5, మార్చి 2019, మంగళవారం

సమస్య - 2948 (బస్సే సాధనము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్"
(లేదా...)
"బస్సె దుబాయిఁ జేర్చఁదగు వాహన మన్యము లేలఁ గోరఁగన్"

40 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఖస్సూ బుస్సూ లాడెడి
      విస్సన్న యనెడు భర్త వేధిం పులకై
      గుస్సా చెందగ పయనము
      బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్



      తొలగించండి
  2. కం.
    నిస్సందేహముగానది
    మిస్సైన మరల దొరకదు మింటనెగురుచున్
    లస్సీ త్రాగుచు నా"ఏర్
    బస్సే" సాధనము గద దుబాయిని జేరన్ .

    రిప్లయితొలగించండి
  3. కందం
    లెస్సగ విదేశ మందున
    తస్సాదియ్యా కొలువది దక్కెను గదరా
    బిస్సున నేగంగ నెయిర్
    బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్

    ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

    రిప్లయితొలగించండి
  4. మిస్సమ్మ స్కూలు బోవగ
    బస్సే సాధనము గద; దుబాయినిఁ జేరన్
    మిస్సవ గూడదు ఫ్లైటును
    హుస్సేనుకునైన భాయి! హుందా తోడన్

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. ఉత్పలమాల
      లెస్సగ విద్యనేర్చి తను లేసెను గా కొలువంది వెళ్ల వా
      డస్సలు కష్టమే గనఁడు నట్లుగ గూర్చె ధనమ్ము తండ్రియున్
      బిస్సును పోవనెంచె నట వేడుక మీరవిదేశయాన మేర్
      బస్సె దుబాయిఁ జేర్చఁదగు వాహన మన్యము లేలఁ గోరఁగన్

      తొలగించండి


  6. తస్సా దియ్య జిలేబీ
    బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్,
    బుస్సని నాటో నెక్కియు
    డస్సులు కొట్టుచు జపాను డర్రున చేరన్ :)


    జిలేబు

    రిప్లయితొలగించండి


  7. డస్సుల కొట్టు బాలుడట డంబము తోడుగ పల్కెబో భళీ
    బుస్సన నాటొ నెక్కవలె బ్రువ్వన సాగవలెన్ తిరమ్ముగా
    కస్సెపు దారి దాటగను కార్పెటు వేసిన రోడ్డులోన నే
    ర్బస్సె దుబాయిఁ జేర్చఁదగు వాహన మన్యము లేలఁ గోరఁగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    లెస్స! దుబాయి జూడ నవలీల విమానమునెక్కి, పోవలెన్!
    తస్సదియా ! మనంబున ముదంబు జనించును ! పోయిరమ్ము ! నీ
    కస్సలు చింతలేదట దిగంగనె బస్సునె యెక్కుమింటికిన్
    బస్సె దుబాయిఁ జేర్చఁదగు వాహన , మన్యము లేలఁ గోరఁగన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  9. కస్సున కోపించిననూ
    తుస్సని చీదుచును ముక్కు దూషణ నెంచన్
    హిస్సీ యన్ననిజమెయిర్
    బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్

    రిప్లయితొలగించండి
  10. కస్సు మనక విను కన్నా
    బస్సు లెటుల వెడలు ? ఓడ పయనము తోడన్
    బుస్సునెగిరి పోవు ఎయిర్
    బస్సే సాధనము గద దుబాయిని జేరన్ !

    గురువర్యులకు నమస్సులు, నా నిన్నటి, మొన్నటి పూరణలను కూడా పరిశీలింప ప్రార్థన.

    నామమున కభేదమనుచు
    రామనవమికి శివ పూజ రంజిల జేయన్
    ప్రేముడి నెంచుచు విడువక
    రామభజన సేయుము శివరాత్రికి భక్తిన్!

    చెలిమిని మరచెడి జనులన్
    మలినములై చేరునట్టి మతములు, కులముల్
    బలమిడ పాలకులకు నా
    కలహము సుఖ మిచ్చు ననియె గాంధీ మునుపే!

    రిప్లయితొలగించండి
  11. హుస్సేను సాగరము దరి
    బస్సుకు పాసేమి లేక బహు వేగమునన్
    దుస్సా హసము జేయగ
    బస్సే సాధనము గద దుబాయిని జేరన్

    రిప్లయితొలగించండి
  12. ముస్సోరీ చేరుటకున్
    బస్సే సాధనము గద;దుబాయిని చేరన్
    ఇస్సీ!బస్సెటు లెక్కుదు?
    దుస్సాధ్యము సాధ్యమౌనె దొర్లింపంగన్!

    రిప్లయితొలగించండి
  13. అస్సలె లోకము తెలియని
    హుస్సేనుకు వీసరాగ నుత్సాహముతో
    విస్సన్నకు చెప్పెనిటుల
    బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్.

    రిప్లయితొలగించండి
  14. విస్సన్న నడి గెనొక్కడు
    బుస్సున నే గంగ దలచి భోరున తాను న్
    గుస్సును జెంది యు బలి కె ను
    బస్సే సాధన ము గద దుబాయి ని జేరన్

    రిప్లయితొలగించండి
  15. కందం
    ఇస్సీ! ఏసీ లేదన
    దుస్సాహసముర బ్రతుకట దుర్బరమయ్యో
    యుస్సని మిత్రుండనె నేర్
    బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్!

    రిప్లయితొలగించండి
  16. మెస్సులె గెలుపును గూర్చును
    బుస్సుమనుచు బుసలు కొట్ట పులిభయపడుగా!
    తుస్సుమనునె ప్రల్లదములు?
    బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్
    **)(**
    మెస్సులు = చౌకధరల క్యాంటినులు
    ప్రల్లదములు = డంబములు

    రిప్లయితొలగించండి


  17. తస్సాదియ్య! జిలేబీ
    గుస్సా మత్ హోన; అమ్మకూచీ వినవే
    విస్సన్న చెప్పెను నపుడె
    బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  18. అస్సాము రాష్ట్రమున నరె
    బస్సే సాధనము గద; దుబాయినిఁ జేరన్
    డస్సితి తిన్సుకియా లో
    నుస్సురనుచు నేరు బస్సును నధిష్టింపన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. గుస్సా యెందుకు భాయీ!
    తస్సాదియ్యా!తెలియగ తాత్పర్యమిదే!
    నిస్సంశయముగ గగనపు
    బస్సే సాధనముగద దుబాయిని జేరన్

    రిప్లయితొలగించండి
  20. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    నిన్న రాత్రి 2 గం. వరకు *శంకర శతకము* లో సగం (54 పద్యాలు) వ్రాయగలిగాను. మిగిలిన సగం పూర్తి చేయాలని కూర్చున్నాను. కనుక ఈరోజు కూడా మీ పూరణలను సమీక్షించే అవకాశం లేదు.
    మన్నించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆపార్వతీ పరమేశ్వరులు తగు శక్తి సామర్ధ్యములిచ్చుగాక

      తొలగించండి
  21. కస్సూ బుస్సూ తెలియని
    కిస్సులతో కాలగతిన క్షేమంబేలన్
    గుస్సా మొదలవ ఏయిరు
    బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్"!!

    రిప్లయితొలగించండి
  22. లెస్సగ వినుడుమ ఱియెయిరు
    బస్సేసాధనముగద దుబాయినిజేరన్
    గుస్సాలు మానియికయా
    బస్సేయెక్కవ లయునెదు బాయికి బాలా!

    రిప్లయితొలగించండి
  23. కందము
    లెస్సగు స్వదేశి డ్రింకుల
    తస్సా దియ్యా యటంచు.తమకము తోడన్
    లస్సీ ద్రావుటకై ఏర్
    బస్సే సాధనము గద దుబాయిని జేరన్
    ఆకుల శివరాజలింగం వనఫర్తి

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. లెస్సగ నుండెనిప్పుడిటలీలనుగొల్పుచు వింతగానెయిర్
      బస్సె,దుబాయిజేర్చదగు వాహనమన్యములేలగోరగన్
      గుస్సనువీడుచున్ నికను గౌరవమొప్పగనెక్కుమాయదిన్
      మిస్సునుగావునీపనికి మేదినీయానముమించి యుండుటన్

      తొలగించండి
  25. "బస్స"న నలుగకుమ మనము,
    బుస్సనియెడి కోపమునకుఁ బోయుమ వే యా
    పస్సను జాలున కితరము
    “బస్సే”, సాధనము గద దుబాయినిఁ జేరన్

    [స+అధనము = సాధనము; ధనహీనతఁ గూడియుంట]


    ఇస్సమయంబునన్ దొరక విక్కడ యన్యము లైన వెవ్వియున్
    విస్సన సెప్పె నాకు మును బేర్మిని నాంగ్లపు భాష యందునం,
    గస్సు మనంగ నేల నలకం గొని, యాన విశేష శబ్ద మీ
    “బస్సె” దుబాయిఁ జేర్చఁదగు వాహన మన్యము లేలఁ గోరఁగన్

    రిప్లయితొలగించండి
  26. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అస్సలు బాగులేదు గురు! యాడికి బోయెను టైముసెన్సయా!
    మిస్సవకుండ కైపదము మేల్కొని జేసితి పూరణమ్ములన్
    గుస్సయె వాసి రేయినిట గుర్రుచు జూడగనీ సమస్యనున్:👇
    "బస్సె దుబాయిఁ జేర్చఁదగు వాహన మన్యము లేలఁ గోరఁగన్"

    రిప్లయితొలగించండి
  27. హుస్సేను దుబాయి వెడల
    బస్సెక్కియు టిక్కె టడుగ ప్రజలట నవ్వన్
    విస్సన్న దెలిపె ఏయి
    ర్బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్!

    రిప్లయితొలగించండి
  28. తుస్సుమనె నాదుకోరిక
    మస్సుకటు విడిచి విమాన మట్టున బోవన్
    కస్సుమనె నింగిన స్థితి
    బస్సే సాధనముగద దుబాయిని జేరన్

    రిప్లయితొలగించండి
  29. విస్సడు శంశబాదునకు వెళ్ళెడు వేళన మార్గమధ్యమున్
    తుస్సని టైరు పంచరయెఁ దూర ప్రయాణము జేయలేదికన్
    బస్సె, దుబాయి జేర్చదగు వాహన మన్యము లేల గోరగన్
    మిస్సవ బోకు ఫ్లైటునని మీరుముజాఫరు హెచ్చరించెనే.

    రిప్లయితొలగించండి
  30. చదవాల్సిన వయస్సులో శ్రద్ధతో విద్య నభ్యసించ వలెనను సందేశంతో నా పూరణ...

    అస్సలు చదవని వాడయి
    మిస్సవ పనులిట హుసేను మరితా నేగెన్
    కస్సున ఎక్కెను ఎయిరు
    బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్.

    రిప్లయితొలగించండి
  31. డస్సిరి పల్లె రైతులట తగ్గిన వానల నీటిఎద్దడిన్
    లెస్సని గల్ఫులో బ్రతుక లేచిరి వీడిరి భార్యబిడ్డలన్
    కస్సున పొంగ వుద్యమము కాలము మారెను చూడ కష్టముల్
    "బస్సె*", దుబాయిఁ జేర్చఁదగు వాహన మన్యము లేలఁ గోరఁగన్
    *బస్సె=చాలిక(హింది)

    రిప్లయితొలగించండి
  32. బుస్సున పొంగిన ఐటీ
    తుస్సుమనంగ మరి గల్ఫు దూరపు కొలువున్
    యొస్సన్న వానికినెయిర్
    బస్సే సాధనము గద దుబాయిని జేరన్

    బుస్సుమని పొంగి బూమ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం తుస్సుమన్నాక దూరతీరమైన గల్ఫులో ఉద్యోగానికి యెస్ అని సిద్ధం అయిన యువకుడు దుబాయ్ చేరాలంటే ఎయిర్ బస్సు సాధనం.

    రిప్లయితొలగించండి


  33. లెస్సగ వినుమయ్య నెయిరు
    బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్
    నుస్సురుసు రనక వేగమె
    మిస్సవబోకందుకొనుము మేటిగ నీవున్.


    రిప్లయితొలగించండి
  34. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్"

    సందర్భము: దుబాయికి బస్సులో వెళ్లవ చ్చంటే నిజమేనేమో అని నమ్మేసింది పాపం. మిస్సండర్ స్టాండ్ చేసుకుంది. ఆమె జెస్సీ.. అందులోనూ రేచీకటి జెస్సీ. బస్సు కనిపించింది. ఎక్కేసింది. "దుబాయ్.." అంది.
    టికెటర్ (కండక్టర్) టికటూ యిచ్చాడు.. కాని ఆతడు చెవిటి టికెటర్.
    ఇంతకూ ఆ బ స్సెక్కడి దనుకున్నారు? దుబ్బాకది.
    పొరపా టప్పటికే జరిగిపోయింది.
    కనిపించక బస్సెక్కిన దామె. వినిపించక టిక టిచ్చినా డతడు.. బలే!!
    అందుకని అనకుము.. "బస్సే సాధనము గద దుబాయికి..." అని..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మిస్సండర్ స్టాండింగున
    జెస్సి.. "దుబా" యనె.. టికె టిడె
    చెవిటి టికెటరే..
    బ స్సది దుబ్బాక.. దనకు..
    "బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    5.3.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి