29, మే 2020, శుక్రవారం

సమస్య - 3383

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట"
(లేదా...)
"పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా"

58 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  నచ్చక పిచ్చివేషములు నందము నొందక జంద్యమూనుటన్
  నెచ్చెలి యౌచు భ్రాతకిక నేరుపు చూపగ రాజనీతినిన్
  రచ్చను జేసి కాంగ్రెసున రమ్యముగాదిగి యూ.పి. నేతగా
  పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా

  రిప్లయితొలగించండి
 2. (పుట్టుమచ్చల నమ్మకపు క్రొత్తపెండ్లికొడుకు తన స్నేహితునితో )
  మెచ్చితి నొక్క కన్నియను ;
  మెండుగ నూహల పల్లకి నూగితిన్ ;
  మచ్చయె మానినీమణికి
  మానితమంజులకీర్తిదాయియున్ ;
  నచ్చితి నేను మామకును ;
  నాణెపుబెండిలి యయ్యె ;స్వర్ణపుం
  బిచ్చుక- కోటిరూప్యముల
  వేగముగా సమకూర్చె నద్దిరా !!

  రిప్లయితొలగించండి
 3. అందరి బతుకు తెలిపెద నంచు తనను
  బ్రోచువాడు జూపిన పొత్తములను దీసి
  నడి బజారున జనుల నానంద బరచి
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట

  రిప్లయితొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కలియుగ భాగవతము:

  నచ్చక ఖేదనమ్మునిక నమ్ముచు బాల్యపు స్నేహమాదటన్
  రచ్చను జేసి కేకలిడి లాభము లేదుర నీవటంచు తా
  ముచ్చట మీర ద్వారకకు పూరుషు పంపుచు మూటతోడనున్
  పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా

  రిప్లయితొలగించండి


 5. చినిగి నట్టి కోటు జతను జిడ్డు ముఖము
  వాడు చూడగా కనబడు బక్క గాను
  కోటి రూప్యముల్ సమ కూర్చె మేటి పిట్ట
  ల దొర వేటలాడుచు సుమా లబ్జు గాను  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. సంప్రదాయపు సంక్రాంతి సంబరాల
  కోడిపందెము లాడగ కూడి జనులు
  పోరులో యజమానికిఁ బూన్చి జయము
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటిపిట్ట

  రిప్లయితొలగించండి


 7. కందోత్పల దలాలు స్ట్రీట్ పిచ్చుక :)


  అమరెను బజారులో న
  మ్ముమ! పిచ్చుక కోటిరూప్యముల వేగముగా
  సమకూర్చె నద్ది రా ఘన
  త, మన జిలేబమ్మదేను తర్ఫీదు సుమా !


  జిలేబి

  రిప్లయితొలగించండి


 8. ముచ్చట లాడె పల్కుచు ప్రమోదము చేర్చెను డిస్ని లాండులో
  మెచ్చి జనాళి కాసులను మేటగ చల్లిరి చూచి భేషుగా
  పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా
  యిచ్చటి నేటి దండితన మించుక గొప్పగ చెప్పవచ్చు రా!  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. అచ్చులతో మిఠాయిలను హర్షముమీరగజేసి యందరున్ మెచ్చెడిరీతి నిష్ఠమెయి మిక్కలి ప్రేమను జూపుచున్ మహా
  సచ్చరితుండు శ్రేష్ఠి యట చక్కగ నమ్మగ పంచదార దా
  పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా.

  రిప్లయితొలగించండి

 10. * శంకరాభరణం వేదిక *
  29/05/2020..శుక్రవారం

  సమస్య
  ****

  పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా"

  నా పూరణ. ఉ.మా.
  **** **** ***

  వచ్చెను భీకరమ్ముగ తుఫాను ;నిరాశ్రయులైరి పేదలే!

  ముచ్చట గొల్పు బాలకుడు బ్రోచగ నెంచెను వారలన్ ;కడున్

  మెచ్చెడి రీతిగా బుడత మిన్నగ గాన కచేరి జేయగన్

  వచ్చిన వీక్షకుల్ పొగిడి వాసిగ నిచ్చిరి కాసులన్; భళా!

  పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా"


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 11. మైలవరపు వారి పూరణ

  పిచ్చుక పేరుతో మొదలు పెట్టెను మందులకొట్టు కొత్తగా.,
  మచ్చిక శానిటైజరులు మాస్కులు మాత్రమె యమ్ముచుండగా
  చెచ్చెర లాభమున్ గొనె విచిత్రము., జూడగ నేడు వానికా
  పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి 'పిచ్చుక మెడికల్ స్టోర్' పూరణ ప్రశస్తంగా ఉన్నది.

   తొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వర్తకమునందు లాభించె పాటిగాను
  కోటి రూప్యముల్; సమకూర్చె మేటి పిట్ట
  లదొర వేడుక మాటల లక్ష కోట్లు
  కులుకుచు దసరా దినముల కూర్మి బంచి

  రిప్లయితొలగించండి
 13. వేటకని  పోవ దొరికెను మాటలాడు 
  నట్టి పిట్ట యొకటి వేగ పట్టి దాని 
  వేలమున కుంచగను పోటి  పెరిగి నాకు    
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట 

  రిప్లయితొలగించండి
 14. తే.గీ//
  తెలుగు రాష్ట్రతెలంగాణ తేజమునకు
  పాలపిట్టని నెంచగా ప్రాభవముగ !
  దినదినాభివృద్ధి నిగూర్చు పనులవలన
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట !!

  రిప్లయితొలగించండి


 15. పిట్ట నొక్కటి కొని తెచ్చి భేషుగాను
  మాంత్రి కుండిల నేర్పగ మాయలెల్ల
  ముద్దు మాటల తోడను మోహ పరచి
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట.

  దైవ కృప చేత లభియించ ధరణి లోన
  పసిడి గుడ్లను పెట్టెడు పక్షి యొకటి
  ధన్యుడైతిననిమదిని తలచె నతడు
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట

  రిప్లయితొలగించండి
 16. రాకు మారిని వలచెను రాజ రాజు
  పలుక రించగ తనలోన బ్రమసి మురిసి
  చిలిపి నవ్వులు కురిపించె కులుకు చెలియ
  కోటి రూప్యముల్ సమకూర్చ మేటి పిట్ట

  రిప్లయితొలగించండి
 17. మెచ్చినపూరణంబులనుమేదినిచాటగనుద్యమించితా
  విచ్చుచువర్థమానులకువేదికదిద్దుచుశంకదీర్చుచున్
  మెచ్చకముద్రణాధరనుమేలుగనెంచినమూల్యమౌప్లుతం
  బిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 18. పక్షులన్ విక్రయించెడు పాణిజుండు
  చదువుల పులుగు దొరకగన్ సంతసించి
  ప్రేమతో మాటలన్ నేర్పి వెలకు పెట్ట
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట

  రిప్లయితొలగించండి
 19. 29.05.2020
  అందరికీ నమస్సులు 🙏

  *సమస్య: "కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట"*

  *తే గీ*

  చదువులబ్బను లేదుగ సరిగ నాకు
  బడిని బెట్టితి పదుగురి బాగు కోరి
  పేరు తోడుగ బొందితి వేలు వేలు
  *"కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏😀🙏

  రిప్లయితొలగించండి
 20. పచ్చియబద్ధముల్ సతము పల్కుచునందరి మభ్యపెట్టుచున్
  మెచ్చినవారలందరికి మిత్రునిగా నటి యించి దోచుచున్
  ఇచ్చును సుమ్ములంచు కడు నింపగు పిచ్చుక నంటగట్ట నా
  పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా

  రిప్లయితొలగించండి
 21. కోటి విద్యలు నేర్చుట కూటి కొరకె
  ననుచు చిలుక శాస్త్రము నెం చు కొనుట వల్ల
  కోటి రూప్యము ల్ సమకూర్చె మేటి పిట్ట
  జీవనో పాధి లభియించి చింత లుడి గె

  రిప్లయితొలగించండి
 22. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః.తేది:29-05-2020.మహోదయులకు నమస్సులతో, శుభోదయం.
  నేటి సమస్యాపూరణాల యత్నం -

  శ్రీల మరిపించు సద్భావ చేతనత్వ
  పూర్ణ సమ్మోహ,నామోద మొంది సర్వ
  జనుల హృదిననిల్చు కవిత జగతి రాసి
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట.


  స్వచ్చపు సద్గుణంబు ఘన సారము గల్గిన మాటలన్ వరం
  బచ్ఛగు నట్లు జెప్పుచును పైకపు సాధన లోనమేటిదీ
  స్వచ్చపు పాలసీ !యనుచు సైయని భీమను కట్టిపించునా
  పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా.

  రిప్లయితొలగించండి
 23. కోటి రూప్యముల్ సమకూర్చె, మేటి పిట్ట
  కోకిలను బోలు గాత్రము,క్రొత్త గళము
  నాదు బిడ్డది;చిన్నతనమునె పొందె
  పేరు, మంచి గురువు సానబెట్ట దాని.

  రిప్లయితొలగించండి
 24. స్వేచ్ఛ నభిలషించు జనాలు వింతగాను
  బట్టి యమ్మరె పిట్టలఁ బంజరముల
  ఘోర మీరీతి స్వేచ్ఛను గోలుపోయి
  "కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట"

  రిప్లయితొలగించండి
 25. చిత్రమొకటి పిట్టది మెప్పు జేర్చె నాకు
  చిత్రమా యిది కాదు సజీవ ప్రతిమ
  యంచు ధనరాశినిడి కొనిరి, యశము మఱియు
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట

  రిప్లయితొలగించండి
 26. ఆలు బిడ్డలు జతకూడ నటవికేగి
  ముండ్ల పొదలకు నరికియా పోడు భూమి
  చదును చేసి యమ్మంగ నా చౌటినేల
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట

  (పిట్ట = మట్టిగడ్డ)

  రిప్లయితొలగించండి
 27. మచ్చిక చేసుకొన్న మరు మావుకు నేర్పితి మాటలెన్నియో
  యచ్చెరువంది లోకులది యద్భుత మంచును రక్తతుండమున్
  మెచ్చిరి, విక్రయింపమని మ్లేచ్ఛుడు వేడగ నొప్పుకుంటి, నా
  పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా

  రిప్లయితొలగించండి
 28. వలపువేటరి పట్టెను వలనువేసి
  భాగ్యవంతుల పట్టిని భార్యగాను
  కట్నకానుకలన్నియు కలిపిచూడ
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట

  రిప్లయితొలగించండి
 29. రిప్లయిలు
  1. ఉ:

   మచ్చను రూపు మాపుటకు మానిని వేడగ జొష్యపుంగవున్
   కుచ్చిత మైన యోచనల కోమలి యిచ్ఛను దీర్చ నెంచనై
   యిచ్చక మాడుచున్ తనదు నేతులు జెప్పుచు చింతసేయనీ
   పిచ్చుక కోటి రూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా

   కుచ్చితము=కుత్సితము

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 30. అచ్చికబుచ్చికల్సలిపియందము చందము భోగ భాగ్యముల్
  హెచ్చుగనున్న నెచ్చెలిని యేమరజేసెను ద్రోహ బుద్ధితో
  నచ్చితివంచుబల్కికడునమ్మికగూర్చగనమ్మి స్వర్ణపుం
  బిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా

  రిప్లయితొలగించండి
 31. పిచ్చుక బొమ్మ చిహ్నముగ పేరును గాంచిన ట్విట్టరందునన్
  పిచ్చిగ వాదులాడుటను వీడి కరోనను మాప గోరుచున్
  యిచ్చిన వేడుకోలు గని యిచ్చిరి వందలు వేలుగా నిధుల్
  పిచ్చుక కోటి రూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా

  రిప్లయితొలగించండి
 32. రూప సౌందర్య మలరించ భావ సుప్ర
  కటన చాతుర్య మేపారఁ గంబుకంఠి
  చలనచిత్ర తారగ వెల్గి నలిననేత్ర
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట


  పచ్చని చెట్ల గూళ్లు సులభమ్ముగఁ బెట్టి నివాసముండి గో
  ర్వెచ్చని పక్క లుంచి చెలరేఁగి సమూహముగాఁ జరించుచున్
  మచ్చిక నిండ్ల వాకిళుల మైమఱ పారఁగఁ దండులమ్ములం
  బిచ్చుకకోటి రూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా

  రిప్లయితొలగించండి
 33. ప్రేమమీరగ బెంచగ పెట్టనొకటి
  దినముకొక్కటి చొప్పున దివ్యమైన
  పసిడి గ్రుడ్డును నొసగంగ వాసిగాను
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటిపిట్ట

  పిచ్చియె మీరగా కొనగ పిచ్చుక లాటరి టిక్కెటుల్ ,భలే!
  తెచ్చెను ప్రైజులే వరుసదీరుచు లక్షల లాభమిచ్చుచున్
  విచ్చిన మల్లెలే కురిసె వీథులవెంబడి స్వాగతించుచున్
  పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా!

  రిప్లయితొలగించండి
 34. పిట్టలనువేటలాడగవేటగాడు
  దొరికెనొకపిట్టపలుకులతోడగలది
  యంతబేరమునకువెట్టయక్షరాల
  కోటీరూప్యముల్సమకూర్చెమేటీపిట్ట

  రిప్లయితొలగించండి
 35. మిత్రులందఱకు నమస్సులు!

  [నా యౌవన దశలో నొకనాఁడు కలలో నేను గాంచిన దృశ్యము]

  మెచ్చియు నొక్క బాల నను మీఱిన ప్రేమనుఁ బెండ్లియాడె! యా
  వచ్చిన యామె తండ్రి ధనవంతుఁడు పట్టణమందు! నామెయుం
  దెచ్చియు నిచ్చెఁ గట్నమును తేజ మెసంగఁగ! నట్టి సొన్నపుం

  బిచ్చుక, కోటి రూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా!

  రిప్లయితొలగించండి
 36. నేటి వార్తాపత్రికలోని కథనం నేపథ్యంలో...

  తేటగీతి
  మాట్రిమోనిలో వరునితో మాటఁ గలిపి
  భర్త తోడ సుతునిగల్గి వలను విసిరి
  వారసత్వఁపు టాస్తని వగల మారి
  కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట

  ఉత్పలమాల
  పెచ్చుగ దోచు బుద్ధిఁ గొని బేరును జూచియు మాట్రిమోనిలో
  ముచ్చట మాటలన్ గలిపి ముద్దియ భర్తయు పుత్రుడుండగా
  నుచ్చుబిగించి కోట్లధన ముండఁగఁ గోర్టుల గెల్చు నూసులం
  బిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా!

  రిప్లయితొలగించండి
 37. అచ్చముమేడవోలెనటయద్భుతరీతినిగట్టెగూడునున్
  బిచ్చుక,కోటిరూప్యములవేగముగాసమకూర్చెనద్దిరా
  యచ్చటగేసులీకవగనాపదనొందినవారికత్తఱిన్
  నచ్చపురక్తితోజగనునాంధ్రముప్రాంతపుమానవాళికిన్

  రిప్లయితొలగించండి
 38. రంగు పొంగుల నటితోడ హంగుగాను|
  చిత్రమాడె శతదినము చిత్తమలర
  మురిసి నిర్మాతలు పొగడ ముద్దు గాను|
  "కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట"

  రిప్లయితొలగించండి
 39. మనసు మరలించుకోర్కెల మాయలందు
  ఆశ దోషాల వెంటాడ? నణగి "రాత్రి
  కోటిరూప్యముల్ సమకూర్చె మేటిపిట్ట
  కలల కామితసిద్దిగ విలువలందు"!!

  రిప్లయితొలగించండి