3, మార్చి 2019, ఆదివారం

సమస్య - 2946 (కలహము సుఖమిచ్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కలహము సుఖ మిచ్చు ననెను గాంధీ మునుపే"
(లేదా...)
"కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్ గాంధీజి మున్పెప్పుడో"

71 కామెంట్‌లు:

 1. వలదనె హింసనము మనకు
  ఫలితము దారుణ మౌను పంక జనాభా
  జలదము వలెకురిసి మలుగు
  కలహము సుఖ మిచ్చు ననెనుగాంధీ మునుపే

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వల దనియెను హింస మనకు' అనండి.
   రెండవ పాదంలో గణదోషం. "ఫలితమ్మగు దారుణముగ..." అనండి.

   తొలగించు
 2. ఇల సత్య మహింసలగొని
  బలహీనుల త్రొక్కి త్రోయు పాపాత్ములతో
  తల వంచక పలు తెరగుల
  కలహము సుఖ మిచ్చు ననెను గాంధీ మునుపే :)

  రిప్లయితొలగించు
 3. రిప్లయిలు
  1. కందం
   చెలఁగుచు సత్యమహింసలు
   తెలవారిని ప్రారద్రోల,దేశముఁ గొన స్వే
   చ్ఛల రక్తపాత రహితఁపు
   కలహము సుఖమిచ్చు ననియె గాంధీ మునుపే

   తొలగించు
  2. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 4. కలనైనన్ తలపింప రాదనుచు మాగాంధీ నివేదించగా
  ఫలితం బుల్గని నంతశాంతి యుతమై ప్రాంతీయ మోహంబునన్
  కలుషం బన్నది దూరమే యనుచు రాగాలాప లాలిత్యమున్
  కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్ గాంధీజి మున్నెప్పుడొ

  రిప్లయితొలగించు
 5. తొలగగ పరజాతీయులు
  వలదనె హింసను, గెలువగ వచ్చనె మనముల్
  సలుప నహింసాయుతమౌ
  కలహము, సుఖమిచ్చుననెను గాంధీ మునుపే

  రిప్లయితొలగించు
 6. అలవోకగ సాధ్య పడవు
  తలచిన కార్యమ్ములేవి ధరణిని వాటిన్
  గెలువ నహింసా యుతమగు
  కలహము సుఖమిచ్చు ననెను గాంధీ మునుపే.

  రిప్లయితొలగించు


 7. ఇమ్రాన్ ఖాన్ ఉవాచ :(  అలుక యదేలర మోడీ
  వలదన కిక! శాంతి మాట పలికితి! పుల్వ
  మ్ముల కిక తావివ్వను ! చిరు
  కలహము సుఖ మిచ్చు ననెను గాంధీ మునుపే!


  రారా సరసకు రారా :)  జిలేబి

  రిప్లయితొలగించు
 8. మత్తేభవిక్రీడితము
  తిలకించంగ నహింస సత్యములు సందేశాత్మకమ్మైన స్వే
  చ్ఛల దేశమ్మును వీడిపోవ బలమౌసంకల్ప మే తెల్లలన్
  దొలఁగన్ జేయఁగ! రక్తపాత రహితోన్మూలమ్మునన్ వీగెడున్
  గలహమ్ముల్సుఖశాంతులిచ్చుననియెన్ గాంధీజి మున్పెప్పుడో

  రిప్లయితొలగించు
 9. ఫలి యించును కార్య ము లి ల
  సలుపoగా శాంతి యుత పు సమర ము నెపుడు న్
  దెలిపె న హింసా యుత మౌ
  సమర ము సుఖ మిచ్చు ననెను గాంధీ మును పే

  రిప్లయితొలగించు
 10. అలసట మరుపుకు జనులిల
  పొలముల పనులందుఁ బెక్కు పొడుపు కథలతో
  మలచెడి ప్రశ్నోత్తరముల
  "కలహము సుఖ మిచ్చు ననెను గాంధీ మునుపే"
  =========================
  గలగల కలహము లెంచిన
  వెలయును శత్రుత్వ మెపుడు బ్రేమ నశించున్
  ఫలియించు శాంతియుతమౌ
  "కలహము సుఖ మిచ్చు ననెను గాంధీ మునుపే"

  రిప్లయితొలగించు
 11. తెలదొరలు భరత మేలగ
  తలబడి పరపా లకులను తరుమం దోలన్
  "యిలc ధర్మమనగ నహింస
  కలహము సుఖ మిచ్చు" ననెను గాంధీ మునుపే

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. యజ్ఞేశ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదం చివర లక్షణ విరుద్ధంగా జగణం ఉంది. "...యిల ధర్మమన నహింసా। కలహము..." అనండి.
   'ఇల' తరువాత అరసున్న అవసరం లేదు.

   తొలగించు
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించు
 12. కందము
  తెలవార లాగడములకు
  బలిపశు వులు భారతీయ ప్రజల హితంబై
  బలికెనం సత్యా హింసా
  కలహమె సుఖమిచ్చు ననెను గాఃధీ మునుపే
  ఆకుల శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శివరాజలింగం గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పలికెను' టైపాటు.

   తొలగించు
 13. ( మహాత్ముడు మహ్మదాలీజిన్నాతో దేశవిభజనసమయాన)
  " అలకల్ బూనక మహ్మదాలి ! యనుజా !
  యాలింపు నా పల్కులన్ ;
  గలతల్ నిండిన భారతీయులును , నీ
  కత్యంతమున్ సొంత పి
  ల్లల బోల్ పాకుజనుల్ మెడల్ నరుక లీ
  లన్ బట్టి ; యింకెట్టు లీ
  కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు " ననియెన్
  గాంధీజి మున్ పెప్పుడో !)

  రిప్లయితొలగించు
 14. చెలిమియె భాగ్యము నొసగును
  కలసి మెలసి యుండ వీలు కలపండింపన్
  తెలివిగ వర్తిలి వీడగ
  కలహము ; సుఖ మిచ్చు ననెను గాంధీ మునుపే !

  రిప్లయితొలగించు


 15. నిలిచెన్ మోడియె సైనికాళి సరసన్ నింపాది చాణక్యుడై
  కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్, గాంధీజి మున్పెప్పుడో
  కలగన్నట్టి ప్రతిష్ఠ దేశమును సాకారంబుగాచేయగా,
  పలికెన్ శాంతియె మేలు మేలనుచు జంబాల్గొట్టు యిమ్రాను ఖాన్
  నిలలో దేశము లన్ని మేల్కొనుచు కానీమిన్ ప్రబోధింపగాన్!


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...యిమ్రాను ఖా। నిలలో...' అనండి. 'కానీమిన్'?

   తొలగించు

  2. కంది వారు

   నమో నమః


   prevention, restraint from action.


   జిలేబి

   తొలగించు

  3. కానీమి - prevention, restraint from action.

   జిలేబి

   తొలగించు
 16. పడుచు గాంధీ ఉవాచ
  చెలువము మీరెడు చిన్నది
  యలిగిన బ్రతిమాలి భర్త హ్లాదముతోడన్
  సలుపగ సేవలను ప్రణయ
  కలహము సుఖమిచ్చుననెను గాంధీ మునుపే!

  మునుపే అన్నారు గనుగ పూర్వాశ్రమంలో అని! :)

  రిప్లయితొలగించు
 17. కలహమున జేతజిక్కిన
  బలికెట్టి విధముగనైన బాధపఱచకన్
  బలిమిని చూపించిన పై
  గల హము సుఖమిచ్చుననెను గాంధీ మునుపే

  హము= పరమాత్మ , సుఖము= స్వర్గము
  బలిమి= ఔదార్యము

  రిప్లయితొలగించు
 18. కలబడ నెంచుట తప్పది
  మెలకువతో దోషమ్ములు మించక మదిలో
  నిలకడన జరుగు నంతః
  కలహము సుఖమిచ్చుననెను గాంధీ మునుపే!

  రిప్లయితొలగించు
 19. ఇలమీగురువును నడుగుము
  చెలువంగా గాంధిగురిచిచెప్పుడుననగన్
  సులువుగనుబదులుసెప్పెను
  కలహముసుఖమిచ్చుననెనుగాంధీమునుపే

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చెప్పుం డనుచున్' అనండి.

   తొలగించు
 20. లలనా వినుమా నిర్మల
  కలధౌతాత్మ జన తతికి, కలవరమేలా,
  సలలిత భాషణ ఖండిత
  కలహము సుఖ మిచ్చు ననెను గాంధీ మునుపే


  ఇలయే నాకము ధర్మ రక్షితముగా నింపార నిక్కమ్ముగం
  గలవే దుస్తర వైరభావములు లోకం బందుఁ జింతింప ని
  శ్చల చిత్తస్థిత శాంత భాషణములన్ సౌహార్ద ఛేద్యమ్ములై
  కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్ గాంధీయె మున్పెప్పుడో

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   'సౌహార్ద + ఛేద్యమ్ములు = సౌహార్ద చ్ఛేద్యమ్ములు' అవుతుంది కదా!

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
   అవునండి. పొరపాటు చూచుకొన లేదు. ధన్యవాదములు. సౌహార్ద జీర్ణమ్ములై యని సవరించెదను.


   ఇలయే నాకము ధర్మ రక్షితముగా నింపార నిక్కమ్ముగం
   గలవే దుస్తర వైరభావములు లోకం బందుఁ జింతింప ని
   శ్చల చిత్తస్థిత శాంత భాషణములన్ సౌహార్ద జీర్ణమ్ములై
   కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్ గాంధీయె మున్పెప్పుడో

   తొలగించు
 21. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వలపుల్ మీరగ మాటిమాటికిని పల్ వాదోపవాదాలతో
  తలుపుల్ బాదుచు జుట్లు పట్టుచునువే తంటాలు కల్పించుచున్
  తెలవారంగను పళ్ళు తోముచునుభల్ తీండ్రించి యత్తయ్యతో
  కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్ గాంధీజి మున్పెప్పుడో!

  గాంధీజి = మనేకా గాంధీజి

  రిప్లయితొలగించు
 22. కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్ గాంధీజి మున్పెప్పుడో
  యలనాటెప్పటి మాటయో యదియ యార్యా!యిప్పుడేవారునా
  బలుకుల్నమ్మరు శాంతులెప్పుడు ప్రలంభాలాడగా రావుగా
  వలపుల్జూపుచుబ్రేమతోడుతను దాభాషించుచోవచ్చునే

  రిప్లయితొలగించు
 23. మైలవరపు వారి పూరణ

  బాపూ ... నీకు వందనమ్🙏

  బలమెంతో యన చేతికర్ర తెలుపున్ , భాగ్యమ్ము కొల్లాయి యే
  తెలుపున్ , తెల్పు శరీరసౌష్ఠవపు దీప్తిన్ బోసినోరే , ధరన్
  పలుకే శాసనమైన జాతిపిత సంభావించి , లేకున్నచో
  కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్ గాంధీజి మున్పెప్పుడో !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
 24. సరదా పూరణ:

  అలుకన్ బూనగ సత్యభామ, ఘన సత్యాలోలుడే ధీమతిన్
  విలువైనట్టిది పారిజాత తరువున్ పేర్మిన్ భువింజేర్చుచున్
  కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చుననియెన్ ;గాంధీజి మున్పెప్పుడో
  బలపర్చెన్ గద శాంత్యహింసలను దాస్వాతంత్ర్య సంగ్రామమున్ !

  రిప్లయితొలగించు
 25. "వలపుల మలపుల జంటకు
  కలహము సుఖమిచ్చుననెను"!"గాంధీమునుపే
  సలిపిన సత్యాగ్రహమున
  తలపోసిన శాంతి మనకుధర్మముబంచెన్!"

  రిప్లయితొలగించు
 26. వలచిన మగడే వలదన
  తలచగవగపేమిగిలెనుతామసముననా
  తలచిన దేదైన ప్రణయ
  కలహము సుఖ మిచ్చు ననెను గాంధీ మునుపే"!!

  రిప్లయితొలగించు
 27. కలలోనైనదలంపబోకుమట రక్తమ్మేరులై పారదే
  ఖలులున్ సజ్జనులైన సత్తురు గదా కయ్యంబులో మానరా
  కలహమ్ముల్, సుఖశాంతులిచ్చుననియెన్ గాంధీజి మున్పెప్పుడో
  పలికే మాటల లోని యార్ధ్రతదియే ప్రాప్తింప జేయున్ గదా!

  రిప్లయితొలగించు

 28. కలలో సైతము వలదనె
  కలహము,సుఖమిచ్చుననెను గాంధీ మునుపే
  యిలలో సహనంబొక్కటి
  బలముగ నున్నను గడించ వచ్చు జయంబున్.

  రిప్లయితొలగించు
 29. రిప్లయిలు
  1. కలహమ్ముల్ వరకార్యభంగకరముల్ ,కార్పణ్యశత్రుత్వసం
   కలితమ్ముల్,వ్యతిరేకన‌ష్టఫలసంఘాతమ్ములై శాంతివి
   హ్వలతం గూర్చు, నిమేషకాలలసితాంతఃపూర్ణరాగమ్ములౌ
   కలహమ్ముల్ సుఖశాంతి నిచ్చు ననియెన్ గాంధీజి మున్నెప్పుడో

   కంజర్ల రామాచార్య
   కోరుట్ల.

   తొలగించు