16, మే 2020, శనివారం

సమస్య - 3370

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దారులం గొట్ట నేర్పె నాధ్యాత్మబోధ"
(లేదా...)
"దారుల్ గొట్టుట నేర్చినాఁడు విని యాధ్యాత్మప్రబోధమ్ములన్"

96 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  దారుల్ తెన్నులు కానరాక బుధుడే దైన్యమ్మునన్ వేడగా
  రారా! నాకడనంచు ప్రీతి గొనుచున్ రమ్యంపు నాచార్యుడే
  చేరన్ దీయుచు వేద శాస్త్రములనున్ చెప్పంగ; మోక్షమ్ముకై
  దారుల్ గొట్టుట నేర్చినాఁడు విని యాధ్యాత్మప్రబోధమ్ములన్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  దారిన్ బోయెడు యోగినాపుచునహో దైన్యమ్మునన్ జూచుచున్
  కారాగారము వీడి బైటపడెడిన్ ఖైదీయుడర్జంటుగా
  బీరుల్ గానక హైద్రబాదునగరిన్ భీష్మించి వేడంగ వే
  దారుల్ గొట్టుట నేర్చినాఁడు విని యాధ్యాత్మప్రబోధమ్ములన్

  దారు : తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010
  సారాయి

  రిప్లయితొలగించండి
 3. ఆలుబిడ్డల పోషించు నవసరమ్ము
  దారులం గొట్ట నేర్పె, నాధ్యాత్మబోధ
  వడసి ఋషిగణకృపచేత, పావనుడయె
  బోయ వాల్మీకి వ్రాసి రామాయణమ్ము!

  రిప్లయితొలగించండి
 4. చేరన్ దీయుచు శిష్యునిన్ గురువిటుల్ జెప్పంగ వాల్మీకి దా
  దారుల్ గొట్టుట వీడినాడు విని యాధ్యాత్మప్రబోధమ్మునన్
  పోరండే శ్రుతిలేక పల్కెనిటు లప్పుణ్యాత్ము డాకానలన్
  దారుల్ గొట్టుట నేర్చినాడు విని యాధ్యాత్మప్రబోధమ్మునన్

  రిప్లయితొలగించండి
 5. మహోదయులకు నమస్సులతో,
  శుభోదయం.

  నేటి పద్యపూరణ ప్రయత్నం-

  కలకలము సంభవించె పోగాల మేమొ!
  యనుచు దిక్కులు తెలియక యంగలార్చు
  నరుల కోమునీంద్రుడు వారి గురువుగ చెడు
  దారులం గొట్ట నేర్పె నధ్యాత్మ బొధ
  -

  రిప్లయితొలగించండి
 6. మహోదయా! నమస్సులతో,

  నేటి రెండవ పద్యపూరణాయత్నం-

  దారాపుత్రుల పోషణార్థమున తా దారుల్లొ బోయేటి యా
  శ్రీ రామామృతపాన చిత్తుల ఋషీ క్షేమంబు కడ్డంబుగా
  జేరంగన్ మదిజ్యోతి భాతి గతిమా ర్చేయంగ యజ్ఞాన మౌ
  దారుల్ గొట్టుట నేర్చినాడు విని యధ్యాత్మప్రబోధమ్ములన్
  -🌹-

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దారుల్లో బోయేటి... మార్చేయంగ' అన్నవి వ్యావహారికాలు. 'ఋషిక్షేమంబు' అనండి.

   తొలగించండి
  2. మహోదయా! నమస్సులతో,
   స్వీకృతం.ధన్యోస్మి.

   తొలగించండి
  3. వ్యావహారికములను సవరించానాని
   అనుకుంటూ....

   మహోదయా! నమస్సులతో,

   నేటి రెండవ పద్యపూరణాయత్నం-

   దారాపుత్రుల పోషణార్థమున తా దారిన్ దయాహీను డై
   శ్రీ రామామృతపాన చిత్తుల ఋషి క్షేమంబు కడ్డంబుగా
   జేరంగన్ మదిజ్యోతి భాతి గతికిం జేగీయు డజ్ఞాన మౌ
   దారుల్ గొట్టుట నేర్చినాడు విని యధ్యాత్మప్రబోధమ్ములన్
   -🌹-

   తొలగించండి
  4. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. (ఆధ్యాత్మప్రబోధములు వినకముందు - విన్నతరవాత)
  కారుంగూతల బోయకున్ గలవు దు
  ష్కర్మల్ -విదారించుటల్ ;
  కారాకూరపు జేష్టలున్ ;వికటతల్ ;
  క్రౌర్యాట్టహాసంబులున్ ;
  దారుల్ గొట్టుట ; నేర్చినాడు విని యా
  ధ్యాత్మప్రబోధమ్ములన్
  దారాపుత్రుల బంధమే విడిచియున్
  దానయ్యె వాల్మీకిగన్ .
  (విదారించుట - చీల్చివేయుట ;కారాకూరపు - క్షోభపెట్టు)

  రిప్లయితొలగించండి
 8. ప్రజలు మెచ్చునట్లుగ పరిపాలనమును
  జరుపుదురని యెన్నుకొన రాజ్యాంగ మంత
  దోసిరాజని నేతలుద్రొక్కు చెడ్డ
  దారులం గొట్ట నేర్పె నాధ్యాత్మబోధ

  రిప్లయితొలగించండి
 9. తే.గీ//
  రామ చరితను రచియించ రక్తిగట్టె
  తొల్లి అజ్ఞాన మలరించ మెల్లగాను !
  బోయవానిని దరిచేరి పోరుబెట్టి
  దారులం గొట్ట నేర్పె నాధ్యాత్మబోధ !!

  రిప్లయితొలగించండి


 10. కలడు ప్రభువుమ నుజులను ఖండితముగ
  లెక్క లడుగును శిక్షించి! లెస్సగాను
  కనుల తెరిపించెను, మనల కాచెను చెడు
  దారులం గొట్ట నేర్పె నాధ్యాత్మబోధ!  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. నారదుని బోధ మనసున నాటుకొనగ
  బోయ వాల్మీకి యయ్యె సంపూజ్యముగను
  రాము గాధను పల్కె చిరాయువుగను
  దారులం గొట్ట నేర్పె నాధ్యాత్మ బోధ.

  రిప్లయితొలగించండి


 12. కందగీతి


  విను! చెడ్డ దారులం గొ
  ట్ట నేర్పె నాధ్యాత్మబోధ టవళిని వీడం
  గ నరులు సన్మార్గమ్మున
  మననము చేయగ ప్రభువును మనసావాచా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. ఆరత్నాకర నామధేయుడట భార్యా పోషణార్థమ్ము సం

  సారంబీదగ బాధ్యతాన్వితుడుగా
  చౌర్యమ్ము నాశించియున్

  దారుల్ గొట్టుట నేర్చినాఁడు, విని యాధ్యాత్మప్రబోధమ్ములన్

  ఘోరారణ్యములోన నారదునిచే క్రూరాత్మడే మారెగా!

  రిప్లయితొలగించండి


 14. చేరెన్ కూటమి కల్లరీడుల సదా చివ్వాడె దుర్మార్గుడై
  వారింపంగ హితుండు లేక లటుడై వాంఛించుచున్ దస్కమున్
  దారుల్ గొట్టుట నేర్చినాఁడు; విని యాధ్యాత్మప్రబోధమ్ములన్
  మారెన్ బుద్ధి మనస్సు లీనమయె రామాయంచు ధ్యానమ్ములో !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. చోరుండైయడవిన్చరించుసుజనస్తోమమ్ముభీతిల్లగా
  "దారుల్ గొట్టుటనేర్చినాఁడు,వినియాధ్యాత్మప్రబోధమ్ములన్"
  వైరాగ్యంబునుచెంది నారదునివాగ్వైచిత్ర్యమున్ శ్లోక్యుడై
  శ్రీరామాయణమున్ రచించెపరమశ్రేయస్సు వాల్మీకియున్

  రిప్లయితొలగించండి
 16. మౌనివరులను పట్టెను మూర్ఖుడగుచు 
  వారి వద్దను వానికి దొరకదేమి 
  కాని తెలిసెను సత్యము, దాన ముక్తి 
  దారులం గొట్ట నేర్పె నాధ్యాత్మబోధ 

  రిప్లయితొలగించండి
 17. బందిపోటుగనిన్నాళ్ళు బ్రతికితాను
  దారులంగొట్టనేర్పెనాధ్యాత్మబోధ
  ఒక్కదినమునవిననొకయోగినోట
  నడత సక్రమమాయెను నాటినుండి

  రిప్లయితొలగించండి
 18. డా. బల్లూరి ఉమాదేవి  నేర్చి నట్టి సువిద్యల నేర్పు వలన
  జ్ఞాన ముద్భవించిన యంత జవము గాను
  జ్ఞాన రహితము లైనట్టి గాఢపు పెడ
  *దారులంగొట్టనేర్పె! నాధ్యాత్మ బోధ!*

  రిప్లయితొలగించండి
 19. త్రోవలంగాచి దోచెడు ధూర్తుడైన
  గుడుల దేవుళ్ళ నగలను గూడ వొలుచు
  వాడు, గొల్చును మమ్ముగా పాడు మనుచు
  దారులం గొట్ట నేర్పె నాధ్యాత్మబోధ!!

  రిప్లయితొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 21. మైలవరపు వారి పూరణ

  ప్రారంభింపగ క్రొత్తజీవితము ధైర్యాంతఃప్రవృత్తిన్ ఖలుం...
  డారంభించి., మదమ్ము గెల్చుట., ధనాన్యాయార్జనంబాపుటన్
  క్రూరత్వమ్మును వీడుటన్., మదిని సంకోచింపకే మానుటన్
  దారుల్ గొట్టుట., నేర్చినాడు విని యధ్యాత్మప్రబోధమ్ములన్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. స్వామి పత్రీజి పిరమిడ్ప్రభావమునను
  ఆంతరంగికషడ్వర్గమంతమైన
  భవ్యభవరోగహరమనిపాడుమోడు
  దారులంగొట్టనేర్పెనాధ్యాత్మబోధ

  రిప్లయితొలగించండి
 24. శ్రీరంజిల్లగఁగర్షకుండుమనయార్షేయంబువీక్షించుచున్
  గోరక్షామయదీక్షబూనినరయన్ గోక్షీర స స్యంబన
  న్సారోదారసితప్రభామయమునౌనన్నంబుగూర్పంగఁగే
  దారుల్ గొట్టుటనేర్చినాఁడువిని యాధ్యాత్మప్రబోధమ్ములన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 25. ఆలు బిడ్డల పోషణమ్మదియె గాదె
  దారులం గొట్ట నేర్పె, నాధ్యాత్మ బోధ
  జీవితమె బుద్బుదమ్మని చెప్పెనంచు
  ముక్తి గోరుచు భవబంధములను వీడె.

  రిప్లయితొలగించండి
 26. పెళ్ళివారలునడవినవెళ్ళువేళ
  దొంగలేతెంచినగలన్నిదోచుగొనగ
  దారులం గొట్ట నేర్పె, నాధ్యాత్మబోధ
  పెద్దవారలు భాషించ,వెడలెవదిలి

  రిప్లయితొలగించండి
 27. దార పుత్రాదుల కొరకు దారుణముగ
  దారులం గొట్టనేర్చె;నాధ్యాత్మబోధ
  మారి రామనామ మహిమ నారి సీత
  చరిత వ్రాసి ధన్యుండయె కరకుబోయ!

  రిప్లయితొలగించండి

 28. * శంకరాభరణం వేదిక *
  16/05/2020 ...శనివారం

  సమస్య
  ********

  దారుల్ గొట్టుట నేర్చినాఁడు విని యాధ్యాత్మప్రబోధమ్ములన్

  నా పూరణ. శార్ధూలము
  **** **** ***

  ( క్రమాలంకార పూరణ... )

  దారన్ బుత్రుల పోషణమ్మె తనదౌ ధర్మంబుగా నెంచుచున్

  నేరంబౌనని హృత్తు దల్చక సదా నీచంగ వాల్మీకియే..,

  దూరంబై యిహ బంధు కోటికి నరెంద్రుండయ్యె దా యోగిగా

  దారుల్ గొట్టుట నేర్చినాడు , విని యాధ్యాత్మప్రబోధమ్ములన్

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నీచంగ' అనడం వ్యావహారికం.

   తొలగించండి
 29. తొలుత వాల్మీకు వృత్తియె దోచుకొనుట
  దారులంగొట్ట; నేర్పె నాధ్యాత్మ బోధ
  నారదుడు,కావ్య రామాయణమును పలికె
  యెవరి జీవితమేమౌను యెరుగలేము.

  రిప్లయితొలగించండి
 30. శాశ్వతంబైన జీవన సత్యములును
  వర్తనంబున మార్పుతో భక్తి పెంచి
  ముక్తి గోరుచు తపియించు మూ ఢ పు చెడు
  దారులం గొట్ట నేర్పె నాధ్యాత్మ బోధ

  రిప్లయితొలగించండి
 31. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అపహరింత వృత్తి నడవి నభిచరించు
  బోయవానిని నారదముని వరుండు
  రామకథను బల్కు కవిగ రాణజేసె
  దారులం గొట్ట నేర్పె నాధ్యాత్మ బోధ.

  రిప్లయితొలగించండి
 32. చంచలము మది కోతియే చపలబుధ్ధి
  నొక్కచోట నుండ దెపుడు, తిక్కగలిగి
  ధ్యానమందు స్థిరంబుగ ధ్యాస నిలుప
  దారులం గొట్ట నేర్పె నాధ్యాత్మబోధ

  రిప్లయితొలగించండి
 33. భారంబయ్యెను! గోరు సౌఖ్యములువే పంచేద్రియమ్ముల్ కటా!
  వైరుల్ రామయ! నిన్నుజేర నరిషడ్వర్గమ్ము లడ్డమ్ములా
  ప్రారంభించితి శ్రోతనైతి వినగా భాగ్యమ్ము నీగాథ *లై*
  *దారుల్ గొట్టుట నేర్చినాడ విని యాధ్యాత్మప్రబోధమ్ములన్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 34. దారులంగొట్టనేర్పెనాధ్యాత్మబోధ
  దారులంగొట్టనేర్పదాధ్యాత్మబోధ
  యెక్కడోపొరబడితిరియిందుగురిచి
  తమినినేర్పునుమంచినాధ్యాత్మవిద్య

  రిప్లయితొలగించండి

 35. * శంకరాభరణం వేదిక *
  16/05/2020 ...శనివారం

  సమస్య
  ********

  దారుల్ గొట్టుట నేర్చినాఁడు విని యాధ్యాత్మప్రబోధమ్ములన్

  నా పూరణ. శార్ధూలము
  **** **** ***

  ( క్రమాలంకార పూరణ... )

  దారన్ బుత్రుల పోషణమ్మె తనదౌ ధర్మంబుగా నెంచుచున్

  నేరంబౌనని హృత్తునన్ దలచకే నిత్యమ్ము వాల్మీకియే..,

  దూరంబై యిహ బంధు కోటికి నరెంద్రుండయ్యె దా యోగిగా

  దారుల్ గొట్టుట నేర్చినాడు , విని యాధ్యాత్మప్రబోధమ్ములన్

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 36. భారంబయ్యె కుటుంబ పోషణము సంపాదించు మార్గంబదే
  దూరంబయ్యెనటంచు మూర్ఖ సఖుడౌ దుర్మార్గునిన్ గూడుచున్
  దారుల్ గొట్టుట నేర్చినాఁడు, విని యాధ్యాత్మప్రబోధమ్ములన్
  వైరాగ్యమ్మును పొందినారిరువురున్ వార్థక్యమే చేరగన్.

  రిప్లయితొలగించండి
 37. తేటగీతి
  పంచుకొనరు దారాసుతుల్ పాపమనుటఁ
  దెలిపి రత్నాకరునకంత, దివ్య రామ
  గాథ వ్రాయ, నధర్మముఁ గాన మాన్పి
  దారులం గొట్ట, నేర్పె నాధ్యాత్మబోధ

  శార్దూలవిక్రీడితము
  దారాపుత్రుల పోషణమ్మునకు నీ దారెంచ, నొప్పింతువా
  వారీ పాపము మోయనొప్పననగన్, వారల్ విభేదించితే
  నా రత్నాకరుఁ డెంచె రామకథ వ్రాయన్, వీడి హేయమ్మునౌ
  దారుల్ గొట్టుట, నేర్చినాఁడు విని యాధ్యాత్మప్రబోధమ్ములన్

  రిప్లయితొలగించండి
 38. నేరంబుల్ సతతంబొనర్చుచునుతానెవ్వారికిన్ జంకకన్
  ఘోరంబైనవిధంబుగాబ్రతుకు నాక్రూరుండు ధన్యా
  త్ముడై
  మారెన్ యోగివరేణ్యుభాషణమునన్, మానెన్ దయా హీనమౌ
  దారుల్ గొట్టుట, నేర్చినాఁడు విని యాధ్యాత్మ ప్రబోధమ్ములన్
  తీరున్తెన్నును సత్ప్రవర్తనములన్ దివ్యంపు సచ్చీలమున్.

  రిప్లయితొలగించండి
 39. రిప్లయిలు
  1. సత్వగుణ మది యలవడఁ జారుతరము
   వేగ క్షీణమై యుండ రజో గుణమ్మ
   హీన దుస్సహ నిజ తామ సేంద్రియముల
   దారులం గొట్ట నేర్పె నధ్యాత్మబోధ


   దారల్ పుత్ర ధనాదు లందుఁ దమి నిర్దాక్షిణ్య చిత్తమ్మునం
   దా రీదంగ భవాబ్ధి రౌరవమునం దాపంబు నిక్కంబు నా
   నారాటమ్ము మదిం జెలంగ వర వేదాధ్వమ్ము, వే వీడి తా
   దారుల్ గొట్టుట, నేర్చినాఁడు విని యధ్యాత్మప్రబోధమ్ములన్

   తొలగించండి
 40. గురువు గారికి నమస్సులు.
  పరులసొమ్మునాశించుటపాపమనిన
  నట్టిసూక్తినిపరిహసమాడెనొకడు
  మంచిదారినివిడిచినమగని చోర
  దారులoగొట్టనేర్పెనాధ్యాత్మబోధ

  రిప్లయితొలగించండి
 41. శా:
  ఆరాతీయుచు నెంచసాగె నిధి సంపాధింప నోపాయముల్
  వీరావేశము పొంగ కూడె నడవుల్ బిందమ్ము సృష్టింపగన్
  కారాగారము జేరినంత కల సాకారంబు గావింప వే
  దారుల్ గొట్టుట నేర్చినాడు విని యాధ్యాత్మప్రబోధమ్ములన్

  బిందము=ఉపద్రవము

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 42. జారెన్ గన్నుల బాష్పముల్ గనగ నా శాకుంతముల్ గూలగా
  మారెన్ మానెను వ్యాధ జీవనము దుర్మార్గంబులన్ మానెనా
  దారుల్ గొట్టుట; నేర్చినాఁడు విని యాధ్యాత్మప్రబోధమ్ములన్
  శ్రీ రామాయణ దివ్య కావ్య రచనా శ్రీకారమున్ జేసెనే

  రిప్లయితొలగించండి
 43. దారుల్గొట్టుటనేర్పినాడువినియాధ్యాత్మప్రబోధమ్ములన్
  దారుల్గొట్టుటవీడినాడువినియాధ్యాత్మప్రబోధమ్ములన్
  గారాకూరపుబోయవాడటమదిన్గాకుస్ధునామంబుతో
  బారంబొందెడుకావ్యసంపదనునేపారంగనిచ్చెన్గదా

  రిప్లయితొలగించండి
 44. అందరికీ నమస్సులు 🙏🙏

  నా పూరణ ప్రయత్నం 🙏

  *తే గీ*

  సంపదలొసగంగన్ పలు సౌఖ్యములను
  స్వచ్ఛ మనసుకలిగి సంతసమున, తాను
  దానధర్మములన్చేయ ధన్య మోక్ష
  *"దారులం గొట్ట నేర్పె నాధ్యాత్మబోధ"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌸🙏🌸🙏

  రిప్లయితొలగించండి
 45. మిత్రులందఱకు నమస్సులు!

  చేరన్ వచ్చు ప్రయాణికుల్ పదములన్ శీఘ్రమ్ముగాఁ బట్టినన్
  వారింపంగను బోక, కొల్లగొను నా వాల్మీకి, దేవర్షియే,
  "వారల్ దైవ నియోగ రూపు" లని చెప్పం, దాను వే మానియున్
  దారుల్ గొట్టుట, నేర్చినాఁడు విని, యాధ్యాత్మప్రబోధమ్ములన్!

  రిప్లయితొలగించండి

 46. శంకరాభరణం గ్రూప్ వారి సమస్య
  *దారులంగొట్టనేర్పె! నాధ్యాత్మ బోధ!*
  నా పూరణము
  నేరేళ్ళ వేణుగోపాలాచార్య....

  సైంధవుని జంప జేసెను చక్ర బోధ
  వీర భగదత్తు నుసిజేసె విష్ణు బోధ
  మాధవుడు కిరీటికి రణమందు కక్షి
  *దారులంగొట్టనేర్పె! నాధ్యాత్మ బోధ!*

  రిప్లయితొలగించండి
 47. శంకరాభరణం అవధాన సంకలనంలో నేనేవిధమైన పాత్ర పోషించ గలనో ఆజ్ఞాపించండి... గురువర్యా....

  రిప్లయితొలగించండి
 48. సారాచార విచార భావనల సౌజన్యాత్మ సంపత్తికై
  ఘోరాజ్ఞాన విమోహ వల్లరిని సద్గోష్ఠీ కుఠారంబుచే
  ధీరత్వంబున ద్రుంచు మన్న మనసాధీనాత్మ వైరాగ్యమన్
  దారుల్ గొట్టుట నేర్చినాఁడు విని యాధ్యాత్మప్రబోధమ్ములన్

  రిప్లయితొలగించండి
 49. తే: నీదుపాప ఫలమ్మది నీకెదక్కు
  పుణ్యఫలమును భార్యయు పొందుననుచు
  పండితుండొకడు తెలప పథమున, విడ
  దారులం గొట్ట నేర్పె, నాధ్యాత్మబోధ

  రిప్లయితొలగించండి
 50. నేరమ్ముల్ పలు చేయుచున్ పథములన్ నిర్భీతితోనిత్యమున్
  క్రూరత్వమ్మున త్రాగుచున్ చనెడికంకుండర్థి వేవీడి యా
  దారుల్ గొట్టుట, నేర్చినాఁడు విని యాధ్యాత్మప్రబోధమ్ములన్
  దారిన్ జూపగ మౌని రాము చరితన్ తావ్రాసె కబ్బమ్ముగా

  రిప్లయితొలగించండి
 51. పారద్రోలుకరోనానుభరణినుండి
  పార్వతీ!విష్ణుపత్నివైభద్రమిడుము
  సాధ్వి!రాధమ్మనీవయేశరణుమాకు
  సితమనంబుననిరతముసేవజేతు

  రిప్లయితొలగించండి