17, మే 2020, ఆదివారం

సమస్య - 3371

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పార్వతీ విష్ణుపత్నివై భద్రమిడుము"
(లేదా...)
"పార్వతి వీవు విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్"

93 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    శార్వరి నామవత్సరము చక్కగ తెచ్చెను వైరసమ్మ; నే
    నోర్వగ లేను లేమిడిని యొంటరి గాడను జాలిజూపవే;...
    పూర్వము నాదు బాధలను పూర్తిగ తీర్చిన పెద్ద వేల్పువౌ
    పార్వతి వీవు;... విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్

    రిప్లయితొలగించండి
  2. అందరికీ నమస్సులు ..🙏🙏🙇🙇

    వృత్తంలో రాయాలనే తపన 😥😥

    పార్వతి భక్తితో గొలిచి ప్రాప్తిగ బొందెద శాంతియున్ తధా
    పార్వతి భక్తితో గొలిచి పట్టెద నిక్కము సంతసమ్ములన్
    పార్వతి రూపమే మనల బాపును నుర్విన యెల్ల వేళలన్
    *"పార్వతి వీవు విష్ణుసతివైనను, బ్రోవవె సత్కృపామతిన్"*

    (ఎలాగోలా రాసేసినట్టున్నాను)
    🙇🙇🙏🙏 తప్పులున్న క్షంతవ్యుణ్ణి 🙏🙏🙇🙇

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...బాపును + ఉర్వినిన్ +ఎల్ల = బాపు నుర్విని నెల్ల" అవుతుంది. "...బాపి శుభం బిడు నెల్లవేళలన్" అనండి.

      తొలగించండి
    2. ధన్యోస్మి ఆర్యా 🙏🙏

      సవరణతో ...

      పార్వతి భక్తితో గొలిచి ప్రాప్తిగ బొందెద శాంతియున్ తధా
      పార్వతి భక్తితో గొలిచి పట్టెద నిక్కము సంతసమ్ములన్
      పార్వతి రూపమే మనల బాపి శుభంబిడు నెల్ల వేళలన్
      *"పార్వతి వీవు విష్ణుసతివైనను, బ్రోవవె సత్కృపామతిన్"*

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఓ! ఐశ్వర్యా!

    గర్వము మీర త్రోయుచును కల్కత వీధుల సానికొంపలన్
    మర్వగ జాలకుండగను మాధురి దీక్షితు నొల్లకుండినన్
    పూర్వము దేవదాసుడను బొత్తిగ చీల్చుచు సంహరించినన్
    పార్వతి వీవు! విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్!

    రిప్లయితొలగించండి
  4. దుర్విధి బట్టె లోకమున దుష్ట కరోన విజృంభణమ్మునన్
    గర్వము ఖర్వమాయె భయకంపితమాయెను లోకమంతయున్
    సర్వ జగమ్ములన్నెపుడు జల్లగ జూచెడి యంబ భారతీ
    పార్వతి వీవు విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్

    రిప్లయితొలగించండి
  5. మహోదయా! నమస్సులతో,
    శుభోదయం.

    నేటి పద్యపూరణ ప్రయత్నం-

    నీళ్ళ వలె ధనమంతయు, నిత్య మత్తు
    కెక్క భోగవాంఛాఖర్చు కెరల జేసి
    పైక మార్జించి దాచెడి భార్య జేరి
    పార్వతీ! విష్ణు పత్ని వై భద్రమిడుము
    ---

    నేటి రెండవ సమస్యాపూరణ ప్రయత్నం-

    సర్వము ఖర్చు జేసితిని శాంభవి! యిప్పుడు రిక్తహస్తుడన్
    పూర్వపు సంప్రదాయమున భోజన కార్యము నిర్వహించితిన్
    నుర్విన బీదసాదలకు, నుత్తమ కార్యము సిద్ధి బొందగన్
    పార్వతి వీవు విష్ణు సతివై నన్ను బ్రోవవె సత్కృపామతిన్
    _________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'నిత్య మత్తు, వాంఛా ఖ(క)ర్చు' దుష్టసమాసాలు.
      రెండవ పూరణలో 'నిర్వహించితిన్+ఉర్విని= నిర్వహించితి నుర్విని' అవుతుంది. "నిర్వహింతు నే నుర్విని..." అనండి.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. నమస్సులతో,
      ఆర్యా! ధన్యవాదములు.మీ పలుకుల మేరకు దుష్టసమాస పద రహితంగా భావిస్తూ


      1.నీళ్ళ వలె ధనమంతయు, నెగడు మత్తు
      కెక్క భోగవాంఛకై ఖ(కి)ర్చు కెరల జేసి
      పైక మార్జించి దాచెడి భార్య జేరి
      పార్వతీ! విష్ణు పత్ని వై భద్రమిడుము
      _____________
      తిన్- తొలగించి-

      2.సర్వము ఖర్చు జేసితిని శాంభవి! యిప్పుడు రిక్తహస్తుడన్
      పూర్వపు సంప్రదాయమున భోజన కార్యము నిర్వహింతు నే
      నుర్విన బీదసాదలకు, నుత్తమ కార్యము సిద్ధి బొందగన్
      పార్వతి వీవు విష్ణు సతివై నన్ను బ్రోవవె సత్కృపామతిన్

      తొలగించండి


  6. కావు మమ్మ పెద్దమ్మ యీ కడిది యగు క
    రోన భారినుండి జనుల, రోయ కమ్మ
    పార్వతీ! విష్ణుపత్నివై భద్రమిడుము
    బొక్కసమునిండ ప్రభుతకు భూరిగాను!
    పలుకుజిలుకలకొల్కివి పాటి గాను
    నీవె మాకు సద్బుద్ధిని నీయవమ్మ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. (ముగురమ్మల మూలపుటమ్మ ఆదిశక్తితో భక్తుడు )
    సర్వము నీవెలే జనని !
    సారపు విద్యలనిమ్ము భారతీ !
    గర్వము నిండు రాక్షసుల
    ఖండన జేసెడి శక్తిరూపవౌ
    పార్వతివీవు; విష్ణుసతి
    వై నను బ్రోవవె సత్కృపామతిన్
    పర్వము గాగ జీవితము
    పంచుచు భాగ్యము నష్టలక్ష్మిరో .
    (పర్వము - పండుగ )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "పంచుము భాగ్యము నాదిశక్తిరో" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి

  8. కందగీతి


    అపకరణచేసెను కరో
    న పెనుపడుచు! మాకు రక్షణవలయు పెద్ద
    మ్మ! పొసగుచు పార్వతీ! వి
    ష్ణుపత్ని వై భద్రమిడుము శుభముల నిమ్మా


    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. కందోత్పల


    అవ! చూపుమమ్మ నాకిక
    సవ! పార్వతి వీవు! విష్ణుసతివై నను బ్రో
    వవె, సత్కృపామతిన్ పొ
    త్తువుగా సద్బుద్ధినిమ్మ తొలి పెద్దమ్మా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  10. కర్వరి యందు సంభవము!కాలము పర్వుల బోయె వేగమై
    సర్వము నీవె నాకు, మనసా ప్రణతుల్! తొలి దొడ్డతల్లివై
    పార్వతి వీవు! విష్ణుసతివై నను బ్రోవవె! సత్కృపామతిన్
    గర్వము లేని జ్ఞానమును కబ్బము గా ప్రసరించవే సదా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. తల్లి దండ్రులు లేరని తల్ల డిల్ల
    నేల ముగ్గురమ్మలు బ్రోవ గెల్ల వేళ
    నమ్మకమ్మింక గానీక వమ్ము వాణి,
    పార్వతీ, విష్ణుపత్నివై భద్రమిడుము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "బ్రోవ నెల్లవేళ" అనండి. 'వమ్ము వాణి'?

      తొలగించండి
  12. ఉర్విని శక్తిరూపమది యొప్పుగ దాల్చిన లోకమాతవై
    సర్వమునందు రాజిలుచు సన్నుతులందుచు వాణివై హృదిన్
    బర్విన చీకటుల్ దునిమి పాలన చేసిడి దాన వీవికన్
    బార్వతి వీవు విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్"

    రిప్లయితొలగించండి
  13. తే.గీ//
    తపమునకు మెచ్చి వరమిడ తరలెభవుడు
    నీకొసగె సగభాగము చేకొనుమిక !
    పార్వతీ !, విష్ణుపత్నివై భద్రమిడుము
    లక్ష్మి ! లాక్డౌను జేయక రక్షనొసగు !!

    రిప్లయితొలగించండి
  14. శివుడు సతినెట్లు పిల్చునో చెప్ప వలయు,

    యెవరి తో మనవలెనని‌ యింది నడుగు,

    నర్చన లిడి దేవతనేమి నడగ‌ దగును,

    పార్వతీ, విష్ణు పత్నివై,
    భద్ర మిడుము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      "చెప్పవలయు నెవరితో" అనండి. 'ఇంది నడుగు'?

      తొలగించండి
  15. తే.గీ//
    నిన్నును భరియింప తరమా సన్నుతిగొను
    పార్వతీ !, విష్ణుపత్నివై భద్రమిడుము !
    అష్ట లక్ష్మివై మముజేర కష్టకాల
    మింక గడచిపోవును గద సంకట హర !!

    రిప్లయితొలగించండి
  16. పూర్వము భిక్షగన్ జదువుఁ బూని యొసంగితి వీవు వాణివై
    పర్విన ధీతమస్సులనుఁ బాఱగఁ ద్రోలితి నీ వరమ్మునన్,
    పర్వము నందగా పలు శుభప్రదముల్ పొనరించి కాచితే
    పార్వతి వీవు, విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  17. చదువు సంధ్యలొసగుమమ్మ శారదమ్మ
    దుష్టశక్తులనణచుము దుర్గ వగుచు
    పార్వతీ విష్ణు పత్నివై భద్ర మిడుము
    శ్రేయములుకూర్చి కావుము శీఘ్రగతిన

    రిప్లయితొలగించండి
  18. "పార్వతీ విష్ణుపత్నివై భద్రమిడుము"

    శివుని భార్యవైజగతికిచిరమునిమ్ము
    "పార్వతీ ,విష్ణుపత్నివై భద్రమిడుము
    లక్ష్మి, బ్రహ్మపత్నివిఁగాగసూక్ష్మమీవె
    వాణి!యనిజగజ్జననికల్పమునుచేసె

    (లేదా...)

    "పార్వతి వీవు విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్"

    సర్వకమంధకారతనుశక్తివిభాసితుఁజేయవేసదా
    "పార్వతివీవు,విష్ణుసతివైననుబ్రోవవెసత్కృపా మతిన్"
    పూర్వధనమ్ముగాకనిలస్వార్జితసంపదనిచ్చి ,
    సాహితీ
    ఉర్విఁగవిత్వయుక్తిగతినుజ్జ్వలకీర్తినిగావెవాణివై

    సర్వకము =అంతము

    రిప్లయితొలగించండి

  19. సర్వులలోన నేనిటుల శాంతియు తోషము దూరమైతి మీ

    యిర్వురి యమ్మలన్ మదిన నిమ్ముగ వేడెద శక్తినివ్వు మా

    పార్వతి వీవు, విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్

    పూర్వ యథాప్రకారముగ పోషణ భారము నీదే యమ్మరో!

    రిప్లయితొలగించండి
  20. తేటగీతి గర్భ మద్యార్కర


    భవికము మాకిమ్ము సింహ వాహినీ,గణపతి జనని,

    భవసతీ,పార్వతీ! విష్ణు పత్నివై భద్ర మిడుము,త్రి

    భువన జనని,కమలాక్షి,పుత్తడి చూపుల మగువ,


    కవనము రసనపై నిడుము కల కాలము నలువ రాణి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారు నమస్కారం ముందు తెలిపిన పద్యములో ఇంది అనగా లక్ష్మి‌‌‌‌ అన్న‌ అర్ధము లో వాడాను

      ఇంది ‌నడుగు లక్ష్మి‌నడుగు ‌‌అన్న భావముతో వాడాను‌ తప్పులున్న సరచేసుకుంటాను

      తొలగించండి
    2. మీ మధ్యాక్కర పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. రిప్లయిలు
    1. పాల కడలిఁ జిలుక లక్ష్మి బయలువడగ
      విష్ణువు పిలిచి చెల్లిని వేడుకొనియె
      చెప్పి యొప్పించు మాచేడె చెవిని నిట్లు
      పార్వతీ! "విష్ణుపత్నివై భద్రమిడుము"

      తొలగించండి
    2. సమన్వయమెలావున్నా, పార్వతి విష్ణువుకు కోడలు అవుతుంది....

      తొలగించండి
    3. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. క్షీరసాగర మందు లక్ష్శి వెలియ గని
    గరళకంఠుడు పలికెను గౌరి తోడ
    "పార్వతీ!విష్ణ్నుపత్నివై భద్రమిడుము
    లోకములని సుందరికి దెలుపు,శుభమిదె!"

    రిప్లయితొలగించండి
  23. వచ్చె కోవిడనిదియును,బ్రహ్మసృష్టి
    మందు లేదట గాపాడమంటు గోరె
    పార్వతీ! విష్ణుపత్ని వై భద్రమిడుము
    అంబుజాసనలక్ష్మినినాడబడుచు

    రిప్లయితొలగించండి
  24. దురితుల నెదుర బలమిడు గరిమ నీవె
    పార్వతీ! విష్ణు పత్నివై భద్ర మిడుము
    వాక్కు తోడ జ్ఞాన మొసగు వాణి వీవె
    జయము నిడ నెల్లరకు జగజ్జనని వమ్మ!

    రిప్లయితొలగించండి

  25. * శంకరాభరణం వేదిక *
    17/05/2020 ...ఆదివారం

    సమస్య
    ***

    "పార్వతి వీవు విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్"



    నా పూరణ. ఉ.మా.
    **** **** ***

    పర్వత రాజ పుత్రిక! కపాలి మనమ్మును దోచు నాయికా!

    గర్వము కోపతాపముల గల్గిన దైత్యుల ద్రుంచు కాళికా!

    సర్వము నీవె నంచు మది సంస్తుతి జేయగ ఖ్యాతి నేలు శ్రీ

    పార్వతి వీవు., విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్"


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  26. యెల్ల లోకాల గాచెడి తల్లి వీవు!
    సర్వమంగళ సౌభాగ్య సంపదిమ్ము!
    వాణివై జిహ్వ నిలిచి సువాక్కు నిమ్ము!
    పార్వతీ విష్ణుపత్నివై భద్రమిడుము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎల్ల లోకాల'... పద్యాన్ని యడాగమంతో ప్రారంభించరాదు.

      తొలగించండి
  27. పాల సంద్రము చిలుకగ బయలుపడెను 
    లక్ష్మి, విష్ణు పెండ్లాడ తలంచె నాపె  
    చేరి ఈరీతి చెప్పంగ చెల్లి కోరె 
    పార్వతీ! "విష్ణుపత్నివై భద్రమిడుము"

    రిప్లయితొలగించండి

  28. ఆర్యా! ధన్యవాదములు.మీ పలుకుల మేరకు దుష్టసమాస పద రహితంగా భావిస్తూ


    1.నీళ్ళ వలె ధనమంతయు, నెగడు మత్తు
    కెక్క భోగవాంఛకై ఖ(కి)ర్చు కెరల జేసి
    పైక మార్జించి దాచెడి భార్య జేరి
    పార్వతీ! విష్ణు పత్ని వై భద్రమిడుము
    _____________
    తిన్- తొలగించి-

    2.సర్వము ఖర్చు జేసితిని శాంభవి! యిప్పుడు రిక్తహస్తుడన్
    పూర్వపు సంప్రదాయమున భోజన కార్యము నిర్వహింతు నే
    నుర్విన బీదసాదలకు, నుత్తమ కార్యము సిద్ధి బొందగన్
    పార్వతి వీవు విష్ణు సతివై నన్ను బ్రోవవె సత్కృపామతిన్

    రిప్లయితొలగించండి
  29. మర్వగ రాని రోగమది మానవ కోటియె నేలరాలగన్
    ఉర్వియె క్రిందుమీదయె మహోగ్రపు కోవిడు తాండవాకృతిన్
    శర్వరి నీవెగా సకల శాస్త్రములందలి దెల్వి, వీవెగా
    పార్వతి, వీవు విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్.

    రిప్లయితొలగించండి
  30. కరుణ జూపించి గావుము కమలనయన
    పార్వతీ: విష్ణు పత్నివై భద్ర మిడుము
    నీదు పాద పద్మ ములకు ని శ్చ లంపు
    భక్తి తోడుత మ్రొక్కెద భాగ్య దాయి

    రిప్లయితొలగించండి
  31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  32. ముగ్గురమ్మలకును నీవె మూలమమ్మ
    బ్రహ్మముఖములనునిలుచువాణివీవె
    శివుని కర్ధభాగమయిన శివవు నీవె
    పార్వతీ, విష్ణుపత్నివై భద్రమిడుము

    రిప్లయితొలగించండి
  33. సర్వ శుభంకరీ జగము సాక హరింప సృజింప దుర్గవే
    సర్వద సర్వమంగళవు సానుల భాగ్య ఫలార్థ కర్తవౌ
    పార్వతివీవు;విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్
    గర్వము ఖర్వమై మనసు కైటభ మర్ధను నందు నిల్పగా

    రిప్లయితొలగించండి
  34. దుర్గయన ముగ్గు రమ్మల మార్గ మనిరి
    చదువు సందెల శారద, శత్రునాశ
    నమున రౌద్రయు కాళి సన్మాన శుభద
    పార్వతీ, విష్ణుపత్నివై భద్రమిడుము

    రిప్లయితొలగించండి
  35. తేటగీతి
    ముగ్గురమ్మలఁ గూర్చిన మూలశక్తి
    విద్యయు, బలిమి వలసిన విత్తములిడు
    బ్రహ్మ నాయకి భారతీ! పరమశివుని
    పార్వతీ! విష్ణుపత్నివై భద్రమిడుము

    ఉత్పలమాల
    సర్వము నాదిశక్తి కనుసన్నల సాగునటంచు గొల్తునే
    యుర్విని సృష్టికిన్ లయకు నోర్పుగ మధ్యన పోషణాదులన్
    నిర్వహణల్ త్రిమూర్తులకు నేర్పు నిడంగ సరస్వతీవు, మా
    పార్వతి వీవు, విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్

    రిప్లయితొలగించండి
  36. పూజ్యులకు ప్రణామాలు🙏

    భార్య పార్వతి నుద్దేశించి భర్త మాటలు...
    తే"

    నిత్య దారిద్ర్యమున మగ్గు నేల బ్రతుకు!

    కాలు నీవు బెట్టనిచట కలుగు సిరులు

    లక్ష్మి తాండవించు నటని లక్షణముగ

    నమ్మి చేసు కొంటిని చక్క నమ్మ వనుచు

    *పార్వతీ! విష్ణు పత్ని వై భద్రమిడుము*
    వాణిశ్రీ నైనాల, హైదరాబాద్

    రిప్లయితొలగించండి
  37. మిత్రులందఱకు నమస్సులు!

    సర్వము నీవె వాణి! మనసా వచసా కొలుతుం ద్రిదేవిగా!
    సర్వ సుశబ్దజాలముల సార్థముగా మదిఁ జేరనీయవే!
    శర్వు కళత్రమై సతము శక్తిని నీయవె! వాణి! లక్ష్మి! యా

    పార్వతి వీవు! విష్ణు సతివై ననుఁ బ్రోవవె సత్కృపామతిన్!

    రిప్లయితొలగించండి
  38. సర్వజగమ్ములన్ కనెడి శాంభవి! మూలపుటమ్మనీవెగా
    శర్వున కర్ధభాగముగ సాగు శివప్రియ! రక్కసాళికిన్
    గర్వము ఖర్వమున్ సలుపుకాళిక! బ్రాహ్మివి వాణివీవె యో
    పార్వతి! వీవు విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్

    రిప్లయితొలగించండి
  39. ముగ్గురమ్మలకీవెగామూలమిలను
    దుర్గ! దూరముజేయుముదుఃఖతతులు
    పద్మభవురాణి, పరమేశు పత్నియైన
    పార్వతీ, విష్ణుపత్నివై భద్రమిడుము

    రిప్లయితొలగించండి
  40. పర్వ పర్వముల నుతింతు గర్వ ముడిగి
    క్షీర జలధి సంజాత లక్ష్మీ సునామ
    సర్వ సంపత్ప్రద దయా రస గుణ విజిత
    పార్వతీ విష్ణుపత్నివై భద్ర మిడుము


    ఉర్వినిఁ దామ సాంధము నహో నశియింపఁగఁ జేయ నిర్మలా
    ఖర్వ విశేష తైలమును గంధ యుతమ్ము నొసంగ నే నిటన్
    సర్వ జగత్తు వెల్గుల ప్రసారము నారయ దీప మందు నే
    పా ర్వతి వీవు విష్ణు సతివై నను బ్రోవవె సత్కృపామతిన్

    [ఏపారు +వతి = ఏపా ర్వతి; వతి = దీపపు వత్తి; విష్ణువు = అగ్ని;
    ఇక్కడ సమస్య లోని యఖండ యతి పరిష్కృత మైనది]

    రిప్లయితొలగించండి
  41. గురువు గారికి నమస్సులు.
    ముగురుశక్తులసంయుక్తమూలహేతు
    పార్వతి,విష్ణుపత్నియై భద్రమిడుము
    భారత ప్రజల ధనమును,భక్తి తోడ
    శంకరుని యందు పరిపూర్ణ చరణములివి.

    రిప్లయితొలగించండి
  42. తే. గీ.

    రాజకీయాన మెప్పొంది రాటు దేల
    శక్తి విత్తము సమపాలు సాగు బడదె
    బలము యోగ్యత ప్రాప్తింప భక్తి గొలువ
    పార్వతీ, విష్ణు పత్నివై భద్ర మిడుము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  43. శర్వుడు విష్ణురూపమునసంయమిసాఁగఁగస్నాతకంబునన్
    "పార్వతి"సర్వమంగళసుభాషిణిభారతిభాగ్యలక్ష్మిగన్
    సర్వముపెండ్లివేడుకలుశాఖపుపాకములడ్డులందగన్
    పార్వతి వీవు విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపామతిన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  44. శర్వుని రాణివై సకల జాతులగాచెడు మాతృమూర్తి చా
    తుర్యమునన్ మహాధృతిని ధూర్తుల దర్పమడంచెడిన్ సతీ
    పార్వతి వీవు; విష్ణుసతివై ననుబ్రోవవె సత్కృపామతిన్
    సర్వము సత్స్వరూపముగ సంపదలిచ్చుచు భాగ్యరాశివై

    రిప్లయితొలగించండి
  45. శార్వరినామకంబలరిశంభునిభర్తగబొందునామెయే
    పార్వతి,వీవువిష్ణుసతివైననుబ్రోవవెసత్క్రపామతిన్
    సర్వద,రుక్మీణీలలన!శాంతినిబొందగనెల్లవేళలన్
    సర్వులరక్షణంబునుబ్రశాంతతగల్గగజేయుమాదయన్

    రిప్లయితొలగించండి
  46. విష్ణునామముఁగల్గినవిప్రవరుడు,
    పాణియందించువధువుగాపార్వతమ్మ,
    పెండ్లి వేడుక తిలకించి పెద్ద లనిరి
    "పార్వతీ విష్ణుపత్నివై భద్రమిడుము"
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  47. నిరతము మునులు గొలుతురు నీదు మగని
    పార్వతీ ! , విష్ణుపత్నివై భద్రమిడుము
    లక్ష్మీ ! మమ్ముల గాచిన లక్షణముగ
    నీమగని మేము గొలుతుము నిరతముగను

    రిప్లయితొలగించండి
  48. శార్వరిదెచ్చెనీభువికి శార్వరులట్లు కరోన రక్కసిన్
    సర్వజనాళి వ్యాకులముశాపముగా పరిణామమొందె నే
    నోర్వగలేను నీవెగతి ఓ జగదంబ భవాని వాణియున్,
    పార్వతి వీవు విష్ణుసతివై నను బ్రోవవె సత్కృపా మతిన్

    రిప్లయితొలగించండి


  49. మరో రెండు పూరణములు.

    అజుని పట్టపురాణి వీవనవరతము
    సన్మతినొ సంగి కావుము,శక్తి నొసగు
    పార్వతీ, విష్ణు పత్నివై భద్రమిడుము
    కూర్మి తో కొలిచెదమమ్మ కువలయాక్షి.

    పర్వత రాకుమా రివిగ బన్నము బాపెడు తల్లివేగదా
    పార్వతి వీవు;విష్ణుసతి వైనను బ్రోవవెసత్కృపామె యిన్
    గర్వము చేరనీ యకను కాంతుని తోడగృ హమ్ము నందునన్
    సర్వశుభమ్ములెల్లపుడొసంగుచు కావగ రమ్ము గోమినీ.

    రిప్లయితొలగించండి
  50. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువుగారికి నమస్కారములు.

    రిప్లయితొలగించండి
  51. శ్రీ గురుభ్యోన్నమః
    తేటగీతి
    వాడు నొక వెర్రిబాగులవాడు కాడె!
    వెంటనే వరము లొసగు !వేడు చుండ!
    నీకు బూడిద తప్పించి నేమి నిచ్చె ?
    పార్వతీ విష్ణుపత్నివై భద్రమిడుము

    రిప్లయితొలగించండి