నడిరేయి సరదా పూరణ: దాగుడు మూతలాడకయె దగ్గగ తుమ్మక గోలపెట్టకేబాగుల నోగులన్ గనక బాగుగ మూయుచు రెండు కన్నులన్రోగములన్ని మాపుటకు రొప్పుచు రోయక గంగ తీర్థమున్ త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
మీ సరదా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏
అందరికీ నమస్సులు 🙏🙏*వృత్తములో సమస్యాపూరణం నా మొదటి ప్రయత్నం ..**ఉ మా*రోగము మీరగన్ జనుల యోగము లన్నియు మారగన్ మరే భోగము లన్నియున్ విడిచి నోపిక తగ్గగ భారమై నిలన్ త్యాగము జేయఁకన్ మధువు త్రాగుచు దూరము నుండకన్ సదా *"త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్"**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*🙏🙏🙏😞
మీ ప్రథమ ప్రయత్నం ప్రశంసనీయం. మొదటి రెండు పాదాలలో యతి తప్పింది. 'చేయక, ఉండక' అన్నవి కళలు, ద్రుతాంతాలు కావు.
ధన్యవాదములు గురువుగారు ..🙏🙏మీ ఆశీస్సులు, ప్రోత్సాహమే ఈ ప్రయత్నానికి ఇంధనం గురువు గారు..🙇♂️🙇♂️సవరించే ప్రయత్నం చేస్తాను 🙅♂️*అన్వయం కుదిరినదా గురూజీ* 🙏
మీరు చివరికి ఏమి త్రాగాలని వివరించారు.. దానిని బట్టి అన్వయం కుదిరిందో లేదో చెప్పవచ్చు
గురువులకు నమస్సులు 🙏🙏సవరణ యత్నము 🙇♂️🙅♂️రోగము మీరగన్ జనుల రోజులు యన్నియు మారగన్ తధా భోగము లన్నియున్ విడిచి భోరున నేడ్చుచు భూమిపై నహో త్యాగము లొప్పకన్ మధువు త్రాగుచునుండు సతమ్ము! నిద్దియే*"త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్"**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*😊🙏
శ్రీమాత్రేనమః సాగుచు పోవలెన్ విరుల శాఖలు తెల్గుల వెల్గు నింపుచున్మోగవలెన్ స్వనంబు మధుమోహన భావము పల్కినట్లుగా త్రాగుము భక్తి భావముల తత్వపురీతిని దివ్యరీతిగన్ త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్తాగవలెన్ మరంద సుధధారలు నిండిన తేనియల్ సదా కస్తూరి శివశంకర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) ఖగపతి తెచ్చిన అమృతము: భోగము లందునన్ మనసు బొత్తిగ జారగ శోకమందునన్రాగము నందునన్ హృదిని రచ్చను జేయు వియోగమందునన్ రోగము రొచ్చులందునను లొంగక వంగక ధూమ్రపత్రమున్త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
గిరీశం ఉవాచ... మీ ఆటవిడుపు పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
మల్లి సిరిపురం శ్రీశైలం, తే.గీ//దేవి కృపను బొందిన తాను తేజముగనుతల్లిదండ్రులు దీవించ మెల్లిగాను !పాలు,పెరుగులను గలిపి ప్రాయమందుత్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు !!
వాగుచుతాగుబోతులువివాదముసల్పుచు పాత్రికేయుకున్"త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి, ధార్మికోత్తముల్"వేగముగాకరోనయిలవృద్ధిఁగనంగనుమార్గమైనదేసాగుటఘోరమౌననివిశాలవిమర్శలు చేసెటీవిలన్
మాఘపాదివారముదివ్యమైనదెపుడునోర్మిసూర్యనమస్కారముత్తమగతిఁదీర్చితదనంతరముభక్తిఁదీర్థమింత"త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు"
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
🙏ధన్యవాదాలు
( భాగవతం - బాగవుతాం )భోగములన్నిటిన్ విడచి పుణ్యుడు పోతన రామునాజ్ఞతో నాగని దీక్షబట్టి తడి యారని కన్నుల నాంధ్రజాతికిన్ వేగమె యందజేసె గద ప్రీతిగ భాగవతామృతమ్మునే ;త్రాగెడివాడె శిష్టుడని త్రాగుచు జెప్పిరి ధార్మికోత్తముల్ .
భాగవతామృతంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పథ్యమందునచారుయెపైత్యరసముబలమునందించపిల్లలు పాలు పెరుగుతేజ మిచ్చెడినుదయముతేనెరసము,త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'చారు+ఎ' అన్నపుడు యడాగమం రాదు.
రాగమయాత్ముడైన రఘురాముడు జంకక తండ్రి మాటకైత్యాగము చేసి రాజ్యము మహాటవులం జను ధర్మమూర్తి సర్వాగమ కీర్తితుం డతని యద్భుత సచ్చరితామృతం బిలన్ద్రాగెడివాడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్.
రామచరితామృతంతో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
వేదమంత్రోక్త సంభార విధిని దేవ సవన మొనరించి వేల్పులు సంతసింపసోమరస హవ్యమిడి తాను సుష్టు దానిత్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
త్రాగె రామరసంబు నా త్యాగరాజునిలిపి హృదయాన శ్రీ రాము నిష్ఠతోడపాప చింతన బాపంగ భక్తి సుధను త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు.
మైలవరపు వారి పూరణ భోగవిలాససంజనితమోహదవాగ్నికి తోయవృష్టియైరాగమదాంధకారఘనరాశికి మధ్యదినార్కరశ్మియైవే గతి మార్చు దివ్యనిధి విష్ణుకథామృతమండ్రు! దానినేత్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్".!!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
రామనామమెంతో రుచిరా కందాటవెలది అరయగ రాముని నామమ్మె రుచి, వలయు మనకనుచు సుమీ జన్నపుగాపరి, త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు జిలేబి నీవున్ గొనుమా!జిలేబి
తేటగీతి సమస్యకు కందపద్య పూరణ. బాగుంది. అభినందనలు.
భోగభాగ్యాలు రాఘవున్స్వాగతించరామనామానహనుమయేరోమరోమమందుబలవిక్రమశ్రీలనందెసుధనుత్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
ఇలపయిన నీదినంబుల నిల్లునడుపుటందున యొడుదుడుకులెదురైన గూడనన్ని సమయములందున నొక్కరీతిత్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులుత్రాగు = మ్రింగు
కందోత్పల !సురుచిరము! రామనామమ డర త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁజెప్పిరి ధార్మికోత్తముల్ రండి రాఘవుని కొలువ త్వరపడి సుజనులారా!జిలేబి
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
భోగమనిత్యమంచురఘుభూవరునామసుధారసంబుచేభోగులుయోగులైరిభువిపోతనక్షేత్రయరామదాసులున్ భాగవతాత్మసారరసభావమధూళినహర్నిహంబులన్ద్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
మనోహరమైన పూరణ. అభినందనలు.
రాగము తోడుతన్ సతము రాముని మానసమందు నమ్ముచున్యేగిరి స్వర్గమున్ ప్రభలు హెచ్చిల, సాధ్యమె మర్వనాతనిన్త్యాగయ మార్గమున్విడక త్రాగుము రామరసాయనంబునేత్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "నమ్ముచున్+ఏగిరి' అన్నపుడు యడాగమం రాదు. "నమ్మి తా మేగిరి..." అనండి.
పూజకు తగువాడు పూజింప బడవలె వ్యర్థులకును పూజ వ్యర్ధమె యగుగాన మనసులో మరువక మహిత రామామృతమ్ త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
సమస్యాపాదం తేటగీతి. మీరు ఆటవెలది వ్రాసారు. "రామామృతమ్' అని హలంతంగా వ్రాయరాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భోగభాగ్యాలనే రోసి ముక్తి గోరి యనవరతమా పరాత్పరుఁ ధ్యానమందుమనసు నిల్పుచు రామనామామృతమును త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
చక్కని పూరణ. అభినందనలు.
గురువు గారిచ్చుశంకరాభరణపద్యపూరణంబునుసొగసుగాపూర్తి జేయ"బాగు నున్నద"నుసుధనువారునొసగ,త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "బాగుగా నున్నదను సుధన్ వారొసంగ" అనండి.
సాగెను పద్యసేవ్యమదిఁజక్కనిసారపుభారతంబునన్వేగముఖచ్చితత్త్వమును,వీడనిధార్మికమూలముల్యనన్వాగనుశాసనున్గొలిచిభారతపద్యపుసారమద్యమున్ద్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కచ్చితత్వము' అనండి. 'మూలముల్+అనన్' అన్నపుడు యడాగమం రాదు.
సాగెను పద్యసేవ్యమదిఁజక్కనిసారపుభారతంబునన్వేగముకచ్చితత్త్వమును,వీడనిధార్మికశక్తిరూపమున్వాగనుశాసనున్గొలిచిభారతపద్యపుసారమద్యమున్ద్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్కొరుప్రోలు రాధాకృష్ణారావు
నా పూరణ. ఉ.మా.**** **** **భోగము భాగ్యముల్ కనుచు మోహ మొకించుక గాని జెందకేత్యాగము జేసి సంతతము దైవపు చింతన సల్పి ధన్యులౌయోగుల బోధనల్ విని మహోన్నత గీత సుధారసమ్మునేత్రాగెడివాడె శిష్టుడని త్రాగుచు జెప్పిరి ధార్మికోత్తముల్ -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱 🌷 వనపర్తి🌷
మంచి పూరణ. అభినందనలు.
మంచి చెడుల నెరుంగక మాట లాడు త్రాగు వాడె : శిష్టు డనిరి ధర్మ విదులు సత్య నిష్టలు పాటించి సౌమ్యు డగుచు మంచి మర్యాద తెలిసిన మాన్య వరుని
పేదలకుసహాయ పడుచునాదరముగవ్యసనములకు బానిసకాక, యనవరతముతల్లిదండ్రుల చూచుచు తద్దయు నలిధరణి శ్రీరామనామామృతమును ప్రీతిత్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
బాగెము వృద్ధియైనపుడు బారులు తీరకు మా మద్యముకైవేగము సూర్యతాపమది ప్రేలుచు నుండెను జాగరూకుడై సాగుము,స్వచ్ఛమైనదగు చల్లని కొబ్బరి బోండ నీటినిన్త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో గణభంగం. "బారులు తీరకు మద్యమందగా" అందామా?
భోగపు వాడలన్ దిరుగు మూర్ఖుడటంచు ప్రసిద్ధుడైన యాభోగియె మారుచున్ సతము ముక్తిపథమ్మును గోరి మద్యమున్ ద్రాగక నెల్లవేళలను తారక నామ సుధారసమ్మునే త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
క్రొవ్విడి వెంకట రాజారావు: వాసుదేవుని లీలల వన్నెలన్ని నెఱుక జేయుచు భక్తిని నెగడ జేసి తనరు భాగవతామృత ధారలెల్ల త్రాగువాడె శిష్టుడనిరి ధర్మవిదులు.
త్యాగము జేసె స్వామ్యమును తండ్రికి నిచ్చిన మాట కోసమైయాగము లెన్నియో సయిచె హాసము మోమును వీడలేదహోయీ గతినున్న రాఘవుని యింపితమైన కథా రసంబునన్త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్౹౹(ఆగము=తప్పు, దుష్కృతము)
భోగములందపేక్ష విడి బుద్దియు దేవునిపై నిమగ్నమైవేగమె మోక్షమొంద పరివేదననొందెడి సాధు జీవికిన్యోగరహస్యమున్ దెలియుమోయని రాముని నామ మాధురిన్త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
మాతపితలు గోరును బిడ్డ మంచి బ్రగతి,సేమము;గురువు దెలుపును చేకొన పథము,గొని వారి యమృతబోధ,మోదమునను త్రాగువాడె శిష్టుడనిరి ధర్మవిదులు.
పరమదుష్టుడనంబడుభరణియందుత్రాగువాడె,శిష్టుడనిరిధర్మవిధులుస్వార్ధచింతనువిడనాడిపరులకొఱకుపాటుపడునట్టిమనుజునిపరమపురుష!
మిత్రులందఱకు నమస్సులు!"త్యాగయ రామనామ రసమానియు వెల్గుచు, రామమంత్ర సద్రాగయుతంపుసత్కృతులు వ్రాయుచుఁ బాడుచుఁ బృథ్విలోన వైరాగిగ భక్తిఁ దేలెనయ! రామరసామృతమెప్డు భక్తితోఁద్రాగెడివాఁడె శిష్టుఁ!"డని, త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్!
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
త్యాగరాజు, గోపన్నలు తనివి తీర రామనామ పానామృత రసము త్రాగి ముక్తిపొందగా నిరువురు భక్తితోడ త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
తే.గీనిర్మలంబైనమనసుతో నిష్ఠగలిగిఐహికంబైన విషయాలనాశలేకమంచి భక్తిభావమునింపు మధురసుధలుత్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు"తే.గీసత్య ధర్మవ్రతముతోడ సాధురసముసతత సద్భక్తిహరినామ శాంతిరసమురక్ష కలిగించు మధురమౌ రామరసముత్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
భోగములందు భావనలు పోవగ నీయక, జీవితమ్మునే త్యాగము చేయుచున్ పుడమి యాతన నొందెడు మానవాళికై రాగముతోడ సంతతము రామనినామసుధారసమ్మునే త్రాగెడువాడు శిష్టుడని త్రాగుచు చెప్పిరి ధార్మికోత్తముల్ అసనారె
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తనకుగలదానిలోకొంతదానమొసగకుండనంతయనుభవింపకూడదండ్రుదాహమొరులకుదీరిచితానుపిదపత్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
వైవిధ్యమైన చక్కని పూరణ. అభినందనలు.
!త్రాగెడివాడెశిష్టుడనిత్రాగుచుచెప్పిరిధార్మికోత్తముల్ ద్రాగెడివాడుశిష్టుడనిధార్మికవేత్తలుసెప్పిరా?మఱిన్ ద్రాగుచుచెప్పిరేయనుటధర్మమె?చెప్పుడుపండితోత్తమా!త్రాగరుగాకద్రాగరిలధార్మికవర్యులుమద్యమెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మఱిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.
భోగములందు భావనలు పోవగ నీయక, జీవితమ్మునేత్యాగము చేయుచున్ పుడమి యాతన నొందెడు మానవాళికైరాగముతోడ సంతతము రామునినామసుధారసమ్మునేత్రాగెడువాడు శిష్టుడని త్రాగుచు చెప్పిరి ధార్మికోత్తముల్
తేటగీతిమ్రింగునది విషమె! విభుడె మ్రింగువాడు!! మేలని ప్రజకున్ శీఘ్రమె మ్రింగుమనియెనమ్మి మంగళ సూత్రమ్ము నగజ గౌరిత్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
అబ్బో... "మంగళసూత్రమ్ము నెంత మది నమ్మినదో..." పద్యభావాన్ని అచ్చంగ తేటగీతిలో దింపి మీ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చాల బాగుంది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
త్రాగకు మద్యమెన్నడును త్రాగిననాయువు తీరిపోవు నీత్రాగుడువల్ల గుల్లయగు తథ్యము దేహమునిల్లు వాకిలుల్రోగములెల్లదూరమవ రోయక నిత్యము గోవు క్షీరమున్త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
శ్రీపతి కథా వితాన వశీకృ తార్త చిత్తత నిరవధిక భక్తి సిక్త రక్తి హరి పదాంభోజ యుగ చింత నామృతమ్ము త్రాగువాఁడె శిష్టుఁ డనిరి ధర్మవిదులు ఆఁగక భక్తి యుక్తము మహాధ్వర సంచయ మొప్పు చుండఁగన్ గోగణ దుగ్ధ మిశ్రితముఁ గూరిమిఁ గూర్చఁగ సంయమీంద్రులే జోగుల హోమ కార్యముల సోమరసమ్మును విప్రదత్తముం ద్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్ [ఇక్కడ ధార్మికోత్తము లన వరుణాది దేవతలు]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
ఉత్పలమాలమాగిన మామిడుల్ తరుల మానెడు తీయని జింటితేనెలన్దాగిన రామచంద్రుని సుధామయ నామముఁ దృప్తిఁ గ్రోలుచున్సాగుచు దక్షిణాన కపి సాధ్వి కుజంగనెఁ దత్సుధామృతన్త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
సుందరమైన పూరణ. అభినందనలు.
ఉ:మాగిన పండ్లు దెచ్చియభిమానము మేరకు సారమంతయున్వేగమె దీసి దాని రుచి పెంపుకు యాలకు జాజి కాయలున్బాగుగ నందు జేర్చి కడుపారగ మావి ఫలారసమ్మునే త్రాగెడి వాడె శిష్ఠుడని త్రాగుచు జెప్పిరి ధార్మికోత్తముల్వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఫలరసమ్ము' అనడం సాధువు. అక్కడ "కడుపారగ నామ్రఫలామృతమ్మునే" అందామా?
మీ అమూల్య సూచనకు ధన్యవాదాలు.
జాగృతి నొందుచుండి మనజాలక త్రాగిన కాలమందునన్వాగెద రెందరోజనులు వావిరిగా చెడుమాటలెన్నియోత్రాగిన మైకముండ ననురాగము మెండయి నివ్విధంబుగన్త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
🙏🏽
క్రొవ్విడి వెంకట రాజారావు: పాగుగ వాసుదేవుని ప్రభావము లెంచెడి దివ్య లీలలన్ కూబరమౌనటుల్ ననువు గొల్పెడి రీతిని బోధసేయుటల్ బాగుగ నాకళించుకొని భాగవతామృత ధారలన్ త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు."బాగుగ వాసుదేవుని"... టైపాటా?
ISKCON ఆధారంగా: ఉ: రాగము లీనుచున్ భజన రంగము సేయుచు కృష్ణ చైత్యులున్ సాగిరి సాధు చింతనము శాంతిని గూర్చగ మానవాళికిన్త్యాగమె మూలమంచు బహు తాత్విక రీతులె పానకమ్ముగా త్రాగేడి వాడె శిష్టుడని త్రాగుచు జెప్పిరి ధార్మికోత్తముల్వై. చంద్రశేఖర్
నమస్సులతో, నేటి రెండవ సమస్యాపూరణ యత్నం-యోగము! ఎన్ని బాధలబడి యోపి సహించుచు తానుసర్వమున్ చాగము జేయుచుండుసు విశాలహృదాంతర వర్తి కార్తితోరాగిగ తల్లిసేవలె మురారి కథామృత మంచు గ్రోలుచున్త్రాగెడి వాడె శిష్టుడని త్రాగెడి వారలు జెప్పె ధార్మికుల్ -🍁-
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
దాగుడు మూతలాడకయె దగ్గగ తుమ్మక గోలపెట్టకే
బాగుల నోగులన్ గనక బాగుగ మూయుచు రెండు కన్నులన్
రోగములన్ని మాపుటకు రొప్పుచు రోయక గంగ తీర్థమున్
త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
మీ సరదా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఅందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండి*వృత్తములో సమస్యాపూరణం నా మొదటి ప్రయత్నం ..*
*ఉ మా*
రోగము మీరగన్ జనుల యోగము లన్నియు మారగన్ మరే
భోగము లన్నియున్ విడిచి నోపిక తగ్గగ భారమై నిలన్
త్యాగము జేయఁకన్ మధువు త్రాగుచు దూరము నుండకన్ సదా
*"త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🙏🙏😞
మీ ప్రథమ ప్రయత్నం ప్రశంసనీయం.
తొలగించండిమొదటి రెండు పాదాలలో యతి తప్పింది. 'చేయక, ఉండక' అన్నవి కళలు, ద్రుతాంతాలు కావు.
ధన్యవాదములు గురువుగారు ..🙏🙏
తొలగించండిమీ ఆశీస్సులు, ప్రోత్సాహమే ఈ ప్రయత్నానికి ఇంధనం గురువు గారు..🙇♂️🙇♂️
సవరించే ప్రయత్నం చేస్తాను 🙅♂️
*అన్వయం కుదిరినదా గురూజీ* 🙏
మీరు చివరికి ఏమి త్రాగాలని వివరించారు.. దానిని బట్టి అన్వయం కుదిరిందో లేదో చెప్పవచ్చు
తొలగించండిగురువులకు నమస్సులు 🙏🙏
తొలగించండిసవరణ యత్నము 🙇♂️🙅♂️
రోగము మీరగన్ జనుల రోజులు యన్నియు మారగన్ తధా
భోగము లన్నియున్ విడిచి భోరున నేడ్చుచు భూమిపై నహో
త్యాగము లొప్పకన్ మధువు త్రాగుచునుండు సతమ్ము! నిద్దియే
*"త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
😊🙏
శ్రీమాత్రేనమః
రిప్లయితొలగించండిసాగుచు పోవలెన్ విరుల శాఖలు తెల్గుల వెల్గు నింపుచున్
మోగవలెన్ స్వనంబు మధుమోహన భావము పల్కినట్లుగా
త్రాగుము భక్తి భావముల తత్వపురీతిని దివ్యరీతిగన్
త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
తాగవలెన్ మరంద సుధధారలు నిండిన తేనియల్ సదా
కస్తూరి శివశంకర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ఖగపతి తెచ్చిన అమృతము:
భోగము లందునన్ మనసు బొత్తిగ జారగ శోకమందునన్
రాగము నందునన్ హృదిని రచ్చను జేయు వియోగమందునన్
రోగము రొచ్చులందునను లొంగక వంగక ధూమ్రపత్రమున్
త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
గిరీశం ఉవాచ... మీ ఆటవిడుపు పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిమల్లి సిరిపురం శ్రీశైలం,
రిప్లయితొలగించండితే.గీ//
దేవి కృపను బొందిన తాను తేజముగను
తల్లిదండ్రులు దీవించ మెల్లిగాను !
పాలు,పెరుగులను గలిపి ప్రాయమందు
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాగుచుతాగుబోతులువివాదముసల్పుచు పాత్రికేయుకున్
రిప్లయితొలగించండి"త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి, ధార్మికోత్తముల్"
వేగముగాకరోనయిలవృద్ధిఁగనంగనుమార్గమైనదే
సాగుటఘోరమౌననివిశాలవిమర్శలు చేసెటీవిలన్
మాఘపాదివారముదివ్యమైనదెపుడు
తొలగించండినోర్మిసూర్యనమస్కారముత్తమగతిఁ
దీర్చితదనంతరముభక్తిఁదీర్థమింత
"త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు"
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యవాదాలు
తొలగించండి( భాగవతం - బాగవుతాం )
రిప్లయితొలగించండిభోగములన్నిటిన్ విడచి
పుణ్యుడు పోతన రామునాజ్ఞతో
నాగని దీక్షబట్టి తడి
యారని కన్నుల నాంధ్రజాతికిన్
వేగమె యందజేసె గద
ప్రీతిగ భాగవతామృతమ్మునే ;
త్రాగెడివాడె శిష్టుడని
త్రాగుచు జెప్పిరి ధార్మికోత్తముల్ .
భాగవతామృతంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపథ్యమందునచారుయెపైత్యరసము
రిప్లయితొలగించండిబలమునందించపిల్లలు పాలు పెరుగు
తేజ మిచ్చెడినుదయముతేనెరసము,
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చారు+ఎ' అన్నపుడు యడాగమం రాదు.
రాగమయాత్ముడైన రఘురాముడు జంకక తండ్రి మాటకై
రిప్లయితొలగించండిత్యాగము చేసి రాజ్యము మహాటవులం జను ధర్మమూర్తి స
ర్వాగమ కీర్తితుం డతని యద్భుత సచ్చరితామృతం బిలన్
ద్రాగెడివాడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్.
రామచరితామృతంతో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివేదమంత్రోక్త సంభార విధిని దేవ
రిప్లయితొలగించండిసవన మొనరించి వేల్పులు సంతసింప
సోమరస హవ్యమిడి తాను సుష్టు దాని
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిత్రాగె రామరసంబు నా త్యాగరాజు
రిప్లయితొలగించండినిలిపి హృదయాన శ్రీ రాము నిష్ఠతోడ
పాప చింతన బాపంగ భక్తి సుధను
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిభోగవిలాససంజనితమోహదవాగ్నికి తోయవృష్టియై
రాగమదాంధకారఘనరాశికి మధ్యదినార్కరశ్మియై
వే గతి మార్చు దివ్యనిధి విష్ణుకథామృతమండ్రు! దానినే
త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్".!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిరామనామమెంతో రుచిరా కందాటవెలది
అరయగ రాముని నామ
మ్మె రుచి, వలయు మనకనుచు సుమీ జన్నపుగా
పరి, త్రాగువాఁడె శిష్టుఁడ
నిరి ధర్మవిదులు జిలేబి నీవున్ గొనుమా!
జిలేబి
తేటగీతి సమస్యకు కందపద్య పూరణ. బాగుంది. అభినందనలు.
తొలగించండిభోగభాగ్యాలు రాఘవున్స్వాగతించ
రిప్లయితొలగించండిరామనామానహనుమయేరోమరోమ
మందుబలవిక్రమశ్రీలనందెసుధను
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇలపయిన నీదినంబుల నిల్లునడుపు
రిప్లయితొలగించండిటందున యొడుదుడుకులెదురైన గూడ
నన్ని సమయములందున నొక్కరీతి
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
త్రాగు = మ్రింగు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికందోత్పల !
సురుచిరము! రామనామమ
డర త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁజె
ప్పిరి ధార్మికోత్తముల్ రం
డి రాఘవుని కొలువ త్వరపడి సుజనులారా!
జిలేబి
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిభోగమనిత్యమంచురఘుభూవరునామసుధారసంబుచే
రిప్లయితొలగించండిభోగులుయోగులైరిభువిపోతనక్షేత్రయరామదాసులున్
భాగవతాత్మసారరసభావమధూళినహర్నిహంబులన్
ద్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండిరాగము తోడుతన్ సతము రాముని మానసమందు నమ్ముచున్
రిప్లయితొలగించండియేగిరి స్వర్గమున్ ప్రభలు హెచ్చిల, సాధ్యమె మర్వనాతనిన్
త్యాగయ మార్గమున్విడక త్రాగుము రామరసాయనంబునే
త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"నమ్ముచున్+ఏగిరి' అన్నపుడు యడాగమం రాదు. "నమ్మి తా మేగిరి..." అనండి.
పూజకు తగువాడు పూజింప బడవలె
రిప్లయితొలగించండివ్యర్థులకును పూజ వ్యర్ధమె యగుగాన
మనసులో మరువక మహిత రామామృతమ్
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
సమస్యాపాదం తేటగీతి. మీరు ఆటవెలది వ్రాసారు. "రామామృతమ్' అని హలంతంగా వ్రాయరాదు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభోగభాగ్యాలనే రోసి ముక్తి గోరి
రిప్లయితొలగించండియనవరతమా పరాత్పరుఁ ధ్యానమందు
మనసు నిల్పుచు రామనామామృతమును
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారిచ్చుశంకరాభరణపద్య
రిప్లయితొలగించండిపూరణంబునుసొగసుగాపూర్తి జేయ
"బాగు నున్నద"నుసుధనువారునొసగ,
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"బాగుగా నున్నదను సుధన్ వారొసంగ" అనండి.
సాగెను పద్యసేవ్యమదిఁజక్కనిసారపుభారతంబున
రిప్లయితొలగించండిన్వేగముఖచ్చితత్త్వమును,వీడనిధార్మికమూలముల్యన
న్వాగనుశాసనున్గొలిచిభారతపద్యపుసారమద్యమున్
ద్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కచ్చితత్వము' అనండి. 'మూలముల్+అనన్' అన్నపుడు యడాగమం రాదు.
సాగెను పద్యసేవ్యమదిఁజక్కనిసారపుభారతంబున
తొలగించండిన్వేగముకచ్చితత్త్వమును,వీడనిధార్మికశక్తిరూపము
న్వాగనుశాసనున్గొలిచిభారతపద్యపుసారమద్యమున్
ద్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
రిప్లయితొలగించండినా పూరణ. ఉ.మా.
**** **** **
భోగము భాగ్యముల్ కనుచు మోహ మొకించుక గాని జెందకే
త్యాగము జేసి సంతతము దైవపు చింతన సల్పి ధన్యులౌ
యోగుల బోధనల్ విని మహోన్నత గీత సుధారసమ్మునే
త్రాగెడివాడె శిష్టుడని త్రాగుచు జెప్పిరి ధార్మికోత్తముల్
-- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి🌷
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండిమంచి చెడుల నెరుంగక మాట లాడు
రిప్లయితొలగించండిత్రాగు వాడె : శిష్టు డనిరి ధర్మ విదులు
సత్య నిష్టలు పాటించి సౌమ్యు డగుచు
మంచి మర్యాద తెలిసిన మాన్య వరుని
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపేదలకుసహాయ పడుచునాదరముగ
రిప్లయితొలగించండివ్యసనములకు బానిసకాక, యనవరతము
తల్లిదండ్రుల చూచుచు తద్దయు నలి
ధరణి శ్రీరామనామామృతమును ప్రీతి
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబాగెము వృద్ధియైనపుడు బారులు తీరకు మా మద్యముకై
వేగము సూర్యతాపమది ప్రేలుచు నుండెను జాగరూకుడై
సాగుము,స్వచ్ఛమైనదగు చల్లని కొబ్బరి బోండ నీటినిన్
త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. "బారులు తీరకు మద్యమందగా" అందామా?
భోగపు వాడలన్ దిరుగు మూర్ఖుడటంచు ప్రసిద్ధుడైన యా
రిప్లయితొలగించండిభోగియె మారుచున్ సతము ముక్తిపథమ్మును గోరి మద్యమున్
ద్రాగక నెల్లవేళలను తారక నామ సుధారసమ్మునే
త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివాసుదేవుని లీలల వన్నెలన్ని
నెఱుక జేయుచు భక్తిని నెగడ జేసి
తనరు భాగవతామృత ధారలెల్ల
త్రాగువాడె శిష్టుడనిరి ధర్మవిదులు.
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండిత్యాగము జేసె స్వామ్యమును తండ్రికి నిచ్చిన మాట కోసమై
రిప్లయితొలగించండియాగము లెన్నియో సయిచె హాసము మోమును వీడలేదహో
యీ గతినున్న రాఘవుని యింపితమైన కథా రసంబునన్
త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్౹౹
(ఆగము=తప్పు, దుష్కృతము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభోగములందపేక్ష విడి బుద్దియు దేవునిపై నిమగ్నమై
రిప్లయితొలగించండివేగమె మోక్షమొంద పరివేదననొందెడి సాధు జీవికిన్
యోగరహస్యమున్ దెలియుమోయని రాముని నామ మాధురిన్
త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాతపితలు గోరును బిడ్డ మంచి బ్రగతి,
రిప్లయితొలగించండిసేమము;గురువు దెలుపును చేకొన పథ
ము,గొని వారి యమృతబోధ,మోదమునను
త్రాగువాడె శిష్టుడనిరి ధర్మవిదులు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపరమదుష్టుడనంబడుభరణియందు
రిప్లయితొలగించండిత్రాగువాడె,శిష్టుడనిరిధర్మవిధులు
స్వార్ధచింతనువిడనాడిపరులకొఱకు
పాటుపడునట్టిమనుజునిపరమపురుష!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి"త్యాగయ రామనామ రసమానియు వెల్గుచు, రామమంత్ర స
ద్రాగయుతంపుసత్కృతులు వ్రాయుచుఁ బాడుచుఁ బృథ్విలోన వై
రాగిగ భక్తిఁ దేలెనయ! రామరసామృతమెప్డు భక్తితోఁ
ద్రాగెడివాఁడె శిష్టుఁ!"డని, త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్!
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిత్యాగరాజు, గోపన్నలు తనివి తీర
రిప్లయితొలగించండిరామనామ పానామృత రసము త్రాగి
ముక్తిపొందగా నిరువురు భక్తితోడ
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ
రిప్లయితొలగించండినిర్మలంబైనమనసుతో నిష్ఠగలిగి
ఐహికంబైన విషయాలనాశలేక
మంచి భక్తిభావమునింపు మధురసుధలు
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు"
తే.గీ
సత్య ధర్మవ్రతముతోడ సాధురసము
సతత సద్భక్తిహరినామ శాంతిరసము
రక్ష కలిగించు మధురమౌ రామరసము
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభోగములందు భావనలు పోవగ నీయక, జీవితమ్మునే
రిప్లయితొలగించండిత్యాగము చేయుచున్ పుడమి యాతన నొందెడు మానవాళికై
రాగముతోడ సంతతము రామనినామసుధారసమ్మునే
త్రాగెడువాడు శిష్టుడని త్రాగుచు చెప్పిరి ధార్మికోత్తముల్ అసనారె
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితనకుగలదానిలోకొంతదానమొసగ
రిప్లయితొలగించండికుండనంతయనుభవింపకూడదండ్రు
దాహమొరులకుదీరిచితానుపిదప
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
వైవిధ్యమైన చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి!త్రాగెడివాడెశిష్టుడనిత్రాగుచుచెప్పిరిధార్మికోత్తముల్
రిప్లయితొలగించండిద్రాగెడివాడుశిష్టుడనిధార్మికవేత్తలుసెప్పిరా?మఱిన్
ద్రాగుచుచెప్పిరేయనుటధర్మమె?చెప్పుడుపండితోత్తమా!
త్రాగరుగాకద్రాగరిలధార్మికవర్యులుమద్యమెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మఱిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.
భోగములందు భావనలు పోవగ నీయక, జీవితమ్మునే
రిప్లయితొలగించండిత్యాగము చేయుచున్ పుడమి యాతన నొందెడు మానవాళికై
రాగముతోడ సంతతము రామునినామసుధారసమ్మునే
త్రాగెడువాడు శిష్టుడని త్రాగుచు చెప్పిరి ధార్మికోత్తముల్
తేటగీతి
రిప్లయితొలగించండిమ్రింగునది విషమె! విభుడె మ్రింగువాడు!!
మేలని ప్రజకున్ శీఘ్రమె మ్రింగుమనియె
నమ్మి మంగళ సూత్రమ్ము నగజ గౌరి
త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు
అబ్బో... "మంగళసూత్రమ్ము నెంత మది నమ్మినదో..." పద్యభావాన్ని అచ్చంగ తేటగీతిలో దింపి మీ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చాల బాగుంది. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిత్రాగకు మద్యమెన్నడును త్రాగిననాయువు తీరిపోవు నీ
రిప్లయితొలగించండిత్రాగుడువల్ల గుల్లయగు తథ్యము దేహమునిల్లు వాకిలుల్
రోగములెల్లదూరమవ రోయక నిత్యము గోవు క్షీరమున్
త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీపతి కథా వితాన వశీకృ తార్త
రిప్లయితొలగించండిచిత్తత నిరవధిక భక్తి సిక్త రక్తి
హరి పదాంభోజ యుగ చింత నామృతమ్ము
త్రాగువాఁడె శిష్టుఁ డనిరి ధర్మవిదులు
ఆఁగక భక్తి యుక్తము మహాధ్వర సంచయ మొప్పు చుండఁగన్
గోగణ దుగ్ధ మిశ్రితముఁ గూరిమిఁ గూర్చఁగ సంయమీంద్రులే
జోగుల హోమ కార్యముల సోమరసమ్మును విప్రదత్తముం
ద్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
[ఇక్కడ ధార్మికోత్తము లన వరుణాది దేవతలు]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిఉత్పలమాల
మాగిన మామిడుల్ తరుల మానెడు తీయని జింటితేనెలన్
దాగిన రామచంద్రుని సుధామయ నామముఁ దృప్తిఁ గ్రోలుచున్
సాగుచు దక్షిణాన కపి సాధ్వి కుజంగనెఁ దత్సుధామృతన్
త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
సుందరమైన పూరణ. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిమాగిన పండ్లు దెచ్చియభిమానము మేరకు సారమంతయున్
వేగమె దీసి దాని రుచి పెంపుకు యాలకు జాజి కాయలున్
బాగుగ నందు జేర్చి కడుపారగ మావి ఫలారసమ్మునే
త్రాగెడి వాడె శిష్ఠుడని త్రాగుచు జెప్పిరి ధార్మికోత్తముల్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఫలరసమ్ము' అనడం సాధువు. అక్కడ "కడుపారగ నామ్రఫలామృతమ్మునే" అందామా?
మీ అమూల్య సూచనకు ధన్యవాదాలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజాగృతి నొందుచుండి మనజాలక త్రాగిన కాలమందునన్
రిప్లయితొలగించండివాగెద రెందరోజనులు వావిరిగా చెడుమాటలెన్నియో
త్రాగిన మైకముండ ననురాగము మెండయి నివ్విధంబుగన్
త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏🏽
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపాగుగ వాసుదేవుని ప్రభావము లెంచెడి దివ్య లీలలన్
కూబరమౌనటుల్ ననువు గొల్పెడి రీతిని బోధసేయుటల్
బాగుగ నాకళించుకొని భాగవతామృత ధారలన్
త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"బాగుగ వాసుదేవుని"... టైపాటా?
ISKCON ఆధారంగా:
రిప్లయితొలగించండిఉ:
రాగము లీనుచున్ భజన రంగము సేయుచు కృష్ణ చైత్యులున్
సాగిరి సాధు చింతనము శాంతిని గూర్చగ మానవాళికిన్
త్యాగమె మూలమంచు బహు తాత్విక రీతులె పానకమ్ముగా
త్రాగేడి వాడె శిష్టుడని త్రాగుచు జెప్పిరి ధార్మికోత్తముల్
వై. చంద్రశేఖర్
నమస్సులతో,
రిప్లయితొలగించండినేటి రెండవ సమస్యాపూరణ యత్నం-
యోగము! ఎన్ని బాధలబడి యోపి సహించుచు తానుసర్వమున్
చాగము జేయుచుండుసు విశాలహృదాంతర వర్తి కార్తితో
రాగిగ తల్లిసేవలె మురారి కథామృత మంచు గ్రోలుచున్
త్రాగెడి వాడె శిష్టుడని త్రాగెడి వారలు జెప్పె ధార్మికుల్
-🍁-