30, మార్చి 2019, శనివారం

సమస్య - 2972 (చీకటిని మించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీకటిని మించు వెలుఁగున్నదా కనులకు"
(లేదా...)
"చీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే"

74 కామెంట్‌లు:

  1. ఎదను నిండిన వెలుగంత ముదము గూర్చు
    గగన మంటిన తిమిరము కరిగి పోయి
    చీకటిని మించు,వెలుగున్న దా కనులకు
    పగలు తొలగంగ రేరాజు పలుక రించు

    రిప్లయితొలగించండి
  2. ప్రాతఃకాల కిట్టింపు:

    కూకటపల్లిలో నిశిని కూడుచు ముచ్చటి పెండ్లికూతురున్
    వాకిలి ద్వారమున్ విడిచి బాపడు వేలిడి చూపుచుండగా
    నాకసమున్నరుంధతిని హాయిగ తీయగ చూడ కోరగా
    చీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే

    రిప్లయితొలగించండి

  3. Unable to cross beyond పెంజీకటి Lord help me in your name glory!


    నా కల కల్లయయ్యె ! సయి నాకము భూమియు భ్రాంతియయ్యె! పెం
    జీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్న, దే
    వా! కనులన్ బడన్ కరుణ భాసిల చేయుము నిత్యముక్త! ఈ
    శా! కృప నీదు కావలయు చక్కగ లోకము లోన నాకికన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏమయింది మీకు...ఇటీవల మరీ వేదాంతంలో ఇమిడి పోయారు )

      తొలగించండి
    2. ఆహా! అద్భుతమైన విరుపు జిలేబీగారూ
      ఉత్తమ్! అతియుత్తమ్!!

      నమోనమః
      👌🏻👏🏻💐🙏🏻🙏🏻

      తొలగించండి
    3. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది అభినందనలు.
      'సయి' లాంటి పాదపూరణ పదాలకు స్వస్తి పలకండి ఇలాంటి పదాల సాయం తీసుకొనే స్థాయిని దాటిపోయారని నా విశ్వాసం

      తొలగించండి
    4. [30/03, 7:18 AM] నివర్తి మోహన్ కుమార్ గారు: 🙏🏻🙏🏻🌹👌👋

      [30/03, 7:18 AM] ఎన్.వీ.ఎన్. చారి: 🙏👌

      [30/03, 7:18 AM] మైలవరపు మురళీకృష్ణ గారు: 🙏పద్యం బాగుందండీ

      తొలగించండి
    5. నేడు జీపీయసు వారి ఉద్యోగాన్ని నే లాగేసుకున్నా మీవరకు. మైలవరపువారి డ్యూటి మాత్రం వారిదే..
      🤣🙏🏻🙏🏻

      తొలగించండి
    6. [30/03, 7:18 AM] వజ్జల రంగాచార్య గారు: చాలాబాగుంది అభినందనలు

      తొలగించండి

    7. నమో నమః అందరికీ :)


      కంది వారు సయి బదులు ప్రభు గా వేసుకున్నా !



      నెనరులు మీ విశ్వాసానికి


      జిలేబి

      తొలగించండి
  4. చీకటి లోకమీయవని చేసినగర్మఫలంబునూడ్వగా
    నాకచతుర్దశోద్భవులునైనజనించకతప్పదంచు నా
    కౌకసులెందరోజనమకైయవతారముబేరవత్తురీ
    *"చీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే*

    రిప్లయితొలగించండి
  5. చీకటిలోనెసౌఖ్యమట చీకటిపేరిమినెయ్యుడంట యా
    చీకటి సేదదీర్చునట చెట్టలుచోరులుహాయిబొంద పెం
    జీకటిదాటియోగినులుజేరరెమోక్షపదంబు ,యోగమన్
    *"జీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే*

    రిప్లయితొలగించండి
  6. ఆకటినున్నబూకటికినందెఫలంబదిగ్రుళ్ళిపోయె పెం
    జీకటిలోనతండు దనచేతికి జిక్కినదాన్నివీడునే
    ప్రాకటమౌబుభిక్షదినె వాడురుచిన్ శుచిజూచెనేయహో
    *"చీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే*

    రిప్లయితొలగించండి


  7. ఆకలిని గొన్న వారికి యన్న మగుచు
    భక్తి గా భజియింపగ భగము గాను
    చీకటిని మించు; వెలుఁగున్నదా కనులకు
    నిత్యముక్తుని కొలువంగ నీరజాక్షి !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. చీకటిని మించు వెలుగున్నదా కనులకు
    ననుచు భ్రమతోడ మనుజులు నిను మరచిరి
    సర్వ మున్నీవయిన మాకసాధ్య మేది?
    మేడిపుర వాస మముగావు నార సింహ!

    మేడిపూర్- నేటి నాగరకర్నూలు జిల్లాలోని దుందుభీ నది తీర క్షేత్రము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు
      చివరి పాదంలో యతి తప్పింది. సవరించండి

      తొలగించండి
  9. విశ్వ రూపము తిలకించ వేడి నావు
    యిచ్చితిని రాజ ! కనుకలి, నచ్చెరువుగ
    చీకటిని మించు వెలుఁగున్నదా కనులకు
    కాంచు మనిపలికెనపుడు కంస రిపువు

    రిప్లయితొలగించండి
  10. వేకువ జామునన్ నిలచి వేలుపు సూరుని కొల్చినం తనే
    నాకము నుండి దేవతలు వాంచిత ముల్ నెరవేర్చు నందురే
    నేకత మందునన్ కొలిచి తూరుపు కొండకు నర్ఘ్య మీయగన్
    చీకటి కంటె మేలయిన చెన్న లరారెడు కాంతి యున్నదే

    రిప్లయితొలగించండి
  11. కురుసభలో కృష్ణుని విశ్వరూపం గాంచిన అనంతరం ధ్రుతరాష్ట్రుని వేడుకోలు:

    తేటగీతి:
    విశ్వ రూపంబుఁ గాంచితి విశ్వనాథ!
    చాలునిక లోకమును గాంచఁ జాలనయ్య
    "చీకటిని మించు వెలుఁగున్నదా కనులకు"
    మరల నాదృష్టి నా కీయుమయ్య కృష్ణ!

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    నా కనుదోయి చూచెడి యనామకమైన ప్రపంచమొక్కటే
    నాకముగా దలంచితిని , నా కనుసోకని దివ్యమౌ మహా...
    లౌకిక దృష్టి లేమి గనులన్ గల యంధుడనన్న భావమన్
    చీకటి కంటె మేలయిన చెన్నలరారెడు *కాంతి* యున్నదే ?!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  13. చక్కని యుపవనము చేరి సరసములను
    సలుపు సమయము నందున, జగతి మరచి
    మదను కేళిలో మిథునము కదుల మసక
    చీకటిని మించు వెలుఁగున్నదా కనులకు

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    వీక నన్యాయ వృత్తిని వీడి నరుడు
    అర్ధ నగ్నత తోనున్న నాడిపోయు
    లోకమే మెచ్చ దతని విలోకనమును
    చీకటిని మించు వెలుగున్నదా కనులకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నరుడు + అర్థ' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. అక్కడ "వీడి మనుజు । డర్ధ..." అనండి.

      తొలగించండి
  15. కన్ను గనలేని పరమాత్మకాంతి మాయ
    చీకటిని మించు,వెలుగున్నదా కనులకు
    నాత్మరూపుడై నీలోన నంగములకు
    జేతనత్వము నిచ్చెడు రీతిలేక?

    రిప్లయితొలగించండి
  16. డా.పిట్టా సత్యనారాయణ
    (పండిట్ ఫకీర్చంద్జీ మహరాజ్ రాధాస్వామి ధ్యానయోగములో జేసిన సత్సంగ్ లో పలికిన సత్య వాక్కు,తన95వ యేట.అందరుస్వాములు తమకు జ్యోతి దర్శనమైనదని పైకి చెప్పుకునేవారే!)
    జోకపు వీక్షణన్ భృకుటి జూడగ జూడగ నేళ్ళుగడ్చినన్
    లోకపు ధ్యాస వీడదు విలోకనమందున వెల్గురాక నన్
    దాకునె యోగసిద్ధియని తల్లడిలన్ గనులందు నిండు పెం
    జీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే?!

    రిప్లయితొలగించండి
  17. (అర్ధరాత్రి యశోధరా రాహులులను వీడి అడవికి బయలు దేరిన సిద్ధార్థుడు తన రథసారథి చెన్నునితో )
    వాకొనరాని వంతలను
    వందురుచుండిన మానవాళికిన్
    మేకొనజేయు నవ్యమగు
    మేలిమి మార్గము జూడ నేగెదన్ ;
    నాకిక సర్వమున్ జగమె ;
    నాయన ! చెన్నుడ ! తెమ్ము గుర్రమున్ ;
    జీకటి కంటె మేలయిన
    చెన్నలరారెడు కాంతి యున్నదే ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణండీ! తెమ్ము తేరునున్ అంటే యింకా బాగుంటుందేమో!నమస్సులు!

      తొలగించండి
    2. బాగుంటుంది . కానీ ఆయన అశ్వాన్నే (కంటకాశ్వం )
      తీసుకురమ్మనమని చెన్నుడికి చెప్పాడండీ ! ఆగుర్రం మీద వెళ్లుతుంటే చప్పుడు కాకుండా ఉండటానికి
      దేవతలు అరచేతులు గుర్రం కాలి గిట్టల క్రింద పెట్టారుట . ధన్యవాదాలండీ !

      తొలగించండి
    3. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. అనుమానిస్తూనే అడిగానండీ!రథసారథి గనుక రథం తెమ్మన్నాడేమోననుకున్నాను.మీరు తెలియనివారుకాదని తెలిసికూడ సాహసించాను.క్షంతవ్యురాలిని!

      తొలగించండి
  18. చిత్త మందున నిల్పి యు శివుని రూపు
    ధ్యాన మందు న మునిగిన గాన నగు ను
    చీకటి ని మించు వెలుగు న్న దా కను లకు
    తని యు చుందు రు భక్తులు తన్మయమున

    రిప్లయితొలగించండి

  19. మా అయ్యరు జంబునాథన్ కృష్ణ స్వామి మహా కార్మేఘము :) கருப்புதா எனக்கு பிடிச்ச கலரு :)



    నా కయి బట్టి పెన్మిటిగ నాకెదు రాడక నెప్డు జై జిలే
    బీ! కమలాక్షి ! యంచు నిల భీముని పాకము వండి వార్చు కృ
    ష్ణా! కిను కేల కాళిమయె చందము మవ్వము నీకు రా! పగల్
    చీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే!



    ஜிலேபி

    రిప్లయితొలగించండి
  20. భవితయె యగమ్య గోచర భరము కాగ
    బాట బొడగన రాదాయె భారమయ్యె
    నంధ కారమంతటను జూడ నలము కొనియె
    చీకటిని మించు వెలుఁగున్నదా కనులకు ?

    రిప్లయితొలగించండి
  21. శాప భయమును, బహుకృత పాప భయము,
    భృత్యు భయమును, పొంచిన మృత్యు భయము,
    సమర భయమును, సన్నిధి శత్రు భయము,
    రోగ భయమును, బ్రతుకున రాగ భయము,
    కలలు, వెతలును, గాఢాంధ కారభయమె
    చీకటిని మించు! వెలుఁగున్నదా కనులకు,
    గట్టి సంకల్ప దీక్షఁ జేబట్టినంత,
    మెల్లగా జారు భయమది, తెల్లవారు..

    రిప్లయితొలగించండి
  22. సర్వసాక్షి రచించిన సృష్టియందు
    పుడమిపైజనించిన మానవుని యజ్ఞాన
    చీకటిని మించు వెలుగున్నదా కనులకు,
    పెద్దలనుజేరి నేర్చిన విద్దెగాక

    రిప్లయితొలగించండి
  23. చీకటిని మించువెలుగున్నదా కనులకు
    నున్నదనుటయే పొసగును నెన్నగాను
    గనులు మూసుకు ధ్యానమ్ము నొనరజేయ
    లీల గన్పించు బరమాత్మ వెలుగుతోడ

    రిప్లయితొలగించండి
  24. యోగ ధ్యానము నందు నియుక్తమైన
    మానసమ్మున నెలకొను మౌనమందు
    లోకముల దాటి జూడ నలోకమైన
    చీకటిని మించు వెలుఁగున్నదా కనులకు

    రిప్లయితొలగించండి
  25. కూకటి వ్రేళ్ళతోదునిమి కోరికలన్నిటినొక్కమారుగా
    నేకముజేసినుల్లమును నీశునినామమెసంస్మరించుచో
    జీకటికంటెమేలయిన చెన్నలరారెడుకాంతియున్నదే
    చీకటిలోన మేలయిన చిచ్చఱకంటిని జూడగానగున్

    రిప్లయితొలగించండి
  26. రిప్లయిలు
    1. జనుల కనుగుణ మగు నట్టి సరణి మార్చ
      మోదము నిడు విద్యుద్దీపమును బుడమిని,
      దూఱ నేల తచ్ఛక్తినిఁ బాఱఁదోలఁ
      జీకటిని, మించు వెలుఁగున్నదా కనులకు


      లోకము లందు జీవులకు రూఢిగ నింద్రియ గోచరంపు టే
      కైక సురాగ్ర గణ్యుఁడు మహాత్ముఁడు నిత్యుఁడు లోకసాక్షియే
      కాఁకవెలుంగు భాస్కరుని కన్న, జగమ్ముల నెల్లఁ గప్పెఁ బెం
      జీకటి కంటె, మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే
      [కంటె = చూచితివా]

      తొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఆకలి బాధ తీర్చుటకు హైరన నొందుచు వృత్తి రీతినిన్
    పోకిరి మూకలన్ కలిసి పోకరు సుత్తిని చేతబూనుచున్
    కూకటపల్లి బ్యాంకునకు కొట్టుచు కన్నము దూరుటందునన్
    చీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే

    రిప్లయితొలగించండి
  28. కృష్ణ బిలమున ఏ కాంతి కణము కూడ
    బయలు పడదని శోధించి పలుకు శాస్త్ర
    వేత్త హాకింగు ఘనునకు ఎంచి జూడ
    జీకటిని మించు వెలుగున్నదా కనులకు

    బ్లాక్ హోల్ లేదా కృష్ణ బిలం అనే అంశం మీద పరిశోధనలు చేసి, వాటి నుంచి కాంతి కణం కూడా బయటకు రాలేదని తెలిపిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కు చీకటిని మించిన వెలుగు లేదు ఎందుకంటే ఆయన జీవితం అంతా చీకటి మీదనే పరిశోధన చేశారు.

    రిప్లయితొలగించండి
  29. వారకాంతల మరిగెను భర్త మరియు
    నారడిని పెట్టు గయ్యాళి యత్త తోడ
    కాన రాకుండె, బ్రతుకున గాంచ కారు
    చీకటిని మించు, వెలుగన్నదా కనులకు.

    రిప్లయితొలగించండి
  30. కూకటి వేళ్ళతో నరుక గుంపగు శత్రువులారిటిన్ దగన్
    దేకువతోడుతన్ జరుప దీవ్రపు ధ్యానసమాధులన్సదా
    శోకములేనిదౌ దనదు శుద్ధపు నాత్మను జేరగానిలన్
    జీకటికంటె మేలయిన చెన్నలరారెడు కాంతియున్నదే?

    రిప్లయితొలగించండి
  31. ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
    సమస్యాపూరణ కార్యక్రమంలో...
    30/03/2019శనివారం ప్రసారంమైన నా పూరణ

    సమస్య...

    జారుని సత్కృపన్ సుకవిజాలము వర్ధిల్ల వాంఛ జేసెదెన్

    నా పూరణ : ఉ.మా.

    **** ****

    తూరుపు దిక్కునన్ బొడిచి ద్యోతము నీయుచు మిక్కుటమ్ముగన్

    ధారణి యంతయున్ ప్రబలు ధ్వాంతము నాశమొనర్చుచున్ సదా

    భూరిగ జీవరాశులను బోడిమి రక్షణ జేయుచున్న కం

    జారుని సత్కృపన్ సుకవిజాలము వర్ధిల్ల వాంఛ జేసెదెన్


    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  32. వేకువ తొలగించగలదు విశ్వమందు
    చీకటిని.. మించు వెలుగు న్నదా కనులకు
    నేరుగ గన లేకున్నను నింపును కాంతి
    నెల్ల వేళల యందునా యినుడు గనుడు

    రిప్లయితొలగించండి
  33. మేకొని పుట్టుగ్రుడ్డియు సమీహితవస్తువుఁ జూడ నెంచినన్
    లోకవికాసలోకనవిలోచనయుగ్మమదొక్కటేలనో?
    చీకటి కంటె మేలయిన చెన్నెసలారెడు కాంతి యున్న దే
    కీకృతచిత్తనేత్రగతబంధురశక్తుల నొక్కటొప్పినన్.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురం,హైదరాబాద్.

    రిప్లయితొలగించండి
  34. భీకర భీమరమ్ముఁ గరివేల్పు మురద్విషు సత్యతోడుగా
    నా కుటిలాత్ముడైన నరకాసురు నంతము జేసినందుకై
    కాకరలెన్నొ లోకులిల గాల్చెడు దివ్వెల నాటి యామినీ
    చీకటి కంతె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే.

    రిప్లయితొలగించండి
  35. కనుల వెలుగులు నింపెడు కలలపంట
    ప్రేమగొనుచును నావెంట ప్రేమమీర
    యెన్ని కష్టములెదురైననేమి భయము
    చీకటిని మించు వెలుఁగున్నదా కనులకు!!

    రిప్లయితొలగించండి

  36. ఆకలి దప్పులన్ మరచి యల్క గృహంబును చేరి సత్యయున్
    కాకయు హెచ్చుచుండనట కాలును గాలిన పిల్లి మాదిరిన్
    కాకువు తోడ మాటలను కంఠము నుండి వెలార్చ పల్కె తా
    చీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే

    రిప్లయితొలగించండి
  37. తేటగీతి
    బంధముల మధ్య జిక్కఁగ పార్థుడైన
    చీకటిని మించు వెలుఁగున్న, దా కనులకు
    మాయ కనిపించ జేసెనె? మాధవుండు
    విశ్వరూపమ్మునన్ గీత వినఁగఁ జూపె

    రిప్లయితొలగించండి