అందువలన నరక వాసులు గోడలో పెద్ద రంధ్రమును తొలిచి దానిలోనుండి వచ్చిన చల్ల గాలిని ఆస్వాదిస్తుండేవారు. నరకపు మంటల వేడిమి రంధ్రము ద్వారా చొచ్చుకొని స్వర్గవాసులు భరింపజాలని వేడికి గురి అయ్యారు.
అందువలన స్వర్గ వాసులు ఆ రంధ్రమును పూడిచేవారు...వెను వెంటనే నరక వాసులు మరలా రంధ్రము తొలిచేవారు.
ఇక భరింపలేక స్వర్గ వాసులు నరక జీవులను భయపెట్ట దలచారు:
"మీ మీద ఇక సుప్రీము కోర్టులో కేసు వేస్తాము జాగ్రత్త!"
"ఓ! లక్షణముగా వేయండి. లాయరులందరు మా వేపే ఉన్నారు కదా! హిహ్హిహ్హిహ్హిహ్హీ!"
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'సంయమ' అన్నది సంబోధనమా? 'సంయమి' అన్న సంబోధన సాధువని కంజర్ల రామాచార్య గారు చెప్పారు. నేనూ ఆ సంబోధనతోనే ముందు పూరణ చేసి, వారి హెచ్చరికతో మార్చుకున్నాను.
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
"పాపము శమించు..."
కుములుచు కుందుచున్ విసిగి కొట్టుకు చావగ భాజపాయులే
కమలము వాడిపోవగను కాంగ్రెసు వేడికి దేశమంటతన్
సమయము రాగ రాహులుడు చక్కగ నేలగ భారతావనిన్
యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్?
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
"కలికాలం మన గ్రహచారం"
కుములుచు పుణ్యజీవులట కుందుచు నుండగ నాకమందునన్
తిమిరము పారద్రోలుచును తియ్యగ భానుడు ప్రజ్వలించగన్
విమలపు రౌరవమ్మునట విందులు జేయగ పాపులెల్లరున్
యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్?
తొలగించండికట్టు కథ:
నరకానికీ స్వర్గానికీ మధ్యను గోడ ఉండినది. స్వర్గములో ఏసీ ఉండుటందున చల్లగా హాయిగా ఉండినది. నరకములో మంటలు ఉండుటందున విపరీతమైన వేడిమి ఉండినది.
అందువలన నరక వాసులు గోడలో పెద్ద రంధ్రమును తొలిచి దానిలోనుండి వచ్చిన చల్ల గాలిని ఆస్వాదిస్తుండేవారు. నరకపు మంటల వేడిమి రంధ్రము ద్వారా చొచ్చుకొని స్వర్గవాసులు భరింపజాలని వేడికి గురి అయ్యారు.
అందువలన స్వర్గ వాసులు ఆ రంధ్రమును పూడిచేవారు...వెను వెంటనే నరక వాసులు మరలా రంధ్రము తొలిచేవారు.
ఇక భరింపలేక స్వర్గ వాసులు నరక జీవులను భయపెట్ట దలచారు:
"మీ మీద ఇక సుప్రీము కోర్టులో కేసు వేస్తాము జాగ్రత్త!"
"ఓ! లక్షణముగా వేయండి. లాయరులందరు మా వేపే ఉన్నారు కదా! హిహ్హిహ్హిహ్హిహ్హీ!"
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలైయర్(లాయర్)లంతా నరకానికే పోతారన్నమాట!
🙏
తొలగించండిఅందరికీ నమస్సులు 🙏
రిప్లయితొలగించండినా పూరణ ప్రయత్నం..
*చం మా*
గమనములేలనోయని దిగాలుగ కార్మికులూళ్ళు బోవగా
సమమగు రీతినన్ నెవరు సాయముజేయగ రారులే యనిన్
తమదగు శైలిలో వెడలు దారిని కాయుచు దూతలన్ గనన్
*"యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కార్మికు లూళ్ళ కేగగా" అనండి. 'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙇
తొలగించండిసవరణతో
గమనములేలనోయని దిగాలుగ కార్మికులూళ్ళ కేగగా
సమమగు రీతినన్ నెవరు సాయముజేయగ రారులే యనిన్
తమదగు శైలిలో వెడలు దారిని కాయుచు దూతలన్ గనన్
*"యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్"*
🙇
సమరమునన్ దునుమవలెన్
రిప్లయితొలగించండిఉమ కాళిగ వాని రక్త మొప్పుచు గ్రోలన్
సమయంబిదియే మరి యా
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...దునుమవలయు। నుమ..." అనండి.
(మహిషాసురుని దండయాత్రకు భయపడుతున్న యమధర్మరాజుతో దేవేంద్రుడు )
రిప్లయితొలగించండిసమయము జూచి జీవులను
జచ్చిన మీదట వేగ నీదు సం
యమనికి దెచ్చి వారలకు
యాతనశిక్షల నెన్నొవైచుచున్
గుములగజేయు దండధర !
కూరిమి మిత్రవరేణ్య!నీవునున్
యమ!మహిషాగమంబున భ
యంబును బొందగనొప్పు నెవ్విధిన్ ?
(సంయమని -యముని రాజధాని;యాతనశిక్షలు -కఠినశిక్షలు;కుములగజేయు -తపింపజేయు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం//
రిప్లయితొలగించండిసుమనసులప్రార్ధన విని
సమరము జేయంగనెంచి సంతసపడుచున్ !
సమయుజ్జీయగు కాళిక
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభ్రమయని యెరింగి జగతిని
రిప్లయితొలగించండివిమల మనంబున నిరతము విశ్వేశ్వరు దా
నమకాదుల నర్చించిన
యమ మహిషాగమనమున భయంపడ దగునా?
అమలిన భక్తిభావమున నంబరకేశుని నమ్మికొల్వగా
నిముసము నాలసింపకను నిశ్చలభక్తికి నీలకంఠుడే
సముచితరీతి బాలకుని శాశ్వతవాసిగ నిశ్చయింప నా
యమ మహిషాగమంబున భయంబును నొందగనొప్పు నెవ్విధిన్ ?
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యసి వైయమః?
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా,నమస్సులు!!
తొలగించండి
రిప్లయితొలగించండియమునా తీరమున నడక
ను మొదలు కొని హాయి హాయనుకొనుచు బోవం
గ మొగదల దారి లో ఓ
యమ! మహిషాగమనమున భయంపడఁ దగునా!
మార్నింగు వాక్ వేళాయె :)
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజిలేబి గారి పూరణ గద్యంలా ఉందండీ....
తొలగించండి
రిప్లయితొలగించండికందా చంప్స్ :)
జగడము చేయను వరలుకొ
నగ యమ, మహిషాగమంబున భయంబును బొం
దఁగ నొప్పు నెవ్విధిన్ ము
ద్దుగుమ్మ, పదపద జిలేబి దువ్వాడు పతిన్
జిలేబి
బాగుంది మీ ప్రయోగం. అభినందనలు.
తొలగించండిసుమనసభక్తిగీతములసుందరవేదికతీర్చిదిద్ది,స
రిప్లయితొలగించండిక్రమముగనిత్యజీవనముకమ్రఫలమ్ములరాజసమ్మున
న్నమకము,చంద్రశేఖరునినామపుగీతములాలపింపసం
యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్"
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సంయమ' అన్నది సంబోధనమా? 'సంయమి' అన్న సంబోధన సాధువని కంజర్ల రామాచార్య గారు చెప్పారు. నేనూ ఆ సంబోధనతోనే ముందు పూరణ చేసి, వారి హెచ్చరికతో మార్చుకున్నాను.
సంయమ అంటే ఇక్కడ బంధనము పాశము
తొలగించండిలాలపింప పక్కన, ఎలాఉంటుంది?
రిప్లయితొలగించండిఅమరెను తాత రాతను భయానక దుర్భర జీవితమ్ము నీ
సమరము తాళలేనిక ప్రశాంతత కావలె దీర్ఘనిద్రకై
సమయము తక్కువాయె సఖి శ్వాసయు బోయెను సన్నగాను నా
యమ, మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్!
జిలేబి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిద్వైపాయన సరస్సులో దాగిన సుయోధనునితో ధర్మరాజు భాషణ:
రిప్లయితొలగించండిఅమితాభిమాన ధనివీ
వు! మడుగులోదూరితివి! నవుకొనరె జనులు
త్తమయోధుడు కౌరవమణి
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితమతమ వాహనములపై
రిప్లయితొలగించండియమరులు కదులుటను గాంచి యముడును వచ్చెన్
హిమవంతుని సుత పెండ్లికి
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వాహనములపై నమరులు..."
రిప్లయితొలగించండిఅమృతము గ్రోల దేవతల కాయువు గల్గును స్వర్గ లోకమున్
క్షమన వసించు మర్త్యులకు చచ్చుట పుట్టుట తప్పకుండునే
సమయము వచ్చినప్పుడును సమ్మతి ముఖ్యము భ్రాంతి వీడియే
యమ మహిషాగమంబున భయంబును బొందగ నొప్పు నెవ్విధిన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"క్షమను" అనండి.
తమక మదేలనోయి! బహు దర్పము జూపెద వేలనోయి నీ
రిప్లయితొలగించండిభ్రమలను వీడు మోనరుడ! బాహు బలంబును బుద్ధివైభవం
బమరిన నేమి తప్పదిట నంతము గాంచుట లెంతవారికిన్
యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్.
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండియము డల కింకరున్ బిలిచి యాయువు దీరినఁ వారిఁ దెమ్ము సం
రిప్లయితొలగించండియమనికిఁ, గాని శ్రీహరిపదాబ్జనిరంతరభక్తిసక్తసం
యమివరుఁ శ్రేష్ఠుఁ జేరకు, తదానయనాధ్వము వాని పుణ్యలో
కము పరమై పునర్జననకారిణి కాదు, యటన్న నేలనో
యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్?.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'సంయమివరుఁశ్రేష్ఠు..' ఇక్కడ అర్ధానుస్వారం టైపాటు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి🙏చంద్రశేఖరమాశ్రయే మమ
కిం కరిష్యతి వై యమః🙏💐🌹
అమలినరత్నసానువు శరాసనమై, హరి బాణమై, భుజం..
గము గుణమై రథాంగములుగాన్ రవిచంద్రులు., వేదముల్ తురం...
గములన నొప్ప దివ్యరథకాంతి వెలుంగు బురారినెంచుచో
యమమహిషాగమంబున భ
యంబును బొందగనొప్పు నెవ్విధిన్ ?
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అద్భుతమైన పూరణ.
తొలగించండిఅమలులు తప్పేచేయరు
రిప్లయితొలగించండితమ పనులనుదేవదేవు తలచుచు చేయన్
యమ, నియమపాలనంబున
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమమకార మేమి లేక భ
రిప్లయితొలగించండియమొకింతయు లేక చేయు యవినీతికినై
కుములగ నేలా నేడిటు
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియమ నియామానుసారిగ ననంతునిఁ గూర్చి తపంబుఁ జేయు ధ్యే
రిప్లయితొలగించండియముఁ దలఁ దాల్చి యివ్విధి భయంకరమౌ వనిఁ జేరి స్వీయ కా
యము గృశియింపగా పులులనైన గణింపని యోగి! నీకు న్యా
యమ? మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్?
అందరికీ నమస్సులు 🙏
రిప్లయితొలగించండి*కం*
అమరుల మైనను చెల్లును
సమరమునకు సిద్ధమనెడి సైనిక వీరుల్
తమ మరణము నెరుగగ నా
*"యమ మహిషాగమనమున భయంపడఁ దగునా"*?
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసముచితపూజలు జేయగ
రిప్లయితొలగించండిసమరమునకుసిద్ధపడునుశంకరయమతోన్
యమపాశంబునుజేగొని
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'శంకరయమతోన్' ?
విమలము నైనదో? తనువు పేర్మి నిరంతర మందగించునే?
రిప్లయితొలగించండిక్రమముగ పాదముల్ మొదలుగా సిగ నొప్పెడు దాక భూషలన్
ప్రముదముతోడఁ దీర్చిన విభాసిలునే? క్షణ నశ్వరీయకా
యమ! మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసమరము జేయుచుసైన్యము
రిప్లయితొలగించండిఅమరముగా మిగిలిదేశకాపరులయ్యున్
యమపాశమునేపాటిది?
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సైన్యం బమరముగా..' అనండి. రెండవ పాదంలో యతి తప్పినట్టున్నది.
తమరు సలుపునది వ్యవసా
రిప్లయితొలగించండియమ ! మహిషాగమనమున భయంపడఁ దగునా !
కమతమున సాయమిచ్చు జ
త మహిష సంతానమేగద భయప డకుమా
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి🙏🏽
తొలగించండిసుమనోహర జీవిత మని
రిప్లయితొలగించండిభ్రమపడి యుండక మరణములే వదలదు మనలన్
ప్రమదము న నెదు ర్కొ న వలె
మహి షా గమనము న భయం పడ దగు నా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. "మరణమె" అనండి.
రెండవ పాదం లో లే టైపాటు అని తెలుపడ మైనది
రిప్లయితొలగించండిగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిసమభావములేకమనిషి
తమవారినిపలువిధములదండింతురహో
సమయవినయమేదర్మని
యమ,మహిషాగమనంబునభయంపడదగునే
మీ పూరణ బాగున్నది.
తొలగించండిగమనపువేగమునను ఖా
రిప్లయితొలగించండియముచేయుగెలుపును పందె మందున తా ప్రే మముతో కొనె నీపతి యో
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా
మీ పూరణ బాగున్నది.
తొలగించండిక్రమముగ తీరిన విధులను
రిప్లయితొలగించండిశ్రమతో కాయము బడల, నశక్తత తోడన్
గమనము సాగగ, ముదిమిన
"యమ మహిషాగమనమున భయంపడఁ దగునా"
మీ పూరణ బాగున్నది.
తొలగించండి"ముదిమిని" అనండి.
గమనము జీవితమంత ని
రిప్లయితొలగించండియమము గనక పాపములివి యని జూడక నుం
డి,మరణ మాసన్న మవగ
యమ మహిషాగమనమున భయంపడ దగునా?
మీ పూరణ బాగున్నది.
తొలగించండియమనియమాదులు మటుమా
రిప్లయితొలగించండియమొనర్చును గద మమతల నాశల నిహమున్
యమివై పరమును గోరక
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా
మీ పూరణ బాగున్నది.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిప్రమథాధిపతిని నిచ్చలు
సుమనస్కుడవై మృకండు సుతునిన్ వలెన్
క్రమముగ యజించు నీవిటు
యమ మహిషాగమనమున భయంపడఁదగునా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమరుల బృందమే కదిలె నద్రిజ పెండ్లిని గాంచనెంచుచున్
రిప్లయితొలగించండిదమతమ వాహనమ్ముల ముదమ్మున నెక్కి చనంగ గాంచి యా
యముడును సాగగా దలచె నంబవివాహముఁ జూడగా వడిన్
యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్.
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా"
రిప్లయితొలగించండియమ నియమమ్ముల తోడను
సుమనస్కుండై చరింప సోకవు వ్యథలున్
భ్రమలిక వీడుము మనుజా
*యమ మహిషాగమనమున భయంపడఁ దగునా"*
సుమశర హరుడౌ శంకరు
సముఖమున వసించు వాని సామీప్యమునన్
కొమరుండుండ మృకండుడు
*యమ మహిషాగమనమున భయంపడఁ దగునా"*
కమలా!యన్నియుదెలిసియు
రిప్లయితొలగించండియమమహిషాగమనమునభయంపడదగునా
గమనముచివరకునదియే
యమపాశమునడ్డగించహరుడొకడెసుమా
సముచిత రీతి విజృంభిం
రిప్లయితొలగించండితము వాహనరాజ గాంచఁ దగ్గె నకట వే
గము మార్కండేయుఁ గదియ
యమమహిషా! గమనమున భయంపడఁ దగునా
స మనుజ జంతు కోటికి నశక్యము గాంచఁగ దేవ కోటి నెం
చ మహిని నెన్నడేని వికచన్నయ నాబ్జము లున్న నేరికిన్
యమ మహిషమ్ముఁ గాంచ నుసు రక్కట నుండునె బొంది లోపలన్
యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్
యమమహిషాగమంబునభయంబునుబొందగనొప్పునెవ్విధిన్
రిప్లయితొలగించండిసుమలత!యెందుకీభయముచూడుముపుట్టుటచావుకేగదా
జమునినిదాటనేరికినిసాధ్యముగాదనినీవెఱుంగవే
యమునిజయింపయోధుడికయాహరుడేగదచాలునిద్ధరన్
ప్రమదయె పాడిగేదెలను వాసిగ పెంచెధనమ్ము కోసమై
రిప్లయితొలగించండిశ్రమయని యెంచకుండ, కడు చాకిరి సేయుచు నుండు గోష్ఠమున్
నిముషము వీడకుండ, ననునిత్యము గేదెలతో చరించు నా
యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్.
చం:
రిప్లయితొలగించండిగమనము జూడ కారులను కట్టడిలేకయె సాగు వీధులన్
సమముగ నన్య సాధనము సందుల బొందుగ బోవుచుండగన్
భ్రమపడి పాదచారి నడి బాటన చింతన సేయ పూనికన్
యమ మహిషాగ మంబున భయంబును బొందగ నొప్పు నెవ్విధిన్
వై. చంద్రశేఖర్
యమి తన నియమము యమమున
రిప్లయితొలగించండితమకము వదలియు తపమున ధారణ జేయన్
యమ కింకరులకు భటులకు
యమ మహిషాగమనమున భయంపడ దగునా
సమరము జేయసిద్ధమని శత్రువులన్ దెగగోసెదన్ పరా
రిప్లయితొలగించండిక్రమమున నన్నుమించెడు శిఖామణులిచ్చ లేరటంచు దా
ప్రమదల ముంగిటన్ బలుక ప్రల్లదముల్ బహునేర్పు నేడు న్యా
యమ!మహిషాగమంబున భయంబును నొందగ నొప్పునెవ్విధిన్ ?
నిముసము తీరికన్ గనక నిత్యము విత్తము నాశ్రయించుచున్
తొలగించండితమకముతో సతీసుతల దంభముమీరగ సాకువారికిన్
యమ మహిషాగమంబున భయంబును నొందగనొప్పు; నెవ్విధిన్
యమభటు లేగుదెంచెదరు యంబుజనాభుని గొల్చుదావునన్ ?
చంపకమాల
రిప్లయితొలగించండిసమయముఁ దీర సూర్యజుడు సాచగ పాశము సత్యవంతుకై
విమల మనస్క పత్ని యట విజ్ఞత మీరఁగ నాపి పొందెనే
కొమరుని గోరుచున్ బతిని, గూర్చెనె మామకు భూమి, సాధ్వికిన్
యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్?
సుమవనమునవిహరించ కు
రిప్లయితొలగించండిసుమసుందరిరత్నమాల సోకుగనేగన్
సుమ ద్రుమముకడకుజన నా
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా
కందం
రిప్లయితొలగించండిసమయస్ఫూర్తిగ కోరుచు
సమవర్తినిఁ బడసె పతిని సావిత్రి సుతుం
డమరన్ మామకు రాజ్యము
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా?
శమమగు జీవితమందున
రిప్లయితొలగించండిరమణీ, సుత, దేహ మోహరంబుల బడక, ని
త్యము హరిఁ జపించు భక్తుడు
యమ మహిషాగమనమున భయంపడఁ దగునా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి21.5.20
రిప్లయితొలగించండిశ్రీ లక్ష్మీ నారసింహాయనమః
నమస్సులతో ,శుభోదయం.
నేటి సమస్యాపూరణ యత్నం-
సమయగమన నిర్దేశుడు
అమలిన నియమపు గతీశు డాయన జగమున్
దమ సీమకభయ మివ్వగ
యమ మహిషాగమనమునభయంపడ దగునా?
నేటి రెండవ సమస్యాపూరణ యత్నం-
విమల మహోన్నతైక సురవేద్యుడుదానవ వంశ సూర్యుడున్
తపనమనోజ్ఞ చిత్తుడు సదైవకథామృతపాన సంరంభ
గమన పథీయ భాసురుడు ఖర్వ పు దానవపుత్ర రత్నంబు
యమ మహిషాగమంబున భయంబును బొందగ నొప్పు నెవ్విధిన్