10, మార్చి 2019, ఆదివారం

సమస్య - 2953 (మరణము లేనివారు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"మరణమే లేనివారలు మనుజు లెల్ల"
(లేదా...)
"మరణము లేనివారు గద మానవు లెల్లరు దివ్యమూర్తులున్"

31 కామెంట్‌లు:

  1. సరకగు మేను మోయుచును సాధకబాధకముల్ భరించుచున్
    వరములు కోరి బావుకొని వ్యర్థపు రీతుల సంతసించుచున్
    పరిపరి జన్మ లెత్తుచును పండుగ జేయుచు నాత్మరూపులై
    మరణము లేనివారు గద మానవు లెల్లరు దివ్యమూర్తులున్ :)

    రిప్లయితొలగించండి
  2. జన్మ జన్మము లందున చచ్చి పుట్టి
    కష్ట సుఖముల దేలుచు కాల గతిని
    పాప పుణ్యపు భారము బ్రతుకు లాగు
    మరణమే లేని వారలు మనుజు లెల్ల

    రిప్లయితొలగించండి


  3. అరయగ నేత లై మన సమాజము నేలగ వత్తు రా సురల్
    సరళిని తీర్చి దిద్ది సయి సంగతు లన్నియు నేర్పి విజ్ఞతన్
    ధరణిని నిల్పి కాలగతి తామిక వీడెద రీ జగద్వహన్
    మరణము లేనివారు గద మానవు లెల్లరు దివ్యమూర్తులున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  4. అరయ గా నేతలై మన యభ్యుదయము
    గాన సురలేను వచ్చిరి గాన వారు
    మరణమే లేనివారలు! మనుజు లెల్ల
    వందనము చేయదగునమ్మ వారికి సఖి !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. జననమొంద సామాన్య సంసారికేమొ
    ముల్లెయందు సన్యాసికి మోక్షమందు
    కారణము లేవయిన గాని కామమందు
    మరణమే లేనివారలు మనుజులెల్ల

    రిప్లయితొలగించండి
  6. ఇంచు కైన లేకయె పర వంచనమ్ము
    మంచు వలెను మరియు విరి మల్లె వలెను
    మంచి మనసు తోడ నెపుడు మసలు చుండ
    మరణమే లేనివారలు మనుజు లెల్ల

    రిప్లయితొలగించండి
  7. సుధ ను గ్రోలు ట చేత నే సుర వరా ళి
    మరణ మే లేని వారలు ; మనుజులెల్ల
    జనన మరణాల సుడి గుండ చక్ర మందు
    తగు లు కొని యును బాధ తో రగులు చుంద్రు

    రిప్లయితొలగించండి
  8. ధరణిని భారతావనిని ధార్మికతత్వవివృద్ధి హెచ్చె. నీ
    స్మరణము తప్పనన్యమును మానసమందు గణింపరెన్నుమా.
    నిరుపమ రామభద్రుఁడవు. నిర్మలముక్తినొసంగు.
    దుష్ట సం
    స్మరణము లేనివారు గద మానవు లెల్లరు దివ్యమూర్తులున్"

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    అరయ మృకండుసూతి , సిరియాళుడు , తిన్నడు , నా ధ్రువుండు , శ్రీ
    చరణములన్ భజించి యిల శాశ్వతులై కనిపింప నమ్మవా ?
    నరవర ! లెమ్ము ముక్తికయి నమ్మి భజించుము , దైవభక్తులై
    మరణము లేనివారు
    గద మానవు లెల్లరు దివ్యమూర్తులున్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. స్వార్థమును వీడి యున్నత పదవినొంది
    ప్రజల సేవె లక్ష్యముగను పాటుపడుచు
    నమరులైనట్టి మనుజులు యశము చేత
    మరణమే లేనివారలు మనుజు లెల్ల.

    రిప్లయితొలగించండి


  11. నిక్కరుని వీడి జీన్సులోనికి, జిలేబి,
    మారుపడ, సైకిలును వీడి మాంఛి బైకు
    నెక్క, ఫ్రెండన్న మాటలో నెమ్మి మారు?
    మరణమే లేనివారలు మనుజు లెల్ల
    ఫ్రెండు షిప్పున సాగేటి బ్రేండు బాసు :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. శరణముఁగోరి దైవమును,చంచలతన్ విడనాడి,ఆత్మ సం
    స్మరణము నిద్ర లేప,వర మంత్ర జపంబలరార,నిత్యమున్
    హరి పద సేవనంబున నిహారము సల్పెడు దొడ్డ వారలున్
    మరణము లేనివారుఁగద మానవులెల్లరు దివ్యమూర్తులున్

    రిప్లయితొలగించండి
  13. ఎదుటి వారిని ప్రేమతో నెవరుఁ జూతు
    రట్టి నేలన యానంద మావరించు
    నలజడులు నుండ వాసీమ, నచ్చట గను
    మ,రణమే లేనివారలు మనుజు లెల్ల!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరణముయన్న మాట వినమచ్చటి వారలు జూడ దైవ సం
      స్మరణమె జేతు రెప్పుడును శాంతిని కోరుచు నుందు రట్టియా
      వరణము గాన మాప్రజ శుభమ్ముల హారతు లిత్తురున్ సప్రే
      మ,రణము లేనివారుఁగద మానవులెల్లరు దివ్యమూర్తులున్

      తొలగించండి
  14. అవని జన్మించిన మనుజుc లంత సకల
    బ్రాణి కోటిలో విష్ణుcనప్పరమ పురుషు
    గాంచి హింసమాని ప్రేమ గాచు చుండ
    మరణమే లేనివారలు మనుజు లెల్ల

    రిప్లయితొలగించండి
  15. పరుల హితము గొరకు సదా పాటుబడుచు
    శ్వాస విడుచు మహి జనులు శాశ్వతముగ
    ప్రజల నాల్కల నెప్పుడు బ్రతుకు చుంద్రు
    మరణమే లేనివారలు మనుజు లెల్ల

    రిప్లయితొలగించండి
  16. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    మరణమే లేని వారలు మనుజు లెల్ల

    సందర్భము:ద్వంద్వము లంటే మానావమానాలు సుఖదుఃఖాలు లాభనష్టాలు మొదలైనవి.. వీటివల్ల పొంగకుండా కుంగకుండా వుండగలుగడం అభ్యసించాలి.. శీతోష్ణ సుఖదుఃఖేషు... అని గీతలో ప్రబోధింపబడింది యిదే!
    నేను ఆత్మ స్వరూపుణ్ణి.. నా కివేవీ అంటవు.. అన్న భావం దృఢపడితే మనుష్యుడు ఆత్మనిష్ఠు డౌతాడు..
    ఇక వానికి నిజానికి జనన మరణాలు లేవు. అవి శరీరానికి మాత్రమే!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ద్వంద్వముల కతీతు లగుచుఁ
    దనరిరేని...

    యాత్మనిష్ఠులై యోగులై యలరిరేని...

    జననమే లేని వారలు జనులు నెల్ల...

    మరణమే లేని వారలు మనుజు లెల్ల...

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    10.3.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  17. ఎంచి జూడగ దేవత లెప్పటికిని
    మరణమేలేని వారలు,మనుజులెల్ల
    చావు పుట్టుక గలవారు జగమునందు
    పాప కర్మల బట్టియు ద్భవముగలుగు

    రిప్లయితొలగించండి
  18. నిరతము నింద్రియాప్తులుగ నీరజనాభుని దివ్యనామ సం
    ప్మరణము లేనివారుగద మానవులెల్లరు; దివ్యమూర్తులున్
    మరువక శ్రీపతీపదము మానసమందున నామకీర్తనల్
    వరముగ నందజేసిరిగ వాసిగ నన్నమయాదులిద్ధరన్

    రిప్లయితొలగించండి
  19. కామందున కోర్కెల కల్పనలను
    లెక్కజేయని నరులకు జిక్కుసుఖము!
    పరుల కొరకెంచుబ్రతుకున వరలకీర్తి
    మరణమేలేని వారలు మనుజులెల్ల!

    రిప్లయితొలగించండి
  20. దాన ధర్మము లందు సతమ్ముఁ బరఁగి
    తోటి వారి కెల్లరకు సంతోష మెల్లఁ
    బంచి కీర్తి శేషులయి సత్పథము సేర
    మరణమే లేనివారలు మనుజు లెల్ల


    దరుమము నిల్పి యెల్లెడల దయ్యము నుంచి మనమ్ము నందునన్
    గరువముఁ జూప కుండ తమ గాదిలి పెండ్లము లండ నుండ బా
    మర జను లైన నేమి యిల మాన్యులె యప్పుడ నిక్క మెంచ దు
    ర్మరణము లేనివారు గద మానవు లెల్లరు దివ్యమూర్తులున్

    రిప్లయితొలగించండి
  21. రాము డాదర్శ పురుషుని రమ్యమైన
    ధర్మపథము ననుసరించి ధరణియందు
    శాంతి సౌభాగ్య ముల గోరు జనులె యైన
    మరణమే లేని వారలు మనుజు లెల్ల

    రిప్లయితొలగించండి
  22. సుధల ద్రాగిన అమరులే సురలు గాన
    మరణమే లేనివారలు, మనుజు లెల్ల
    కర్మలంబడి మరణించి కరుణగల్గి
    సృష్టి కార్యము నందునసహకరింత్రు!!

    రిప్లయితొలగించండి
  23. అరయగ దేవతాగణములయ్యరెయెన్నటికెప్పుడున్సుమా
    మరణములేనివారుగద,మానవులెల్లరుదివ్యమూర్తులున్
    మురిపెముతోడశంకరునిబూజలుభక్తినిజేయువారలున్
    విరివిగ దైవనామమునువేమరుసారులుబల్కువారలున్

    రిప్లయితొలగించండి
  24. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వరములు కోరి సోనియను వాకబు జేయుచు రేట్లు సీట్లకై
    పరువులు బెట్టి రాహులువి పట్టుకు గట్టిగ పాదపద్మముల్
    విరుగగ నడ్డి యాఖరకు వీలుగ జేరుచు చంద్రశేఖరున్
    బరువగు రాజకీయమున భారత మాతకు "సేవ"జేయుచున్
    మరణము లేనివారు గద మానవు లెల్లరు దివ్యమూర్తులున్

    రిప్లయితొలగించండి
  25. అరయగ దీనులెల్లరుల యాకలి దీర్చెడు బుద్ధి తొడ స్వా
    ర్థరహితుడై చరించుచు సదా శరణార్థుల నాదరించుచున్
    పరహిత కార్యముల్ సలుపు వారగు భూరి పరోప కారులే
    మరణము లేని వారు గద, మానవులెల్లరు దివ్యమూర్తులే.

    రిప్లయితొలగించండి
  26. .

    పరుల మేలును గోరుచు పగలు రేయి
    పరితపించుచు పనులను వాసిగాను
    చేయువారలే నిజముగా జీవి తాన
    మరణమేలేని వారు మనుజు లెల్ల.

    రిప్లయితొలగించండి
  27. అమృతమును త్రాగినట్టి యా యమరులెల్ల
    మరణమే లేని వారు,మనుజు లెల్ల
    చావు నొందక తప్పదు జగతియందు
    సృష్టి నియమమ్యుమిది యౌను జీవులకును.

    రిప్లయితొలగించండి
  28. నా ప్రయత్నం :

    తేటగీతి
    ఇలను మాయకు సమ్మోహితులగుచుండి
    నాత్మరూపు లమను సత్యమలవడకనె
    గమ్యమన్నది పరమాత్మ కౌగి లనెడు
    స్మరణమే లేని వారలు మనుజులెల్ల

    చంపకమాల
    పరమును గమ్యమంచు స్థిరభావన మేర్పడి యాత్మరూపులన్
    స్మరణము నిత్యమున్ విడక మాధవు నా పరమాత్మఁ జేరెడున్
    గురుతుగఁ ద్రుంచి చింతనల కూరిమి శ్వాస పథాన ధ్యాన వి
    స్మరణము లేనివారు గద మానవు లె, ల్లరు దివ్యమూర్తులున్!

    రిప్లయితొలగించండి
  29. దేశ స్వాతంత్ర్య పోరాట ధీరులుఁ గనఁ
    భౌతికముగ లేకున్నను బ్రజ మనసున
    మరణమే లేని వారలు; మనుజు లెల్ల
    వారి నాదర్శముఁ గొనవలయు నెపుడు
    =================================
    అరయగ వక్ర మార్గమున నందరి సొమ్ములు దోపిడెంచి తాఁ
    ధరణిని కొంత పంచుచును దాతగఁ బేరు గడించ ధూర్తులౌ
    వరముగ నీతి సంపదను బంచుచు మంచికి సేవలెంచినన్
    మరణము లేనివారు గద మానవులెల్లరు దివ్యమూర్తులున్

    రిప్లయితొలగించండి
  30. దేశ స్వాతంత్ర్య పోరాట ధీరులుఁ గనఁ
    భౌతికముగ లేకున్నను బ్రజ మనసున
    *మరణమే లేని వారలు; మనుజు లెల్ల*
    వారి నాదర్శముఁ గొనవలయు నెపుడు
    =============
    2వ పూరణ
    =========
    అరయగ వక్ర మార్గమున నందరి సొమ్ములు దోపిడెంచి తాఁ
    ధరణిని కొంత పంచుచును దాతగఁ బేరు గడించ ధూర్తులౌ
    వరముగ నీతి సంపదను బంచుచు మంచికి సేవలెంచినన్
    *మరణము లేనివారు గద మానవులెల్లరు దివ్యమూర్తులున్*

    రిప్లయితొలగించండి