ఒకరోజు భోజరాజు చాలా ఉల్లాసంగా "టంటంట టంటంట టటంట టంటం' అని కూనిరాగం తీస్తూ సభకు వచ్చినాడట. మంత్రి కేమీ అర్థం కాలేదు రాజా! కవులను కావ్య గానం చేయమన్నారా? లేక మీరేదయినా సమస్య యిస్తారా? అని అడిగినాడు. రాజు నవ్వుతూ ఇదే సమస్య "టంటంట టంటంట టటంట టంటం" దీన్ని ఆధారంగా చేసుకొని మిగతా మూడు పాదాలూ పూరించాలి. సభలో దండి,భవభూతి తో సహా అందరు కవులూ రాజు కేమైనా పిచ్చి పట్టిందా అని నివ్వెర పోయి చూస్తున్నారు ఒక్క కాళీదాసు తప్ప.
కాళిదాసు మాత్రం ముఖం లో ఏ భావమూ చూపకుండా కూర్చున్నాడట.
రాజు మహాకవీ మీరు కూడా నాకు మతి పోయిందనుకుంటున్నారా? అని అడిగాడు. అంత ధైర్యం నాకు లేదు ప్రభూ! సమస్య యింకో మారు వివరించండి అన్నాడు. కుమార సంభవ కావ్యం లో మీరు రాసిన 'అస్తుత్తరస్యాం దిశి దేవాతాత్మా"అన్నట్లు యింద్రవజ్ర వృత్తములోని పాదం యిది. ఈ వృత్తం మీకు కొట్టిన పిండే కదా పూరించండి.అన్నాడు. వెంటనే కాళిదాసు అయిదు క్షణాలు కళ్ళు మూసుకొని యిలా చెప్పాడు. 'రాజ్యాభిషేకే మద విహ్వాలయా: హస్తాత్ చ్యుత: హేమ ఘటః యువత్యాః సోపాన మార్గేషు కరోతి శబ్దం టంటంట టంటంట టటంట టంటం" రాజు ఆశ్చర్యం తో అలా చూస్తూండి పోయాడు. అలా చూస్తారేమి మహారాజా!అర్థం సులభమే కదా!నేను సభకు అర్థం వివరిస్తాను. రాజు గారికి పరిచారికలు స్నాన ఘట్టం లో స్నానం చేయిస్తున్నారు. వారిలో ఒక పరిచారిక రాజుగారి సౌందర్యం చూసి మై మరిచి పోయింది. ఆమె చేతి లోని బంగారు చెంబు జారి పోయి స్నానఘట్టం మీదు గా దొర్లుతూ మీరు చెప్పినట్టు 'టంటంట టంటంట టటంట టంటం' అని మోత చేసింది. మహా కవీ! మీరు ఉదయం స్నాన ఘట్టం దగ్గర లేరు కదా!మీరెలా చెప్ప గలిగారు? నేను మీ ఉల్లాసాన్ని,ఉత్సాహాన్నీ చూసి ఊహించి చిన్న శ్లోకం చెప్పాను. అన్నాడు కాళిదాసు. భోజ రాజు సింహాసనం మీది నుంచి లేచి వచ్చి కాళిదాసును కౌగలించుకున్నాడు. అక్షరలక్ష లిచ్చిగౌరవించాడు అందుకే కాళిదాసును మహాకవి అన్నారు. . .
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
సయ్యాటంబుల తోడుతన్ తెలుగునన్ సవ్యంపు ఛందస్సుతో
వయ్యారంబగు శైలినిన్ గరపుచున్ బ్రహ్మాండమౌ ప్రీతినిన్
కుయ్యోమంచును నేను మొత్తుకొనగా ఘోరంపు తప్పుల్ వినా
నయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నేనౌనన్
మీ సరదా పూరణ బాగున్నది.
తొలగించండి"కుయ్యో యంచును... వినా యయ్యో..."
🙏
తొలగించండి30.05.2020
రిప్లయితొలగించండిఅందరికీ నమస్సులు ..🙏
*సమస్య: "ఒకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో"*
*కం||*
వికటించిన చదువులతో
పకపక నవ్వుచు పలుకగ వగలొలికిస్తూ
చకచక వ్రాయుట తెలియక
*"నొకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😀🙏
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'ఒలికిస్తూ' అనడం వ్యావహారికం. "వగల నొలుకుచున్" అందామా?
*సవరణతో*
తొలగించండివికటించిన చదువులతో
పకపక నవ్వుచు పలుకగ *వగలొలికింపన్*
చకచక వ్రాయుట తెలియక
*"నొకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో"!!*
ఒక పద్యమున యతి కుదర
రిప్లయితొలగించండిదొకటన ప్రాస సరిగుండదు,గణము భంగం
బొకట,సమస్యకు సరిగా
నొకడైనం బద్యరచన నొనరింపడయో!
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'ఒకటన' అని కాక 'ఒకటను' అనండి. 'సరిగ నుండదు' అనడం సాధువు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
కయ్యమ్మున్ కడు చేయకే విడిచియా గారాబు నాంగ్లమ్మునున్
పొయ్యిన్ బెట్టుచు నన్యదేశ్యములనున్ పొంగారు నాంధ్రమ్మునన్
వయ్యారంబగు నర్ధ శూన్యములతో బ్రహ్మాండమౌ ధారతో
నయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నేనౌనన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది.
తొలగించండి"అర్థపుష్టి గలుగన్" అంటే బాగుంటుందేమో?
🙏
తొలగించండిచకచక రచించు చుండగ
రిప్లయితొలగించండిరకరకముల జేయు తప్పులను జూ పుచునే
పకపకమని నవ్వితి , నిపు
డొకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో
మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండినో యూజ్ యెన్ని దఫాలు పిలిచినా రా రే :)
అకటా! కష్టే ఫలి! వి
న్నకోట నరసింహ! పిలచి నా నే నీహా
రిక నా బండివరార్యుల
నొకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో!
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'లక్కాకుల' వారిని వదిలేశారేం?
తొలగించండిలక్కాకుల వారు ఉద్ధండులు!
వారి మామూలు వ్రాతలే పద్యం కదా !
జిలేబి
రిప్లయితొలగించండివయ్యారమ్ముగ భాస్కరార్య భళిరో బండన్న! ఓ విన్న కో
టయ్యా! రండిటు చేయ పూరణల మిట్టాడంగ నీహారికా!
కయ్యాలాడెద మీ ప్రకోష్టమున ఝంకారాల! బిల్వంగ నో
రయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నేనౌననన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరకరకములలంకారము
రిప్లయితొలగించండిలొకపట్టున గానరావు నొయ్యారముగా
నిక మాతృభాష మరచితి
మొకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో!
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఒకపరి గురువులు మెచ్చెడి
రిప్లయితొలగించండిచకచకమనితడుముగొనక (జక్కగగూర్చిన్
సకలముగణములతోడను
ఒకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'కూర్చిన్'? "...జక్కగ గూర్పన్.." అందామా? 'తోడను+ఒకడైనన్' అని విసంధిగా వ్రాయరాదు.
రిప్లయితొలగించండిపకపక నవ్వుదురు జిలే
బి!కందమా తేటగీతి వెలదుల వ్రాయం
గ కదలి రండని బిల్వగ
నొకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో!
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశయ్యాపాకరసధ్వనిప్రకరవాచ్యవ్యంగ్యలక్ష్యార్థసా...
హాయ్యప్రోక్తకవిత్వలక్షితసుపద్యంబెన్న నాకిష్టమౌ
నయ్యారే! అటువంటి పద్యమె ప్రశంసార్హంబు., తద్రీతిగా
నయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నేనౌనన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండివికటించిన విద్యలతో
రిప్లయితొలగించండిఅకటకటా! సగము నేర్చి అధ్యాపకులై
ఇక చాలని తల పెట్టరు
ఒకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో
మీ పూరణ బాగున్నది.
తొలగించండిసుకవులకెల్లరులకు నే
రిప్లయితొలగించండిప్రకటించితి గాదె తెలుగు ప్రాశస్త్యమునే
ప్రకటించుచు వ్రాయమనగ
నొకడైనంబద్యరచన నొనరింపఁ డయో!
కం//
రిప్లయితొలగించండిమకరందముబోలు తెలుగు
వికటముగా బలుకు వాని విషమము నోటన్ !
నకనకలాడుచు నేడ్వగ
ఒకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో !!
వికసిత వచనపు కవులై
రిప్లయితొలగించండిప్రకటిత మౌ భావములను వ్రాసెడి వార ల్
సుకర పు ఛంద ము నందున
నొక డైనను బద్య రచన నొనరింప డ యో
వయ్యాకరణుల్ సెబాసన,శుభ ప్రాసంగ సౌభాగ్యముల్
రిప్లయితొలగించండివయ్యారంబుగ నాట్యకేళి సలుపన్ వైచిత్రితో వాణికిన్
సయ్యాటల్ వలెఁ దోచుకావ్య సుమ శశ్వత్ ప్రౌఢి నొప్పారుచున్
అయ్యోయొక్కడు గూడ పద్యముల వ్రాయంబోడు నేనౌనన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరకముగ గద్య కవితలను
ప్రకటించుట వచ్చు గాని వారందరికిన్
యకటా! ఛందమె కొదవడి
ఒకడైనం బద్యరచన నొనరింప డయో!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిరక,రక రచనా ప్రక్రియ
రిప్లయితొలగించండిచక,చక రాయుచు తెలుగున జంకుట యేలో,
నకటా వింతగ తోచన్
"ఒకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో"
కయ్యంబేలర యాలకింపుమొక సద్గ్రంథంబునే కూర్చగన్
రిప్లయితొలగించండివియ్యంబందున విన్నవించితి గదా విజ్ఞానులన్, సూరులే
యయ్యారే యను భంగి పద్యముల భాషౌన్నత్యమున్ జాట, తా
మయ్యో! యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నేనౌననన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసుకవులనబడెడువారల
రిప్లయితొలగించండినొకడైనంబద్యరచననొనరింపడయో
యకటాయేమనిజెప్పుదు
నొకడైనన్వ్రాయమేలునొక్కటిరచనన్
ఒకరినిమించిమరొక్కరు
రిప్లయితొలగించండిసుకవులుతమకవితలల్లిసుమధురగతులన్
చకచకవినిపించుడనిన
ఒకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినెయ్యం బించుకఁ జూడరే గురువులన్ నెగ్గించి హ్రస్వమ్ముగా
తొలగించండినయ్యయ్యో లఘువున్ గ్రహించి గురువౌ నట్లున్ దగన్ లాగుచున్
వెయ్యిన్నొక్క దొసంగులౌ నుడులు వైవిధ్యార్థదుష్టంబులౌ
నయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నే నౌననన్
కంజర్ల రామాచార్య.
అయ్యాయేమనిజెప్పుదిప్పుడుభువిన్హర్షంబుగల్గంగగా
రిప్లయితొలగించండియయ్యోయొక్కడుగూడపద్యములవ్రాయంబోడునేనౌననన్
భయ్యావ్రాయుమునీవుచక్కగనుమాపంచాస్యువర్ణించుచున్
నయ్యారేయనునట్లుపండితులుదామాశ్చర్యమొందంగగా
అయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నే నౌననన్
రిప్లయితొలగించండిఅయ్యా పద్యము వ్రాయుటన్న సులువా ఆ ఛందముల్ బ్రాసలున్
అయ్యారే యతులన్న మా మతుల కాద్యంతమ్ము నాకంపమౌ
నయ్యా సద్గురు శంకరార్య దమ శిష్యత్వమ్ము నిమ్మందురే
పకపక నవ్వుదు రంచును
రిప్లయితొలగించండిసుకవులు, వారించఁగ మనసు కరము, సెలగం
దికమక వ్యాకరణమ్మున
నొకఁ డైనం బద్యరచన నొనరింపఁ డయో
అయ్యా యిండ్లను దార నందనుల కుయ్యాలించి సైరించి తా
రయ్యో వ్రాయుచు నుంటిరే వెతల భావ్యం బెట్టు లౌ నిట్లు మీ
రయ్యా వ్రాసిన వాటి కింక దయ సమ్యగ్వీక్షణం బీనిచో
నయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నే నౌననన్
[ఆ + ఆ = ఆయా = అయ్యా]
శా:
రిప్లయితొలగించండిఅయ్యారే పరిహాసమాడ దగునా యచ్చంగ పద్యాలనే
సయ్యాటన్ రచియింప నిచ్చటన నిచ్ఛంగింప సంరంభమున్
భయ్యా మీకిది నేయమా నిటులనన్ వాక్రుచ్చ నివ్వేళన
న్నయ్యో యొక్కడు గూడ పద్యముల వ్రాయంబోడు నెనౌననన్
వై. చంద్రశేఖర్
నేనౌననన్ గా చదువగలరు
తొలగించండినా ప్రయత్నం :
రిప్లయితొలగించండిఒకరోజు భోజరాజు చాలా ఉల్లాసంగా "టంటంట టంటంట టటంట టంటం' అని కూనిరాగం తీస్తూ సభకు వచ్చినాడట. మంత్రి కేమీ అర్థం కాలేదు రాజా! కవులను కావ్య గానం చేయమన్నారా? లేక మీరేదయినా సమస్య యిస్తారా? అని అడిగినాడు. రాజు నవ్వుతూ ఇదే సమస్య "టంటంట టంటంట టటంట టంటం" దీన్ని ఆధారంగా చేసుకొని మిగతా మూడు పాదాలూ పూరించాలి. సభలో దండి,భవభూతి తో సహా అందరు కవులూ రాజు కేమైనా పిచ్చి పట్టిందా అని నివ్వెర పోయి చూస్తున్నారు ఒక్క కాళీదాసు తప్ప.
కాళిదాసు మాత్రం ముఖం లో ఏ భావమూ చూపకుండా కూర్చున్నాడట.
రాజు మహాకవీ మీరు కూడా నాకు మతి పోయిందనుకుంటున్నారా? అని అడిగాడు.
అంత ధైర్యం నాకు లేదు ప్రభూ!
సమస్య యింకో మారు వివరించండి అన్నాడు.
కుమార సంభవ కావ్యం లో మీరు రాసిన
'అస్తుత్తరస్యాం దిశి దేవాతాత్మా"అన్నట్లు యింద్రవజ్ర వృత్తములోని పాదం యిది.
ఈ వృత్తం మీకు కొట్టిన పిండే కదా పూరించండి.అన్నాడు. వెంటనే కాళిదాసు అయిదు క్షణాలు కళ్ళు మూసుకొని యిలా చెప్పాడు.
'రాజ్యాభిషేకే మద విహ్వాలయా:
హస్తాత్ చ్యుత: హేమ ఘటః యువత్యాః
సోపాన మార్గేషు కరోతి శబ్దం
టంటంట టంటంట టటంట టంటం"
రాజు ఆశ్చర్యం తో అలా చూస్తూండి పోయాడు. అలా చూస్తారేమి మహారాజా!అర్థం సులభమే కదా!నేను సభకు అర్థం వివరిస్తాను. రాజు గారికి పరిచారికలు స్నాన ఘట్టం లో స్నానం చేయిస్తున్నారు. వారిలో ఒక పరిచారిక రాజుగారి సౌందర్యం చూసి మై మరిచి పోయింది. ఆమె చేతి లోని బంగారు చెంబు జారి పోయి స్నానఘట్టం మీదు గా దొర్లుతూ మీరు చెప్పినట్టు 'టంటంట టంటంట టటంట టంటం' అని మోత చేసింది.
మహా కవీ! మీరు ఉదయం స్నాన ఘట్టం దగ్గర లేరు కదా!మీరెలా చెప్ప గలిగారు?
నేను మీ ఉల్లాసాన్ని,ఉత్సాహాన్నీ చూసి ఊహించి చిన్న శ్లోకం చెప్పాను. అన్నాడు కాళిదాసు. భోజ రాజు
సింహాసనం మీది నుంచి లేచి వచ్చి కాళిదాసును కౌగలించుకున్నాడు. అక్షరలక్ష లిచ్చిగౌరవించాడు
అందుకే కాళిదాసును మహాకవి అన్నారు. . .
పై సందర్భంగా బోజరాజు :
కందం
ప్రకటించఁగ 'టంట'ధ్వని
నికరమ్ముగ కాళిదాసు నిజమునె జెప్పెన్
చకితుని జేయుచు, నన్యులు
నొకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో
శిష్యులతో గురువు :
శార్దూలవిక్రీడితము
సైయ్యంచున్ దలలూప మీరుఁ దగఁ బ్రశ్నాపత్రమున్ గూర్చి మీ
కియ్యంజూపిన పద్యరత్నములలో నింపైన రెండిచ్చితిన్
దయ్యాలే మిము పూనెనో, మరచిరో దద్దమ్మ లై శుంఠలై
యయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నే నౌననన్
సహదేవుఁడు గారు మంచి చాటువు నందించారు.
తొలగించండిసరియైన పాఠ మిది కావచ్చునని నే ననుకొను చున్నాను.
రాజ్యాభిషేకే మద విహ్వలాయా:
హస్తాత్ చ్యుతో హేమ ఘటో యువత్యాః
సోపాన మార్గేషు కరోతి శబ్దం
టంటంట టంటంట టటంట టంటం"
ఆర్యా! ధన్యవాదములు. సవరించుకుంటాను
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి30, మే 2020, శనివారం
రిప్లయితొలగించండిశంకరాభరణం సమస్య - 3384
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నే నౌననన్"
శా|| అయ్యారే!భవమైనభావరమణీయంబున్ కవిత్వమ్మునన్
వయ్యారంపుపదాలతో రససుధాభాండంబు నొల్కున్ జతిన్
ఉయ్యాలాడుమతిన్ వసంత తరురాగోత్పాదమో శ్రీగతిన్
"అయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నే నౌననన్"
(లేదా...)
"ఒకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో""
అకలంకకవిత్వపథము
సకలమ్మీయునుభవితకుసౌజన్యమ్మున్
ఇకనైనవిశ్వహితమున
"కొకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో""
.------ఓలేటి వేంకట బంగారేశ్వరశర్మ
సుకుమారపు భావనలను
రిప్లయితొలగించండిసకలాలంకృత పదముల సాధుత్వముతో
నకలంకంబైన విధము
నొకడైనం బద్యరచన నొనరింపడహో!
శ్రీనాథుని అంతరంగం
వెయ్యిన్నొక్క విధంబులన్ మలచి సంప్రీతిన్ సువృత్తంబులన్
తయ్యారైన సుకావ్యకన్యకను సత్కారంబునన్ శోభతో
నెయ్యంబునా మది స్వీకరించు సుగుణాన్వేషుల్ భువిన్గానకే
యయ్యో!యొక్కడుగూడ పద్యముల వ్రాయంబోడు నేనౌననన్
ఈసారి పోతన
వియ్యంబందగ మానసంబు నెపుడా విశ్వాత్మకున్ దోడుతన్
చెయ్యందింపగ నాతడే రచనలన్ శీఘ్రంబుగా జేయుచున్
సయ్యంమీంద్రు వలెన్ సదానిలుచుచున్ సచ్ఛీలమేపారగా
నయ్యో!యొక్కడుగూడ పద్యముల వ్రాయంబోడు నేనౌననన్
సుకరపు శిక్షణనిచ్చుచు
తొలగించండినకలంకం బైనరీతి నల్లగపద్యాల్
మకుటంబగు బ్లాగునెటుల
నొకడైనం బద్యరచన నొనరింపడహో?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసవరించిన పోతన పూరణ కవితా ప్రసాద్ గారికి ధన్యవాదములతో
తొలగించండివియ్యంబందగ మానసంబు నెపుడా విశ్వాత్మకున్ దోడుతన్
చెయ్యందింపగ నాతడే రచనలన్ శీఘ్రంబుగా జేయుచున్
కయ్యమ్ముల్ విడనాడి సారమతిమై కంజాక్షునిన్ గొల్చువా
డయ్యో!యొక్కడుగూడ పద్యముల వ్రాయంబోడు నేనౌననన్
కయ్యంబుల్మునుచిఱ్ఱుబుఱ్ఱుగనునాకర్ణించుసల్లాపము
రిప్లయితొలగించండిల్వయ్యారంబుగజిల్కువారలనశ్రీవర్థిల్లుకళ్యాణమున్
నుయ్యాలూగగబంచరత్నములచిన్మూలంబుబ్రౌఢంబున
న్నయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నే నౌననన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
అయ్యో లేరిల మాతృభాష నిటులన్యాయమ్ముగా మాపుచున్
రిప్లయితొలగించండిసయ్యాటించెడి నాయకుల్ హతవిధీ యాంధ్రాత్మ క్షోభింపగా,
అయ్యా నేడిటులాంగ్ల మాధ్యమమె ముద్దాయెన్ గదా నింక పై
నయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నే నౌననన్
కయ్యమ్ముల్ పొనరించుచున్ బడి సుశిక్షన్ తాను కోల్పోయినన్
రిప్లయితొలగించండిశయ్యాశిల్పము సూన్యమౌను, మది భాషాయోషఁ లేకున్నచో
సైయ్యంచున్ సభలందు పో తరమ, భాషన్ పట్టు లేకుండ న
య్యయ్యో యొక్కడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నేనౌననన్