2, మార్చి 2019, శనివారం

సమస్య - 2945 (బెదరుచుఁ గార్యముల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు"
(లేదా...)
"బెదరుచుఁ గార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్"
(ఈరోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)

87 కామెంట్‌లు:

  1. బెదరగ నాంజనేయునకు వీర్యము నిచ్చెను జాంబవంతుడే
    బెదరగ కుంభసంభవుడు వీరున కిచ్చెను సూర్యమంత్రమున్
    బెదరుచు బంధుహత్యకట వీరుడు పార్థుడు గీత దెచ్చెగా
    బెదరుచు కార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్

    సూర్యమంత్రము = ఆదిత్య హృదయం

    రిప్లయితొలగించండి
  2. చెదరని కార్యదీ క్షతను చేకొని ముందుకు సాగి పోయినన్
    వదలని బంధముల్ మిగుల బాధను ముంచిన సాహసం బునన్
    ముదముగ భోగ భాగ్యముల మోహము నందున మోసమే యగున్
    బెదరుచు కార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్

    రిప్లయితొలగించండి


  3. పదపద వయ్య పండితుడ ఫక్కున నవ్వుదు రెల్లరున్ వినన్!
    సదనము లోన నిట్లు కవి శంకర పల్కుట మేలకో నెటుల్
    బెదరుచుఁ గార్యముల్ విడుటె విజ్ఞత? కల్గు జయంబు లెల్లెడన్
    నదరక చేయ యత్నముల నమ్మకమున్ గొని దీటుగా సఖా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...ఏలకో యెటుల్' అనండి. 'నదరక'...?

      తొలగించండి
  4. పదుగురి మేలొనర్చ దగు భావన తోడను ధర్మ మార్గమున్

    వదలక సాగుమోయి యది భారమటంచు దలంప బోక సే

    యదగునటంచెఱంగుమిక, హానిని గూర్చెడధర్మ మైనచో

    బెదురుచు కార్యముల్ విడుటె విజ్ఞత, కల్గు జయంబు లెల్లెడన్.

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    బృహన్నలతో....

    హృదయమునందు భీతి యది యేలనొ ? తోలుము స్యందనమ్ము , నా
    మది ధృతి పూర్ణముత్తరకుమారుడనంచు రణమ్ముఁ జేరి , యా...
    పద గమనించి , పల్కెనిటు పారుట ధీరునకొప్పునొక్కచో
    బెదరుచుఁ గార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబులెల్లెడన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  6. హృదయము బల్కు వాస్తవము లెంచక భీతియు మౌఢ్య మందుచున్
    చెదరిన మానసమ్ము గొని చింతల, శంకల యూబి లో పడన్
    బెదరుచు కార్యముల్ విడుటె విజ్ఞత! కల్గు జయమ్ము లెల్లెడన్
    సదమల చిత్తమందు కడు చక్కని వ్యూహము రూపు దాల్చగన్!

    రిప్లయితొలగించండి
  7. దుష్ట కార్యము లందున దొరలు కంటె
    మొండి పట్టున తలదూర్చి మోస బోవ
    తగదు , సామ్య వాదము తరలి వెడల
    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  8. ఒద రవినీతినన్ నిలచి - యొప్పుగ జెప్పిన దేశ భక్తి తో
    బెదరుచు కార్యమున్ విడుట - విజ్ఞత గల్గు, జయమ్ము లెల్లెడన్
    చెదరిన శ్వాశ నిక్కముగ - చేరును కాయముతోడ కీర్తియున్
    పదిలము కీర్తి చంద్రికలు - భావితరాలను, పుత్రపౌత్రులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒద రవినీతినిన్...' అనండి.

      తొలగించండి


  9. ఆకాశవాణి వారికి పంపినది


    అదియిది యన్ని నీదు తలపైన ధురంబుగ నెత్తుకొంచు నీ
    మది కలగుండవన్ బతికి మాడుట గొప్పయకో తలోదరీ?
    కుదురుగ యోచనల్ గనుచు కోవిద, మచ్చిక కాకపోయినన్
    బెదరుచు కార్యముల్ విడుటె విజ్ఞత, కల్గు జయంబు లెల్లెడన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      తలపైన... 'తలపు + ఐన' అని ఉంటే యతి సరిపోతుంది. కాని 'తల + పైన' అనుకుంటే యతి కుదరదు.

      తొలగించండి
  10. పదునగు భావనల్ విరియ పద్ధతిగా ప్రతి కార్యమున్ సదా
    వదలక ధర్మమార్గమును బ్రాణముఁ బెట్టుచు జేయగావలెన్
    కుదురుగఁ జేయలేనపుడు గూలుచు నుండగ నేమి చేసినన్
    *"బెదరుచుఁ గార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్"*

    రిప్లయితొలగించండి
  11. మనుజునకు చెడుతలపులు మదికి వచ్చు
    నప్పుడప్పుడు వెంటనె యట్టిపనులు
    సలుపక కలుగు పర్యవసాన మెరిగి
    బెదరి కార్యముల్ విడుచుట విజ్ఞతయగు

    రిప్లయితొలగించండి
  12. పాప మౌను నపహరించ పరుల ధనము

    మనము నైన తలచ రాదు మగువ పొందు,

    పరుల దూషణ మిలలోన పనికిరాదు,

    యముడు చేయు చుండును గణణము సతతము

    పాప కార్యముల్,యమపురి బాధ బాప

    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు"

    రిప్లయితొలగించండి
  13. విధిగ సఖీయమౌ పలుకె వేదముగా ప్రతి భర్తకున్ సదా
    మదిగొని యాలిమాట పతి మార్దవ మానస శాంతరూపుడై
    వదరక చేయగావలెను! వద్దని కన్నుల నెఱ్ఱ జేయగా
    "బెదరుచుఁ గార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్"

    రిప్లయితొలగించండి
  14. ( దేశస్వాతంత్ర్యంకోసం అహింసామార్గదర్శకుడు గాంధీజీ)
    సదమలధర్మమూర్తియును
    జారుతరోన్నతమూర్తి గాంధిజీ
    మదమయు లాంగ్లపాలకుల
    మానసరీతుల మార్చి పంపగా
    చెదరని సత్యదీక్షలను
    జేకొనె ; బాపుజి యట్లు హింసకున్
    బెదరుచు గార్యముల్ విడుటె
    విజ్ఞత గల్గు జయంబు లెల్లెడన్ .

    రిప్లయితొలగించండి
  15. అదనుఁదలంచి మానసమునందున గాంచి యపార నష్టమున్
    బెదరుచు కార్యముల్ విడుట విజ్ఞత, కల్గు జయంబు లెల్లెడన్
    సదమల బుద్ధితో తలచి చక్కని వ్యూహము పన్ని, మూర్ఖతన్
    వదలి చరించుచున్ పనుల పద్ధతితో నొనరించ పృథ్విపై

    రిప్లయితొలగించండి
  16. సవరించిన పూరణ
    దుష్ట కార్యము లందున దొరలు కంటె
    మొండి పట్టున తలదూర్చి మోస బోవ
    తగదు , సౌమ్యత వాదమున్ తరలి వెడల
    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు

    రిప్లయితొలగించండి
  17. అలవికాని సమయమందు ననవరతము
    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు
    తగిన కాలము కనుగొని తద్దయు దృతి
    పనులను సలిపి నప్డు సత్ఫలితమొదవు

    రిప్లయితొలగించండి
  18. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు"

    సందర్భము: కర్మ ఫల త్యాగం చేయా లని గీత చెబుతోంది. కర్మలను మానివేయా లని కాదు. ఒకవైపు కర్మఫలత్యాగం చేస్తూ మరోవైపు భగవత్ సమర్పణగా యథావిధిగా కర్మల నాచరిస్తూ వుంటే ఏ కర్మ బంధమూ కలుగ దని అంతరార్థం.
    బంధాలు తొలగా లంటే కర్మలు మాని వేయా లని కాదు. బద్ధకస్తుల కా విధంగా తోచడంలో ఆశ్చర్యం లేదు.
    ఒక గీతా ప్రవచనం విన్న సోమరి అలాగే భావించాడు మరి!
    ఫలం కోరకుండా పని చేయడానికి చేతకాక "పనులే వదలివేస్తే సరి!" అని ఆతడు పొరపాటుగా అర్థం చేసుకున్నాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "ఫలముఁ గోరక కలుగదు బంధ మెప్పు"

    డను ప్రవచనము సోమరి విని యనుకొనె...

    "ఫలముఁ గోరఁ గలుగుఁ గర్మ బంధము గద!

    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    2.3.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  19. కదనమునందునన్ దనదు కార్ముకమున్ విడి వైరిజంపగా
    బెదరుచు కాృర్యముల్ విడుటె విఙ్ఞత? కల్గు జయంబులెల్లడ
    ల్లదనునుజూసి మార్కొనగ నస్త్రబలంబున గ్రమ్మినల్గడల్
    పదునగు శస్త్రయూధమున వ్రక్కలుసేయ నరాతిసైన్యమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జయంబు లెల్లెడ। న్నదనును...'

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి


  20. అదరక సర్వ కార్యముల హాయిగ జక్కగ జక్కబెట్టగన్

    పదుగురి మెప్పు బొందెదవు; వాస్తవ మిద్దియె మానవోత్తమా!

    హృదయము నందు నిల్పి యిది కృత్య మొనర్చుము; నమ్మ కిట్లనన్

    "బెదురుచు కార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లడన్"


      ---ఆకుల శాంతి భూషణ్

                          వనపర్తి

            

    రిప్లయితొలగించండి
  21. కీడునెంచిc యుత్తరుడు కిందకు దిగి
    "బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు"
    నని దలపగ ధీరత నర్జునుడిక
    జీల్చెనుc గౌరవ సేనను సీమc దరుమ

    - యజ్ఞేశ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని మీ మూడు పాదాలలో గణదోషం. నా సవరణ.....

      కీడు నెంచి యుత్తరుడు దా క్రిందకు దిగి
      బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు
      ననుచు దలపగ ధీరత నర్జునుండు
      జీల్చెఁ గౌరవ సేనను సీమ దరుమ.

      తొలగించండి
    2. మీ బ్లాగ్ చూచి యుత్సాహం చూపుతున్న.
      ఇవి పురిటి నొప్పులు.
      ధన్యవాదములు.🙏🙏🙏

      తొలగించండి

  22. ఫరులకు హితము జేకూర్చు పనులసేయ
    వలయు నదరక బెదరక ప్రాజ్ఞులార!
    మాన హానిని కలిగించు కాని పనుల
    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞతయగు.
    ఆకుల శివరాదలిఞంగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  23. పదుగురు మెచ్చు కృత్యములు భావి తరాల కు మేలు గూర్ప గా
    వదలు డ టoచుమూర్ఖ తతి వక్ర పు మార్గము జూప వారికి న్
    బెదరు చు కార్య ముల్ vdu
    విడుట వి జ్ఞత ?కల్గు జయమ్ము లెల్ల డన్
    సదమల చిత్తు లై ధృతి ని సాగుట నొప్పగు నెల్ల వేళ లన్

    రిప్లయితొలగించండి


  24. బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు
    నను కొనుట తప్పగు జిలేబి! నమ్మ దగిన
    వాక్యమిది కాదు విను కవివరులు నిన్ను
    భ్రమని ద్రోలవేయగ చూచు పథక మిద్ది :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నారదా! నువ్వేనా ఈ మాటలు జిలేబి గారికి చెప్తున్నది?"

      తొలగించండి

    2. నమో నమ ఃఃఃఃఃఃఃఃఃః

      మీరూ నారదాయ నమః అనే సారూ :)



      నెనరులాయ నమః :)


      జిలేబి

      తొలగించండి
  25. ఆకాశవాణి, హైదరాబాదు వారి సమస్య....

    "యుద్ధమె శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్"

    మీ పూరణలను గురువారం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
    padyamairhyd@gmail.com

    రిప్లయితొలగించండి
  26. బెదరుచుకార్యముల్విడుటెవిఙ్ఞతగల్గుజయంబులెల్లెడన్
    బెదరుట యెప్పుడున్దగదు,భీరువువోలెను నుండకుండగా
    నదరెడుమానసంబునహాయనునట్లుగనెల్లవేళలన్
    బెదురులులేకనుండగనువిఙ్ఞతగల్గుజయంబులున్మఱిన్

    రిప్లయితొలగించండి


  27. కుదురుగ నొక్కతావునను కూర్చొన నివ్వక చింతనమ్ములున్
    గదుముచు నుండగా మదిని గట్టిగ వాదన చేయ లేక తా
    నదియిదియంచు సంతతము నంజక వాటిని వీడి నొక్కటన్
    బెదరుచు కార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్"

    రిప్లయితొలగించండి
  28. బెదరి కార్యముల్ విడుచుటె విఙ్ఞతయగు
    బెదరుటన్నది తెలియుమా పిరికితనము
    విఙ్ఞు డగుమానవుడుధర బెదరకుండ
    దూసుకొనుచుబో వలెనెంత దూరమైన

    రిప్లయితొలగించండి
  29. పులిపాక సావిత్రి,నరసరావుపేట.

    ముదముగ 'సీత 'నా త్రిజట పుణ్యపు రాశిగ నెంచి,రాక్షసా
    స్పదమగు లంకలో సుజన సమ్మతమై విలసిల్లె;రామునే
    కుదురుగ నమ్మి; రావణుని,క్రూరుని,దూరము నుంచె,వానికిన్
    బెదరుచు,కార్యమున్ విడుటె విజ్ఞత -కల్గు జయంబు లెల్లెడన్

    రిప్లయితొలగించండి
  30. సదమల భావ మాధురి,ప్రశస్త,సమస్త,బుధాళి మెచ్చగా,
    పదిలము జేసి సత్కృతుల వర్ధిల జేయుట పాడి యౌను;ఆ
    పద గొని తెచ్చు దుష్టుల,వివాదము జోలికి పోక,వారికిన్
    బెదరుచు,కార్యముల్ విడుటె విజ్ఞత;గల్గు జయంబు లెల్లెడన్

    రిప్లయితొలగించండి
  31. ఊరి కుపకార మొనరించ నూహ సేసి
    వారి వారి యిండ్లకు నేఁగి మీరు దుడ్డు
    లిమ్మని యడుగ మఱి పాఱి రెల్లరు కడు
    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు


    కదలి సతమ్ము లోకజన కంటక నీతి వహింప కుండి తా
    నుదుటునఁ బాపసంచయము నొందు విధమ్ములు వీడి నెమ్మదిం
    బదుగురు దుఃఖ వారినిధి పాల్పఁడు, ధర్ముని దండ నీతికిన్
    బెదరుచుఁ, గార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బెదరుచు నాదు ప్రేయసికి వీడుచు నాంధ్రను ప్రజ్వలించితిన్
    బెదరుచు నాదు పెండ్లముకు వీడుచు బీడిలు పల్లటించితిన్
    బెదరుచు సున్నితుండ్లకట వీడుచు వాట్సపు పిక్కటిల్లితిన్
    బెదరుచుఁ గార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  33. నాశనము జేయ శాంతిని నరకమె యని
    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు
    సమత మమతల బెంచుచు సాగు నాడు
    శాంతి సౌఖ్యము లలరారు జగతి లోన

    రిప్లయితొలగించండి
  34. నేటి పాకిస్తాన్ పరిస్థితి

    ఎదిరి బలమెరింగియును దా మెగిరిపడుచు
    యుద్ధ మనివార్యమేయైన బద్ధులమని
    చీనిప్రభువులు చెయివీడ చిన్నబోయి
    బెదరి కార్యముల్ విడచుటె విఙ్ఞతయగును!

    రిప్లయితొలగించండి
  35. మీపరీక్షల సమయానశాపమైన
    కాపి గొట్టుట వీడుచు కష్టపడుచు
    జదివి జయమును బొందుడీవదలబోక
    మనసు నంగీకరించని తనములున్న?
    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞతయగు

    రిప్లయితొలగించండి
  36. కదలి దేశోన్నతి కొరకు కఠిన చర్యఁ
    బట్ట నడ్డుకొనెడి ప్రతి పక్షమునకు
    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు
    నె? తరుణమిదియె చెలరేగు నేర్పు తోడ౹౹

    రిప్లయితొలగించండి
  37. ఏటికెదురీదుకార్యముల్ యెదుట నిల్వ
    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు"
    కార్యసాధకుండెపుడును ఘనము గాను
    యోచనలుజేసి ముందరకుద్యమించు !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గంగాప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కార్యము లెదుట నిల్వ' అనండి. అక్కడ యడాగమం రాదు.

      తొలగించండి
  38. చంపకమాల

    " కదనము నందు బంధువని గాఁచితిరే యభిమన్యుఁ గౌరవుల్
    విదురతఁ జూపుమయ్య! యని వీడక, వీరుల కెన్న కాదొకో
    బెదరుచు కార్యముల్ విడుటె విజ్ఞత! కల్గు జయంబు లెల్లెడన్
    ముదమున గీతవాక్కువిని ముందుకు సాగిన పాండునందనా!"

    రిప్లయితొలగించండి
  39. తండ్రి హిరణ్యకశిపుని మాటలువిన్న ప్రహ్లాదుని అంతరంగము....

    తేటగీతి
    చదువులందు మర్మమునెల్ల వెదకి నేర్చి
    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు
    నా? దురితమెటులౌ హరినామభజన?
    సర్వమయుని భజించుటె జ్ఞానమనిన!

    రిప్లయితొలగించండి
  40. హృదయము నందుబొందికగ నీశుగృపార్థమె లక్ష్యలక్ష్యమై
    సదమలవృత్తివర్తి‌లుచు, సజ్జనగోష్ఠి గురూక్తి భక్తితో
    చెదరనిసాధనారతి వశీకర ణాత్మసుయోగయోగికిన్
    *"బెదరుచుఁ గార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్"*

    రిప్లయితొలగించండి
  41. ఏటికెదురీదుకార్యములెదుట నిల్వ
    బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు"
    కార్యసాధకుండెపుడును ఘనము గాను
    యోచనలుజేసి ముందరకుద్యమించు !!

    **సవరణతో..

    రిప్లయితొలగించండి
  42. పదవులు సంపదల్ చదువు బంధము లెల్లను నిత్తెమంచు గో
    విద బుధకోటికెల్లరకు వేదన గూర్చక పాపభీతిచే
    *బెదురుచు కార్యముల్ విడుటె విజ్ఞత;కల్గు జయంబులెల్లెడన్*
    సదమల వృత్తి సాధనల సద్గురు పాదము లాశ్రయించినన్

    రిప్లయితొలగించండి
  43. పదవిని నడ్డు బెట్టుకుని పాపపు కార్యము లెంచు కంటెఁ దా
    "బెదరుచుఁ గార్యముల్ విడుటె విజ్ఞత, కల్గు జయంబు లెల్లెడన్"
    బదుగురి మేలొసంగు పనిఁ బట్టుచుఁ జేసిన హాయిఁ దృప్తియౌ
    ముదమదిఁ గల్గుఁ జూడ ఘన మోక్షపు మార్గము కీర్తియౌనులే

    రిప్లయితొలగించండి