23, మే 2020, శనివారం

సమస్య - 3377

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్"
(లేదా...)
"నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్"

73 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  సాధింపంగ ప్రధానమంత్రి పదవిన్ జంద్యమ్మునున్ దాల్చుచున్
  నాదమ్ముల్ కడుజేసి రచ్చలిడుచున్ నందమ్మునన్ తూలుచున్
  మోదమ్మంతయు కోలు పోవుచునహో మూర్ఖుండ! గగ్గోలుగన్
  రోదింపం దగదంటిరా విను కరోనా బూచినిం బిల్చెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. శార్దూల సమస్యా పాదములో యతిమైత్రి?

   తొలగించండి
  2. అలసట, తొందరపాటు వల్ల జరిగిన పొరపాటు. మన్నించండి. ఇప్పుడు సవరించాను. సవరించిన సమస్యకు అనుకూలంగా మీ పూరణలో స్వల్ప మార్పులు చేయమని మనవి.

   తొలగించండి
  3. 🙏

   మరేమీ పరవా లేదు సార్...మా వాడు దేనికైనా రెడీ:

   ********************************************************************************************************

   దోమల్ గూడను హైద్రబాదునగరిన్ తోరంపుటందమ్ముతో
   జాముల్ జాములు వేచి యుంటిరి గదా సామర్థ్యపుం కన్నియల్
   చాముండేశ్వరి వోలు తల్లినికనున్ సాధించి బాధించకోయ్
   నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్

   తొలగించండి
 2. అందరికీ నమస్సులు 🙏

  *కం||*

  బాధలు మనవని తలచిన
  భాధలు కావవి నెఱుఁగుము వాదింపకనే
  బాధలు నీవని యనుకొని
  *"రోదించినఁ, బిలిచెదను కరోనా బూచిన్"*!!

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మరో సరదా పూరణ 😊😄🙏

   *కం||*

   రోదించిన బిస్కట్లిక
   రోదించిన చాకొలెట్లు దొరుకవు నికపై
   రోదించిన రారెవ్వరు
   *"రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్"*!!

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏😄🙏

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి.
   "కావవి యెఱుగుము..వాదింపకయే"

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  4. మొదటి పద్యం లో *ద, ధ* లకు ప్రాస చెల్లునా గురువుగారూ..!?

   రెండవపద్యంలో *రో* కు *దో* తో యతి కూడా..!!🤔
   తెలుపగలరు..!

   - రాధేశ్యామ్ రుద్రావఝల🙏🙏

   తొలగించండి
  5. మొదటి పద్యం లో *ద, ధ* లకు ప్రాస చెల్లునా గురువుగారూ..!?

   రెండవపద్యంలో *రో* కు *దో* తో యతి కూడా..!!🤔
   తెలుప గలరు.

   - రాధేశ్యామ్ రుద్రావఝల🙏🙏

   తొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  తుఫానుకు ముందు:

  చాదస్తమ్ముగ పోరు సల్పుచునయో జన్యమ్మునందోడుచున్
  క్రోధమ్మున్ దగ సైచ జాలకనయో కుప్పించి వే గంతుచున్
  దీదీ! నీవిక మోడినిన్ కఱచుచున్ తీవ్రమ్ముగా దూఱుచున్
  రోదింపం దగదంటిరా విను కరోనా బూచినిం బిల్చెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ పూరణ మార్చిన సమస్యకు వర్తిస్తుంది. మార్పులు అవసరం లేదు. బాగుంది.

   తొలగించండి
 4. ఆదమరచి నిదురించక
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్
  రాదని తలంతు వేమో
  ఈ దరినే పొంచి యున్న దిప్పుడు నీకై

  రిప్లయితొలగించండి
 5. గోదుమ లర్కలు జొన్నలు
  నాదౌ తృణధాన్యమెప్పు డాహారమునన్
  చేదైనన్ గొను, మథవా
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్

  రిప్లయితొలగించండి
 6. నా దేశమ్మె ధరాగ్ర గ్రామి యని చైనా దేశ భావమ్ముగా

  మోదమ్మన్నది లేక జేయుచది యామోదమ్ము గానట్టి దౌ

  భాధమ్మే కలిగించి దేశములకున్ భాషించె నీరీతిగా

  రోదింపందగ దంటిరా విను కరోనా బూచినిం బిల్చెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. యతి సవరించిన సమస్యకు వర్తిస్తుంది.
   'భాధమ్మే'?

   తొలగించండి


 7. ఆదాము అవ్వ కతలను
  మోదము తో మందసానమునజోగుచు పి
  ల్లా!దా! విను! మాట వినక
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. యతిదోషంతో సమస్య ఇచ్చినందుకు కవిమిత్రులు మన్నించాలి. సవరించాను.

  రిప్లయితొలగించండి
 9. కాదంటివిగా రొట్టెను,

  కాదంటివి‌ నీవు పాలు, కాఫీ నైనన్,

  లేదుర నీకన్నంబున్


  రోదించిన పిలచెదను కరోనా బూచిన్


  జ్వరము పడ్డ సుతుడు అన్నము కొరకు మారాము చేస్తుంటే తల్లి పలుకులు

  రిప్లయితొలగించండి


 10. రా! మాల్గాడియు కూతవెట్టి వెడలెన్ రా పొద్దుపోయేనుర
  మ్మా! మంచమ్మున తొంగుమా కతలతో మై కమ్మగా బుజ్జి! రా
  డ్రామాల్వేయకు! మంచిగానిదుర పోరా చంటి! లేదన్నచో,
  నా మాటల్ వినకుండ నేడ్చిన, కరోనా బూచినిం బిల్చెదన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. తామై పల్కెద రీగతిన్ జగమునన్ దథ్యంబుగా భావినిన్
  ధీమంతుల్ జననుల్ సమస్తజనముల్ తేజోమయుల్ పిల్లలన్
  నీమం బొప్పగ బెంచువారలు "సుతా! నీవిట్లు నిత్యం బిటన్
  నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్"

  రిప్లయితొలగించండి
 12. కం//
  బాధించిన మన్త్రించెద
  నాదుంగలు దొంగిలించి నాపై నిందల్ !
  వాదించవలదు చిన్నా
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్ !!

  రిప్లయితొలగించండి
 13. మాధవునిదల్లి బిలిచియు
  వేధించకదినుము,వచ్చివేడన్నమునిన్
  లేదనిమారాంజేయుచు
  రోదించినఁ, బిలిచెదను కరోనా బూచిన్

  రిప్లయితొలగించండి
 14. వేదన చెందకు తెలిపెద 
  నూదర గొట్టగను తగదు ఓరిమి వలయున్ 
  రోదన మానుము ఇదిగో 
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్  

  రిప్లయితొలగించండి
 15. ఏమే యో కలహాలమారి! బడు లింకేనాడు ప్రారంభమౌ
  నో? మారామును మానకుండ యిటు లయ్యో మమ్ము బాధింతువే!
  యేమో కోర్కెలఁ గోర లాక్డవునులో నేరీతి నేఁ గొందునే?
  నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్

  రిప్లయితొలగించండి
 16. కం//
  వేదన జెందితి కృష్ణా
  సాతానుల బిల్లజెప్పె సాకులనెన్నో !
  కాదనక నోరు దెరువుము
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్ !!

  రిప్లయితొలగించండి
 17. శ్రీమాతాలలితాశివానిపరమై,శ్రీకారసంరంభమై
  నీమారాధితసేవ్యమానకరమై,నీలీలసత్యంబునై,
  నీమారాధనసేయనీనిసుతతోనేనంటికోపంబుతో
  "నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్"
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 18. కం//
  నాదుడ్డులు నాకొసగుము
  లేదని వాదించవలదు లెమ్మిక నీవున్ !
  ఈదినము నేను వెడలెద
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్ !!

  రిప్లయితొలగించండి
 19. *మరో పూరణ*

  రోదనలకు కారణమై
  వేదన బెంచగ జనులిల బేజారయ్యెన్
  కాదిటు లనుటయె తప్పుగ
  *"రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్"*!!

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏😷🙏

  రిప్లయితొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 21. ఖాదమనిన చాలిట్టుల
  ఖేదపడెద వేల? రమ్ము కృపతో తినరా!
  నీ దుడుకు చేష్ట లాపుము
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్

  రిప్లయితొలగించండి
 22. వేదన గూర్చుచు జనులకు
  మోదము లేకుండ జేసె భూగోళము న న్
  ఖేదపు బాలుని తో ననె
  రోదించిన బిలిచెద ను కరోనా బూచి న్

  రిప్లయితొలగించండి
 23. @ 12:30 AM శంకరాభరణం వాట్సపు లో నా పూ'రణము'

  కొంత మద్యాహ్నసమయ నిద్దుర వలనను, రెండునెలలుగా మూగవోయిన కంప్యూటరు సరియయి మిగిలిపోయిన బనులను పూర్తిచేసే క్రమములోనూ నిదుర ఆలస్యమయిన ఈ రాక్షసభ్రమణ కాలమందున....

  అందరికీ ఇదే నా హెచ్చరిక


  నాదగుఁ బద్యం బమృతము
  వాదంబుల నొప్పుకొనను వదలను మిమ్మున్
  మోదంబునె జూపవలెను
  "రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్"

  - విట్టుబాబు

  రిప్లయితొలగించండి
 24. మైలవరపు వారి పూరణ

  *సోమాస్య* అనే పేరుగల కోడలుపిల్ల పోలీస్ స్టేషన్లో ఇలా కంప్లయింట్ ఇచ్చింది.. 😭😭

  నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్!
  సోమాస్యా! వినకున్న నా పలుకు నైసోలేషనిప్పింతు., నే..
  లా? మన్నింపవు నన్ను నిన్నిపుడె క్వారంటైనుకంపింతునన్
  శ్రీ మా అత్తయె యిట్లు నేడు బెదిరించెన్! మీరె దిక్కయ్యరో!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 25. కాదంచు నేదిచేప్పిన
  వాదనలును చేయుదీవు వదలక పట్టున్
  నాదు వచనములను వినక
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్

  రిప్లయితొలగించండి
 26. కాదనకపెట్టినదితిను
  వేదన పెట్టకవినినచొ వేడుకనాకున్
  కాదూలేదనినీవన
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్

  రిప్లయితొలగించండి
 27. ఏమే కావరమా సతమ్ము నిట నీయిచ్చన్ ప్రవర్తించుచున్
  సామమ్మౌగతి చెప్పు నానుడులకున్ శత్రుత్వమున్ జూపి నీ
  క్షేమమ్మున్ మదిలో తలంచు ప్రజ నాక్షేపించుచున్ నిత్యమున్
  నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్


  రిప్లయితొలగించండి
 28. లేదిందేమియు ఫలమిటు
  రోదించినఁ, బిలిచెదను కరోనా బూచిన్
  ఛేదింపగ వైద్యునిటకు
  వాదింపకు మతని దోడ వాడుము మందున్

  రిప్లయితొలగించండి
 29. నీ మూర్ఖత్వము హద్దుమీరె గదరా నేతాళ లేకుంటి, నీ
  క్షేమంబెప్పుడు గోరుదాననిదిగో క్షీరంబునే గ్రోలు, నీ
  వామౌనమ్మును వీడమంచునొక దెబ్బన్ వేయుచున్ బల్కెనే
  నామాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్.

  రిప్లయితొలగించండి
 30. గురువు గారికి నమస్సులు.
  హ్లాదంబు లేక మనుజులు
  రోదించినబిలిచెదనుకరోనబూచిన్
  చాదస్తపుమొగుడేగద
  బాదరబందీలటంచుబావురమనియెన్.

  రిప్లయితొలగించండి
 31. మోమాటమ్మిక లేక జెప్పెదను నీ మూర్ఖత్వమున్ మానకన్
  భూమాతన్ నను జీవ జాలముల నీ భోగంబుకై వేల్చుటన్
  కామాటమ్మది వీడుమోయి నరుడా గారుణ్యమున్ నేర్వుమన్
  నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్

  రిప్లయితొలగించండి
 32. వాదనజేయకతినుమా
  కాదనిమారాముజేయగాదిలిలేకన్
  బాదుడునినునేనిప్పుడు
  రోదించినబిలిచెదనుకరోనాబూచిన్

  రిప్లయితొలగించండి
 33. వేధించు నివ్విధి కరొన
  శోధించగ చేసె మేళ్ళు,శోకించెడు బి
  డ్డన్ దల్లి యాపను బలుక
  'రోదించిన బిలిచెదను కరోనా బూచిన్!'

  రిప్లయితొలగించండి
 34. ద,ధ ప్రాస విషయము ఒక పాదంలో ద బదులు ధ వేసుకోవచ్చు అది అవకాశంమాత్రమే

  రిప్లయితొలగించండి
 35. పోదము వూరికి ననుచును
  వాదము చేయుట వలదుగ బాలా!వినుమా !
  ఖేదముతో తిండి తినక
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్"

  రిప్లయితొలగించండి
 36. రోదన పసిబిడ్డదనిన
  మోదముగలిగించుఁగాదెఁ బుట్టిన నాటన్,
  గాదన యెదిఁగిన మనుమల
  "రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్"
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 37. కాదన్న పనులు సేయఁగ
  మేదినిఁ దల్లులకు వరము మీరన్నట్టుల్
  హా దొరకెన్ మంత్ర మిపుడు
  రోదించినఁ బిలిచెదను గరోనా బూచిన్


  ఈ మా మానవజాతి ముంచెను గదా యియ్యెగ్గు రాకాసి మా
  భూమిం జేరి పరాక్రమించి నిలిచెం బో మృత్యు రూపమ్మునన్
  నీ మాయల్ వల దింకఁ బొమ్మనఁగ, దానిం జంపు మో దైవమా,
  నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్

  [వెడలనని యేడ్చిన కరోనా బూచి]

  రిప్లయితొలగించండి
 38. వైఎస్ ఆర్ జిల్లా బద్వేలు లో జరిగిన వాస్తవ ఘటన నుటంకిస్తూ తల్లి తమ పిల్ల లిద్దరికీ భయం పెట్టే సందర్భం ....

  కందం
  వాదించి రిమోటు కొరకు
  వేదనతో కన్నుమూసె ప్రియ సోదరియే
  యా దిశలో మీరిద్దరు
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్


  శార్దూలవిక్రీడితము
  నా మాటెంచి రిమోటు నీయుమనగన్ నాదంటె నాదంచుఁ దా
  నామాటన్ వినకుండ నక్కగొనఁ బ్రాణాలన్ విడెన్ చెల్లియే
  ప్రేమంజూపుచు సర్దుకొన్న ప్రియమౌ, వేదించి యామాదిరిన్
  నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్

  రిప్లయితొలగించండి
 39. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నామాటల్వినకుండనేడ్చినకరోనాబూచినింబిల్చెదన్
   నేమీమాటలుబల్కుచుంటిరియహాయిట్లంటిరేమీవెసన్
   మీమాటల్వినకుండయుండిననహోపిల్పింతురాయాకరోన్
   నమ్ముండిప్పుడువిందుమాటనునికన్ నామామమీదొట్టుగా

   తొలగించండి
 40. మిత్రులందఱకు నమస్సులు!

  [తన మామిడిపండ్లను తమ్ముఁడు తిన్నాఁడని మారాము చేయుచున్న కూఁతురు ననునయించుచుఁ దల్లి పలికిన మాటలు]

  "నా మామిండ్లను దమ్ముఁ డిప్డు తినియెన్! నా కద్దియే కావలెన్
  మా!" మంచుం దనకూఁతు రేడ్చి మిగులన్ మారామిడం, దల్లి, "గా
  రామున్ మానియు, బుద్ధిగా మెలఁగుచో, ఫ్రాక్ కొందు! నీ విట్టులే,

  నా మాటల్ వినకుండ నేడ్చినఁ, ’గరోనా బూచి’నిం బిల్చెదన్!"

  రిప్లయితొలగించండి
 41. ఖేదము నిచ్చెడిదానిని
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్,
  వేదన నిచ్చెడిపాదము
  పాదములకు మధ్యనుండ భావ్యముగాదే

  రిప్లయితొలగించండి
 42. మోదమున నా నుడుల నా
  మోదించక వేదన నిడ మూర్ఖము తోడన్
  వాదించగ, నీ వెంతయు
  రోదించిన బిల్చెదను కరోనా బూచిన్!
  (కరోనా లాక్ డౌన్ సందర్బంగా ఇంట్లో జరిగే సరదా బెదిరింపులు,వాగ్వివాదాలు)

  రిప్లయితొలగించండి
 43. బాధలు బెట్టకు బిడ్డా!
  నాదేహమునలసిబోయె నన్నునుగనుమా
  వేధించకనిక(బడుకో
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్

  రిప్లయితొలగించండి
 44. వాదనలాడకబుద్ధిగ
  చేదని మారామునిటులజేయకనిపుడే
  కాదనుచు మాత్ర మ్రింగక
  రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్

  రిప్లయితొలగించండి
 45. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 46. శా:

  భామా! చూడుము చంటిపాప నిటుగా పారాడ నారాటమున్
  యేమా చూపులు బిత్తరిన్ వణకుచున్ యేమేమొ మాటాడుచు
  న్నేమార్చన్ వెనువెంట నేడ్చ నికపై నేరీతి వారింపనో
  నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిన్ బిల్చెదన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 47. మోదముమీరగ దినరా
  వాదించక యమ్మతోను పాలన్నమునే
  కాదని పేచీపెట్టుచు
  రోదించిన బిల్చెదను కరోనా బూచిన్

  ప్రతి పెళ్ళికొడుక్కీ వంకలుపెట్టే కూతురితో తల్లిఘోష

  సామీరా వినవే! పరాకుదగునా? సాతాను వైనావుగా!
  యేమేమీ? విసిగించు చుంటిననుచు న్నేమేమొ మాట్లాడెదే?
  ఈమారైనను మేముచూచిన వరున్నిబ్బంది పాల్జేయకే
  నామాటనా వినకుండ నేడ్చిన కరోనాబూచినిం బిల్చెదన్ !

  రిప్లయితొలగించండి
 48. ఏమా తొందరపాటు భూతలమునన్ యేపార నీకోవిడే
  మా!మా! మందు దుకాణముల్తె రవగా మాప్రాణముల్నిల్చునే
  మామా వెంటనె మూసివేయు నటులన్ మాటిచ్చి కాపాడుమా
  నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్.

  మా!మా!-cease, stop (వద్దు)

  రిప్లయితొలగించండి 49. కం:రోదించక మాట వినుము
  కాదంచును గోల చేయ గ్రక్కున వచ్చున్
  నీదరి కది వేగముగా
  *రోదించిన బిలిచెదను కరోనా బూచిన్.*

  మరొక పూరణ

  కం:ఏదిచ్చిన కాదనకయు
  మోదముతోనది తినవలె ముందుగ పాపా
  మోదను తిట్టను నికపై
  *రోదించిన బిలిచెదను కరోనా బూచిన్*.

  రిప్లయితొలగించండి
 50. "రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్"

  బోధలనల్లరిమానడె
  రాదేకుదురనిజననియుప్రహరించెస్వజున్
  వేదనపడగద్దించెను
  "రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్"

  ------ఓలేటి వేంకట బంగారేశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 51. ఏమామూర్ఖత యెంతచెప్పిననునీవేమాత్రమున్ లొంగవే
  నీమేనంతయు ధూళిదూసరితమౌ నీ యాటలింకేలరా
  నీమారామునుమానుమింక భడవా నీయేడ్పు చాలించుమా
  నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్

  రిప్లయితొలగించండి
 52. శోధించిన గని పించదు
  వేదించును వచ్చెనంటె వీడదుమనలన్
  బాధింపకు బలుకుచు నిటు
  "రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్"

  రిప్లయితొలగించండి