27, మార్చి 2019, బుధవారం

సమస్య - 2969 (సతియే కద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సతియే కద పూరుషునకు సద్గురువు గనన్"
(లేదా...)
"సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్"

44 కామెంట్‌లు:

  1. అతఁడు తెగిన గాలిపటము
    గతి యొకటని లేని యతని గమనంబులకున్
    మితినిడి గమ్యంబుఁ దెలుపు
    *"సతియే కద పూరుషునకు సద్గురువు గనన్"*

    రిప్లయితొలగించండి
  2. పతిదేవుని ప్రేమ సౌధము
    మితిమీరిన మమత పెంచి మెప్పును పొంద
    న్నతివకు ప్రాణ ప్రదమట
    సతియే కద పూరుషునకు సద్గురువు గనన్

    రిప్లయితొలగించండి
  3. ప్రాతఃకాల కిట్టింపు:

    అతిగా మాటలు పాటలన్ వినుచు తానానంద మొందంగ భల్
    సతమున్ టీవిల ఛానలందు నయయో చాదస్తమౌ రీతినిన్
    గతి లేకుండగ నాధుడే జరుపగా గార్హస్థ్య కర్మంబులన్;...
    సతి యే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్?

    రిప్లయితొలగించండి
  4. ( వీరనారి మాంచాల )
    సతతము తనజత కోరెడి
    పతి "బాలుని"ఘనసమరపు బాటకు వడిగా
    నతిని ననుపు మాంచాలా
    సతియే కద పూరుషునకు సద్గురువు గనన్ .

    రిప్లయితొలగించండి
  5. కం॥
    పతి మనసును సవరించుచు

    గతి తప్పినచోటను మమ కారము తోడన్

    సతతము సరిదిద్దును గద

    "సతియే కద పూరుషునకు సద్గురువు గనన్"

    రిప్లయితొలగించండి
  6. ప్రతి కార్యంబును ధరణిని
    సతితో చర్చించక కొనసాగించని యే
    పతి యైనను జెప్పు నిజము
    *సతియే గద పూరుషునకు సద్గురువు గనన్*

    రిప్లయితొలగించండి


  7. తన మగడేడుండాడో ఆవిడకు కాక ఇంకెవరికి పత్తా :)
    సద్గురువు కూడా శిష్యపరమాణువుల నట్లే విడువడట !



    అతలవితలపాతాళము
    న తాను దాగినను పట్టి నచ్చెనటంచున్
    పతిగా చేసుకొనంగన్
    సతియే, కద పూరుషునకు సద్గురువు గనన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    వెతలను తోడును వీడక
    గతి దప్పిన భర్త నడత గని సవరించన్
    మతి హీనుని జతగొను కుల
    సతియే కద పూరుషునకు సద్గురువు గనన్

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా సత్యనారాయణ
    పతియే రాజని మంత్రియౌ కరణపున్ వ్రాతంబు జేకొంచు వే
    జతనంబౌ గృహ వైద్యముల్ నెరపు దా సామాన్యమౌ వంటలన్
    వెతలన్ శ్వాస ప్రవృత్తినిన్ మెలగు;యే వేదంబులన్ జూచెనో
    సతియే భర్తకు నొజ్జయౌ బరమ సంస్కారమ్ము నేర్పింపగన్
    (పెద్దలు, బాటదప్పిన వివాహితునితో నీసడింపుగా పలికే వాక్యము"పెండ్లామే పెద్ద గురువు" దీనిని సమస్యాపాదముగా రచించిన గురువు గారికి అభివందనములు!)

    రిప్లయితొలగించండి
  10. వెతలం దైనను వెన్నుతట్టి శుభముల్ పల్కంగ ధైర్యం బిడన్
    మతిలే కున్నను మౌనమే తగిన నాహార్యం బుగావిం చినన్
    పతియే దైవమ టంచు భక్తిగస దాప్రాణం బుగా సేవలన్
    సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్

    రిప్లయితొలగించండి
  11. సతితోవిష్ణువుకామితార్థదుడునైసర్వంసహాభారకుం
    డతులాధారకుడయ్యె,సాంబశివుడండాండాదికిన్ జేతమై
    వ్రతసౌభాగ్యపుభాగ్యమిచ్చెసతిపార్వత్యంశసాధ్వీమణుల్
    *"సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్"*

    రిప్లయితొలగించండి
  12. సతిభర్తాఘముదొల్గజేయునట సత్సంతానభాగ్యంబుతో
    పతివంశంబునునిల్పుచున్నదట పాపాల్పాయువౌయాహికిన్
    సతియేగృధ్రమునయ్యునీడ్చు నట విశ్వంబందుభర్తృవ్రతా
    *"సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్"*

    రిప్లయితొలగించండి
  13. పతియేదైవమటంచుసాధ్వితులకున్ భార్యామణుల్ సేవలన్
    నతులన్ జేసి పతివ్రతల్ జగతిలోప్రఖ్యాతినింబొందగా
    సతిసావిత్ర్యనసూయసీతలని శశ్వత్కీర్తినందించెడా
    *"సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్"*

    రిప్లయితొలగించండి
  14. సతియైసత్యరణంబునందుహరికిన్ శస్త్రాస్త్రమందించెలే
    సతియైజానకిరామచంద్రునకు శశ్వచ్ఛాంతిజేకూర్చెలే
    సతియైవాణివిధాతవ్రాతకును సౌజన్యంబిడన్ ధన్యయౌ
    *"సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్"*

    రిప్లయితొలగించండి


  15. నారాయణ :)


    మతిబోవంగ వినమ్రతన్ మరచుచున్ మర్యాదగా యుండకన్
    సతతమ్మాతడు మాట మీరి సయి దుష్కార్యంబులన్ చేయగా
    నతిగా జీవితమందు తోక నతడే నాడించగా కోయుచున్
    సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    కాదన్నారో !.... అంతే..

    జతగా జేరును , మాన్చు దుర్వ్యసనముల్ , సంసారమున్ దిద్దు , బా...
    ధ్యతలన్ గుర్తెరిగించు , నీతి గఱపున్ వ్యక్తిత్వపూర్ణుండుగా ,
    నితరాలోచనలేల ? సత్యమిదియే ! యే యింటనైనన్ గనన్
    సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  17. కందం
    పతికిన్ సత్కర్మలతో
    వెతలం వీడంగఁ జేయు వేల్పుగ నలరన్
    మతిమంతుండై చెలఁగగ
    సతియే కద పూరుషునకు సద్గురువు గనన్

    రిప్లయితొలగించండి
  18. వెతలను దూరము జేసెడు
    గతుల ను జూపిoచి పతిని గాచు చు సతమున్
    స్తుత మతి యై మసలెడి తత్
    సతి యే కద పూరు షునకు సద్గురు వు గనన్

    రిప్లయితొలగించండి
  19. అతడే పెండ్లికి పూర్వము
    శతమర్కట తుల్యుడు గద, చతురత తోడన్
    పతినే గృహస్థు జేసిన
    సతియే గదపూరుషునకు సద్గురువు గనన్.

    రిప్లయితొలగించండి
  20. అతి వ్యామోహమ్మున దన
    సతిగూడగ నదిదరించ శవసాయమ్మున్
    గతితప్పినవేళ తులసి
    సతియేగద పూరుషునకు సద్గురువు గనన్

    రిప్లయితొలగించండి
  21. కృతి నొక్కటి జగమంతయు
    స్తుతి నొందగ వ్రాసిన కవి శుభలగ్నమునన్
    కృతిపతికి నొసగ నాకృతి
    సతియే కద పూరుషునకు సద్గురువు గనన్

    రిప్లయితొలగించండి
  22. సతిపతి సమమని పలుకక
    అతి మాటాడక మరంతె గానంతేగా
    పతియనుటుత్తమ మార్గము
    సతియే కద పూరుషునకు సద్గురువు గనన్

    రిప్లయితొలగించండి
  23. 🙏🏼జైశ్రీరామ్🙏🏼
    ఆర్యులకు శుభోదయము💐

    శంకరాభరణంలో నేడు పూరించవలసినదిగా ఇచ్చిన సమస్య.

    సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్ !

    నా ప్రయత్నము.

    సతి సర్వోత్తమసద్గురూత్తమ యనన్ సత్యంబె యోచింపఁగా.
    సతి ధర్మాచరణైకవేద్య. పతికిన్ సన్మార్గ దిక్సూచి. స
    ద్గతికిన్ మూలము. సత్యవర్తనపరోదారాంమృతాబ్ధ్యైన సత్
    సతియే భర్తకునొజ్జయౌఁ బరమ సంస్కారంబు నేర్పింపఁగన్.

    సదసద్వివేక పూర్ణులైన మీకు నా ప్రణామములు.
    జై శ్రీమన్నారాయణ🙏🏼
    చింతా రామకృష్ణారావు.

    రిప్లయితొలగించండి
  24. మహాభ్యో గురుభ్యోన్నమః 🙏🙏🙏
    అపాండవము గావించిన అశ్వత్థామను బట్టి దెచ్చిన అర్జునునితో ద్రౌపది, "వీడిని జంపినచో కృపి కూడా పుత్రశోకంతో బాధ పడుననియూ, బ్రాహ్మణుని జంపుట పాపమనియూ" వారించినది. ఆ మాటలు లోక పూజ్యములే గదా!

    అతి కోపమున విజయుc దు
    ర్మతి కృపి నందనుని బట్టి రాగను ద్రౌపది
    పతితో ద్విజుc విడిపింపగ
    సతియే కద పూరుషునకు సద్గురువు గనన్

    రిప్లయితొలగించండి
  25. ప్రతినిత్యము కలిమియనిన
    సతియే కద పూరుషునకు; సద్గురువు గనన్
    గతి తప్పిన బ్రదుకందున
    సుతి మెత్తని సుద్దులనిడి చుక్కాని యగున్
    **)()(**
    చుక్కాని = The steering wheel of a boat.

    రిప్లయితొలగించండి
  26. హితమును పలుకుచు నిరతమ
    హితము చేయని విధముగ చేయుచు బోధల్
    పతి సుఖమును కోరెడి కుల
    సతియే గద పూరుషులకు సద్గురువు గనన్.

    గతి తప్పి చరించె డి పతి
    కతి చక్కగ హితము దెలుపు చనవరతంబున్
    మతితో మార్చుకొనిన నిజసతియే
    సతియేగదా పూరుషులకు సద్గురువు గనన్.

    రిప్లయితొలగించండి
  27. సతతము పతినేగొలిచెడు
    సతియే కద పూరుషునకు సద్గురువు గనన్
    పతిగా ప్రేమను బంచిన
    సతిజేసెడు పూజలెల్ల సఫలత జెందున్..

    రిప్లయితొలగించండి
  28. సతియన శక్త్యవతారము
    సతియే నడిపించుజగతిసక్రమరీతిన్
    సతియే సృష్టికి మూలము
    సతియేకద పూరుషునకుసద్గురువుగనన్



    రిప్లయితొలగించండి
  29. పతిని కడు గౌరవించుచు
    సతతము పరిచర్య తోడ సంతసమిడుచున్
    రతియై మదనుని కేళిన్
    సతియే కద పూరుషునకు సద్గురువు గనన్

    రిప్లయితొలగించండి
  30. అతులిత రాగ మ్మడర ను
    చిత రీతి నెదిగి తనరిన శీల పురుషుఁ డా
    సుతునకు నేర్పిన మాతయు
    సతియే కద పూరుషునకు సద్గురువు గనన్


    సతు లెంచంగ జగత్రయమ్మున మహా చారిత్ర సంభావ్యలై
    తత విజ్ఞాన విహీనులే చెపుమ యింద్రాణీ వరాఖ్యా సతీ
    పతి నిత్యార్చ్యనిజాత్మభర్త వసుధాభర్త త్రయం బందునన్
    సతి యే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్

    రిప్లయితొలగించండి
  31. అతివలు మిక్కిలి సామ
    ర్ధ్యత కలిగిన వారయి స్థిర మనసుగల యు
    న్నత మంత్రాంగమ్ము నెరపు
    సతియే కద పూరుషునకు సద్గురువు గనన్

    సమర్ధత కలిగి స్థిర మనసుతో తగిన సలహాలు ఇవ్వగల భార్య కూడా భర్తకు గురువు లాంటిది.

    రిప్లయితొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మతిలే నట్టి యొకండినిన్ కలియగా మంత్రమ్ము తంత్రమ్ముతో
    గతిలేకుండగ మొట్టుచున్ సతము తా గార్హస్థ్య కర్మంబులన్
    స్తుతమౌ రీతిని వంట వార్పులను తా శోషించి బోధించగా
    సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్

    రిప్లయితొలగించండి
  33. సతియేమూలము సృష్టికిన్నరయ యస్మద్వంశ మింపొందగన్
    సతియేయాద్యముదేశగౌరవము నాశాద్యంతమేపారగన్
    సతియేయన్నియుయైధరన్దనరిసంసారంబుదాజూచుతన్
    సతియేభర్తకునొజ్జయౌ బరమసంస్కారంబునేర్పింపగన్

    రిప్లయితొలగించండి
  34. మతిమాంద్యమ్మున బాలుడట్లుగ మనోమౌఢ్యమ్మునన్ మూర్ఖుడై
    గతులందప్పుచు నీచదుష్టజనసాంగత్యాప్తదుష్కృత్యసం
    వృతుడై మత్తిలి సంచరించు నెడ సంవిత్పూర్ణవిశ్వాసత
    త్సతియే భర్తకు నొజ్జయౌ పరమసంస్కారమ్ము బోధించగన్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  35. మతియై సంసృతి కార్యముల్ సలిపి సమ్మానమ్ముతో నిక్కలో
    రతియై నిత్యము మారుకేళిని కడున్ రంజిల్లగా జేయుచున్
    పతిసాంగత్యముతోనపత్యమును సంపాదించుచున్ ప్రేమతో
    సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్

    రిప్లయితొలగించండి
  36. ఋతువుల కనుకూల మయిన
    క్రతువుల సరియగు
    విధముల గావించుటలో
    సతతము సలహాలిడు కుల
    సతియేకద పూరుషునకు సద్గురువు గనన్

    రిప్లయితొలగించండి
  37. కాళిదాసును పెళ్లి చేసుకొన్న రాజకుమార్తె తాను మోసపోయానని తెలుసుకుని:

    గతి యిట్లైనది మోసపోతిని కదా కర్మంబు చెం చీత డే
    గతి విద్య న్బడయంగ నౌ నకట యాకాళి న్మది న్నమ్మితి న్నితనిం బంపెద నమ్మయొద్దకు రయంబే శంకరార్థాంగియౌ
    సతియే భర్తకు నొజ్జయౌఁ బరమసంస్కారమ్ము నేర్పింపఁగన్.

    రిప్లయితొలగించండి
  38. : మరొక పూరణ
    డా. బల్లూరి ఉమాదేవి
    హితము దెలుపు సాహిత్యం
    బతి చక్కగ వ్రాయు నేర్పు నవ లీలగ స
    న్మతితో నొసంగు నా విధి
    సతియే గద పూరుషులకు సద్గురువు గనన్

    రిప్లయితొలగించండి
  39. సతతమ్మాతడు జూదమాడు, పలు దుష్కార్యమ్ములే సల్పుచున్
    నతిగా మద్యము గ్రోలువానికిల కళ్యాణమ్మునే జేయగా
    పతియే దైవముగా దలంచి పద సేవన్ జేయుచున్ మార్చినన్
    సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపగన్

    రిప్లయితొలగించండి
  40. ప్రతిజీ వినిగురు వనుచును
    యితిహాసమ్ములు బలుకగ యిలలో నేడున్
    మతితో పనులొనరించెడి
    సతియే కద పూరుషునకు సద్గురువు గనన్

    రిప్లయితొలగించండి