8, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2951 (పరులు సేయనొప్పు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పరులు సేయ నొప్పు పాలనమ్ము"
(లేదా...)
"పరులు సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్"

57 కామెంట్‌లు:

  1. చెరువు లారి నపుడు చేపలు చావగ
    కరువు వచ్చి నపుడు కాస్త వంగి
    పురుషు లెల్ల రొల్లి కురిసిల కూర్చొన
    "పరులు" సేయ నొప్పు పాలనమ్ము :)

    రిప్లయితొలగించండి
  2. పుడమి నేలు రాజు భోగము లనువీడి
    సన్య సింప గోరి వన్య ములకు
    తరలి వెడలి నంత తనవార లెవరైన
    పరులు సేయ నొప్పు పాలనమ్ము

    రిప్లయితొలగించండి

  3. భాజ్పాకే మీ మత్ దాన్ (మత్తు దాన్ :) వేతురు గాక ! :)


    భరత భూమి మనది బంగరు భూమి జి
    లేబి మురిపెముగను లెస్స గాను
    పది పదులుగ మనకవసరము నేడు త
    త్పరులు సేయ నొప్పు పాలనమ్ము!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. పెరటి లోని కూర కొరకాదు మందున
    కంద్రు మనుజులు సత మవనిపైన
    పొరుగు కొంప లోని పుల్లకూర రుచించు
    పరులు సేయ నొప్పు పాలనమ్ము

    రిప్లయితొలగించండి
  5. పరుల వలెన్ స్వదేశజన
    భావము కెక్కక కల్పియుంచు కూ
    ర్పరులు ; విభిన్నయోచనల
    రాష్ట్రము ముక్కలు చేయనీని తీ
    ర్పరులు ; స్వవేషముల్ నడలు
    భాషల నెంచని ధర్మమందు ద
    త్పరులు ; సమస్తరాజ్యమును
    పాలన సేయగ నొప్పు నెప్పుడున్ .
    ( రాష్త్రము - దేశము )

    రిప్లయితొలగించండి
  6. కూడు గుడ్డ నీరు కోరుకున్న చదువు
    శాంతి సౌఖ్యములను జనుల కెపుడు
    నంద జేయునట్టి యనఘులు నిస్వార్ఠ
    పరులు సేయనొప్పు పాలనమ్ము.

    రిప్లయితొలగించండి

  7. జైబోలో భాజ్పాకీ హరిహర మోడీ :)



    అరరె! జిలేబి దేశమిది యద్భుత మైనది వేదమేను దీ
    ని రవళి! కార్యకర్తలన నీతినిజాయతి యొప్పు వారలే
    సరి! సరి భాజపాయె మరి! శంకరుపైన దురాయి! వారె, త
    త్పరులు, సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. కొత్తగా పెళ్ళయిన నేటితరం అమ్మాయి తొలిరేయి తంతు, ఈ పాలగ్లాసు పట్టుకెళ్ళడం, అమ్మలక్కల పరాచికాలు అంటే చిరాకుపడుతోంది. అప్పుడు బామ్మగారు అన్నారు కదా!

    "ఓ కొత్తపెళ్ళి కూతురా!
    తాజా పాలలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీర కణాలకు శక్తిని అందిస్తాయి. తక్షణ శక్తిని కార్బోహైడ్రేట్స్ ద్వారానే పొందగలుగుతారు. పాలు తీసుకోవడం వల్ల మెటబాలిజం సరిగా ఉంటుంది. అలాగే విటమిన్ డి అందుతుంది. అలసట, ఒత్తిడిని దూరంగా ఉంచడానికి పాలు సహాయపడతాయి. అందుకే ...

    మరులు గొనిన వాడు మధురమయిన రేయి
    పంచుకొనగ వేచె! పాల గ్లాసు
    చేతబెట్ట గానె చిత్రమా! నిను గేలి
    పరులు సేయ నొప్పు! పాలనమ్ము!!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఇవ్వాళ విట్టు బాబు గారు రాజశేఖరుల వారిని‌ తలపించేసారు :)

      ఆ బామ్మ జిలేబి బామ్మ యే :)


      జిలేబి

      తొలగించండి


    2. ఇంతకీ రాజశేఖరుల వారేమిటి మరీ నల్లపూసై పోయేరు ? సీతాకళ్యాణం తరువాయె వస్తారా ? రామనవమి కి యెదురు చూడవచ్చా ?


      తెలుపగలరు

      చాన్నాళ్లాయె వారి కథాకమామిషుల వాయ్స్ మేజిక్కుల చదివి విని !

      వెంఠనే సభలోన్ రావలెన్ !

      విన్నపాలు వినవలెను వింత వింతలు :)


      ఇట్లు
      జిలేబి

      తొలగించండి
    3. విట్టుబాబుగారి వివరణ బాగున్నది!శీఘ్రమేవ క్షీరప్రాప్తిరస్తు!!

      తొలగించండి
    4. జిలేబిగారూ,కోటవారు మొన్నటివరకూ పుత్రసమాగమంతో వ్యస్తులై ఉన్నారు.సీతారామ కల్యాణమును ఇంకా ఆరంభించలేదనుకుంటున్నాను.ఈ సంవత్సరాంతానికి పూర్తి చేయాలని సంకల్పించారు. మీ విన్నపాలను విన్పిస్తాను.

      తొలగించండి
    5. జిలేబి గారూ!
      సీతారామకల్యాణం చేశాక గానీ పూరణలజోలికి రానని చెప్పారు కోటవారు

      తొలగించండి
    6. సీతారామ కల్యాణము 2020 శ్రీరామనవమికి పూర్తవుతుందని కోటవారు శలవిచ్చారు!అందాకా బ్లాగుకు శలవు ప్రకటించారు!

      తొలగించండి
  9. ఎదుటి వారి స్థానమది తనదిగ భావ
    నెంచి సతము యోచనెంచి తగిన
    రీతి న్యాయమెంచు లెస్సగు న్యాయత
    *త్పరులు సేయనొప్పు పాలనమ్ము*

    రిప్లయితొలగించండి
  10. నా ప్రయత్నం

    ఆటవెలది
    ప్రజలు కట్టి నట్టి పన్నులనుచు తిన్న
    పాము లౌచు నవియె పగను బెంచు
    సేమ మెంచి వాడి ప్రేమలరయు పొదు
    పరులు సేయ నొప్పు పాలనమ్ము

    చంపకమాల
    గిరుల పరిశ్రమాలికి ప్రకీర్తిత పంటపొలాల బీదకున్
    పరిమితి మేరపంచి ప్రజ బాగొన గూర్చిరటంచు నమ్మెడున్
    గురుతర బాధ్యతల్ దెలిసి కోరిన వృద్ధిని నందఁ బూను సొం
    పరులు సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  11. ప్రజల మేలు గోరి వలసిన మార్పు లు
    సాహసము న జేసి సత్వరము గ
    చెడు ను బెల్లగించు శేము షులై నతెo
    పరులు సేయ నొప్పు పాల నంబు

    రిప్లయితొలగించండి
  12. సకల భావములను సాధులు విబుధులు
    సర్వమెరిగి తన్ను శరణు వేడ
    కమల నయను వేడ కాయడా! భక్తితత్
    పరులు సేయ నొప్పు పాలనమ్ము

    రిప్లయితొలగించండి
  13. సమస్య: పరులు సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్
    నిరతము సొమ్ముపై మనసు నిల్పుచు దోచుచు పేద వారలన్
    సరసములాడుచున్ సతము చక్కని కన్యల చెంతచేరుచున్
    దురితములన్ మునుంగు కడు ధూర్తుల నాశము చేయు కీర్తి త
    త్పరులు సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  14. ప్రజల మేలుగోరి పారాకులేకయె
    దరులు లేనియట్టి దయనుగల్గి
    సత్వగుణము తోడి సద్ధర్మచింతన
    పరులు సేయనొప్పు పాలనమ్ము

    రిప్లయితొలగించండి

  15. భావ మందు మేటి సేవాను రక్తియు
    పేదలనిన చాల ప్రేమ కలిగి
    కరుణ యందు వాంఛ కలుగు గొప్ప త
    త్పరులు సేయ నొప్పు పాలనమ్ము

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠాః
    పాపే పాపరతాస్సదా !
    రాజానమనువర్తంతే
    యథా రాజా తథా ప్రజాః !!


    ఇరవుగ రాజు ధర్మమతి యేని ప్రజల్ గన ధర్మబద్ధులౌ...
    దురతడె పాపి యేని కడు దుష్టులు పాపులునౌదురిద్ధరన్!
    నరపతి యెట్లొ పాలితులునట్లె చరింతురు , గాన ధర్మ త....
    త్పరులు సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  17. చం.
    పరుల హితమ్ముగోరఁ గలవారలు పాలన నీతి ముందుచూ
    పరులు, జనాభివృద్ధికి నిబద్ధులు, ధీరులు, శూరులైన కా
    పరులు, శిలామనీషులు, కృపాహృదులార్యజనోక్త ధర్మ త
    *"త్పరులు సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్"*

    - విట్టుబాబు

    రిప్లయితొలగించండి
  18. గురుదేవులకు వినమ్రవందనములు
    ============********==========
    రాజకీయ మందు లక్ష కోట్లలను పొంది
    చిలుక పలుకు బలుక చిత్రము గను
    పలికె నీతి లేని వారలు "నవినీతి
    పరులు " సేయ నొప్ప పాలనమ్ము!

    రిప్లయితొలగించండి
  19. ప్రజల సేమ మరసి బహువిధములయుక్తి
    పరులు సేయనొప్పు పాలనమ్ము
    చీకు చింత లేని జీవన మార్గము
    నెన్ను కొందు రపుడు మన్ను జనులు

    రిప్లయితొలగించండి
  20. రాజకీయ మిటను రాజుకొనియె, నీదు
    ఓటు నమ్మి వేసి ఓడ వద్దు
    మంచి నెగ్గి నపుడె మనకు మేలగు! నీతి
    పరులు సేయ నొప్పు పాలనమ్ము!

    రిప్లయితొలగించండి
  21. వీరు వార నియెడి భేద భావము లేక
    యందఱి యెడ నొక్క చంద ముండి
    శాంత మూర్తు లౌచు సంతత సద్ధర్మ
    పరులు సేయ నొప్పు పాలనమ్ము


    అరు లధికమ్ముగా నునిచి యార్జనమం దనునిత్యముం బ్రగా
    ఢ రతి వహించి నిర్దయయు డంబము నెక్కొన లోభ మోహ త
    త్పర జన వంచనా కలిత ధర్మ పరిచ్యుత రాజ కోటికిం
    బరులు సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  22. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సందర్భము : మహిళల దినము

    డింపులయ్య డింపులమ్మతో:👇

    తెరచుచు కండ్లు చూడుమిట తేరకు చేసెను మమ్మి రాజ్యమున్
    తెరలకు చాటు దాగుచును త్రిప్పగ యంత్రము వ్రాలె నోటులే
    దరువులు వేసి నాయకులు దండము పెట్టుచు నాట్యమాడిరే
    పురుషులు వట్టి ఛాందసులు పుణ్యము పాపము నెంచుచుండ, సొం
    పరులు సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  23. డా.పిట్టా సత్యనారాయణ
    బిర్రు కొలది వాని బెంచి పెద్దసేయ
    బుర్రుమనుచు మరచు భూమిక నట
    వాడు మన పరాయి పాలక నీతి త
    త్పరులు సేయ నొప్పు పాలనమ్ము

    రిప్లయితొలగించండి
  24. గురువుగారు బ్లాగును వీక్షించరా? 3000 సమౄస్యల తర్వాత శంకరాభరణానికి స్వస్తి చెప్తారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎందులకు ఈ అనుమానం? ఓపిక ఉన్నన్నాళ్ళు శంకరాభరణం సమస్యలు ఇవ్వడం వదలనని అన్నారుగా ఆ మధ్య? వారి పుస్తక ముద్రణలో వ్యస్తులై ఉంటారు బహుశ. చిన్న పని కాదుగా అది!

      తొలగించండి
    2. దత్తాత్త తన్వి రాగపుఁ
      దత్తరమున నుత్తలముగఁ ద్యాజ్యం బయ్యెం
      జిత్తంబున నిజ భృత్త
      న్వాత్త లసత్తార శంకరార్యా తగవే!

      తొలగించండి
    3. సీతా:

      నేటి సమస్యను శంకరయ్య గారు అర్ధరాత్రి 1.41 గంటలకు వ్హాట్సప్ సమూహంలో విడుదల చేసి పడుకున్నారు. నా పూరణలను అప్పుడే తయారుచేసికొని ఆటవెలదిని బ్లాగులో సమస్య విడుదల కాగానే 5.00 కు ప్రచురించాను. ఆటవిడుపుది శ్రీ కామేశ్వర రావు గారి పిదపనే :)

      తొలగించండి
    4. పూజ్యులు కామేశ్వరరావుగారూ, దయచేసి మీ పద్య ప్రతిపదార్ధ తాత్పర్యములను యివ్వ ప్రార్ధన!ఇన్నేసి సంధులు, సమాసాలు నాబోంట్లకు అవగాహన కావడం కష్టమే!

      తొలగించండి
    5. గురువుగారు ప్రశ్నలిస్తున్నారుగానీ,సమాధానాలు చూసే తీరికలేకుండా ఉన్నారిటీవల!కనుక ఒక లాండ్ మార్క్ (దీనికి తెలుగు పోచిరాజు వారే యివ్వాలి) చేరుకున్నాక (3000 ఎపిసోడ్లు,మా స్టార్ మహిళ లాగ)మానేస్తారేమోనని అనుమానం వచ్చింది!

      తొలగించండి
    6. అనుమానం వలదు. ఇటువంటి landmarks ను ఎన్నో దాటారు పూర్వం...మనబోటి వాళ్ళ ప్రార్థనలను మన్నించి...

      తొలగించండి

    7. దత్తాత్త తన్వి రాగపుఁ
      దత్తరమున నుత్తలముగఁ ద్యాజ్యం బయ్యెం
      జిత్తంబున నిజ భృత్త
      న్వాత్త లసత్తార శంకరార్యా తగవే!

      దత్త - ఇవ్వబడిన
      అత్త - తినువాడు ?
      తన్వి - తనివి ; ఆడుది;
      రాగపు
      తత్తరమున - ఇన్ పానిక్ : సంభ్రమమున
      ఉత్తలముగ - త్వరగా
      త్యాజ్యము - వర్జించు
      అయ్యెను
      చిత్తంబున
      నిజ
      భృత్
      తన్వ
      అత్త
      లసత్
      అర
      శంకర
      తగవే

      జిలేబీ మయముగా వున్నది :)


      జిలేబి

      తొలగించండి
    8. లాండ్ మార్క్ ను లక్ష్య మన వచ్చు. పర్వ మన వచ్చు. కణు పన వచ్చు. గమ్య మన వచ్చు. మె ట్టన వచ్చు.
      బ్లాగ్ ( వెబ్ లాగ్) ను “జాల క్రమ మ”నవచ్చు. “వల వ్రాతల గమి” యన వచ్చు.

      డా. సీతా దేవి గారు నా యీ దత్త వివరణమున నా భావమును గ్రహించి నట్లు దలఁచెదను.
      జిలేబి గారు చాలా దగ్గరకి వచ్చారు.

      దత్త ఆత్త తన్వి రాగపుఁ తత్తరమునన్ ఉత్తలముగన్ త్యాజ్యంబు అయ్యెన్ చిత్తంబున నిజ
      భృత్ తను ఆత్త లసత్ తార శంకరార్యా! తగవే?
      ఆత్త పొందఁ బడిన
      నిజ భృత్తన్వాత్త లసత్తార : శంకరాభరణము; దత్తాత్త తన్వి : ఇతర జాల క్రమము (బ్లాగ్) .

      తొలగించండి

    9. Landmark -/ సీమానిర్దేశక చిహ్నము


      జిలేబి

      తొలగించండి


    10. కంది వారి జవాబు :) జిలేబి కిట్టింపు :)


      నిజ భృత్తన్వాత్త లసిత
      సుజనుల కవివరుల వీడుచున్ మధు బాలా
      ర్థి జనిత శంకర శతకము
      న జతనముగ సమయమయ్యె నను నమ్మండీ :)


      జిలేబి

      తొలగించండి
    11. ధన్యవాదములు,నమస్సులు జిలేబిగారికి మరియు కామేశ్వరరావుగారికి!

      తొలగించండి
  25. డా.పిట్టా సత్యనారాయణ
    సురుచిర భారతావనిని జూచి యసూయను జెంది వచ్చి త
    స్కరులు శతాబ్దులాదిగ నపార సుసంపద లార్చి వేయగా
    జరుపు ప్రయత్నముల్ గనక "చాలును రైళ్ళను విద్య బెంచి రం"
    చరమొలేక విజ్ఞులటు జాగృతి గానక నమ్మి రిట్టులా
    "పరులు సమస్త రాజ్యమును పాలన సేయగ నొప్పు నెప్పుడున్"


    రిప్లయితొలగించండి
  26. అరయుచు సేమమున్ బ్రజల హర్షము జూచుచునట్టియాదయా
    పరులు సమస్త రాజ్యమునుపాలనజేయగ నొప్పునెప్పుడున్
    గరువది యెంతవచ్చినను గాసిలుబెట్టక పన్నులన్నియున్
    నరకొరగాగదీయుచును నందరిమోములుసక్కజేవలెన్

    రిప్లయితొలగించండి
  27. మహిళ లేని చోటు మహిలోనగనరాదు
    మహిళ యనగనదియె మహిమ గలది
    మహిళ విలువ దెలిసి మాన్యతగల నీతి
    *"పరులు సేయ నొప్పు పాలనమ్ము"*!!

    రిప్లయితొలగించండి
  28. ఓట్ల చేతగలచి!నోడించి మనల కా
    పరులు సేయనొప్పు!పాలనమ్ము
    లాభలోభమందు లౌక్యానజీవంచు
    నాయకుండె మేటి మాయగాడు!

    రిప్లయితొలగించండి
  29. ధరణి నేలు రాజ్య, ధన, జయ, సంతాన,
    జ్ఞాన, ధాన్య, ధైర్య, శౌర్యములను
    వనిత రూపులనెడి భరతదేశమున రూ
    పరులు సేయ నొప్పు పాలనమ్ము

    రూపరి= స్త్రీ

    రిప్లయితొలగించండి
  30. పరులకు మేలొనర్చదగు పంతము గల్గిన వారు నేతలై
    సరియగు నిర్ణయమ్ములు ప్రజాభిమతమ్మును గారవించుచున్
    నిరతము జేయువారు ఖలు నీచుల దూరము నుంచు ధర్మత
    త్పరులు సమస్త రాజ్యమును పాలన సేయగ నొప్పు నెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  31. వెఱ్ఱి మాట కనగ వినుమ దేవిధము దా
    పరులు సేయ నొప్పు పాలనమ్ము?
    సత్య వాక్య మిదియె సర్వకాలముల కా
    పరులు సేయ నొప్పు పాలనమ్ము!

    రిప్లయితొలగించండి
  32. గోవు ఇంట నున్న గోముగా పిండిన
    నీరు లేని పాలు నిక్క మనుచు
    దూడ మూతి గట్టి ధుఃఖంబు పడకుండా
    పరులు సేయ నొప్పు పాలనమ్ము

    ఇంట గెలిచి నోడు ఇలపైన తాగెలిచి
    పరులు సేయ నొప్పు పాలనమ్ము
    నమ్మ కున్న ఇదియె నరుడ సత్యమ్మురా
    నరులగోల వినుర నారసింహ

    రిప్లయితొలగించండి


  33. ప్రజల వెతల నరసి బాగుగా స్పందించి
    వారి బాధలెల్ల బాపి వేగ
    సంతసమ్ము కూర్చి జయము నిచ్చు వివేక
    పరులు సేయ నొప్పు పాలనమ్ము.

    రిప్లయితొలగించండి