పారావారమె కద సంసాసము దారాసుతులను సాకుట కొరకై పోరాటమె జేసెడు సంసారుల కెందుల కొ యీ వసంతోత్సవముల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'సంసారము' టైపాటు.
ధన్యవాదాలు గురువుగారు..
గురువర్యులకు నమస్సులు,నా నిన్నటి మొన్నటి పద్యములను పరిశీలింప ప్రార్థన."కళ్ళు బైర్లు క్రమ్మె, బలము కరగి పోయె వలదు వలదిహ లోకపు వైభవములువినుడు హాయిన్ గొలుపదీ కదనము నాకుకృష్ణ! మఱలెద"మని గుడాకేశు డనియె!ఆ కుల మీ కుల మన పెను వ్యాకులము సృజించి నంత పబ్బము గొనెడిన్కాకులు కానేరని పలుగాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్!ఆ కుల మీ కుల మన పెను వ్యాకులము సృజించి నంత పబ్బము గొను నా లోకులు కలిగించెడి చీకాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్!పలుగాకులు సరికాదేమోనని సవరించి రెండవది వ్రాసాను ధన్యవాదములు
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
వత్సర మంతయున్ గొణిగి వాతపు పిత్తపు బాధలందునన్మత్సర మంతయున్ సమసి మందులు మాకులు మ్రింగుచుండగా నుత్సుక మంతయున్ సడలు చుండగ రంగుల భంగులన్ వసం తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏కొండాటమే ఈరోజు నాకు :)
హింసాత్మకమాయె బ్రతుకు,కంసులె కనవత్తురసలు కానము విలువల్,ధ్వంసము సమాజమింకెడ?సంసారులకెందుకీవసంతోత్సముల్..?ఇచ్చినట్లుగానే పూరించాలంటే..భారపు బ్రతుకుల నీడ్చుచుపేరుకుపోయిన కలతలు, పేదరికమ్మున్,దారికి రాకున్నను సంసారులకెందులకొ? యీ వసంతోత్సముల్..
మీ రెండు విధాల పూరణలు బాగున్నవి. అభినందనలు.నిజానికి నిన్న ముందుగా సిద్ధం చేసుకున్న సమస్య... "సంసారుల కేల యీ వసంతోత్సవముల్" ఆ తరువాత వృత్తపాదం ఛందోగోపనంతో సిద్ధమయింది. అందుకని కందపాదాన్ని కూడా ఛందోగోపనంగా మార్చాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చీరలు నగల ని భార్యలు మారాము లు జేయు చుండ మాన్య త కరువై పో రాటము సలి పె డు సం సారు ల కెందు ల కొ యీ వసంతో త్సవ ముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధ్వంసము చేసుకొని మెయినిపుంసత్వము వృద్ధినొందు పువ్వారంచున్కంసారిని మరచుచు సం సంసారుల కెందులకొ వసంతోత్సవముల్?జిలేబి
'సం । సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్' మరో పూరణ వ్రాయండి.
మరో పూరణ ఒకటి కాదు :)ఇవ్వాళ గోళీలే రాబోతున్నాయి :) కాచుకొనుడీ :)జిలేబి
ఓహో మారిపోయింది :)జిలేబి
డా.పిట్టా సత్యనారాయణ తీరా పచ్చి రసాయనపారావారమ్ము జిమ్మ బరగిన సరసాల్నీరాటంబుల బడ సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్
సమస్య :-"సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్"*కందం**తూరుపు తెల వారక ముందే రంగుల కాగితముల దెచ్చిరి బడిలోచేరని పిల్లల కోసంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్ ..................✍చక్రి
మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు సర్
మత్సరమేమిలేక గవిమా న్యులు గావ్య కలాపమందు నత్యుత్సుకతన్ గళాభిరుచియో హితమోప్రజకీయనెంచరేయుత్సవ శస్తి సౌరభము నూరికి యూరికి బ్రాకగా *"వసంతోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్"*
ఉత్సవ మన్న నందరకు నూహల పల్లకి దెచ్చి యిచ్చు సంవత్సరమంత సంతసపు వాహినులుద్ధతి పారనొప్పు నేయుత్సవమీయకుండును నవోత్సుకతన్ శుభశోభలన్ *"వసంతోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్"*
ఔరాపద్యామృతరసమౌరౌరామరగకాగి మధురససమమైక్షీరముచల్లారిన *"సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్"*
రామ రామ ! శంకరా భరణులపై యింత విసు రులా !జిలేబి
శంకర్ గారూ,మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
మైలవరపు వారి పూరణ ఉత్సవముత్సవమ్మనచు నూరక రంగులు చల్లనేల ? ని...ర్మత్సరమైన ప్రేమ మధురమ్మగు జాతికి , సంప్రదాయ సం...పత్సముపేతవైభవము మచ్చునకైనను లేనివౌ వసం.... తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్ !మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సారము గన మాయాసంసారము నందేమిలేదు చవులూరగ కంసారిని భజియింపక సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్?
మారుని బాణపు వేగముపారగ హృదినిండి పోవు పడతుక తోడైజోరుగ చెప్ప వలదు సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్!జిలేబి
మత్సరమెంతొ నిండుచును మానవజీవితమెల్ల మారగా ;వత్సలతన్ స్మరింపకయెవంచకులట్టుల బిడ్డలుండగా ; కుత్సితభావముల్ జెలగి క్రుంగగజేయగ నెట్టులీ వసం తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ ! గృహస్థునకున్ దలంపగన్ ?
ధన్యవాదాలండీ !
ఆరంగు రసాయనికములారోగ్యము లంతరించ నాడుదురిలలోబారులు తీరుచు నటసంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్"
వత్స! శుభాంగి ప్రాణసము వన్నెల చిన్నది నీదు రాజ్ఞియౌ!కుత్సిత మేమి లేదు విను కోమలి కంజుని సృష్టియే కదావత్సలమున్ సహిష్ణుతను పాణిగృహీతికి చూపకన్ వసం తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్?జిలేబి
డా.పిట్టా సత్యనారాయణ"తెలంగాణా హోళి""వత్స!యివేటి యాట లిట వావిరి మోదుగు రంగు వాడుమీకుత్సిత బుద్ధితో మసిని గోరిన రంగులనాడ హోళియే?ఉత్సవ రీతి బావలకు నోపిన కొబ్బరి మాలలన్ వసంతోత్సవముల్! ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపగన్(పెద్దలు, ఊరి పిల్లలకు యిచ్చిన 195౦దశక కాలపు సలహా)
డా.పిట్టా నుండిఆర్యా కృతజ్ఞతలు.
ఆరిన తాపపు కవివరులారా! రమణుని రమణుల లసమానంబౌతీరని కోరికలవి !సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్?జిలేబి
తారా శశాంకు లైనను వీరా వేశము నందు వేడుక మీరన్ మారుని వలపున మునుగు సం సారుల కెందుల కొయీ వసంతోత్సవముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రెండవ, మూడవ పాదాలలో గణదోషం. "వీరావేశమ్మునందు... మారని వలపు ముసుగు..." అనండి.
తారా శశాంకు లైనను వీరా వేశమ్ము నందు వేడుక మీరన్ మారని వలపున ముసుగు సం సారుల కెందులకొయీ వసంతోత్సవముల్
కంసారి వశము గాడాఆసాంతము మదనుడెప్డు--నార్తిని గొల్వన్ఆ సామీప్యము గలుగదె!సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మదను డెప్పు డార్తిని...' అనండి. సమస్య... "సం । సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్"
ధన్యవాదములు
ఆ రాజు సభ నడుగ "సం సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్?"ధీరుం డొకఁడనె "పారావారము వలె మైత్రి యనుచు వసుధను చాటన్!"
మీ వాకోవాక్య పూరణ బాగున్నది అభినందనలు.
ధన్యవాదాలండి 🙏
వేరెవరో కాదు బసకుచేరే స్నేహితులతోడ సెలవు దినములన్బారును దర్శించెడి సంసారుల కెందులకొ? యీవసంతో త్సవమున్'ఎందులకొ ' అని దీర్ఘం లేకుండా అనవచ్చా?
మీ పూరణ బాగున్నది అభినందనలు. ఎందులకో/కొ.... రెండూ సాధువులే
🙏🏽
🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼ఆర్యులకు శుభోదయమ్🙏🏼శంకరాభరణం లో నేటి సమస్య వసంతోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్ !పూరణకై నా ప్రయత్నము.ఉ. ఉత్సవమెల్లవారలకు నుత్సుకతన్ గలిగించితీరు నా యుత్సవముత్సవంబు. శుభ యోగమె క్రోల్పడు గేస్తు బాధలందుత్సవ తేజమెట్లొదవు నో హరి నీవిక బ్రోవమిన్ వసంతోత్సవముల్ ముదంబునిడునొక్కొ గృహస్తునకున దలంపఁగన్?🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼చింతా రామకృష్ణారావు🙏🏼
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.
మారుని దహనపు వేళనుమారారిని గొల్వకిటుల మన్మధలీలన్ నీరాడగ దగునే?సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్ ?
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
ఉత్సవ మన్న నేది? విను! హోళియె కాక మరొక్క టేదయా?వత్సర తాపముల్ మరిచి వాసిగ జేయు వసంత కేళినే!ఉత్సుకతన్ సదా జరుపుచుండగ హర్షము నివ్వదే? వసంతోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్" 🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱 🌷వనపర్తి🌷
మీ పూరణ బాగున్నది అభినందనలు
కోరలు సాచిన విషములుయే రకమౌ రంగుల జూడనేర్వగ నేడున్ పోరనిక రంగాటలు సంసారు కెందులకొ యీ వసంతోత్సవముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'విషములు + ఏ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. రెండవ పాదంలో గణదోషం. యతిదోషం. మూడవ పాదంలోను గణదోషం. సవరించండి.
ధన్యవాదములు. సరిజేసితిని గురువర్యా!🙏కోరలు సాచిన విషములునేవిధ వర్ణపు జిలుగుల నరయగ నేడున్ పోరనిక రంగులను సంసారు కెందులకొ యీ వసంతోత్సవముల్
బీరువ నిండుగ బంగరు పేరులు గలవారు జేయు వేడుక లెపుడున్ చారన్నపు చిల్లర సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్
భారపుబ్రదుకును నీదనువేరగు మార్గమ్ములెన్నొ వెదకుచునుండన్ దోరమయగుబూనిక సంసారులకెందులకొయీవసంతోత్సవముల్
కోరలు సాచిన విషములునే రక వర్ణపు జిలుగుల నేర్పుగ జూడన్పోరనిక రంగులను సంసారు కెందులకొ యీ వసంతోత్సవముల్
సారమదేమిటొ ఎరుగకకారణము తెలియక కనులు కలుగు కబోధుల్తీరున హోళి జరుపు సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్ఎందుకు జరుపుకొంటున్నామో, అందులోని అర్ధమేమిటో ఏమీ తెలుసుకోకుండా కళ్ళున్న గుడ్డివారి లాగా హోళీ పండగ జరుపుకొనే సంసారులకు ఈ ఉత్సవాలు ఎందుకో !
యెరుగక అని ఉండాలేమో మొదటి పాదంలో
ధన్యోస్మి.
శూరత్వముతో బ్రతికెడివారికి నుత్తేజ మిచ్చు పలు యుత్సవముల్ ధారుణిని హీనమగు సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్
పారావా రాభపు సంసా రావన సంభృత విలసన తత్పరులుం గారే యక్కట యీ సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్ మత్సర మెల్లఁ జిత్తమున మాని నిరంతర దీక్షఁ బూని శ్రీవత్స పదాంబు జార్చనలు భక్తినిఁ జల్పుట గాక గేహినీ వత్స నికాయ సంజనిత బాధల నియ్యభిసారికా వసంతోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకుం దలంపఁగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
మారిన కాలము నందునదారిన పిల్లల నడుపుట తప్పని యుద్ధం!దూరె పరీక్షల మాసంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్?
మత్సర లక్షణమ్మిటను మానవులందున హెచ్చె జూడగాకుత్సిత బుద్ధియున్ బెరిగె కూడుట చేతిన సెల్లుదాయె భీభత్సుల కాలమాయె నిటువంటి మహోగ్రపు వేళలో వసంతోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకుం దలంపఁగన్?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.యుద్ధం, మాసం అని వ్యావహారికాలను ప్రయోగించారు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) వత్సర మంతయున్ మనము వాకబు జేయుచు నాంధ్రభారతిన్తత్సమ సంధులన్ మరచి తన్నుకు చచ్చెడి పూరణంపు భీభత్స రసమ్ము శంకరుల భాగ్యము జేయగ నెట్టులీ వసంతోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్?
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
మత్సరముల్ త్యజించి భువి మాన్యునిగావసియించు చున్నచో నుత్సవముల్ నిరంతరము నుర్విని మోదము నిచ్చు సుమ్ము బీభత్సపదమ్ము నందు చను పాంసను డైనను వాని కీ వసంతోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్?
మారుని కడతీర్చెకద యు మారాజని మదిని దలచి మన్మధ లీల న్నూరకె విడువక పలు సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్నిన్నటి దత్తపది కి నా పూరణ పక్షి గుడ్లను బెట్టిన పగిది నొక్క గ్రుడ్డి వాడగు రారాజు కొడుకుల గనె ;వార లిహలోకమును వీడ పోర, బైటపడె కుయుక్తులు, హాయిగాబ్రతుక జనులు
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.'కడతేర్చక' టైపాటు!
బోరగు పాఠ్యాంశములనుహారరు మూవీ కథలుగ హాయిగ దెలుపన్లేరుగ వెదకిన లేసంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'లేసం'?
ఆశావాది ఉవాచఉత్సుకతింతయున్ బడక నూసురుమంచును మూల్గగా వసంతోత్సవముల్ ముదంబు నిడునొక్కొ? గృహస్థునకున్ దలంపగన్ కుత్సిత మింతలేక యొనగూడగ సౌఖ్యము మిత్రసంగతిన్నుత్సవమార్భటిన్ జరుప గూరును సత్వజవంబులున్ సదా!
హింసా వాదుల రంగేసంసారుల కెందులకొ?యీవసంతోత్సవముల్సం-సారమొసంగుననియెసంసాదం రంగులాట సాగుటకొరకే! సంసాదం=సమావేశం
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'సంసాదం' వ్యావహారికం. 'సంసాదము' అనండి.
వత్సరమంతయున్ భవపుబంధముతోడను మ్రగ్గుచోవసంతోత్సవముల్ ముదంబునిడు నొక్కొగృహస్ధునకున్ దలంపగన్నుత్సవముల్ గడున్ముదమునొందగ జేయును నెల్లవారిలో,మత్సరమెందున్గనకమానితరీతినినుండమేలగున్
క్రొవ్విడి వెంకట రాజారావు: పారమ్యంబగు రీతిని శ్రీరాము నుపాశ్రయించి చెలగక నిపుడున్ జోరుగ వార్థకమున సం సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్.
ఉత్సవముల్ గదా మన మహోన్నత సంస్కృతి పట్టుగొమ్మలైవత్సరమందు వచ్చు పలు పర్వము లన్నియు తెచ్చు ఖర్చు భీభత్సమటంచు భీతిలునుపక్షియ మేమియు లేని యీ వసంతోత్సవముల్ ముదంబు నిడు నొక్కొ గృహస్థునకున్ దలంపగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూడవ పాదం కొంత అర్థం కాలేదు.
వత్స! సుధర్మమార్గమున పాణిని బట్టిన ధర్మపత్ని తోసత్సుఖ మొందుచుం దగిన సంతతినంది చరింప నిత్యమున్నుత్సవమౌనుగాదె యిక నూరటజెందుము వింటె యీవసంతోత్సవముల్ ముదంబునిడు నొక్కొ గృహస్ధునకున్ దలంపగన్.
శ్రీరామా కృష్ణా యని యా రామ ముగా .సతతము నానందముతో కూర్చొనుటను విడి ముదిసంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్.
పారావారమె కద సం
రిప్లయితొలగించండిసాసము దారాసుతులను సాకుట కొరకై
పోరాటమె జేసెడు సం
సారుల కెందుల కొ యీ వసంతోత్సవముల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సంసారము' టైపాటు.
ధన్యవాదాలు గురువుగారు..
తొలగించండిగురువర్యులకు నమస్సులు,
రిప్లయితొలగించండినా నిన్నటి మొన్నటి పద్యములను పరిశీలింప ప్రార్థన.
"కళ్ళు బైర్లు క్రమ్మె, బలము కరగి పోయె
వలదు వలదిహ లోకపు వైభవములు
వినుడు హాయిన్ గొలుపదీ కదనము నాకు
కృష్ణ! మఱలెద"మని గుడాకేశు డనియె!
ఆ కుల మీ కుల మన పెను
వ్యాకులము సృజించి నంత పబ్బము గొనెడిన్
కాకులు కానేరని పలు
గాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్!
ఆ కుల మీ కుల మన పెను
వ్యాకులము సృజించి నంత పబ్బము గొను నా
లోకులు కలిగించెడి చీ
కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్!
పలుగాకులు సరికాదేమోనని సవరించి రెండవది వ్రాసాను
ధన్యవాదములు
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
తొలగించండివత్సర మంతయున్ గొణిగి వాతపు పిత్తపు బాధలందునన్
రిప్లయితొలగించండిమత్సర మంతయున్ సమసి మందులు మాకులు మ్రింగుచుండగా
నుత్సుక మంతయున్ సడలు చుండగ రంగుల భంగులన్ వసం
తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండికొండాటమే ఈరోజు నాకు :)
హింసాత్మకమాయె బ్రతుకు,
రిప్లయితొలగించండికంసులె కనవత్తురసలు కానము విలువల్,
ధ్వంసము సమాజమింకెడ?
సంసారులకెందుకీవసంతోత్సముల్..?
ఇచ్చినట్లుగానే పూరించాలంటే..
భారపు బ్రతుకుల నీడ్చుచు
పేరుకుపోయిన కలతలు, పేదరికమ్మున్,
దారికి రాకున్నను సం
సారులకెందులకొ? యీ వసంతోత్సముల్..
మీ రెండు విధాల పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండినిజానికి నిన్న ముందుగా సిద్ధం చేసుకున్న సమస్య... "సంసారుల కేల యీ వసంతోత్సవముల్" ఆ తరువాత వృత్తపాదం ఛందోగోపనంతో సిద్ధమయింది. అందుకని కందపాదాన్ని కూడా ఛందోగోపనంగా మార్చాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచీరలు నగల ని భార్యలు
రిప్లయితొలగించండిమారాము లు జేయు చుండ మాన్య త కరువై
పో రాటము సలి పె డు సం
సారు ల కెందు ల కొ యీ వసంతో త్సవ ముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిధ్వంసము చేసుకొని మెయిని
పుంసత్వము వృద్ధినొందు పువ్వారంచున్
కంసారిని మరచుచు సం
సంసారుల కెందులకొ వసంతోత్సవముల్?
జిలేబి
'సం । సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్' మరో పూరణ వ్రాయండి.
తొలగించండి
తొలగించండిమరో పూరణ ఒకటి కాదు :)ఇవ్వాళ గోళీలే రాబోతున్నాయి :) కాచుకొనుడీ :)
జిలేబి
రిప్లయితొలగించండిఓహో మారిపోయింది :)
జిలేబి
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండితీరా పచ్చి రసాయన
పారావారమ్ము జిమ్మ బరగిన సరసాల్
నీరాటంబుల బడ సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండి"సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్"
*కందం**
తూరుపు తెల వారక ముం
దే రంగుల కాగితముల దెచ్చిరి బడిలో
చేరని పిల్లల కోసం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్
..................✍చక్రి
మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు సర్
తొలగించండిమత్సరమేమిలేక గవిమా న్యులు గావ్య కలాపమందు న
రిప్లయితొలగించండిత్యుత్సుకతన్ గళాభిరుచియో హితమోప్రజకీయనెంచరే
యుత్సవ శస్తి సౌరభము నూరికి యూరికి బ్రాకగా *"వసం
తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్సవ మన్న నందరకు నూహల పల్లకి దెచ్చి యిచ్చు సం
రిప్లయితొలగించండివత్సరమంత సంతసపు వాహినులుద్ధతి పారనొప్పు నే
యుత్సవమీయకుండును నవోత్సుకతన్ శుభశోభలన్ *"వసం
తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్"*
ఔరాపద్యామృతరస
రిప్లయితొలగించండిమౌరౌరామరగకాగి మధురససమమై
క్షీరముచల్లారిన *"సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్"*
తొలగించండిరామ రామ ! శంకరా భరణులపై యింత విసు రులా !
జిలేబి
శంకర్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఉత్సవముత్సవమ్మనచు నూరక రంగులు చల్లనేల ? ని...
ర్మత్సరమైన ప్రేమ మధురమ్మగు జాతికి , సంప్రదాయ సం...
పత్సముపేతవైభవము మచ్చునకైనను లేనివౌ వసం....
తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసారము గన మాయాసం
రిప్లయితొలగించండిసారము నందేమిలేదు చవులూరగ కం
సారిని భజియింపక సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమారుని బాణపు వేగము
పారగ హృదినిండి పోవు పడతుక తోడై
జోరుగ చెప్ప వలదు సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్సరమెంతొ నిండుచును
రిప్లయితొలగించండిమానవజీవితమెల్ల మారగా ;
వత్సలతన్ స్మరింపకయె
వంచకులట్టుల బిడ్డలుండగా ;
కుత్సితభావముల్ జెలగి
క్రుంగగజేయగ నెట్టులీ వసం
తోత్సవముల్ ముదంబు నిడు
నొక్కొ ! గృహస్థునకున్ దలంపగన్ ?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ !
తొలగించండిఆరంగు రసాయనికము
రిప్లయితొలగించండిలారోగ్యము లంతరించ నాడుదురిలలో
బారులు తీరుచు నటసం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివత్స! శుభాంగి ప్రాణసము వన్నెల చిన్నది నీదు రాజ్ఞియౌ!
కుత్సిత మేమి లేదు విను కోమలి కంజుని సృష్టియే కదా
వత్సలమున్ సహిష్ణుతను పాణిగృహీతికి చూపకన్ వసం
తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్?
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండి"తెలంగాణా హోళి"
"వత్స!యివేటి యాట లిట వావిరి మోదుగు రంగు వాడుమీ
కుత్సిత బుద్ధితో మసిని గోరిన రంగులనాడ హోళియే?
ఉత్సవ రీతి బావలకు నోపిన కొబ్బరి మాలలన్ వసం
తోత్సవముల్! ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపగన్
(పెద్దలు, ఊరి పిల్లలకు యిచ్చిన 195౦దశక కాలపు సలహా)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడా.పిట్టా నుండి
తొలగించండిఆర్యా కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిఆరిన తాపపు కవివరు
లారా! రమణుని రమణుల లసమానంబౌ
తీరని కోరికలవి !సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్?
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితారా శశాంకు లైనను
రిప్లయితొలగించండివీరా వేశము నందు వేడుక మీరన్
మారుని వలపున మునుగు సం
సారుల కెందుల కొయీ వసంతోత్సవముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ, మూడవ పాదాలలో గణదోషం. "వీరావేశమ్మునందు... మారని వలపు ముసుగు..." అనండి.
తారా శశాంకు లైనను
తొలగించండివీరా వేశమ్ము నందు వేడుక మీరన్
మారని వలపున ముసుగు సం
సారుల కెందులకొయీ వసంతోత్సవముల్
కంసారి వశము గాడా
రిప్లయితొలగించండిఆసాంతము మదనుడెప్డు--నార్తిని గొల్వన్
ఆ సామీప్యము గలుగదె!
సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మదను డెప్పు డార్తిని...' అనండి.
సమస్య... "సం । సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్"
ధన్యవాదములు
తొలగించండిఆ రాజు సభ నడుగ "సం
రిప్లయితొలగించండిసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్?"
ధీరుం డొకఁడనె "పారా
వారము వలె మైత్రి యనుచు వసుధను చాటన్!"
మీ వాకోవాక్య పూరణ బాగున్నది అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండి 🙏
తొలగించండివేరెవరో కాదు బసకు
రిప్లయితొలగించండిచేరే స్నేహితులతోడ సెలవు దినములన్
బారును దర్శించెడి సం
సారుల కెందులకొ? యీవసంతో త్సవమున్
'ఎందులకొ ' అని దీర్ఘం లేకుండా అనవచ్చా?
మీ పూరణ బాగున్నది అభినందనలు.
తొలగించండిఎందులకో/కొ.... రెండూ సాధువులే
🙏🏽
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼
రిప్లయితొలగించండిఆర్యులకు శుభోదయమ్🙏🏼
శంకరాభరణం లో
నేటి సమస్య
వసంతోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్ !
పూరణకై నా ప్రయత్నము.
ఉ. ఉత్సవమెల్లవారలకు నుత్సుకతన్ గలిగించితీరు నా
యుత్సవముత్సవంబు. శుభ యోగమె క్రోల్పడు గేస్తు బాధలం
దుత్సవ తేజమెట్లొదవు నో హరి నీవిక బ్రోవమిన్ వసం
తోత్సవముల్ ముదంబునిడునొక్కొ గృహస్తునకున దలంపఁగన్?
🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼
చింతా రామకృష్ణారావు🙏🏼
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.
తొలగించండిమారుని దహనపు వేళను
రిప్లయితొలగించండిమారారిని గొల్వకిటుల మన్మధలీలన్
నీరాడగ దగునే?సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్ ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండి
రిప్లయితొలగించండిఉత్సవ మన్న నేది? విను! హోళియె కాక మరొక్క టేదయా?
వత్సర తాపముల్ మరిచి వాసిగ జేయు వసంత కేళినే!
ఉత్సుకతన్ సదా జరుపుచుండగ హర్షము నివ్వదే? వసం
తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్"
🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
🌷వనపర్తి🌷
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండికోరలు సాచిన విషములు
రిప్లయితొలగించండియే రకమౌ రంగుల జూడనేర్వగ నేడున్
పోరనిక రంగాటలు సం
సారు కెందులకొ యీ వసంతోత్సవముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విషములు + ఏ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. రెండవ పాదంలో గణదోషం. యతిదోషం. మూడవ పాదంలోను గణదోషం. సవరించండి.
ధన్యవాదములు. సరిజేసితిని గురువర్యా!🙏
తొలగించండికోరలు సాచిన విషములు
నేవిధ వర్ణపు జిలుగుల నరయగ నేడున్
పోరనిక రంగులను సం
సారు కెందులకొ యీ వసంతోత్సవముల్
బీరువ నిండుగ బంగరు
రిప్లయితొలగించండిపేరులు గలవారు జేయు వేడుక లెపుడున్
చారన్నపు చిల్లర సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభారపుబ్రదుకును నీదను
రిప్లయితొలగించండివేరగు మార్గమ్ములెన్నొ వెదకుచునుండన్
దోరమయగుబూనిక సం
సారులకెందులకొయీవసంతోత్సవముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోరలు సాచిన విషములు
రిప్లయితొలగించండినే రక వర్ణపు జిలుగుల నేర్పుగ జూడన్
పోరనిక రంగులను సం
సారు కెందులకొ యీ వసంతోత్సవముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసారమదేమిటొ ఎరుగక
రిప్లయితొలగించండికారణము తెలియక కనులు కలుగు కబోధుల్
తీరున హోళి జరుపు సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్
ఎందుకు జరుపుకొంటున్నామో, అందులోని అర్ధమేమిటో ఏమీ తెలుసుకోకుండా కళ్ళున్న గుడ్డివారి లాగా హోళీ పండగ జరుపుకొనే సంసారులకు ఈ ఉత్సవాలు ఎందుకో !
యెరుగక అని ఉండాలేమో మొదటి పాదంలో
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి.
తొలగించండిశూరత్వముతో బ్రతికెడి
రిప్లయితొలగించండివారికి నుత్తేజ మిచ్చు పలు యుత్సవముల్
ధారుణిని హీనమగు సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపారావా రాభపు సం
రిప్లయితొలగించండిసా రావన సంభృత విలసన తత్పరులుం
గారే యక్కట యీ సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్
మత్సర మెల్లఁ జిత్తమున మాని నిరంతర దీక్షఁ బూని శ్రీ
వత్స పదాంబు జార్చనలు భక్తినిఁ జల్పుట గాక గేహినీ
వత్స నికాయ సంజనిత బాధల నియ్యభిసారికా వసం
తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకుం దలంపఁగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిమారిన కాలము నందున
రిప్లయితొలగించండిదారిన పిల్లల నడుపుట తప్పని యుద్ధం!
దూరె పరీక్షల మాసం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్?
మత్సర లక్షణమ్మిటను మానవులందున హెచ్చె జూడగా
తొలగించండికుత్సిత బుద్ధియున్ బెరిగె కూడుట చేతిన సెల్లుదాయె భీ
భత్సుల కాలమాయె నిటువంటి మహోగ్రపు వేళలో వసం
తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకుం దలంపఁగన్?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండియుద్ధం, మాసం అని వ్యావహారికాలను ప్రయోగించారు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
వత్సర మంతయున్ మనము వాకబు జేయుచు నాంధ్రభారతిన్
తత్సమ సంధులన్ మరచి తన్నుకు చచ్చెడి పూరణంపు భీ
భత్స రసమ్ము శంకరుల భాగ్యము జేయగ నెట్టులీ వసం
తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్?
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్సరముల్ త్యజించి భువి మాన్యునిగావసియించు చున్నచో
రిప్లయితొలగించండినుత్సవముల్ నిరంతరము నుర్విని మోదము నిచ్చు సుమ్ము బీ
భత్సపదమ్ము నందు చను పాంసను డైనను వాని కీ వసం
తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమారుని కడతీర్చెకద యు
రిప్లయితొలగించండిమారాజని మదిని దలచి మన్మధ లీల
న్నూరకె విడువక పలు సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్
నిన్నటి దత్తపది కి నా పూరణ
పక్షి గుడ్లను బెట్టిన పగిది నొక్క
గ్రుడ్డి వాడగు రారాజు కొడుకుల గనె ;
వార లిహలోకమును వీడ పోర, బైట
పడె కుయుక్తులు, హాయిగాబ్రతుక జనులు
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'కడతేర్చక' టైపాటు!
బోరగు పాఠ్యాంశములను
రిప్లయితొలగించండిహారరు మూవీ కథలుగ హాయిగ దెలుపన్
లేరుగ వెదకిన లేసం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'లేసం'?
ఆశావాది ఉవాచ
రిప్లయితొలగించండిఉత్సుకతింతయున్ బడక నూసురుమంచును మూల్గగా వసం
తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ? గృహస్థునకున్ దలంపగన్
కుత్సిత మింతలేక యొనగూడగ సౌఖ్యము మిత్రసంగతి
న్నుత్సవమార్భటిన్ జరుప గూరును సత్వజవంబులున్ సదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహింసా వాదుల రంగే
రిప్లయితొలగించండిసంసారుల కెందులకొ?యీవసంతోత్సవముల్
సం-సారమొసంగుననియె
సంసాదం రంగులాట సాగుటకొరకే!
సంసాదం=సమావేశం
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సంసాదం' వ్యావహారికం. 'సంసాదము' అనండి.
వత్సరమంతయున్ భవపుబంధముతోడను మ్రగ్గుచోవసం
రిప్లయితొలగించండితోత్సవముల్ ముదంబునిడు నొక్కొగృహస్ధునకున్ దలంపగన్
నుత్సవముల్ గడున్ముదమునొందగ జేయును నెల్లవారిలో,
మత్సరమెందున్గనకమానితరీతినినుండమేలగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపారమ్యంబగు రీతిని
శ్రీరాము నుపాశ్రయించి చెలగక నిపుడున్
జోరుగ వార్థకమున సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్సవముల్ గదా మన మహోన్నత సంస్కృతి పట్టుగొమ్మలై
రిప్లయితొలగించండివత్సరమందు వచ్చు పలు పర్వము లన్నియు తెచ్చు ఖర్చు భీ
భత్సమటంచు భీతిలునుపక్షియ మేమియు లేని యీ వసం
తోత్సవముల్ ముదంబు నిడు నొక్కొ గృహస్థునకున్ దలంపగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదం కొంత అర్థం కాలేదు.
వత్స! సుధర్మమార్గమున పాణిని బట్టిన ధర్మపత్ని తో
రిప్లయితొలగించండిసత్సుఖ మొందుచుం దగిన సంతతినంది చరింప నిత్యము
న్నుత్సవమౌనుగాదె యిక నూరటజెందుము వింటె యీవసం
తోత్సవముల్ ముదంబునిడు నొక్కొ గృహస్ధునకున్ దలంపగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశ్రీరామా కృష్ణా యని
యా రామ ముగా .సతతము నానందముతో
కూర్చొనుటను విడి ముదిసం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్.