29, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2971 (రణము సెలరేఁగె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన"
(లేదా...)
"రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్"

89 కామెంట్‌లు:

  1. ప్రాతఃకాల కిట్టింపు:
    (మనలో మాట)

    గొణుగుడు మోడి వైరమటు గోలగ మారగ నాంధ్రమందునన్
    రణమిటు రాష్త్ర పెన్నికల రచ్చల లోన తెలంగణమ్మునన్
    వ్రణములు పాత కాలపువి భగ్గున రేగగ బాబు రాకతో
    రణము సెలంగెరా తెలుఁగు రాష్ట్రములందున నేమి చెప్పుదున్

    రిప్లయితొలగించండి

  2. తెలుగు రాష్ట్రాలలోనే కాదు టాప్ క్లాస్ వరల్డు బీటర్ :)



    తెలుగు నిలుచునో య‌నెడు సందియపు దినము
    ల మన శంకరయ్య చలువ లక్షణముగ
    సరసి, యెటు చూడగనచట శంకరాభ
    రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన!



    జాల్రా జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. వందిమాగధులు బహువచనము :)


      జిలేబు

      తొలగించండి
    2. నాకే తొందరగా ఐడియా వచ్చిందనుకున్నా! పూరణ పోస్టు చేసి చూస్తే ఇక్కడాల్రడీ జిలేబీపాకం లో శంకరాభరణం మునిగి తేలింది..
      😄👌🏻👏🏻🙏🏻🙏🏻

      తొలగించండి
    3. వందిమాగధులు మరెంతమంది తేల్తారో..చూడాలి
      🤣🙏🏻

      తొలగించండి
    4. జిలేబి గారూ
      మీ పూరణ కో నమస్కారం. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  3. డా.పిట్టా సత్యనారాయణ
    కనము జాతీయతాభావ గౌరవమ్ము
    జనములకు దానముల నివ్వ జవము దప్పె
    అప్పులును పప్పు కూడుకు ఆంధ్ర,తెలుగు
    రణము సెలరేగె తెలుగు రాష్ట్రముల లోన

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా సత్యనారాయణ
    ఫణముగబెట్టి"జాతి"నిట ప్రాంతమె గొప్పదటంచు నెంచిరో
    గణముల పోరు, పాలిపగ కంఠపు టెత్తుకు నిండె, దూషణల్
    గణగణమ్రోగె కేంద్రము సగర్వముగా మనజాల నోపునే
    గొణగెడు భారతీయత;యగోచరమాయెను భావి పౌరుకున్
    రణముసెలంగెరా తెలుగు రాష్ట్ర ములందున నేమి చెప్పుదున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా పిట్టా వారూ మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పౌరుకున్' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  5. తెలుగు పద్యము నిలుపగ వెలసె వలను
    గలిపె నెందరో కవులను భళిర! కంది
    శంకరయ్య గురుల కల శంకరాభ
    *"రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన"*
    🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి


  6. జాల్రా జిలేబి ఉవాచ :)



    గణగణ నైదనంగ మన కందివరార్యుల ప్రాంగమందహో
    మణిమయ పద్యపాదములు మాన్యుల మేల్మి జిలేబులున్ భళా
    యణగని శారదాంబ కృప యద్భుతమై కనరాగ యగ్నిధా
    రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. పాలనము జేసి యైదు సంవత్సరములు
    చేసినపని చెప్పి యొకట, చెప్పనేమి
    లేక యొకట, నోట్లకు వైరి ఢీకొనంగ
    రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన

    రిప్లయితొలగించండి
  8. తెలుగు చచ్చిన దనుకొన్న దిగులు మాని
    పాటు పడికృషి జేయంగ పట్టు బట్టి
    దేశ మంతట చుట్టిన వ్యాస మౌని
    రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రముల లోన

    రిప్లయితొలగించండి
  9. వా‌రి బలమది వీరికీ బలములనుచు
    చర్చ యెన్నికల గురించి జరుగుచుండ
    గెలుపు నోటములివియని యల సమీక
    రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన


    రిప్లయితొలగించండి
  10. వ్రణముగ నన్యభాష మన వాదములందున జేరెనక్కటా!
    రణమిక తప్పదంచు భళి! రాజసమొప్పగ నుద్యమంబుగా
    ఘనతరమైన తల్లినుడికారము వెల్గగఁ జేసిరందరున్
    ప్రణమిలు! శంకరాభరణ పండిత కోటికి విట్టుబాబు! పూ
    "రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్"

    🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    ప్రణతులు లేవు, ప్రేమమయ వాక్సుధలన్నవి లేనె లే , వకా...
    రణ రిపుభావమేర్పడెను , రాజుకొనన్ పెనుమంటయే , రణాం...
    గణమనిపించుచుండె , గనగా మన చంద్రుల మధ్యనీ గతిన్
    రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఇద్దరు చంద్రుల మధ్య యేమైంది ?



      జిలేబి

      తొలగించండి


    2. ఓహో :)


      ఇరువురు చంద్రులరరె తమ
      పరువుల పోగొట్టుకొనుచు పరుగిడిరి గదా
      తిరిపెంబెత్తుకొనుచు నో
      ట్ల రయమ్మున మ్రింగ గ్రక్కటంచు జిలేబీ :)


      జిలేబి

      తొలగించండి
    3. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు

      తొలగించండి
  12. ... ...శంకరాభరణం....
    29/03/2019 శుక్రవారం
    సమస్య

    రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్

    నా పూరణ

    ***** ***** **** **
    గణ గణ మ్రోగె నెన్నికల గంటలు తెన్గు ధరాతలంబునన్

    కణ కణ మండు వేసవిని కల్గెను తాపము హెచ్చు;ఘోరమౌ

    రణమిది!నేత లందరును రాజ్యము నేలగ ఫీట్లు జేయ నీ

    రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్!

    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  13. రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన
    మోస కులమత ద్వేషాల మోయ కుండ
    నేడు మనమంత యోచించి ఓటు వేయ
    ఓటు విలువను జాటుము తెలుగు బిడ్డ

    రిప్లయితొలగించండి
  14. పదవి నందుకొన నొకరిపైని యొకరు
    నోట వచ్చిన రీతుల మాటలాడి
    కీడు తలపోయు చుండగా నేడు ఓట్ల
    రణము సెలరేగె దెలుగు రాష్ట్రములలోన!

    రిప్లయితొలగించండి
  15. వ్రణమయి స్వాధికారసమరాంగణసంభవమై చెలంగె, పూ
    రణమయి కీర్తిసంపదల రాసులఁ గూర్చె, ప్రజాహితంపు తో
    రణమయి పంచవార్షికవిరాజితమై రహి మించె, మ్రోగు వీ
    రణము సెలంగెరా తెలుగు రాష్ట్రములందున నేమి చెప్పుదున్.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురం
    హైదరాబాద్.

    రిప్లయితొలగించండి
  16. తేటగీతి
    ఎన్నికల వేళ బాబుకు కన్నుగుట్టి
    కాలుమోపియు కార్చిచ్చు గలుగజేయ
    చంద్రశేఖరుడు ఫ్రళయ రుద్రుడాయె
    రణము సెలరేగె తెలుగు రాష్ట్ర ముల లోన
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు
      మూడవ పాదంలో ప్రాసయతి తప్పింది సవరించండి.

      తొలగించండి
  17. అలఘు సాంఘిక మాధ్యమముల కతమున
    ప్రజల చైతన్య దీప్తియె ప్రజ్వ రిల్ల
    వెలుగు నింపుచు బ్రదుకుల వెతల సంహ
    రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన

    రిప్లయితొలగించండి
  18. వ్రణమును బ్రహ్మ రాక్షసిగ వర్ధిల జేసెడు కోతి నేతలున్
    గణముల రెచ్చగొట్టెడు వికారపు మాటల వోట్లుపొంద దా
    రుణముగ కేసి యారునొక క్రూరుగ చిత్రణ జేయు తీరుగన్
    రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నికలవేళ నేతల కెవరికైన
      గెలుపు లక్ష్యమై నీతినిఁ దలువఁ మరచి
      అడ్డు నదుపన్న దేలేని చెడ్డదైన
      రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు

      తొలగించండి
  19. ఎన్నికలు సమీపించగ నన్ని రాజ
    కీయదళములు బండ్లపైకెక్కి శత్రు
    పక్ష యభ్యర్థులపయిన వాదు లాడు
    రణము సెలరేగె దెలుగు రాష్ట్రములలోన

    రిప్లయితొలగించండి
  20. మిత్రులందఱకు నమస్సులు!

    [లక్ష్మీ’స్ ఎన్టీయార్ సినీమా రిలీజు కానున్న సందర్భంగా రెండు రాష్ట్రాలలోని జనులు వారిలో వారే వితర్కించుకొను సందర్భము]

    "గుణముల కాటపట్టనుచుఁ, గోరిన రీతిని "లక్ష్మి’సెంటియార్"
    గణుతినిఁ గొన్నదయ్య తెలఁగాణను నాంధ్రను నిన్నినాళ్ళు! "చి
    త్రణ మెటులుండు? నిందలు నుతమ్ముల నేవియు హెచ్చు?" నన్ మహా
    రణము సెలంగెరా తెలుఁగు రాష్ట్రములందున! నేమి చెప్పుదున్?"

    రిప్లయితొలగించండి
  21. గుండు కవి వరుడు గోదా(రణము) దాల్చి కఠిన నేలన చేయ కావ్య కృషిని ,
    జంధ్యాల కవిరేడు జర్సిలో నుడుగుల చెలి పూ(రణము)లను జేయు చుండ ,
    పోచిరాజు పదపు పుడకలు కలిపి నగ్న్యుద్ధ(రణము)జేసి కుడుపు బెట్ట,
    కావ్యాoబు స(రణము) గంగవోలె దుముక కంది గురువుగారు కాచు చుండ,
    అంబుత(రణము)తో నష్టావధాని మైలవరపు వారు జలధిని దాట
    అంతఃక(రణము)న నలసట లేక జిలేబి ప్రతిలిఖించ లెక్క లేక ,
    అంచ తత్తడిచెలి కంగసంస్క(రణము) సీతమ్మ సొగసుగా జేయ,చదువు
    తొయ్యలి కంగుళి తో(రణము)ను బెట్ట నసునూరి పండితుండందముగ, ప
    రబ్రహ్మశాస్త్రి పరాచ కాస్త్రములు నంత(ర్వ్రణము)లకు పూతలను పూయ,
    విట్టుబాబు తళియ ల్విద్దెల తల్లి కతిచ(రణము) వలన తేన్పు కలుగ,

    బుడిబుడి చ(రణము)లతోడ పూసపాటి
    సరస నధ్యాహ(రణము)తో శంక రార్యు
    సదనమున శ(రణము)నొంద,శంకరా భ
    (రణము) సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన"

    (కొన్నిచోట్ల ఏక వచన ప్రయోగ కారణమున కవులకు క్షమాపణ నమస్సులతో )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిమిత్రుల ప్రస్తావనతో పెక్కు రణములతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.

      తొలగించండి
    2. భలే! సీసపాటి వారూ!
      ఇంతమంది మహామహుల చరణారవిందముల వద్ద నన్ను కూడా కూర్చోపెట్టినందుకు అనేక ధన్యవాదములు
      🙏🏻🙏🏻

      తొలగించండి

    3. వావ్ అలుపెరుగని జిలేబి కూడాను సీసంలో కరిగి పోనాది :)


      అదురహో పూసపాటి వారు

      నెనరులు


      జిలేబి

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    6. జడయల్లి జడకుచ్చులిడ రాయప్రోలు తల్లావఝ్ఝుల.....జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యము వలె ఉన్నది మీ పద్యము.
      💐👌🙏 పి లక్ష్మణా చార్య





      స్వామీ
      వారి కాలి గోటికి సరిపోము వారు విసరిన మెతుకులు గతికిన చాలు

      తొలగించండి
  22. దేశ పాలక వర్గపు తీర్పు కొఱకు
    శాంతి యుత ముగ నెన్ని క జరుపు నట్లు
    చర్య గైకొన్న గాని ప్రచార మందు
    రణ ము సెలరేగె దెలు గు రాష్ట్ర ము ల లోన

    రిప్లయితొలగించండి
  23. రాచబిడ్డల చేతలు రాఁజు కొనఁగ
    స్థలముల తగవు లడరంగఁ జలము పగయుఁ
    దెనుఁగు నుడికారపు సొగసు మునుఁగఁ గలి క
    రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన


    ఫణముగఁ బెట్టి వర్ధనము పామరులోయన సంత తమ్మకా
    రణ సువిరోధ చిత్తమున రాక్షస తుల్య మదైక బుద్ధి యం
    త్రణ మది యగ్నియై తనరఁ దర్క పరస్పర రోష మోహ వా
    గ్రణము సెలంగెరా తెలుఁగు రాష్టము లందున నేమి చెప్పుదున్

    రిప్లయితొలగించండి
  24. తెలుగు భాషయె జగతిని వెలుగు రీతి
    పూర్వ వైభవ మొసగుచున్ బూజ్య కంది
    శంకరార్య మానస పుత్రి శంకరాభ
    రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రముల లోన

    రిప్లయితొలగించండి
  25. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గుణమగు మేక బిర్యనిట గుంటురు గోంగుర పచ్చడచ్చటన్
    వణకిడు మిర్చి బజ్జిలకు వాడ్చిన వంకయ గుత్తికూరకున్
    పుణుకులు జొన్న రొట్టెలకు పూర్ణపు బూరెలకిచ్చటచ్చటన్
    రణము సెలంగెరా తెలుఁగు రాష్ట్రములందున నేమి చెప్పుదున్

    రిప్లయితొలగించండి
  26. ప్రజలు పాలకులగు ఘన ప్రభుత రీతి
    బడుగు జీవులు నిర్మించు భవిత బాట
    అయిదు వర్షములొకపరి యద్భుత గతి
    రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన

    ప్రజలే పాలకులయ్యే ఘనమైన ప్రభుత్వం బలహీన వర్గాలు భవిష్యత్తు బాట నిర్మించే విధంగా అయిదు సంవత్సరాలకు ఒకసారి ఈ రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం చెలరేగుతుంది.

    రిప్లయితొలగించండి
  27. గణగణమ్రోగెనెన్నికనగారతెలుంగుననేతచేతనన్
    రణగొననిస్వనంబులును ,రాష్ట్రమునందునబాబుచంద్రదూ
    షణకటుభాషణంబులు నిశాచరవృత్తులనింద్యహేయవా
    *"గ్రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్"*

    రిప్లయితొలగించండి
  28. ఎన్నికలపర్వమరుదెంచె నెన్నికలలు!
    నెన్నికలలో వినాయకులెన్నడేని
    ప్రజలయూసెత్తలేని సంపన్నుల విత
    *"రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన"*

    రిప్లయితొలగించండి
  29. కనినకలలన్ని నిజమైన గలలుగాను
    రణముసెలరేగెతెలుగురాష్ట్రములలోన
    నొకరి గెలుపునాకొఱకునింకొకరు,పోరు
    సల్పుచుండిరిఘాటైన బల్కులుడివి

    రిప్లయితొలగించండి
  30. మనదగు మాతృ భాష పనిమాలిన భాషయటంచు చెప్పుచున్
    ఘనమది యాంగ్లమంచు పలు కాసుల నిచ్చునటంచు నమ్ముచున్
    వనధిని దాటి పోయి సముపార్జన చేయుటె గొప్పయంచు ప్రే
    రణము సెలంగెరా తెలుగు రాష్ట్రము లందున నేమి చెప్పుదున్.

    రిప్లయితొలగించండి
  31. (తెగులు పట్టిన తెలుగునేతలకు కన్నతల్లు లిద్దరూ
    చెవులుమెలివేసి తెలుగునేల ఘనత చెప్పి శాంతపరచాలి)
    రణము సెలంగెరా తెలుగు
    రాష్ట్రము లందున నేమి చెప్పుదున్ ?
    కణకణమందు నేతలకు
    కామము ! క్రోధము ! మత్సరాగ్నియే !
    తనయుల నిర్వురన్ దెలుగు
    తల్లియు , నా తెలగాణతల్లియున్
    ఘనమగు పూర్వఘట్టముల
    గాథల నన్నిటి బోధసేయరే ?

    రిప్లయితొలగించండి
  32. శతకములలోన ' శంకర ' శతక మొకటి
    శంకలేకుండ పంచగ శంకరాభ
    రణము సెలరేఁగెఁ ; దెలుఁగు రాష్ట్రములలోన
    గలకవులు విశాఖలో గలిసి రొకట

    నిన్నటి సమస్యకు నా పురాణ

    కన్న సంతతి ముదిమిని కాలదన్న
    గౌతమీ స్నాన మొనరించెఁ ; గాశి కేఁగి
    గంగలో మున్గె నొక్కడు ; గగన మేగ
    నుత్తరాంచల మందున నుసురు లిడెను

    రిప్లయితొలగించండి
  33. పణముగ బెట్టి యాస్తులను ప్రాభవమున్ గొన నోట్లతోడుతన్
    వినయముగా ప్రజాళి కడ విశ్వసనీయతతో నటించుచున్
    ధనముగలట్టి నాయకులు దర్పముతోడ చెరించు చుండగా
    రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్

    రిప్లయితొలగించండి
  34. ఎన్నికలన?భవితకు వినేందుకొరకె
    నాయకులమాట,మూటల మాయజాల
    మొసగు సభలందు వోటర్ల మోసబడెడి
    రణము!సెలరేగె దెలుగు రాష్ర్ట ముల లోన

    రిప్లయితొలగించండి
  35. ఓటు నాకు వేయుమనుచునొకడు, కాదు
    కాదు నాకే ననుచు మరొకడన, ఒకరి
    నొకరు వాదులాడంగ నా డోర్మి లేక
    రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన!!

    రిప్లయితొలగించండి
  36. అణకువ లేకయుండుచును నారడిజేయుచునొక్కరొక్కరున్సదా
    పణములు వెట్టుచుండియును భార్యలయాభరణంబులన్నియున్వచో
    రణముసెలంగెరా తెలుగురాష్ట్రములందుననేమిచెప్పుదున్సదా
    వినయవిధేయతల్గలిగిబ్రేమనునింపుచునుండమేలగున్

    రిప్లయితొలగించండి
  37. savarimchina pUraNa
    తెలుగు చచ్చిన దనుకొన్న దిగులు మాని
    పాటు పడికృషి జేయంగ పట్టు బట్టి
    దేశ మంతట చుట్టిన వ్యాస మౌని
    శంక రార్యుని మెచ్చగ వంక లేక
    రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రముల లోన

    రిప్లయితొలగించండి

  38. అన్ని గ్రూపుల యందున నాంధ్ర భాష
    పట్ల మక్కువ పెరు గంగ వ్రాయు చుండ
    వరుస నన్ని ప్రక్రియల. పలు కవితల
    రణము సెల రేగి తెలుగు రాష్ట్రముల లోన

    నిన్న సఖులైన వారలు నేడు పగతు
    రైరి,పదవికాంక్షయధిక మై జనముల
    మధ్య బాంధవ్యము నశించ నేడు
    రణము సెల రేగె తెలుగు రాష్ట్రముల లోన

    రిప్లయితొలగించండి
  39. ఘనము గణతంత్రమం దెన్నికలకలమున
    జనము తోడును పొందగ జరుగు సభల
    పదును మాటల కత్తులు వదలుచుండ
    రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన

    రిప్లయితొలగించండి