కవిమిత్రులారా,
నేడు విశాఖపట్టణంలో
నా 'శంకర శతకము' ఆవిష్కరణోత్సవానికి
అవకాశ మున్నవారు తప్పక రావలసిందిగా ఆహ్వానిస్తూ...
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పుస్తకావిష్కరణ సభఁ బోఁ దగ దఁట"
(లేదా...)
"గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్"
పుస్తకము కవి జీవితపుటనుభవము
రిప్లయితొలగించండిపుస్తకము మంచిమిత్రుడు పుస్తకంబు
లేనిగదియాత్మలేనిశరీరమేల
*"పుస్తకావిష్కరణ సభఁ బోఁ దగ దఁట"*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచిరుసవరణతో 🙏
తొలగించండిశ్రీ కంది శంకరయ్య గారికి 🙏🙏
చిత్తము పరుగుపెడుతోంది..
వృత్తి బంధించింది...
గ్రంథావిష్కరణకు రాలేకపోవుచున్నందుకు మన్నింపుమని కోరుచూ...
కార్యక్రమం విజయవంతం కావాలని అభిలషిస్తూ..... 💐💐👏👏🙏🙏
బంధమ్మైనది వృత్తి , చిత్తము గనన్ బాధామయమ్మయ్యె , స
ద్గంధమ్ముల్ విరజిమ్ము శంకరకృతిన్ గాంచంగలేనెట్టులో !
అంధీభూతమునయ్యె మార్గము , మహేశా ! నేడు *మత్పాదమీ*
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ *రాదు* ముమ్మాటికిన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
హృద్యమైన పూరణ అవధానిగారూ,నమస్సులు!
తొలగించండిథా ప్రాసతోనే యలరారు మీ పూరణము వీక్షించ నాకాంక్షించుచున్నాను మురళీ కృష్ణ గారు.
తొలగించండిమాన్యులు కవిపండితులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు.🙏🙏. నాపై అనురాగముతో పద్యమును సమీక్షించి , థా ప్రాస పద్యమును కోరినందుకు సంతసించి...
తొలగించండిపాంథుండన్ నిజవృత్తిమార్గమున,నన్ బంధించి, ఈ కార్యమన్
మంథానమ్ము మథించె మానసము ధర్మమ్మంచు , పో నెట్లనన్
సంథన్ చెప్పుచునుంటి,కాని యడియాసయ్యెన్ , మదీయాంఘ్రి యీ...
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అద్భుతము మైలవరపు వారు
తొలగించండిఅత్యద్భుతము!!
తొలగించండిమురళీ కృష్ణ గారు ధన్యవాదములండి నా కోరికను మన్నించి యద్భుతమైన పూరణము నందించినందులకు.
తొలగించండిశ్రీ పెసపాటి కృష్ణ సూర్య కుమార్ గారికి ..
తొలగించండిశ్రీమతి సీతాదేవి గారికి..
శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు 🙏
నమస్సులండి. చిన్న సందేహము.
తొలగించండిఅహిర్బుధ్న్యుఁడు వ్యుత్పత్యర్థము తెలియఁ జేయఁగోరెదను.
ఇందలి బుధ్న (బుధ్న్య ) శబ్దములు బుధ్ ధాతు సంబంధితములు కావని చూచాను. అవి వేళ్ళు (వేళ్ళ తోఁగూడిన) అర్థములని చదివాను.
వివరించఁ గోరెదను వీలైన .
"
రిప్లయితొలగించండిగ్రంథమ్మౌను గవీశ్వరాళికి మహాగర్వంబుగావాకొనన్
గ్రంథమ్మౌను గవీశునాత్మజాభవము తద్గ్రంథంపుటావిష్క్రియన్
గ్రంథార్తీమనసూరటన్ గనును సత్కావ్యుండ్రు నేహేతువై
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్?
కంది శంకరు ని శతక కావ్య మన గ
రిప్లయితొలగించండిభక్తి సుధలను జిమ్మె డు పద్య రచన
పుస్త కావిష్క రణ సభ బో దగదట
నను ట పాడి యు కాదని యంద్రు బుధులు
(కొన్ని సభలను దృష్టిలో నుంచుకొని )
రిప్లయితొలగించండిసమయమునకు నేగ నచటకు జనులు రారు ;
చెవిన బెట్టరు పలుకుల సెల్లు దప్ప ;
ఆఫు జేసిన మైకును నాప రెవరు ;
పుస్తకావిష్కరణసభ బో దగదట .
ప్రాతఃకాల కిట్టింపు:
రిప్లయితొలగించండిబంధుల్ పిల్చిరటంచు వేడుకని భల్ భావించి రంగస్థలిన్
గంధమ్మున్ తిలకంబు దాల్చి ముఖమున్ గంభీర తేజమ్ముతో
సంధుల్ వ్యాకరణాదులందు బలుపౌ సాంగత్యమే లేనిచో
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్ :)
తేటగీతి
రిప్లయితొలగించండికందిశంకరయ్య కవిపుంగవులు-కావ్య
రచన జేసిరి కద దినత్రయము నందు
పుస్తకావిష్కరణ సభ బోదగదట
యనుట నవమాన మనియెంతు నార్యు లార.
ఆకుల శివరాజలింగం వనపర్తి
సంఘమునకు మేలొనరించు సరసమైన
రిప్లయితొలగించండికావ్యములు ,పదుగురు మెచ్చు కవితలు బుధ
వరులు వ్రాసిన పోదగు వాటి కొరకు
ముదము బడయుచు ,విద్రోహము కలిగించు
పుస్తకావిష్కరణ సభఁ బోఁ దగ దఁట"
గురువు గారికి పుస్తకావిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు 💐💐
రిప్లయితొలగించండిఆ సభన వోట్లు వేయగ నడగ రెవరు
ఆ సభన నోట్ల కెరవేయు టన్న దియును
గనము,మనసైన సభయట కదలు డంత
పుస్తకావిష్కరణ సభఁ,*బోఁ దగ దఁట
*పోవుటకు తగినదని
బంధమ్మన్నది విశ్వనాథు పరమై భవ్యంపు భావమ్ము స
తొలగించండిద్గ్రంథమ్మై శివరాత్రినన్ శతకమై ధ్యానమ్ము నేకాగ్రమై
సంధించెన్ గద శంకరుండు,నికపై జన్మమ్ము రాదింక,నా
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్"
చక్కగా జరుగు మన విశాఖలోన
రిప్లయితొలగించండిపుస్తకావిష్కరణ సభఁ, బోఁ దగ దఁట
దుష్టనేతలతో జను తొత్తు లెవరు
కవులకున్ విజ్ఞులకును స్వాగతము సుమ్ము
జ్ఞాన గంధమ్ము విరజిమ్ము సత్కవులను
గలువ గతజన్మ భాగ్యమే!తెలివి నిడదె
పుస్తకావిష్కరణ సభ;బో దగ దట
రాజకీయ సభ;చనగ రచ్చ రచ్చ!
మస్తకమునకు రుచియౌను మంచిదైన
రిప్లయితొలగించండిపుస్తకావిష్కరణ సభబో!దగదట
వాస్తవమ్మును దెలియక బధిరులగుచు
పుస్తకములను దెగడగ మూర్ఖజనులు!
నేడు వలదంటిని వినుమా నీరజాక్షి
రిప్లయితొలగించండికాశి యాత్రకు మరునాడు కదలవచ్చు
నెటుల పోయెద మీదిన మింతి వదలి
పుస్తకావిష్కరణ సభఁ, బోదగదట
పుస్తకావిష్కరణ శుభ ప్రదం కావాలని,పుస్తకం
రిప్లయితొలగించండిచిరకాలం నిలవాలని కోరుతూ, అభినందనలతో
🙏🙏🙏
శంకరార్యుల శతకంబు శరము లాగ
మణి ఫణి సహస్ర భాసిత మగుచు, కూడి
కోటినాల్కల ప్రజలంత గొలువ గాను
వెలుగు జిలుగుల జగతిని వెలయు గాక!
రసము రవ్వంత లేకయె రచన జేసి
రిప్లయితొలగించండిభావ దారిద్ర్య మేపార పాప ములను
హెచ్చు జేయుచు జనులను రెచ్చ గొట్టు
"పుస్తకావిష్కరణ సభఁ బోఁ దగ దఁట"
శంకరార్య విరచిత శ్రీశంకర శత
రిప్లయితొలగించండికమ్ము వేడుక తోడను గదల బోవ
పుస్తకావిష్కరణ సభ, బోదగదట
యాజ్ఞ వచ్చె నెన్నికల మీటనుచు నేడు!
# నేడు నిజముగానే meeting యున్నది.😢
గురువర్యులకు ...నమస్సులు...అభినందనలు
రిప్లయితొలగించండివిద్యలెల్లనేర్చినతిగ విర్రవీగి
రిప్లయితొలగించండిరాజకీయము లోన తా రాణ కెక్క
కులము కుంపట్లనెగదోయు కుకవి యొక్క
"పుస్తకావిష్కరణ సభఁ బోఁ దగ దఁట!
ననుచు జెప్పినమాట లనాచరించు!!
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్"
రిప్లయితొలగించండిఅందుకే రావటల్లేదు సర్
సరదాగా వ్రాసాను సర్
తొలగించండిక్షంతవ్యుడను
శతక మావిష్కరణమది స్వామి యచట
రిప్లయితొలగించండిదిగ్విజయముగాజరుగుత!దైవకృపను
నాశు భసమయ మందున నందుకొనుము
వందనంబులు నాయవి వందలాది
పుస్త కావిష్కరణసభబోదగదట
రిప్లయితొలగించండియెండలెక్కువ యచ్చట నుండలేవు
ననుచు వాసుకి చెప్పగావినుట వలన
మాను కొంటిని పయనము మదిని నెంచి
పుస్తకావిష్కరణ సభఁ బోఁ దగ దఁట
రిప్లయితొలగించండినా సమస్య నొసఁగి కవి నాథ నాథు
లక్కట విశాఖ కరుదెంచ మనఁగఁ దగునె
శంకర శతక వీక్షణ సంపద కయి
పాంథశ్రేణికి నేత్ర పర్వమగు నిర్వ్యాపార సంధానతన్
మంథాద్ర్యాభ కవీశ్వ రాళి కది సమ్మానంబ చింతించగన్
గ్రంథివ్రాత సమాహితార్థము లసంగ్రాహ్యమ్ములై యున్న నా
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
బంధమ్మేనని ఛందమంతయును భల్ బాధాకరమ్మంచుచున్
సంధుల్ గొందులు దాటలేని మడుగుల్ సాహిత్యమందంచుచున్
బంధుల్ గూడుచు చాయి బిస్కటులకై వైజాగు నగ్రమ్మునన్
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్
గంధమ్మౌ మది వీడి హర్షమున సత్గ్రంథమ్ము తావ్రాయ సం
రిప్లయితొలగించండిబంధమ్మున్ వరియించు పండితుడు, సద్భక్తిన్ జనన్ ధర్మమౌ
నంధత్వమ్మున వ్రాయ కైత రుచిరమ్మౌఛందమున్ వీడుచున్
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్
గంధము: గర్వము
బందూకుల్ ధరియించి స్వార్థపరులన్ పంతమ్ము తో జంపెడిన్
రిప్లయితొలగించండిపంథాయే ఘనమంచు విప్లవపు భావాలన్ ప్రబోధించెడిన్
గ్రంథాలెన్నియొ వ్రాసి వానిని జనాకర్షమ్ము కై చేసెడిన్
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్.
పంథామార్చుచు వేగమేవెడల సద్వాపారమౌ శంకరున్
రిప్లయితొలగించండిగ్రంథావిష్కరణోత్సవమ్మునకు,నేగన్ రాదు ముమ్మాటికిన్
మంథాద్రీసమమౌ సుపండితసభన్ మాత్సర్యమేపారగా
గ్రంధమ్మున్ రచియించలేక యకటా!గర్హించువాక్యమ్ములన్
రామలింగేశ్వరాలయ రచ్చయందు
రిప్లయితొలగించండినెన్నికలసభ నొకదాని నేర్పరచిరి
కానయీదినమందున కందివారి
పుస్తకావిష్కరణ సభ బోదగదట
గ్రంథావిష్కరణాధ్వరమ్మునకు నేగన్ దొల్గునజ్ఞానమున్
రిప్లయితొలగించండిపంథాభేదవిభేదతర్కసహితార్భాటాంతరార్థంబు త
ద్గ్రంథారంభనివేదవేదనమహత్త్వాకాంక్షవేద్యంబగున్
*"గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్రాదు ముమ్మాటికిన్"*
గ్రంథావిష్క్రియలక్ష్యలక్షణము లోకాలోకనంబెర్గకన్
రిప్లయితొలగించండిశంకర శతకావిష్కరణకు వెళుతూ వెళుతు కంది వారి ఆలోచన :)
పంథాగా భళి సాగుతున్న సభలో పద్యమ్ములన్ రాయుచున్
సంథాగా వెలుగొందు పండితుల ప్రాశస్త్యమ్ము దివ్యోజ్వలా
మాంథర్యమ్మును గాన కైపదమసామాన్యంబుగా వేయకన్
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్!
అని ఇట్లాంటి థ ప్రాస వేసి చక్కా బోయేరు కంది వారు :)
శుభాకాంక్షలతో
జిలేబి
😊👏👌
తొలగించండిLate Kate ?
సూపరు!లేటుగా వ్రాసినా మీరే లేటెస్ట్ యెప్పుడూ!గురువుగారు శలవుదీసుకున్నప్పుడల్లా మనకిది మామూలేగా!
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిపూని శంకర శతకమ్ము మౌనియౌచు
శంకర గురుదేవులుఁ గూర్చ జరుగు గొప్ప
పుస్తకావిష్కరణ సభఁ బోఁ దగ దఁట
బయట కసలు పాండిత్యంపు పటిమ వినఁగ
రిప్లయితొలగించండిపుస్తకావిష్కరణ సభఁ బోఁ! దగ దఁట
మస్తుగా సుత్తి పల్కులు మాలిని విన
వమ్మరో జిలేబి, మన ప్రవర్తన సరి
లేకపోయిన తప్పదు లెంపకాయ !
జిలేబి
శార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిపంథావీడని భక్తితత్పరతలన్ పాండిత్య మేపారగన్
సంధానించగ శంకరున్ శతక మాస్వాదించ భాగ్యమ్ము! త
ద్గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్
గ్రంథోద్దీపన జేయు పండితులపై గారమ్ము లేకుండగన్
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిముంధా జ్యోతి ష మెల్ల దబ్బరగు నీ మోమెల్లచిట్లించ వే
బంధంబుల్ యట తారుమారగును పై పై యట్టలే భావపుం
సంధానంబది మంట గల్చు నొకడై సాగన్ విమర్శన్;వృథా
గ్రంధా విష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిమస్తకము ద్రిప్పి మంచిని మరువలేని
విధముగా కైతలల్లియు వెతల దెలుప
పిలిచి పిలిచిన రానట్టి ప్రీతి వెలయు
పుస్తకావిష్క"రణ"సభ బో దగదట
చనగ వలె మన మెల్లరు జవము గాను
రిప్లయితొలగించండిచక్కగా రచియించిన శంకరార్యు
పుస్తకావిష్కరణసభ ,బోదగదట
పనికిమాలిన చోట్లకు వ్యక్తులెపుడు
పుస్తకావిష్కరణ సభ బోదగదట
యనుట పాడి గాదు వినుడనవరతమ్ము
పుస్తకము మంచి మిత్రుడు పుడమి యందు
ననుట మరువ కూడదటండ్రు నార్యులెల్ల.