11, మార్చి 2019, సోమవారం

సమస్య - 2954 (కన్న కుమారుండె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కన్న కుమారుండె నా మగండని పల్కెన్"
(లేదా...)
"కన్న సుతుండె నా మగఁడు గాఁడె యటంచన మెచ్చి రెల్లరున్"

74 కామెంట్‌లు:

  1. కన్నియ లందరు కూడగ
    పన్నుగ శివరాత్రి నాడు పందిరి లోనన్
    చెన్నుగ మా కూతురు వెం
    కన్న కుమారుండె నా మగండని పల్కెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👌🏻👏🏻💐

      వెంకన్న గారి వియ్యంకుల వారికి శుభప్రాతఃకాల ప్రణామాలు
      🙏🏻🙏🏻😃

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఉదయం మీ యింటికి వచ్చి మిమ్మల్ని కలిసి కాసేపు మీతో ఆత్మీయంగా సంభాషించడం ఎంతో సంతోషాన్ని, తృప్తినీ ఇచ్చింది.

      తొలగించండి


  2. "పొన్నారి! నీ పతి యెవరు?"
    "అన్నన్నా అది తెలియనిదా యందరికిన్?"
    చెన్నుగ జిలేబి, "భళి వెం
    కన్న కుమారుండె నా మగండని పల్కెన్!"



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓహో!
      జిలేబి యంటే ప్రభాకరులవారి అమ్మాయా!
      🤣🤣🤣

      👌🏻👏🏻💐🙏🏻

      తొలగించండి


    2. వామ్మో ! ఇక్కడ మరో "లింకు" కుదిరి పోయిందా !!! హతోస్మి :)



      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. శిశుపాలుడే నీ మగండు అన్న రుక్మితో....

    అన్నా! యా శిశుపాలుని
    కన్నా పదివేల రెట్లు ఘనుడాతండే
    యన్నది రుక్మిణి, దేవకి
    "కన్న కుమారుండె నా మగండని పల్కెన్"

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    " అన్నులమిన్న ! నీ పతికి నందరినిన్ సమదృష్టి జూచుచున్
    మన్నన జేయునట్టి మహిమాన్వితసద్గుణమెట్టులబ్బెనో ?"
    యన్న., "నదేమి?త్వత్కులమునందు జనించినవాడు మామ ! నీ...
    కన్న సుతుండె నా మగఁడు గాఁడె" యటంచన మెచ్చి రెల్లరున్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. అట్లాంటి "త్వత్ " కలుపు మరో మహిమ జిలేబి వృత్తము లో "గను‌"డు :)


      జిలేబి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  5. సమస్య :-
    "కన్న కుమారుండె నా మగండని పల్కెన్"

    *కందం*

    నిన్ననె ముద్దుల చెల్లెలు
    తిన్నగ నా దరికి వచ్చి తెలిపెను ప్రేమన్
    అన్నా తప్పక యా సుం
    కన్న కుమారుండె నా మగండని పల్కెన్
    ........................‌‌✍చక్రి

    రిప్లయితొలగించండి


  6. ఆ ఇంట్లో యెవరూ యెవరికి తీసిపోరు :)



    "అన్నుల మిన్న! కంజముఖి!అంబుజలోచన! "చీటి" పేర్లతో
    మిన్నగ యాడువారలను మీరెటులన్ భళి కొల్లగొట్టిరో "?
    "టన్నుల కొద్ది యా గనుల టక్కుటమారిగ దోచి నట్టి వెం
    కన్న సుతుండె నా మగఁడు గాఁడె" యటంచన మెచ్చి రెల్లరున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. నిన్నటి లోకము నందున
    తిన్నగ పెద్దల పలుకులు తీరుగ నడచెన్
    నాన్నా వలచితి యావెం
    కన్న కుమారుండె నా మగండని పల్కెన్

    రిప్లయితొలగించండి
  8. చెలికత్తెలతో రుక్మిణీ మాత :

    కందం
    అన్నయ్య పూనుకొన నే
    నెన్నగ లేను శిశుపాలు నెటులైన హరిన్
    వెన్నుని గెలిచెద దేవకి
    కన్న కుమారుండె నా మగండని పల్కెన్

    రిప్లయితొలగించండి
  9. *అన్నులమిన్న రుక్మిణి తన యన్న రుక్మితో పలికిన మాటలుగా నూహించిన పద్యం*


    మిన్నగ లీలలు జూపిన
    వెన్నుడు, బృందా విహారి వృషనా శుండౌ
    కన్నడె యావసు దేవుని
    కన్నకుమారుండె నాకు మగండని పల్కెన్.

    రిప్లయితొలగించండి
  10. ఉ.మా.
    చెన్నుగ పూలమాలలను చెన్నుఁడు దాల్చక మున్నె దాల్చ నా
    కన్నియ గోద తా వలచి కన్నుల నిల్పుచుఁ గృష్ణరూపమే
    యెన్నగ విష్ణుచిత్తుడిది యేమని, దేవకి చారమందు మే
    *"ల్గన్న సుతుండె నా మగఁడుగాఁడె యటంచన మెచ్చి రెల్లరున్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చారమందు'...?

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారూ.
      🙏🏻🙏🏻

      చారము అనగా చెఱసాల గురువుగారూ.

      చారము : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
      సం. వి. అ. పుం.
      1. చెఱ;

      తొలగించండి
  11. నిన్నటి దాక పెండ్లియన నిప్పుడు నేలని బీరమాడి తీ
    వన్నులమిన్న మన్మధు వివాహము జేకొని తెవ్వరా వరుం
    గ్రన్నన జెప్పమన్న నయగార ము లొల్క భవద్ధవానుజున్
    *"కన్న సుతుండె నా మగఁడు గాఁడె యటంచన మెచ్చి రెల్లరున్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వరుం' అని డు ప్రత్యయం లేకుండా ప్రయోగించారు.

      తొలగించండి
  12. తన శీలాన్ని శంకించిన వారితో ఒకమగువ పల్కులు

    తిన్నగ జూడుము పోలిక
    హన్నా!యిటుబల్కదగునె నతివలతోడన్ ?
    వన్నెను రూపున దప్పక
    కన్నకుమారుండె నామగండని బల్కెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      తండ్రి కొడుకుల పోలికలను తీసుకొని చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
      "...దగునె యతివలతోడన్" అనండి.

      తొలగించండి
    2. కన్నులవిందుగా ననిట కంటికిరెప్పగా బెంచవారలే
      యెన్నటికైన నాయరువు నేమరగాదగు కార్యమే?దగ
      న్నున్నత వంశజుండనుచు,యుక్తమటంచును దల్లిదండ్రి దా
      కన్న సుతుండె నామగడుగాదె యటంచన,మెచ్చిరెల్లరున్ !

      కన్న =చూచిన సుతుండు = పెండ్లికుమారుడు
      అరువు =ఋణము

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! బహుకాలదర్శనం!!సవరిస్తాను.
      వృత్తపూరణకూడ పరిశీలించ ప్రార్ధన!

      తొలగించండి
  13. మన్నన పాండవు లడవులc
    నున్న సమయమున హిడింబి యున్నతు భీమున్
    తన్నాడె ముదముతొ కుంతీ
    కన్న కుమారుండె నా మగండని పల్కెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ముదముతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'కుంతీ కన్నకుమారుడు' దుష్టసమాసం అవుతుంది. "ముదమున కుంతియె" అనండి.

      తొలగించండి
    2. నమస్కారములు!
      కనీసం రోజుకొక్క పద్యమైనా వ్రాయాలని తపనతో ప్రయత్నిస్తున్నాను.
      పితృ సములైన మీరు సరిచేస్తారని తపన! సరి చేసుకొనుటకు ప్రయత్నిస్తాను. ధన్యుడను.
      🙏🙏🙏

      తొలగించండి
  14. ( సత్యభామ తన తల్లిదండ్రులతో బంధువులతో )
    " మన్నును గూరిమిన్ దినిన
    మానుష దేహుడు ; నమ్మువారలన్
    దిన్నగ బ్రోచు మాధవుడు ;
    తెల్లము గాని మహాస్వభావుడున్ ;
    మన్నిక దేవకీవసులు
    మంజులపుణ్యములన్ని పండగా
    కన్న సుతుండె నా మగడు
    గాడె ! "యటం చన మెచ్చి రెల్లరున్ .

    రిప్లయితొలగించండి
  15. అన్న పిలచి నీమది యం
    దున్నది యెవరని యడుగగ సిగ్గుపడుచు యా
    చిన్నది మాతలుడగు జ
    క్కన్న కుమారుండె నా మగండని పల్కెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సిగ్గుపడుచు నా చిన్నది మాతులుడగు...' అనండి.

      తొలగించండి
  16. వెన్నెల కాంతుల మెరిసెడి
    అన్నుల మిన్న యు మను వ యి హాయిగ నుండన్
    ద న్న డి గిన వారికి సుo
    కన్న కుమారుండు నా మగ oడని పల్కె న్

    రిప్లయితొలగించండి
  17. సన్నని నడుమున్గలిగిన
    నన్నెలతియె మొన్నదానునందరియెదుటన్
    నన్నా! వింటిరె భారతి
    కన్నకుమారుండెనామగండనిబల్కెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నెలతి' కాదు 'నెలత' అనండి.

      తొలగించండి
  18. అన్నెము పున్నెము నెరుగ
    న్నన్నా నామనవి మినుమ యనె రుక్మిణియే
    నిన్నెరిగిన వసుదేవుని
    కన్న కుమారుండె నా మగండని పల్కెన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    ఈతి బాధలతో సంద్ర మీదుతుండి
    చావు బ్రతుకుల మధ్యను సాగుచుండ
    నమరు లట్టుల జీవించ నగున దెటుల
    మరణమే లేనివారలు మనుజు లెల్ల ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'సంద్ర మీదుచుండి' అనండి.

      తొలగించండి


  19. ఏమండీ కంది వారు

    సంసృతాంధ్ర
    శతావధానం బాగా జరిగిందా ?

    విశేషాలేమిటి ?


    జిలేబి


    రిప్లయితొలగించండి
  20. వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్

    చెన్నుగ సక లామర సై
    న్యోన్నత పతి షణ్ముఖుండు నుగ్రుఁడు, వల్లీ
    సన్నుత నామయె, పార్వతి
    కన్న కుమారుండె నా మగండని పల్కెన్


    తిన్నగఁ జూడ నిప్పడుచు దేహ విలాసము నంచు రోయఁ దా
    సన్నముగన్ మనో జనిత సంశయ మెల్లయుఁ గాంత కంత వి
    చ్ఛిన్నము గాఁగ రుక్మిణినిఁ జేరి రతీసతి యీతఁ డవ్వ నీ
    కన్న సుతుండె నా మగఁడు గాఁడె యటం చన మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      'వల్లీ సన్నుత నామయె' ఇక్కడ అర్థం కాలేదు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      బహుకాల దర్శన భాగ్య మిచ్చారు.
      శ్రీ వల్లీదేవి దేవసేనలు కుమారస్వామి భార్యలు కదా. వల్లీ యను సన్నుతమైన నామము కల యామెయే చెప్పిన దని నా భావమండి.

      తొలగించండి
  21. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పున్నమి రేతిరిన్ మురిసి ముద్దుల కన్నియ బ్రాహ్మణత్వమున్
    తన్నుల నోపుచున్ వినక తాతల నవ్వల తల్లి మాటలన్:
    "జన్నవు ధారి డింపులుడు చక్కని సోనియ! షోకుగాడు నీ
    కన్న సుతుండె నా మగఁడు గాఁడె" యటంచన మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. మిత్రులందఱకు నమస్సులు!

    [తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోలుపోయి, మేనత్త యింటిలో పెరిగిన ఒక బాలిక, ఆ మేనత్తతో, తన పెండ్లి గురించి దిగులు వద్దని, ఆమె కన్నకొడుకునే తాను పెండ్లాడుతానని నలుగురి ముందు ధైర్యముగా తెలుపుతున్న సందర్భము]

    "చిన్నతనమ్ము నాకు! నిఁకఁ జేసెదరే మను వీ వయస్సునన్?
    గన్నటువంటివారు ననుఁ గానఁగ లేరు పరాసులౌటచేన్!
    మన్ననతోడఁ బెంచితివి మాన్య ననున్! మది నెంచ నత్త నీ
    కన్న సుతుండె నా మగఁడు గాఁడె?" యటంచన మెచ్చి రెల్లరున్!

    రిప్లయితొలగించండి
  23. కం.
    చిన్నారి! నీమగడెవరన
    "నన్నే ప్రేమించినట్టి నాబావయ్యే
    చెన్నై వైద్యుడు"నాయత్త
    కన్న కుమారుండె నా మగండని పల్కెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, మూడవ పాదాలలో గణదోషం. "చిన్నీ! నీ మగ డెవరన.... చెన్నై వైద్యుం డత్తమ। కన్న..." అనండి.

      తొలగించండి
  24. అన్నువగాగదాననియెయాదివరాహులరామలక్ష్శికి
    న్గన్నసుతుండెనామగడుగాడెయటంచనమెచ్చిరెల్లరు
    న్గన్నువపండుగాయెగదకాంచగమిమ్ములనెల్లవేళల
    న్జెన్నువమీరయుండుడికజీవితమంతయురాగసంపదన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పదాల మధ్య వ్యవధానం ఉంచండి.

      తొలగించండి


  25. Seetha Deviమార్చి 11, 2019 10:00 AM
    కన్నులవిందుగా ననిట కంటికిరెప్పగా బెంచవారలే
    యెన్నటికైన నాయరువు నేమరగాదగు కార్యమే?దగ
    న్నున్నత వంశజుండనుచు,యుక్తమటంచును దల్లిదండ్రి దా
    కన్న సుతుండె నామగడుగాదె యటంచన,మెచ్చిరెల్లరున్ !

    కన్న =చూచిన సుతుండు = పెండ్లికుమారుడు
    అరువు =ఋణము

    రిప్లయితొలగించండి
  26. నిన్ననె చెప్పితి గాదే
    నన్నభిమానించు వాడు నరసింహుండే
    నాన్నా! నీ ప్రియ సోదరి
    కన్నకుమారుండె నా మగండని పల్కెన్

    రిప్లయితొలగించండి
  27. అన్నను గాంచి రుక్మిణి మహాత్ముడె యౌ శిఖిపింఛమౌళి యా
    వెన్నునకేమనస్సును నివేదన జేసితి గాదె నింకనా
    కన్నని దప్పవేరొకని గాంచగ లేనిక నట్టి దేవకీ
    కన్నసుతుండె నామగడెయటంచన మెచ్చిరెల్లరుల్

    రిప్లయితొలగించండి
  28. మిన్నుయు మన్నుయు ఏకము
    యన్నట్లు విరిగిన శైవ ధను జూసిన యా
    యన్నుల మిన్న ధశరధుడు
    కన్న కుమారుండె నా మగండని పల్కెన్

    ఆకాశము భూమి ఒకటైపోయాయా అన్న శబ్దం చేస్తూ విరిగిన శివ ధనుస్సు చూసి ఆ కన్య అనగా సీతాదేవి, దశరధుడు కన్న కుమారుడైన ఈ రఘురాముడే తన భర్త అని పలికింది.

    రిప్లయితొలగించండి
  29. ఉత్పలమాల
    చిన్నతనంబునుండి మనసిచ్చితి మీరలు నిశ్చ యించగన్
    జెన్నుగ నాకునచ్చె నిది జెప్పిన ప్రేమలటంచు విద్యపై
    సన్నగిలంచు దృష్టి మది సైచితి సత్యమిదమ్మ బావ నీ
    కన్న సుతుండె నా మగఁడు గాఁడె యటంచన మెచ్చి రెల్లరున్

    (నీకు + అన్న = నీ కన్న)

    రిప్లయితొలగించండి


  30. అన్నుల మిన్నౌ రుక్మిణి
    యన్నగధరునిమనమందు నారాధించన్
    అన్నయు కాదన దేవకి
    కన్నకుమారుండె నామగండని పల్కెన్.

    : రెండవపూరణ

    పన్నగము పైన నాట్యము
    మిన్నగ చేయగ భయమున మిత్రులు బారన్
    మన్నన చూపిన దేవకి
    కన్నకుమారుండె నామగండని పల్కెన్.

    రిప్లయితొలగించండి
  31. పున్నమి రేయిన విబుధులు
    యెన్నెన్నో ముచ్చటలను యెన్నగజదువన్
    మన్నన నొందెను పూరణ
    కన్న కుమారుండె నా మగండని పల్కెన్!!

    రిప్లయితొలగించండి
  32. చిన్నామీతాతవనగ
    పున్నమి లావెలుగునింప పుట్టితివయ్యా
    తన్నిక జూతువుమనవడ
    కన్నకుమారుండె నామగడనిపల్కెన్(అమ్మమ్మ తమాషాగాపలికినమాట)

    రిప్లయితొలగించండి
  33. నిన్నటి దాకఁ బిల్చినను నేరము జేసిన వానినట్లుగా
    నెన్నుచు నొక్క మాటకుఁ దనెప్పుడుఁ బల్కని కోడలే సుమా!
    ఉన్నత మద్దిరాల పురుషోత్తమ వంశపు శ్రీనివాసులే
    "కన్న సుతుండె నా మగఁడు గాఁడె యటంచన మెచ్చి రెల్లరున్"
    ==================================
    రెండవ పూరణ
    ==========
    ఉన్నత భావంబులతో
    నన్నగ స్త్రీలందరికి సహాయముగా తాఁ
    దన్నుగ నిల్చెడి సత్యము
    "గన్న కుమారుండె నా మగండని పల్కెన్"

    రిప్లయితొలగించండి
  34. నిన్నటి దాకఁ బిల్చినను నేరము జేసిన వానినట్లుగా
    నెన్నుచు నొక్క మాటకుఁ దనెప్పుడుఁ బల్కని కోడలే సుమా!
    ఉన్నత మద్దిరాల పురుషోత్తమ వంశపు శ్రీనివాసులే
    *"కన్న సుతుండె నా మగఁడు గాఁడె యటంచన మెచ్చి రెల్లరున్"*
    =============
    రెండవ పూరణ
    ==========
    ఉన్నత భావంబులతో
    నన్నగ స్త్రీలందరికి సహాయముగా తాఁ
    దన్నుగ నిల్చెడి సత్యము
    *"గన్న కుమారుండె నా మగండని పల్కెన్"*

    రిప్లయితొలగించండి