12, మార్చి 2019, మంగళవారం

సమస్య - 2955 (క్రూరుని మార్గమే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్"
(లేదా...)
"క్రూరుని మార్గమే మనకుఁ గూర్చును ముక్తి నటన్న సత్యమౌ"

75 కామెంట్‌లు:



  1. ఆరని మంటయగునురా
    క్రూరుని మార్గమ్మె మనకుఁ, గూర్చును ముక్తిన్
    చేరుచు గురువుల వేదపు
    సారము నేర్వగ ప్రపత్తి సాధన‌తోడై



    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ( రాయబార సభలో ద్రోణునితో భీష్ముడు మెల్లగా అంటున్నాడు )
    ఆరని పగసెగల తృణీ
    కారపు పలుకుల విడడిక కలుషితమతియౌ
    రారాజు ; వినడు హితమును ;
    క్రూరుని మార్గమ్మె మనకు గూర్చును ముక్తిన్ .

    రిప్లయితొలగించండి
  3. కిట్టింపు: 👇

    శూరుడు కృష్ణుని భక్తుడు
    తీరుగ ధర్మపు నిరతుడు ధీరుండగునా
    వీరుడు యాదవుడగు న
    క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఈ పూరణలో నాకైతే ఎలాంటి కిట్టింపు కనిపించడం లేదు.

      తొలగించండి
    2. కిట్టింపార్టీ!
      (కిట్టింపు అనే ఆర్టు గలవారు)
      😃🙏🏻🙏🏻

      తొలగించండి
    3. అక్రూరుని గురించి ఇప్పుడే గూగులులో పైపైన చదివి ధైర్యము చేసితిని..."ధైర్యే సాహసే ..."

      🙏

      తొలగించండి


  4. భారము కాదు జీవితము బాధ్యత తోడుగ కర్మ మార్గమున్,
    సారము నాల్గు వేదముల సర్వము నేర్వగ! భక్తి మార్గమే
    తీరము చేర్చు నెల్లరిని దేహపు కాముము వీడ!గాన న
    క్రూరుని మార్గమే మనకుఁ గూర్చును ముక్తి నటన్న సత్యమౌ!

    అక్రూరుడు - సౌమ్యుడు


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. 👌🏻👏🏻👌🏻
      💐
      మీరంతా అక్రూరుని మార్గాన్ని పట్టినారు కావున క్రూరుని మార్గమే నాకు మిగిలినది.
      😀🙏🏻

      తొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    ధీరగభీరభావనిజధీపరిపూర్ణుడు , భక్తిమార్గసం...
    చారపరాయణుండు , పదసన్నిధి పెన్నిధిగా దలంచి కం...
    సారిని నమ్మినట్టి గుణసాంద్రుడు , మోహవిదూరుడైన అ...
    క్రూరుని మార్గమే మనకుఁ గూర్చును ముక్తి నటన్న సత్యమౌ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఈ పద్యం లో చిరు సవరణ కు మన్నించండి 🙏

      ధీరగభీరభావజనిధీపరిపూర్ణుడు , భక్తిమార్గసం...
      చారపరాయణుండు , పదసన్నిధి పెన్నిధిగా దలంచి కం...
      సారిని నమ్మినట్టి గుణసాంద్రుడు , మోహవిదూరుడైన అ...
      క్రూరుని మార్గమే మనకుఁ గూర్చును ముక్తి నటన్న సత్యమౌ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  6. ధారణ సేయుచు మనమున
    శ్రీ రమణున్ కమలనాభు చిన్మయ రూపున్
    తీరుగ వేడుము; వర అ
    క్రూరుని మార్గమ్మె మనకు గూర్చును ముక్తిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వర + అక్రూరుని = వరాక్రూరుని' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు కదా! "తీరుగ వేడుకొను మ।క్రూరుని..." అనండి.

      తొలగించండి
  7. రిప్లయిలు
    1. భారతపావనప్రకటభాగవతాదికథేతిహాసముల్
      సారవిచారదృష్టి మనసార పఠించిన వేద్యమౌ గదా
      దారులు శాశ్వతస్థితివిధాయము లెయ్యవొ?, కాన చేరు మ
      క్రూరుని మార్గమే, మనకుఁ గూర్చును ముక్తి నటన్న సత్యమౌ.

      కంజర్ల రామాచార్య
      కోరుట్ల.

      తొలగించండి
    2. రామాచార్య గారూ,
      చక్కని పూరణ. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  8. సనక సనందనాదుల శాపానికి గురైన జయవిజయులను నాభక్తులుగా ఏడు జన్మలు కావాలో, నా శత్రువులుగా మూడు జన్మలు కావాలో తేల్చుకోమన్నపుడు వారి భావనగా నా ప్రయత్నం

    భారము దూరంబగుటయుఁ
    గారణ మేదైన మనలఁ గాచును హరియే
    తీరున మూడు జననములఁ
    *"గ్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్"*

    రిప్లయితొలగించండి
  9. పోరున మరణము పొందిన
    వీరుడ వనిపేరు పొందు వేయి విధమ్ముల్
    కారణ మేదైన గానీ
    క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  10. తీరుగ ధర్మము వీడక
    చేరిచి మాధవు మనమున చెరగని భక్తిన్
    ప్రేరణ జగతికి నిచ్చు న
    క్రూరుని మార్గమ్మె మనకుగూర్చును ముక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ద్వారకానాథ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "ప్రేరణ జగతికి నిడు న।క్రూరుని..." అనండి.

      తొలగించండి
  11. asnreddy

    నేరపు ప్రవృత్తితోడను
    దూరుచు బుధవర్గముఁ జన దుర్మార్గమునన్
    రౌరవము కలుగు, సత మ
    క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్

    రిప్లయితొలగించండి
  12. పారగ భక్తి మనమ్మున
    చీరునదే పాపములను క్షేమంబలరన్
    వేరు తెఱగులేలా?అ
    క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్

    రిప్లయితొలగించండి
  13. ఎరిగిన భాగవతమ్మున
    నేరున నవవిధములందుc గేవల భక్తిన్
    మరువక మదిని దలచుచు నc
    క్రూరుని మార్గమె మనకు గూర్చును ముక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసింపదగినది.
      మొదటి, మూడవ పాదాలను లఘువుతో ప్రారంభించారు. కందంలో మొదటి పాదాన్ని లఘు గురువులలో దేనితో ప్రారంభిస్తామో మిగిలిన పాదాలను దానితోనే ప్రారంభించాలి. రెండవ పాదంలో యతిదోషం. మూడవ పాదం చివర అరసున్న అవసరం లేదు. నా సవరణ....
      పేరగు భాగవతమ్మున
      నేరిచి నవవిధములైన నిర్మల భక్తి
      న్నేమరక మదిని దలచి య
      క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్.

      తొలగించండి
    2. ఆరంభములో నున్నాను. మీ సూచనలు పాటిస్తాను. మీరు చూపిస్తున్న ప్రేరణకు, ప్రేమకు ధన్యవాదములు. 🙏🙏🙏

      తొలగించండి
  14. ఉత్పలమాల
    సారవిహీన సంసృతి విశాల సముద్రము నందు లీనమై
    పారముగానలేక బహు బాధల నొందుచు భక్తిహీనుడై
    చేరును దుర్గతిన్ నరుడు,శ్రీపతిసేవలొనర్చు నట్టి య
    క్రూరుని మార్గమేమనకు గూర్చును ముక్తి నటన్న సత్యమౌ.
    ఆకుల శివరాజలింగం వనపర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆకుల శివరాజలింగం గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  15. కోరని నరకము జేర్చును
    క్రూరుని మార్గమ్మె ; మనకు గూర్చు ను ముక్తిన్
    తీరుగ దైవము గొల్చు చు
    కారుణ్య ము జూపి మెలగ కందువ భక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. క్రూరుడగు కంసుని వధకు
    ప్రేరణ కృష్ణున కొసంగి ప్రియమును గూర్పం
    గారణ భూతుడయిన య
    క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్ !

    రిప్లయితొలగించండి
  17. కోరికలడగించి హరిని
    జేరుటకన్నను మరియొక క్షేమముగలదా?
    చేరగ నాతారకుడ న
    క్రూరుని మార్గమ్మెమనకు గూర్చును ముక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దారులగాచుచున్ జనుల దారుణరీతిని దోచువాడయున్
      ప్రేరణనొంది దేవముని బ్రీతిగజెప్పిన రామనామమున్
      దారకమంత్రమున్ బలికి ధన్యతనొందిన రామభక్తుడౌ
      క్రూరునిమార్గమే మనకుగూర్చును ముక్తినటన్న సత్యమౌ

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మూడవ పాదం అర్థం కాలేదు.
      రెండవ పూరణలో 'దోచువాడయున్' అనడం సాధువు కాదు. "దోచువాడెయై" అనండి.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! ఆ తారకుని చేరుకోవడానికి అక్రూరుని మార్గమే తగినదని భావమార్యా!
      రెండవ పూరణను సవరిస్తాను!నమస్సులు!

      తొలగించండి
  18. రౌరవమునకున్జేర్చును
    గ్రూరుని మార్గమ్మె,మనకు గూర్చును ముక్తిన్
    గారణ జన్ముని సాయిని
    గారుణ్యము కలుగువరకు గయిదండలిడన్

    రిప్లయితొలగించండి


  19. ధోరణి జిహాది మార్గపు
    ప్రేరణ సమ్మత మతంబు రేయింబవలున్
    ధీరత్వమ్మను పేరిట
    క్రూరుని మార్గమ్మె మనకు గూర్చును ముక్తిన్ !


    రిప్లయితొలగించండి
  20. క్రూరుండౌ కంసు నడచ
    సూరికి దారిని మఱింత సుగమము జేయన్
    క్రూరత్వము చేరని య
    క్రూరుని మార్గమ్మె మనకు గూర్చును ముక్తిన్!

    రిప్లయితొలగించండి
  21. పోరది వినాశ హేతువు
    మారణ హోమమ్ము గాక మమకారమునే
    కోరుము రాజా ! యను న
    క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్

    రిప్లయితొలగించండి
  22. ధారుణి వెల్గిన సత్య వ
    చో రతు లెల్లరుఁ జరించి చూపిన ఘనమౌ,
    చేరఁగ నీకుమ యెన్నఁడుఁ
    గ్రూరుని, మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్


    దారకు చే నెఱింగిన నుదార యదూత్తమ వంశ నాశమున్
    ధీరతఁ జెప్పెఁ బార్థునకు దీనుఁడు నా సదసద్విచార వి
    స్ఫారుఁడు యాదవాన్వయుఁడు శౌరి నిజాత్మ విదుండు సౌమ్యుఁ డ
    క్రూరుని మార్గమే మనకుఁ గూర్చును ముక్తి నటన్న సత్యమౌ

    రిప్లయితొలగించండి
  23. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    దూరుచు "గోవు-రక్షకుల" తుంటరి హృత్తుల సందుగొందులన్
    పోరుచు హిందు వైరులను పొంకము మీరగ "రోము-రోమమున్"
    వీరుడు నుగ్రవాదులను పేల్చుచు చీల్చుచు పాకి వారికిన్
    క్రూరుని మార్గమే మనకుఁ గూర్చును ముక్తి నటన్న సత్యమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మ్ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. రౌరవ నామకంబనెడు రొచ్చున వేయును నెల్లవేళలన్
    గ్రూరుని మార్గమే మనకుగూర్చును ముక్తినటన్న సత్యమౌ
    కారణజన్ముడా రమణుగాంక్షలు మీరగ వేడుచో నికన్
    నారమణుండె యిచ్చుననునాశలుదప్పకయుండుగావుతన్

    రిప్లయితొలగించండి
  25. ప్రారబ్దమ్మునజేసిన
    ఘోరపు పనులే జనముల గూర్చగ నిడుముల్
    పోరగ పాపవిముక్తిన
    క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గంగాప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విముక్తిని' అనండి.

      తొలగించండి
  26. ఆరనిమంటగు కోర్కెలు
    క్రూరుని మార్గమ్మె!మనకు గూర్చునుముక్తిన్
    ప్రేరణ దైవాంశమ్మే
    జేరక సాధ్మమ్ముగాదు చుంతించుమయా!

    రిప్లయితొలగించండి
  27. పూరింపగ దత్తపదిన
    వీరుడు మారుడని మరల వెనుకగ త్రోసెన్
    ధీరుని,చివరిదనఁ? దెలిపె
    "క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్"

    రిప్లయితొలగించండి
  28. సవరించిన పూరణ
    --------------------
    పోరున మరణము పొందిన
    వీరుడ వనిపేరు పొందు వేయి విధమ్ముల్
    కారణ మేదైన తగును
    క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్

    రిప్లయితొలగించండి
  29. నా ప్రయత్నం :

    కందం
    ఊరించ యుగపురుషుఁడని
    భూరిగ గని పంచభూతములనన్నిట నా
    శౌరినిఁ దనరిన నయ్య
    క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్

    ఉత్పలమాల
    శౌరినిఁ జూచి తక్షణమె సర్వము నిండిన వాడె తోచ శా
    రీరక మానసాదుల పరీక్షగ గాంచుచు రక్షకుండు ను
    ద్ధారకుఁడీతఁడే ననుచు తన్మయ మందుచు ధన్యుడైన న
    క్రూరుని మార్గమే మనకుఁ గూర్చును ముక్తి నటన్న సత్యమౌ

    రిప్లయితొలగించండి
  30. భోరున నేడ్వఁగ జేయును
    క్రూరుని మార్గమ్మె ; మనకుఁ గూర్చును ముక్తిన్
    శ్రీరాముని జపమెంచగ
    తారా జువ్వ వలె జీవితంబది వెల్గున్

    రిప్లయితొలగించండి
  31. సారపు ధర్మము నరయుచు
    మారుని జనకుని తలచుచు మదిలో నెపుడున్
    గారవముంచి తిరుగు న
    క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్"*

    రిప్లయితొలగించండి
  32. భోరున నేడ్వఁగ జేయును
    *క్రూరుని మార్గమ్మె ; మనకుఁ గూర్చును ముక్తిన్*
    శ్రీరాముని జపమెంచగ
    తారా జువ్వ వలె జీవితంబది వెల్గున్

    రిప్లయితొలగించండి