17, మార్చి 2019, ఆదివారం

సమస్య - 2960 (సుజన పరాభవంబున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్"
(లేదా...)
"సుజన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్"

86 కామెంట్‌లు:

 1. భజనలు జేసెడి వారలు
  సుజలమ్ము లపూజ జేయ శోభను గూర్చున్
  సుజనుడు నిరతము భక్తిని
  సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పద్యం బాగున్నది. కాని సుజన పరాభవానికి అన్వయం?

   తొలగించు
 2. స్వజనుల చేర్చి కూర్చుచును సందడి జేయుచు రచ్చబండనున్
  భజనలు చేసి నాయకుల బంధుల మిత్రుల గోత్రమెంచుచున్
  గుజగుజ రాజకీయమున గుంభన రీతిని శత్రుపక్షమున్
  సుజన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్ :)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రాజకీయాలలో ఇది సహజమే! 'శత్రుపక్షపున్ సుజన...' అంటే ఇంకా బాగుంటుందేమో?

   తొలగించు
 3. విజయము సాదించు కొఱకు
  స్వజను ల మిత్రుల తలపక స్వార్థ ము తోడ న్
  కుజ నులు పొంద గ సలుపె డు
  సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తు ల్

  రిప్లయితొలగించు
 4. సవరించిన పూరణ
  భజనలు జేసెడి వారలు
  సుజలమ్ము లపూజ జేయ శోభను గూర్చున్
  కుజనుని మోసపు బుద్ధిని
  సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్

  రిప్లయితొలగించు
 5. నిజనిర్ధారణ లెంచక
  ప్రజలను మోసంబుజేయు పరిపాలనకై
  విజయులుగాగా! మంచిగ
  సుజనపరాభవ మొసంగు!సుఖసంపత్తుల్

  రిప్లయితొలగించు
 6. మైలవరపు వారి పూరణ

  ద్రౌపది....

  నిజగురుపుత్రుడయ్యు ధరణీసురవంశమునన్ జనించియున్
  కుజనుల చెంతజేరి కఱకుందనమొప్ప వధించె పాండవా...
  త్మజులను చంటిబిడ్డలను దారుణమౌ ! కురుపక్షపాతియౌ
  సుజన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
 7. భజనయె సలుపుచు ఖలులకు
  నిజమును గ్రహియింప లేక నిత్యము మసలే
  కుజనులె తలచెద రిట్టుల
  "సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మసలే' అన్నది వ్యావహారికం.

   తొలగించు


 8. త్యజియించదగును కోరిక
  ల జిలేబి వరుసగ నీవు లాభంబులకై
  గజిబిజిగ కూడ గట్టిన,
  సుజన పరాభవ మొసంగు, సుఖ సంపత్తుల్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 9. ప్రజలు నమాయికులు దమను
  భజన నొనర్చె ప్రభువుల వాక్చందనమున్
  నిజమని యోటును వేయన్
  *"సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్"*


  ప్రజలకు మేలొనర్తుమని వారికి సేవలొనర్చె భాగ్యమున్
  భుజబలు వీవు యోటరువు ముంగిట నుండెద కుక్కపిల్ల నై
  గజిబిజిమాటలొల్కి నిజకర్కశ నీతి చరించు నేతకున్
  *"సుజన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్"*

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శంకర్ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. "భజన నొనర్చెడి ప్రభువుల..." అనండి.

   తొలగించు
 10. స్వజనుల కీర్తనలనడుమ
  నిజదోషమ్ముల మరచి నిందలువేయన్
  కుజనులకు బ్రీతిగూర్చగ
  సుజన పరాభవమొసంగు సుఖసంపత్తుల్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిజదోషమ్ములను మరచి...' అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించు
  2. ఆర్యా, నా ఫోనునుండి మెసేజి వెళ్ళడంలేదు.టాబ్ లో తిరిగి టైపుచేయడంతో దోషాలు దొర్లుచున్నవి.క్షమించ ప్రార్ధన!

   తొలగించు


 11. (శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేయు సందర్భం....)

  విజయుడ!ద్రోణ భీష్ములను వీక్షణ జేయుచు వేదనేలనో!

  సుజనులు వైరి పక్షమున శోభిలు ధర్మము వీడి జేరలే!

  నిజమిది! త్రుంచు వారలను! నేరము గాదయ!నమ్ము బావ!యీ

  సుజన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్

  🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
  🌷వనపర్తి🌷

  రిప్లయితొలగించు
 12. సుజన విధేయు గౌతముని శ్రోత్రియు శంకరకింకరున్ మునుల్
  నిజబలగంబుతో జనియు నీడనొసంగగ నన్నపానముల్
  స్వజనుల మంచువేడనిడె , సౌరి మిషన్ సుధ గోర దెచ్చియున్
  *"సుజన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్"*

  రిప్లయితొలగించు
 13. కుజనులు కుయుక్తి తోడను
  విజయము సాధింపనేమి విశ్వము నందున్
  నిజముగ తాత్కిళికమే
  సుజన పరాభవ మొసంగు సుఖసంపత్తుల్.

  రిప్లయితొలగించు
 14. (సుజనుడైన చాణక్యుని లేదా విష్ణుగుప్తుని అవమానించి నందులు నాశనమైనారు ;గౌరవించి
  చంద్రగుప్తుడు మగధసామ్రాజ్యానికి చక్రవర్తి అయినాడు .)
  యజనము సల్పి లోకపు హి
  తార్థము నుండెడి విష్ణుగుప్తునిన్
  గుజనులు నందు లందరును
  గ్రొవ్వున ద్రోసిరి ;చచ్చినారుగా
  సుజనపరాభవంబున ;య
  శోవిభవంబులు దక్కునెప్పుడున్
  విజయుడు చంద్రగుప్తునకు
  విప్రునిసేవను రాజ్యమట్లుగన్ .

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జంధ్యాల వారూ,
   విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 15. రాయబారిగా రానున్న కృష్ణుని అవమానించమని శకుని దుర్యోధనునితో అంటున్నాడు.....

  నిజ శుభ గుణ యోగమునన్
  భజనీయుఁడె కృష్ణుఁ డిపుడు పగవా డయ్యెన్
  స్వజనులు నీ తోడుండఁగ
  సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్.

  రిప్లయితొలగించు
 16. ప్రజలను పాలించుటకై
  విజరముగ భవన కదంబ పెంపును చేయన్
  కుజరముల నరక నెగదో
  సు జన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కదంబ పెంపు' దుష్టసమాసం.

   తొలగించు
  2. 'ఎగదోసు' అన్న ప్రయోగం వ్యావహారికం.

   తొలగించు
  3. నమస్కారములు
   సవరించ ప్రయత్నిస్తాను

   తొలగించు
 17. సుజన పరాభవ మనునది
  ప్రజలేరికి నుండబోదు పావన చరితా!
  యజరామరమగు నాత్మకు
  సుజనపరాభవ మొసంగుసుఖ సంపత్తుల్ ?

  రిప్లయితొలగించు
 18. స్వజనుల మేలును గోరుచు
  ప్రజలనుపీడించునేత పాలనజేయన్
  విజయము బొందునుదప్పక
  "సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్!!

  రిప్లయితొలగించు
 19. సవరణతో

  ప్రజలను పాలించుటకై
  విజరముగ భవన చయమును పెద్దగ జేయన్
  కుజరముల నరకమను దురు
  సు జన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్

  రిప్లయితొలగించు
 20. అజిర విలాసార్థము చి
  త్త జనిత దుష్కార్య రతము ధర్మం బగునే
  సుజితంబై ఘోరాంహ
  స్సు జన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్


  సుజన గుణోన్నతద్యుతి సుశోభిత మూర్తుల కెల్లఁ బేర్మి భా
  వజ వశ వర్తనాధమ వివాద విహారుల క్రూర చిత్తులుం
  గుజనుల సజ్జనార్దిత సుఘోర సుభీషణ దుష్ట వా గియా
  సు జన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 21. ఈ నాటి శంకరా భరణము సమస్య

  సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్

  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


  దక్షుని చేత నా దహనాంబకుడు పరాభవము నొంది తనదు భార్య దేహ
  మును ముక్కలుగ జేసి ఘనత నొప్పారెడు శక్తి పీఠములకు జన్మ కార
  కుండాయెనుగద, నో కోమలీ! వస్త్రాప హరణము నిడెనుగా మరువ లేని
  బాధ ,సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్ తరచి చూడ ,పాండు రాజ
  సుతులు శౌర్య హీను లనుచు శుష్క పలుకు
  లేల పలుకు చుంటివి చెల్లి? కాల నిర్ణ
  యమున కెదురీద సాధ్యమా యనుచు పలికె
  నంద సుతుడు నా ద్రౌపది నవత గాంచి

  రిప్లయితొలగించు
 22. పంచగుళికలు 3


  11)తే: వోటు కొరకు తిరుగు చుండు యింటి చుట్టు,
  కోటి ప్రశ్నల తోడ మీ కుశల మడుగు
  గెలిచిన పిదప మిమ్ములన్ తలచ బోడు
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

  12)తే: ఎన్నికలపుడు లెఖ్ఖ లేనన్ని మార్లు
  మురికి వాడలు మొత్తము తిరుగు చుండు
  ముగిసి నంతన్ మురికి వాడ వెగటు కలుగు
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

  13) తే: ఎన్నికల తరుణాన ఏ చిన్ని పాప
  కనుల ముందు కనబడినన్ కన్న బిడ్డ
  వోలె ముద్దాడు ,పిదప నా గాలి పడదు,
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

  14)తే: ఇరుకు గదులేల ,యిత్తుగా నిల్లు మీకు
  ననుచు పలుకు నమ్మకముగ నాస జూపి
  పిదప నివ్వబోడెప్పుడు పిసరు భూమి
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

  15) తే: ఆవులకు ననవరతము సేవ చేయు,
  గోవు లాంటి వ్యక్తి యనుచు కోరి గెలుపు
  నీయ, గోముఖ వ్య్ఘ్రాఘ్రమై నిన్ను చంపు
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

  రిప్లయితొలగించు
 23. నిజ దోషములను మరచుచు
  కుజనుల నెమకుచు తదుపరి కూర్మిని జతగా
  ధ్వజమెత్తగ తన భవితకు
  సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్

  నిన్నటి సమస్యకు నాపూరణ

  జ్ఞాన బిక్ష నిడెడు సద్గురు నెమకుచు
  సకల జీవుల నిల సాకు ననుచు
  భక్తి తత్పరతను పరమాత్మ జేర , సా
  ధనముఁ గోరువాఁడె ధన్యజీవి

  రిప్లయితొలగించు
 24. గిజగిజ లాడుచుండుచును గీడను భావననొందెనే సుమా
  సుజనపరాభవంబున ,యశోవిభవంబులు దక్కునెప్పుడున్
  స్వజనమనంగవారలు సభాస్ధలి మెప్పును నొందుచోదగన్
  సుజనమనంబులెప్పుడును శుధ్ధిగనుండును గీడుజేయవే

  రిప్లయితొలగించు
 25. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  "భుజముల నెత్తి సోదరిని మొత్తెద శత్రుని నెత్తిమీదనున్
  ద్విజుడను వారణాసికడ దీవన కోరుచు విశ్వనాథునిన్
  భజనలు జేసి రొప్పెదను:... భారత మాతకు సేవజేయుటన్
  సుజన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్"

  రిప్లయితొలగించు
 26. కుజనుడు స్వాభిమానమున గూర్చును చేటును సజ్జనాళికిన్
  ద్విజులను,గోవులంగనల,దీనుల,నార్తుల వంతబెట్టుటే
  నిజగుణమవ్వగా దనదు నీచపుజేష్టల నెంచుచుండిటుల్
  సుజన పరాభవంబున యశోవిభవంబులు దక్కునెప్పుడున్

  రిప్లయితొలగించు
 27. సుజనులు పెండ్లి చేసికొని సూనుల బొంది విముక్తి జెంద పూ
  ర్వజన ఋణమ్ము నుండి భవ బంధము లంచు విరక్తి భావ్యమే
  నిజమిది ముక్తి లభ్య మగు నీకు కుటుంబ నియుక్త కర్మలన్
  సుజనపరా! భవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్.

  రిప్లయితొలగించు
 28. విజయము నొందగ బరిలో
  నిజముగ బంధువులు హితులు నిలువరు మనమున్
  రుజువయె భువి, యరిపక్షపు
  సుజన పరాభవ మొసంగు సుఖసంపత్తుల్!!!

  రిప్లయితొలగించు
 29. నిజమని నమ్మబోకుమిది, నిన్నొక మూర్ఖుని గాను చూతురీ
  ప్రజలని చెప్పుచుంటి విను పాపపు మాటలనాడు వారలీ
  కుజనులు సద్గుణాత్ములను కుచ్ఛితు లోర్వక చెప్పిరిట్టులన్
  సుజన పరాభవంబున యశో విభవంబులు దక్కు నెప్పుడున్?

  రిప్లయితొలగించు
 30. గజిబిజిగను గనబడినన్
  నిజమును గనవచ్చు బుధులు నేర్పునఁ జెప్పన్
  విజయము నీయగఁ జేసెడి
  "సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్"

  రిప్లయితొలగించు
 31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 32. అజసుతు నడుగగ ధర్మజు
  కుజనుడు శిశుపాలు డెట్లు గృష్ణుని జేరెన్?
  నిజకథ నారదుc దెలిపెను
  సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్.


  అజసుతుడు - నారదుడు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. యజ్ఞేశ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అజసుతుని ధర్మజు డడుగ' అనండి. ప్రథమలో 'ధర్మజు' అని డు ప్రత్యయం లేకుండా వ్రాసారు. అలాగే 'నారదుడు తెలిపె' అనండి.

   తొలగించు
  2. అజసుతుని ధర్మజు డడుగ
   కుజనుడు శిశుపాలు డెట్లు గృష్ణుని జేరెన్?
   నిజకథ నారదుడు దెలిపె
   సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్.

   గురువు గారికి ధాన్యవాదములతో!
   🙏🙏

   తొలగించు
 33. విజయము ఒకటే లక్ష్యమ
  పజయమసలు సైపలేని పదవీ కాంక్షా
  భజన గణముకు తమ యెదిరి
  సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్

  ఎన్నికల యందు విజయం సాధించడం ఒకటే లక్ష్యంగా పెట్టుకొని, అపజయం అనే ఊహను కూడా ఓర్చుకోలేని పదవీ కాంక్ష ఎక్కువగా ఉండే రాజకీయ భజన పరులకు అవతలి పక్షంలో ఉన్న మంచివారిని అవమానించే మాటలు సుఖ సంపదలు చేకూరుస్తాయి.ఎన్నికల సీజన్ మొదలైంది కాబట్టి ఈ ప్రక్రియ ఇప్పుడు బాగా కనిపిస్తోంది.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కృష్ణారెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విజయ మ్మొకటే...' అనండి. గణముకు అనరాదు గణమునకు అనాలి. "భజన గణమ్మునకు నెదిరి" అనండి.

   తొలగించు
 34. వ్రజవరు వెక్కిరించి శిశుపాలుడు చక్రహతుండు గాడె, యా
  యజనము నందు దక్షుడు పురారిని హేళన జేయఁ గూలడే?
  గజముఖుఁ గేలి సేసి శశి క్రచ్చర శాపము నొంద లేదొ! యే
  సుజన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్?.

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించు
 35. asnreddy

  భజనల చేసి కపటియై
  ప్రజలను వంచించి మంచి పదవులు గొనుచున్
  నిజమును దాచు కుటిలునకు
  సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్

  రిప్లయితొలగించు
 36. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వృజినము లొనర్చి చెలగు ద
  నుజ కులము నణచగ జేయు నూకుల యందున్
  విజితి నిలుప యరి నాళిని
  సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిలుప నరి...' అని ఉండాలనుకుంటాను.

   తొలగించు
  2. గురువు గారికి నమస్కారములు. మీ సూచన శిరోధార్యము.

   తొలగించు
 37. నిజసుత పంచకాంతకుడు నేరముజేసిన ద్రౌణిపాఱుడా
  సుజనుడుగాడువీడు గురు సూతియటంచువధించకున్నచో
  ప్రజలకుమూడు గృష్ణయని పావనిబల్క వధించపాపమౌ
  *"సుజన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్"*

  రిప్లయితొలగించు
 38. సవరణలతో
  ===========
  ప్రజ కొందరు సోమరులై
  *సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్*
  విజయమనిఁ దలచి గోపం
  బు జనింపగ మాటలెంచ బూనును భ్రమతో

  రిప్లయితొలగించు