24, మే 2020, ఆదివారం

సమస్య - 3378

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో"
(లేదా...)
"మల్లెల నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో"

77 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  అల్లరి చేయనెంచి కడు హాయిగ నేగుచు మాటిమాటికిన్
  చిల్లర ప్రశ్నలేయుచును చిక్కులు తెచ్చి వధానమందునన్
  పుల్లలు పెట్టెడిన్ కవుల ముద్దుల మోముల కొంటె నవ్వులన్
  మల్లెల నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో

  రిప్లయితొలగించండి
 2. పెల్లగు పెరిమెను దెచ్చితి
  మల్లె లనిన నాగరాజు, మది రోసెఁ నయో
  యిల్లా లడిగిన నగలను
  పెళ్ళై యిన్నేళ్ళయుఁ గొనిపెట్టని కతమున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   '..యిన్నేళ్ళకుఁ గొనిపెట్టని..' అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 3. అందరికీ నమస్సులు🙏🙏

  *కం||*

  పిల్లడి పెండ్లికి వచ్చిన
  యెల్లరు పలు పూలు తెచ్చి యేవో యనగా
  నల్లగ మాడిన వడలిన
  *"మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో"!!*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏😄🙏

  రిప్లయితొలగించండి
 4. కం//
  చల్లని ప్రొద్దున విచ్చెడి
  నల్లని రేగడి పొలమున నద్భుతరీతిన్ !
  కొల్లలుగా మదిదోచెడి
  మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో !!

  రిప్లయితొలగించండి

 5. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  పల్లెలు పట్నవాసులును పద్యములొల్లి వధానమందునన్
  చల్లగ పిల్చి శాలువలు చక్కగ కప్పగ కాకినాడనున్
  తల్లులు పిల్లలీయగను తట్టల నిండుగ క్రుళ్ళిపోయినన్
  మల్లెల, నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో

  రిప్లయితొలగించండి
 6. అందరికీ నమస్సులు 🙏😊

  *ఉ*

  పిల్లడు పెళ్ళిలో తనను వింతగ జూచిన భార్యనే గనన్
  కల్లని కాపురం తలచి కానక జీవిత ముచ్చటల్ సదా
  చల్లని రాతిరే సతియె చక్కగ రమ్మనె వెన్నెలన్ నహో
  *"మల్లెల నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో"!!*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   వాట్సప్ లో నా వ్యాఖ్య గమనించండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురువు గారు ..
   సవరణలు చేసెదను
   🙏🙏🙇🙇

   తొలగించండి
 7. కం//
  నెల్లడ ప్రియమని జెప్పిరి
  మల్లె లనిన, నాగరాజు మది రోసెఁ నయో !
  నిల్లాలిక రావలదను
  పొల్లగు మాటలు వినగనె బోరున నేడ్చెన్ !!

  రిప్లయితొలగించండి
 8. (అవధానం చేయటానికి వేదికనెక్కబోతున్న నాగరాజకవికి
  ముందుగా చల్లిన మల్లెమొగ్గలు కనిపిస్తే ...?)
  చల్లని పిల్లతెమ్మెరల
  చాడ్పున పాపయశాస్త్రి కావ్యమౌ
  యుల్లము నార్ద్రమున్ సలుపు
  నొప్పగు " పుష్పవిలాప "పద్యముల్
  మెల్లగ గుండె నింపుకొని
  మేలగు నూహల వేది నెక్కుచున్
  మల్లెల - నాగరాజు గని
  మానసమందున రోసె నయ్యయో !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాన్నగారి పుష్పవిలాపాన్ని ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.
   "కావ్యమౌ నుల్లము..."

   తొలగించండి
 9. కల్లకపటము లెరుంగడే !
  మల్లెల నే యిం టి పేర మసలిన వాడే !
  తల్లడిల జేసిరా ! మరి
  మల్లెలనిన నాగరాజు మది రోసెఁ నయో !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   మొదటి పాదంలో గణభంగం. "...లెరుంగడు/డె" అనండి.

   తొలగించండి
 10. మల్లెలుఁజేతజుట్టి మన మారుతి రావుయె నాగరాజునై
  మల్లియ పాత్రలో నటన మానస మందున రాధికమ్మరం
  జిల్లగ నాయకుండు చిరజీవియెనిల్చుచుమెప్పునందగా
  మల్లెల నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 12. ఎల్లలు లేని భక్తిని మహేశుని పూజొనరింప మాలగా

  నల్లిన మల్లెపూల గొని యా గుడికిం జని భక్తులెల్లరున్

  వెల్లువ గాను, కంఠమున వేయగ కొల్లలు భారమౌచు నా

  మల్లెల నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో

  రిప్లయితొలగించండి

 13. చిత్రం సత్పుర వాసికి మల్లెలు నచ్చవా ? తప్పున్నర తప్పండోయ్ :)  అల్లీ బిల్లీ అమ్మా
  యిల్లా రా పద పదండి యింతుల్లారా
  కల్లాకపటంబెరుగడు!
  మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో?  జిలేబి

  రిప్లయితొలగించండి

 14. సత్పుర వాసి నాగరాజు గారికి శుభాకాంక్షలతో


  అనుమానమువలదే పొడ
  గను! మల్లెల నాగరాజు గని! మానసమం
  దున రోసె నయ్య యో నే
  టి నూత్నమగు ప్రక్రియన్? ఘటికులు జిలేబీ !  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. తెల్లని వస్తువుల్ గృహిణి తేవలదంచును జెప్పి బంపినన్
  గొల్లలు మూటగట్టుకొని కోరిక మీరగ వచ్చి దానినిన్
  బల్లను జేర్చు నాథునకు పల్కుము తెచ్చిన దేమియంచనన్
  మల్లె లనాగ, రాజు గని మానసమందున రోసె నయ్యయో.

  రిప్లయితొలగించండి
 16. మల్లెలమధుమాసంబున
  మల్లెలుకొల్లలుగజేర్చిమాలిమిగోరన్,
  చల్లనిమాఱేడురహిత
  మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 17. మల్లీశ్వరి తన ప్రాణము
  మల్లెలవలెతెల్లనైనమనసామెది యా
  మల్లీశ్వరినెడబాయగ
  మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో

  రిప్లయితొలగించండి
 18. మైలవరపు వారి పూరణ

  మల్లెల యింటిపేరితని మాటలుతెల్లని రాజహంసలౌ.,
  నల్లు సుధాసమానమధురామలపద్యము.,లిట్టిచోటు మా....
  కిల్లగునే వసింపగనిసీ! యని కుళ్లుకుతంత్రభావముల్
  మల్లెల నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

  రిప్లయితొలగించండి


 19. భళ్ళున చేరు మా మదన పల్లియ పువ్వులు బెంగుళూరు! హా!
  కల్ల! జిలేబు లార ! పలుకాకులు లోకులు! గాలివార్త! ఆ
  మల్లెల, నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో?
  చెల్లని మాట మీదనుచు చెప్పుట తప్పదు చక్కనమ్మలూ!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. తెల్లని వెన్నెల విరిసెడు
  చల్లని రాతిరి సరసన సరసము లాడన్
  బిల్లది లేదంచు వగచి
  మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో.

  రిప్లయితొలగించండి
 21. మల్లెలు వచ్చెడివేళన
  చెల్లికి పూలజడవేయజేకురపూలన్
  నల్లని ముఖమయెధరలకు
  మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో

  రిప్లయితొలగించండి
 22. పెల్లుగ కవితల నల్లగ
  చల్లిరి మెప్పుగ విరులను సంతోషము గన్
  వెల్లువగా వఛ్చి పడెడు
  మల్లె లని న నాగరాజు మది రోసె న యో !

  రిప్లయితొలగించండి
 23. ఉల్లము వేదన చెందెను
  మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో
  యెల్లరు చెప్పుదురుగదా
  మల్లెల వాసనకు పాము నాట్యంబాడన్

  రిప్లయితొలగించండి
 24. మల్లెలనమ్మెడి నింటన
  పల్లెన చేపలను నమ్మిబస జేయుటకున్
  వల్లయు గాకసువాసన
  మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో

  రిప్లయితొలగించండి
 25. *సవరణలు చేసితిని గురువుగారు..*

  ఒక చూపు చూడ ప్రార్ధన ..😊😀🙏

  పిల్లడు పెళ్ళిలో తనను వింతగ జూచిన భార్యనే గనన్
  కల్లని శోభనమ్ములనె కానక ప్రేమలు మానసంబునే
  చల్లని రాతిరే సతియె చక్కగ రమ్మనె వెన్నెలందునే
  *"మల్లెల నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో"!!*
  🙏🌹🙏

  రిప్లయితొలగించండి
 26. మల్లియ బోలెడి ప్రియసఖి
  మల్లిక నమెరిక వరునిని మనువాడి చనన్
  కల్లోలమవ మది వెతను
  "మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో"

  రిప్లయితొలగించండి
 27. చల్లని వెన్నెలీనెడు నిషద్వరి యందున నేగి, తోటలో
  యుల్లము నందు నిల్చిన మహోన్నత సద్గుణ శీలి పొందుకై
  మెల్లిగ రమ్మటంచు కను మీటుచు పిల్చిన రాక పోయె నా
  మల్లెల నాగరాజు, గని మానసమందున రోసె నయ్యయో.

  రిప్లయితొలగించండి
 28. అల్లాడించె కరోనా
  చిల్లర పనులైన లేక జింతిలుచుండన్
  యిల్లాలికి సిగ ముడిలో
  మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో

  రిప్లయితొలగించండి
 29. సరిజేసితిని గురూజీ 🙏
  కం//
  ఎల్లెడ ప్రియమని జెప్పిరి
  మల్లె లనిన, నాగరాజు మది రోసె నయో !
  యిల్లాలిక రావలదను
  పొల్లగు మాటలు వినగనె బోరున నేడ్చెన్ !!

  రిప్లయితొలగించండి
 30. పల్లెలలో వసించుచును పచ్చని పంటలు పూలతోటలున్
  చల్లని గాలిలోన చక్కని యూహల తేలియాడు, రా గిల్లడు పూలదండకయి గిల్లిన పువ్వుల కన్గొని, వాడినట్టి యా
  మల్లెల, నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో

  రిప్లయితొలగించండి
 31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 32. సంభాషణలలో గ్రామ్యంబు ప్రయోగింపందగు.....
  😄


  పల్లె పడుచు గ్రామ్యములో
  “కల్లెములో పూసినాయి కాదనకయ్యో!
  ఇల్లిదిగో సావీ యీ
  మల్లె” లనిన నాగరాజు మది రోసెఁ నయో

  రిప్లయితొలగించండి
 33. ఇల్లాలుముడుచుకొనునా
  మల్లెలనిననాగరాజుమదిరోసెనయో
  తల్లీతీయుమువాటిని
  నల్లదెయిపుడయ్యెవాంతియావాసనకున్

  రిప్లయితొలగించండి
 34. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః.
  మహోదయులకు శుభోదయం

  నేటి సమస్యాపూరణాల యత్నం -

  తల్లీ! వ్యాపారమిపుడు
  డొల్లే మల్లెలది,నేన టుగనను వాటి
  న్నొల్లని వగువ్యాపారపు
  మల్లెలనిన, నాగరాజు మది రోసెనయో.

  చల్లని కాలమే మనసు జల్లుల కాస్సద మయ్యెనో గదా!
  మెల్లగ మల్లిచెంత తను మోదము తోడను వెళ్ళబూనుచున్
  తల్లడ మొంది దానపుడు దైన్యము నొందెను కుళ్ళిపోయి నా
  మల్లెల, నాగరాజు గని మానసమందున రోసెనయ్యయో.
  -🌺-

  రిప్లయితొలగించండి
 35. రిప్లయిలు
  1. చల్లంగ జాఱు చున్నాఁ
   డిల్లు వదలి కంపు రోఁత యేపారంగం
   బెల్లుగ సంపెఁగలు కలియ
   మల్లె లనిన నాగరాజు మది రోసె నయో


   అల్ల జగమ్మునం దునికి కర్హత యింతయు లేదె యం చహో
   తల్లడ మంది మిక్కుటము తప్త మనస్కులు నై సమీపులుం
   గల్లరు లా మనుష్యులను గాంచఁగ నాగులు, సూడఁ బోలుఁ జు
   మ్మల్లెల నాగరాజు గని, మానసమందున రోసె నయ్యయో

   [నాగరాజు గని = పాముపుట్ట; అల్లె = వింటి నారి]

   తొలగించండి
 36. ఉ:

  ఝల్లన గుండె రద్దు నిడ ఝామగు రాతిరి శోభనమ్మునే
  నిల్లిసి బోవ వాహనము నెంతయు వేడిన లాకుడౌనునన్
  పిల్లను జెర్చ చుక్కెదురు వేదిక నంతయు చిన్నబోవగన్
  మల్లెల నాగరాజు గని మానస మందున రోసె నయ్యయో

  నిలు +ఇసి=నిల్లిసి

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 37. కందం
  ఉల్లము ముదమందెఁ దొలుతఁ
  బిల్లలు విరిదండ నిడ పిపీలికములవే
  మెల్లగ కుట్టఁగ, మాలగ
  మల్లె లనిన నాగరాజు మది రోసెఁనయో

  ఉత్పలమాల
  పిల్లలు దెచ్చు మాలగని వేడుక నయ్యెను దాల్చ ముందటన్
  వల్లె యనంగ వేసిరదె వాసిగ మెచ్చి నుపన్యసించుచున్
  మెల్లగ లోని చీమలవి మీరుచు కుట్టఁగ నొచ్చి దండలో
  మల్లెల నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో


  రిప్లయితొలగించండి
 38. మల్లికసంతసించెనటమామకుమారుడువచ్చెనంచునా
  మల్లెలనాగరాజుగని,మానసమందునరోసెనయ్యయో
  మల్లెలపాదులన్నియునుమాడిమసౌటననెండవేడికిన్
  నుల్లముతల్లడిల్లగుటనోర్వకరంగడుఖేదమొందుచున్

  రిప్లయితొలగించండి
 39. మెల్లగ జారుకునేందుకు
  మల్లెలమధ్యను జురజర మాఱుచు బాకన్
  జిల్లులుబడగను గాన్చిన్
  మల్లెలనిన నాగరాజు మదిరోసెనయా

  రిప్లయితొలగించండి
 40. మల్లెల మాలలై జనుల మైమరపించెడి పద్య మాలికల్
  యల్లుచు నెల్లరన్ రస సుధాంబుధి దేల్చెడి సత్కవీశ్వరున్
  మల్లెల నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో
  ప్రల్లదనంబునెల్లపుడు వాదములాడెడి మచ్చరీడికన్

  రిప్లయితొలగించండి
 41. గురువు గారికి నమస్సులు.
  వల్లీదేవతకిష్ఠము
  మల్లెలనిన,నాగరాజుమదిరోసెనయా
  భల్లూకముతోరణమును
  కల్లాకపటమెరుగనిసుకవికిన్నమస్సుల్.

  రిప్లయితొలగించండి
 42. చివరి పాదము కవికిన్ నమస్సుల్ గా చదువ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 43. అల్లుచు మంచిపద్యముల హాయిగ సంతసమందుచున్న దా
  నెల్లరి గోర్కెమేరనిట నేర్పడజేయ వధానవేడుకన్
  మల్లెల నాగరాజు,గని మానసమందున రోసెనయ్యయో
  ఫెళ్ళున గాయనెండ సెగపెంపుగ సూర్యుడు జ్యేష్ఠమాసమున్

  రిప్లయితొలగించండి
 44. అందరికీ నమస్సులు🙏
  కం"

  కల్లా కపటమెరుగదని
  పెళ్ళాడ, నలిగిన యాలి పిలిచిన రాదే
  చల్లని రాత్రిని చూడన్
  *మల్లెల నిన నాగరాజు మది రోసెనయో!*

  మరో ప్రయత్నం 🙏
  ఉ.మా

  చల్లని రాతి రొంటరిగ చంద్రుని వెన్నెల గాంచగన్ మనం
  బెల్లను ఝల్లనన్, మదిన యిన్చుక జాలియు లేదె యాలికిన్
  కల్లలు చేసెనా కలలు కాపుర మొద్దని పోయినంత నా
  *మల్లెల నాగరాజు గని మానస మందున రోసె నయ్యయో!*

  వాణిశ్రీ నైనాల, హైదరాబాద్

  రిప్లయితొలగించండి