గురుకులములో నొక మంద బుద్ది గల విద్యార్ధి పురాణములు అన్ని కలిపి గజిబిజిగా సమాధానము చెబుతుంటే ఆ గురువు అతనితో ఇవి “మూడు రకముల పురాణ కధలు కలుపకుండా చదువుకోవాలి” అని తెల్పు సందర్భము
8 తే: దేవుని గుడిలోన తరచు తిరుగు చుండ భక్తి గలవాడని తలచి పల్లె జనులు వోట్లు రాల్చ, గతము వీడి తూట్లు పొడుచు తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
9 తే: దొరికినంత రిలీఫ్ ఫండు దోచ దలచి నేతలు జనుల పై సాను భూతి తోడ , వరద ముంచిగ గ్రద్దలై వాలు చుండు తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
10 తే: తల్లి దొక పార్టి ,యింటిలో తండ్రి దొక్క పార్టి ,వేరొక పార్టి లో భార్య చేరు , నెవరు గెలిచినన్ వారికే పవరు పొసగు తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
తన వెంట వచ్చిన వారి మదిలో ఉన్న అనుమానాలు తీరిపోయేలా సముద్రం మీద వారధి చక్కగా నిర్మించి, వానర వీరులతో కలిసి లంకలో నివసించే జనాల పాలిటి శంకరుడు(సుఖాన్ని ప్రసాదించే వాడు) అయిన రావణుడి మీద విజయం సాధించి, రఘురాముడు ప్రజలను కాపాడాడు
పొంకము నొందెను పార్వతి
ప్రత్యుత్తరంతొలగించుశంకరు గెల్చి;...రఘువరుఁడు జనులను బ్రోచెన్
లంకను రావణుని గెలిచి
సంకటముల దీర్చి జనుల సంబరముంగన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మిగుల సంబరమందన్' అనండి. 'జనుల' శబ్దం పునరుక్తమయింది.
🙏
తొలగించుఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
తొలగించు
ప్రత్యుత్తరంతొలగించుడొంక తిరుగుళ్ళదేలా?
బొంకుచు పల్కెడు జిలేబి బొమ్మాళీ యే
వంకర టింకర మాటల
శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్?
జిలేబి
జిలేబి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తిరుగుళ్ళవేలా' అని కదా ఉండాలి?
లేదా... డొంక తిరుగు డదేలా... అని ఉండాలి!
తొలగించుసంకటమని దశకంఠుడు
ప్రత్యుత్తరంతొలగించువంకగ సీతాపహరణ వారధి కాగా
క్రుంకగఁ జేసెను లోకవ
శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్
తత్కమనీయమౌ కవన ధారన లోకము మెచ్చు రీతిగా
తొలగించుసత్కవి విశ్వనాథు వలె శాశ్వత కావ్యము వ్రాసి కీర్తి సం
పత్కరుడైన మేలుగద!పద్యపు విద్యన మేటి రత్నమా
సత్కవి, కాని.. నాగఫణి శర్మ వధానముఁ జేయు టెందుకో?
తనదు యవధాన విద్యకు తల్లి వాణి
తొలగించుమెచ్చి యొడిలోన గూర్చుండ నిచ్చె నెపుడొ
కుకవు లందరిఁ బొగిడెడు కుటిలు డింక
"నాగ ఫణిశర్మ సుకవి యనన్" దగండు.
రాకుమార గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'కవన ధారను' టైపాటు.
ధన్యవాదాలు గురూజీ!
తొలగించులంకను పాలించెడి యా
ప్రత్యుత్తరంతొలగించుశంకర భక్తుడిని చంపి సంగ్రామములో
శంకర వరములఁ గెలిచెను
శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్
మల్లేశ్వర్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉత్తరార్ధంలో కొంత అన్వయదోష మున్నట్టుంది.
వంకర బుద్ధిని జూపుచు
ప్రత్యుత్తరంతొలగించుపంకజ నేత్రి జనకసుతఁ బంధించిన యా
లంకాధిపతయగు శివ వ
శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్.
విరించి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లంకాధిపతి' టైపాటు.
లంకేశుని హతమార్చిన
ప్రత్యుత్తరంతొలగించుయంకము ముగియ శివలింగ మమరించుచు తా
బింకము నొందక భక్తవ
శంకరు గెల్చి రఘువరుడు జనులను బ్రోచెన్!
(బింకము = గర్వము)
శ్రీధర రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రత్యుత్తరంతొలగించురంకెలు వేయ దైత్యులను, రక్తపుటేరుల తేల్చి, చేరుచున్
వంకలు దాటి, గాధిజుని వర్దిని, మండప మందు, నేర్పుగా
పొంకముగా కరమ్మునట పొందికగా నమరంగ సింగిణీ
శంకరు నాజి గెల్చి, జనసంఘముఁ బ్రోచెను రామభద్రుఁడే
జిలేబి
జిలేబి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లంకాపురికిని పావని
ప్రత్యుత్తరంతొలగించుపంకజ నేత్రి ధరసుత నపహరించగ నా
లంకాధీశుడగు శివ వ
శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్.
శాంతిభూషణ్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
ప్రత్యుత్తరంతొలగించుసంకుచితాంతరంగుడు నిశాచరనాథుడు భ్రాతృబోధ ని..
శ్శంకఁ దృణీకరించి , విలసద్విభవప్రభలొల్కు ద్వీపమౌ
లంకకు చేటు గూర్చనవురా ! కనకాంచిత రాజ్యభాగ్యనా....
శంకరు నాజి గెల్చి జనసంఘముఁ బ్రోచెను రామభద్రుఁడే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.
తొలగించు
తొలగించువావ్!
కనకాంచిత రాజ్య భాగ్యనాశంకరు!
చాలా బాగుందండి మైలవరపు వారు
జిలేబి
నమో నమః.. 🙏🙏
తొలగించుఒకటి శ్రీమతి జిలేబీ గారికి..
మరొకటి మా ప్రభాకరశాస్త్రి గారికి.
ప్రత్యుత్తరంతొలగించుకంది వారికి విన్నపాలు
నిన్నటి సర్వ మాధ్యమాలలో వచ్చిన సమస్యాపూరణలన్నీ డీ టీ పీ చేసి నాగ ఫణి శర్మ గారికి శంకరాభరణము తరపున పీడీయెఫ్ కానుక గా ఇవ్వవలసినదిగా మహజరు !
ఇట్లు
జిలేబి చేవ్రాలు
నిన్నటి రోజంతా మా మిత్రునితో బిజీగా తిరగడం వల్ల పూరణలు చూడలేదు. ఈరోజు చూసి మీరు కోరినట్లు ప్రయత్నం చేస్తాను.
తొలగించువంకర బుద్ది చేత మునివర్యుల యజ్ఞము పాడు సేయు,రా
ప్రత్యుత్తరంతొలగించుమాంకిత సీతఁదెచ్చెను,మహాత్ముల సంపద తస్కరించె,శ్రీ
లంకపురేశ్వరుండు రణరంగ పిశాచము నట్టి ధర్మనా
శంకరు నాజి గెల్చి జనసంఘముఁ బ్రోచెను రామభద్రుఁడే
కృష్ణ గారూ,
తొలగించుచక్కని పూరణ. అభినందనలు.
'లంకాపురేశ్వరుడు' అనడం సాధువు. "శ్రీలంకకు పాలకుండు..." అనవచ్చు.
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించుడా.పిట్టా సత్యనారాయణ
ప్రత్యుత్తరంతొలగించుశంకర! యెక్కడి వాక్యము
పొంకపు పాశ్చాత్య వాణి పుణ్యమొ యేమో
అంకెల గారడి"యుగమము"న
"శంకరు గెల్చి రఘువరుడు జనులను బ్రోచెన్?"
డా.పిట్టా సత్యనారాయణ
ప్రత్యుత్తరంతొలగించువంకర టింకరల్ పొసగ వాసికి పద్య సమస్య గూర్చు నా
శంకరు నాజి గెల్చి జనసంఘము బ్రోచెనను రామ భద్రుడే;
పొంకపు సత్యమున్ బలుకు పుణ్యము దక్కెను మాకు నో గురో!
సంకట బాణవర్షమున సాకెను దాశరథుండె మమ్ములన్!
డా. పిట్టా వారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'దాశరథుడు' అన్న ప్రయోగ సాధుత్వం విషయంలో సందేహం.
గు రు మూ ర్తి ఆ చా రి
ప్రత్యుత్తరంతొలగించు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
లంకా ప్రభువగు లంకా
శంకరు గెల్చి రఘువరుడు జనులను బ్రోచెన్ |
పంకజ ముఖి బంధించుచు ,
సంకటముం గూర్చు ఖలునిఁ జావు విడుచునే ?
( శంకరుడు = సుఖము లిచ్చు వాడు ; లంకాశంకరుడు = లంకకు
సుఖము చేకూర్చు వాడు )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
గురుమూర్తి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లంకా' శబ్దం పునరుక్తి కదా? "లంకాప్రభువగు రాక్షస। శంకరు..." అనవచ్చునేమో?
అంకిత భావమ్మున మది
ప్రత్యుత్తరంతొలగించుశంకరుగొల్చె రఘువంశ సంభూతుండే
శంకలవేలా? భక్తిని
శంకరుగెల్చి రఘువరుడు జనులను బ్రోచెన్
సీతాదేవి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురువర్యా,నమస్సులు!
తొలగించుకొంకక దైత్యుల దునిమి యు
ప్రత్యుత్తరంతొలగించునం కి త మై ముని గణము ల కండ గ నిలిచెన్
జంకక పోరున భక్త వ
శంక రు గెల్చి రఘు వరుడు జనుల ను బ్రోచెన్
రాజేశ్వర రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
ప్రత్యుత్తరంతొలగించుఆర్యా,౨వపాదంలో "బ్రోచెను" ఉండాలి "న" అదనంగా టైపా వల్ల చేరింది.ఆపై పూరణలో"యుగము"లో మ చేరిన టైపా.
వంకలు నిలువెల్ల గలుగు
ప్రత్యుత్తరంతొలగించులంకాధిపతి యగు దుష్ట రావణునే ని
స్సంకోచమ్ముగ విధినా
శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్.
జనార్దన రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లంకాధిపతిన్ సీతను
ప్రత్యుత్తరంతొలగించుజంకక చెఱఁబెట్టినట్టి శంకరు బంటున్
వంకర బుద్ధిని జన నా
*"శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్"*
విట్టుబాబు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లంకాశుభకరు ; నమరభ
ప్రత్యుత్తరంతొలగించుయంకరు ; సకలదనుజాభయంకరు ; భవనా
శంకరకింకరు ; భువనవ
శంకరు గెల్చి రఘువరుడు జనులను బ్రోచెన్ .
జంధ్యాల వారూ,
తొలగించుమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
అద్భుతమైన పూరణండీ,అభినందనలు!
తొలగించుశంకరార్యులకు , సీతాదేవి గారికి ధన్యవాదాలు.
తొలగించుఅంకముజేరెను నంబిక
ప్రత్యుత్తరంతొలగించుశంకరుగెల్చి,రఘువరుడు జనులను బ్రోచెన్
బింకము గలిగిన పశువా
లంకేశుని సంహరించి రాజసమొప్పన్
సుబ్బారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అంకమున జేరె నంబిక' అనండి. బాగుంటుంది.
క్రొవ్విడి వెంకట రాజారావు:
ప్రత్యుత్తరంతొలగించులంకేశుడు మోసముతో
నంకించిన జానకమ్మ నరయుటె గాక
న్నంకమ్మున వాని, శివ వ
శంకరు గెల్చి రఘువరుడు జనులను బ్రోచెన్.
రాజారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంకమునందుజేరెగదయంబిక సేవల మెప్పుజేసియా
ప్రత్యుత్తరంతొలగించుశంకరు,నాజిగెల్చి జనసంఘము బ్రోచెను రామభద్రుడే
లంకపురాధిపు న్శిగుల రాజసమొప్పగ మూర్కొనంగసూ
శంకలుదీరగా బ్రజలు సంతసమొందుచు నుండిరయ్యెడన్
సుబ్బారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జంకును గొంకులేక హరు సాంబదిగంబరు నంబికాపతిన్
ప్రత్యుత్తరంతొలగించుశంకరు నర్చసేసి దివిజాధిపు గెల్చెను దైత్యవంశ నా
*"శంకరు; నాజి గెల్చి జనసంఘముఁ బ్రోచెను రామభద్రుఁడే"*
పొంకముగాకళత్రనెపమూడ్చెమదేభనిశాచరారియై
శంకర్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ నాటి శంకరా భరణము సమస్య
ప్రత్యుత్తరంతొలగించుశంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
గురుకులములో నొక మంద బుద్ది గల విద్యార్ధి పురాణములు అన్ని కలిపి గజిబిజిగా సమాధానము చెబుతుంటే ఆ గురువు అతనితో ఇవి “మూడు రకముల పురాణ కధలు కలుపకుండా చదువుకోవాలి” అని తెల్పు సందర్భము
తనను పరిహసించ ,తామసము బడసి
మునివాటికకు జేరి ముదముతోడ
నొనరించె పార్వతి నొక్క వ్రతమ్మును,
భక్తితో పూజించ పంచ ముఖుడు
నర్దాంగి కోరిక నమలు పరచి నర్ధ
దేహము నివ్వగన్, దిష్టి నొందె
గిరిసుత శంకరు గెల్చి, రఘువరుఁడు
జనులను బ్రోచెన్ విజయము బడసి
సీత తో నయోధ్యకు జేరి , చీర లిచ్చి
కాచె పాంచాలిని సభలో కంసరిపువు,
మూడు రకముల కధలివి జోడు చేయ
కూడదని చట్టు తోబల్కె గురువునొకడు
పూసపాటి వారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పరచి యర్ధదేహము...' అనండి.
వోట్ల పంచ గుళికలు 2
ప్రత్యుత్తరంతొలగించు6 తే: చిల్లి బక్కెట్టు తో నీరు చేదలేము,
సందరమున శుద్ధ జలము పొందలేము
వంచకుని లోన మంచిని కాంచబోము,
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
7 : తే: చెల్లి కేనాడు కొనబోడు చీరలేమి,
నాదు చెల్లెళ్ళు మీరంచు నాణ్య మైన
చీరలను పంచు జనులకు నూరులోన,
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
8 తే: దేవుని గుడిలోన తరచు తిరుగు చుండ
భక్తి గలవాడని తలచి పల్లె జనులు
వోట్లు రాల్చ, గతము వీడి తూట్లు పొడుచు
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
9 తే: దొరికినంత రిలీఫ్ ఫండు దోచ దలచి
నేతలు జనుల పై సాను భూతి తోడ ,
వరద ముంచిగ గ్రద్దలై వాలు చుండు
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
10 తే: తల్లి దొక పార్టి ,యింటిలో తండ్రి దొక్క
పార్టి ,వేరొక పార్టి లో భార్య చేరు ,
నెవరు గెలిచినన్ వారికే పవరు పొసగు
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
పద్యాలు బాగున్నవి. తప్పక పుస్తకంగా ప్రచురించండి.
తొలగించు9వ పద్యం మూడవ పాదాన్ని "వరద ముంచగ గ్రద్దలై వ్రాలుచుంద్రు" అనండి.
పంచగుళికలు పసందుగున్నవి.
తొలగించుఆచరించదగిన,నానందకరమైన
జనజాగృత రసగుళికలు
మీకివే మా అభినందనలు!
ధన్యవాదములు
తొలగించుపంకజ ముఖి సీతను గొని
ప్రత్యుత్తరంతొలగించులంకేశుడు పరుగులెత్తి లంకను దాచన్
బింకము గూల్చంగ శివ వ
శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్
నిన్నటి సమస్యకు నా పూరణ
రాగ జ్ఞానము లేని బైరాగి యొకడు
కవన విద్య నెరుంగక కవి నటంచు
పండితుడనని సభ కేగి బలికె నిటుల
నాగఫణి శర్మ సుకవి యనం దగండు
కృష్ణారావు గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'రాగ జ్ఞానము' అన్నపుడు 'గ' గురువై గణదోషం.
శంకలు దీరగ వారధి
ప్రత్యుత్తరంతొలగించుపొంకముగన్ గట్టి యాకపివరుల తోడన్
లంకాపురి జనులందరి
శంకరు గెల్చి రఘువరుడు జనులన్ బ్రోచెన్
తన వెంట వచ్చిన వారి మదిలో ఉన్న అనుమానాలు తీరిపోయేలా సముద్రం మీద వారధి చక్కగా నిర్మించి, వానర వీరులతో కలిసి లంకలో నివసించే జనాల పాలిటి శంకరుడు(సుఖాన్ని ప్రసాదించే వాడు) అయిన రావణుడి మీద విజయం సాధించి, రఘురాముడు ప్రజలను కాపాడాడు
కృష్ణారెడ్డి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కృష్ణారెడ్డిగారూ,రెండవ పాదంలో యతి సరిచేయండి.పొ కు పి కు యతి సరిపోదు.ఒ ఉ లకు,ఎ ఇ ఋ లకు అ అం ై ౌ లకు యతిమైత్రి
తొలగించుగురువుగారు కొన్నిసార్లు గమనించరు!
ధన్యవాదములు సీతాదేవి గారూ
తొలగించుకొంచెం సందేహిస్తూనే ఆ పదం వాడాను. అంతకు మించి మరే పదము తోచలేదు. మీరు ఏదైనా సూచించగలరని ప్రార్ధన
తొలగించుపొంకమునన్ గట్టి దనదు పొలతుకగావన్ అనవచ్చును.ఆలోచించండి,ఇంకా మరికొన్ని తట్టవచ్చు!
తొలగించుసంకట కారకు రావణు
ప్రత్యుత్తరంతొలగించునంకము నందుఁ దునుమాడి యంబాపతినిన్
సంకీర్త నాళి నిమ్ముగ
శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్
పంకజ నాభు వేఁడ నల పంకజ గర్భ ముఖామరుల్ తమిం
బంకజ లోచనుండు ఖల పంకిల మానస దైత్యు రావణుం
బంకజ లోచనార్థ మట పంకజ జాన్వయు దర్పు ధర్మ నా
శంకరు నాజి గెల్చి జనసంఘముఁ బ్రోచెను రామభద్రుఁడే
కామేశ్వర రావు గారూ,
తొలగించుమొదటి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
రెండవ పూరణ 'పంకజ' శబ్దావృత్తితో మనోహరంగా అత్యుత్తమంగా ఉన్నది. మీకు ఒక్కటి కాదు ఐదు 'పద్మశ్రీ'లు!
పోచిరాజువారు ఈరోజు పంచముఖ పద్మజులైనారు!అమోఘము!నమఃపూర్వక అభినందనలు!
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. ధన్యోస్మి.
తొలగించుడా. సీతా దేవి గారు ధన్యవాదములు, నమస్సులు. మనః పంక ప్రక్షాళనార్థమే పంకజనాభాశ్రయము.
ఆటవిడుపు సరదా పూరణ:
ప్రత్యుత్తరంతొలగించు(జిలేబి గారికి అంకితం)
పొంకము మీరగా గిరిజ మోదము నొందెను మంచుకొండనున్
శంకరు నాజి గెల్చి;...జనసంఘముఁ బ్రోచెను రామభద్రుఁడే
రంకెలు వేసి చొప్పడుచు రాబడి గోరిన కూటశాలినిన్
బింకము జూపి గెల్వగను విందును జేయుచు భాగ్యనగ్రినిన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
కాని గిరిజ ఆజిలో శంకరుణ్ణి గెలువడం?
"తపస్సును మాన్పించి ప్రేమ యుద్ధంలో గెలిచి సగ భాగమై"
తొలగించుకింకరుడయ్యు పూర్వమున కిన్కనుబూనుచు శత్రుభావనన్
ప్రత్యుత్తరంతొలగించుపంకజలోచనిన్ వనిని వంచనతోడను తస్కరించి యా
లంకకు జేర్చగా సతిని రక్షణసేయగ దైత్యవంశ నా
శంకరు నాజిగెల్చి జనసంఘము బ్రోచెను రామచంద్రుడే!
సీతాదేవి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించులంకేశుడు దశగ్రీవుడు
ప్రత్యుత్తరంతొలగించువంకర మదితో ధరణిజ విడువక యున్నన్
మంకునc బోరన్ ఇంతివ-
శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్
యజ్ఞేశ్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...దశకంఠుడు... బోరగ నింతి...' అనండి.
కృతజ్ఞతలతో 🙏🙏
తొలగించులంకేశుడు దశకంఠుడు
వంకర మదితో ధరణిజ విడువక యున్నన్
మంకునc బోరగ నింతివ
శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించువంకర బుధ్ధితోడ యినవంశకులాంగనఁ బంధిసేసెనా
ప్రత్యుత్తరంతొలగించులంకపురాధినాథుడగు రాక్షసు డంచు కపీశుడావిధిన్
పంకజ నేత్రుకున్ దెలుప భండన మందున యట్టి ధర్మనా
శంకరు నాజి గెల్చి జనసంఘముఁ బ్రోచెను రామభద్రుఁడే.
విరించి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బుద్ధితోడ నినవంశ..మందున నట్టి...' అనండి. 'లంకాపురాధినాథుడు' అనడం సాధుసమాసం.
పంకజ ముఖియా సీతను
ప్రత్యుత్తరంతొలగించుసంకటములపాలు జేయు సర్వంకషుడౌ
లంకాధిపతియగు శివ వ
శంకరు గెల్చి రఘువరుడు జనులను బ్రోచెన్!!!
శైలజ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంకట మాయె రావణుని జంపక నేను జయించు టెట్టులీ
ప్రత్యుత్తరంతొలగించులంక నటంచు బాధపడ రాము డగస్త్యుడువచ్చి యిచ్చెనా
సంకటమార్పు స్తోత్రమును సర్వులుమెచ్చగగొల్చి ధ్వాంతనా
శంకరు నాజి గెల్చి జనసంఘముఁ బ్రోచెను రామభద్రుఁడే.
మిస్సన్న గారూ,
తొలగించుమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు గురువు గారూ.
తొలగించులంకాధిపతిని గెలువగ
ప్రత్యుత్తరంతొలగించుశంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్
శంకరుడేరామేశ్వరు
శంకలుదీరగవినుడిక శరణము వేడన్!!
గంగాప్రసాద్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం
ప్రత్యుత్తరంతొలగించుపంకజ నేత్ర కుజన్ గొని
బింకమ్మున తమ్ముని, సతి వినతులు వీడన్
లంకాదీశుని మోహ వ
శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్
సహదేవుడు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొంకక అంబ తపముచే
ప్రత్యుత్తరంతొలగించుశంకరు గెల్చె.. రఘువరుడు జనులను బ్రోచెన్
జంకక దశ శిరుని దునిమి
పంకజ ముఖి సీతఁ గాచె వసుమతి యందున్.
శంకించక యవనీశుడు
లంకాపురి జేరి జంపె లంకాధిపతిన్
బింకముతో తిరుగు శివ వ
శంకరు గెల్చె.. రఘువరుడు జనులను బ్రోచెన్
డా ఉమాదేవి గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.