19, మార్చి 2019, మంగళవారం

సమస్య - 2962 (కాకులు మానవులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్"
(లేదా...)
"కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్"

98 కామెంట్‌లు:

 1. కేకలు వేయుచు నిరతము
  రాకాశి సతిని గెలువగ రభసల కంటె
  న్నేకాంతపు లోక మైనను
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "కంటె। న్నేకాంతపు లోకమునన్..." అనండి.

   తొలగించు
 2. స్వానుభవం:

  చీకటి తోడ తద్దినపు చేతలు చేయుచు నెండమీరగా
  వాకిలి బైటనున్ వడలు బారులు గట్టుచు పేర్చి వేచుచున్
  కేకలు వేసి పిల్చినను కిక్కురువెట్టిన రాకపోవుచున్
  కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్ :)

  కిక్కురువెట్టు = వంచించు

  రిప్లయితొలగించు


 3. ఆకులు రాలెడు కాలము
  లో కన్నులు ముక్కు చెవియు లోపము గానన్
  మాకంద మెక్కడయిక ! చి
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్!


  హాచ్ హాచ్ ఒక్కటే తుమ్ములు :)

  జిలేబి

  రిప్లయితొలగించు

 4. నారాయణ ! పిండముల చేసి :)  మా కుల పెద్ద లంచట నమస్కృతి చేయుచు తద్దినంబుగా
  సోకులు మాడ ! పిండముల స్తోత్రము తోడుగ పెట్టి పెద్దలన్
  మా కడ చూచి నిట్లనుట మాన్యమకో నరులార ! యెట్లరా
  కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్?


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చూచి యిట్లనుట' అనండి.

   తొలగించు
 5. కం.
  కాకను భరించ లేకను

  వాకిలిలో చెట్టు నీడ ప్రజలే జేరన్

  కాకులు రెట్టను వేయుచు

  "కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మల్లేశ్వర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాకులు' పునరుక్తమయింది. "సోకుగ రెట్టలు వేయుచు। కాకులు..." అంటే ఎలా ఉంటుంది?

   తొలగించు
  2. చమత్కారంగా బాగుంది గురువుగారూ,ధన్యవాదములు..

   తొలగించు
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించు


 6. ఈ కువలయమున నో నరు
  డా!కష్టసుఖాల మిళితమౌ జీవనమే!
  ఏ కరణిని జూచిన జీ
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్"

  రిప్లయితొలగించు
 7. ( అంబరాలు తాకే ఆడంబరాల మాటలతో చెవులకు
  హోరెత్తిస్తూ ప్రజలకు విసుగు పుట్టిస్తారు సోమరయ్యలు )
  " చేకురు నెంతయో సుఖము
  చెల్వుగ మీ " కని యోటు గోరుచున్
  మూకలు మూకలై తిరిగి
  మొత్తము చిత్తము మార్పనెంచుచున్
  సోకుగ మీసముల్ మెలచు
  శుష్కపు వ్యక్తుల డాంబికంపు చీ
  కాకులు మానవాళి కతి
  కష్టములన్ గలిగించు నెప్పుడున్ .
  ( మెలచు - త్రిప్పు )

  రిప్లయితొలగించు
 8. నేటి శంకరా భరణము సమస్య

  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్

  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

  నారదుడు వచ్చి సత్యభామతో పారిజాత పుష్పము గురించి తెలుప సత్యభామ అలుక పానుపు నెక్కగ
  శ్రీ కృష్ణుడు పలికిన పలుకులు (అగడు కాకులు = జగడాల మారివారు, తెఱవ = స్త్రీ ,వేల్పు టెంకి = స్వర్గము )

  సాత్రాజితీ నీకు స్వస్థత యే రీతిగా నుండెనో? నీ ముఖ మున సంత
  సమ్మేల తగ్గె? నీ జడలోన మల్లె లేల వడలె,వదన తిలకము చెదరె
  నేలనో?వచ్చెనా వేలుపు తపసి నీ వద్దకు? నో తెఱవ! తెలుసు కొను
  మ,నగడు కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్ ,సుఖమ్ము సంత
  సంబు కలుగబోదు కలహాసనుని పలుకు
  లెప్పుడు ,తరళ లోచన చెప్పు చుంటి
  వినుము, పారిజాతము తెత్తు వేల్పు టెంకి
  నుంచి యని సతికి తెలిపెను బక వైరి

  రిప్లయితొలగించు
 9. శ్రీకరమైన కార్యములు చేతను బట్టెడు చింత చేయగా
  వేకువనే మహాపదలు వ్రేఁకదనంబున చుట్టుముట్టుచున్
  శోకము గల్గఁజేయునిల శూలములై భయపెట్టు చిక్కు చీ
  కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్

  రిప్లయితొలగించు
 10. ఏకాలమైన కలిగెడి
  యాకలి యిక్కట్టు తీర్చ నాహారముకై
  రూకల సంపాదన చీ
  కాకులు మానవులకెపుడు కష్టము లనిడున్

  రిప్లయితొలగించు
 11. తేకువ తో జీవి త మున
  శోక ము లెరు గ క నిరత ము సుఖ ముల గోరన్
  భీ కర మగు విధ మున చీ
  కాకులు మానవుల కెపుడు కష్ట ముల నిడు న్

  రిప్లయితొలగించు
 12. తేకువ నడగించునుగా
  పోకిరిగా దుడుకు మాట పొరపాటేగా
  లోకులు నరరే యన పలు
  గాకులు;మానవులకెపుడు కష్టములనిడున్.

  రిప్లయితొలగించు
 13. డా.పిట్టా సత్యనారాయణ
  ఏకది మేకౌనట మా
  కీ కలికాలమ్మునందు గిట్టక శ్రమలే!
  పోకల మించని రూపము
  కాకులు మానవులకెపుడు కష్టముల నిడున్
  "యెంపలి చెట్లకు నిచ్చెన లేసేరయా"పోతులూరి వీరబ్రహ్మంగారి జోష్యము

  రిప్లయితొలగించు
 14. డా.పిట్టా సత్యనారాయణ
  వేకువ గాగ మూకలుగ విప్పిన నారొద నోపలేము యే
  పోకన కావు కావు మని గంతులు వేసిన రాడె చుట్ట మే
  కాకిగ బోల్తు రీ ధరణి గౌరవ పూరిత ధ్యాన శీలునిన్
  కాకులు మానవాళికతి కష్టములన్ కలిగించు నెప్పుడున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'పూరిత ధ్యాన' అన్నపుడు 'త' గురువై గణదోషం. సవరించండి.

   తొలగించు
 15. లోకపు పోకడ నులువుము
  నేకముగా తపము జేయు నాకము జేరన్
  యికc వీడుము మనమున చీ
  కాకులు మానవుల కెపుడు కష్టములు నిడున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. యజ్ఞేశ్ గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసార్హమే.
   రెండవ పాదంలో యతి తప్పింది. మూడవ పాదం గురువుతో ప్రారంభించాల్సింది మీరు లఘువుతో ప్రారంభించారు. సవరణలతో మరో పద్యం వ్రాయండి. 'పోకడ నులుపుము' అన్నది అర్థం కాలేదు.

   తొలగించు

 16. 21) తే: సెల్లు ఫోనులు గైకొని యెల్ల ప్రజలు
  కల్లు బాబును గెలిపించ, తెల్ల వార్లు
  బారు లన్ని తెరచి యుంచు జోరుగాను,
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

  22)తే: ధమ్ము బిర్యాని పెట్టించి రమ్ము తోడ
  పొట్ట నింపుచున్ మూన్నాళ్ళు పోషణమ్ము
  చేసి, గెలిచిన వెంటనే ఛీఛి యనును
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

  23)తే: బ్రాంది విస్కి సారాయిల బ్రాండు లన్ని
  గంట కొకమారు నీకిచ్చు కఱటి వాణ్ణి
  సీటు నెక్కించ,చూచునా చెలిమి కలిగి
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
  (కఱటి = మూర్ఖుడు )  24) తే: మద్య పాన నిషేధమ్ము సాధ్యమైన
  త్వరిత గతిన తెత్తు ననుచు దండు కొనును
  వోట్లు, గెలిచిన వెంటనే తూట్లు పొడుచు,
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

  25) తే: ఓటు వేయు సమయమున వూరు లోని
  ప్రజల కై కార్లు, నాటోలు గజము కొకటి
  తిరుగు, తదుపరి బస్సైన దొరక బోదు,,
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

  రిప్లయితొలగించు
 17. బాకులు,చాకుల జేగొని
  పీకలు గోయుచు జరించి భీభత్సముగన్
  వీకనుజాపెడి నాపలు
  గాకులు మానవులకెపుడు కష్టములనిడున్

  పలుగాకులు = దుష్టులు

  రిప్లయితొలగించు
 18. ఏకబిగిని మీదబడుచు
  బోకను తమ యింటబయట బొడుచుకదిను యా
  వ్యాకులములు గలుగగ చీ
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్

  రిప్లయితొలగించు
 19. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్

  సందర్భము: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము.. దానినే విజ్ఞులైనవారు రకరకాల పేర్లతో రూపాలతో చెబుతారు.. అందుకే అనేక నామ రూపాలతో దేవత లలరారుతూ వుంటారు.. అదీ తత్వ దర్శనం..
  అనేకత్వంనుంచి ఏకత్వంలోకి యిలా తత్వదర్శనం చేయలేకపోతే అనేకత్వం దగ్గరే ఆగిపోతే అవాంఛనీయ సంఘటనలే తప్ప లోకక్షేమం వరించదు.
  ఆ తత్వాన్ని తెలుసుకోలేక కేవల నామ రూపాత్మకమైన దృశ్య ప్రపంచంమీదనే జీవితాంతం మోజు పడుతూ వుంటారు లోకులు.. ఆ మోజే శోకంగా మారడం ఖాయం. మనసు చీకాకు పాలు కావడం తప్పదు. మానవులకు కష్టా లనేవి యిందువల్లనే వస్తున్నాయి.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఏకము బ్రహ్మము నరయక

  ప్రాకట మగు దృశ్య జగతిపై మో జదియే

  శోకముగాగ మదిని చీ

  కాకులు మానవుల కెపుడు
  కష్టముల నిడున్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  19.3.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 20. శంకరాభరణం..
  నేటి సమస్య.

  కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్

  నా పూరణ.

  శ్రీకరమైన కాలమును శ్రీహరి చింతనతోడ పుచ్చినన్
  భీకర దుష్ఫలార్భటులు వీగునుగా శుభముల్ రహించగన్.
  భీకరమైహికమ్ము గొని విజ్ఞత క్రోల్పడిమెల్గుచున్న, చీ
  కాకులు మానవాళికతికష్టములన్ కలిగించునెప్పుడున్.
  🙏🏼🙏🏼🙏🏼

  రిప్లయితొలగించు
 21. మైలవరపు వారి పూరణ

  చేకొని కుక్క కార్యమును చేయగనెంచిన గార్దభంబటన్
  చాకలి చేత జచ్చెనిది సత్యము ! మిన్నక యున్న మేలగున్ !
  తేకువ నన్యకారణమతిన్ గొన జోక్యము , వచ్చునట్టి చీ...
  కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
 22. చేకుర నోగిరమ్ము దనచేడియ జీరును నైకమత్యమున్
  ప్రాకటమేగ దాగుడువ వాయసపిండము దద్దినంబునన్
  తేకువతో హరిన్ దలచు దీరుగ కావుము కావుమంచు నే
  కాకులు మానవాళి కతికష్టములన్ గలిగించునెప్పుడున్ ?

  రిప్లయితొలగించు
 23. వీకన్ పనులను చేసిన
  చేకూరును విజయమెప్డు చెయ్దుము లందున్
  లోకులవలన కలుగు చీ
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చెయ్దము' టైపాటు.

   తొలగించు
 24. చీకటి పలుకులు నీచపు
  పోకడలను నిత్యము తలపోయుచు లోకా
  నికిహాని జేయు మీడియ
  కాకులు మానవులకెపుడు కష్టముల నిడున్

  చీకటి పలుకులు, నీచపు పోకడలనే ఎప్పుడూ అనుసరిస్తూ ప్రపంచానికి హాని కలిగిస్తున్న మీడియా కాకులు మనుషులకి ఎప్పుడూ కష్టాలే కలిగిస్తాయి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మూడవ పాదములో ప్రధమాక్షరము హ్రస్వమైనది గమనించ సూచన!

   తొలగించు
  2. కృష్ణారెడ్డి గారూ,
   భావం బాగుంది. సీతాదేవి గారన్నట్టు మూడవ పాదాన్ని సవరించండి.

   తొలగించు
  3. అవునండీ గమనించలేదు. సీతాదేవి గారి కందపద్య కదంబము పుస్తకము చూశాకే పద్య రచనా ప్రయత్నం మొదలు పెట్టి, ఈ బ్లాగులో అడుగుపెట్టాను

   తొలగించు
 25. నీ కింక శంక యేలయ
  యీ కలి లోకోపకారు లెందును లేరే
  కేకలు వేసెడి లోకులు
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్


  లోకులఁ గాంచి పొందకుమ రోషము దుస్సహ దేహజోగ్ర జా
  డ్యాకర హేతుభూతములు హ్లాద వినాశక భూతముల్ వచో
  భీకర దూషణాకలన వేధిత మానసపుం గడింది చీ
  కాకులు మానవాళి కతి కష్టములం గలిగించు నెప్పుడున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించు
 26. ... ...శంకరాభరణం....
  19/03/2019 మంగళవారం
  సమస్య:

  కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్

  నా పూరణ: ఉ.మా.

  ***** ***** **** ***

  కాకము నేర్పదే మనకు కల్సిమెలంగు విధంబు నీ ధరన్!

  కాకము గీముపై నిలిచి కావని బంధుల రాక తెల్పదే!

  కాకి భుజించ నన్నమును గల్గు శనీశ దయంబు లెవ్విధిన్

  కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్


  🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
  🌷వనపర్తి🌷

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శనీశ దయంబు' ?

   తొలగించు
 27. ఆకలిగొన్న వాని మది యాకులితమ్మగు, క్షుత్తు తీరినన్
  చేకురు మానసమ్మునను శీఘ్రముగా సుఖ మెల్లవేళలన్
  కాకుల వంటి లోకులిల కల్మషమౌ మదిఁ బెట్టు నట్టి చీ
  కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్

  రిప్లయితొలగించు
 28. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  భాగ్యనగర్ ప్రజాతంత్రము:

  కూకటపల్లి వోటరుల గుండెలు దోచెడి యత్నమందునన్
  మేకల బిర్యనిన్ కుడిపి మెండుగ నోటులు పంచిపెట్టుచున్
  వేకువ జామునన్ తరలి పీకల నిండుగ కల్లుపోయు చీ
  కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  2. 🙏

   "The Kurnool Lok Sabha seat in 2014 reportedly went to a new entrant for Rs 40 crore. This time, the Nandyal Lok Sabha seat is said to have been auctioned for Rs 100 crore. A rival party is fielding a candidate who has offered to match the bid “measure for measure..."

   https://www.google.co.in/amp/s/www.deccanchronicle.com/amp/nation/politics/140319/lok-sabha-seat-goes-for-rs-100-crore-in-nandyal.html

   తొలగించు
 29. క్రొవ్విడి వెంకట రాజారావు:

  బాకీలు, నింటి లోపల
  వీకయె లేని సతి పోక, పిల్లల గోలల్,
  వ్యాకులచిత్తత నొసగు చి
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్.

  రిప్లయితొలగించు
 30. కాకుల వలెనైఖ్యతతో
  వేకువనే కోడికూత వేయగ? పనులున్
  లోకులు జేయక!మనచీ
  కాకులు మానవులకెపుడు కష్టమునిడున్!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వలె నైక్యత' టైపాటు.

   తొలగించు
 31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 32. ఏకాకి తనమునరయగ
  వ్యాకులతను బెంచుచుండి పగగలిగించన్
  నాకలతలిడెడుబలుచీ
  కాకులుమానవులకెపుడు కష్టములనిడున్

  రిప్లయితొలగించు
 33. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వీకయెలేక ధామమున ప్రేయసి పన్నెడి వాదులాటలున్,
  పోకునుగూడు తత్త్వమున పోకిరియై తిరుగాడు పుత్రుడున్,
  వ్యాకులచిత్తత న్నొసగి పాఱుచు కుంటుపడంగ జేయు చీ
  కాకులు మానవాళి కతికష్టములన్ కలిగించు నెప్పుడున్.

  రిప్లయితొలగించు
 34. శోకము నకు కారణమని
  నీకెన్నియొ సార్లు చెప్పనేమి వినవు గా
  దే, కలహమసూయయు, చీ
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్,

  రిప్లయితొలగించు
 35. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 36. లోకుల మాటలన్వినిన రూఢిగ గల్గెడుచెప్పలేనిచీ
  కాకులుమానవాళికతికష్టములన్గలిగించుానెప్పుడు
  న్లోకులుకాకులేయగుచులుఛ్ఛపుమాటలగీడుజేయుచున్
  లోకువజేతురెప్పుడునురూమరులెన్నియొపల్కుచుండుచున్

  రిప్లయితొలగించు
 37. పోకిరి వాడెయౌ సుతుని బుద్ధిని మార్చ వచించె తండ్రియే
  శోకపు మూలమేమనగ జూదము నాడుట వారకాంతతో
  చీకటి కార్యమున్ సలుపు చింత, దురాశయె తెచ్చునట్టి చీ
  కాకులు మానవాళికతి కష్టములన్ గలిగించు నెప్పుడున్.

  రిప్లయితొలగించు
 38. ఆ కుల మీ కుల మన పెను
  వ్యాకులము సృజించి నంత పబ్బము గొను నా
  లోకులు కలిగించెడి చీ
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్!

  ఆ కుల మీ కుల మన పెను
  వ్యాకులము సృజించి నంత పబ్బము గొనెడిన్
  కాకులు కానేరని పలు
  గాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్!

  మొదటి పద్యం సరికాదేమోనని(పలుగాకులు)సవరించి రెండవది వ్రాసాను
  పరిశీలించ ప్రార్థన.

  రిప్లయితొలగించు
 39. చేకురు నంచు సౌఖ్యములు జిహ్వకు తిన్నది జీర్ణమౌను చీ
  కాకులు లేక యంచు తిన కద్దు కదా తములమ్ము వైద్యులో
  వాకున రాచపుండనెడి వ్యాధికి కారణ మండ్రు చూడ వ
  క్కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్.

  రిప్లయితొలగించు
 40. ఆకలిలేమియున్ మిగుల వ్యాకులతన్ కలిగించు స్వాస్థ్యమున్
  రూకల ఖర్చు హెచ్చుటయు రూపములో కళ తగ్గుచుండుటన్
  పీకలదాకనప్పులును వేదనలన్కలిగించు గొప్ప చీ
  కాకులు మానవాళికతి కష్టములన్ గలిగించు నెప్పుడున్.

  రిప్లయితొలగించు
 41. లోకము నందున జనులను
  ప్రాకటముగ బ్రతుకనీక పరిపరివిధముల్
  మూకలుగ వచ్చిపడు చీ
  కాకులు మానవులకెపుడు కష్టముల నిడున్!!!

  రిప్లయితొలగించు

 42. ఆకలితో మొదలౌ చీ
  కాకులు మానవులకెపుడు కష్టములనిడు
  న్నేకాకుల జీవితమున
  వేకువ తోడను మొదలగు వేదన లెల్లన్.

  రిప్లయితొలగించు
 43. వేకువనే లేచి నిదుర
  నాకొడవలి గడ్డ పార నాగలి పట్ట
  న్నూకలు కఱువే గద ! చీ
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  జనులు కలియుగమందున జడువ బోరు
  బొంకఁగా ; హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు
  సత్యమును బల్కి యిక్కట్లు స్వాగతించి
  బ్రతికి యుండగ పలుపాట్లు పడెడు వాడు ?

  రిప్లయితొలగించు
 44. ప్రాకట మైనదౌ తమలపాకును గైకొని శ్రీకరమ్ముగన్
  తోకను ద్రుంచి, లేత సుధ తోయము కాసుయు వైచి ప్రేమగన్
  చేకొనుడయ్య వేయకుడు సేమము కావవి మేకులైన *వ*
  *క్కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించు
 45. పోకుము పోకిరి పనులకు
  యేకముగా దపము సల్పుc మీశుని జేరన్
  లోకులు బలు కాకులు చీ
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్

  రిప్లయితొలగించు
 46. కం. ఏకాగ్రతవిడకరుమము
  కాకాయనివచ్చుకాకి కరవదుమెతుకున్
  చేకూరదుపుణ్యఫలము
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్

  రిప్లయితొలగించు
 47. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్

  సందర్భము: సులభము
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  బాకు లటు తోటివారికి
  బ్రాకటముగ సూటిపోటి పలుకులతో జీ
  కాకు లిడెడు లోకు లనెడు
  కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  19.3.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 48. బాకుల వంటి మాటలవి పామరులైన జనంబు లాడఁ జీ
  *కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించునెప్పుడున్*
  లోకుల మాట లెక్కగొను లోకము కెప్పుడు శాంతిలేదహో!
  "లోకులు కాకులే" యనెడి లోగడ నానుడి మర్చిపోతిరా?

  రిప్లయితొలగించు