28, మార్చి 2019, గురువారం

సమస్య - 2970 (గౌతమీ స్నానము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గౌతమీ స్నాన మొనరించెఁ గాశి కేఁగి"
(లేదా...)
"కుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి జరిపెన్ గోదావరీ స్నానమున్"

47 కామెంట్‌లు:



  1. బయలు దేరి దేశాటన భక్తిగాను
    గౌతమీ స్నాన మొనరించెఁ గాశి కేఁగి
    గంగలో మునిగె జిలేబి కర్మ ఫలము
    ల సరి జేసుకొనంగ చాలమిని వీడి!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      స్నాన మొనరించె, అని ఒక కామా పెడితే ఇంకా బాగుంటుంది.

      తొలగించండి
  2. ప్రాతఃకాల కిట్టింపు:

    వ్రతమున్ సల్పగ బాపనయ్య నదిలో పాదమ్ము జారంగ హా!
    బ్రతుకే చాలునటంచుచున్ తలపుతో ప్రార్థించి పర్వెట్టె సై
    కుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి;...జరిపెన్ గోదావరీ స్నానమున్
    సతితో చెంబున నీళ్ళుముంచి వడిగా శాస్త్రీయమౌ రీతినిన్ :)

    రిప్లయితొలగించండి


  3. కతచేసెన్ తన యవ్వనమ్ము జతగా కార్కశ్యమే మౌఢ్యమై
    పతనంబాయెను జీవితమ్ము శివుడిన్ ప్రార్థించె నాజీవియే
    కుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి, జరిపెన్ గోదావరీ స్నానమున్,
    జతగా భక్తులు చేర ద్రిమ్మరులుగా జాబాలురుల్ తోడుగాన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. రాజమండ్రి లోన దిగి నే రమ్యమైన
    గౌతమీ స్నాన మొనరించెఁ,గాశి కేఁగి
    శంకరుని జూసి గంగలో జలక మాడి
    నాను, విజయ వాటిక నేను జేరి
    కృష్ణ వేణిలో మునిగితి ,తృష్ణ తీరె
    ననుచు పలికెనొకడు తన తనయ తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడు నదుల స్నానానికి చెందిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నేను 'ఒనరించితిని' అనడం సాధువు కదా? సమస్యలో 'ఒనరించె' అని ఉన్నది. అన్వయం కుదరదు. సవరించండి.

      తొలగించండి
  5. తీర్ధ యాత్రలు చేయంగ తెరలు తొలగె
    భార్య వెంబడి పరుగిడి భక్తి గాను
    గౌతమీ స్నాన మొనరించెఁ , గాశి కేఁగి
    గంగ లోమునిగి తికొంగు కలిపి మురిసి

    రిప్లయితొలగించండి
  6. (నూట యాభై యేండ్ల క్రితం కాశీయాత్ర చేసి మొదటి యాత్రాగ్రంథం
    రచించిన ఏనుగుల వీరాస్వామి }
    దక్షిణపు గంగగా ఖ్యాతి దనరునట్టి
    గౌతమీస్నాన మొనరించే ; గాశి కేగి
    యుత్తరపు గంగ విఖ్యాతి నురవడించు
    వినుతభాగీరథిన్ మున్గె వీరసామి .

    రిప్లయితొలగించండి
  7. భక్తి భావాన వెడలి యు భార్య తోడ
    గౌతమీ స్నాన మొనరించె ; గాశి కేగి
    విశ్వ నాథుని దర్శించి విధి గ తాను
    గంగ లో ముని గెను పాప కర్మ తొలగ

    రిప్లయితొలగించండి

  8. ఆటవిడుపు for change :)
    (అంకితం జీపీయెస్ వారికి )


    కతలన్ చెప్పెను మోడి పై విడువకన్, కైమోడ్చె మిన్నేటికిన్
    కుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి, జరిపెన్ గోదావరీ స్నానమున్,
    జతకాంగ్రేసు జనాళి జాల్మలులటన్ జైజై యనంగా భళా
    రతనంబీవెయనంగ రాహు లుని సారంగాంకుడే నాంధ్రలోన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ...

    సతతామ్నాయవిధానచిత్తుడు నదీస్నానమ్మె పాపౌఘని...
    ష్కృతికిన్ మార్గమటంచు నమ్మి మది *గంగేచాది* మంత్రమ్మునన్
    కృతసంకల్పవిధిన్ సమస్తనదులన్ కీర్తించి పూతుండుగాన్
    కుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి జరిపెన్ గోదావరీ స్నానమున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రశస్తమైన పూరణండీ!నమస్సులు!

      తొలగించండి
    2. శ్రీమతి సీతాదేవి గారికి.. శ్రీ ప్రభాకరశాస్త్రి గారికి నమోవాకములు 🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
  10. వేంకటేశుడనే భక్తుని కథ గౌతమి అనే అమ్మాయికి చెప్పడం

    వినుము!పావనగంగలో మునుకలిడుచు,
    గౌతమీ! స్నానమొనరించె కాశికేగి
    వేంకటేశుడు, నిజసతి వెంటరాగ
    విశ్వనాథుని బూజించె వేడ్కమీర!

    రిప్లయితొలగించండి
  11. "గోదావరి" అనే పేరు గల మిత్రురాలితో ఒక గృహిణి

    అతిభక్తిన్ ధర దైవధామము లనాయాసంబు దర్శించుచున్
    నతు లర్పించుచు మ్రొక్కొసంగ నట పుణ్యస్నానముల్ జేసి, తా
    ప్రతిమాసంబొక క్షేత్రమట్లు నొకడా భక్తుండు నేడట్లుగా
    కుతుకం బొప్పగ కాశికేగి జరిపెన్, గోదావరీ! స్నానమున్.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురం, హైదరాబాద్.

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    తీర్థ యాత్రలు జేయుచు దిరిగితిరిగి
    భద్రగిరిధాము నర్చింప భక్తు డొకడు
    గౌతమీ స్నానమొనరించె .కాశికేగి
    శంకరుని గొల్వ గంగలో స్నానమాడె.
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  13. ధనము దర్పము గల్గిన దాను యొకతె
    గౌతమీ స్నానమొనరించె గాశి కేగి
    దుందుభీ తీరవాసుని దురిత హరుని
    నామ మహిమ హితముగాదె నారసింహ!

    దుందుభి - కృష్ణ ఉపనది
    ఆ నదీ తీరంబున మా పితృదేవులచే ప్రతిష్ఠితంబగు నృసింహాలయము గలదు.

    రిప్లయితొలగించండి
  14. డ.పిట్టా సత్యనారాయణ
    అమ్మలక్కల ముచ్చట్ల కంతు గలదె
    కన్నకొడుకుల గొప్పల గతిని దెలుప
    "నమెరికానుండి మావాడు అట్లె వచ్చి
    గౌతమీ స్నాన మొనరించె గాశి కేగి"

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా సత్యనారాయణ
    అతి దారిద్ర్యము మాటలందు గలదే ఔన్నత్యమున్ జూపగన్?
    జతనంబేమియులేని పాట మెలగన్ సాగేను భూపాలమై
    మతి దప్పెన్గద మాదు తాత యపుడే మంచంబునన్ బాడుచున్
    కుతుకంబొప్పగ కాశికేగి జరిపెన్ గోదావరీ స్నానమున్
    (మంచంలోనే ప్రాతఃకాలవేళఅన్ని తీర్థ ప్రదేశములను చుట్టి వచ్చినానని"భూపాల"మనే పాటను పూర్వకాలంలో పాడేవారు.భావనయే "భక్తి"కదా!)

    రిప్లయితొలగించండి
  16. వావిరియగు రాజమహేంద్ర వరము కేగి
    గౌతమీ స్నాన మొనరించె: గాశి కేగి
    గంగయందు మునిగి తీర్థకముల యాత్ర
    పూర్తిగావించె, తప్పక ముక్తినొందు

    రిప్లయితొలగించండి
  17. ధనము నాశించి ప్రజలను దారిగాచి
    దోపిడీ లెన్నొ జేసిన ధూర్తుడతడు
    వయసు డిగిననాడందరువదిలి పోవ
    పాప పరిహారమనుచును భయము నొంది
    గౌతమీ స్నాన మొనరించెఁ గాశి కేఁగి!!

    రిప్లయితొలగించండి
  18. రాజమండ్రి కేగి యొకడు పూజ సేయ
    గౌతమీ స్నాన మొనరించెఁ ; గాశి కేఁగి
    విశ్వ నాథుని వీక్షింప వేగిరముగ
    గంగ మునిగియు ధన్యత గాంచె గాదె?

    రిప్లయితొలగించండి
  19. పాపముల దొలగించునుబ్రతియొకరికి
    గౌతమీస్నాన,మొనరించెగాశికేగి
    పరమ పావన గంగలో పత్నితోడ
    నీటమునుగుచు రామయ్య నీరమిచ్చె

    రిప్లయితొలగించండి
  20. మిత్రులందఱకు నమస్సులు!

    [కాశీ నెడఁబాసిన వ్యాసుఁడు, ద్రాక్షారామ నామకంబైన దక్షిణ కాశిలోని భీమేశ్వరుని దర్శింపఁగోరి, తత్స్వామ్యభిషిక్తతచేఁ బవిత్రమైనదియు, భాగీరథి తుల్యయు, దక్షిణ గంగయు నైన గోదావరి నదిలో స్నానమాడిన సందర్భము]

    పతితుండై శివుఁ బాసి, దక్షిణపు దీవ్యల్లింగ సుక్షేత్రమున్
    మతిలో సంస్మరణమ్ము సేయుచు, వెసన్ మందాకినీ తుల్య నా
    సతతాస్రావను మున్గఁ గోరియును, వ్యాసర్షీంద్రుఁ డాత్రమ్మునన్
    గుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి, జరిపెన్ గోదావరీ స్నానమున్!

    రిప్లయితొలగించండి
  21. కాశి కాన్నపూర్ణ సమేత కాలకంఠ
    దర్శనమ్ముఁ జేయఁగ నమితంపుఁ బ్రీతిఁ
    బుణ్య గంగావగాహము, మున్న చేసి
    గౌతమీ స్నాన మొ,నరించెఁ గాశి కేఁగి


    సితదే హాసిత గాత్ర భూతపతి కాశీనాథ విశ్వేశ్వ రా
    యత పాదద్వయ వారిజద్యుతి వికాసాంభోధి సద్యఃఫ లా
    తత పుణ్యప్రద భక్త పాపచయ విధ్వంసేద్ధ గంగా నదిం
    గుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి జరిపెన్ గోదావరీ! స్నానమున్

    రిప్లయితొలగించండి
  22. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కతలన్ చద్వగ బాపనయ్య మృతమౌ కాశీని భవ్యమ్మనన్
    వ్రతమున్ సల్పుచు మున్గగాను నదిలో పాదమ్ము జారంగ హా!
    బ్రతుకే చాలునటంచుచున్ తలపుతో ప్రార్థించి పర్వెట్టె సై
    కుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి;...జరిపెన్ గోదావరీ స్నానమున్,
    మతిలే కుండగ కాలుజారి మృతుడై మాయెమ్మయెన్ వార్ధిలో!

    రిప్లయితొలగించండి
  23. సతితోనేగినరాముడయ్యెడలదాస్నానంబునాగంగలో
    గుతుకంబొప్పగగాశికేగిజరిపెన్ ,గోదావరీస్నానమున్
    సతితోగూడుచుజేయుచోగలుగునేసాయుజ్యంబెక్కాలమున్
    బతితుల్బొందుదురైహికంబులగుబబ్బంబుల్సదామున్గుచోన్

    రిప్లయితొలగించండి
  24. భద్ర సోమలో స్నానమ్ము పాపహరము
    ముక్తి ప్రదమంచు తెలుపగా మోక్షగామి
    సజ్జునుడని పొగడదగు మజ్జనకుడు
    గౌతమీ, స్నానమొనరించెఁ గాశి కేఁగి.

    రిప్లయితొలగించండి
  25. కనుచు రాజమహేంద్రిని గన్నులార
    కోటిలింగాల రేవున కుతపుడొకడు
    గౌతమీ స్నానమొనరించె, కాశి కేగి
    గంగలోమునిగి శివుని గాంచె నతడు!!!

    రిప్లయితొలగించండి
  26. గతి నీవే కదా విశ్వనాథ యిలలో కారుణ్య వారాశి దు
    ర్గతులం బాపగ నిన్ను జేరదగు మార్గంబిచ్చి యంత్యాన స
    ద్గతులం జూపగ నంచు వృద్ధు డదె తా దారా సమేతమ్ముగా
    కుతుకంబొప్పగ గాశికేగి జరిపెన్ గోదావరీ స్నానమున్.

    రిప్లయితొలగించండి
  27. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    'సైనికార్చన' పుస్తకం డిటిపి పనిలో వ్యస్తుడనై మీ పూరణలను సమీక్షించలేకున్నాను. మరొక రెండు రోజులు ఇదే పరిస్థితి... మన్నించండి.

    రిప్లయితొలగించండి
  28. పండుగ దినము లందున నిండు సభన
    కనులఁ గట్టిన రీతిగఁ గథను జెప్పి
    తనదు కమ్మని మధుర గాంధర్వ గాన
    గౌతమీ స్నాన మొనరించెఁ, గాశి కేఁగి

    రిప్లయితొలగించండి
  29. రాణ్మహేంద్రవాస్తవ్యుడు బ్రాహ్మణుండు
    *"గౌతమీ స్నాన మొనరించెఁ; గాశి కేఁగి"*
    తీర్థయాత్రాప్రశస్తి దైర్థికుడొకండు
    నుడవవినితానమాడిమృడుడిని మ్రొక్కె

    రిప్లయితొలగించండి
  30. సతతారాధన ,తీర్థయాత్ర ,హితసౌజన్యుండు ,పుణ్యాత్ముడౌ
    నతశీలుండును ,గర్మనిష్ఠుడు ,సదానందుండు బిండోదకాల్
    *"కుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి జరిపెన్; గోదావరీ స్నానమున్"*
    సతిసీతాపతి ప్రీతిజేసిమరలెన్ సద్గోష్ఠి దీపింపగా

    రిప్లయితొలగించండి
  31. పతితుండొక్కడు బావనాపగల జాజ్వల్యప్రభావంబులన్
    స్తుతతీర్థుంజనిగౌతమీనది,మహాస్రోతస్వినీగంగికన్
    వెతలన్నూడ్వ గమించిగొల్చి రచనన్ బేర్మిన్ లిఖించెన్నిటుల్
    *"కుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి జరిపెన్ గోదావరీ స్నానమున్"*

    రిప్లయితొలగించండి
  32. గౌతమి,సుమలు యాత్రకు గలసివెళ్లి
    డిల్లి,మధుర గయ,ప్రయాగ మల్లిమల్లి
    విశ్వనాధునిదర్శించ విధిగవెళ్లి
    గౌతమీ స్నానమొనరించె కాశికేగి

    రిప్లయితొలగించండి
  33. *కావేరి తన చెల్లెలు గోదావరికి తన మామ కాశీలో గంగా స్నానమాచరించాడని చెబుతున్నట్టుగా నూహించి*

    వ్రతముల్ మెండుగ జేయీనట్టి సఖు డాహ్వానింపగా భార్యనే
    జతగా గైకొని సాగెనాతడట విశ్వాత్ముండఁ దర్శించుచున్
    నతి ముఖ్యంబది గంగ స్నానమని మోక్షార్థుల్ వచింపన్నటన్
    కుతుకంబొప్పగ కాశికేఁగి జరిపెన్, గోదావరీ! స్నానమున్

    రిప్లయితొలగించండి
  34. 🙏🏼జైశ్రీరామ్🙏🏼
    ఆర్యులకు శుభోదయమ్💐.

    కుతుకంబొప్పగ కాశికేగి జరిపెన్ గోదావరీ స్నానమున్.

    సమస్యకు.. నా పూరణ.

    సతమున్ దక్షిణ కాశినాఁ బరగు దక్షారామ భీమేశ్వరుం
    డితఁడే. గౌతమి గంగయే. కొలిచినన్ హృద్యంబటంచున్ మదిన్
    మతిమంతుండగు వ్యాసుడెంచి శివునింబ్రార్థింపఁగా కోరుచున్
    కుతుకంబొప్పఁగ కాశికేగి, జరిపెన్ గోదావరీ స్నానమున్.

    🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼

    రిప్లయితొలగించండి
  35. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  36. దక్షరామము కాశిగ దక్షిణాన
    భీమశంకరుడంబతో వెలసె, జనులు
    హర హర, మహదేవ, హర ఓం యనుచు, సప్త
    గౌతమీ స్నానమొనరించెఁ గాశి కేఁగి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ద్రాక్షారామపు ఆలయ సమీపంలోని కోనేరును "సప్త గౌతమి" అంటారని విన్నట్లు గుర్తు..

      తొలగించండి