31, మే 2020, ఆదివారం

ఆహ్వానం!


సమస్య - 3385

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భావము గానముగ నెగడ బాధయె కల్గెన్"
(లేదా...)
"భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్"

30, మే 2020, శనివారం

సమస్య - 3384

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఒకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో"
(లేదా...)
"అయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నే నౌననన్"

29, మే 2020, శుక్రవారం

సమస్య - 3383

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట"
(లేదా...)
"పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా"

28, మే 2020, గురువారం

సమస్య - 3382

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చదువు రానివాని చట్టు సూరి" 
(లేదా...)
"చదువే రాదను వానికిన్ సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగున్"

27, మే 2020, బుధవారం

సమస్య - 3381

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్"
(లేదా...)
"చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్"
(ఈ సమస్యను పంపిన వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలు)

26, మే 2020, మంగళవారం

'ఉగాది కవి సమ్మేళనం' పుస్తకాలు

కవిమిత్రులకు నమస్కృతులు.
'శంకరాభరణం ఉగాది కవిసమ్మేళనం'
'శంకరాభరణం అష్టావధాన సంకలనం'
పై రెండు పుస్తకాలు ప్రింటై ఎల్లుండి నాకు చేరతాయి. పుస్తకాలను కొరియర్ లో పంపడానికి వీలుగా చిరునామాలు పంపమన్నాను. ఈ క్రింద పేర్కొన్న వారి చిరునామాలు నాకు అందలేదు. దయచేసి వెంటనే పంపవలసిందిగా మనవి.

ఇంకా ఈ క్రింద పేర్కొన్న కవిమిత్రుల చిరునామాలు అందలేదు….
అచ్యుతానంత బ్రహ్మచారి
అవుసుల భానుప్రకాశ్
ఆకుండి శైలజ
ఆచార్య ఫణీంద్ర
ఆత్రేయ ప్రసాద్
ఆముదాల మురళి
ఆరవల్లి శ్రీదేవి
N.Ch. చక్రవర్తి
ఐతగోని వెంకటేశ్వర్లు
కడయింటి కృష్ణమూర్తి
కరణం రాజేశ్వర రావు
కరణం శేషగిరి రావు
కర్నాటి రఘురాములు గౌడ్
కవిశ్రీ సత్తిబాబు
కానుకొలను లక్ష్మీసీత
కె. ఈశ్వరప్ప
కొనకళ్ళ ఫణీంద్ర రావు
క్రొవ్విడి వేంకట రాజారావు
గంగుల ధర్మరాజు
గుగ్గిళ్ళ జనార్దనాచారి
గుమ్మా నాగమంజరి
గోలి హనుమచ్ఛాస్త్రి
చింతా రామకృష్ణారావు
చిటితోటి విజయకుమార్
జంధ్యాల ఉమాదేవి
జంధ్యాల సుబ్బలక్ష్మి
జి. ప్రభాకర శాస్త్రి
జిలేబి
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ
ధనికొండ రవిప్రసాద్
నారుమంచి అనంతకృష్ణ
నేమాని సోమయాజులు
పాలపర్తి హవీలా
పి. మోహన్ రెడ్డి
పోచిరాజు కామేశ్వర రావు
పోచిరాజు సుబ్బారావు
బండకాడి అంజయ్య గౌడ్
బల్లూరి ఉమాదేవి
మంద పీతాంబర్
మిస్సన్న
ముడుంబ వేణుగోపాలాచార్యులు
ముత్యంపేట గౌరీశంకర శర్మ
మైలవరపు మురళీకృష్ణ
వజ్జల రంగాచార్య
డా. వరలక్ష్మి హరవే
విట్టుబాబు
వెలగపూడి భారతి
శంకర్జీ డబ్బీకార్
శిష్ట్లా వి.ఎల్.ఎన్. శర్మ
శ్రీపతి శాస్త్రి
సూర్య కటకం
హరి వేంకట సత్యనారాయణ మూర్తి
దుర్గాప్రసాద రావు
చెరుకూరి వేంకట సూర్యనారాయణ శర్మ
కాకర మురళీధర్
ఫోన్ నెం. 9951087936

సమస్య - 3380

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దీనెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే"
(లేదా...)
"దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే"
(డా. జి. సీతాదేవి గారికి ధన్యవాదాలతో)

25, మే 2020, సోమవారం

సమస్య - 3379

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము"
(లేదా...)
"సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్"

24, మే 2020, ఆదివారం

జన్మదిన శుభాకాంక్షలు!


ఆహ్వానం!


సమస్య - 3378

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో"
(లేదా...)
"మల్లెల నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో"

23, మే 2020, శనివారం

సమస్య - 3377

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్"
(లేదా...)
"నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్"

22, మే 2020, శుక్రవారం

సమస్య - 3376

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తప్పఁగఁ బరీక్ష విద్యార్థి తాను మురిసె"
(లేదా...)
"తప్పి పరీక్షలోఁ గడు ముదంబున గంతులు వేసె ఛాత్రుఁడే"

21, మే 2020, గురువారం

సమస్య - 3375

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"యమ మహిషాగమనమున భయంపడఁ దగునా"
(లేదా...)
"యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్"

20, మే 2020, బుధవారం

సమస్య - 3374

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హనుమంతుని జప మిడుముల నందించుఁ గదా"
(లేదా...)
"హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే"

19, మే 2020, మంగళవారం

కవిమిత్రులకు విన్నపం...

        ఎంతోకాలంగా అనుకుంటున్న విషయం...
        'సమస్యా పూరణలు' పేరిట ఇప్పటికి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అయితే అవన్నీ కవులు వ్యక్తిగతంగా తాము చేసిన సమస్యాపూరణలను ముద్రించుకున్నవే.
        'శంకరాభరణం - బృహత్సమస్యాపూరణలు' పేరుతో శంకరాభరణంలో ప్రకటింపబడిన 1116 మంచి సమస్యలను ఎన్నుకొని, ఒక్కొక్క సమస్యకు వచ్చిన పూరణలలో నాలుగు ఉత్తమమైనవి, విభిన్నమైనవి ఎన్నుకొని పూరించిన కవుల పేర్లతో సహా ప్రకటిస్తూ ఒక పుస్తకం తీసుకురావలన్నది నా చిరకాల స్వప్నం. ఈ పద్ధతిలో ఇది మొట్టమొదటి పుస్తకం అవుతుంది.  ఈ విషయాన్ని ఎన్నోసార్లు, ఎన్నో సమావేశాలలో, ఎందరితోనో ప్రస్తావించాను. అందరూ ఇది మంచి కార్యమని ప్రోత్సహించారు. ఎంతవరకు వచ్చిందని అడుగుతూ ఉన్నారు.
        పుస్తక ముద్రణా భారం తమదని శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు వాగ్దానం చేసారు. అంతేకాక ఎప్పటికప్పుడు ఈకార్యం పూర్తి చేయవలసిందిగా గుర్తు చేస్తున్నారు. 
అయితే ఇంతకాలంగా తీరిక లేకపోవడం వల్ల, తరచూ ప్రయాణల వల్ల, అనారోగ్యం వల్ల, డిటిపి పనుల ఒత్తిడి వల్ల నేను ఈ పనిని మొదలు పెట్టలేకపోయాను. మొదలు పెట్టినా ఇది ఒక్కడి వల్ల అయ్యే పని కాదు.
        అందువల్ల ఆసక్తి ఉన్న కవిమిత్రులను ముందుకు రావలసిందిగా మనవి చేస్తున్నాను. *ముందుకు వచ్చిన వారిలో పదిమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం కేటాయిస్తాను*. ఆ సంవత్సరం వారికి ఉత్తమమైనవిగా తోచిన సమస్యలను ఎన్నుకొని, ఆ సమస్యకు వచ్చిన పూరణలలో వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్న నాలుగింటిని పూరించిన వారి పేర్లతో సహా కాపీ చేసి, ఒక ఫైలులో పేస్ట్ చేసి నాకు పంపవలసి ఉంటుంది. శ్రమతో కూడిన పనే. కాని సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పుస్తకంలో మీ భాగస్వామ్యం ఉంటుంది.
        కేవలం బ్లాగులో వచ్చిన పూరణలనే ఎన్నుకొనడానికి అవకాశం ఉంది. వాట్సప్ సమూహంలో సాధ్యపడదు.
        లాక్‌డౌన్ ప్రారంభమైనపుడు ఈ ఆలోచన వస్తే బాగుండేది. ఇప్పటికైనా అవకాశం ఉంది.
ఆసక్తి ఉన్న కవిమిత్రులు స్పందించవలసిందిగా మనవి. 

సమస్య - 3373

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రావణుఁడు కుంభకర్ణుఁడు రక్ష మనకు"
(లేదా...)
"రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్"

18, మే 2020, సోమవారం

సమస్య - 3372

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మనుజులను సంఘజీవులం చనుట కల్ల"
(లేదా...)
"మనుజులు సంఘజీవులను మాట యసత్యము గాదె చూచినన్"

17, మే 2020, ఆదివారం

ఆహ్వానం!


సమస్య - 3371

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పార్వతీ విష్ణుపత్నివై భద్రమిడుము"
(లేదా...)
"పార్వతి వీవు విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్"

16, మే 2020, శనివారం

సమస్య - 3370

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దారులం గొట్ట నేర్పె నాధ్యాత్మబోధ"
(లేదా...)
"దారుల్ గొట్టుట నేర్చినాఁడు విని యాధ్యాత్మప్రబోధమ్ములన్"

15, మే 2020, శుక్రవారం

సమస్య - 3369

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు"
(లేదా...)
"త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్"
(విట్టుబాబు సౌజన్యంతో)

14, మే 2020, గురువారం

ఆహ్వానం


సమస్య - 3368

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్"
(లేదా...)
"బంగారమ్మును గాంచి దూరముగ నేఁ బాఱంగ యత్నించితిన్"

13, మే 2020, బుధవారం

దత్తపది - 167

కవిమిత్రులారా,
'ఉత్పలమాల, చంపకమాల, మత్తేభము, శార్దూలము' 
ఈ పదాలతో ఛందస్సౌందర్యాన్ని తెలుపుతూ 
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

12, మే 2020, మంగళవారం

అవధాన సంకలనం ముఖచిత్రం


సమస్య - 3367

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ"
(లేదా...)
"భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

11, మే 2020, సోమవారం

సమస్య - 3366

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్"
(లేదా...)
"మోక్షముఁ గోరువారలకు ముఖ్యము చౌర్యము మద్యపానముల్"

10, మే 2020, ఆదివారం

ఆహ్వానం!


సమస్య - 3365

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పలికిన నిందలు మధురసుభాషితము లగున్"
(లేదా...)
"పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్"

9, మే 2020, శనివారం

సమస్య - 3364

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"క్రికెటు కష్టమైన క్రీడ యగును"
(లేదా...)
"క్రికెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా"

8, మే 2020, శుక్రవారం

సమస్య - 3363

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్"
(లేదా...)
"ఇంటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ"

7, మే 2020, గురువారం

సమస్య - 3362

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్"
(లేదా...)
"గాడిద నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై"

6, మే 2020, బుధవారం

సమస్య - 3361

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ముదము వలదటంచుఁ బోఱఁ డేడ్చె"
(లేదా...)
"ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్"

5, మే 2020, మంగళవారం

సమస్య - 3360

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు"
(లేదా...)
"హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్"

4, మే 2020, సోమవారం

సమస్య - 3359

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్"
(లేదా...)
"నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్"

3, మే 2020, ఆదివారం

ఆహ్వానం


సమస్య - 3358

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్"
(లేదా...)
"పైకంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే"

2, మే 2020, శనివారం

'ఉగాది కవిసమ్మేళనం' ప్రచురణ

కవిమిత్రులారా!
          శార్వరి ఉగాది సందర్భంగా కవుల పద్య సంకలనం 'శంకరాభరణం - శార్వరి ఉగాది కవిసమ్మేళనం' పేరుతో ముద్రించడానికి తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. అందులో కవుల ఊరి పేరుతో పాటు ఫోన్ నెం. కూడా ఇవ్వాలని కోరారు. కావున ఆ సంకలనంలోని కవులు తమ ఫోన్ నెం.లు, చిరునామాలు ఈ పోస్టు క్రిందకాని నా మెయిల్ (shankarkandi@gmail.com)కు కాని పంపించమని మనవి.
          దాదాపు 120 పేజీల పుస్తకం ముద్రణకు అవసరమైన డబ్బు పూర్తిగా సమకూరలేదు. కనుక పంపని వారెవరైనా ఉంటే పంపవచ్చు. తప్పక పంపాలన్న నిర్బంధం లేదు. డబ్బు పంపవలసిన అకౌంటు వివరాలు.....

Kandi Shankaraiah
State Bank of India,
Warangal Main.
A/c No. 62056177880
IFC : SBIN0020148

గూగుల్ పే, ఫోన్ పే, పేటియం ద్వారా పంపడానికి ఫోన్ నెం. 7569822984

సమస్య - 3357

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాట్నము విడి గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్"
(లేదా...)
"రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్"

1, మే 2020, శుక్రవారం

సమస్య - 3356

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మునిఁ గని భయపడిరి పుడమిదొరలు"
(లేదా...)
"మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్"