23, మార్చి 2019, శనివారం

సమస్య - 2965 (హరుఁడు గౌరితో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హరుఁడు గౌరితో వెలసె సింహాచలమున"
(లేదా...)
"శివుఁ డంబాసహితుండు కోరి వెలసెన్ సింహాచలస్వామిగన్"

48 కామెంట్‌లు:

  1. సరసనగల తరుణి కోర చిరునగవున
    చెప్పె ధరణిఁ గలపలు విశేషములను
    హరుడు గౌరితో, వెలసె సింహాచలమున
    హరియె నరసింహ రూపము నందుననుచు

    రిప్లయితొలగించండి
  2. డా.పిట్టా సత్యనారాయణ
    నవ బృందంబులెలక్షనున్ గదియగా నౌరా!భలే వల్సలన్
    ఛవి మాలెన్నిటగొర్రె దాటుల మనన్ సాధారణంబయ్యె నీ
    రవముల్ యాకసమందు నిండ గనెనో రాద్ధాంతమే లీలగా
    శివుడంబా సహితుండు కోరి వెలసెన్ సింహాచల స్వామిగన్

    రిప్లయితొలగించండి
  3. ప్రాతఃకాల కిట్టింపు:

    కవిరో! కాశిని గంగనున్ తటమునన్ కైవల్యధామంబునన్
    శివుఁ డంబాసహితుండు కోరి వెలసెన్;..సింహాచలస్వామిగన్
    భవ బంధమ్ములు త్రెంపగన్ వెలసెగా వైశాఖపట్నమ్మునన్
    కవితన్ గూర్చిన కంది శంకరులదౌ కావ్యమ్ము వీక్షించగన్ :)

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    సువిశాలంబగు భక్తితత్త్వమున సంస్తుత్యార్హమైనట్టి హైం...
    దవమే శాశ్వతమందు భిన్నగతులన్ దైవమ్ము తానొక్కడే !
    శివుడే శ్రీహరి , విష్ణువే శివుడు , రక్షింపంగ శిక్షింపగా !
    శివుఁ డంబాసహితుండు కోరి వెలసెన్ సింహాచలస్వామిగన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిరు సవరణ 🙏

      సువిశాలంబగు భక్తిమార్గమున సంస్తుత్యంపు తత్త్వమ్ము హైం...
      దవమే శాశ్వత, మందు భిన్నగతులన్ దైవమ్ము తానొక్కడే !
      శివుడే శ్రీహరి , విష్ణువే శివుడగున్ శిక్షింప రక్షింప , నా
      శివుఁ డంబాసహితుండు కోరి వెలసెన్ సింహాచలస్వామిగన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. శివనామమ్ము జపించుచున్ నొసట భాసింపంగ భస్మమ్ము భ...
      క్త వరేణ్యుండొకరుండు కారడవినేగన్ , సామజమ్మొండు ఘీం...
      రవమున్ జేయ భయార్తుడయ్యె , నతనిన్ రక్షింప , గర్జించుచున్
      శివుడంబాసహితుండు కోరి వెలసెన్ సింహాచలస్వామియై !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    (ముస్లిం దంపతులిటీవల ఛండీ యాగములో హవిస్సునందించినారు--వార్త,22-3-2019 ఆంధ్ర జ్యోతి)
    ఛండికా యాగ పర్వము సాగ నొకట
    దండి ముస్లిము లార్తిని దరలి గలువ
    నందుకొన రారె హవిసు నానందముగను
    హరుడు గౌరితో వెలసె సింహాచలమున

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    (తేది 24-3-2019 రోజున శ్రీ కంది వారి "శంకర శతకము"ఆవిష్కరణ , విశాఖపట్టణములో)
    పుస్తకము ముట్ట రెవరు పో పూని చదువ
    నన్న శంకర కవి కృతి నరయ నేమొ
    దండి యావిష్కరణ జూడ దరలి వచ్చె
    హరుడు గౌరితో వెలసె సింహాచలమున!

    రిప్లయితొలగించండి

  7. కొలుచు దైవాలు వేరైన కోవలేశు

    డొక్కడె!శివుడే శ్రీహరి!నిక్క మిదియె!

    వాసి నరసింహ లక్షి రూపముల గొనుచు

    హరుడు గౌరితో వెలసె సింహాచలమున


    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  8. భువిపై భక్తుల రక్ష చూచుటకునై పూతాత్మయౌ కాశి‌లో
    శివుఁ డంబాసహితుండు కోరి వెలసెన్; సింహాచలస్వామిగన్
    భవముల్ బాప రమేశ్వరుండు వెలసెన్;భాగ్యంబులన్ పంచగా
    కవిరాట్ వర్ణిత దేవదేవులట సాక్షిత్కారమున్ జూపెడున్

    రిప్లయితొలగించండి


  9. హరుడు గౌరితో వెలసె సింహా! చల, మున
    కన్ గొనెను తాను హరి పాద కమలమగుచు!
    నాల్క పైన పలుకుటెలనాగ నిల్చె
    పడతి చెంతలేని మగడు బతుక గలడె?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. ప్రజలఁ గాపాడు యిచ్చతో వసుధపైన
    హరుఁడు గౌరితో వెలసె, సింహాచలమున
    శ్రీహరి వెలసె కొండపై చెన్నుగాను
    జనుల రక్షించి కలిగించ సంతసమును

    రిప్లయితొలగించండి
  11. వెండి కొండపై నున్నట్టి వేల్పు పేరు,
    గంగ నిత్యం బెవరి తోడ కలహ మాడు,
    నార సింహు డేమాయెను నరుల కొరకు,
    హరుడు, గౌరితో, వెలసె సింహా చలమున,

    రిప్లయితొలగించండి
  12. పరమ పావన శ్రీశైల గిరుల లోన
    నడిగి నంతనె వరమిచ్చి యభయ మిచ్చు
    హరుఁడు గౌరితో వెలసె ; సింహాచలమున
    కొలువు దీరెను శ్రీహరి చెలువు మీర!

    రిప్లయితొలగించండి
  13. శ్రీగిరి వెలసె భక్తుల జేరి కావ
    హరుడు గౌరితో ; వెలసె సింహాచలమున
    విష్ణుడు వరాహ నరసింహ విశ్రుతుండు
    లక్ష్మి భూదేవు లిరుగడ లలరుచుండ .

    రిప్లయితొలగించండి
  14. జనుల గరుణించు కొరకు శ్రీశైలమందు
    హరుడు గౌరితో వెలసె; సింహాచలమున
    హరియె నరసింహుగ రమతో నధివసించె
    జనులు దరిసించు వారినాసక్తితోడ

    రిప్లయితొలగించండి
  15. వెండి కొండ పై భక్తుల కండ యగుచు
    హరుడు గౌరి తో వెల సె ; సింహా చలము న
    హరి యె దను జారి యై భక్త వరదుడగు చు
    కొంగు బంగార ము గ తాను కోర్కె దీర్ప

    రిప్లయితొలగించండి


  16. సవమై నిర్మలమై పురాణుడగుచున్ స్వాజన్యమై వెల్గుగా
    నవనిన్ శీతనగంబు పైన నమరెన్, నాట్యస్థలంబై సఖీ
    శివుఁ డంబాసహితుండు; కోరి వెలసెన్ సింహాచలస్వామిగన్
    ధవుడా విష్ణువు లక్ష్మి తోడుగ మహాధామంబుగా నిల్పుచున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. నరహరి మహిమ నిల జాటు నోము తోడ
    అచల పాలకుం డగుటకు నాబ తోడ
    హిమ గిరిని వీడి వచ్చి మహిమలు జూప
    హరుఁడు గౌరితో వెలసె సింహాచలమున

    రిప్లయితొలగించండి
  20. భక్తకోటిని గాపాడ భరణియందు
    హరుడు గౌరితోవెలసె,సింహాచలమున
    నారసింహుడప్ప న్నగా నరుల నెపుడు
    నోముజేయగ దయతోడ నుద్భవించె

    రిప్లయితొలగించండి
  21. భువనంబుల్ సృజియించువేళను స్వయంభూమూర్తియై నిల్వగా
    శివుడంబాసహితుండు; కోరివెలసెన్ సింహాచలస్వామిగన్
    స్తవనీయంబగు రూపమున్ గనగ బ్రస్తావించ బ్రహ్లాదుడే
    భవనాశంకరుడై నిలన్ హరియె సంభావించి లక్ష్మీసతిన్

    రిప్లయితొలగించండి
  22. రిప్లయిలు
    1. మున్న వెలయంగ విష్ణుండు సన్నుతముగ
      నద్రి నింపార లక్ష్మితో భద్రముగను
      క్షేత్ర మహిమమును ద్విగుణీకృతము సేయ
      హరుఁడు గౌరితో వెలసె సింహాచలమున


      అవనీ భారముఁ దీర్ప నర్భకుని దుఃఖాంభోధి నెండింపగన్
      భువి కేతెంచి రమాధినాథుఁడు దయం బూరించి దైత్యేంద్రు నా
      యువులం దీసి చెలంగి గోళ్ళ నరసింహుండంతఁ, గీర్తింపగన్
      శివుఁ డంబా సహితుండు, కోరి వెలసెన్ సింహాచలస్వామిగన్

      తొలగించండి
  23. ఆకసమునందు కైలాస మందు జతగ
    హరుఁడు గౌరితో వెలసె; సింహాచలమున
    తనదు నిజరూపమున హరి తరలి వచ్చి
    యేటి కొకనాడు వెలుగును దీటు గాను

    రిప్లయితొలగించండి
  24. తేటగీతి
    భూజనాళిని రక్షింప బూని కరుణ
    రజిత గిరివీడి శ్రీగిరీ రాజితముగ
    హరుడు గౌరితో వెలసె ;సిం
    హాచలమున
    వెలసె నిజభక్త వరదుడై చెలువుమీర.
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  25. తేటగీతి
    భూజనాళిని రక్షింప బూని కరుణ
    రజితగిరి వీడి శ్రీగిరి రాజితముగ
    హరుడుగౌరితో వెలసె.సింహాచలమున
    వెలసె హరి భక్త వరదుడైచెలువుమీర
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  26. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ దేవు
    మనువు వేడుక జూడగ మనసు పడిన
    గౌరి కోరిక దీర్చగ కదలి వచ్చి
    హరుడు గౌరితో వెలసె సింహాచలమున

    రిప్లయితొలగించండి
  27. అవగాహంబునుగాంచితేసుమతి! యాయచ్చోట వేంచేసెయీ
    శివుడంబాసహితుండు,కోరివెలసెన్సింహాచలస్వామిగన్
    నవనిన్గల్గినమానవాళినిక దాగాపాడనప్పన్నయే
    భవబంధంబుల ద్రెంపుమాయనుచునీభవ్యున్ సదాగొల్తురే

    రిప్లయితొలగించండి
  28. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కవిరో! వోట్లకు డింపులయ్య చనగా కైలాస శైలమ్మునన్
    వివరంబిమ్మని భాజపా జనులటన్ పీడించి వేధించగా
    దివికిన్ జూచుచు గడ్డమున్ నలుపుచున్ ధీశక్తి జూపెన్నిటుల్:
    "శివుఁ డంబాసహితుండు కోరి వెలసెన్ సింహాచలస్వామిగన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము లోని పద్యము.

      చంచల.
      లఘువు చివర నున్న వృత్తము:

      నీ కటాక్ష మోక్ష నైపుణీ భవమ్ము విశ్వ మెల్లఁ
      బ్రాకటంపుఁ గర్ణముల్ ప్రభాస దిక్కు లెల్ల నెంచ
      నా కవల్ వికూణికల్ తవాధర ద్వయమ్ము లోభ
      భీకర త్రపల్ ద్విజాలి ప్రేతరాజు రిక్క లెంచ

      తొలగించండి
    2. 🙏🙏🙏

      మీకు రాని విద్య భువిలో దివిలో లేదు కదా!

      తొలగించండి
    3. మీకు గుర్తున్నదా? ఒకసారి వృత్తముల పాదము లన్నియు గురువుల తోనే యెందుకు ముగుయు నని సందేహము వెలి పుచ్చితిరి.

      తొలగించండి
    4. చక్కగా గుర్తున్నది. ఈ విషయముపై శ్యామలీయం గారు ఏదో వ్యాఖ్య పెట్టినారు గదా! ప్రశ్నలు అడుగుటకు పాండిత్యం అనవసరం. సమాధానాలు చెప్పడం కొందరికే చెల్లును:

      "Any fool can ask questions no wise man can answer"

      తొలగించండి

    5. Per Contra

      Every one is a fool in some context and wiseman in another :)


      Cheers
      జిలేబి

      తొలగించండి
    6. జిలేబిగారికి నామద్దతు!
      ప్రశ్నలడగడానికి కూడ కొంత ఙ్ఞానము,ముఖ్యముగా జిఙ్ఞాస అవసరము.ఉపనిషత్తులన్నీ ప్రశ్నోత్తరాలేగదా!

      తొలగించండి
    7. మహాభారతము లోఁ గూడ యుధిష్ఠిరుని ప్రశ్నలు భీష్ముని యుత్తరముల ద్వారా నీతులు నాధ్యాత్మిక బోధలు వర్ణాశ్రమ ధర్మములు సత్య తపో జప దాన కర్మ విశేషములు తత్ఫలములు రాజ కార్య దండనాది నిరూపణములు మున్నగు పెక్కు విషయములు వివరింపఁ బడినవి కదా.

      తొలగించండి
  29. లక్ష్మినారసింహుల పెళ్లి లౌక్యముగను
    హరుడుగౌరితోవెలసె సంహాచలమున
    వాణి బ్రహ్మలు నతిధులై వాలిరంట!
    దేవళంబున గోడపై జీవకళగ!

    రిప్లయితొలగించండి
  30. భువిఁ శ్రీశైలము పుణ్యతీర్థమట సంపూజ్యుండుగా నిల్చెనే
    శివుడంబాసహితుండు, కోరి వెలసెన్ సింహాచల స్వామిగా
    నవనిన్ ధర్మము నిల్పనెంచి నరసింహమ్మౌచు నాకొండపై
    భవహారుండగు పద్మనాభుడె కదా భక్తాళి నేబ్రోవగన్.

    రిప్లయితొలగించండి
  31. రిప్లయిలు
    1. టైపాటు సవరణతో

      ధరణి శ్రీశైలమందున వరము లీయ
      హరుఁడు గౌరితో వెలసె, సింహాచలమున
      శేషశాయి లింగమయె నృసింహుడనఁగ
      బూది హరునకు చందన పూత హరికి

      తొలగించండి
  32. మత్తేభవిక్రీడితము

    అవనిన్ దక్షిణ కాశి శ్రీగిరిగ శ్రేయమ్ముల్ ప్రసాదించగన్
    శివుఁ డంబాసహితుండు కోరి వెలసెన్, సింహాచలస్వామిగన్ 
    స్తవనీయంపు నృసింహమై వెలసె దాశార్హుండు శ్రీదేవితో
    నివురున్ లింగడు దాల్చు చందనము మైనిండంగ పర్జన్యుడౌ!

    రిప్లయితొలగించండి
  33. అర్ధనారీశ్వరత్వము నవనిప్రజకు
    తెలియ జేయంగ తీరు బడిగ
    హరుడు గౌరితో వెలసె సింహాచలమున
    నవతరించెనరహరిగ హరియు తాను.

    వెండి కొండపై విహరించె వేడ్క తోడ
    హరుడు గౌరితో,వెలసె సింహాచలమున
    విష్ణుమూర్తి నరహరిగ వేగ తాను
    బాల ప్రహ్లాదు బ్రోవగ వసుధ యందు.

    రిప్లయితొలగించండి
  34. తేటగీతి

    భూజనాళిని రక్షింప బూని కరుణ
    రజితగిరి వీడి శ్రీగిరి రాజితముగ
    హరుడుగౌరితో వెలసె.సింహాచలమున
    వెలసె హరి భక్త వరదుడైచెలువుమీర

    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి