9, మే 2020, శనివారం

సమస్య - 3364

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"క్రికెటు కష్టమైన క్రీడ యగును"
(లేదా...)
"క్రికెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా"

85 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  టికెటుల పొందినన్ విరివి టెక్కులు జూపుచు నల్ల మార్కెటున్
  చకచక కూర్చి మేకపును చక్కగ పోవగ స్టేడియమ్ముకున్
  నికటము నుండ రాదనగ నిక్కపు రీతిని ప్రేక్షకార్యులన్
  క్రికెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా

  రిప్లయితొలగించండి
 2. అందరికీ నమస్సులు 🙏

  నా పూరణ ప్రయత్నం

  *ఆ వె*

  మూడు రకములాట ముందాడుటనెటుల
  చీరు గరలు తోడ చిందులెటుల
  కష్టము పెరిగెనట కనుగొన నిప్పుడు
  *"క్రికెటు కష్టమైన క్రీడ యగును"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏😊🙏😊🙏

  రిప్లయితొలగించండి
 3. కర్రబిళ్ళలాడు కాలముగాదాయె
  కొత్తయాటగాన కొరుకుబడదు
  చేతివాటమున్న చెడుగుడు గాదయా
  క్రికెటుకష్టమైన క్రీడయగును
  +++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 4. వికెటు పడక నతిగ వేళ గడిచినచో,
  వడిగ వికెటులన్ని పడుచుపోవఁ,
  కఠినముగ నెడతెగకఁ గురియు వృష్టిచే
  క్రికెటు కష్టమైన క్రీడ యగును.

  రిప్లయితొలగించండి
 5. మరో ప్రయత్నం

  *ఆ వె*

  చేతిలోన నున్న చెత్త గేములు పట్టి
  వచ్చి చేరరెవరు పరుగులనుచు
  వదలకుండ బ్యాటు పట్టునదెవ్వరు
  *"క్రికెటు కష్టమైన క్రీడ యగును"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏😊🙏😊🙏

  రిప్లయితొలగించండి

 6. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  దేవ దానవుల 20 x 20:

  పకపక నవ్వి వైరసుడు బంగరు రాష్ట్రము నాక్రమించగా
  చకచక చంద్రశేఖరుడు జాలిని జూపుచు ప్రీతి వేడగా
  వికెటుల కీపరుండు మన వెన్నుడు పోవగ హైద్రబాదుకున్
  క్రికెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా!

  రిప్లయితొలగించండి
 7. ఆరు బంతులనుచు నరివర్గములనెంచి
  బ్రహ్మజ్ఞానమనెడి బడితెతోడ
  మనసుహద్దు దాటు మాదిరి నాడెడు
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అరిషడ్వర్గాన్ని ఓవర్ లోని ఆరు బంతులతో పోల్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బ్రహ్మజ్ఞాన' మన్నపుడు 'హ్మ' గురువై గణభంగం. "బ్రహ్మబోధ" అందామా?

   తొలగించండి
 8. మడుగులోన దాగి మనుజుల జంపెడు
  సర్పరాజు నణచ జతులతోడ
  పడగపైన నాడు వ్రజబాల రూపు చ
  క్రికెటు కష్టమైన క్రీడయగును?

  సకియలతో నదీతటిని చక్కగగూడుచు కేళిలోలుడై
  సకలము కృష్ణమాయగను చానలమధ్య ననేకరూపుడై
  వికసిత సారసాననుడు వేడుకనాడగ చక్రికిన్నెటుల్
  క్రికెటు గనంగ కష్టమగు క్రీడయగున్ సురమౌని నారదా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   "వేడుక నాడగ నందసూతి చ।క్రి కెటు గనంగ..." అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
   నాడెడు చక్రికిన్నెటుల్ క్రికెటు అంటే సరియైన అర్ధం స్ఫురించేదేమో!రాసక్రీడలో ఒక్కొక్కరితో ఒక్కొక్కడిగా ప్రవర్తిల్లగల చక్రికి క్రికెట్ ఒకలెక్కా అని నా భావన!

   తొలగించండి
 9. వికటపు వేషధారులగు ఫేరవులన్ దునిమెన్ సలీలలన్
  యెకసకెమాడె గోపికలు యింతులతోడను రాసలీలలన్
  సకల చరాచరమ్ములను చల్లగ చూచి రమించునట్టి చ
  క్రి కెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గోపికలు+ఇంతులు' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 10. ఆ.వె//
  చిన్నతనము నందు చిన్నికృష్ణుని గాంచి
  పన్నగముల రాజు భయముజెంది !
  కృపను జూపమనగ, కృష్ణమూర్తియగు, చ
  క్రి, కెటు కష్టమైన క్రీడ యగును !!

  రిప్లయితొలగించండి


 11. ఆదియు నతడాయె నంతమునతడాయె
  చూడ గలడు సూవె సూటి గాను
  వాడె క్షేత్రి మరియు వాడె క్షేత్రమ్ము! చ
  క్రి కెటు కష్టమైన క్రీడ యగును.


  జిలేబి

  రిప్లయితొలగించండి


 12. ప్రకటము వాడె క్షేత్రి, యధిపా! మునిపుంగవ, క్షేత్రమున్ సుమా!
  నికటము, దూరమైనది వినిర్మలమై కన వచ్చు నాత డా
  యె కనుల ముంగటన్ సరణి యెవ్వల నెల్లయు తేటతెల్ల!చ
  క్రికెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. ఆరు ఋతువు లనెడి యారు బంతులతోడ
  వరుస ఓవరు లగు వత్సరాలు
  కాలు డంపయిరునుఁ గాగ జీవితమను
  క్రికెటు కష్టమైన క్రీడ యగును.

  బాటు మాను మరియు బౌలరు కాలేడు
  ఫీల్డ రసలు కాడు, పిల్లవాడు
  రెండు హస్తములును లేని వాడతనికి
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  రిప్లయితొలగించండి
 14. వెంట గమించి దాసి వలె బేరిమి కార్యసహాయకారియై,
  బంటుగ మంత్రియై తగు నుపాయముఁ జూపుచు, నోర్పు నందు మి
  న్నంటుచు, పేర్మి భోజనము నందునఁ దల్లిగ, దుర్గుణమ్ము ల
  న్నింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 15. సకలజగంబునం దిరుగు సంయమివర్యుడు చేరి భూమియం
  దొకటను బాలకుల్ హరుస మొప్పగ నాటల నాడుచుండగా
  చకచక వచ్చి నిల్వగను జట్టున నొక్కడు చూచి పల్కె నీ
  క్రికెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా!

  రిప్లయితొలగించండి


 16. జిలేబీయము :) ఆటవెలది పాద గర్భిత కందాట :)  రమణయ్య! చక్రి కెటు క
  ష్టమైన క్రీడ యగును క్రికెటాటా? వాడా
  యె మగటిమి గాడు! సిక్సరు
  ల మగత కన్నుల సులువుగ లాగించు ‌కదా !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 18. మైలవరపు వారి పూరణ

  సకలమునీంద్రగోమనుజసంఘము గావగ విష్ణువొక్కడే
  చకచక చంపు దానవుల చక్రహతిన్ రణమన్న క్రీడగా!
  నొకడిటు బంతివేయ మరి యొక్కడు కొట్టెడి యాట యన్న చ...
  క్రికెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా ?

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 19. సత్య భామ కినుకసత్యంబు నిత్యంబు
  యూర డింప బూని జేరె పురము,
  చోర లీల నెంచ సుమనస లీలచ
  క్రికెటు కష్టమైన క్రీడ యగును
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 20. ఆటలాడయింటియావరణములేక
  బయటకెళ్ళలేకభయము తోటి
  బంతికొట్టిపరుగు పంచనతీయుట
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  రిప్లయితొలగించండి


 21. చంపకమాల పాదగర్భిత కందము :)


  అరె కుంబ్లె సుమా! వాడికి
  మరి క్రికెటు కనంగఁ గష్ట మగు క్రీడ యగున్?
  సురమౌని నారదా తెలు
  ప రాదకో మాకిపుడె సభాస్థలిని వెసన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. అరె కుంబ్లె సుమా! వాడికి
   మరి క్రికెటు కనంగఁ గష్ట మగు క్రీడ యగున్?
   సురమౌని నారదా యనె
   డు రోచన జిలేబి తొరపడు తెలుపనిపుడే :)   జిలేబి

   తొలగించండి
 22. సకలము బొజ్జలోఁ గలిగి శైశవమందు విచిత్రరీతిలో
  ప్రకటితముగ్ధకేళివటపత్రపుటోపరిశయ్యఁ దేలుచున్
  వికటపు వృష్టులందు వడి వ్రేలికొసన్ గిరి లీల నిల్పు చ
  క్రికెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 23. అవును నిజమె కాద! అది సరియే కదా 
  అస్తమాను ఆట అనగ నెటుల
  డబ్బు యిస్తిమనుచు గబ్బు లేపగరాదు                   
  క్రికెటు కష్టమైన క్రీడ యగును  

  రిప్లయితొలగించండి
 24. బ్యాటు మాను బంతి బాదగ సిక్సులు,
  ఫోరులు టివిన గని పిల్ల లీల
  వేసి గెంత్రు, గాని వెళ్ళి యాడుమనగ
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  రిప్లయితొలగించండి
 25. ఆటలాడు చుండునానందమునుపొందు
  పగలు రాత్రిమాస వర్షమేది?
  ఏసమయము నందునేదియునాడ చ
  క్రికెటు కష్టమైన క్రీడ యగును?

  (వర్షము=సంవత్సరము)

  రిప్లయితొలగించండి
 26. కొండనెత్తినట్టి గండరగండడు
  కాళియునిపడగలకేళిసలిపె
  కష్టములనుబాపికాపాడుటనిన చ
  క్రికెటు కష్టమైన క్రీడ యగును?

  రిప్లయితొలగించండి

 27. * శంకరాభరణం వేదిక *
  09/05/2020 ...శనివారం

  సమస్యలు
  ********

  క్రికెటు కనంగ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా!

  క్రికెటు కష్టమైన క్రీడ యగును"

  1వ పూరణ. చం.మా.
  **** **** **

  ప్రకటితమాయె చోరకళ పాలను వెన్నను తష్కరించ..గో

  పికల విరాళినన్ మునిగి పేరును గాంచెను రాసకేళిలో

  చకచక దైత్యులన్ దునిమి చాటె ప్రవీణత యుద్ధ కేళి; చ

  క్రి కెటు కనంగ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా!

  2వ పూరణ. ఆ.వె.
  *** *** ****

  జయము గలుగు నెపుడు చదరంగ కేళిలో
  బుద్ధిబలము జూడ భూరి యున్న
  బుద్ధి కలిగి కండ వృద్ధి లేకున్నను
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 28. శాంతి దూతగఁ జని సమరము వలదనె
  క్రీడి కేమొ నతడు గీత చెప్పి
  పోరుఁ జేయ మనుచు పురికొల్పి నట్టిచ
  క్రి కెటు కష్టమైన క్రీడ యగును.

  రిప్లయితొలగించండి
 29. ఆయుధమ్ముఁ బట్ట ననుచు చెప్పిననేమి,
  సవ్యసాచి కతడు సారథిగను
  సమితి కేగనేమి, సమర భీముడగు చ
  క్రి కెటు కష్టమైన క్రీడ యగును

  రిప్లయితొలగించండి
 30. పడతుల వలువలను పరిగొనె నొకచోట
  యువిదఁ బ్రోచెను మరి యొక్క చోట
  లీలలెన్నొ చూపు శైలధరుడగు చ
  క్రి కెటు కష్టమైన క్రీడ యగును.

  రిప్లయితొలగించండి
 31. నీడపట్టు నాడ నీతియుచెప్పిన
  తాతమాటవినక తనని కూడ
  మనుమడొచ్చియాడుమనగ, వృద్ధునకును
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  రిప్లయితొలగించండి
 32. నిత్య సాధనంబె నిపుణత బెంచు దా
  నెన్నడైన నాట నిష్ట పడక
  జట్టు లోన జేర జటిలమై వానికి
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  రిప్లయితొలగించండి
 33. వీక్షణమ్మున కిది విందు గొల్పచు నుండి
  దినము రాత్రి యనక ననవరతము
  చదువు కడ్డు పడగ చదువరుల కెపుడు
  క్రికెటు కష్టమైన క్రీడ యగును!

  రిప్లయితొలగించండి
 34. సకియలు స్నానమాడుతరి చల్వల దోచిన వాడెగా సుచే
  లకముల నిచ్చి ద్రౌపది పురస్క్రియ నిల్పె, నతండె దూతయై
  ఝకటము మానుమంచుసభఁ శాంతిని కోరిన నల్లవేల్పు చ
  క్రికెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా

  రిప్లయితొలగించండి
 35. పగలు రేయి యనక పదిమంది గుమిగూడి
  ఆడు చుండ వలయు నాపకుండ
  శక్తి, యుక్తి, రక్తి సామర్ధ్యములనాడు
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  రిప్లయితొలగించండి
 36. వికటపు మాటలాపు మవివేకముగా నిటు బల్కరాదు జ
  క్రి కెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా
  ప్రకటముగానె గెల్చె గద లక్షణనా ఘన మత్స్య యంత్రమున్
  నికముగ గూల్చి జాటె దన నేర్పును నాడె సలక్షణమ్ముగా

  రిప్లయితొలగించండి
 37. మిత్రులందఱకు నమస్సులు!

  [శ్రీకృష్ణుని బాల్యక్రీడల నాకసముపైనుండి కాంచుచు దేవతలు నారదమౌనితో ముచ్చటించు సందర్భము]

  "సుకరముగా వనమ్మునకు శోభిలుచుం జని కందుకమ్ముచేఁ
  బ్రకటమునైన నేర్పు కనుపట్టఁగ నాడఁగ, గోపికామణుల్
  వికచ సరోజనేత్రముల వీక్షణ సేసెడి వేడ్క యిద్ది! చ
  క్రి కెటు కనంగఁ గష్టమగు క్రీడయగున్ సురమౌని నారదా?"

  రిప్లయితొలగించండి
 38. గురువు గారికి నమస్సులు.
  శక్తియుక్తిపెంచుసరసహృదయులకు
  ముక్తినొసగుధ్యానమునులకురక్ష
  నసురసంహరణకునవతారపురుషచ
  క్రికెట్టుకష్టమైనక్రీడయగును.

  రిప్లయితొలగించండి
 39. ఒకడుఁగొట్టబంతినొకడునొడిసిపట్టు
  నొకడునుమ్మిరాయునొకడుతొడను
  రుద్దివిసురునిలకరోనపెరుగఁగాన
  "క్రికెటు కష్టమైన క్రీడ యగును"

  రిప్లయితొలగించండి
 40. ఆదివారమందునందరునన్కొనె
  ఇంటినందుబయలు దేరెనంత
  ఆట లాడువేళనల్గురువచ్చిన
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  రిప్లయితొలగించండి
 41. బయటపరుగులాటబంతియుతోటియు
  ఇంటినందునాడ చేటు తెచ్చు
  ఆట లాడువేళనన్నియు పగులును
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  రిప్లయితొలగించండి
 42. గోపికలను జేరి కోలాటమాడుచు
  సంచరించుచుండు సంతసమున
  సతము చెలులతోడ సయ్యాటలఁజన, చ
  క్రి కెటు కష్టమైన క్రీడ యగును?

  రిప్లయితొలగించండి
 43. 'నేను'యనెడి బల్ల నేగొన జీవన
  క్రికెటు కష్టమైన క్రీడ యగును,
  నీదు కృపను బల్ల నేగైకొనంగ దే
  వా!కడు సులభంబె,బంతు లాట


  బల్ల=బ్యాటు

  రిప్లయితొలగించండి
 44. నీడ పట్టునుండినీటుగక్యారము
  బోర్డు నాడ మేలు బోరు లేక
  మండుటెండనందు వడదెబ్బతగులునే
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  రిప్లయితొలగించండి
 45. సకల జగమ్ములన్ నిలిపి సారపు కుక్షిని సంతతమ్ము నూ
  నిక విహరించుచుండు హరి నీరజనాభుడు గోపకాంతలం
  దు కడుఁ బ్రియత్వమేర్పడగ తోషముతోడుత నాటలాడు చ
  క్రి, కెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా

  రిప్లయితొలగించండి
 46. అర్ధ రాత్రి లేచియానందవేళది
  పూరణంబుచూచి పూర్తి చేయ
  చెప్పుకొనిన బుర్రచెమటలుపట్టు నే
  క్రికెటు కష్టమైన క్రీడ యగును?

  రిప్లయితొలగించండి
 47. బంతితగులమనముభరియించనోపము
  కఱ్ఱజారకాలుగందుగాన
  క్రికెటుకష్టమైనక్రీడయగునుసుమా
  తెలియుమిదియనీవుతెలుగుబాల!

  రిప్లయితొలగించండి
 48. తాఁ జనండు ధర్మ తత్పరతఁ గపట
  వృత్తి చిత్త మందు నిత్తె ముండుఁ
  గాసు లెంచి జనుల మోసగించు టది వ
  క్రి కెటు కష్టమైన క్రీడ యగును


  ఒకఁడ పదాఱు వేల సతు లుండఁగ నందఱి కన్నిరూపు లూ
  ని కరుణ గారవించఁ గను నీరజ నేత్రుని లీల లన్నిటిన్
  సకల చరాచ రావన విశారదుఁ డైన త్రివిక్రముండు చ
  క్రి కెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా

  రిప్లయితొలగించండి
 49. క్రికెటు కష్టమైన క్రీడ యగును"(సమస్య)

  గోటితోనిలిపెను గోవర్ధనగిరిని
  భువినిబంతిచేయు పురుషుడతడు
  సర్వ జనుల రక్ష-సంపద లిచ్చ చ
  క్రి, కెటు కష్టమైన క్రీడ యగును?


  చెమటపట్టకుండ సేదతీరెడివాడు
  బద్దకంబుతోడ బతుకువాడు
  పరుగుతీయుటనిన భారమౌవానికి
  క్రికెటు కష్టమైన క్రీడ యగును.


  రిప్లయితొలగించండి
 50. అందరికీ నమస్సులు🙏
  ఆ. వె

  నీడ పట్టు నుండి వీడియో గేముల
  నాడు పిల్లలకిక బ్యాటు పట్టు
  బలము యేది? నారు బయట నాడెడి యాట
  *క్రికెటు కష్టమైన క్రీడ యగును*
  ***
  మరో పూరణ....

  ఇట్టి గేము నాడ యీలాకు డౌనందు
  కాదిది నొకరాడు యాట నౌటు
  డోరు నందు చూడ బోరు కొట్ట దెపుడు
  *క్రికెటు కష్టమైన క్రీడ యగును*

  వాణిశ్రీ నైనాల, హైదరాబాద్
  9త మే, 2020

  రిప్లయితొలగించండి
 51. ఆ.వె.

  క్రీడ ప్రాంగణమున క్రిక్కిఱు జనులుండ
  ప్రేర కమ్ము నాట పెంపు గొలుపు
  కనగ నేడు వ్యాప్తి కారోన వైరసు
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 52. వికలపుమోముగల్గిమనవీరడునాటనుమూర్ఛనొందుటన్
  గ్రికెటుకనంగగష్టమగుక్రీడయగున్సురమౌనినారదా!
  క్రికెటునునాడుచుండగనుగేకలువేయుచుధూర్తులయ్యెడన్
  బకపకనవ్వుచుండుచునుబందెమువేయుచుబాడుచేతురే

  రిప్లయితొలగించండి
 53. 1.
  యుద్ధ సమీక్ష లో ధర్మరాజు తో అర్జునుడు శ్రీకృష్ణపరమాత్మ గురించి మాట్లాడుతూ...

  ఆటవెలది
  బాల కృష్ణునిగనె లీలలెన్నియొ చూపి
  రాక్షసాలికెళ్ల శిక్ష వైచె
  దక్షుడై నడుపఁ గురుక్షేత్రమదియె చ
  క్రికెటు కష్టమైన క్రీడ యగును?

  2. రుక్మిణీ దేవి నారద మహర్షితో...

  చంపకమాల
  చకితుని జేసె బాల్యమున శైలము నెత్తుచు గోట, నింద్రునిన్!
  ముకులిత సత్యభామ మది పొంగుచు విచ్చఁగ స్వర్గమేగి తాఁ
  జకచకఁ బారిజమ్ముఁగొన సాగెనుఁ దెచ్చెడు కార్యమన్న చ
  క్రికెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా?  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెండవ పద్యం కొన్ని సవరణలతో..

   చంపకమాల
   చకితుని జేసె వజ్రి నట శైలము నెత్తుచు గోట బాలుడై!
   ముకులిత సత్యభామ మది పొంగుచు విచ్చఁగ స్వర్గమేగి తాఁ
   జకచకఁ బారిజమ్ముఁగొన సాగెనుఁ దెచ్చెడు కార్యమన్న చ
   క్రికెటు కనంగఁ గష్టమగు? క్రీడ యగున్ సురమౌని నారదా!

   తొలగించండి
 54. (త్రిలోకసంచారి నారదునికి క్రికెట్టు ఆటగురించి వివరిస్తున్న క్రికెట్ అభిమాని)

  వికెటునకంటిపెట్టుకొని వేగము పర్వులదీయగావలెన్
  చకచకనన్నిమూలలకు జంకక బంతులనంపగావలెన్
  కకవిక బంతులన్ విసరి కట్టడిజేయుట సాధ్యమౌనొకో
  క్రికెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా

  రిప్లయితొలగించండి
 55. అందరికీ నమస్సులు🙏
  మరో పూరణ...
  ఆ.వె
  🙏🙏🙏
  మరో ప్రయత్నం....
  ఆ.వె
  ఆట లాడ, జగతి నాటక రంగము
  జనులు పాత్ర దారులు నటియింప
  శోధన సలుప నిది, సూత్రధారియగు చ
  *క్రి కెటు కష్టమైన క్రీడ యగును?*
  వాణిశ్రీ నైనాల, హైదరాబాద్

  రిప్లయితొలగించండి
 56. ఆదినుండీ అసురసంహార విద్యయందారితేరినవాడైన శ్రీహరికి అది కష్టమా ??

  ప్రకటితమయ్యె దైత్యకులవైరి బలంబులు పెక్కులున్ హిర
  ణ్యకశిపుఁ,రవణాద్యసుర నాథులనంతమొనర్చువేళ స
  ర్వకళ కలానిధానుఁడు పురందర సేవితుఁడాద్యుఁడైన చ
  క్రి కెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా

  రిప్లయితొలగించండి
 57. సకలచరాచరమ్ములనుసాకుచురక్షణసల్పుదేవియౌ
  నకడమచక్రమమ్మయెదయానుగుణమ్ముఁబరిభ్రమింపచే
  యుకతనరాక్షసాధములయూపిరిదీయభవానియైన
  శా
  క్రి, కెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా"

  ★అకడమచక్రము=గ్రహముల శుభశుభ స్థానములను తెలుపు చక్రము/గ్రహగమనం

  రిప్లయితొలగించండి
 58. లోక జీవరాశి సాకల్యముగ జాచి
  జన్మ నిచ్చి పెంచి సమయ జేయు
  జగతి నడుప నింక సర్వజ్ఞుడగునా చ
  క్రి కెటు కష్టమైన క్రీడ యగును?!

  రిప్లయితొలగించండి
 59. నాటిపెద్దవారు యాడినయాటను
  మార్పుజేసి పేరుకూర్పు జేసి
  క్రికెటు కష్టమైనక్రీడయగునుగాదు
  ఆడవారు నేడు యాడుటాయె!

  రిప్లయితొలగించండి
 60. *సమస్య*
  క్రికెటు కష్టమైన క్రీడయగును


  ఆ.వె.
  పిచ్చు బాగుగున్న మెచ్చియాడగ దగు
  క్రికెటు నందు పిచ్చు కీలకమ్ము
  వానకురిసి గ్రౌండు వరదతో నిండగా
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  @శ్రీధర్ కొమ్మోజు, వరంగల్

  రిప్లయితొలగించండి
 61. *సమస్య*
  క్రికెటు కష్టమైన క్రీడయగును


  ఆ.వె.
  పిచ్చు బాగుగున్న మెచ్చియాడగ దగు
  క్రికెటు నందు పిచ్చు కీలకమ్ము
  వానకురిసి గ్రౌండు వరదతో నిండగా
  క్రికెటు కష్టమైన క్రీడ యగును

  @శ్రీధర్ కొమ్మోజు, వరంగల్

  రిప్లయితొలగించండి
 62. పరుగు పరుగు కెన్నొ భాసిల్లు చప్పట్లు
  మండుటెండ లోన మంట బుట్ట
  గురియె కుదరకున్న గుర్తులు మేనిపై
  క్రికెటు కష్టమైన క్రీడ యగును!!

  రిప్లయితొలగించండి