18, మార్చి 2019, సోమవారం

సమస్య - 2961 (సరి రాఁ డెవ్వఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బొంకఁగా హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు"
(లేదా...)
"సరి రాఁ డెవ్వఁ డసత్యమాడఁగ హరిశ్చంద్రాఖ్య భూజానికిన్"

47 కామెంట్‌లు:

  1. జంకు లేకను పలుకంగ సాటి యెవరు
    కలియు గంభున వింతల నిలయ మంట
    విలువ లేదట నీతికి నెలవు కనగ
    బొంకఁగా హరిశ్చంద్రునిఁ బోలు నెవడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలియుగంబున' టైపాటు.

      తొలగించండి
  2. అనిని వినగ నశ్వథ్థామ హతుడయెనని
    ధనుసును విడి ద్రోణుడు కూలె ధర్మరాజు
    బొంకగా, హరిశ్చంద్రుని బోలు నెవడు
    సత్య సంధత లోననీ జగతి యందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధనువును' అనండి.

      తొలగించండి
    2. అయె..సాధువేనానండి..
      అయ్యె..ఆయె..సాధువులనుకుంటా...

      తొలగించండి
  3. ప్రాతఃకాలపు కిట్టింపు:

    ధరలో సత్యము ధర్మమున్ నిలుపుటన్ ధైర్యమ్ములో నీతనిన్
    సరి రాఁ డెవ్వఁ ;..డసత్యమాడఁగ హరిశ్చంద్రాఖ్య భూజానికిన్
    తరమా! భూమిని నాకమున్ గలుపగా తథ్యమ్మవన్ రీతినిన్!
    వరమౌ తీరున నీతనిన్ దలచుచున్ ప్రార్థించె గాంధీజి భల్!

    రిప్లయితొలగించండి


  4. అరయంగన్ నిజ మన్న దేది? ముసియేదయ్యా? ప్రసంగంబదే
    ది? రసాభాసముగా శకారునివలెన్ ధీటైన రీతిన్ భళా
    సరి రాఁ డెవ్వఁ డసత్యమాడఁగ; హరిశ్చంద్రాఖ్య భూజానికిన్
    సరిరాడెవ్వడు సత్య మొక్క టిని తా సౌశీల్యమై నిల్పగాన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. అరె! శకారుని కిలని ధీటైన దెవరు
    బొంకఁగా? హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు
    సత్యమొక్కటినే శీల సంపదవలె
    గాచె? పలుకవే చిలుక చకచక యనుచు !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. తేటగీతి
      సత్య మునుబల్క జగతిలో సంకటములు
      వశ్య మగుటసాధ్యంబు కైవల్య కాంత
      బొంకగా !హరిశ్చంద్రుని బోలు నెవడు
      సత్య పథమును విడని భూజాని గలడె?

      ఆకుల శివరాజలింగం వనపర్తి

      తొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    నక్షత్రకుడు... హరిశ్చంద్రునితో..

    కరమందున్ గన గుడ్డిగవ్వ యయినన్ కన్పింపదే తీర్చగా ,
    ధరణీనాథ ! ఋణమ్మె లేదని యసత్యంబొండు పల్కంగ నీ...
    కిరవౌ సంపద దక్కు , నిన్ను గనగానిట్లందురింతే గదా !
    సరి రాడెవ్వడసత్యమాడగ హరిశ్చంద్రాఖ్య భూజానికిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. జనులు కలి యుగ మందున జంక రె వరు
    బొంకగా ;హరి శ్చoద్రుని బోలు నెవడు
    సత్య మే పల్కి నిరతంబు సాత్విక ముగ
    మెలగ నేర్చు ను మాన్య తన్ మెఱయు నట్లు

    రిప్లయితొలగించండి
  9. స్వార్థ పూరిత జగమందు సర్వ జనులు
    గొంకు లేకయె రవ్వంత జంకు లేక
    వీస మైనను వెనుకంజ వేయరు గద
    బొంకఁగా ; హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు?

    రిప్లయితొలగించండి
  10. గు రు మూ ర్తి ఆ చా రి


    " బొంకగా హరిశ్చంద్రుని బోలు నెవడు

    వా డసత్యరతడు , నిరూపణము జేతు "

    ననుచు గాధిసుతుడు ‌ తా బ్రతిన యొనర్చి

    నా వశిష్టుతో , నపజయుం డయ్యె | నౌర !

    అంబుజహితునకు గళంక మలద వశమె ?


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  11. యుద్ధ సమయాన ధర్మేంద్రు యూహ మార్చి
    బొంకఁగా! హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు
    దార సుతులను గోల్పోయి ధరణి నిలువ
    సత్యc మీతని భూషణ సరళి భువిని!

    రిప్లయితొలగించండి
  12. రాజ్య మంతరించె సిరులు రావు వెంట
    సుతుడు లేడు సతియు తన చుట్టు లేదు
    అన్ని ఇడుముల మనమున సంతసమని
    బొంకగా హరిశ్చంద్రుని బోలు నెవడు

    రాజ్యము పోయింది సిరి సంపదలు వెంట లేవు, కొడుకు దగ్గర లేడు, భార్య తన చుట్టూ లేదు - అన్ని కష్టాలు చుట్టుముట్టినా మనసులో సంతోషమని అబద్ధం ఎవరైనా హరిశ్చంద్రునిలా చెప్పగలరా?

    రిప్లయితొలగించండి
  13. జంకు గొంకును లేకుండ సకల‌జనులు
    చీటి మాటికి విషయము చిన్నదైన
    నెందు కనుకోరు వారలు హీనులగుచు
    బొంకఁగా, హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. (విశ్వమిత్రుని మాటగా..)
      ధరలో చెల్లును నాదుమాటయె,నసాధ్యమ్మేదియున్ లేదు నే
      సురరాజున్ సురు లందరున్ వినగ నస్తోకమ్ముగా దెల్పెదన్
      సిరినే కోరిన దివ్వలేక నతడే చిత్తౌను క్షోణిన్ గనన్
      సరి రాడెవ్వడసత్యమాడగ హరిశ్చంద్రాఖ్య భూజానికిన్ !!

      తొలగించండి
  14. సంకటస్థితి లోనైన జంకునుగద
    బొంకగా,హరిశ్చంద్రుని బోలునెవరు
    వంకబెట్టగ లేనట్టి వాక్కునందు
    సుంకమడిగెను కాంతనే జూడరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సిరియున్ రాజ్యము గోలుపోయినను సౌశీల్యంబు నిక్కంబనన్
      దరలెన్ గానల గట్టుపుట్టముల గాంతాపుత్ర సంయోగమున్
      సరిరాడెవ్వ,డసత్యమాడగ, హరిశ్చంద్రాఖ్య భూజానికిన్
      దరమే కాటికి కాపరైన విధి యాద్యంతంబు వెంటాడగన్

      తొలగించండి
  15. ధరణి గూలెను ద్రోణుడు ధర్మరాజు
    బొంకగా,హరిశ్చంద్రునిబోలునెవడు
    పోల్చలేమండి యెవరిని పుడమినందు
    సత్య పాలన విషయాన సాటియతని

    రిప్లయితొలగించండి
  16. (అబద్ధాలపుట్ట " హరిశ్చంద్ర" గురించి తండ్రి ఆవేదన )
    నోరు తెరువ నసత్యాలు జారుచుండె ;
    దెబ్బ లెన్నైన వదలడు దబ్బరలను ;
    తక్కువైనది నా కేడు పొక్కటింక ;
    బొంకగా " హరిశ్చంద్రు " ని బోలు నెవడు ?

    రిప్లయితొలగించండి
  17. సరిరారెవ్వరు దాన మీయక నరున్ సాధించ గర్ణుండెపో
    సరిరారెవ్వరు శాపమీయక ధరన్ శ్లాఘించ దుర్వాసుడే
    సరిరారెవ్వరు రంతిదేవునకు యాజంబర్థికిన్నీయకే
    *"సరి రాఁ డెవ్వఁ డసత్యమాడఁగ హరిశ్చంద్రాఖ్య భూజానికిన్"*

    రిప్లయితొలగించండి
  18. కొత్త నగరిని నేనాదుకొందు ననుచు
    బొంకగా, హరిశ్చంద్రుని బోలు నెవడు
    కలడు పుడమిలోన యితడుగాక యనుచు
    నెన్నుకొనగ నొసగెనొక మన్నుముంత

    రిప్లయితొలగించండి
  19. డా.పిట్టా సత్యనారాయణ
    "రంకు"కే "బొంకు" పృచ్ఛకా!రాజుకేల?
    'బొ''బ్బొ' గలిపిన నీవెంత పుణ్యుడవొకొ
    నడి బజారున యనకు నీ నడ్డి విరుగ
    "బొంకగా హరిశ్చంద్రుని బోలు నెవడు?"

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. ఏకపత్నీవ్రతమ్మున నెంచ రామ
    చంద్రుఁ గాకుత్స్థునకు ధర సరి యెవండు
    సత్య నిత్య వ్రతమునఁ గాంచ, వలదయ్య
    బొంకఁగా, హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు ?


    ధరయం దుండిరె భూతలాధిపులు సత్యత్విట్టు లెన్నండు నే
    నరయం జాలుదు వాని సత్య రత మా యౌన్నత్య మెల్లం దపో
    వర గాధేయుఁడు వల్కె నింద్రసభలోఁ బాకారి వీక్షించఁగన్
    సరి రాఁ డెవ్వఁడ? సత్యమాడఁగ హరిశ్చంద్రాఖ్య భూజానికిన్

    రిప్లయితొలగించండి
  22. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అరెవో! భారత మాతనున్ గొలుచు మీ యత్నమ్మునున్ మానుడీ!
    పరువుల్ పెట్టుచు రండి! భాగ్య నగరిన్ బ్రహ్మాండమౌ రీతినిన్
    వరమౌ నెన్నికలందునన్ వినగ పల్ వాక్యమ్ములీ తీరునన్:👇
    "సరి రాఁ డెవ్వఁ డసత్యమాడఁగ హరిశ్చంద్రాఖ్య భూజానికిన్"

    రిప్లయితొలగించండి
  23. వట్టి మాటలేల?వసిష్ట!వసుధ లోన
    బొంకఁగా హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు"
    లేడు గాదె,నీదు పలుకు లెపుడు సత్య
    దూరము, నిపుడె ఋజువు చేతునని వెడలె
    గాది సుతుడు రయముగ నాకమును విడిచి

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వోట్ల పంచగుళికలు 4


      16)తే :భిక్ష గాడికి గుప్పెడు బియ్య మైన
      రాల్చని మనిషి వోట్లకై దాల్చు నపర
      దాన కర్ణావ తారమ్ము దయను కలిగి ,
      తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

      17) తే:తల్లి తండ్రులు యింటిలో దండగనుచు
      నాశ్రమంబున చేర్చిన నల్ప బుద్ధి
      వాడు జనులకు యిచ్చునా కూడు గుడ్డ,
      తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
      18తే: అన్న కైన వదిన కైన నక్క కైన
      మంచివారికే వోట్లను పంచ వలయు
      లేనిచో నీకు నిత్యము హాని కలుగు
      తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
      19) తే: నేడొకరి టోపి పెట్టును మాడు పైన,
      రేపు నొక్కటి తలపైన దోపు కొనును,
      స్వార్ధ పరుడే దినము నీకు సాయపడడు,
      తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
      20) తే: వలదు రౌడీల రాజ్యము, చెలిమి తోడ
      రామ రాజ్య పాలనమును మేము చేతు
      మనుచు నమ్మ బలుకు నేత మాయ తోడ,
      తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

      తొలగించండి
  25. ఇంపగు పదవు లొనగూడు నెన్నికలను
    బొంకఁగా, హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు?
    స్వార్థ పరులై మనుజులిప్డు సాగుచుండ
    కాంచ తరమె నిజమరి నీ కాలమందు

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. సరిగా జెప్పిరి యార్యులే నిజము మాసావిత్రికే వేళలన్
    సరిరాడెవ్వడసత్యమాడగ,హరిశ్చంద్రాఖ్యు భూజానికిన్
    సరిరాడెవ్వడుసత్యమాడగనునాశాంతంబుశోధిల్లగన్
    గరిమన్సత్యముబల్కుచోనెపుడునెక్కాలంబుసౌఖ్యంబెగా

    రిప్లయితొలగించండి

  28. మారెనిప్పుడు కాలము మహిని జూడ
    జంకను పలుకు లేకయే జవముగాను
    బొంకగా,హరిశ్చంద్రుని బోలు నెవడు
    గలడటండ్రుబుధజనులు కలత తోడ.

    రిప్లయితొలగించండి
  29. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  30. తగునె యుద్ధాన ధర్మజు దెలివి మీరి
    బొంకఁగా; హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు
    పుత్ర పత్ని రాజ్యమును ఫణము బెట్ట
    సత్య సంధానుc డాతని సాటి యెవరు?

    రిప్లయితొలగించండి
  31. వెంటబడుచు నక్షత్రక కంటకాన
    బొంకగా!"హరశ్చంద్రుని బోలు నెవడు
    యప్పుదీర్చగ కష్టాలు జెప్పు కొనక!
    కాటికాపరిగా బాకిగట్టె రాజు!

    రిప్లయితొలగించండి
  32. ధరణిన్ కాంచము మోసపూరితపు చందమ్మందు నానేతకున్
    సరి రాఁ డెవ్వఁ డసత్యమాడఁగ, హరిశ్చంద్రాఖ్య భూజానికిన్
    వరుసన్ పల్కును ప్రీతితో సతము తా వంచింప సద్భక్తి యా
    దురహంకారిని యెన్నికల్ జరుగుచో దూషింప న్యాయమ్మగున్

    రిప్లయితొలగించండి
  33. *శంకర శతకము* ముద్రణ పనిమీద విద్యానగర్ వచ్చి ఉన్నాను. ఏ రాత్రికి నెలవు చేరుకుంటానో. ఈరోజు మీ పూరణలపై స్పందించలేను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  34. ధరణిన్ బాలన జేయగన్ పదవికై ధర్మమ్మునే వీడుచున్
    బరులన్ వంచన జేయుచున్ ధనము సంపాదించెడిన్ నేతకున్
    సరిరాడెవ్వఁ డసత్యమాడఁగ, హరిశ్చంద్రాఖ్య భూజానికిన్
    శిరమున్ వంచుచు మ్రొక్కరా యతని సచ్చీలమ్ము గీర్తించుచున్.

    రిప్లయితొలగించండి
  35. సరిరారెవ్వరు సారెసారెకును సంసారంబులో బొంకరే
    హరినీనామమె రక్షనాకనుచు ,గుయ్యాళింపు మీ దాసునిన్
    పరుడన్ గానని బాసలాడి, బడయన్ ప్రజ్ఞా ప్రభావంబుచే
    సిరి సౌఖ్యాదులు నందితందురు గదా క్షేమంబు నర్థించు నీ
    *"సరి రాఁ డెవ్వఁ డసత్యమాడఁగ హరిశ్చంద్రాఖ్య భూజానికిన్"*

    రిప్లయితొలగించండి
  36. సత్య ధర్మములకెపుడు సాటి లేక
    గాంధివలెనుండు వారలు కలర యిలన
    అవసరార్థమే యందరు అసలు సిసలు
    బొంకఁగా, హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు!!

    రిప్లయితొలగించండి