14, మే 2020, గురువారం

సమస్య - 3368

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్"
(లేదా...)
"బంగారమ్మును గాంచి దూరముగ నేఁ బాఱంగ యత్నించితిన్"

69 కామెంట్‌లు:

  1. అందరికీ నమస్సులు 🙏🙏

    నా పూరణ..

    *కం||*

    సింగారించుకు తిరుగగ
    పొంగిన నా మనసు తోడ వొడుపుగ కోరన్
    నింగిన యంటిన ధరలన్
    *"బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి* ✍️

    రిప్లయితొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    వంగల్ దేశమునుండి వచ్చి వధువున్ వైనంపు వేటందునన్
    కంగారొందిన మానసమ్ము గొనుచున్ గాఢంపు నావేదనున్
    సంగారెడ్డిని పెండ్లి చూపు జనుచున్ చక్కన్ని యత్తయ్యదౌ
    బంగారమ్మును గాంచి దూరముగఁ బాఱం జూచితిన్ భీతితోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. "బంగారమ్మును గాంచి దూరముగఁ బాఱం జూచితిన్ భీతితోన్"

      సార్! యతి సరియా?

      తొలగించండి

    2. బంగారం ముందు యే యతియైనా లొంగి సరి యన వలసిన దే :)

      తొలగించండి
    3. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      "గాఢంపు టావేదనన్" అనండి. 'చక్కన్ని' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
    4. సమస్యలోని యతి దోషాన్ని సవరించాను.

      తొలగించండి
  3. అంగన జన్మ దినంబున
    సింగారించు కొనుటకయి జిగినిని గోరన్
    అంగడికి వెడలి యక్కడ
    బంగారముఁ గాంచితి , భయపడితిఁ గొనంగన్

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వంగల్ రాణిని పెండ్లి యాడుచునయో ప్రారబ్ధకర్మంబునన్
    చెంగల్ పట్టున ప్రేమయాత్ర జనగన్; చిన్నారి యిల్లాలహో
    శృంగారమ్మున దూరి కొట్టున కడున్ శీఘ్రమ్ముగా నెన్నినన్
    బంగారమ్మును గాంచి దూరముగఁ బాఱం జూచితిన్ భీతితోన్

    రిప్లయితొలగించండి
  5. (భోగజీవితాన్ని నిరసిస్తూ చింతామణి బిల్వమంగళునితో )
    భంగంబయ్యెను నాదు గర్వమిక నో
    పాండిత్యరత్నాకరా !
    సింగారమ్ముల నమ్మి బంధనములన్
    ఛేదింపలేనైతినే !
    చెంగావుల్ ధరియింతు ;మాధవుని సం
    సేవింతు నెక్కాలమున్ ;
    బంగారమ్మును గాంచి దూరముగ బా
    రం జూచితిన్ భీతితో .

    రిప్లయితొలగించండి

  6. గ్రాముకు నలభై రూపాయలు తగ్గిందన్నాడు అయినా కొనాలంటే భయమే :)


    సింగారించుకొని భళా
    అంగడి వాడిని నడిగితినయ్యా వెలయో?
    టంగున ఖరీదు చెప్పగ
    బంగారముఁ గాంచితి, భయపడితిఁ గొనంగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. కం//
    గంగకు శంకరు డొసగిన
    బంగారముఁ గాంచితి, భయపడితిఁ గొనంగన్ !
    తంగము సర్పంబవగన్
    కంగారుగ శివ శివ యన కాంచన మయ్యెన్ !!

    రిప్లయితొలగించండి
  8. బంగారముకొనిభార్యకు
    శృంగారముసేయమేనుఁజెంగునరిగినా
    నంగడికి,వేలుపెరిగిన
    బంగారముఁ గాంచితి, భయపడితిఁ గొనంగన్"

    శృంగారం=అలంకరణ
    (సింగారముసేయమేనుఁజెంగునరిగినా)

    రిప్లయితొలగించండి


  9. సింగారింపుల కంఠమందు నెకిలేసెంతోజిలేబీవలెన్
    చెంగా గాన్పడె! రొక్కమెంతయనగా చెప్పింది విన్నాక ఓ
    రంగీ! పెన్మిటి చట్టు మూర్ఛిలుచు ఫౌరన్ఫౌరి బాజారులో
    బంగారమ్మును గాంచి దూరముగఁ బాఱం జూచితిన్ భీతితోన్!

    జస్ట్ ౫౦ వేల కే మూర్ఛిలితే యెలా :)
    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. దొంగల పాలయె నగలు 
    సింగారించుకొన లేవు సిగ్గయె ననగన్  
    పొంగిన ప్రేమను పోయితి 
    బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "పాలయ్యె నగలు... ప్రేమని నేగితి" అనండి.

      తొలగించండి
  11. రంగాజ్యూలరి మార్టుకు
    బంగారముకొనగనేగిపండుగవేళన్
    నింగికిజేరినధరతో
    బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    కొంగున్గట్టిరి చిన్నముక్కనిది నాకున్ బెండ్లిలో ! నింతియే!
    సింగారించితిరా! మరొక్క నగ నిస్సీ! మీరనన్., దీర్చగా
    బెంగన్., బోయితి., జూడగా
    వెలను బెంబేలెత్తి వెన్దిర్గుచున్
    బంగారమ్మును గాంచి దూరముగఁ నే బాఱంగ యత్నించితిన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  13. చెంగలువరంగు చీరను
    సింగారముతోముదితయుజిగినిని కొరకై
    పొంగిననుత్సాహంబుగ
    బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్

    రిప్లయితొలగించండి
  14. చెంగటన యున్న యింటిని
    బంగారము దోచి తక్కువ ఖరీదనుచున్
    దొంగలు నలుగురు తెచ్చిన
    బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్.

    రిప్లయితొలగించండి
  15. బంగినపల్లియు పచ్చని
    రంగు, తినుట లాభము, మధుర ఫలముగాదే!
    నింగిని జేరు ధరలతో
    బంగారము గాంచితి, భయపడితి గొనంగన్.

    రిప్లయితొలగించండి
  16. టాంగానెక్కిపయనమై
    రంగడుటౌనుకుకొనుటకురత్నముసిగకై
    రంగికి పుట్టిన దినముకు
    బంగారముఁ గాంచితి, భయపడితిఁ గొనంగన్

    రిప్లయితొలగించండి
  17. అంగీకారమువడ్డికాసులకునాకాశంబుసాక్షంబునై
    భంగమ్మైనదిచెల్లుజేయగనునాభావంబుశ్రీవాసమై
    సాంగోపాంగమురోగబాధవిషమైవిశ్వంబుచింతించగన్
    బంగారమ్మును గాంచి దూరముగఁ బాఱం జూచితిన్ భీతితోన్"
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  18. మంగా!పసిడిని మించిన
    బంగారపు ఛాయనీదిపతినగునాకున్
    ముంగురులనుసర్దుతుననె
    బంగారముఁ గాంచితి, భయపడితిఁ గొనంగన్

    రిప్లయితొలగించండి
  19. పొంగిన నుత్సాహమ్మున
    నంగన తోడుగ వెళితిని యాభరణ ముకై
    అంగడి ధరలను వినియును
    బంగారము గాంచితి భయ పడితి గొనంగన్

    రిప్లయితొలగించండి
  20. మిత్రులందఱకు నమస్సులు!

    [బంగారము నమ్మెడి దుకాణమునఁ, గరోనా వ్యాధిగ్రస్థుఁడు తాఁకిన బంగారమును నేను తీసికొనుటకు వెనుకాడిన సందర్భము]

    రంగుల్ వొంగెడి బంగరమ్ముఁ గని, బేరంబాడ వాంఛించి, యేఁ
    జెంగుల్ దోపియు రొండియందుఁ, జనఁగాఁ, జిత్రమ్ముగా వచ్చియున్,
    గంగారేమియులేక యప్పుడు కరోనా రోగియే తాఁక, నా

    బంగారమ్మును గాంచి దూరముగ నేఁ బాఱంగ యత్నించితిన్!

    రిప్లయితొలగించండి
  21. సింగారించిన నొక మెడ
    బంగారము గాంచితి,భయపడితి గొనంగన్
    పొంగారు ప్రేమ నాసతి
    మంగ,'కొనుము యట్టిదనును'మదినదలచితిన్.

    రిప్లయితొలగించండి
  22. బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్"
    (సమస్య)
    కం:
    నింగికెగబాకుధరతో
    బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్
    బెంగాబెదురూలేకను
    సింగారమెముఖ్యమాయె శ్రీమతికిపుడున్.

    రిప్లయితొలగించండి
  23. దొంగల బెడదకు భయపడి
    సింగారించగ నగలను స్థిమితము లేకన్
    యంగన లీవిధి తలుపరె
    బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్

    రిప్లయితొలగించండి
  24. రంగుగ సతి కోరెననుచు
    బంగారము కొనగ నెంచి వడిగా నేగన్
    మింగుడు పడకా ధరయును
    *బంగారము గాంచితి భయపడితి గొనంగన్*

    రిప్లయితొలగించండి
  25. పొంగారెన్ సతి పైన బ్రేమ మరి గొంపోతిన్ దుకాణమ్ముకున్
    సింగారించిన చిన్నదప్పుడడిగెన్ శ్రీ లక్ష్మి హారమ్మునే
    కంగారై మది మూల్యమున్ దెలియగా గాదంచు శక్యమ్మికన్
    బంగారమ్మును గాంచి దూరముగ నేఁ బాఱంగ యత్నించితిన్

    రిప్లయితొలగించండి
  26. సవరణ...


    * శంకరాభరణం వేదిక *
    14/05/2020 ...గురువారం

    సమస్యల
    ********

    "బంగారమ్మును గాంచి దూరముగ నేఁ బాఱంగ యత్నించితిన్"

    పూరణ. ఉ.మా.
    **** **** **

    బంగారమ్మును కాన్క నీయ సతికిన్ బ్రాతిన్ చనన్ గొట్టుకున్

    బంగారమ్మె తులంబుకున్ బలుకు యాబ్భైవేలనెన్ వాడయో!


    కంగారయ్యెను గుండెలో గబులు రేగన్ మెండుగా నంతటన్

    బంగారమ్మును గాంచి దూరముగ నే బాఱంగ యత్నించితిన్


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  27. బంగాళదుంప కూరయు
    బంగారముఁ గాంచితి, భయపడితిఁ గొనంగన్
    అంగము బలమౌనొకటియు
    అంగమునకు చక్కదనమునతివకునొకటిన్

    రిప్లయితొలగించండి
  28. నింగిన్ ద్రాకెడు మూల్యమున్న పసిడిన్ నీకిత్తుమే తక్వకున్
    బంగారమ్మును, తీసుకొమ్మనుచు నన్ వారడ్గుచున్ చేరిరా
    దొంగల్ మువ్వురు మూటతో, కనగ నా దుర్మార్గులన్ వారిదౌ
    బంగారమ్మును గాంచి దూరముగ నే బాఱంగ యత్నించితిన్.

    రిప్లయితొలగించండి
  29. గురువు గారికి నమస్సులు.
    సిoగారపుయువతిమెరియ
    బంగారముగాంచితి,భయపడితికొనంగన్
    నింగినితాకినధరలు
    బాంగ్లా దుంపలు కరువగు భారత భువిలో.

    రిప్లయితొలగించండి
  30. సింగారించుటకొఱకును
    బంగారముగొనగనేగబ్రమదముతోడన్
    నంగడిధరనటవినగను
    బంగారముగాంచితిభయపడితిగొనంగన్

    రిప్లయితొలగించండి
  31. రంగక్షారము జేర్చి రాణ బొసగన్ లాక్డౌనులో మాయికుల్
    మంగల్యంబని యమ్మ జూప మదిసంభాషించె స్వప్నంబులో
    బంగారమ్మును గాంచి దూరముగనేఁబాఱంగ యత్నించితిన్
    శృంగారించెడు గాంచనాదులను గోసెక్కించకే భీతితో

    రిప్లయితొలగించండి
  32. శా॥
    పొంగారున్ సతి యంద మంచు మోదమ్ముతో గొట్టుకున్

    బంగారంబును గొందునంచు నటకున్ బైకంపుతో జేరగా

    నంగీకారము గాక యయ్యధిక మూల్యంబంబరమ్మంటగా

    బంగారమ్మును గాంచి దూరముగ నేబారంగ యత్నించితిన్

    (పొంగారు= అతిశయించు)

    రిప్లయితొలగించండి
  33. అంగన నీకేల యిఁక వి
    హంగమ్ముల భంగి పొంగి యాశ్చర్యముగన్
    నింగికిఁ జేరంగ ధరలు
    బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్


    అంగారమ్మనఁ గాల్చ వాయి నకటా యత్యంత మొక్కుమ్మడిం
    గంగారుండఁగ నాదు చిత్తమున వీకన్నీటిఁ గాక్షించి నే
    నుంగుం గంచును, గంది చూర్ణ మని యయ్యో తింటి నే నింత నా
    బం గారమ్మును గాంచి, దూరముగ నేఁ బాఱంగ యత్నించితిన్

    [ఆబన్ + కారమ్ము = ఆబం గారమ్ము; ఉంగ +ఉంగ + అంచును = ఉంగుంగంచును]

    రిప్లయితొలగించండి
  34. శా:

    సింగారింపును కోరి పూర్వనగలన్ సిద్ధమ్మిడన్ మార్పుకై
    చెంగున్ జేరితి స్వర్ణకారు దుకునం చేపట్ట నవ్యమ్ముగా
    కంగారెత్తితి హస్తలాఘవమునన్ గానంగ తామ్రార్కమున్
    బంగారమ్ము ను గాంచి దూరముగ నే బాఱంగ యత్నించితిన్

    దుకునం: అంగడి (మాండలికము)
    తామ్రార్కము: ఎర్రటి రాగి

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  35. బంగారమ్మునుగాంచిదూరముగనేబాఱంగయత్నించితిన్
    బంగారమ్మునుగాంచిబాఱుటయనన్భారంబుగొన్గోలుచేయంగసూ
    సింగారించగనిచ్చయుండినదగన్శీఘ్రంబవిచ్చేయుమా
    రంగా!సిద్ధముజేసికారునువెసన్రమ్మందుసోమేశునిన్

    రిప్లయితొలగించండి
  36. కందం
    పొంగెడు కరోన భయమున
    సింగారించిరెవరొయని చింతిలి, తెలుపన్
    సంగతి ప్రభుత్వ భటులకు
    బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్

    శార్దూలవిక్రీడితము
    క్లింగంచున్ విని గంట ద్వారమున సారించంగఁ దారాడుచున్
    సింగారమ్మగు దండ కొద్ది ధరనే చెల్లించ మీదౌననన్
    గంగారందున చోరుడేమొననుచున్ గాసిల్లి యవ్వానిదౌ
    బంగారమ్మును గాంచి దూరముగ నేఁ బాఱంగ యత్నించితిన్


    రిప్లయితొలగించండి
  37. పొంగు ల్వారెడి మేనిరూపమున
    ప్రాపున్గొన్న శ్రీ రాగమై
    రంగున్మేలిమి వన్నెయందలర
    జాలు న్నింతి కింకేలనో
    బంగారమ్మును; గాంచి దూరముగ
    నే బాఱంగ యత్నించితిన్-
    సింగారంబిక చిన్నబోయి తన
    రోచిన్వీడునన్ శంకతో!

    రిప్లయితొలగించండి
  38. మైదాస్ అనుభవం

    బంగారమ్మును గూడబెట్టు తపనన్ భ్రాంతింబడిన్ గోరగా
    కంగారున్ దనుదాకినట్టి దినుసున్ కల్యాణమై మారగా
    సింగిరించిన కూతురే తుదకు నిర్జీవంబగు బొమ్మయై
    బంగారమ్మును గాంచి దూరముగ నేబారంగ యత్నించితిన్

    కల్యాణము = కాంచనము

    రిప్లయితొలగించండి
  39. రంగమ్మ పెండ్లికొరకై
    రంగుల బట్టలఁ గ్రయించి రహితో, నగకై
    యంగడిలో ధరపెరిగిన
    బంగారముఁ గాంచితి, భయపడితిఁ గొనంగన్

    రిప్లయితొలగించండి
  40. బంగారమ్మనుగాంచి యిచ్చగొని నేప్రార్థింప ప్రేమమ్ముకై
    యంగీకారముఁ దెల్పె నామెయును తానానందమున్ బొందుచున్
    సింగారింపగ బోయి, యాపణముకున్ శీఘ్రమ్ము హెచ్చౌవెలన్
    బంగారమ్మును గాంచి దూరముగ నేఁ బాఱంగ యత్నించితిన్


    రిప్లయితొలగించండి
  41. బంగారమ్మనుగాంచి యిచ్చగొని నేప్రార్థింప ప్రేమమ్ముకై
    యంగీకారముఁ దెల్పె నామెయును తానానందమున్ బొందుచున్
    సింగారింపగ బోయి, యావిపణికిన్ శీఘ్రమ్ము హెచ్చౌవెలన్
    బంగారమ్మును గాంచి దూరముగ నేఁ బాఱంగ యత్నించితిన్
    అసనారె

    రిప్లయితొలగించండి
  42. శృంగార మ్మునబహుమతి
    సింగారమెశ్రీమతులకు సిరులిచ్చుగదా
    కొంగున గట్టుక పోరగ
    బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్!

    రిప్లయితొలగించండి