31, మార్చి 2019, ఆదివారం

సమస్య - 2973 (రాముని రాజ్యమందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రామరాజ్యాన ధర్మము రాక్షసమ్మె"
(లేదా...)
"రాముని రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లుబాటగున్"

96 కామెంట్‌లు:

  1. ప్రాతఃకాలపు ప్రాతఃస్మరణ:

    భీముని వోలె మోడి కడు భీతిని రేపగ పాకి హృత్తునన్
    జామున జామునన్ బుధుడు జంద్యము నూనగ వోట్లకోసమై
    గోముగనన్ని రాష్ట్రములు గోవుల రక్షణ చేయగానెటుల్
    "రాముని రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లబాటగున్?"

    రిప్లయితొలగించండి
  2. ఆయుధంబులఁజేపట్టి, యసుర గణము,
    జనుల పీడింప సాగిరి జంకు లేక,
    దేశ రక్షణకెవరింక దిక్కు? రామ
    రామ! రాజ్యాన ధర్మము రాక్షసమ్మె..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామ్ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా. పిట్టా సత్యనారాయణ
      స్వల్ప ధర్మముతో పూట జరుపు మనకు
      ప్రజల పాలనలో నెంత బడెను బయట?
      నాల్గు పాదాల మోతాదు నాడు దాటె
      రామరాజ్యాన ధర్మము రాక్షసమ్మె(మోతాదు పేరిట,size wise)

      తొలగించండి
    3. ధన్యవాదములు మహోదయ, సమస్యల క్రమసంఖ్య 2971 తరువాత కాస్త వెనక్కి వెళ్ళినట్లున్నది, సవరించాలేమో చూడండి..🙏

      తొలగించండి
  3. చదువు కోవలె ననినచో చదువు కొనుము,
    సందు కో బ్రాంది షాపు పసందు జేయ
    నబల రాత్రిళ్ళు తిరుగంగ సబబు కాదు.
    పేద వాని రోగానికి యేది మందు,
    ధరలు ధరను వీడి. దివి యధరము తాక
    చూడ వేమి మమ్ములను, కాచుము దశరధ
    రామ,రాజ్యాన ధర్మము రాక్షసమ్మె
    యనుచు గగ్గోలు బెట్టిన వినవు నీవు

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా సత్యనారాయణ
    నీమము తోడ నాటలను నింగికి బంతిని గూర్చి నేతయై
    గోముగ బాలనన్ నడుప గూరిన భాగ్యము పాకు (పాకిస్థాన్)పాలనై
    సామము మీర బాలనను చక్కగ బెట్ట సముద్యమించ పాక్
    రాముని రాజ్యమందెపుడు "రాక్షస ధర్మ"మె చెల్లుబాటగున్

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    3వ పాదంలో సవరణ
    చక్కగ బెట్టగ సాగుచున్న పాక్....గా చదువ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  6. నాల్గు పాదముల పయిన నడచు చుండె
    రామరాజ్యాన ధర్మము; రాక్షసమ్మె
    యేలుచుండె నీదినముల యెచట జూడ
    యుగములయెడ కారణమన యుక్తమౌను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...దినముల నెచట జూడ...' అనండి.

      తొలగించండి
  7. (రంగనాయకమ్మ నాస్తిక సమావేశంలో ప్రసంగిస్తూ ..)
    రాముడు ఖండనాసికగ
    రావణు సోదరి జేసినాడుగా ;
    రాముడు చాటుగా కపుల
    రాజును వాలిని జంపినాడుగా ;
    రాముడు శంకతో సతిని
    రంకును మోపుచు బంపినాడుగా ;
    రాముని రాజ్యమందెపుడు
    రాక్షసధర్మమె చెల్లుబాటగున్ .'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. పొద్దుటే ర‌గనాయకమ్మ గారిని తలచేరూ :(


      జిలేబి

      తొలగించండి
    2. జంధ్యాల వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. శంకరార్యులకు , జిలేబిగారికి ధన్యవాదాలు .
      రంగనాయకమ్మ కూడా పద్యం నాలుగు పాదాలలో
      నాలుగుసార్లు రాముని తలచుకుంది .

      తొలగించండి

  8. మారీచుడు రావణునితో


    నీమము తప్ప నీయడు! మునీశ్వరు లెల్లరి దీవనల్ సదా
    క్షేమము చేర్చు నాతనికి ! కేవలమాతడు మాసి కాడు! మా
    యామయ లోక రక్షకుడయా! విడువన్ దగు యత్నమున్ వెసన్!
    రాముని రాజ్యమం దెపుడు, రాక్షస! ధర్మమె చెల్లుబాటగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      ప్రశస్తమైన విరుపుతో అద్భుతమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. మంచి విరుపు,చక్కని పద్యం జిలేబిగారూ,అభినందనలు! కాని,మారీచుడు కూడ రాక్షసుడేగదా,రావణుని రాక్షస అని సంబోధించడం సబబేనా?సమస్యాపూరణలో అన్ని పట్టింపులుండవులెండి.నమస్సులు!

      తొలగించండి
    3. మారీచుడు దొంగలలో మంచి దొంగ

      తొలగించండి


    4. అందరికి నమో నమః

      ఏదో అలా వచ్చేసే అంతే :)


      జిలేబి

      తొలగించండి
  9. ధరణి పైనను నాల్గు పాదాల వరలె
    రామరాజ్యాన ధర్మము, రాక్షసమ్మె
    కలియుగాన, సత్యమసలు కానరాదు
    మంచిమార్గాన ప్రజలిల మనుట యెపుడొ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  10. విశ్వామిత్రుడు రామునితో


    రామ! రాజ్యాన ధర్మము, రాక్షసమ్మె
    ధూర్తులకు! శిష్టులకదియే తూపరాణి!
    ధర్మమును రక్ష సేయగ ధాత్రి నిలుచు
    నెల్లకాలము మేల్మిగ నెమ్మి బడసి !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. పేరు రామరాజ్యమె గాని ప్రేమ సున్న!
    నేతి బీరను పోలిన రీతి యుండ
    నేమి చోద్యమ్ము !చిత్రమ్ము ! రామ!రామ!
    రామరాజ్యాన ధర్మము రాక్షసమ్మె !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రీతి నుండ...' అనండి.

      తొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    శంకరాభరణం.. సమస్యాపూరణం..

    "రాముని రాజ్యమం దెపుడు రాక్షసధర్మమె చెల్లబాటగున్"

    రాముని నింద చేసెడి వరాకులు దానవు , లట్టి జాతి నీ...
    నామము చేరియున్నదొ ! జనావనుడాతడు ధర్మమూర్తి , మా...
    రాముని రూపురేఖల విరాజిలు దైవము , జానకీమనో..
    రాముని రాజ్యమం దెపుడు రాక్షస ! *ధర్మమె* చెల్లబాటగున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ చక్కని విరుపుతో ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  13. కష్ట మన్న ది యెరుగని కాల మందు
    ప్రజల సౌఖ్య మె తన కిచ్చు ప్రమద మనుచు
    పాల నంబు ను సల్పి న పరమ పురు షు
    రామ రాజ్యాన ధర్మం బు రాక్షస మ్మె ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఱాజేశ్వర రావు గారూ,
      మీ ప్రశ్నార్థక పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. నేటి రాజకీయ మరయ నేతి బీర
    నోటు కమ్ముడు బోతివా నువ్వుc, జూడ
    రామరాజ్యాన ధర్మము రాక్షసమ్మె,
    రాజి బడకున్న నీవోటు రామ యిశువు
    రామ రాజ్యంబు నేలగ రాజు వీవె


    ఇషువు- బాణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రామ + ఇషువు = రామేశువు' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "రాము కోల" అనండి.

      తొలగించండి
  15. ధర్మమచ్చోట నాల్గు పాదాల నిలువ
    శ్రీత్రయంబులె క్రీడించు ధాత్రి సుమ్ము
    మానవత్వము విడిన దుర్మతుల పట్ల
    రామ రాజ్యాన ధర్మము రాక్షసమ్మె

    రిప్లయితొలగించండి
  16. తేటగీతి
    ధరణి తాటక మారీచు దర్పమణచి
    రావణాసుర కుంభకర్ణాది దనుజు
    లను దునిమి రాజ్యమును జనరంజ కముగ
    పాలనము జేసె శ్రీరామభద్రు డెట్లు?
    రామరాజ్యావ ధర్మంబు రాక్షసమ్మె.
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివరాజ లింగం గారూ,
      అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. పనుల గల్పించు మాటలు పడెను మూల
    పించనుల నిచ్చు హామీలె పెరిగె జూడ
    ప్రజల బిచ్చగాళ్ళుగ మార్చు పథకముల వి
    రామరాజ్యాన ధర్మము రాక్షసమ్మె

    రిప్లయితొలగించండి
  18. రిప్లయిలు
    1. చింతా వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'నీమ నిబద్ధ..' ప్రయోగం సాధువు కాదనుకుంటాను.

      తొలగించండి
  19. తండ్రియానతి దాజన దావమునకు
    దుష్టరాక్షసుల శరముల ద్రుంచగాను
    అగ్నిపూతను వనమున కంపగాను
    రామరాజ్యమున ధర్మము 'రాక్షసమ్మె'

    రాక్షసము = కఠినమైనది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. '..రాక్షస శరముల...' అనండి. 'ద్రుంచగాను + అగ్నిపూత = ద్రుంచగా నగ్నిపూత' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!

      తొలగించండి
    3. సవరించిన పూరణ
      తండ్రియానతి దాజన దావమునకు
      దుష్టరాక్షస గణముల ద్రుంచువేళ
      నగ్నిపూతను వనమున కంపునపుడు
      రామరాజ్యాన ధర్మము రాక్షసమ్మె!

      తొలగించండి
  20. కరుణ మానవత్వంబు వెన్కటికినెపుడొ
    *"రామరాజ్యాన ;ధర్మము రాక్షసమ్మె"*
    కలియుగంబున ,స్వార్థమంగాంగమందు
    జీర్ణమయ్యె జీర్ణించుకో శ్రేయమొదవ

    రిప్లయితొలగించండి
  21. క్రూరుడె తలుపఁ, బచరింపు గోరి సతము
    రామనిందఁ జేసెడివాఁడు రక్కసుండె!
    గుండెల పయింగరము నుంచి గూర్చగలవ?
    *"రామరాజ్యాన ధర్మము రాక్షసమ్మె!?"*

    రిప్లయితొలగించండి
  22. దోపిడీదారుజన్యువుల్ పాపినేత
    లందువేళ్ళూనుకొన ప్రజలకును మేలు
    సేయనెంచనినాయకుల్ సేవజేయ
    *"రామరాజ్యాన ధర్మము రాక్షసమ్మె"*

    రిప్లయితొలగించండి
  23. కామము క్రోధముల్ సఖులు ,కాని యొసంగక గావుకార్యముల్
    సేమము గూర్తుమంచు జనసేనలు, రైతులు, నింటికొక్క పా
    ర్టీ ,మమతానురాగముల ఢీకొన నెక్కొన మేకవన్నెపుం
    *"రాముని రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లుబాటగున్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'మేకవన్నెపున్ రాముని' అనండి. అక్కడ అనుస్వారం రాదు.

      తొలగించండి
  24. రిప్లయిలు
    1. సవరణ పద్యము...


      .. ...శంకరాభరణం....
      31/03/2019 ఆదివారం
      సమస్య

      రాముని రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లుబాటగున్

      నా పూరణ

      ***** ***** **** **
      నీమము దమ్మమున్ మరియు నీతిని దప్పక రాజ్య మేలగన్

      రాముని మించు నాథుడును లభ్యమె రాజ్యము లన్ని కాంచగా

      నేమని జెప్పుదున్ దమరి కిట్టుల బల్కుట భావ్య మెట్టులన్?

      రాముని రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లుబాటగున్


      🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
      🌷వనపర్తి🌷

      తొలగించండి
    2. శాంతిభూషణ్ గారూ,
      అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. నాల్గుపాదాల నడిచెనున్యాయముగను
    రామరాజ్యాన ధర్మము,రాక్షసమ్మె
    కంసుపాలన నరయగ ,గాలయముని
    తలపుగలిగెనునిజముగ దమనవిధము

    రిప్లయితొలగించండి
  26. సీమలు దాటెడిన్ గుతిని స్వేచ్ఛగదోచ ప్రజాధనంబునన్
    నీమములెంచకన్ హితుల నేర్పుగజేయగ మంత్రివర్యులన్
    ధీమతులెల్లరున్ దొలగ దేకువజూపుచు విస్మరించగా
    రాముని,రాజ్యమందెపుడు రాక్షసధర్మము చెల్లుబాటగున్

    రిప్లయితొలగించండి
  27. దాతలును నీతులును భాతి నేతలును స
    నాత నాచారములు సున్న రోత కలుగుఁ
    గలియుగాన నక్కట స్వార్థకారణమున
    రామ! రాజ్యాన ధర్మము రాక్షసమ్మె


    బాముల నేమి సేసితిమొ పార్థివ నందన నిన్ను గంటిమే
    పామర దైత్య నాథ ఖర పాలన మందుఁ జెలంగఁగం బరం
    ధాముఁడ దండకావనము దైన్యులు వల్కిరి, చూచి మౌను లా
    రాముని, రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లుబాటగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  28. నీమముదప్పకుండగను నీతినివర్తిలుచుందురందఱు
    న్రామునిరాజ్యమందెపుడు,రాక్షసధర్మమె చెల్లుబాటగు
    న్రాముని శత్రువాఖలుడు,రావణురాజ్యమునందు పూర్తిగా
    సేమముజేయభూప్రజకుశ్రీపతిచంపెను దుష్టరావణున్

    రిప్లయితొలగించండి
  29. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    UPA (2009 - 2014)

    ఏమని చెప్పెదన్ గురుడ? ఎన్నడు లేనిది నేడు చేసితే!
    కాముగ శంకరాభరణ కైపద మందున నచ్చుతప్పిటుల్: 👇
    "రాముని రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లబాటగున్"❎
    "రోమను రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లబాటగున్"✅

    కాముగ = calm గ
    (రోమను రాజ్యమందెపుడు "యతి" భ్రంశమే 😊)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. రోమను రాజ్యమం దెపుడు రోగ్సుల ధర్మమె చెల్లబాటగున్"✅

      :)

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      యతి తప్పిందంటూనే 'రైట్' గుర్తు పెట్టుకున్నారు! :-)

      తొలగించండి
  30. క్షామము లేదు కాంచగను చక్కని పాలన చేసినట్టి యా
    రాముని రాజ్యమం దెపుడు, రాక్షస ధర్మమె చెల్లుబాటగున్
    నీమములన్ త్యజించి యను నిత్యము దోచుచు పేద వారలన్
    కోమలులన్ సదా యడచు క్రూరుల దుర్భర పాలనమ్ములో

    రిప్లయితొలగించండి
  31. శ్యామల వాణి లక్ష్మి నిలయమ్ముగ వాసిని గాంచుచున్ సదా
    క్షేమమొసంగగన్ జనులు చింతను వీడిచెరంగిరే భువిన్
    రాముని రాజ్యమందెపుడు, రాక్షస ధర్మమె చెల్లుబాటగున్
    కాముకు డైన రావణుని కాలము నందున లంకలోపలన్

    రిప్లయితొలగించండి
  32. రెండవ పూరణం
    (శ్రీ రామునికి అపరాధ నమస్సుమాంజలులతో)

    ఏమని చెప్పనోయి యొక హీనుని మాటయె శాసనమ్ముగా
    రాముడు భ్రూణ జానకిని లక్ష్మణు వెంట నరణ్య మంపెనే
    ప్రేమను వీడి కోమలిని వ్రేకటినా విధి పంప గాంచినన్
    రాముని రాజ్యమందెపుడు రాక్షస ధర్మమె చెల్లుబాటగున్.

    రిప్లయితొలగించండి
  33. ఉత్పలమాల
    కాముక రావణాసురుని గాసిలి కూల్చియు సీతతోడుగన్
    రాముడయోధ్యజేరి తన రాజ్యమునందున నొక్కడేనియున్
    లేమిని కష్టమున్ గనక ప్రేమల పంచుచు నేలెనందురే?
    రాముని రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లుబాటగున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      ప్రశ్నార్థకంగా చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  34. అల్పు మాటల నాలించి యాతురముగ
    నిండు గర్భిణి యైనను నిర్దయగను
    రాజ ధర్మమంచు సతిని రచ్చ విడిచె
    రామ రాజ్యాన ధర్మము రాక్షసమ్మె

    రిప్లయితొలగించండి
  35. సోముని రీతి చల్లగను జూచెను బ్రోచెను లోకులందరన్
    భీముగ శత్రుమూకలకు భీతిని పంచెను జేయ దుష్కృతుల్
    రాముడె ధర్మమౌ, యసుర రావణ..శాత్రవ జానకీ మనో
    రాముని రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లుబాటగున్!

    రిప్లయితొలగించండి
  36. తేటగీతి
    భారతీయ ప్రజాస్వామ్య తీరుఁ జూచి
    సంస్కరించఁగఁ బూనుచున్ సచ్చరితులఁ
    గదలి రార! యెన్నికల సంగ్రామమపుడు
    రామ! రాజ్యాన ధర్మము రాక్షసమ్మె! !

    రిప్లయితొలగించండి


  37. వెలసె నాల్గు పాదములలో విశ్వమందు
    రామరాజ్యాన ధర్మమ్ము, రాక్షసమ్మె
    చటను కాలూన జాలక జవము గాను
    పరుగు తీసెను పరుగున వసుధయందు


    రెండవ యుగమందు వెలసె మెండుగాను
    రామరాజ్యాన ధర్మము రాక్షసమ్మె
    రంజనము కూర్చు సతతము రాక్షసులకు
    నెవరి గొప్పదనమె వారి కిలను హెచ్చు.

    రిప్లయితొలగించండి
  38. నీమనసేదిజెప్పునది నీహితమయ్యది నీతిమాలినన్
    సేమము ,సాటివారిమనసే మనకూరట యోట్లరాల్చు నా
    రామమమాయికాళియెద రాముభజించివరించువంచనా
    *"రాముని రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లుబాటగున్"*

    రిప్లయితొలగించండి
  39. క్షేమము యోగమౌ ప్రజల చింతనకే ప్రథమాసనంబు సం
    క్షేమము రాజ్యలక్ష్యమగు సేవకు లేమను పాలకుండ్రు శ్రీ
    *"రాముని రాజ్యమం దెపుడు ;రాక్షస ధర్మమె చెల్లుబాటగున్"*
    కామపిశాచ క్రోధఖర ఖర్వులు పుర్వులు నేత లైనచో

    రిప్లయితొలగించండి
  40. జైశ్రీరామ్🙏🏼
    శుభోదయమ్.💐

    శంకరాభరణం.. సమస్య.

    "రాముని రాజ్యమం దెపుడు రాక్షసధర్మమె చెల్లుబాటగున్"

    పూరణకై నా ప్రయత్నము.

    నీమ, నిబద్ధ జీవనము నిత్యము ధర్మ పరీమళంబుకాన్
    రాముఁడు ధర్మ పాలనను రాక్షస నిర్ణయమున్ రహించు. స
    త్క్షేమము కోరి కావగను శ్రీకరధర్మమునేలునట్టి మా
    రాముని రాజ్యమందెపుడు
    రాక్షస ధర్మమె చెల్లుబాటగున్.
    సద్విధేయుఁడు
    చింతా రామకృష్ణారావు.

    రిప్లయితొలగించండి