13, మార్చి 2019, బుధవారం

సమస్య - 2956 (హరునిన్ మృత్యువు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్"
(లేదా...)
"హరునిన్ మృత్యువు మ్రింగఁగా భువన మత్యానందమున్ బొందెరా"

68 కామెంట్‌లు:

  1. నరకాసురుండు వీడెన్
    శరములు,కూలె రధమందు, జయము లభించెన్
    పురుషోత్తమునకు,తొలగె గొ
    హరు, మృత్యువు మ్రింగ లోక మానందించెన్"

    గొహరు ఆపద

    రిప్లయితొలగించండి



  2. అరె! జీర్ణము వాతాపియ
    న రక్కసుల యాట ముగిసె నరరె, జిలేబీ
    పరమాత్ములకిడుమా జో
    హరు, మృత్యువు మ్రింగ లోక మానందించెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. ఇంతకంటే చేత కాదు:

    కరచుచు భక్తుల సతతము
    తిరుమలలో తిరుగుచుండి త్రిప్పల నిడుచున్
    పరుగిడిన ముంగి చెంతకు
    హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్

    హరి = పాము

    రిప్లయితొలగించండి
  4. పరమేశుని లీల లుగన
    హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్
    వరమనె పార్వతి నెమ్మిని
    సురలోకపు వేల్పు లంత చోద్యము గాంచెన్

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    🙏🕉శ్రీ మాత్రే నమః 🙏

    స్మరభస్మప్రభవుండు , భండుడు నిజేచ్ఛావృత్తి లోకమ్మునన్
    సురకోటిన్ మునికోటులన్ దునుముచున్ దుష్టుండుగా., నమ్మయే
    వరకాలాకృతి దాల్చి శ్రీ లలిత చంపన్ దానవున్ శాంతిసం...
    హరునిన్ మృత్యువు మ్రింగఁగా భువన మత్యానందమున్ బొందెరా !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  6. మరులన్ గొల్పగ నాదిభిక్షువునటన్ మారాంతకుండై మనో
    హరునిన్ మృత్యువు మ్రింగఁగా భువన మత్యానందమున్ బొందెరా
    పరమేశుండట విప్పె కన్నులనుచున్ ప్రార్థించు కాలంజరిన్
    పరిగృహ్యంబుగ స్వీకరించుననుచున్‌ భాగ్యమ్ముగా నెంచుచున్!


    ఒకరి బాధ మరొకరికానందము :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. అరివీర భయంకరుడగు
    నరకాసురు డంతమొందె నారీమణిచే
    వరగర్వితుడా నరసం
    హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్

    రిప్లయితొలగించండి
  8. పరనారీహరు దానవాధిపుని భద్రాద్రీశుడారాముడా
    హరిదండెత్తి వధించ లోకములు బ్రహ్మానందమందంగ ని
    ర్జరులారాముని యంజలించి రిటు దుర్మార్గాశనున్శాంతి సం
    *"హరునిన్ మృత్యువు మ్రింగఁగా భువన మత్యానందమున్ బొందెరా"*

    రిప్లయితొలగించండి
  9. పరులను హింసించుచు ము
    ష్కరు లలజడిసల్ప శాంతిసైన్యము తత్స్థా
    వరముల గూల్చజిహాదీ
    హరు మృత్యువు మ్రింగ లోకమానందించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "రాముని కంజలించి..." అనండి.

      తొలగించండి
  10. వరముల బొంది యు గరువపు
    సుర వైరి యు నరుల నొ oచ శూర త హరి సం
    గరమున బోరగ నా సం
    హరు మృత్యు వు మ్రింగ లోక మానం ది oచెన్

    రిప్లయితొలగించండి
  11. స్మరణంబే భయమై చెలంగగ సదా మర్త్యాళిలో శాంతి సం
    హరణంబే తన లక్ష్యమంచు కౄర గతి బాహాశక్తి ప్రదర్శించునా
    యరిపై సైన్యము దాడి చేసి తునుమన్ వ్యాఘ్రాధమున్ ధర్మ సం
    హరునిన్ మృత్యువు మ్రింగఁగా భువన మత్యానందమున్ బొందెరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "బాహాశక్తి చూపించు నా..." అనండి.

      తొలగించండి
  12. కరుణాహీనుని బాలఘస్మరుని దుష్కర్మాచరున్దుర్మతిన్
    నరులన్ఖేచరులన్సురాధిపుల నన్యాయంబుగాజంపుచున్
    పరపీడారచనాదురంధరుడనన్భంజించునాప్యాయతా
    *"హరునిన్ మృత్యువు మ్రింగఁగా భువన మత్యానందమున్ బొందెరా"*

    రిప్లయితొలగించండి
  13. దురుసుగ మానవ హక్కుల
    కరకు మనంబున హరించు కర్కశ మతియౌ
    దురితుని,దుష్టుని స్వేచ్ఛా
    హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్"

    రిప్లయితొలగించండి
  14. వరుసగ దుష్టులు,దొంగలు,
    నర మేధకు బూనిరంత నయ వంచకులన్
    దునుమాడె పెద్దలును--- నా
    హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్.

    ఆహరు=ఆఖరు,చివర తెలుగు వ్యుత్పత్తి పద కోశము, ఆంధ్ర విశ్వకళాపరిషత్తు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      గ్రాంథిక పదాల విషయంలో వ్యుత్పత్తి పదకోశాన్ని ప్రమాణంగా స్వీకరించరాదు. అది లోక వ్యవహారాలను, మాండలికాలను కూడా పేర్కొన్నది.

      తొలగించండి
  15. కరుణయె రూపుగగట్టగ
    పరమేశ్వరుడే జగముల పాలింపంగన్
    వరసతి యనుమతినీయగ
    హరు మృత్యువుమ్రింగ లోకమానందించెన్

    ఆర్యా,విభక్తులను మార్చి పూరించాను.తప్పయితే మన్నించండి!హరు మృత్యువుమ్రింగ యనగానే ఆయన గరళకంఠమే గుర్తొచ్చింది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెరపున్ లేకయె సంపదల్ దనకు ప్రాప్తించన్ సుగంధంపువౌ
      తరులన్ నేలను గూలగొట్టుచును కాంతారమ్ములే దోచుచున్
      పెరుగన్ మీసము వీరుడంచు వనినావీరప్ప క్షోణీజ సం
      హరున్ మృత్యువుమ్రింగగా భువన మత్యానందమున్ బొందెరా!

      తొలగించండి
    2. నాల్గవ పాదములో హరునిన్ గా చదువప్రార్ధన!టైపాటు!

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'హరు' అన్న శబ్దం ద్వితీయలో ఉంది. ప్రథమావిభక్తి కాదు.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!

      తొలగించండి
  16. ( భస్మాసుర భస్మ వృత్తాంతం లోకానందకారకం )
    కరుణాసింధుని ; కామితార్థకరునిన్
    గౌరీహృదానందునిన్ ;
    కరిచర్మాంబరశోభితున్ ; శశి ధరున్ ;
    గంగామనోవల్లభున్ ;
    వరమున్ గోరిన సందియంపు పురుగున్ -
    భస్మాసురున్ - విజ్ఞతా
    హరునిన్ - మృత్యువు మ్రింగగా భువన మ
    త్యానందమున్ బొందెరా !

    రిప్లయితొలగించండి
  17. అరయగ వారధి కట్టి ర
    ఘు రాముడు తన కపిమూక కూడి యశముతో
    డరణము సలుపగ సీతా
    హరు మృత్యువు మింగ లోకమానందించెన్

    సముద్రం మీద వారధి కట్టి, తన వానర సైన్యంతో కలిసి రఘు రాముడు యుద్ధం చేయగా సీతా హరుడు, సీతను అపహరించిన వాడిని మృత్యువు మింగితే లోకమంతా ఆనందించింది.

    రిప్లయితొలగించండి
  18. హరుడే లయకారుడుగద
    హరుమృత్యువు మ్రింగ లోక మానందించెన్
    హరుమృత్యువు మ్రింగుటయా
    జరుగని పనియార్య!యదియ జగమందెచటన్

    రిప్లయితొలగించండి
  19. కరమున్భారత సైన్యమన్దనర పుల్కామా వధాశూరుసం
    హరునిన్ మృత్యువు మ్రింగగా భువనమత్యానందమున్బొందెరా
    యరయన్ నంతియయౌనుగా భువిని సయ్యాటాల నాడించుచు
    న్గరమున్వేసట బెట్టగాదగును నెక్కాలంబురాకుండుగా

    రిప్లయితొలగించండి
  20. దురిత చయ విచారు భయం
    కరు రాత్రించరు విషాదకరు నా భస్మా
    సురు వర నిమిత్త పూజిత
    హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్


    ధరలోపాప జనక్షయమ్మునకు సద్ధర్మావనార్థమ్ము కా
    దె రమానాథుఁడు దాల్చ నేర్చును విహారేద్ధావతారమ్ములే
    యరవిందాక్ష ధనుర్వినిర్గతము బ్రహ్మాస్త్రమ్ము సీతా సతీ
    హరునిన్ మృత్యువు మ్రింగఁగా భువన మత్యానందముం బొందెరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి

    3. వావ్!

      అరవిందాక్ష ధనుర్ వినిర్గత బ్రహ్మాస్త్రము
      సీతా సతీ హరున్!

      జిలేబి

      తొలగించండి
    4. ధన్యవాదములండి. పదప్రయోగము నచ్చినందులకు. ధనుః + వినిర్గతము.
      అ, ఆ లు తప్ప మిగిలిన అచ్చులతో గూడిన విసర్గకు అచ్చులు గాని మృదు వ్యంజనములు కాని పరమైన విసర్గ ర్ గా మారును.

      తొలగించండి
  21. కందము
    హరుడే సృష్టి.స్థితి.లయ
    కరుడే! భువనాలనేలు కరుణ దలిర్పన్
    అరయన్ మృత్యుంజయు డే
    హరు మృత్యువు మ్రింగ లోకమానందించెన్
    అకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  22. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సరకుల్ దెచ్చుచు బాంబు ప్రేల్పులకు పల్ సామగ్రి చేకూర్చుచున్
    పురమున్ జొచ్చుచు సాధు మానవులపై మ్రోగించి చెండాడుచున్
    పరువుల్ పెట్టెడి హంతకుండ్లనట భల్;...ప్రార్థించి లాలించగా
    హరునిన్;...మృత్యువు మ్రింగఁగా భువన మత్యానందమున్ బొందెరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మీ ఆదేశానుసారం సరిజేయ ప్రయత్నించి పూరింప బూనితిని.
      ధన్యవాదములు.,,🙏🙏

      భారత యుత్తర భాగాన
      దూరుచు జయిషే మహమ్మదున్మాది యనన్
      తుర్కల నాయకుcడా అజ-
      హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్

      తొలగించండి
  23. ఉత్తర భారతమందున
    దూరుచు దాడులు సలిపిన దుష్టుడు జయిషే-
    మహ్మదు నాయకుడు ఆ అజ
    హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసింపదగినది. మీరు ప్రాసమైత్రిని పాటించలేదు.

      తొలగించండి


    2. అరె! ఉత్తర భారతమున
      రరె దూరుచు దాడిసేయ రక్కసు జయిషే
      పురుగులు, మహ్మదు యా యజ
      హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్;

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబి గారికి ధన్యవాదములు.
      మీరు పద్యములతో నాడుకోగలరు.
      నాకు కొత్త గావున ప్రతి పూరణా ఒక రణము ల యున్నది. పోరాడవలెనని ఆరాటం.
      గురువుగారు ప్రోత్సహింపఁ సమయము దొరకక పోయినప్పటికీ, మీరు మిగతా సభ్యులు నాకు ఉత్సాహాన్నివ్వ ప్రార్థన.🙏🙏🙏

      తొలగించండి
  24. పరుగెత్తి హయగ్రీవుడు
    మరుగునకై జలధిజొచ్చ మత్స్యపురూపున్
    హరిచేతను నామ్నాయా
    హరు మృత్యువుమ్రింగ లోకమానందించెన్

    రిప్లయితొలగించండి
  25. వరగర్వితుడై భస్మా
    సురు డానాడిలను కాలి స్రుక్కెనుగాదే
    హరు గావగ వచ్చి దనుజ
    హరు మృత్యువు మ్రింగ లోకమానందించెన్.

    రిప్లయితొలగించండి
  26. భరియింపగ లేమనుచు త్రి
    పురాసురు వధింపమంచు మొరలిడి రట నా
    సురలే దీనత తోడన్
    హరునిన్, మృత్యువు మ్రింగ లోక మానందించెన్.

    రిప్లయితొలగించండి
  27. హరునిన్ గూర్చి తపమ్మొనర్చి ఫలితమ్మాదానవుండంది తా
    బరమానందము జెందుచున్ భువుడనే బస్మమ్ము జేబోవగా
    హరియే మోహినియై వధించెగద క్రూరాత్ముండెయౌ విజ్ఞతా
    హరునిన్, మృత్యువు మ్రింగగా భువనమత్యానందమున్ బొందెరా!

    రిప్లయితొలగించండి
  28. పురవాసుల దుసు మాడుచు
    నరకాసురుడవని జనుల నంతము జేయన్
    శరము లిడగ హరి , నరసం
    హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్

    రిప్లయితొలగించండి
  29. మత్తేభవిక్రీడితము
    వరగర్వంబున గన్యలన్ నరకుఁడా ప్రాగ్జోతిషాధీశుడున్
    జెరబట్టన్, సురతాణినిన్ దరుముచున్ చేబట్ట ధత్రన్, నిశా
    చరుడున్ యుద్ధమునందుఁ గూలె నెదిరించన్ గృష్ణు సత్యామనో
    హరునిన్, మృత్యువు మ్రింగఁగా భువన మత్యానందమున్ పొందెరా!

    రిప్లయితొలగించండి
  30. డా.పిట్టా సత్యనారాయణ
    హరియన నెవరనుకొంటివి
    హరుడును హరి నేనె యను టహా సాధనయౌ
    పరగ నిజాత్మా భేదపు
    హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్
    "బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నా పరాః"

    రిప్లయితొలగించండి
  31. డా.పిట్టా సత్యనారాయణ
    బరువున్ త్రాసది యొక్కటే యనిన సద్భావంబు గాదందురే
    హరియున్నాత్మల జీవ భేదమగులే హ్లాదంపు సంసారమున్
    మరిచే యోగము సర్వ పూజలకునౌ మాహాత్మ్యమే;నైక్యపుం
    హరునిన్ మృత్యువు మ్రింగగా భువన మత్యానందమున్ బొందెరా!

    రిప్లయితొలగించండి