16, మార్చి 2019, శనివారం

సమస్య - 2959 (ధనముం గోరి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ధనముఁ గోరువాఁడె ధన్యజీవి"
(లేదా...)
"ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ"

106 కామెంట్‌లు: 1. ఎవరితో అనుబంధం రాసుకోవాలె :)


  అదియు నిదియు యన్ని యనుచుకాకన్ మాన
  ధనముఁ గోరువాఁడె ధన్యజీవి
  భువిని పురుషు లందు పుణ్యపురుషులు వే
  రౌ జిలేబి తెలిసి రాసు కొనవె


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అదియు నిదియు నన్ని...' అనండి.

   తొలగించు
  2. లేమలందు నీ జిలేబియే వేరయా
   లెక్క లేలనింక మ్రొక్కఁదగును
   😁🙏🏻🙏🏻

   తొలగించు

  3. విట్టు బాబు పల్కు వినవె భామ :)


   జిలేబి

   తొలగించు
 2. పేద రికము గాంచి ప్రేమించ రెవ్వరు
  ధనమె మూల మంట ధరణి యందు
  కొండ నుండు స్వామి కోట్లకు పడగెత్తె
  ధనముఁ గోరు వాఁడె ధన్య జీవి

  రిప్లయితొలగించు
 3. పాత్రలందు దాను పరిపూర్ణముగ జేరి
  పగలు రాత్రి యనక పాటుబడుచు
  సహజనటన తోడ జనతతి యభిమాన
  ధనము గోరువాడె ధన్యజీవి .

  రిప్లయితొలగించు
 4. అధము డెపుడు గోరు నధికమౌ ధనమును
  మానమును ధనమును మధ్యముండు
  ధనము రోసి యెపుడు ధరణి లోపల మాన
  "ధనముఁ గోరువాఁడె ధన్యజీవి"
  **)(**
  శ్లో. అధమా ధన మిచ్ఛంతి ధనం మానంచ మధ్యమా ౹
  ఉత్తమా మాన మిచ్ఛంతి మానోహి మహతాంధనం ౹౹

  రిప్లయితొలగించు
 5. తనువున్ గూడిన నాత్మనున్ గొలుచుచున్ ధర్మంపు మార్గమ్మునన్
  చనుచున్ ప్రేమను స్నేహమున్ పనుపుచున్ శ్లాఘించి పుణ్యాత్ములన్
  మనమున్ దైవపు చింతలన్ నడపుచున్ మాన్యమ్ము హృల్లేఖమౌ
  ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ :)

  రిప్లయితొలగించు
 6. నీకు వోటు వేస్తా.... నాకేంటటా...?? 🤗

  పంచ వర్షములకు పార్టీలు వాగ్దాన
  పదును చూపి వోటు వరము నడుగ
  దానమీయననెను దండంబుఁ బెట్టరో
  *"ధనముఁ గోరు వాఁడె ధన్యజీవి"*

  రిప్లయితొలగించు


 7. అనుమానంబది యేల బాల నిజమే యత్యద్భుతంబైనదౌ
  మన యీ జన్మ సుమా జిలేబి వలె‌ తా మస్తైన కాంక్షల్ సదా
  మన సామీప్యము నందు నిల్పును! చిదాత్మై ప్రత్యగాత్మౌ మహా
  ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ!

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఆత్మ + ఐ/ఔ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

   తొలగించు
 8. ఘనమౌ సంపద లింటలేని మనిషౌ కార్యార్ధి కాకున్నచో
  వినుమో యాతని బాధలెన్న తరమా వెంకన్న కేసాధ్యమా
  మనమున్ ప్రేమను పంచగోరు సతియే మౌనంబుగా దూరమౌ
  ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్ధియై

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మనిషి' అన్న ప్రయోగం సాధువు కాదంటారు. అందులోను 'మనిషి + ఔ' అన్నపుడు సంధి లేదు. అక్కడ "నరుడౌ" అనండి.

   తొలగించు
 9. తరణి చుట్టు తిరుగు ధరణివోలెను నేడు
  మనిషి తిరుగు చుండె ధనము చుట్టు
  పైసలోనె యుండు పరమాత్ము డనుచును
  ధనముఁ గోరువాఁడె ధన్యజీవి

  రిప్లయితొలగించు
 10. విద్య,వినయమున్న?విశ్వంబు నీదౌను!
  తల్లి,దండ్రి,గురువు దగినరీతి
  నీతి,నియమమందు జాతిసౌశీల్యతా
  ధనముగోరువాడె ధన్యజీవి!

  రిప్లయితొలగించు
 11. ధనమున్ మృణ్మయమట్లుగా దలచి తద్దారాసుతుల్ బాంధవుల్
  తను వెందాక రహించు, నంతవరకే తన్నాశ్రయింత్రంచు, పా
  వనమౌ శ్రీహరినిం దలంచి యెదలో, వైకుంఠముం జేర, నై
  ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ.

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించు
 12. అణువు న ణువు నందు హరి హరుల ను గాంచి
  భక్తి యందు మున్గు పరమ యోగి
  జన్మ సఫల మొంద చతురార్థ మోక్ష సా
  ధన ము గోరు వాడు ధన్య జీవి

  రిప్లయితొలగించు
 13. మైలవరపు వారి పూరణ

  దినభత్యమ్ములకై తపించెదవు , భక్తిజ్ఞానవైరాగ్యసా...
  ధనసంపత్తియె నిత్యమైన ధనమౌ, దైవత్వసంసిద్ధికిన్
  మనమున్ కట్టడి చేయుమా! పరమగణ్యంబైన తద్భక్తిసా...
  ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  2. వరూధిని... ప్రవరునితో

   నను నీ దానిగ కొమ్ము , నిన్ను గొని ఆనందాబ్ధిలో ముంచెదన్ !
   ఘనవేదమ్ముల నేర్చినన్ ఫలము మోక్షంబౌ చిదానందమే !
   కనుమా ! విప్రవరా ! సుఖంబు గొనరా ! కాంతాపరీరంభసా...
   ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు

  3. ఇంతన్నా విడు విడు అంటూ పారి పోనాడు పిచ్చి పారుడు :)


   అహరహమున్ భళారె తన యవ్వన శోభల మత్తులన్ సదా
   బహణెల పన్ని పెన్మిటిని బాగుగ బాహువులందు చేర్చునా
   సహచరురాలు ప్రేయసి! విశాంపతి చూడగ నావిడన్ తృటిన్,
   గ్రహణమువేళ, నత్యధికకాంతి వెలింగిరి సూర్యచంద్రముల్!

   తొలగించు
 14. మనసు నదుపు జేసి, మాయను కనిపెట్టి,
  తనను తెలిసికొనగ తపన బడుచు,
  తత్త్వ సారమరసి, తలచియాత్మ పరిశో
  ధనముఁ గోరు వాఁడె ధన్యజీవి..

  రిప్లయితొలగించు
 15. అనవరతమును పరమాత్మనే ధ్యానించి
  దైవమును నిలుపుచు మోవి పైన
  భోగములు త్యజించి భువిపైన మోక్ష సా
  ధనముఁ గోరు వాఁడె ధన్యజీవి.

  రిప్లయితొలగించు
 16. రెండవ పూరణ:

  పరమపదము నందుఁ బరమార్థమందును,
  మాయ విడక భక్తి మార్గమందు
  సాధనమ్ము లేక సంసారమునఁ బడి
  *"ధనముఁ గోరువాఁడె ధన్యజీవి"*

  రిప్లయితొలగించు
 17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కృష్ణారెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం చివర "మోక్ష మిచ్చు" అనండి. లేకుంటే గణదోషం. 'కంఠు + అపర' అన్నపుడు యడాగమం రాదు. "కంఠు నపర..." అనండి.

   తొలగించు
  2. పొరబాటు జరిగింది. రెండవ పాదం కూడా ఒకటి, మూడవ పాదాల లాగా వ్రాశాను

   తొలగించు
 19. ధనముం గోరగనేల? మదిలో దైవంబునే నిల్ప వే
  ధనలున్ నిల్చునె?కోర్కెలన్ విడి సదా ధ్యానంబులో మున్గి వి
  ష్ణు నివాసంబును చేరఁదల్చి తపమున్ శోధించి వై
  ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మూడవ పాదం చివర "వైరాగ్యసా " అని చదువ మనవి

   తొలగించు
  2. కృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "...గోరగ నేల యిట్లు మదిలో..." అనండి.

   తొలగించు
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 21. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


  ధనమే జీవనయంత్రమున్ నడుపగా ధాత్రీతలం బందు నిం

  ధనమౌ | కాని , యొనర్ప కార్జనము నన్యాయానురోధాన | నై

  ధనమై పోవును నీదు జన్మ , విడు మత్యంతాశ | సద్భక్తి సా

  ధనముం గోరి పరిశ్రమించు నరుడే ధన్యుండు మోక్షార్థియౌ


  ( అనురోధము = అనుసరణము ; నైధనము = పతనము )

  ( మూడవపాదంలో అఖండయతి )


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించు
 22. అనాయాస మరణం వినా దైన్యేన జీవితం!

  బ్రతికినన్ని నాళ్ళు భారమ్ముగాకుండ
  చేయిజాపనట్టి జీవితమ్ము
  నొప్పి నెరుగకుండ యొప్పారు సుగమ ని
  ధనము గోరువాడు ధన్యజీవి

  రిప్లయితొలగించు
 23. మాత్ర యెంతయున్న మాత్రమేమిఫలము
  దానమిచ్చినంత తగ్గి పోవు
  యివ్వగనె మరింత యెదుగుచుండు జ్ఞాన
  ధనము గోరువాడె ధన్యజీవి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మాత్ర'? "తగ్గిపోవు । నివ్వగనె..." అనండి.

   తొలగించు
  2. 🙏🏽
   మాత్ర= ధనము, రొక్కము ( ఆం. భా )

   తొలగించు
 24. ఆటవెలది
  ధరణి గోచరించు ధనధాన్య రాసులు
  శాశ్వత ములుగావు నశ్వరములు
  స్వర్గ ధామ సౌఖ్య సంపద యను ముక్తి
  ధనము గోరువాడె ధన్యజీవి
  ఆకుల శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించు
 25. ధనమె సర్వ మనుటc దప్పది; సద్గుణ
  ధనముc గోరు వాడె ధన్య జీవి,
  తెలియ గోరు ధనముc దగుశీల మానాలు
  మేడిపూరి నేలు మహిమ సింహ!

  రిప్లయితొలగించు


 26. వచ్చే వారము నకు ఆకాశవాణి సమస్య యేమిటి ? తెలియజేయగలరు


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గ్రహణమువేళ నత్యధికకాంతి వెలింగిరి సూర్యచంద్రముల్

   తొలగించు
  2. చంద్రము శబ్దమునకు చంద్రుఁ డను నర్థము రాదని నా యభిప్రాయము.
   కర్పూరము, నీళ్ళు, బంగారు మున్నగు నర్థములను జెప్ప వచ్చును.
   చంద్ర శబ్దము కర్పూరాదు లమహత్తులగుటచే ము వర్ణకము వచ్చి చంద్రము గా నయినది. చంద్రుఁడు మహచ్ఛబ్దము కదా.
   చంద్రుడు శబ్దము కావలె ననిన సూర్యచంద్రులే యనవలసి యుండునని విశ్వసించుదును.
   గురువు గారు సందేహ నివృత్తి జేయఁ గలరు.

   తొలగించు
  3. సూర్యచంద్రులున్ అని కూడ చెప్పారండీ.ఏదయినా తీసుకోవచ్చు అనికూడ చెప్పారు.

   తొలగించు
  4. చంద్రముఁడు సకారాంత పుంలింగశబ్దముగా సాధువే నండి.

   తొలగించు
  5. సంస్కృతంలో నాది మిడిమిడి జ్ఞానమే!

   తొలగించు
 27. పుర్రె లెన్ని బుట్టి పుడమిలో గిట్టవా
  కొలది భక్తి లేక కోతి తతులు
  ఆతురతను బొంది ఆత్మ జ్ఞానమనెడి
  ధనముఁ గోరువాఁడె ధన్యజీవి

  రిప్లయితొలగించు
 28. ధన మవసర మగును ధరణీపతుల కెల్ల
  యజ్ఞ యాగములకు నవని జన సు
  రక్షణమునకును ధరను న్యాయ రీతిని
  ధనముఁ గోరువాఁడె ధన్యజీవి


  ధనముల్ ధాన్యము లెల్ల నక్షయములే తర్కింప నిద్ధాత్రినిన్
  వినయం బింకయు భక్తి యింపెసఁగ నా విష్ణు ప్రపత్త్యర్చనా
  జనితంబైన సుఘోరపాప చయ నాశప్రాభవో గ్రాగ్ని కిం
  ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ

  [అగ్నికి + ఇంధనము = అగ్ని కింధనము]

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించు
 29. ఆవుల లలి పెంచు టనువుగా వర్ధిల్ల
  ప్రకృతి నిర్మలముగ వరలె నాడు
  పతనమయ్యె నేడు పశువులు లేక గో
  ధనముఁ గోరువాఁడె ధన్యజీవి

  రిప్లయితొలగించు
 30. ధర్మ మార్గ మొకటి ధనమును జేర్చగ,
  వేరు దారి లోన వెర్రి ధనము,
  ధనము గూర్చు నపుడు ధర్మము బాటించి
  ధనము గోరు వాడె ధన్యజీవి
  కొరుప్రోలు రాధాకృష్ణా రావు
  రిప్లయితొలగించు
 31. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చనుచున్ భారత వీధులన్ బలముగా శ్లాఘించి గాంధీలనున్
  తినుచున్ నల్లని ఘాసమున్ బలుపుగా తిన్పించి సామ్రాట్లకున్
  ఘనమౌ రీతిని గెల్చుచున్ పదవులన్ కన్పించు కాంట్రాక్టులన్
  ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ

  రిప్లయితొలగించు
 32. చదువు కున్న చాలు జనులకు సంపద,
  యశము గౌరవమ్ము లబ్బు నవని
  పరులు దోచలేని ప్రాశస్యమౌ జ్ఞాన
  ధనము కోరువాడె ధన్యజీవి!!!

  రిప్లయితొలగించు
 33. ధనము గోరువాడె ధన్య జీవి యనుట
  యక్షరాల నిజమె యార్య ! యదియ
  ధనము లేని యెడల తద్దయు జూతురు
  చులకను గను భువిని సుమ్ము నమ్ము

  రిప్లయితొలగించు
 34. కోట్లు కూడబెట్టి కోటలన్ గొనవచ్చు
  పుడమినేల పదవి బొందవచ్చు
  కాసు చేయలేని కార్యమేదియు లేదు
  ధనముఁ గోరువాఁడె ధన్య జీవి.

  రిప్లయితొలగించు
 35. ధనమే ముఖ్యము కాదటంచెఱగి సద్ధర్మమ్మునే వీడకన్
  మనమున్ ధ్యానము జేయుచున్ బరుల క్షేమమ్మే సదా గోరుచున్
  వినయమ్మున్ విడకుండ శ్రీకరుని యన్వేషించు జ్ఞానమ్మనే
  ధనముంగోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ.

  రిప్లయితొలగించు
 36. అనఘుండై హరిపాదమాశ్రయించి నిత్యానందమున్ బొందగా
  ననువౌరీతిని జేకొనన్ శమదమాద్యష్టాంగ యోగమ్మునన్
  సనకాదుల్ జనుమార్గమున్ గడచి సచ్ఛారిత్రుడై ఙ్ఞాన సా
  ధనమున్ గోరి పరిశ్రమించు నరుడే ధన్యుండు మోక్షార్ధియై

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "హరిపాదముల్ గొలిచి..." అనండి.

   తొలగించు
  2. ధన్యవాదములు గురువుగారూ,సవరిస్తాను!

   తొలగించు
 37. వినుమా శంకర! యిధ్ధరన్దలప యెవ్వాడైనమెప్పున్వడున్
  ధనమున్గోరి పరిశ్రమించు నరుడే,ధన్యుండు మోక్షార్ధియౌ
  వినయంబొప్పగ రామనామమును దావేసారి బల్కందగున్
  ననుమానంబునులేదుగా నికను నార్యా మీరలే జెప్పుడీ

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'యిద్ధరన్ దలప నెవ్వాడైన...' అనండి.

   తొలగించు
 38. ఆలు బిడ్డ పోషణాధారముకొరకు
  వృత్తులందు నిష్ట వృత్తి చూసి
  యంకితంబగుచును న్యాయము నీతితో
  "ధనముఁ గోరువాఁడె ధన్యజీవి"


  రిప్లయితొలగించు
 39. తనదు తప్పులన్ని తలచు కొనుచు సరి
  దిద్దు కొనగ వలయు పెద్ద మనసు
  బెట్టి ప్రతి దినమ్ము, నట్టి యాత్మ పరి శో
  ధనముఁ గోరువాఁడె ధన్యజీవి

  రిప్లయితొలగించు
 40. అనుభవమ్మున నతడాశయములనెంచి
  కోరుకున్న పదవి కూర్మికుడిచె
  జనుల మనసు దోచ జననేతగాపొందు
  ధనముఁ గోరువాఁడె ధన్యజీవి!!

  రిప్లయితొలగించు
 41. పంచగుళికలు 3


  11)తే: వోటు కొరకు తిరుగు చుండు యింటి చుట్టు,
  కోటి ప్రశ్నల తోడ మీ కుశల మడుగు
  గెలిచిన పిదప మిమ్ములన్ తలచ బోడు
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

  12)తే: ఎన్నికలపుడు లెఖ్ఖ లేనన్ని మార్లు
  మురికి వాడలు మొత్తము తిరుగు చుండు
  ముగిసి నంతన్ మురికి వాడ వెగటు కలుగు
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

  13) తే: ఎన్నికల తరుణాన ఏ చిన్ని పాప
  కనుల ముందు కనబడినన్ కన్న బిడ్డ
  వోలె ముద్దాడు ,పిదప నా గాలి పడదు,
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

  14)తే: ఇరుకు గదులేల ,యిత్తుగా నిల్లు మీకు
  ననుచు పలుకు నమ్మకముగ నాస జూపి
  పిదప నివ్వబోడెప్పుడు పిసరు భూమి
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

  15) తే: ఆవులకు ననవరతము సేవ చేయు,
  గోవు లాంటి వ్యక్తి యనుచు కోరి గెలుపు
  నీయ, గోముఖ వ్య్ఘ్రాఘ్రమై నిన్ను చంపు
  తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ


  రిప్లయితొలగించు
 42. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 43. ధనముఁ గోర కిల, నిధనమును దగదు బం
  ధనములఁ బడఁకు పరధనమును సతి
  ధనముఁ వలదు జ్ఞాన ధనముతో నాత్మ శో
  ధనముఁ గోరువాఁడె ధన్యజీవి!

  రిప్లయితొలగించు
 44. [3/16, 18:44] Shankarji Dabbikar: ధనముంగోరిపరిశ్రమించుజనులే దారిద్ర్య సంహారకుల్
  ధనమున్దాచియు దూరదేశము నకేదాసోహమన్ధూర్థులే
  ఘనులైగౌరవమందుపెద్దలను శిక్షార్హుండ్రుగాజేయు సా
  *"ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ"*
  [3/16, 19:12] Shankarji Dabbikar: ఘనులాగారడిమాటలన్ప్రజకు మోక్షార్థంబునిప్పింతుమం
  చును నామాన్యులు వేషభాషల మహాశుష్కార్థ వేదాంతులై
  మనుచున్ గోముఖ వ్యాఘ్రులై దిరుగ దుర్మార్గంబు శిక్షించు సా
  *"ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ"*
  [3/16, 19:28] Shankarji Dabbikar: వినరోభాగ్యము యోగసాధనయె దైవీసంపదంచున్ గురుం
  డనఘుండందరి మేలునై నుడవ నేడవ్వాని బూజింతురా
  మనుచున్నాడట శీతశైలమున సంపాదించ రండంచు నై
  *"ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ"*

  రిప్లయితొలగించు
 45. ఘనవిద్యార్థము లార్జసేయవలె వాగర్థంబులౌ జ్ఞానులీ
  ధనముంబొందగలోకమంచులకు నిస్త్రైగుణ్యులై ద్వంద్వముల్
  యనుదోషంబుల గర్మవాంఛలను గుయ్యాళించకన్ సాధనా
  *"ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ"*

  రిప్లయితొలగించు
 46. ధనముం బొందుట బంధనమ్మె కనగా ధాత్రిన్ ధనమ్మే మహేం
  ధనమైకాల్చును క్రోధనమ్మును సదా హెచ్చింప గాజూచు నై
  ధన మార్గమ్మగు నాత్మ బోధనము ప్రాథమ్యమ్ముగా నైన సా
  ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ

  రిప్లయితొలగించు
 47. 1.దొరలు దోచలేరు దొంగలెత్తుకు పోరు
  దానమిచ్చినంత తరుగ బోదు
  విద్య అనెడి ధనము విశ్వమందటువంటి
  ధనముఁ గోరువాఁడె ధన్యజీవ


  2.విషయ వాంఛ లెల్ల వీడుచు భువిలోన
  దైవ మందు సతము తలపు నుంచి
  విడక పూజ చేసి వేగమే తా ముక్తి
  ధనము కోరువాడు ధన్యజీవి  3.ధనము లేదటంచు తాపత్రయపడక
  చేయి చాపి కుండా జీవితమున
  బ్రతుకు గడుపు చుండి వసుధలో నభిమాన
  ధనము కోరువాడు ధన్యజీవి


  4.గొప్ప చదువు చదివి కువలయ మందున
  ఖ్యాతి నంద గోరి కష్టపడుచు
  సకల గ్రంధములను చదువుచు విజ్ఞాన
  ధనము కోరువాడు ధన్యజీవి

  5.ఆలయమ్ము కట్టు నాలోచనము చేసి
  చింత చేయకుండా చెంత నున్న
  ధనము దాన మొసగి తనియక చందాల
  ధనము కోరువాడు ధన్యజీవి


  6.స్వార్థ చింతన విడి జగతి యందు సతము
  వాసిగా ధనమును పంచు చుండి
  వడిగ ముక్తి యనెడి పారమార్థిక మగు
  ధనము కోరువాడు ధన్యజీవి


  రిప్లయితొలగించు
 48. క్షయము లేక శాంతి సౌఖ్యము లొసగుచు
  మోక్ష పధము నడిపి మోక్ష మొసగు
  గరళ కంఠు నపర కరుణా భరితమైన
  ధనము గోరు వాడె ధన్య జీవి

  రిప్లయితొలగించు
 49. [ ప్రజలు నమాయికులు దమను
  భజన నొనర్చె ప్రభువుల వాక్చందనమున్
  నిజమని యోటును వేయన్
  *"సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్"*

  ప్రజలకు మేలొనర్తుమని వారికి సేవలొనర్చె భాగ్యమున్
  భుజబలు వీవు యోటరువు ముంగిట నుండెద కుక్కపిల్ల నై
  గజిబిజిమాటలొల్కి నిజకర్కశ నీతి చరించు నేతకున్
  *"సుజన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్"*

  రిప్లయితొలగించు
 50. సవరణతో...
  ===========
  పదవి ధనము పేరు నధికారమది జూచి
  స్వార్థ బంధ మెంచు జనుల కంటె
  వ్యక్తిలోని మంచి వ్యక్తిత్వమను స్నేహ
  *ధనముఁ గోరువాఁడె ధన్యజీవి*

  రిప్లయితొలగించు