22, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2964 (మధుపానాసక్తులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్"
(లేదా...)
"మధుపానాంకిత మత్త చిత్తులు గదా మౌనుల్ సదాచారులున్"

59 కామెంట్‌లు:


 1. మౌని - శ్రీకందిశంకరయ్య గారికి
  శుభాకాంక్షలతో


  సుధలొల్కెడు తేటతెనుగు
  మధురిమలన్ తేలియాడి మాకందంబై
  విధవిధ కైపదములనెడు
  మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్!


  జిలేబి


  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ మధురంగా ఉన్నది. అభినందనలు.
   'విధిగా నిడు కైపదముల । మధుపానాసక్తులు...' అంటే బాగుంటుందేమో?

   తొలగించు
 2. ప్రాతఃకాల కిట్టింపు:

  వధలన్ జేయుచు క్రోధ కామముల భల్ వైరాగ్యమొప్పారగన్
  మధువున్ జిందెడి రామనామమనునా మంత్రమ్ముపాసించుచున్
  కథలన్ గ్రోలుచు కృష్ణలీలను సదా కైవల్యమందించెడిన్
  మధుపానాంకిత మత్త చిత్తులు గదా మౌనుల్ సదాచారులున్ :)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "కైవల్యమందించు స।న్మధుపానాంకిత...' అంటే బాగుంటుందేమో?

   తొలగించు
 3. డా.పిట్టా సత్యనారాయణ
  విధులై షట్చక్రాలను
  విధిగా దాటంగ నచటి విస్తృత నందాం
  బుధిలో గాంచిన తేజో
  మధుపానా సక్తులుగద (మౌనివరేణ్యుల్)మౌని వర్యుల్

  రిప్లయితొలగించు
 4. హృదయము కోవెలగ మలచి
  సదమల మతితో నిరతము సద్గోష్ఠులతో
  వదలక హరినామామృత
  మధుపానాసక్తులు గద మౌనుల్ సుజనుల్

  రిప్లయితొలగించు
 5. మైలవరపు వారి పూరణ

  విధినారాయణ వాద్యవాదన లసద్విన్యాసపాదమ్ములన్
  తధిమిం ధిత్తణుతోం తధోం తకిట శబ్దానందనృత్యమ్మునన్
  విధుఖండాభ్రనదీప్రకంపనల సంవిద్రూపు నర్చించి , త....
  న్మధుపానాంకిత మత్త చిత్తులు గదా మౌనుల్ సదాచారులున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 6. డా.పిట్టా సత్యనారాయణ
  బధిరాంధాదుడనై సుయోగ మనగా బట్టించుకోలేక నే
  మధువున్ గ్రోలితి నన్ను నేనె గనుచున్ మాటాడి తి న్నా రసాం
  బుధియే చాలని యోగినైతి నధరం బాసించె సారాయి కి
  న్నధికారుండను హక్కునిచ్చు ప్రభుత న్నాదంటి "తేజంపు స
  ద్మధుపానాంకిత మత్త చిత్తులు గదా మౌనుల్ సదాచారులున్"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. బధిరాంధాత్ముడనై...గా సవరించితిని
   డా.పిట్టా సత్యనారాయణ

   తొలగించు


 7. సుధ లొల్కంగ తెనుంగు కైపదముగా శోభాయమానంబుగా
  విధిగా నైదన గంట ట్రింగుమనగా వేంచేయగా శుభ్రమై
  మధుపాత్రంబుగ శంకరాభరణమై మవ్వంపురీతిన్ సదా
  మధుపానాంకిత మత్త చిత్తులు గదా మౌనుల్ సదాచారులున్!  జిలేబి

  రిప్లయితొలగించు
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 9. మధు సూద న చరణ మ్ములు
  వదలక నిరతము జపించు పరమ మునీంద్రుల్
  సదమల పు భక్తి రసమన్
  మధు పానా స క్తులు గద మౌని వరే ణ్యుల్

  రిప్లయితొలగించు
 10. వ్యధలన్ బాపెడి మంచి యౌషధముగా
  భావించు రాజోత్తముల్
  మధుపానాంకితమత్తచిత్తులు గదా!
  మౌనుల్ సదాచారులున్
  మధురాధీశుని చూడ్కికై మదుల స
  మ్మార్జించి ధ్యానింపగా
  విధురంబన్నది లేక స్వామికరుణన్
  వీతాజ్ఞతన్ వెల్గరే !
  (సమ్మార్జించి-కడిగి ;విధురము -ఎడబాటు ;వీతాజ్ఞత-అజ్ఞానం నశించి)

  రిప్లయితొలగించు
 11. మది నెప్పుడు విడ లేని వి
  బుధులెల్లరు నా హరి తలపుల పూజించన్
  మధుసూదను నామసుధా
  మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్

  రిప్లయితొలగించు
 12. సుధ కన్నను మిక్కుటముగ
  మధరమ్మౌ రామనామ మహిమేమందున్
  వ్యధ ద్రుంచెడి నామ మనెడి
  "మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్"

  రిప్లయితొలగించు
 13. కుదురుగ హరి చరణములను
  ముదమారగ మదినిలుపుచు మురిసెడివారల్
  మధుసూదను నామామృత
  మధుపానాసక్తులు గద మౌనుల్ సుజనుల్

  రిప్లయితొలగించు
 14. బుధులైకోవిదులైదు
  ర్విధిబాధామర్మమరసి రిపువర్గంబున్
  వధియింపగహరిపూజా
  *"మధు పానాసక్తులు గద మౌనుల్ సుజనుల్

  రిప్లయితొలగించు
 15. మధురంబంచునుమాధవాచ్యుతహరేమాంపాహిగోవర్ధనా
  మధుదైత్యారిమురారిశూలివినుతామాన్పందగున్దోషముల్
  సుధపాథోనిధివాసయంచుమనసాస్తోత్రంబులన్ భక్తియన్
  *"మధుపానాంకిత మత్త చిత్తులు గదా మౌనుల్ సదాచారులున్"*

  రిప్లయితొలగించు
 16. ఉదయంబు త్రాగును యుత్పల మాలా మధురిమలు, కందముతో గలుపుచు ,
  బ్లాగులో దొరకెడు పాలకు ఫేస్బుక్కు గుల్యము కలుపుచు గ్రోలు చుండు
  ఫలహార వేళలోన్ ,వాట్సప్పు తేనియల్ జవిజూచు మధ్యాన్న సమయమందు,
  నమ్మవలె మధు పానాసక్తులు గద మౌని వరేణ్యు లనబడు నీల గళ స
  మానుడు, బుధ పూజ్యుండు, ధీమంతుడు, మద
  రహితుడు, తెలుగు భాషా నెరవరి, యెల్ల
  కవుల మానస చోరుడు ,కంది శంక
  రుండు,వెలుగు చుండు సతము రుక్కు లిడుచు


  (గురువు గారి పాదములకొక చిరు పుష్పము )

  రిప్లయితొలగించు
 17. రిప్లయిలు
  1. కుదురుగ దురీయమందున
   గదియించి మనోలయమున గనుగొననాత్మన్
   గుదిగొను బ్రహ్మానందా
   మధుపానాసక్తులు గద మౌనివరేణ్యుల్
   కదియించు = ఘటించు
   గుదిగొను = అతిశయించు

   తొలగించు
  2. కదియన్ దైవము,సద్విచారముల సాంగత్యంబు జేకూరగన్
   విధిగా నిత్యము మాధవార్చనలు,ఋగ్వేదాది పారాయణల్
   కుదురౌచిత్తము,ధ్యానమున్ గలిగి సద్గుర్వర్య పాదార్చనా
   మధుపానాంకిత మత్తచిత్తులు గదా మౌనుల్ సదాచారులున్

   తొలగించు
 18. వ్యధలను బాపుచు సతతము
  సుధలను పండించు హరి వచోమృత మరయన్
  నిధి కాదా!నామంబను
  మధు పానా సక్తులు గద మౌని వరేణ్యుల్.

  రిప్లయితొలగించు
 19. మధుపము పుష్పములందలి
  మధువును మనసుపడురీతి, మహిలో పారే
  మధురమగునట్టి గంగా
  మధు పానాసక్తులు గద మౌనివరేణ్యుల్
  మధు=నీరు

  రిప్లయితొలగించు
 20. 🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼
  ఆర్యులకు శుభోదయమ్🙏🏼.

  శంకరాభరణంలో నేటి సమస్య.
  మధుపానాంచిత మత్త చిత్తులుకదా మౌనుల్ సదాచారులున్.

  పూరణకై నా ప్రయత్నము.

  మధుపంబట్టుల కావ్యపుష్ప మధువుంబ్రఖ్యాతిగా గ్రోలి తత్
  సుధలన్ చిత్ర కవిత్వ మార్గమున సుశ్లోకంబుగాఁ జూపున
  త్యధికుల్మెచ్చుతెరంగునొప్ప వరలే యాంధ్రామృతోత్పాద్యమౌ
  మధుపానాంచిత మత్త చిత్తులు కదా మౌనుల్ సదాచారున్.

  సద్విధేయుఁడు
  చింతా రామకృష్ణారావు.🙏🏼

  రిప్లయితొలగించు
 21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 22. అదునెపుడు దొరుకునొ మరి య
  యిదెపు డవున న్మదీయ జిత్తము జూడన్
  యుదయమె మీరిడిన పదా
  మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్

  రిప్లయితొలగించు
 23. విధి నెఱుగుట కొఱకుం బలు
  విధ మార్గంబుల వెదకెడి విబుధులె వారల్
  విధిగా నధిపురుష కృపా
  "మధు పానాసక్తులు గద మౌనుల్ సుజనుల్"

  రిప్లయితొలగించు
 24. మధురంబోంకారమనుచు
  విధినే సతతము జపించ విబుధులు ఋషులే
  ప్రధములు ; స్మరణ మనందగు
  మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్

  రిప్లయితొలగించు
 25. సుధలు కురిపించి జగతిని
  బుధ మార్గమున నడిపించి బుద్ధి తెలుపు యా
  మధురపు భగవద్గీతా
  మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్

  రిప్లయితొలగించు
 26. పదిలమ్మని పరతత్త్వము
  విదులౌ నరులీ జగమున విడువక నజునిన్
  మదినెంచ నా సుధామయ
  మధు పానాసక్తులు గద మౌనుల్, సుజనుల్!

  రిప్లయితొలగించు
 27. బుధవర్యులు జెప్పినటుల
  మధురోక్తుల వల్లెవేయ మాన్యవరుండే!
  సుధలంగ్రోలెడు నూహల
  మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్!!

  రిప్లయితొలగించు
 28. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అధిదేవుండై వెలుగుచు
  పృధివిని కాపాడుచుండి విలసిల్లెడునౌ
  బుధుడా హరనామామృత
  మధుపానాసక్తులు గద మౌనివరేణ్యుల్.

  రిప్లయితొలగించు
 29. సదమల మార్గమునఁ జనుచు
  ముదమున చేయుచును తపము మోక్షముకొరకై
  మది రాఘవు నామామృత
  మధు పానాసక్తులు గద మౌనుల్ సుజనుల్

  రిప్లయితొలగించు
 30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 33. మధుసూదన నామాంచిత
  సుధా రసాస్వాదన మనసులునౌ నానా
  విధ పాప కార్య దూరులు
  మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్
  [మధుప + అనాసక్తులు = మధు పానాసక్తులు; మధుపము = మద్యపానము చేయునది]

  విధనంబైనను ధాన్య హీనమయినం భేదంబు లేదంచు ద
  ద్విధి సద్బావ తరంగ చోదితులు దేవీ దివ్య సంప్రీత చి
  త్త ధవ క్షేమద భక్త కల్పతరు పద్మ ద్యోత పాదార్చనా
  మధుపానాంకిత మత్త చిత్తులు గదా మౌనుల్ సదాచారులున్

  రిప్లయితొలగించు
 34. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  నా "ప్రాతఃకాల కిట్టింపు" కు పేరడీ:

  వధలన్ జేయుచు కోళ్ళ మేకలును భల్ వండించి బిర్యానినిన్
  మధువున్ జిందెడి బీరు వ్హిస్కిలను నోల్డ్ మాంకుల్ను సేవించుచున్
  కథలన్ గ్రోలుచు రాజకీయములనున్ కల్యాణమున్ గోరు స
  న్మధుపానాంకిత మత్త చిత్తులు గదా మౌనుల్ సదాచారులున్


  ఓల్డ్ మాంకు = "Old Monk" Rum
  "మౌనుల్ సదాచారుల్" = Dumb Kashmir Brahmins

  రిప్లయితొలగించు
 35. సుధలన్ చిందు మెఱుంగుపల్వలువలున్ సొంపౌస్వరూపమ్ముతో
  మధువైరిన్ మది గాంచు గోపికలు తిగ్మమ్మొంది యానామపున్
  మధుపానాంకిత మత్త చిత్తులు గదా, మౌనుల్ సదాచారులున్
  వ్యథలన్ వీడు తలంపుతో సతము విశ్వాత్మున్ ప్రశంసించెడిన్


  రిప్లయితొలగించు
 36. మధువిద్వేషిమనోహరాంగుని సుధర్మస్థాపనోద్యుక్తునిన్
  విధుమౌళిప్రముఖామరార్చితకనద్విఖ్యాతునిం గోరి, త
  న్మధురప్రాభవభక్తికీర్తనల శ్రీమత్పాదపద్మస్రవ
  న్మధుపానాంకితమత్తచిత్తులు గదా మౌనుల్ సదాచారులున్

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించు
 37. బుధులుడివిన ధ్యానమయను
  మధుపానాసక్తులుగద మౌనివరేణ్యుల్
  విధిమెప్పుబొందగోరిన
  విధిగామౌనమ్ముమేలు విస్తృతభంగిన్

  రిప్లయితొలగించు
 38. మధుపానాంకిత మత్తచిత్తులుగదామౌనుల్ సదాచారులున్
  మధుపానాంకిత మత్తచిత్తులన సమ్మానంబెమౌనీశ్వరున్
  మధుపానంబది జేయునెప్పుడునునున్మంత్తుంగ దానెల్లరిన్
  సుధలన్మౌనులుగ్రోలుటేయనగ నాసోమంబంచుటేసుమా

  రిప్లయితొలగించు
 39. సుధలుచిలుకు హరి నామపు
  మధు పానాసక్తులు గద మౌనుల్ .సుజనుల్
  మధుసూధనుడే భువిలో
  నధినాథుండనికొలిచెద రనవరతంబున్.

  రిప్లయితొలగించు
 40. విధిగా విదురుడు, మరి నా
  రదు ప్రహ్లాదుడు సరేసరి కమల నాభున్
  హృదయం బున నిల్పసదా
  మధు పానాసక్తులు గద మౌనివరేణ్యుల్

  రిప్లయితొలగించు
 41. వ్యధలన్ బాపుచు బ్రోచు శ్రీహరిని విశ్వాసమ్ముతో కొల్చెడిన్
  బుధవర్గమ్మును గౌరవించుచు సదా మోక్షార్థులై భక్తితో
  మదిలో నిత్యము నిల్పి కొల్చి, మధురమ్మౌ నామ సంకీర్తనా
  మధుపానాంకిత మత్తచిత్తులు గదా మౌనుల్ సదా చారులున్

  రిప్లయితొలగించు
 42. మత్తేభవిక్రీడితము
  నిధి నిక్షేపమనంగ వాజ్ఙ్మయము సందేశాత్మకమ్మౌచు నీ
  పృధివిన్ జ్ఙాన పరీమళంబుఁ బనుచన్ వేదాలశోధించెడున్
  బుధులై వేలకు వేలవత్సరములున్ బోనీక ధ్యానాంబుధిన్
  మధుపానాంకిత మత్త చిత్తులు గదా మౌనుల్ సదాచారులున్

  రిప్లయితొలగించు
 43. [3/22, 6:15 PM] +91 94400 00427: 🙏🙏
  అధికానందము పొందుచు
  మధువైరిని తలచుచు సతమానందాబ్ధిన్
  విధిగా మెలగెడు వారలు
  మధుపానాసక్తులుగద మౌనుల్ సుజనుల్

  రిప్లయితొలగించు
 44. మదిలోఁ జెడును దలఁపక స
  హృదయంబున జనుల మేలు నెంచుచు సతమున్
  విధిగా "రామా"మృతమౌ
  *మధు పానాసక్తులు గద మౌనుల్ సుజనుల్*

  రిప్లయితొలగించు