1, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2944 (క్షుద్బాధల్ సను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్"
(లేదా...)
"క్షుద్బాధల్ సనుఁ గాలకూట విషమున్ గొన్నంత సత్యం బిదే"

85 కామెంట్‌లు:

  1. సద్భావము గలుగు మైత్రిని
    యద్భుత ముగమలుపు లున్న యానందముగా
    సద్భుద్ది తోన తొల గునట
    క్షుద్భాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ కొంత గందరగోళంగా ఉన్నది. మొదటి, మూడవ పాదాలలో గణదోషం. 'మైత్రిని + అద్భుత, ఉన్న + ఆనందముగా...' అన్నపుడు యడాగమం రాదు. సవరించండి.

      తొలగించండి
  2. ఉద్బలునకు మూడినపుడు
    నుద్బంధముకన్న మేలు నుర్విని వీడన్
    బుద్బుదమీ ప్రాణముగద!
    క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి సవరణతో:

      ఉద్బలునకు మూడినచో
      నుద్బంధముకన్న వీడ నుర్విని మేలౌ
      బుద్బుదముల ప్రాణమ్ముల !
      క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్ :)

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మైలవరపు వారి సవరణతో ప్రశస్తమయింది.

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    కర్షకుని ఆవేదన..

    మృద్బంధుత్వము దక్క మాకు మరి వేరే లేరు చుట్టమ్ముల...
    స్మద్బాధన్ దిలకింపదా జలదమున్ , మన్నించి వర్షింపదే!
    హృద్బాధల్ తొలగంగ మాకు మరణంబే మార్గమై తోచెడిన్ !
    క్షుద్బాధల్ సనుఁ గాలకూట విషమున్ గొన్నంత సత్యం బిదే !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  4. క్షుద్బాధల్ దొలగింపఁ బూనుటకునై కోకొల్లలౌ హేతువుల్
    సద్బోధావ్రతదీక్షలన్ జెలగనా సత్త్వోపవాసమ్ములన్,
    హృద్బద్ధవ్య‌సనమ్ములన్ మునుగ దా నేప్రొద్దు రాత్రిం బవల్,
    క్షుద్బాధల్ సను కాలకూటవిషమున్ గొన్నంత, సత్యంబిదే

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి


  5. బుద్బుదపు జీవితమునన్
    సద్బుద్ధియు బోవ మదియు చపలత గాంచన్
    నుద్బలు డొకండు తలచెన్
    క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. సద్బుద్ధిని భక్తుండై
    మద్బంధుడ వీవ యంచు మాధవసేవన్
    హృద్బలమును వెచ్చించిన
    క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్.

    రిప్లయితొలగించండి
  7. క్షుధ్బాధల్ భరియించు కంటె నరకం బేముండునో దైవమా
    సద్భావం బునభక్తి తోగొలి చినన్ సాక్షాత్కృతిన్ జేయడే
    మద్భావం బునుగాంచ కుండ శిలయై యామంచుకొం డంబడన్
    క్షుద్భాధల్ సనుఁ గాలకూట విషమున్ గొన్నంత సత్యం బిదే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      బభలకు ప్రాసమైత్రి లేదు. గమనించండి.

      తొలగించండి
  8. ఉద్బలుడు,పేదవాడును
    క్షుద్బాధల్ మీఱగ ననె శోకము నిటులన్
    "క్షుద్బాధ తాళజాలను;
    క్షుద్బాధ దొలంగు గాలకూటము గొనినన్."

    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శోకమున నిటుల్' అనండి.

      తొలగించండి
  9. ( అమృతం జీవనకారకం - గరళం మరణకారకం )
    సద్బుద్ధిని గ్రోలిన సుధ
    క్షుద్బాధ దొలంగు ; గాలకూటము గొనినన్
    యద్బలవంతులు నైనను
    తద్బలమంతయు నశించి దాల్తురు మిత్తిన్ .
    (యద్బలవంతులు - ఎంతటి బలవంతులు ; తద్బలము -
    ఆ బలము ; మిత్తి - మరణం )



    రిప్లయితొలగించండి


  10. ఉద్బాష్పంబులవేల? యిష్టసఖుడా!యూగాడనేలన్ వ్యధన్?
    హృద్బాధల్ చను నంతరాత్మయు సదా హృత్సారమున్గానగా
    నుద్బోధించెద వీడు నెంజిలను మున్నున్ నిప్డు తప్పేసుమా
    క్షుద్బాధల్ సనుఁ గాలకూట విషమున్ గొన్నంత సత్యం బిదే?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. సద్బోనము దొరకి తినగ
    క్షుద్బాధ దొలంగు; గాలగూటము గొనినన్
    మద్బాధలన్ని బోవగ
    తద్బుధ్నుని కడకు జేరి తఱియుదు జన్మన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సద్బోనము' దుష్టసమాసం.

      తొలగించండి
  12. అద్భుత భోజన మున్నను
    క్షుద్భాధ దొలంగుఁ, గాల కూటముఁ గొనినన్
    సద్భుద్ధీ! విన వేమిర
    బుద్భుదమౌ జీవితమిక ముగియును గదరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో ప్రాస తప్పింది. బ-భ లకు ప్రాసమైత్రి లేదు.

      తొలగించండి
  13. సద్బల పు టోగిరం బున
    క్షుద్బా ధ తొలంగు ; గాల కూటము గొన గ న్
    మద్బల ము నశించం గా
    మృద్బల ము పెరిగి కలుగును మిత్తియు త్వర గాన్

    రిప్లయితొలగించండి
  14. పాండిత్యమునకు నేటి సమాజము ఇచ్చు విలువ తెలుపుట నుద్దేశించి:

    అద్భుత బండితు డొక డా
    త్మోభవ బెండ్లి యొనరించి తా నప్పుల బా
    ధోద్భటు డాలోచించెను
    క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్

    ఉద్భట - తీవ్ర
    ఆత్మోద్భవ - కూతురు

    ప్రయత్న దోషములు సవరించి దీవించ ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ద్వారకానాథ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని బ-భ ప్రాసను ప్రయోగించారు.

      తొలగించండి
  15. సద్బాల్య మంతరించెను
    చిద్బోధలు లేని వయ్యె!చీ!చీ!బ్రతుకా!
    మద్బొక్కసంబు ఖాళీ!
    క్షుద్బాధ దొలంగు గాల కూటము గొనినన్!!

    రిప్లయితొలగించండి
  16. ఉద్బంధకు సమమగునా
    క్షుద్బాధకు తాళకనిరి కొందరు నాతో
    "నుద్బోధ కడుపు నింపునె?
    క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్"
    ***)()(***
    ఉద్బంధ = ఉరితీత
    నైరాశ్య మేపార పలికిరిటుల.

    రిప్లయితొలగించండి



  17. క్షుద్బాధకు కారణమున్
    క్షుద్బాధ భరించుచు కనుగొని తెలిపె కదా
    క్షుద్బాధ భరింప తగదు,
    క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    [ హిరణ్యకశిపుని మధ్య ప్రహ్లాదుని మధ్య

    సంభాషణ ]


    మద్బోధామృత మాను | మాను మిక నా మానాథు నామోక్తులన్ |

    త్వద్బుధ్ధిన్ సుత ! యీ పవిత్ర కశిపున్ భావింపు సద్భక్తితో

    ............................................................................

    తద్బాంధవ్యము జన్మతో నొదవె నో తండ్రీ ! విమర్శింపగా :-

    సద్బుధ్దిన్ హరి కీర్తనమ్ము హృదిలో సల్పన్ మనోవేదనల్ ,

    క్షుద్బాధల్ సను కాలకూట విషమున్ గొన్నంత సత్యం బిదే ! ! !

    { ఆను = త్రాగు ; పవిత్ర కశిపుడు = హిరణ్య

    కశిపుడు }

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  19. మద్బంధువు రైతు గెలువ
    క్షుద్బాధ దొలంగు! గాలకూటము గొనినన్
    తద్బాధల్ తాకనటుల
    సద్బుద్ధి నరాచకముల సరిదిద్ద వలెన్!

    రిప్లయితొలగించండి
  20. కాలకూట విషాన్ని తినమన్న తండ్రితో ప్రహ్లాదుడు

    బుద్బుదమగు జివనమున
    మద్బాధల దొలగజేయు మాధవ స్మరణే
    సద్బంధువు శౌరియవగ
    క్షుద్బాధ దొలంగు కాలకూటము గొనినన్

    రిప్లయితొలగించండి
  21. గురుదేవులకు శుభోదయ వందనములు
    =========*******=======
    హృద్బాధలను మరువగా
    హృద్బలమున నిచ్చె విషము నీశ్వర భక్తిన్
    తద్బలమున హరియనుచున్
    క్షుద్బాధ దొలంగు, కాలకూటము గొనినన్ !

    రిప్లయితొలగించండి
  22. సవరించిన పద్యము

    సద్బోధన విని నంతనె
    క్షుద్భాధ దొలంగుఁ, గాల కూటముఁ గొనినన్
    సద్భుద్ధీ! విన వేమిర
    బుద్భుదమౌ జీవితమిక ముగియును గదరా!

    రిప్లయితొలగించండి
  23. బుద్బుదప్రాయమయైనను
    క్షుద్బాధలుదప్పవకట సోమరికైనన్
    హృద్బలమునీరసించిన
    క్షుద్బాధదొలంగుగాలకూటముగొనినన్

    రిప్లయితొలగించండి
  24. ఈరోజు మిత్రులు కొందరు బ-భ ప్రాసను ప్రయోగించారు. దానిని దోషమని నేను పేర్కొన్నాను. దీనిని గురించి కొంత వివరణ....
    *స్వవర్గజ ప్రాస*
    ప్రాసభేదాలలో స్వవర్గజ ప్రాస అని ఒకటి ఉంది. దీనినే కస్తూరి రంగకవి 'స్వవర్గ ప్రాస' అన్నాడు.
    "క,చ,ట,త,ప వర్గాలలోని ప్రథమ తృతీయ వర్ణాలకు (క,చ,ట,త,ప లకు వరుసగా గ,జ,డ,ద,బ లు), ద్వితీయ చతుర్థ వర్ణాలకు (ఖ,ఛ,ఠ,థ,ఫ లకు వరుసగా ఘ,ఝ,ఢ,ధ,భ లు), తృతీయ చతుర్థ వర్ణాలకు (గ,జ,డ,ద,బ లకు ఘ,ఝ,ఢ,ధ,భ లు) ప్రాస చెల్లుతుంది" అని కూచిమంచి వేంకటరాయడు పేర్కొన్నాడు. కాని మనకు ప్రాచీన కావ్యాలలో ప్రయోగాలు త వర్గకు ఎక్కువగా, ట వర్గకు తక్కువగా కనిపిస్తున్నాయి. మిగిలిన వర్గాలకు కనిపించవు. అప్పకవి మొదలైనవారు ఈ రెండు వర్గాలకే ప్రాసమైత్రిని చెప్పినారు. కనుక మనం క,చ,ప వర్గాలకు ఈ ప్రాసను పాటించరాదు. ఈ లెక్కన ఈనాటి సమస్యాపూరణలో బభ లకు ప్రాసను వేయరాదన్నాను.
    నా ఉద్దేశంలో కవిమిత్రులు ఈ విశేష ప్రాసల జోలికి వెళ్ళకుంటే ఉంటే మంచిది.

    రిప్లయితొలగించండి
  25. అద్భుతమౌ యంబ రుచుల
    క్షుద్బాధ దొలంగు ; గాలకూటము గొనినన్
    బుద్భుదమౌ లోకంబులు
    సద్భావంబున నిలుచుర సదమలరీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ద్వారకానాథ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బ-భ' ప్రాస వేశారు.

      తొలగించండి
  26. సద్బల హీనులు రైతులు
    క్షుద్బాధ నణచఁ దలఁచిరి గోప్యమ్ముగ నీ
    బుద్బుదపు టసువులు సనఁగ
    క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్


    ఉద్బాధార్త జనాళి వేదనల సద్యోభంగ కార్యమ్ము లం
    చద్బాధ్యత్వ ధురీణులై పరఁగి సంచారమ్ము సేయం దగున్
    సద్బోధల్ వలుకంగ భావ్య మగునే క్షామంబు వర్తిల్లగన్
    క్షుద్బాధల్ సనుఁ గాలకూట విషమున్ గొన్నంత సత్యం బిదే

    [చను = ప్రవర్తించు]

    రిప్లయితొలగించండి
  27. సద్బలము నిడును కొర్రలు
    క్షుద్బాధ దొలంగుఁ, గాలకూటముఁ గొనినన్
    హృద్బలము పెరుగు ప్రజకని
    యుద్బోధించెను మగనికి యుమ దృతి తోడన్

    రిప్లయితొలగించండి
  28. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మృద్బంధమ్మగు నీదు బుద్ధి భడవా మేసెన్ గదా ఘాసమున్
    సద్బుద్ధిన్ విడనాడి భారతమునన్ క్షాత్రమ్ము జూపింతువే!
    ఉద్బోధన్ వినుమా పఠాను! వడిగా నుల్లాసమౌ నీకికన్
    క్షుద్బాధల్ సనుఁ గాలకూట విషమున్ గొన్నంత సత్యం బిదే!

    రిప్లయితొలగించండి
  29. సద్బావనతో తినిన
    క్షుద్బాధ దొలంగు,గాలకూటము చొనినన్
    వేదన తాళగ జాలక
    హృద్బాధనుపొంది చావు నందెదవయ్యా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం.

      తొలగించండి
  30. బుద్బుదమగు జీవితమును
    సద్బుద్ధి గలిగి ముదమున సాగించ వలెన్
    హృద్బాధలేమగు? నెటుల
    క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్?

    రిప్లయితొలగించండి
  31. సద్బోధన నిడిన యతికి
    క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్
    శబ్దము ఓంకారమె ని
    శబ్దంబుగ జేర్చునతని శంకరు చెంతన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    మాతా కౌశల్య సుతుడె
    సీతాపతి యనఁగఁ; జంద్రశేఖరుఁడు గదా
    శీత నగమునకు జని తన
    నాతిని గన తపము జేసె నద్భుత రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ చివరి రెండు పాదాల ప్రాస తప్పింది.

      తొలగించండి
  32. తద్బంధుత్వము దగ్గరంచు దలచ న్దాళి న్మెడ న్గట్టె, నే
    తద్బంధ మ్మురిత్రాడు నయ్యె, కన డాదాయమ్ము సంతానమున్,
    మద్బోధోక్తుల నాలకించడు, సదోన్మత్తుండునై, కాన నీ
    క్షుద్బాధల్ సను గాలకూటవిషముం గొన్నంత,సత్యంబిదే

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  33. ఉద్బవమందన్ ప్రేమే
    క్షుద్బాదదొలంగు!"కాలకూటముగొనినన్
    నద్బుతముగ తగ్గించదు!
    సద్భావన జేరబోదు సాంగత్యమునన్!
    కాలకూటము=ఔషదము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      బ-భ ప్రాస వేశారు.

      తొలగించండి
  34. డా.పిట్టా సత్యనారాయణ
    (బానయ్య,శిష్యుని పేరు. నేను గురువును.
    శిష్యుడు:"విద్యయను క్షుద్బాధ ఎట్లు దీరును?"
    గురువు:"కాలకూటము వంటి కఠినాతి కఠిన అర్థ గోచరము వల్ల.")
    మద్బానయ్యాఖ్యుండా
    పద్బాంధవుడాయె శిష్య పథమున్ జేరెన్
    "క్షుద్బాధ విద్య నెటుల"న
    "క్షుద్బాధ దొలంగు గాల కూటము గొనినన్".

    రిప్లయితొలగించండి
  35. ఉద్బోధించిరి పెద్దలే కృషి మహోద్యోగమ్మటంచున్ భువిన్
    క్షుద్బాధల్ తొలగించు హాలికుడె తా గోల్పోయి సర్వమ్మునే
    తద్బాధల్ గనడెవ్వడంచు మదిఁ క్షేత్రాజీవియే దల్చెనే
    క్షుద్బాధల్ సనుఁ గాలకూటవిషమున్ గొన్నంత సత్యంబిదే.

    రిప్లయితొలగించండి
  36. డా.పిట్టా సత్యనారాయణ
    (మాయలో పడి ఎన్నో జీవ జంతువుల దిని మనుటకన్న నీతిగా బ్రతకాలంటే అంత కాలకూటము గొనిన మేలే!)
    క్షుద్బాధార్పగ గాదె జీవి తపనల్ క్రూరంపు స్వార్థాన నా
    పద్బాంధాళియు గావజాల రతనిన్, పాపాలదే జీవికౌ(జీవనమగును)
    మ"ద్బానయ్య"వినీతి నొల్లడదిగో మాయాంధకారంపు వే
    క్షుద్బాధల్ సను గాలకూట విషమున్ గొన్నంత, సత్యంబిదే!

    రిప్లయితొలగించండి
  37. బుద్బుదప్రాయంబదియే
    సద్బుద్ధి గలిగిన శుభము సారమ్మిదియే
    ఉద్బోధచేయ దగదయ
    క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్"!!

    రిప్లయితొలగించండి
  38. సద్బుద్ధిఁ గలిగియున్నను
    క్షుద్బాధ దొలంగుఁ; గాలకూటముఁ గొనినన్
    తద్బాధలుఁ జెప్ప తరమ?
    సద్బోధలు విన్న రాదు సంకటమిట్లున్

    రిప్లయితొలగించండి