కాకతీయ గణపతి దేవుడు తోటి రాజులతో బంధుత్వము పెంచుకొని తీర ప్రాంతము వరకు తన సామ్రాజ్యమును విస్తరించి అంధ్ర రాష్ట్రము మొత్తము పాలించు సమయమున రేచర్ల రుద్రుడు ర్మప్ప దేవాలయము కట్టాలని దానిలో శివ కేశవులు ఒకే ఆలయములో ఉండేలా నిర్మాణము చేయాలని ప్రతిపాదన చేస్తాడు. ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురై విఘ్నములు కలుగు నేమో అనుకొన్న గణపతిదేవుడు తన మాటను రేచర్ల రుద్రునికి చెప్పు సందర్భము
పినచోడి పుత్రికల్ పేరమ్మ నారమ్మలను పరిణయ మాడి లక్షణముగ వెలనాడు రాజ్యము కలిపి సామ్రాజ్యము పాలించు చుంటిని బాగు గాను , వేంగి చాళుక్యుoడు వీరభద్రునికి నా పుత్రి రుద్రమ్మను పుణికరించి పెండ్లితో బంధమ్ము పెంచి నే తీరాంధ్ర విజయము గొనినాడ, విష్ణు శివుల గుడికట్ట విఘ్నంబగునని గణపతి భీతింజెందె ననవల దెప్పుడు, నీదు
కోరిక సతము సఫలమగును,మొదలిడు పనులు రేచర్ల రుద్రుడా! పఱపు తోడ, శిల్పి రామప్ప పనిజేయు శీఘ్ర గతిని ననుచు గణపతి దేవుడు నాజ్ఞ లిడెను
రిప్లయితొలగించండికమల పెనిమిటి శశాంకుం
డమలిన స్నేహితుడతండు! డాబన్నది లే
దు! మరి జిలేబీ చెప్పెద
కమలాప్తుడు చంద్రుడనుట కల్ల యెటులగున్?
జిలేబి
రిప్లయితొలగించండికమలన్ భర్తగ చేరగాను సరసన్ కారుణ్యమున్ చూపుచున్
సుమమాలన్ ధరి యించి పట్టె కరముల్ శోభిల్లు సప్తస్వర
మ్ము మిలాయింపగ గారవమ్ము చొనుపన్ మున్నీటిరాచూలియే!
కమలాప్తుండు శశాంకుఁ డౌననుట నిక్కంబే కదా మిత్రమా!
జిలేబి
కమల యన లక్ష్మి, చంద్రుఁడు
రిప్లయితొలగించండిసముద్రమున సోదరుఁడయి జన్మింపఁగ నా
యమలిన బాంధవ్యముతోఁ
గమలాప్తుఁడు చంద్రుఁ డనుట కల్ల యెటు లగున్?
ప్రాతఃకాల కిట్టింపు:
రిప్లయితొలగించండికమనీయమ్మగు మంచుకొండ కొననన్ కైలాసముంజేరగా
హిమమున్ బోరుచు మేఘపంక్తులను భల్ హీనమ్ముగా దాగుచున్
సమరంబందున నోడిపోవుచును తా శైలంపు శీతమ్మునన్
కమలాప్తుండు శశాంకుఁ డౌననుట నిక్కంబే కదా మిత్రమా!
గమనింతురు రాత్రిఁబవలు
రిప్లయితొలగించండిసమచిత్తులు వారిరువురు సాంజలి నిడరే
అమలపు చౌకీదారులు
కమలాప్తుఁడు, చంద్రుఁ డనుట కల్ల యెటులగున్
విఘ్నాయాసులు బోలెడు
తొలగించండివిఘ్నాయత్తులును చాల విపరీతముగా
విఘ్నేశు గొల్వ,ధర్మపు
విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్
విఘ్నపు భీతితో నడుగు వేయగ నెంచడు నీచుడెన్నడున్
తొలగించండివిఘ్నము లొంగదీయగను వేసియు మానును మధ్యముండిలన్
విఘ్నము లెంచకన్ గెలుచు విజ్ఞుడు,వారును లేక ధర్మపున్
విఘ్నము సంభవించునని భీతిని జెందె గణేశు డత్తఱిన్
నీవు నేర్పిన విద్యయె నీరజాక్ష!
రిప్లయితొలగించండికమల యనగ నీరనియట
సముద్రమున నీరు చంద్రు సఖియై పొంగున్
విమలమతులు వినయముగా
*"కమలాప్తుఁడు చంద్రుఁ డనుట కల్ల యెటులగున్"*
😀🙏🏻🙏🏻
కమలాబ్ధిజయౌ శశియును
రిప్లయితొలగించండిసముద్రమునబుట్టెనిట్లు సాగరశయనుం
డుమొనసిబంధుత్వముతో
కమలాప్తుఁడు చంద్రుఁ డనుట కల్ల యెటులగున్"
కమలాప్తుడువెన్నుండగు
రిప్లయితొలగించండిగమలకుబెన్మిటియగు శశి గమలాసహజుం
డమలిన బంధుత్వగరిమ
*"కమలాప్తుఁడు చంద్రుఁ డనుట కల్ల యెటులగున్"*
సమయంబేల వృథాహరింతురు మహాశంభుండు ముక్కంటియై
రిప్లయితొలగించండిసమయస్ఫూర్తి నిడున్ ముముక్షుతతి సౌజన్యాగ్రహానుగ్రహం
బు మృగాంకుండు మరీచి పావకులు నా మ్రోలన్ వసింపంగ నా
*"కమలాప్తుండు శశాంకుఁ డౌననుట నిక్కంబే కదా మిత్రమా"*
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండికమలము తిండికి తహతహ
కమలమ్మును విప్ప కనుల గాంచిరి దీనుల్
కమలిన కడుపుల నింపన్
కమలాపకమలాప్తుడు(P.M)చంద్రు(C.M)డనుట కల్ల యెటులగున్?
డా లాపక పడిన టైపాటు, సమస్యా పాదంలో
తొలగించండిడా.పిట్టా నుండి
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి🙏🕉నమశ్శివాయ 🙏💐
కృమి యైనన్ తదధీనమై మసలు ధాత్రిన్ , సర్వలోకేశ్వరుం...
డమలానందమనోజ్ఞమూర్తి ,బహుళాష్టైశ్వర్యదుండౌ గనన్,
విమలాంతఃకరణుండునౌ శివునకున్ నేత్రత్రయం బగ్నియున్ ,
కమలాప్తుండు , శశాంకుఁ డౌననుట నిక్కంబే కదా మిత్రమా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అర్జునుడు..
తొలగించండిసమరక్షోణి ధనుస్సు చేతఁగొనెనా చండార్కుడై దోచు , వి...
భ్రమమున్ గొల్ప శశాంకుడోయనదగున్ భ్రాత్రాళిపై ప్రేమతో !
ప్రమదన్ కొల్వునకీడ్వ , భగ్గుమనుచున్ , భక్తిన్ గనన్ స్తబ్ధుడౌ !
కమలాప్తుండు శశాంకుఁ డౌననుట నిక్కంబే కదా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిసుమ లావణ్యము నందునన్ కమల యున్ శోభిల్లు రే గల్వయున్
సమమే గావున విష్ణునాననమునన్ సంధిల్లె నేత్రంబులై
సమమౌ దృష్టిని బెంచు బోధ యది వే శాస్త్రంబులన్ గాంచినన్
కమలాప్తుండు శశాంకుడౌ ననుట నిక్కంబే కదా మిత్రమా!
తిమిరము బోద్రోలునొకడు
రిప్లయితొలగించండితమకము గల్గించి మరుల దట్టుచు నొకడున్
సమముగ జగతికి నాప్తులు
కమలాప్తుఁడు, చంద్రుఁడనుట కల్ల యెటులగున్
తమ సస్యముల కతమగుచును
రిప్లయితొలగించండిశ్రమ జీవుల కలలు పండ చల్లదనమునే
యమితముగన్ గురిపించెడి
"కమలాప్తుఁడు చంద్రుఁ డనుట కల్ల యెటులగున్"
కమల వికసనము తో రవి
రిప్లయితొలగించండికమలాప్తు డు ; చంద్రుడ నుట కల్ల యెటుల గున్
విమల కుముద ము లు విచ్చగ
ప్రమద ము తో కాంతి నొసగు రజనీ ప్ర భువై
విడదీయుట గాదు, మంచి వాటిని కలుపుటయే సుకవి లక్ష్యమని తెలుపుట.
రిప్లయితొలగించండిఅమరించు సుకవి అన్నియుc
నమరిన సూర్య శశు లగ్ని నేత్రుని దేవున్
తమకము విడి నమకము లిడ
కమలాప్తుడు చంద్రుడనుట కల్ల యెటులగున్?
కుముదాప్తుడు చంద్రుడు కద !
రిప్లయితొలగించండికమలాప్తుడు చంద్రుడనుట కల్ల ; యెటులగున్ ?
కమలాప్తుడు సూర్యుడు కద !
కుముదము కమలము శశి - రవి గురుతులు కావా ?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశమని యందు వెలుగునిడు
రిప్లయితొలగించండియమృతాంశుడు కమలమునకు నార్యుండౌటన్
రమణుడు హితుడే యగుగద
కమలాప్తుడు చంద్రుడనుట కల్ల యెటులగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ నాటి శంకరాభరణము సమస్య
రిప్లయితొలగించండికమలాప్తుఁడు, చంద్రుఁడనుట కల్ల యెటులగున్
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
చీకటి తెరలన్ని చెదరెడు సమయాన, మేనును విరుచుచు, మేదిని కను
రెప్పలన్ మెల్లగ విప్పుచు కనుచుండు తూరుపు దిక్కును, భూరుహముల
పైనున్న పికములు పరవశము కలిగి నెనరును బడసి కూయును వెలుగు ని
డ (కమలాప్తుఁడు, చంద్రుఁడనుట కల్ల , యెటులగున్)? గాదిలీ, కుధాకుండు పశ్చి
మాద్రిలో దాగిన పిదప మంచు వేల్పు
తారలను కూడి నభముపై దర్శనమిడు,
నిదియె ప్రకృతి సహజంబు, నింతిరో వి
నుమనుచు పలికె సతితోడ నొక్క మగడు
నిన్నటి రోజు శంకరా భరణము బ్లాగు లో సమస్య
రిప్లయితొలగించండి"విఘ్నంబగునని గణపతి భీతిం జెందెన్"
ఇచ్చిన పాదము కందము నా పూరణముసీసములో
కాకతీయ గణపతి దేవుడు తోటి రాజులతో బంధుత్వము పెంచుకొని తీర ప్రాంతము వరకు తన సామ్రాజ్యమును విస్తరించి అంధ్ర రాష్ట్రము మొత్తము పాలించు సమయమున రేచర్ల రుద్రుడు ర్మప్ప దేవాలయము కట్టాలని దానిలో శివ కేశవులు ఒకే ఆలయములో ఉండేలా నిర్మాణము చేయాలని ప్రతిపాదన చేస్తాడు. ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురై విఘ్నములు కలుగు నేమో అనుకొన్న గణపతిదేవుడు తన మాటను రేచర్ల రుద్రునికి చెప్పు సందర్భము
పినచోడి పుత్రికల్ పేరమ్మ నారమ్మలను పరిణయ మాడి లక్షణముగ
వెలనాడు రాజ్యము కలిపి సామ్రాజ్యము పాలించు చుంటిని బాగు గాను ,
వేంగి చాళుక్యుoడు వీరభద్రునికి నా పుత్రి రుద్రమ్మను పుణికరించి
పెండ్లితో బంధమ్ము పెంచి నే తీరాంధ్ర విజయము గొనినాడ, విష్ణు శివుల
గుడికట్ట విఘ్నంబగునని గణపతి భీతింజెందె ననవల దెప్పుడు, నీదు
కోరిక సతము సఫలమగును,మొదలిడు
పనులు రేచర్ల రుద్రుడా! పఱపు తోడ,
శిల్పి రామప్ప పనిజేయు శీఘ్ర గతిని
ననుచు గణపతి దేవుడు నాజ్ఞ లిడెను
మొన్నటి శంకరా భరణము సమస్య
రిప్లయితొలగించండిమధుపానాసక్తులు గద మౌని వరేణ్యుల్
ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో
ఉదయంబు త్రాగును యుత్పలమాలా మధురిమలు కందము తో గలుపుచు ,
బ్లాగులో దొరకెడు పాలకు ఫేస్బుక్కు గుల్యము కలుపుచు గ్రోలు చుండు
ఫలహార వేళలోన్ ,వాట్సప్పు తేనియల్ జవిజూచు మధ్యాన్న సమయమందు,
నమ్మవలె మధు పానాసక్తులు గద మౌని వరేణ్యు లనబడు నీల గళ స
మానుడు, బుధ పూజ్యుండు, ధీమంతుడు, మద
రహితుడు, తెలుగు భాషా నెరవరి, యెల్ల
కవుల మానస చోరుడు ,కంది శంక
రుండు,వెలుగు చుండు సతము రుక్కు లిడుచు
(గురువు గారి పాదములకొక చిరు పుష్పము )
గురువు గారు పై పూరణములు నొకసారి తిలకించండి
రిప్లయితొలగించండివిమలా,వినుమీ రవియే
రిప్లయితొలగించండికమలాప్తుడు,చంద్రుడనుట కల్లయెటులగున్
కుముదంబులకిలహితుడే
కమలము కుముదంబులరయ గావుగనొకటే
కమలాసన భవ బలరిపు
రిప్లయితొలగించండినమస్కృత విరాజమాన నరహరి లక్ష్మీ
సుమనః కాసారమునకుఁ
గమలాప్తుఁడు చంద్రుఁ డనుట కల్ల యెటులగున్
[కమలాప్తుఁడు = విష్ణువు]
కమలా కాంత మనఃప్రకార తతి సుగ్రాహ్యంబు గానేర్చునే
కమ లోద్భాసిత శారదాపతికి నక్కామారి కైనన్ మదిన్
విమలాంభోధి సహోద్భవ ద్వయము సంప్రీతిన్ రమాచంద్రులే
కమలాప్తుండు శశాంకుఁ డౌననుట నిక్కంబే కదా మిత్రమా
[కమల = లక్ష్మీ దేవి]
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
కమనీయమ్మగు నోట్ల రద్దులనటన్ గావించి యేడ్పించుచున్
చెమటల్ పోసెడి టాక్సు పద్ధతులనున్ సృష్టించి వేధించియున్
సమరంబందున గెల్వ గోరుచును భల్ చల్లంగ మాట్లాడుటన్
కమలాప్తుండు శశాంకుఁ డౌననుట నిక్కంబే కదా మిత్రమా
కమలాప్తుడు = "కమలం" ఎన్నిక గుర్తు కలిగి మురియు వాడు
సుమములగంధంబట్లుగ
రిప్లయితొలగించండిఅమరిన యాప్రేమజంట నన్యోన్యతయే
కుమలక జేయగ?యనిరట
కమలాప్తుడు చంద్రుడనుట కల్లయెటులగున్ (కమల,చంద్రులుప్రేమికులు)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమలినసతి సీత వదన
రిప్లయితొలగించండికమలమునకు రాముడు ఖరకరుడే యౌగా!
సమరస చంద్రుడు జగతికి
కమలాప్తుడు చంైద్రుడనుట కల్లయెటులగున్ ?
చంద్రుడనుట
తొలగించండివిమలా! నేర్వుము సూర్యుడేగదిల నెవ్విధంబుగా జూచినన్
రిప్లయితొలగించండికమలాప్తుండు,శశాంకుడౌననుటనిక్కంబేకదామిత్రమా!
యమలంబొందెడుకాంతిపుంజములనాహార్యంబుగావించుచున్
బ్రమదంబొందగజేయుచున్ బ్రజకునాప్యాయంబుజేకూర్చుగా!
: తమమును భేదించు భువిని
రిప్లయితొలగించండికమలాప్తుఁడు, చంద్రుఁ డనుట కల్ల యెటులగున్
తిమిరము నందున వెలుగుచు
ప్రమదము కలువల కొసంగు వాడు వసుధపై
ద్యుమణియె గద లోకమ్మున
రిప్లయితొలగించండికమలాప్తుడు, చంద్రుఁ డనుట కల్ల యెటులగున్
హిమాంశుడాతడే కద
కుముదేశుడనుచు పిలువగ కువలయమందున్
తిమిరారాతియు చక్రబంధువతడే దీప్తాంశుడాతండెగా
రిప్లయితొలగించండిజమునయ్యంచును పిల్చునట్టి రవియే సావిత్రుడే గాదుటే
కమలాప్తుండు, శశాంకుడౌననుట నిక్కంబే కదా మిత్రమా
కుముదేశుండన వాడె పక్షధరుడున్ గుందేటి తాల్పుండనన్.
కమలము చంద్రులుగలిసిరి
రిప్లయితొలగించండిఅమితము యయెనేమొ దోస్తీ అవసరమందన్
మమకారమువీడగనా
కమలాప్తుఁడు చంద్రుఁ డనుట కల్ల, యెటులగున్!!
కమలములకు కాంతినొసగు
రిప్లయితొలగించండికమలాప్తుడు చంద్రుడనుట కల్ల యెటులగున్
సుమ బాణుని తాపము తా
క్రమముగా పెంచుట సహజము కాదా భువిలో
ఎన్నికలపర్వమరుదెంచె నెన్నికలలు!
రిప్లయితొలగించండినెన్నికలలో వినాయకులెన్నడేని
ప్రజలయూసెత్తలేని సంపన్నుల విత
*"రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన"*