ఉదయం స్నానానంతరం దేవాలయానికి వెళ్ళి వచ్చి శివపరమైన శతక మొకటి వ్రాయలని, ఒక్క రోజులో లింగోద్భవకాలానికి పూర్తి చేయాలని సంకల్పించాను. ఇంకా ఛంసస్సు, మకుటం నిర్ణయించుకోలేదు. చూద్దాం... నా సంకల్పం నెరవేరుతుందో లేదో... నమశ్శివాయ
..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య 🤷♀.................... రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్
సందర్భము: కార్తవీర్యార్జునుని సంహరించి వచ్చిన తన కుమారుడైన పరశురాముని చూసి ఎంతో నొచ్చుకొన్నాడు జమదగ్ని మహర్షి. మహారాజును మట్టు పెట్టినందుకు కలిగిన పాపాన్ని తొలగించు కోవడానికై తీర్థయాత్రలు చేసి రమ్మన్నాడు. (పట్టపు రాజును జంపుట కట్టలుకన్ విప్రు జంపుకంటెను పాపం బట్టి ట్టనకుము నీ వీ చెట్ట సెడన్ దీర్థ సేవ సేయుము తనయా! భాగ..9 వ స్కం. 463 ప.) ఇంకా ఇలా అన్నాడు. "నాయనా! గంగలో మునిగితే.. కాశిలో విశ్వేశ్వరుని గొలిచితే.. పాపా లన్నీ పోతాయి. అక్కడున్న రోజుల్లో శివరాత్రి వస్తే భక్తితో భజన చెయ్యి." తండ్రి మాట పాటించి పరశురాముడు ఒక సంవత్సరంపాటు తీర్థయాత్రలు చేసివచ్చాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ శ్రీ మృత్యుంజయుఁ గొలిచిన..
నా మందాకిని మునిగిన.. నఘము హరించుం
గా మరి! యా కాశిఁ బరశు
రామ! భజన సేయుము శివ రాత్రికి భక్తిన్
✒~డా.వెలుదండ సత్యనారాయణ 4.3.19 -----------------------------------------------------------
రామనవమి నాడు విడక
రిప్లయితొలగించండిరామ భజన సేయుము; శివరాత్రికి భక్తిన్
ప్రేమను గూడుచు గుడిలో
నీమముగా జేయు భజన నిష్కృతి కొరకై!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శుభోదయం సార్!
తొలగించండి🙏
"దేనికైనా రెడీ!"
సోమాలంకృతశేఖరుఁ
రిప్లయితొలగించండిడామోదించియు నపరిమితామోఘకృపన్
సేమ మ్మిడఁగా వందిత
రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్.
🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఉదయం స్నానానంతరం దేవాలయానికి వెళ్ళి వచ్చి శివపరమైన శతక మొకటి వ్రాయలని, ఒక్క రోజులో లింగోద్భవకాలానికి పూర్తి చేయాలని సంకల్పించాను. ఇంకా ఛంసస్సు, మకుటం నిర్ణయించుకోలేదు. చూద్దాం... నా సంకల్పం నెరవేరుతుందో లేదో... నమశ్శివాయ
రిప్లయితొలగించండితప్పక నెరవేరును!!!
తొలగించండి🙏
తప్పక నెరవేరుతుంది గురువు గారూ...🙏🙏🙏
తొలగించండిశివానుగ్రహ ప్రాప్తిచే నచిర కాలాన మీ యభీష్టము సత్ఫలవంతమగుఁగాక!
తొలగించండిసజ్జన సద్భక్త సంకల్పమునకు శంకరాశీస్సులు సద్యోజాతములై సంపూర్ణకారకములై సాఫల్యమొసంగును!!!
తొలగించండిఓంశివాయనమః గురుదేవులకు ప్రణామములు.మీది సత్సంకల్పంస పరమేశ్వరాశీర్వాదంతో శ్రీకారం చుట్టబోతున్నారు. తప్పక సాకారమౌతుంది. మీకూ కవిమిత్రులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినా ప్రయత్నం :
తొలగించండికందం
భామ! వరానన! రాముని
నామము ముమ్మాఱు పలికి నమ్ముము అదియే
వేమఱులౌనని హరుడనె
రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్
ఉత్పలమాల
శ్రీరఘురామ నామపు విశేషము దెల్సిన శూలి జెప్ప ము
మ్మాఱులు నామమున్ బలుక మాఱుగ వేమఱు లన్న పుణ్య మే
పారు వరాననా! యనుచు పార్వతి తోడను నమ్మి భక్తితో
శ్రీరఘురామ సద్భజన సేయఁ దగున్ శివరాత్రికిన్ దమిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభామా! హరిహర భేదము
రిప్లయితొలగించండిలేమాత్రము చూపబోకు మిరువురునొకటే
నేమము వీడక మదిఁ శివ
రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్.
రిప్లయితొలగించండినీమము తప్పక మాలిని
రామ భజన సేయుము! శివరాత్రికి భక్తిన్
నీమము తప్పక నీశుని
నీ మది నెంచుము జిలేబి నెంజిల బోవన్ !
జిలేబి
రిప్లయితొలగించండిశ్రీరఘురామ! సద్భజన సేయఁ దగున్ శివరాత్రికిన్ దమిన్
ప్రేరణ నిచ్చు నీకిది పరేశుని రాతల మార్చు నిద్దియే
రార ! కుమార! శ్యామ! గహరమ్ముల కాల్చెద మయ్య చీకటిన్
దూరము చేయు రాత్రియిది దోర్బల మున్ సయి జేర్చునిద్దియే!
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏమని జెప్పుదు వింతను
రిప్లయితొలగించండిరాముడు శివుడే యటంచు లౌఖ్యము గనుమా
లేమా ముక్తిని కోరుచు
రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్
కాముని గా ల్చియు గిరి జ కు
రిప్లయితొలగించండిప్రేమను బం చిన మహేశ విశ్వేశ్వర యా
భామ మనోహర విదిత వి
రామ భజన సేయుము శివ రాత్రికి భక్తిన్
(దక్షారామంలోని మాణిక్యాంబా సమేతుడైన భీమేశ్వర
రిప్లయితొలగించండిస్వామి భజనకన్న మహాశివరాత్రినాడు ఇంకేమి కోరాలి ?)
క్షేమంబుల నిరత మరసి ;
క్షామంబుల నవల నుంచు ; కామితకరుడౌ ;
శ్రీ మాణిక్యాంబా హృ
ద్రామభజన సేయుము శివరాత్రికి భక్తిన్ .
రామనవమి నాడు రఘు
రిప్లయితొలగించండిరామ భజన సేయుము; శివరాత్రికి భక్తిని
సోముని కీర్తించుచునే
యామిని యంతయు గడుపుము హరసేవనలో
ఏమరకయె ప్రతిదినమును
రిప్లయితొలగించండిరాముని గూరిచి భజింప రావే మనసా !
నీమము తప్పకు మెపుడును
రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
శి వ క ళ్యా ణ ము
************************
--------------------------------------------------------------------------------
పార్వతీ పరమేశ్వరులను నూత్న వధూ వరుల జేయుట
-------------------------------------------------------------------------------
గౌరిని జంద్రకాంతఫలకమ్మున కూర్చొనబెట్టి , గంధపున్
సారము - నంగలేపనము - సంపెగనూనె నలంది , పూసి క
స్తూరిని , హేమకుంభములతో జలమార్చుచు , ధూపధూమ వి
స్ఫారితదీర్ఘకేశములఁ జక్కగ వేనలి వేసి రంగనల్
అభ్యంగనస్నాన మాచరింపగనె స
ర్వాంగసంస్కారకార్యముల జేసి
అంగరాగమ్ముల నంజనాలేపముల్
సొంపారగా సంతరింప జేసి
తళుకులగుల్కు పీతవసనమ్ముల మేన
నింపొదవగ ధరియింప జేసి
మాణిక్యఖచిత హేమక భూషణముల ను
న్నత రీతిగా నలంకృతము జేసి
సర్వభువన జన నయనోత్సవకరముగ
గౌరినిం దీర్చిదిద్దిరి కాంతలెల్ల |
జనని మేనకాదేవి రచన మొనర్చె
మలయజ కలిత కళ్యాణతిలకరేఖ |
జనకుడగు హిమక్ష్మాధర చక్రవర్తి
లలన కిడె లలాటమున లలామకమ్ము
భసితము మారె కస్తూరి భరితాంగ రాగసంపదగ
పసిమియేనికతోలు మారె పసిడియంచుల పచ్చడముగ
బుసకొట్టు భుజగము మారె భూషించు తార హారముగ
నొసటి నేత్రము మారె నాహ ! నూత్నదీప్త లలామకముగ
జూట మది శిరోవస్త్రమై శోభ నొసగ
బాలశశియె చూడామణిత్వమును పొంద
పెండ్లికొడుకయ్యె శంభుడు వేడ్కమీర
పెండ్లిపల్లకిగా మారె వృషభు డంత
-----------------------------------------------------------------------------------------
వివహవేదికా వర్ణనము
---------------------------------------------------------------------------------------
అమరగణమ్ము లెల్లయు " శివా " యనుచున్ జయపెట్టుచుండగా ,
యమునయు గంగయున్ గలసి యల్లన చామర వీచుచుండగా ,
రమయు నరుంధతీసతియు బ్రాహ్మియు హారతు లిచ్చుచుండ , స
ప్తమునులు దివ్యవేదవిదితమ్ముగ కార్యము లాచరించగా ,
ప్రమదముతోడ నిల్వ నిరుపార్శ్వములందున బ్రహ్మవిష్ణువుల్ ,
రమణుడు - శంకరుం డిక విరాజిలె చక్కని పెండ్లిబిడ్డడై
ప్రకట మంగళకర మధురవాద్యనిస్వనములతో
సకల బంధుహితులు రాగ , శంభు నెదురుకొనియె మే
నక | మరియు తుషార శైలనాధు డతని యమలపా
ద కమలముల నెలమి గడిగి దానమొసగె కన్యకన్
ప్రమథులు మంగళవాద్యముల్ మొరయింప ,
దిక్పతుల్ పుష్పవేదిక నమర్చ ,
నలుగిడె నా యరుంధతి వధూవరులకు |
కమలాతపత్రమ్ము కమల పట్టె |
ఆ కేశవాంభోరుహాసను లిరువైపు
నిలిచిరి శంభుని నికట మందు |
గీర్పతి మంత్రము లేర్పడ బఠియింప
గీర్వాణి కళ్యాణ గీతి బాడె |
గిరిజయు శివుడున్ దమయొక్క శిరముల పయి
ముత్తెముల తలంబ్రాలను పోసుకొనిరి
సేస లుంచెను దేవతాసిధ్ధగణము
శ్రీకరము మనోహరము నై త్రిజగములకు
పరగె వారి శుభంకర పరిణయమ్ము
వినిన చదివిన మోక్షమ్ము మనకు గలుగు
బాలచంద్రమౌళి . దీనభక్తపాల . శంకరా .
శూలపాణి . నాగభూష . శుభ్రదేహ . ఈశ్వరా .
నీలకంఠ . నిర్వికార . నిర్మలా . మనోహరా .
జాల మేల మమ్ము బ్రోవ జాలితో . మహేశ్వరా
* * * * * * * *
గురుమూర్తి ఆచారి గారు కళ్ళకు కట్టినట్లు పార్వతీపరమేశ్వరుల కళ్యాణమును వర్ణించారు. శుభాభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండికంది వారు :)
ఓ రెండు రోజుల ముందు గూఢోత్ముడు అంటే ఏమిటని కొచ్చెను మార్కు లేవదీసేరు :)
మొత్తం మీద ఇవ్వాళ్టి కి కొంత మేటరు చిక్కింది :) (అనుకుంటా :)
ఈ నా టపా చూడ గలరు :)
https://varudhini.blogspot.com/2019/03/blog-post.html
పృషోదరాదీని యథోపదిష్టమ్ !
జిలేబి
శ్రీరమణీమనోహర విచిత్రచ రిత్ర పవిత్రగాత్ర దు
రిప్లయితొలగించండిర్వారవికారహారహర ప్రాణపరాత్పరమారమార సం
హారతమఃపతంగసుగుణాకరశంకరపాహి, సేవితా
*"శ్రీరఘురామ ,;సద్భజన సేయఁ దగున్ శివరాత్రికిన్ దమిన్"*
[3/4, 06:14] Shankarji Dabbikar: పామరపండితసేవిత
రిప్లయితొలగించండికామితవరదాయకార్థకాంతుభజింతున్
రామార్చితార్తిహరు నభి
*"రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్"*
[3/4, 06:23] Shankarji Dabbikar: శ్రీమందాకినితలపై
హైమాదేహార్థభాగమందు జగంబుల్
సోమాదికండదండా
*"రామ ,భజన సేయుము శివరాత్రికి భక్తిన్"*
జైశ్రీరామ్🙏🏼
రిప్లయితొలగించండిఆర్యులారా! శుభోదయమ్.
మహా శివరాత్రి సందర్భముగా శుభాకాంక్షలు.
సమస్య.
రామ! భజన సేయుము శివరాత్రికి భక్తిన్.
పూరణకు నా ప్రయత్నము.
రాముఁడె సోముని భక్తుఁడు.
సోముఁడు రాముండునొకటె శోభిలఁ జేయన్
నీమముతో మెలగెడి శ్రీ
రామ! భజన సేయుము శివరాత్రికి భక్తిన్.
రాముఁడె సోముని భక్తుఁడు.
సోముఁడు రాముండునొకటె శోభిలఁ జేయన్
నీమముతో మెలగెడి శ్రీ
రామభజన సేయుము, శివ!
రాత్రికి భక్తిన్.
నమస్సులతో
చింతా రామకృష్ణారావు.
04 . 03 . 2019.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితమతమ తోచిన విధముగ
రిప్లయితొలగించండినమ శివ మదిలో పూనిక నిడుకొని తీరన్
తామస గుణమును వీడవిc
రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్.
3 వ పాదం ..విడి యవి రామభజన
రిప్లయితొలగించండిగా స్వీకరించగలరు.🙏
రాముడు ప్రణవంబును మరి
రిప్లయితొలగించండిసోముడు తారకము నెపుడు స్తుతియింతురుగా
భీమ,హరియు వేరా?శివ
రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్.
ఆకుల శివరాజలింగం వనపర్తి
వామార్ధదేహ గౌరిని
రిప్లయితొలగించండిసోమార్కానల నయనుని శూలాయుధుని
న్నేమారక నాస్వాత్మా
రామభజన సేయుము శివరాత్రికి భక్తిన్
చారువినీలగాత్రసువిశాలమనోహరనేత్రునిన్
రిప్లయితొలగించండిభూరివరప్రదాత్రురగభూషణు నొక్కనిగా దలంచుచున్
గోరి శివార్చనన్ సలుపి కూరిమి రామజయంతి రోజునన్,
శ్రీరఘురామసద్భజన సేయదగున్ శివరాత్రికి న్దగన్.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
రామ నవమిన శివార్చన
రిప్లయితొలగించండినేమానకుమా యెపుడును నేమరు పాటున్
నీమది హరిహర నిలయము
రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్
సోమేశుని శివుని భవుని
రిప్లయితొలగించండిభీమా శంకరుని హరుని విశ్వేశ్వరుడా
రామేశుని దలచుచు నభి
రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్.
భారము మోయు నీశ్వరుడు, బారము ముట్టగ జేయు భక్తితో
రిప్లయితొలగించండిజేరగ పాద సన్నిధికి, క్షేమము జూచెడు దైవమాతడే
తీరును మీదు బాధలిక దేహి యనన్, పరమేశు గొల్చుచున్
శ్రీరఘురామ!సద్భజన సేయఁ దగున్;శివరాత్రికిన్ దమిన్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిగౌరికిఁ దెల్పె శంకరుడు గాంచగ విష్ణుసహస్రనామపుం...
సారము రామశబ్దమయమై వెలుగొందుచునున్నదంచు , సం...
సారమునీదు వారలకు చక్కని తారకనామమద్దియే
శ్రీరఘురామ సద్భజన సేయఁ దగున్ శివరాత్రికిన్ దమిన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండి[దశరథుఁడు శ్రీరామునకు మహాశివరాత్రి పర్వదినమున పరమశివు నెట్లు స్మరింపవలెనో వివరముగాఁ దెలుపుచున్న సందర్భము]
"మీఱిన భక్తితోడుతను, మిక్కిలిగా మదిలో స్మరించుచున్,
జేరి సమీపమందుననుఁ జిత్తము నీశునిఁ జేర్చి నిత్యమున్,
గోరి ’నమఃశివాయ’ యని కూరిమి తోడుతఁ గొల్చుచున్ శివున్,
శ్రీరఘురామ! సద్భజన సేయఁ దగున్ శివరాత్రికిన్ దమిన్!"
భీమాపత్తులఁ గావ వి
రిప్లయితొలగించండిరామ మెఱుంగక యునిచి పరంధాము మదిన్
రామ నవమి పర్వదినము
రామ భజన సేయుము శివ! రాత్రికి భక్తిన్
దారుణ రాక్షసాంతకుఁడు ధర్మ రతైక విభుండు నేక స
ద్దార మనస్స్థితుండు ననృతద్విషుఁ డిద్ధర రామచంద్రుఁడే
యేరకి నిశ్చయమ్ముగను నిద్దిన మద్దిన మేల నిత్యముం
శ్రీరఘురామ సద్భజన సేయఁ దగున్ శివరాత్రికిం దమిన్
మానిని.
తొలగించండినిర్జర సంచయ నిత్య సమార్చిత నిర్గుణ భాసిత నీలగళా
దుర్జయ దోర్బల దుష్టపురత్రయ దుస్స్థితి కారక దుఃఖహరా
దుర్జన మానస దోషగుణాంతక ధూర్జటి నామక దుర్గ ధవా
తర్జిత భర్జిత తాపస రక్షక దైత్యసుపూజిత దండమయా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
పేరున చంద్రశేఖరుడు ప్రీతిని కాడొకొ విశ్వనాథుడే
వారి సుపుత్రుడే గదర బంగరు కొండడు రామచంద్రుడున్
కోరిక తీర నిర్వురికి కూరిమి మీరగ నొక్కవేటునన్:👇
శ్రీరఘురామ సద్భజన సేయఁ దగున్ శివరాత్రికిన్ దమిన్!
రిప్లయితొలగించండిరామనవమి దినమందున
రామభజన చేయుము,శివరాత్రికి భక్తిన్
కామహరుని మందిరమున
యామినిలో పూజ చేయ నఘములు తొలగున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముక్తి కలుగును దప్పక మూర్తి! నీకు
రిప్లయితొలగించండిరామ భజన సేయుము ,శివరాత్రికి భక్తిన్
బూజలునభిషే కమ్ములు భూరిజేయ
సిరియు సంపద లిచ్చును శివుడుమనకు
వారునువీరునాక పరివారము సైతము భక్తితోడుతన్
రిప్లయితొలగించండిశ్రీరఘురామ సద్భజన సేయదగున్ శివరాత్రికిన్దమిన్
శ్రీరమనాథుడున్మఱియు శ్రీసతి భర్తయు నేకరూపులే
యేరికిజేసినన్భజన నిద్దరిమూర్తులసేవయేయగున్
గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ ..
రిప్లయితొలగించండిభైరవు డాత్మశాంతి నిడి పారగ ద్రోలు వికార చిత్తముల్
కోరిన కోర్కుల న్నొసగు కోమల మానసు డాశివుండు సం
సారికి యాదిశంకరుని సన్నుతి క్షేమమొసంగు మిత్రమా
శ్రీరఘురామ ! సద్భజన సేయఁ దగున్ శివరాత్రికిన్ దమిన్
నామజపము వంటిది!శ్రీ
రిప్లయితొలగించండిరామ!భజనసేయుము!"శివరాత్రికిభక్తిన్
కాముని గాల్చినదైవము
సోముని గుడియందుదలచ?సూక్ష్మతలబ్బున్!
కామము మోక్షము పై శివ
రిప్లయితొలగించండినామము పెదవుల పయినిడి నాకరు ణామూ
ర్తు మదిని నిలిపి మరీ నవి
రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్
కోర్కె మోక్షము మీద శివుని నామము పెదవుల పైన ఉంచి ఆ కరుణామూర్తిని మదిలో నింపుకుని మరీ అవిరామంగా భజన చేయండి శివరాత్రి నాడు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్
సందర్భము: కార్తవీర్యార్జునుని సంహరించి వచ్చిన తన కుమారుడైన పరశురాముని చూసి ఎంతో నొచ్చుకొన్నాడు జమదగ్ని మహర్షి. మహారాజును మట్టు పెట్టినందుకు కలిగిన పాపాన్ని తొలగించు కోవడానికై తీర్థయాత్రలు చేసి రమ్మన్నాడు.
(పట్టపు రాజును జంపుట
కట్టలుకన్ విప్రు జంపుకంటెను పాపం
బట్టి ట్టనకుము నీ వీ
చెట్ట సెడన్ దీర్థ సేవ సేయుము తనయా!
భాగ..9 వ స్కం. 463 ప.)
ఇంకా ఇలా అన్నాడు.
"నాయనా! గంగలో మునిగితే.. కాశిలో విశ్వేశ్వరుని గొలిచితే.. పాపా లన్నీ పోతాయి. అక్కడున్న రోజుల్లో శివరాత్రి వస్తే భక్తితో భజన చెయ్యి."
తండ్రి మాట పాటించి పరశురాముడు ఒక సంవత్సరంపాటు తీర్థయాత్రలు చేసివచ్చాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
శ్రీ మృత్యుంజయుఁ గొలిచిన..
నా మందాకిని మునిగిన..
నఘము హరించుం
గా మరి! యా కాశిఁ బరశు
రామ! భజన సేయుము శివ రాత్రికి భక్తిన్
✒~డా.వెలుదండ సత్యనారాయణ
4.3.19
-----------------------------------------------------------
🌼🙏🌼నమః శివాయ
రిప్లయితొలగించండిరామ మహిమ దెలిపె శివుడు
హైమవతికి రామరామ యనిముమ్మారుల్
నీమది దలచిన శివమగు
రామభజన సేయుము శివరాత్రికి భక్తిన్
...గోపాలాచార్యులు,కర్నూలు
శంకర స్తుతి:
రిప్లయితొలగించండికందర్ప గాత్ర హర్తారం కామిత వర దాయినం
ప్రణమామి మహాదేవం హరం భక్త వశంకరమ్ ॥1॥
సదాశివం సతీనాథం గంగేశ్వరమ్ మహేశ్వరమ్
దేవాసుర గణారాధ్యం నమామి నంది వాహనమ్ ॥2॥
పూర్వోత్తర దిగధ్యక్షం హిమవన్నగ సంస్థితం
ప్రణమామి విరూపాక్షం వామార్థ స్థిత శైలజామ్ ॥3॥
సురాపగా సు మూర్ధానం సుర సంచయ పూజితమ్
నిజ భక్త జనాధీనం శుభప్రదం నమామ్యహమ్ ॥4॥
తాండవప్రియ దేవేశం దాక్షిణ్యాది గుణప్రభామ్
అంబరాంబర సద్గాత్రం ప్రణమామి త్రిలోచనమ్ ॥5॥
శూలాయుధ మహావీరం మాతంగ చర్మ ధారిణమ్
కాలాంతకం పురారాతిం నమామి విశ్వపాలకమ్ ॥6॥
సర్పకుండల సర్వజ్ఞం సుప్రతీకం సుదర్శనమ్
సువర్ణాక్షం స్వయంభూతం ప్రణమామి విషాంతకమ్ ॥7॥
క్షేమము గొన భువిపైనను రామభజన సేయుము, శివరాత్రికి భక్తిన్
రిప్లయితొలగించండిసోముని భజనలు సలిపిన నా ముక్కంటి దయతోడ హర్షము కలుగున్
కారణ జన్ముడై హరియె కల్పము నందు జనించె ధర్మమున్
రిప్లయితొలగించండిధారుణిఁ నిల్పనెంచి ఖలు దానవ మూకల ద్రుంచినట్టి యా
శ్రీరఘు రామ సద్భజన సేయదగున్, శివరాత్రికిన్ దమిన్
కారణ కారణమ్మె యగు కల్మష కంఠుని కొల్వగా వలెన్.
క్షేమము గల్గగ నిత్యము
రిప్లయితొలగించండిరామ భజన సేయుము,; శివరాత్రికి భక్తిన్
సోముని జప జాగారము
దామెవరెంతురొ హితమదిఁ దథ్యము గల్గున్