కవిమిత్రులకు నమస్కారములు నేను వ్రాసిన శతకము లోంచి కొన్ని పద్యాలు గురువు గారు శ్రీ శంకరయ్య గారి అనుమతి తో బ్లాగులో పెడుతున్నాను మీ అమూల్యమైన అభిప్రాయములు సూచనలు ఇచ్చి తప్పులు సరిదిద్ద ప్రార్ధన
మకుటము తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
ఈ రోజు పంచ గుళికలు 1
1)తే: కోట్ల రూకలు వెచ్చించి వోట్లు కొన్న నేత లెటుల నేల గలరు నీతి తోడ ధనము తిరిగి సంపాదించ దారు లెంచు తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
2తే: కులము వాడనుచు నతని గుణము వదలి యేరికోరి యా వ్యక్తిని నెన్నుకొనగ కళ్ళు నెత్తికెక్కి యతను కాటు వేయు తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
3 తే: మా మతంబు వాడనుచు నో మందమతికి పట్టుబట్టి నీవు పదవి కట్ట బెట్ట నల్ప బుద్ది కల్గి నతడు నాదుకొనడు తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
4.తే భూమి దోచు రక్కస గణ భూతములకు భయము నొoది గూoడాలకు జయము నిడగ , మీ గృహమ్మునే ఘనముగా మ్రింగ గలరు తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
5 తే: చదువు లేకున్న నా డబ్బు మదము కలిగి వెధవ పనులు చేజూతురు పదవి కొరకు ` వేలు ముద్ర జనులెటుల నేల గలరు తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
కాళేశ్వరం నుండి వచ్చిన మా బాల్య మిత్రునితో కొన్ని ముఖ్యమైన పనుల మీద రోజంతా తిరుగవలసి వచ్చింది. ఇంతకుముందే అలసటతో నెలవు చేరుకున్నాను. మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.
రిప్లయితొలగించండివామ్మో ! వారి మీదే బాణమెక్కు పెట్టే రా!
వారికి కితాబు ! మీ కై పదానికి జిలేబి జవాబు :)
సత్కవి! కంది శంకర! సుసాధ్యము చేయును దేనినైననా
సత్కవి! కాని నాగఫణి శర్మ వధానముఁ జేయు టెందుకో
సత్కవి వర్య మీకు తెలుసా? భళి శారద ప్రాభవమ్ము తా
నత్కము గాను తెల్పగ జనాళికి తెన్నిడి తేనెలూరగాన్!
జిలేబి
అరయ సాహిత్యమును బల్కి యలరజేయు ;
రిప్లయితొలగించండిమధుర సంగీతమును బాడి మదుల దోచు ;
కెరలు " వాగ్గేయకారుండు " ; కేవలంబు
నాగఫణిశర్మ " కవి " యనగా దగండు .
చివరి పాదం. "నాగఫణిశర్మ సుకవి యనం దగండు "
రిప్లయితొలగించండిఅని చదువ మనవి .
రిప్లయితొలగించండివిరియు శారదప్రాభవ విభవమచట!
తేనెలూరుతెన్గు పలుకు తేటగీతి
గానచట జిలేబులగును! గాన నెటుల
నాగఫణి శర్మ సుకవి యనం దగండు?
జిలేబి
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిహృత్కమలమ్ము శారదకునింటిని చేసిన యోగి , భావసం...
పత్కలితుండు మాడుగులవంశజుడే కవియౌ వధానియౌ !
తత్కమనీయనామమును దాల్చిన వేరొక పూరుషుండిలన్
సత్కవి కాని నాగఫణి శర్మ వధానముఁ జేయు టెందుకో ?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
హృత్కమలమ్ము వాడగ, విహీన రసజ్ఞులు గూడు చోట, రా
రిప్లయితొలగించండిజత్కమనీయ రీతులను సమ్మతి మెచ్చఁగరాని చోట, హృ
మత్కమనీయ గాత్ర రస మానని చోటకు నేగవచ్చు నో
సత్కవి! కాని నాగఫణి శర్మ వధానముఁ జేయు టెందుకో?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
తొలగించండిహృ మత్కమనీయ.. ముద్రా దోష మనుకుంటాను. పరిశీలించండి.
కవన మల్లుట తోడుత గాన రసము
రిప్లయితొలగించండినాగ బంధము బోలిన వాణి గళము
పృచ్చ కులపాలి పండిత పుణ్య మూర్తి
నాగ ఫణి శర్మ సుకవి యనం దగండు
శతావధానంలో బ్రహ్మశీ మాడుగుల నాగఫణి శర్మ గారి పూరణ....
రిప్లయితొలగించండితత్కవిరాజ రాజ శతధా కృతిమూర్తి శిరోజరత్నమై
హృత్కమలంబులే విరియ నింపుగఁ బుట్టు ప్రభాత సూర్యమై
సత్కవి మండలీ విభవ చాతురిఁ గావ్యము లల్లఁ గల్గి యో
సత్కవి! కాని నాగఫణి శర్మ వధానముఁ జేయు టెందుకో?
పద్యమంటెను తెలియని పామరుండు
రిప్లయితొలగించండిమద్యమును గ్రోలి పలికె తా మత్తు తోడ
ఘంటశాలయె కాదంట గాయకుండు
నాగ ఫణిశర్మ సుకవియనందగండు.
ఆటమొదలు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(కంది సారుకు అంకితం)
అత్కుల బొంతలౌ కృతుల నచ్చట నిచ్చట చేర్చి కూర్చుచున్
మెత్కులు కోరుచున్ విరివి మేతకు కైతలు పల్కుచుండెడిన్
సత్కవి కాని నాగఫణి శర్మ వధానముఁ జేయు టెందుకో?
కిత్కిత లిచ్చుచున్ ప్రజకు కీర్తిని కూర్చగ కందివర్యుకున్ :)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహిమ నగోన్నత శైలి రాణించి,కవిత
రిప్లయితొలగించండిపొంగి పొరలెడు,ధిషణయన్ నింగి శశియె
నాగఫణి శర్మ--సుకవి యనందగండు
పేలవంబుగ మాటలు పేర్చి కూర్ప.
తే.గీ.అంగజాంగజు డవధాన పుంగవుండు
రిప్లయితొలగించండిపండితుండును సద్గుణ మండితుండు
విబుధ వంద్యుండు బహుశాస్త్ర విజ్ఞుఢెట్లు?
నాగఫణి శర్మ సుకవి యనందగండు.
ఆకుల శివరాజలింగం వనపర్తి
సత్కవిగ బేరుబొందెను జనతయొక్క
రిప్లయితొలగించండిసేమమునుకోరి కవనము చేయుచుండు
నాగ ఫణిశర్మ ; సుకవి యనందగండు
కవితలందు చెడుతలపు గానరాగ
తత్కమనీయమౌ కవన ధారన లోకము మెచ్చు రీతిగా
రిప్లయితొలగించండిసత్కవి విశ్వనాథు వలె శాశ్వత కావ్యము వ్రాసి కీర్తి సం
పత్కరుడైన మేలుగద!పద్యపు విద్యన మేటి రత్నమా
సత్కవి, కాని.. నాగఫణి శర్మ వధానముఁ జేయు టెందుకో?
తనదు యవధాన విద్యకు తల్లి వాణి
తొలగించండిమెచ్చి యొడిలోన గూర్చుండ నిచ్చె నెపుడొ
కుకవు లందరిఁ బొగిడెడు కుటిలు డింక
"నాగ ఫణిశర్మ సుకవి యనన్" దగండు.
పలు శతావధాన ముల తా నల య కుండ
రిప్లయితొలగించండిసలి పె నల వోకగా సర్వ సమ్మ తము గ
సాటి లేనట్టి మేటి యౌ సౌమ్యు నెటుల
నాగ ఫణి శర్మ సుకవి య నంగ ద గం డు ?
రిప్లయితొలగించండికంది వారికి విన్నపాలు
ఈ నాటి సమస్యాపూరణలన్నీ డీ టీ పీ చేసి ఫణి గారికి శంకరాభరణము తరపున పీడీయెఫ్ గా ఇవ్వవలసినదిగా మహజరు !
ఇట్లు
జిలేబి చేవ్రాలు
సంస్కృతాంధ్రముల వధానచక్రవర్తి
రిప్లయితొలగించండినాగఫణిశర్మ సుకవి;యనందగండు
దుష్కవియని నీర్ష్యగొనుచు దోషమెంచి
భారతీకృప బొందిన వాగ్మియతడు!
గరికపాటికి సరిసాటి ఘనుల లోన
రిప్లయితొలగించండినాగఫణి శర్మ, సుకవి యనం దగండు
పూసపాటి తెలుసు కొమ్ము, పురిటి బిడ్డ
గాదె నతడు తరచి చూడ కవుల చెంత
🙏🏽
తొలగించండిపూసపాటివారు పురిటి బిడ్డయితే మరి నాబోటివారు కడుపులోని పిండ సమానులమే
తొలగించండిఅబ్బే మోమొప్పుకోమండి :) యెవరేమైనా మా పూసపాటి గండుపూస పాటియే :)
గరికపాటికి సరి సాటి ఘనుల లోన
నాగఫణి శర్మ !సుకవియ! నంద! గండు
పూస పాటి మనసు కవి పూసపాటి
గాదె నితడు తరచి చూడ కవుల మధ్య!
జిలేబి
వేసినాము మునగచెట్లు వెనుక ప్రక్క,
తొలగించండికాసె నో యన్న దండిగా కాయలెన్నొ,
చెట్టు లెక్కి కోయమనుచు నెట్ట వలదు
చెల్లి , నేనెంత మీముందు చిన్న వాడ
తొలగించండిఅబ్బే కుదరదండీ మా సభలోని వారు మీరు కాబట్టి తక్కువ చేసే ప్రసక్తి లేనేలేదు .( వారిని పొగడటము విడువము కాని మా సభలోని వారు మాకు ముద్దు )
:)
జిలేబి
కవిమిత్రులకు నమస్కారములు నేను వ్రాసిన శతకము లోంచి కొన్ని పద్యాలు గురువు గారు శ్రీ శంకరయ్య గారి అనుమతి తో బ్లాగులో పెడుతున్నాను మీ అమూల్యమైన అభిప్రాయములు సూచనలు ఇచ్చి తప్పులు సరిదిద్ద ప్రార్ధన
తొలగించండిమకుటము
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
ఈ రోజు పంచ గుళికలు 1
1)తే: కోట్ల రూకలు వెచ్చించి వోట్లు కొన్న
నేత లెటుల నేల గలరు నీతి తోడ
ధనము తిరిగి సంపాదించ దారు లెంచు
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
2తే: కులము వాడనుచు నతని గుణము వదలి
యేరికోరి యా వ్యక్తిని నెన్నుకొనగ
కళ్ళు నెత్తికెక్కి యతను కాటు వేయు
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
3 తే: మా మతంబు వాడనుచు నో మందమతికి
పట్టుబట్టి నీవు పదవి కట్ట బెట్ట
నల్ప బుద్ది కల్గి నతడు నాదుకొనడు
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
4.తే భూమి దోచు రక్కస గణ భూతములకు
భయము నొoది గూoడాలకు జయము నిడగ ,
మీ గృహమ్మునే ఘనముగా మ్రింగ గలరు
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
5 తే: చదువు లేకున్న నా డబ్బు మదము కలిగి
వెధవ పనులు చేజూతురు పదవి కొరకు
` వేలు ముద్ర జనులెటుల నేల గలరు
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
🙏🏽
తొలగించండి🙏
తొలగించండి🙏🙏👌
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
తొలగించండి.......... ........
నమస్తే పూసపాటి గారూ ! పద్యాలు చక్కగా ఉన్నవి
ధన్యవాదములు
తొలగించండిఆశుకవి, నవధానియు నైన యట్టి
రిప్లయితొలగించండినాగఫణి శర్మ సుకవి! యనందగండు
సుకవి పరుని కైత హరించి చూపరులకు
తనదటంచు మాయ గొలుపి తనరు నతడు!
నాల్గవపాదంలో "మాయ గొలిపి"
తొలగించండిబోడి మల్లన్న యనురీతి బొసగె సామి!
రిప్లయితొలగించండిశర్మ యవధాన సారము సాంతము విని
నాగఫణి శర్మ సుకవి యనందగండు
నాయ నంగను బాడియే? మీకది నైతికమ్మె?
సత్కవికాని నాగఫణిశర్మ వధానముజేయుటెందుకో
రిప్లయితొలగించండిసత్కవికాదునా యనుచు సత్యప్రమాణము జేయనేర్తురే
సత్కవియౌను దెల్పుటకు సాక్ష్యములాతని పూరణంబులే
సత్కవి కానిచో నెవరు సత్కృతులీయరు గాదెయీ భువిన్
తొలగించండిసుబ్బారావు గారు సుబ్బారావు గారలే :)
జిలేబీ మయము గా వున్నది :)
జిలేబి
తత్కరుణాంబుధిన్ మునిగి ధన్యతనొందుచు సాహితీరతిన్
రిప్లయితొలగించండిసత్కవిగా ప్రజాదరణ జక్కగబొందిన భారతీ సుసం
పత్కరునిన్ సుగాత్రవరుని,బావననాముని జెప్పనొప్పునే
సత్కవిగాని నాగఫణిశర్మ వధానము జేయుటెందుకో?
మూడవపాదమున సుగాత్రవరు గా చదువ ప్రార్ధన!
రిప్లయితొలగించండినల్గురినిఁ గలిపి యొకండు నయముగఁ బలు
రిప్లయితొలగించండికంగ బహువచనమ్ము వాడంగ వలయు
నాగ ఫణి శర్మ సుకవు లనంగ వలయు
నాగ ఫణి శర్మ సుకవి యనం దగండు
ఉత్కటు నందు జాలి గొను టొప్పునె చెప్పుమ యెన్నఁ డేని యా
పత్కర మై చెలంగు నది వాని వధానము గూలుఁ గాక యీ
సత్కృపఁ జూప నేల నయ చాలును బండిత మాని కివ్విధిన్
సత్కవి, కాని, నాగఫణి శర్మవ ధానముఁ జేయు టెందుకో
[పద విభజన: సత్కవి నాగఫణి శర్మవ కాని ధానముఁ జేయు టెందుకో; ధానము = అండ]
పంచ సహస్రావధాని!నపారమైన
రిప్లయితొలగించండిధరణంబున మేధావి!దక్షుడనగ
నాగఫణిశర్మ!సికవి!యనన్ దగండు
ననెడి వాడికి దెలియక యనినమాట!
జగతి సిగలోన మెరిసిన చలువ జ్యోతి
రిప్లయితొలగించండితల్లి భారతి ముద్దుల తనయుడతడు
నాగఫణిశర్మ , సుకవి యనందగండు
నక్షరమ్ములు జాలవే నతని బొగడ!!!
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
నాగఫణి శర్మ సుకవి యనం దగండు
సందర్భము: సులభము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
మంత్ర ముగ్ధులఁ గావించు మాటలాడి..
పారవశ్యంబులో ముంచుఁ బాట పాడి..
అతులిత వధానియౌ నాత, డనకు డిటుల..
"నాగఫణి శర్మ సుకవి యనం దగండు.."
✒~డా.వెలుదండ సత్యనారాయణ
14.3.19
-----------------------------------------------------------
పరగ భానుడె యదయింప పశ్చిమమున
రిప్లయితొలగించండితేనె కెపుడును లేదన తీయదనము
సర్వ రక్షకుడే కాదు శర్వుడనిన
"నాగఫణి శర్మ సుకవి యనం దగండు"
తేటగీతి
రిప్లయితొలగించండిసంస్కృతాంధ్ర భాషల సవ్యసాచియౌచు
వాణి సంగీత సాహిత్య బాణి నెఱుఁగ
నాగఫణి శర్మ సుకవి యనం దగండు
దానిమించిన నుతులకుఁ దగునతండు
చక్కనియవధానంబులుసక్రమముగ
రిప్లయితొలగించండిచేసి ఖ్యాతిని బొందిన శ్రేష్ఠు నిఇటుల
నాగఫణిశర్మ సుకవియనందగండ
టంచనుట భావ్యమే తెల్పు డవని యందు.
యత్కథనమ్మగోచరమనాదరణీయవికల్పితమ్మునౌ,
రిప్లయితొలగించండియత్కృతిశాబ్దికార్థగతి
నన్యసుదుర్లభబోధకమ్మొ, తత్
చీత్కృతపాండితీకవనచిత్రనిరర్థకదుష్ప్రయోక్తృసం
సత్కవి కాని నాగఫణిశర్మ వధానము జేయుటెందుకో.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
*ఎన్నికల కాలం మన్నికైన కోర్కె*
రిప్లయితొలగించండిఉత్పలమాల
సత్కృప నంది భావనల చంధము గానము దీర్చి భారతీ
హృత్కమలంబదే విరియ నింపుగ బ్రహ్మకు జెప్పి వ్రాతలన్
సత్కృత నేతగా ప్రజల కందగ దిద్దెడు కోర్కెఁ గోరడే
సత్కవి? కాని నాగఫణి శర్మ వధానముఁ జేయు టెందుకో?
మత్కృత పాపమేమొ మరి మానిని పాపపు మాటవింటినే
రిప్లయితొలగించండిసత్కవితా సుధారసపు సారమెఱుంగని సాధ్వియైన యా
చిత్కళ పల్కెనిట్టుల విచిత్రపు మాటల నాలికింపుడీ
సత్కవికాని నాఘఫణి శర్మ వధానముఁ జేయుటెందుకో.
హృత్కమలమ్ముఁ నిల్చువిధి హృద్యముగా పఠియించుపద్యముల్
రిప్లయితొలగించండిసత్కవి, కాని, నాగఫణి శర్మవధానము చేయుటెందుకో
సత్కరుణామృతమ్ము నిల సర్వజనాళికిఁ బంచు శారదా
సత్కృపఁ బొందినట్టి ఘన సాంద్రులు వ్రాయక దివ్యకావ్యముల్.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఆగమై యమెరికా లోన నడుగు చెడెను
చేసె కవనము నడతను జీల్చె;నొజ్జ
దేది?శర్మకు దగనిదౌ తీరు జూడ;
నాగఫణిశర్మ సుకవి యనందగండు!
కాళేశ్వరం నుండి వచ్చిన మా బాల్య మిత్రునితో కొన్ని ముఖ్యమైన పనుల మీద రోజంతా తిరుగవలసి వచ్చింది. ఇంతకుముందే అలసటతో నెలవు చేరుకున్నాను. మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.
రిప్లయితొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఛత్క!వనమ్మహంబుగొను సాధన,సర్కసు యాట గాదు
సత్కవులను గూర్చి ఛందమున సాగరె !పంక్తిని బృచ్ఛకుండ్రు;వి
ద్వత్కవి భారతంబు గొని వాయనమిచ్చును;కావ్యమేది? యీ
షత్కవి కాని నాగఫణిశర్మ వధానము జేయుటెందుకో
సవరణతో
రిప్లయితొలగించండి============
తను శతావధానములు జేసిన ఘనుండు
*"నాగఫణి శర్మ సుకవి యనం, దగండు"*
నితర కవితల నల్లగ నెవ్వరైనఁ
బద్యముల నల్లువారలే వసుధఁ సుకవి