31, మే 2020, ఆదివారం

సమస్య - 3385

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భావము గానముగ నెగడ బాధయె కల్గెన్"
(లేదా...)
"భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్"

80 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    నావల కాదురా యనక నందము నొందక గొంతు చీల్చుచున్
    బావురు మంచు నేడ్చి కడు బాధల నోర్చుచు ప్రేమకోసమై
    చేవయె లేక పాడగను చేడియ నేర్పగ మిస్సియమ్మలో
    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్

    "మీకు మీరే మాకు మేమే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పుణ్యాన ఇప్పుడే యూట్యూబులో 'మిస్సమ్మ' సినిమాలో ఆ సంగీత సాధనా ఘట్టం చూసి హాయిగా
      కళ్ళవెంట నీళ్ళు వచ్చేలా నవ్వుకున్నాను. ధన్యవాదాలు!
      మీ పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    త్రోవను పోవుచున్ వినగ తోరపు ప్రీతిని వానకాలమున్
    కోవెల బైట నాదటను కూరిమి మీరగ ముత్తుకూరునన్
    కావలె మాకు మీరనుచు కప్పలు మెండుగ ప్రేమచూపగన్
    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్.....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను గార్ధభ గానాన్ని ఊహించాను నీనుంచి ! వెరైటీగా మండూక గానం వచ్చింది :)

      తొలగించండి
    2. శాస్త్రి గారూ,
      బెకబెకల గానంతో మీ పూరణ స్వభావోక్త్యలంకారంతో మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
      ****
      సీతాదేవి గారూ,
      మీరు గమనించలేదేమో... మొదటి పూరణలో అన్యాపదేశంగా గార్దభగానాన్నే ప్రస్తావించారు.

      తొలగించండి
    3. అవును గురువుగారూ!అన్నయ్యకు ముత్తుకూరన్నా,గాడిదలన్నా ప్రీతి :)

      తొలగించండి
    4. ఆ ముత్తుకూరులో పుట్టిన ఒక గాడిదను నేను :)

      తొలగించండి
  3. ఏడ తానున్నాడొ బావా!
    బావయె దూరము గాగను
    నావల నంతఃపురమున నావేదనతో
    జీవించెడి మల్లీశ్వరి
    భావము గానముగ నెగడ బాధయె గల్గెన్

    రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే!

    తావియు బూవూలై వరలు దంపతులిద్దరు నిత్యతోషులై
    యేవురు సంతతిన్ గలిగి యిమ్ముగ కాపురముండ కాలమే
    చేవను జూపుచున్ పతిని చెంతకు బిల్వగ శోకసంద్రమౌ
    భావము రాగమై నెగడ బ్రాణము రంపపుగోత బొందెడిన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నాచెల్లెళ్ళిద్దరికి ఇద్దరే... ఇద్దరూ తెలుగు క్లాసికల్ మూవీలను ప్రస్తావించారు.
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.
      ఇక మీ రెండవ పూరణతో ఒక జ్ఞాపకం... మా అబ్బాయి 13వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబాన్ని 'మాతృదేవోభవ' సినిమాకు తీసుకెళ్ళి అందర్నీ ఏడిపించాను.
      అన్నయ్య ప్రస్తావించిన మిస్సమ్మ ఎంతగా నవ్విస్తుందో, మీరు ప్రస్తావించిన మాతృదేవోభవ అంతగా ఏడిపిస్తుంది.
      రెండూ కన్నీళ్ళు తెప్పించేవే!

      తొలగించండి
    2. ధన్యోస్మి గురుదేవా!నమస్సులు!
      నవ్వినా యేడ్చినా కన్నీళ్ళే వస్తాయి!ఏ కన్నీటెనకాల యేముందో తెలుసునా? ముద్దబంతి పూవులో!

      తొలగించండి
  4. 31.05.2020

    *సమస్య :"భావము గానముగ నెగడ బాధయె కల్గెన్"*

    *నా పూరణ* 🌸

    *కం*

    దేవుని భక్తిగ కొలుచుచు
    జీవుడి చింతలు తరుగగ చిత్తమునందున్
    కోవెల మదయే నని స
    *ద్భావము గానముగ నెగడ బాధయె కల్గెన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'కోవెల మదియే యని' అని ఉండాలకుంటాను.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏
      సవరణతో

      దేవుని భక్తిగ కొలుచుచు
      జీవుడి చింతలు తరుగగ చిత్తమునందున్
      కోవెల మదియేయని స
      *ద్భావము గానముగ నెగడ బాధయె కల్గెన్"*

      తొలగించండి
  5. పూవుల విలాప పద్యము
    లా వరగంధర్వ గాయకాలపితములై
    ఆ వేదనాభరిత కవి
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్

    రిప్లయితొలగించండి
  6. జీవమునున్నగాయకుడుచిత్తమునెప్పుడుగానశాస్త్రసం
    భావనమైసమాజహితవైఖరినూతముఁగార్మికాంకినిన్
    వీవథమందుఁగష్టపడవేదనమొందివిశేషరాగమున్
    "భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్"

    వీవథము= మార్గము

    రిప్లయితొలగించండి


  7. ఆవల కలడనెడు విభుం
    డీ వల వలయమున బతికెడీ జీవి వెతల్
    కేవలముగ చూచు నేమో
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  8. కందోత్పల - ఆగప - తెడ్డు ఆంధ్తభారతి‌ ఉవాచ


    తపమున తోచె విభుడె యా
    గప! భా వము గానమై నెగడఁ బ్రా ణము ఱం
    పపుఁ గోఁతఁ బొందె "డింగరు
    డ!పరాత్పర కావుమయ కడయు నీవెనయా"


    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. కేవల మాతడే మనుపు! కిమ్మనకుండె గదా! జనాళికో
    కేవల మాయె జీవితము! కింకటచేసె కరోన ! చూడడే
    యావలి వాడు చూడడె ప్రయాస, వెతల్! తనలో నభద్రతా
    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. కం//
    కావను వాడే లేడను
    శ్రీ వనితాద్వేషముగల చిత్తగు వాఁడున్ !
    పావన భగవద్దూషణ
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్ !!

    రిప్లయితొలగించండి
  11. బావయు కోరగ పాటను
    భావము లేకుండ పాడెపల్లెపు మరదల్
    నావలదు వినుట! నాపుము
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్

    రిప్లయితొలగించండి
  12. నీవేమో నా  మాటల 
    నావల వెట్టంగ నాదు  ఆశల నెల్లన్ 
    కావలెనని త్రోయగ నా  
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్ 

    రిప్లయితొలగించండి

  13. * శంకరాభరణం వేదిక *
    31/05/2020..ఆదివారం

    సమస్య
    ****

    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్"

    నా పూరణ. ఉ.మా.
    **** **** ***

    కావర మూని రావణుడు గైకొని జానకి నేగె లంకకున్

    పావన మూర్తి రాఘవుడు భార్య వియోగము తాళజాలకే

    తా విలపించి తీవ్రముగ దారుణ వేదన నొంద నట్టిదౌ

    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్"


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  14. త్రోవరులై తమ యూరికి
    పోవలె నను కాంక్షతోడ మూకుమ్మడిగా
    త్రోవను నడిచెడు పేదల
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్

    రిప్లయితొలగించండి
  15. జీవిత భాండా గారము
    కోవిదులకు వింతగొల్పు;గూఢముగానౌ!
    సేవిత రామ చరిత్రపు
    భావము గానముగ నెగడ బాధయె కల్గున్.

    రిప్లయితొలగించండి
  16. జీవన భృతి గోల్పోవగ
    చావుకు బ్రతుకునకు నడుమ సాగుచు దేవా
    బ్రోవు మనెడి శ్రమ జీవుల
    భావము గానముగ నెగడ బాధయె గల్గెన్!

    రిప్లయితొలగించండి
  17. జావళి పాడెద ననుచును
    దేవళ మందున నొకరుడు తికమక రీతి న్
    చేవపు శృంగార మొలకు
    భావము గానముగ నెగడ బాధయె గల్గె న్

    రిప్లయితొలగించండి
  18. భావమురసభరితంబన
    కైవల్యముజేరవచ్చుగానముతోడన్
    భావమురసరహితంబన
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  19. జీవము ఠావులు తప్పగ
    కావగ గోపన్న భజన కరుణను సేయన్
    పావన రాముని కృతులను
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్

    రిప్లయితొలగించండి
  20. పావని సీతను చూలా
    లిన్,వనమున విడుచు సీను లీనము నేనై
    బోవ 'లవకుశ'న శోకపు
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      రెండవ పాదంలో ప్రాస తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. పావని సీతను లక్ష్మణు
      డే విడిచె నడవిన రాముడి వచన బద్ధుం
      డై,వదిన గతికి గుమిలిన
      భావము గానముగ నెగడ బాధయె కల్గెన్.

      తొలగించండి
  21. మైలవరపు వారి పూరణ

    ఈ విలయమ్ము జూడనిది యింతయి విశ్వము తల్లడిల్ల., నీ..
    లావున మృత్యుఘంటికల లక్షలమంది హరించుచుండగా
    గావలె దేవ! రక్ష., కనికారము జూపవె! శోకపూర్ణమై
    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  22. జీవనతత్వభావనలజీవుడుదేవుడునేకమౌచుస
    ద్భావపుగీతగానమదిబాధనుబాపగభాసురంబునై,
    కేవలనిస్తుభావనలగీతములల్లుచుకీర్తికాంక్షనౌ
    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  23. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః తేది:31-05-2020. మహోదయులందరికి నమస్సులతో, శుభోదయం.

    నేటి సమస్యాపూరణాల యత్నం -

    చావక ధనయాసపెరిగి
    కావ వలయువాడె దేశ కాపగుగుహ్యం
    బే వమ్ముజేసియమ్మెడి
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్.

    రావణు డాతతం దచట రక్కసు లందరి తోడ జెప్పెనే
    యీ విధమైన యీమె నిక యేవిధమైనను నావశంబు జే
    యన్ విధి, యన్నమాటలకు నందరు సీతను హింసజేయు నా
    భావము గానమై నెగడు బ్రాణము ఱంపపు గోత బొందెడిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి.
      నా సవరణలను వాట్సప్ లో చూడండి.

      తొలగించండి
  24. త్రోవను పాదచారులయి దూరము నెంచక కాకరూకులే
    పోవలె సొంతయూరికని మూటల నెత్తి కుటుంబ మెల్లరుల్
    త్రోవరు లౌచు సాగు జన దుర్భర యత్నము గాంచినంతనే
    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్

    రిప్లయితొలగించండి
  25. లేవే పనులును సేయగ
    జీవిక యెటులో దెలియక జిక్కిరభాగ్యుల్
    బోవగ దారియు దెలియని
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్

    రిప్లయితొలగించండి
  26. ఆ విధి రామచంద్రునికి నద్భుత రీతిగ రామదాసుడే

    కోవెల కట్ట,చట్ట విముఖుండను చుం జెరసాలనుంచిరే

    దేవుని కృత్యమే యయిన దెబ్బల కోర్వక కీర్తనమ్ముగా

    భావము గానమై నెగడఁ బ్రాణము రంపపుఁ గోత బొందెడిన్

    రిప్లయితొలగించండి
  27. చావులు దైవకృత్యములు శంభుని లీలలటంచునెంచుటా
    కావర కష్టమానసము గల్గిన వారల దుష్ట చర్యయా
    కావగరమ్ము శ్రీదయిత కర్కశమైన కరోన నుండి నా
    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్

    రిప్లయితొలగించండి
  28. ఉ:

    జీవము లేని రాగముల చింతన సేయక నాలపించుటన్
    పావన శ్రావ్య గీతములు భక్తులకెల్ల నశాంతి గూర్చగన్
    కావుమటంచు దేవరను కంఠము విప్పగ వేడి కోలుగన్
    భావము గానమై నెగడ బ్రాణము ఱంపపు కోత బొందెడిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  29. ఆ వర వనాంతరమ్మునఁ
    బావన ముని పుంగవునకు వాల్మీకి కహో
    యా విపరీతము విహ గా
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్


    దేవున కర్పణమ్ముగ విధేయత నుండి ఫలమ్ము కోరకే
    పావన నిత్య కర్మములు పన్నుగఁ జేయఁ బరమ్ము వొందుదుర్
    నీవృ దధీశుఁ డేన యని నిత్యము సేసెడి చేతలం దహం
    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్

    [నీవృత్తు = దేశము]

    రిప్లయితొలగించండి
  30. *సరదా పూరణ* 🙏😀

    *కం||*

    నీవిక పాడుట తగదుగ
    పోవిక నీ పాట మేము వోపఁగ నెటులా
    దేవుని మ్రొక్కెద మనిన ప్ర
    *"భావము గానముగ నెగడ బాధయె కల్గెన్"!!*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  31. బావయెసర్వము మల్లికి
    బావనుగనలేకయెడదబరువైపోగా
    బావవలపుమదిదలచుచు
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్

    రిప్లయితొలగించండి
  32. కందం
    కావలసిన పాటనిడితి
    నావల వేరొకరి పేర నచ్చెరువొందన్
    నేవింటినదేమిటొ నా
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్!

    ఉత్పలమాల
    "రావయ !యొక్కపాట మది రంజిల మా సినిమాకు వ్రాయుమా!
    కావలె" నన్న నిచ్చితిని కాసుల కెంచక మిత్రుడంచు నే
    నావల యోక్కమారు విన నచ్చెరువొందితి వేరు పేర నా
    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్


    రిప్లయితొలగించండి
  33. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  34. జీవనముబరువుగాగను
    నీవేలుపుగాచుననుచు నీశునిగొలువన్
    నావిభునామమహత్యపు
    భావముగానముగనెగడబాధనుగల్గెన్

    రిప్లయితొలగించండి
  35. ఆవిరియీపిరైభువికియాయువుతగ్గగ బాధనొందనా
    భావముగానమైనెగడబ్రాణముఱంపపుగోతబొందెడిన్
    పావనుడైనరామవిభుభక్తినిగొల్చీనమోక్షమిచ్చునే
    గావునసేవజేయుమికకాంక్షలుదీర్చునుదప్పకుండగన్

    రిప్లయితొలగించండి
  36. శుక్రాచార్యులవారు బలిచక్రవర్తితో నిట్లనియె.

    భావింప బాలకుండే
    కావింపకు దానమింక కపటుడు విష్ణుం
    డీవిధమున నరుదెంచెను
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్.

    రిప్లయితొలగించండి

  37. ఓవగ రామ సత్కథకు నూపిరి లౌ గతి నయ్యయోధ్యలో
    భూవరపుత్రి నందనులు ముగ్ధుల జేయుచు బాడ గాధలో
    రావణ లంకలో జనని రాక్షస బాధల ఘట్ట మందు నా
    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్.

    రిప్లయితొలగించండి
  38. కావగరమ్మటంచునిను గాఢపు భక్తిని పూని కొల్చి తిన్
    సేవకు చిక్కెనీఫలముచిన్మయ రూపుడ చింతవీ డితిన్
    దైవ వశమ్మునన్నిచట దల్చెడి వీలుల భించెనయ్య నా
    భావము గానమై నెగడు ప్రాణమురంపపుకోత నొందె డున్

    రిప్లయితొలగించండి
  39. పూవులతోటకుంజనగ పూవులుజాలిగ నోళ్ళు విప్పిమా
    జీవముతీయబోకుమని చింతిలి చేసిన విన్నపంబులన్
    భావనచేయ మానసము భారముతోడుత నుమ్మలించ నా
    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్

    రిప్లయితొలగించండి