6, మార్చి 2019, బుధవారం

సమస్య - 2949 (ప్రేమించినఁ గీడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్"
(లేదా...)
"ప్రేమయె కీడొనర్చుఁ గద ద్వేషమె మేలొనఁగూర్చు నిచ్చలున్"

43 కామెంట్‌లు:

  1. "నారీ స్తనభర నాభీ దేశం..."

    రాముని నామమె శ్రేయము
    కామము నీబోటి యతికి కంపమ్మొసగున్
    భామల జూడ వికారము
    ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్ :)

    రిప్లయితొలగించండి
  2. భామల విషయమె కాదుర
    నీమదిలో నిలుపుకొనుమ నీమముగానే!
    కామాది యారు గుణముల
    *"ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్"*

    రిప్లయితొలగించండి
  3. ( రుక్మి తన చెల్లెలు రుక్మిణితో )
    ఏమిది ? రుక్మిణీ ! వినవ
    యెంతగ జెప్పిన ? నందనందనున్
    నామది నున్న శాత్రవుని ;
    నల్లని గొల్లని ; విస్మరింపుమా !
    నీమము నేర్పరించితిని ;
    నీవిక నాదగు దారి రానిచో
    ప్రేమయె కీడొనర్చుగద ;
    ద్వేషమె మేలొనగూర్చు నిచ్చలున్ .

    రిప్లయితొలగించండి
  4. రాముని నామము వీడుచు
    భామల, భాగ్యాల వెంట పరుగిడు టేలన్
    కామాది షడ్వర్గముల
    ప్రేమింటినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్.

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    ఏమనుకొంటివయ్య ? నిను హింసను జేయగ ప్రోత్సహించు , శ్రీ...
    రామపథమ్మునందు జనరాదను , మత్తునముంచు , కామమే
    కామితమంచు బోధనిడు , గావున మానవ ! దుర్గుణాళిపై
    ప్రేమయె కీడొనర్చుఁ గద ద్వేషమె మేలొనఁగూర్చు నిచ్చలున్" !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  6. నా ప్రయత్నం

    కందం
    కామము క్రోధము లోభము
    లౌ మోహ మదాది మత్సరమ్ములుగన్ నీ
    వేమాత్రము లొంగకుమా!
    ప్రేమించిన కీడొనర్చుఁ ద్వేషింపు మిఁకన్

    ఉత్పలమాల
    కామము క్రోధమున్ మరియు గహ్వర లోభ పథాన వాటిపై
    ప్రేమయె కీడొనర్చుఁ గద ద్వేషమె మేలొనఁగూర్చు, నిచ్చలున్
    భూమిని రేగుచున్ తుదకు మోహ మదాదిగ మత్సరమ్ములై
    సేమము గాక నిన్ను నవె చిధ్రము జేసెడు శత్రువుల్ సుమా!

    రిప్లయితొలగించండి


  7. ఏమాయెన్ గురువర్యా
    యీ మధ్యన ఉల్ట పల్ట యీ మాదిరిగా
    ప్రేమము పైన సొలయికల్?
    ప్రేమించినఁ గీడు గల్గు? ద్వేషింపు మిఁకన్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. క్షామంబెంతయొ వచ్చిన
    ప్రేమించుటెరుగరు వారు వేతురు బాంబుల్
    భామా! పాకిస్తానును
    "ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్"

    రిప్లయితొలగించండి


  9. నా మాతృభూమి సహనపు
    ధామంబని పలికితివిగ ధరణిన్? భళి పు
    ల్వామా నేర్పెను నరుడా
    ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. సామీ! యని దరిచేరిన
    భామిని మోహమున నీదు భాగ్యమ పయినన్
    దామిణిని యెరుగ కుండనె
    ప్రేమించిన గీడు గల్గు ద్వేషింపు మికన్

    రిప్లయితొలగించండి
  11. కందం
    సామాజిక మాధ్యమముల
    కామించక విద్యనేర్చి ఘనతన్ గొనుమా!
    లే మా! శిష్యా! వాటిని
    ప్రేమించినఁ కీడొనర్చుఁ ద్వేషింపు మిఁకన్

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు

    1. ఒప్పక పోతే మొటిక్కాయ ఒక్కటి టప్ మని వేసి ఒప్పిచేస్తే సరి :)



      జిలేబి

      తొలగించండి
    2. అప్పుడు గురువు గారు కూడా ఒక్కటి వేస్తారు.

      తొలగించండి
  13. రోమాంచిత కీటకమే
    ప్రామాణ్యముతోడ జేరు పరవశమున ఆ
    ధూమాగ్ని; చచ్చు ;నతిగా
    ప్రేమించిన కీడుగల్గు--ద్వేషింపుమికన్.

    రిప్లయితొలగించండి


  14. ఈ మహిలోన నిక్కమిది యే సుదతీ తన రార నొప్పునా
    ప్రేమయె; కీడొనర్చుఁ గద ద్వేషమె; మేలొనఁగూర్చు నిచ్చలున్
    నీమము తప్పకన్ విభుని నీహృదయంబున గొల్చి కోరగా
    కామము లేక ధర్మ విధి గాను జిలేబి విధాత రాతగా !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. కామాది యారు గుణముల
    ప్రేమించి న కీడు గల్గు ద్వేషింపు మి కన్
    మోము న నవ్వు ను జూపు చు
    పామరుడైకీడు సేయు పాల సు ని ల లో

    రిప్లయితొలగించండి
  16. కామము క్రోధము లోభము
    తమరిక తప్పక విడువుము తక్కిన మూడున్
    సుమ! వీడుట సులు వగునట
    ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్"

    రిప్లయితొలగించండి
  17. రాయలసీమ ఫాక్షనిస్ట్ కూతురితో
    హేమా!విను పగతుసుతుని
    ప్రేమించిన కీడొనర్చు,ద్వేషింపుమికన్
    మీమాంసలికన్ వలదీ
    సీమన్ బగలే విజయము క్షేమముగూర్చున్

    రిప్లయితొలగించండి
  18. కందము
    వేమరు భక్తిని హిమగిరి
    ధాముని భజియించు నట్టి తాపసవర్యా!
    కామాద్యరి వర్గంబుల
    ప్రేమించిన గీడుగల్గు ద్వేషించుమికన్.
    ఆకుల శివరాజలింగం వనపర్తి


    కామాద్యరి వర్గంబుల
    ప్రేమించిన గీడుగల్గు ద్వేషించుమికన్

    రిప్లయితొలగించండి
  19. కామము మోహము జయించ
    లేమని వాంఛా విలాస లోలురు, పతితుల్
    గా మారినట్టి యతులన్
    ప్రేమించిన గీడు గల్గు ధ్వేషింపు మికన్

    కోరికలు, ఇష్టాలను జయించే శక్తి లేదని తెలుసుకుని విలాసాలు, భోగాలలో మునిగిపోయి పతనమైన కపట సన్యాసులను ప్రేమిస్తే చెడు జరుగుతుంది, అలాంటి మోసగాళ్ళను ధ్వేషించడమే మంచిది

    రిప్లయితొలగించండి
  20. కామముక్రోధముమదముల
    బ్రేమించినగీడుగల్గు ద్వేషింపుమికన్
    సేమముగలుగును జగతికె
    యేమాత్రమువలదుశంక యీవిషయమునన్

    రిప్లయితొలగించండి
  21. ఆ మంచు కొండ వెనుకను
    ఏమంచు నిలిచె నమేయ చీనీ సేనల్
    ఏ మంచి జూప వలదు
    ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్

    రిప్లయితొలగించండి
  22. ప్రేమించు టెఱుంగక తా
    కామమునకు లొంగి నిజము గానని ఘనుడా
    కాముకుడీ రీతి వదరె,
    "ప్రేమించిన గీడు గల్గు ద్వేషింపు మికన్"!

    రిప్లయితొలగించండి
  23. కామమున చొక్కు వానిని ప్రేమించినఁ గీడు గల్గు, ద్వేషింపు మికన్ కామాంధులను పుడమిపై క్షేమమ్ముగను వసియింప క్లేశము విడుచున్

    రిప్లయితొలగించండి
  24. భామామణులు గలరు నీ
    వేమాఱిచి వారి వీడి యిమ్మెయి నకటా
    కామమున వారకాంతలఁ
    బ్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్


    నీమము తోడ జీవనము నిత్యము సజ్జన వాంఛనీయమే
    కామము దక్కు బానిసవు కాకుము వింటిమి కాదె వేద వా
    క్స్తోమము వీడి ద్వేషమును దూర్ణముఁ జక్కఁగ నాశ్రయించినం
    బ్రేమయె, కీడొనర్చుఁ గద ద్వేషమె, మేలొనఁగూర్చు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  25. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నామము రూపమున్ విడక నర్తన మాడుచునుంటివే సదా!
    రోమము రోమమందు గొని రొప్పుచు రోజుచు చింతజేతువే!
    ఓ మమతా! వినమ్మనను! ఓటమి తథ్యము! మోడిపైన నీ
    ప్రేమయె కీడొనర్చుఁ గద ద్వేషమె మేలొనఁగూర్చు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  26. కోమలి కొంటెచూపులకు గుందిన డెందము నందు గూడుతో
    పామరపండితాదులును పాడయి పోయిన చిన్నెలెన్నియో
    సేమముకాదుజారిణుల చెంతవసించిన పాముపుట్టయై
    *"ప్రేమయె కీడొనర్చుఁ గద ద్వేషమె మేలొనఁగూర్చు నిచ్చలున్"*

    రిప్లయితొలగించండి
  27. ప్రేమకు దాసులెల్లరని ప్రేమ సమస్త మటంచునెంచి యా
    గామహరుండు బార్వతికి గాయము నందు సగంబొసంగె శ్రీ
    స్వామి రమాధవుండిడెను సాధ్వికి స్థానము వక్షమందు నే
    *"ప్రేమయె కీడొనర్చుఁ గద ద్వేషమె మేలొనఁగూర్చు నిచ్చలున్"?*

    రిప్లయితొలగించండి
  28. ఏమహితాత్ముజూచినను నింకమరొక్కరిజూడనొల్లమో
    యేమహితాత్మయోగరతి నింకమనోభ్రమలారిపోవునో
    యామహిమాన్వితాభ్యసనమాత్మహితంబన మర్చి ,మిథ్యయౌ

    *"ప్రేమయె కీడొనర్చుఁ గద ద్వేషమె మేలొనఁగూర్చు నిచ్చలున్"*

    రిప్లయితొలగించండి
  29. రాముడుభక్తవత్సలుడురామునిగొల్వుముదానవాధిపుల్
    రామునిచేనశించిరట రామునికైనతి దైవమెక్కడా
    రామునికంటె,రామునికి ప్రాణము హన్మడు రామునందుధర్మమా
    రామునిరామరామయని రామను రాముకొసంగు లేనిచో
    *"ప్రేమయె కీడొనర్చుఁ గద ద్వేషమె మేలొనఁగూర్చు నిచ్చలున్"*

    (మండోదరి రావణునికి హితముపదేశిస్తూ---–)

    రిప్లయితొలగించండి
  30. ఏమార్గమిడు సదాగతి
    నామార్గమెమార్గమంద్రు నయమున మీరా
    రాముని విరోధి నడతను
    *"ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్"*

    రిప్లయితొలగించండి
  31. కామాద్యరివర్గంబుల
    *"ప్రేమించినఁ గీడు గల్గు; ద్వేషింపు మిఁకన్"*
    స్వాములదుర్వ్యసనపరుల
    నేమానిసివీడునతడె నిజవర్తనుడౌ

    రిప్లయితొలగించండి
  32. కామమె లేనివేళ భువిఁ గార్యము లేవియు సాగవయ్యె నా
    కామము హద్దుమీరినను కల్పము నందునరుండు హీనుడౌ
    కామమదాదిగా గలవికారము లారిటి పట్లచూపెడా
    ప్రేమయె కీడొనర్చుఁగద ద్వేషమె మేలొనగూర్చు నిచ్చలున్.

    రిప్లయితొలగించండి
  33. ప్రేమగిడ పారిజాతము
    కామితమున సత్యభామ కల్మషమదితో
    ధీమా యాశల యందే
    ప్రేమించిన గీడుగల్గు ద్వేషింపుమికన్

    రిప్లయితొలగించండి
  34. కామముమీరియుండునెడ కామికుమధ్యననుండునట్టియా
    ప్రేమయెకీడొనర్చుగద,ద్వేషమెమేలొనగూర్చునిచ్చలున్
    బ్రేమలుదూరమైనపుడువేరుగగాపురముండుటౌకతన్
    గాముకులొక్కరైమరలకాపురమొండుగజేయుచుందురే

    రిప్లయితొలగించండి
  35. ఏమిర బాలక యేమిది
    యామాధవుని పొగడుటయు నాపుము పుత్రా
    సేమము కాదాతండరి
    ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్"*

    రెండవపూరణ

    కం:సామము తోడను పల్కుచు
    కామము తీర్చుకొన నెంచు కామాందునిలన్
    వేమరు దైవంబనుచును
    ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్"*

    మూడవపూరణ

    క్షేమము కాదిది వినుమా
    ప్రేమయనెడి పేరుతోడ విషమును చిమ్మున్
    కామాంధుని గుడ్డిగనిటు
    ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్"*

    మరొక పూరణ

    ప్రేమను పంచుచు బ్రతికిన
    సేమము తోబాటు ముదము చేకూరు నిలన్
    కామాదియారు గుణముల
    ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్.



    రిప్లయితొలగించండి
  36. ఏమాత్రముసచ్చీలత
    లేమలపైగౌరవమ్ము లేని కుజనులన్..
    లేమా! వినుమిక గోరకు
    *"ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్"*!!

    రిప్లయితొలగించండి
  37. కామము మోహమున్ మదము క్రౌర్యము లోభము మత్సరంబులున్
    క్షేమముఁ గూర్చలే విలను కీర్తిఁ గలంచును నేరికైననున్,
    పామరు నందు ప్రాజ్ఞుడగు పండితు నందున తత్ప్రవృత్తమౌ
    ప్రేమయె కీడొనర్చు గద ద్వేషము మేలొనరించు నిచ్చలున్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  38. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్

    సందర్భము: కార్లను బైకులను ప్రేమించవచ్చు. కాని అమితమైన వేగాన్ని ప్రేమిస్తే వచ్చేది ప్రాణాపాయమే!.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఈ మహిఁ గార్లను బైకుల

    మేమే మొనగాళ్ళ మనుచు మించి నడుపగా

    నే మగునొ! యమితవేగముఁ

    బ్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    6.3.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి