25, మార్చి 2019, సోమవారం

సమస్య - 2967 (విఘ్నం బగునని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్"
(లేదా...)
"విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ డత్తఱిన్"

33 కామెంట్‌లు:

 1. ప్రాతఃకాల కిట్టింపు:

  విఘ్నము పారద్రోలు దొర వీధిని జేరగ పూజకోరుచున్
  అఘ్న యొకత్తె మేయగను హాయిని జెందుచు మామిడాకులన్
  జఘ్నిని చేత పట్టుకొని చావను కొట్టగ చౌకిదారటన్
  విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ డత్తఱిన్ :)

  అఘ్న = ఆవు
  జఘ్ని = శూలము

  రిప్లయితొలగించు
 2. మైలవరపు వారి పూరణ

  అఘ్న వలెన్ పవిత్రుని మహాత్ముని గాంచిన ఆంగ్లపాలకుల్
  నిఘ్నుని జేయ శస్త్రముల లేమిని గాంచి., స్వతంత్రదీప్తికిన్
  విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ., డత్తఱిన్
  జఘ్నులనందజేసె ఘన శాంతినహింసను వాని చేతికిన్ !!

  అఘ్న ... ఆవు
  నిఘ్నము ..... లోకువ
  జఘ్ని .. శస్త్రము

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు


 3. గణపతి అను గోపబాలకుని మనో భావన


  అఘ్నయు తప్పించుకు ద
  ద్రుఘ్న సమీపమునకు తను తుర్రుమనగ నౌ
  పఘ్నము వలని తనకికన్
  విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్ !


  జిలేబి

  రిప్లయితొలగించు

 4. గణేశుని శంకరాభరణపు ముచ్చట్లు :)


  విఘ్నము లన్నియున్ తొలగ వేకువ జామున లేచి చూడగా
  నౌ "ఘ్న" య టంచు ప్రాస! యరె! నచ్చెడు పూరణ నెట్లు చేతునో
  విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ డత్తఱిన్
  ఘ్నా, ఘ్న, ల తో పదమ్ములరె గట్టిగ గాన్పడె నాంధ్రభారతిన్ !


  ఇంకేముంది పూరణ అయిపోనాది :)


  జిలేబి

  రిప్లయితొలగించు
 5. విఘ్నేశుని దొంగ యొకడు
  విఘ్నములను బాపు మనెను వీధుల దోచన్
  విఘ్నములే తొలగుచు ని
  ర్విఘ్నంబగునని గణపతి భీతిం జెందెన్.

  రిప్లయితొలగించు
 6. విఘ్నమ్ముల గెలుచు ననుచు
  విఘ్నేశుని పేరుపెట్ట విధిరాతయయో!
  విఘ్నములు గెలువ జాలక
  "విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్"

  రిప్లయితొలగించు
 7. ( చిలకమర్తి వారి నవలలోని మొద్దబ్బాయి గణపతి గణేశ
  చతుర్ధిని మరచి తరవాత చేసినపనికి భయపడ్డాడు . )
  విఘ్నమ్ములకే కాక న
  విఘ్నమ్ములకును నధిపతి ; విశ్వేశు సుతున్
  విఘ్నేశుచవితిన మరచి
  విఘ్నం బగునని " గణపతి " భీతిం జెందెన్ .

  రిప్లయితొలగించు
 8. విఘ్న ము బాపీ పనుల ని
  ర్విఘ్న ము గా నెర వేర్చు గొప్ప వేలుపు దా నై
  న ఘ్నoబగు నెట్టు ల తా
  విఘ్నం బగు నని గణపతి భీతి O జెందె న్?

  రిప్లయితొలగించు
 9. నాకు, కవిశ్రీ సత్తిబాబు గారికి నిన్నటి నుండి అన్నీ విఘ్నాలే. నిన్న రాత్రి మేము రిజర్వేషన్ చేసుకున్న రైలు తప్పిపోయింది. అక్కడి నుండి బస్ స్టాండ్ వెళ్తే హైదరాబాదుకు డైరెక్ట్ బస్సులు లేవన్నారు. విజయవాడ బస్సెక్కాము. అది బయల్దేరి కొద్ది దూరం వెళ్లాక మేము కూర్చున్న సీట్లు రిజర్వు అయ్యాయని దింపేశారు. మళ్ళీ బస్ స్టేషన్ చేరుకొని ప్రైవేటు బస్సులో ఇంతకు ముందే విజయవాడ చేరుకున్నాము. ప్రస్తుతం హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కి కూర్చున్నాము.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విచారకరం!క్షేమంగా స్వస్థలం చేరుకోవాలని ఆకాంక్ష!

   తొలగించు
  2. అయ్యో పాపం సార్ :(

   మా అమ్మగారు ఉండియుంటే మీరు tickets కొనిన ముహుర్త దోషం విడమరచి చెప్పుండేది:

   http://gpsastry.blogspot.com/2011/08/microcausality.html?m=0

   తొలగించు
  3. కంది శంకరుగురువుల కాంక్షదీర
   సకల శుభములు గలిగించు శంకరుండు
   నన్ని విధముల వారిని నాదుకొనగ
   బయన మయ్యది సుఖముగ వరలుగాక!

   తొలగించు


 10. ( మహేశ్ ,గణేశ్ ఇద్దరు స్నేహితులు...
  మహేశ్ గణపతిని కొలుస్తాడు...గణేశ్ గణపతి పూజ చేయడం మరిచిపోతాడు....)

  ఉ.మా

  విఘ్నము గల్గ గూడదని వేడె "మహేశు" త్రినేత్రు నందునిన్

  విఘ్నము లేదు నాకిక యవిఘ్నముగా
  యగు కార్యమంచు నా

  విఘ్నహరుం డుమాసుతుని వేడని స్నేహి గణేశుతో డనన్

  విఘ్నము సంభవించునని భీతిని జెందె గణేశు డత్తఱిన్  🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
  🌷వనపర్తి🌷

  రిప్లయితొలగించు
 11. విఘ్నాయాసులు బోలెడు
  విఘ్నాయత్తులును చాల విపరీతముగా
  విఘ్నేశు గొల్వ,ధర్మపు
  విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విఘ్నపు భీతితో నడుగు వేయగ నెంచడు నీచుడెన్నడున్
   విఘ్నము లొంగదీయగను వేసియు మానును మధ్యముండిలన్
   విఘ్నము లెంచకన్ గెలుచు విజ్ఞుడు,వారును లేక ధర్మపున్
   విఘ్నము సంభవించునని భీతిని జెందె గణేశు డత్తఱిన్

   తొలగించు
 12. డా.పిట్టా సత్యనారాయణ
  విఘ్నంబునకే పతిని కృ
  తఘ్నుల ప్రార్థనయు నున్నతాదర్శము ని
  ర్విఘ్నంబెట్లగు తప్పక
  విఘ్నంబగునని గణపతి భీతిం జెందెన్

  రిప్లయితొలగించు
 13. డా.పిట్టా సత్యనారాయణ
  మోదీ ని గెలి పించుటకు మున్ను, గణపతి అంతరంగావిష్కరణ:
  "విఘ్నము హైందవంబునకు వేయి విధంబుల ధర్మజొల ని
  ర్విఘ్నప్రయత్నముల్ జెలగ వీథికి నెక్కు నెలక్షనాదులన్
  విఘ్నము జేయ,మోది గన వీలొకటుండిన చాలునా మదిన్
  విఘ్నము సంభవించున"ని భీతిని జెందె గణేశు డత్తరిన్

  రిప్లయితొలగించు
 14. విఘ్నాధిపతయ్యు మనువు
  విఘ్నంబగునని గణపతి భీతింబొందెన్
  విఘ్నేశు బెండ్లికి శతపు
  విఘ్నము లనుమాటవినగ వింతయుగాదే!

  రిప్లయితొలగించు
 15. విఘ్నముల కెరుతు రధములు
  విఘ్నము తలపక నడతురు విజ్ఞుల్ యెపుడున్
  విఘ్నపతి దలచు వారికి
  విఘ్నం బగునని గణపతి భీతిన్ జెందెన్

  రిప్లయితొలగించు
 16. ఈ రోజు శంకరా భరణము బ్లాగు లో సమస్య

  "విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్"

  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


  కాకతీయ గణపతి దేవుడు తోటి రాజులతో బంధుత్వము పెంచుకొని తీర ప్రాంతము వరకు తన సాంబ్రాజ్యమును విస్తరించి అంధ్ర రాష్ట్రము మొత్తము పాలించు సమయమున రేచర్ల రుద్రుడు ఒక్క దేవాలయము కట్టాలని దానిలో శివ కేశవులు ఒకే ఆలయములో ఉండేలా నిర్మాణము చేయాలని ప్రతిపాదన చేస్తాడు. ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురై విఘ్నములు కలుగు నేమో అనుకొన్న గణపతి దేవుడు తన మాటను రేచర్ల రుద్రునికి చెప్పు సందర్భము .


  పినచోడి పుత్రికల్ పేరమ్మ నారమ్మలను పరిణయ మాడి లక్షణముగ
  వెలనాడు రాజ్యము కలిపి సాంబ్రాజ్యము పాలించు చుంటిని బాగు గాను ,
  వేంగి చాళుక్యుoడు వీరభద్రునికి నా పుత్రి రుద్రమ్మను పుణిక రించి
  పెండ్లితో బంధమ్ము పెంచి నే తీరాంధ్ర విజయము గొనినాడ, విష్ణు శివుల
  గుడికట్ట విఘ్నంబగునని గణపతి భీతింజెందె ననవల దెప్పుడు, నీదు

  కోరిక సతము సఫల మగును,మొదలిడు
  పనులు రేచర్ల రుద్రుడా! పఱపు తోడ
  శిల్పి రామప్ప పనిజేయు శీఘ్ర గతిని
  ననుచు గణపతి దేవుడు నాజ్ఞ లిడెను

  రిప్లయితొలగించు
 17. జఘ్నిని జేబూనుచునే
  విఘ్నంబగునని గణపతిభీతిన్ జెందెన్
  నిఘ్నమయగుదుము జనులకు
  విఘ్నంబుల రాకగురిచి భీతిని జెందన్

  రిప్లయితొలగించు
 18. అఘ్నిశరీరమునకు హే
  మఘ్నిని హత్తించి కొల్చ మంచి యగును ని
  ర్విఘ్నముగ గోవులఁ దునుమ
  విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్
  అఘ్ని: ఆవు, హేమఘ్ని: పసుపు

  రిప్లయితొలగించు
 19. అఘ్నిశరీరమందునను హర్షముతోడుత పూయఁ జేసి హే
  మఘ్నిని పూజనమ్ములను మాన్యతతో నొనరించ నిచ్చ ని
  ర్విఘ్నము గానగున్ పనులు విశ్వము నందున, నాల జంపినన్
  విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ డత్తఱిన్

  రిప్లయితొలగించు
 20. అఘ్నా గణాధి విభుఁడు కృ
  తఘ్నతఁ జూపిన నొరులకుఁ దన కాంక్షలకున్
  జఘ్నివ్రజ ఘాతమ్మున
  విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్

  [గణపతి = పూర్వోక్త గోగణ పతి]


  విఘ్నమ యైనభూభ్రమణ విస్తృత యత్నము ఘోర దైత్య శ
  త్రుఘ్ననిజాగ్రజప్రవరు తోడుత పందెము నందు నింక నా
  విఘ్నగణాధిపత్యము భువిన్ మఱి దక్కుట కివ్విధమ్మునన్
  విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ డత్తఱిన్

  రిప్లయితొలగించు
 21. జఘ్నిని దాధరించియును శాత్రవవీరుల మూర్కొనంగగా
  విఘ్నము సంభవించునని భీతినిజెందె గణేశుడత్తఱిన్
  విఘ్నము కల్గునేయనుచు వేదనతోడను నుండుచోనికన్
  నిఘ్నమ యౌదుమీభువిని నీరజలోచన! వింటివేసుమా

  రిప్లయితొలగించు
 22. విఘ్నంబువలదనుచునా
  విఘ్నాధిపునే దలవగ ప్రేరణ గలుగన్
  విఘ్నంబుభగ్న మవనే
  విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్!!

  రిప్లయితొలగించు
 23. విఘ్నవినాశునిన్ సురలు వేడి దశానను చెంతనుండి యా
  జఘ్నిధరుండె యైన ఘన జాబిలి తాల్పుని యాత్మలింగమున్
  విఘ్నము గల్గజేయుచునువింశతి బాహుని నుండి తెమ్మనన్
  విఘ్నము సంభవించునని భీతిలు చుండె గణేశు డత్తరిన్.

  రిప్లయితొలగించు
 24. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  విఘ్నపు వేల్పు పేరుగల వీర సవర్కరు స్వర్గవాసుడై
  అఘ్న ప్రియంక రాకనిట హైరన నొందుచు చూచుచుండగా
  జఘ్నిని పూని యోగి కడు జంజట జేయగ మోడి గెల్పుకున్
  విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ డత్తఱిన్

  రిప్లయితొలగించు
 25. విఘ్నేశుని హస్తమున శ
  తాఘ్నిగ చరియించి రిపుల తరిమెడి దగునా
  జఘ్నియె విఫలంబగుచో
  విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్

  విఘ్నేశ్వరుడే జడిసె శ
  తాఘ్నిగ వీడంగ తనదు తండ్రి ని గావన్
  జఘ్నిని, భస్మాసురు పై
  విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్

  నిన్నటి సమస్యకు నా పూరణములు

  భూత, దయ, కరుణ రసమ పూర్వ గతిని
  చాటు నా సుభాషితముల మేటి రచన
  గాక భాష గంభీరత గల కవితల
  పుస్తకావిష్కరణ సభఁ బోఁ దగ దఁట

  గ్రంధస్తమ్మయె నాటి గాధలవనిన్ గంటమ్మునున్బట్టి నన్
  సంధుల్ సక్రమమై రచించ నట దుస్సంధుల్ సదా రిక్త, మా
  బంధుత్వమ్మును నిల్ప లేని కవితల్ ప్రాచుర్య మాసించ నా
  గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 26. *గణేశనే యువకుడింటర్వ్యూ కొరకు వెళుతూ తొందరలో వినాయకునకు నమస్కరించలేదు.... మార్గమధ్యమందీ విషయం గుర్తుకు వచ్చి మదనపడుతున్నట్టుగా నూహించి.....*


  విఘ్నము బాపుచున్ జనయభీష్టమొసంగెడు వాడటంచు ని
  ర్విఘ్నత గోరి కొల్తురట విజ్ఞులు మూఢుడ నైతి గాదె యా
  జఘ్నిధరున్ సుతుండగు గజాననుఁ గొల్వక తప్పుజేసితిన్
  విఘ్నము సంభవించునని భీతిలు చుండె గణేశుడత్తరిన్.

  రిప్లయితొలగించు
 27. రావణునుద్దేశించి.

  విఘ్న పరచకున్న పనిని
  విఘ్నం బగు సురులు కనుచు వేగతలచుచున్
  విఘ్నము చేయక యున్నను
  విఘ్నంబగునని గణపతి భీతిన్ చెందెన్.

  రిప్లయితొలగించు