ఈడగు వేళ భావనలు యేదెస నా మది ప్రజ్వరిల్లెనో ? కూడగ నేల భాస్కరుడు కోరిక దీర్చగ నప్రయత్నమున్ వీడగ లేని దుస్థితిది వెన్నడి రాకయె మిన్నకుండునా ! చూడని దాని జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్
నమస్తే! ఆర్యా! నేను ఇటీవలే పద్యాలు రాయడము నేర్చుకుంటున్నాను.అగ్రజుల వారి పర్యవేక్షణలో.(లాక్డౌను కాస్త తోడయింది. సమస్యా పూరణ నా ప్రయత్నము. వాడల ముద్దుగ తిరిగెడి వాడు మన యశోద పిల్ల వాడున్ కాంచెన్ నేడు చవితి చంద్రుడినే చూడకుమన జూచినాడ జూడని దానిన్
నాడు చిరుత తనమందున
రిప్లయితొలగించండిచూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
నేడు ముదితనము నందున
వాడకుమన వాడినాడ వాడనిదానిన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
మోడి ఉవాచ (నాతో రహస్యముగా):
తోడుగ నెక్కి కాప్టరును దొంగల చూపున జాలమందునన్
వేడుక మీర చూచి కడు వేదన లిచ్చిన గాలివాననున్...
పోడిమి మీర పోవగను ముద్దుల కొల్కత; నా ముఖమ్మునున్
చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్
కాప్టరు = helicopter
తొలగించండిచూచిన దానికి ఖాతా ఖర్చు వెయ్యి కోట్లు :)
మీ సరదా పూరణ బాగున్నది.
తొలగించండి🙏
తొలగించండి
తొలగించండిజిలేబి గారు:
ఆమె అడిగినది లక్ష కోట్లు 😊
రిప్లయితొలగించండిబోడి జిలేబీ సొంపుల
తోడు భళి నాట్యమాడె దూకుడు తాళం
బేడున! రికార్డు డాన్సుల
చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. "భళిర నాట్యమాడె" అంటే సరి!
27.05.2020
రిప్లయితొలగించండిఅందరికీ నమస్సులు 🙏
నా పూరణ ..
*కం||*
వేడుక కాదుగ గ్రహణము
చూడకు నువు తొందరపడి చూపులు బోవున్
తేడా జేయును గదయని
*"చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్"!!*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏
27.05.2020
తొలగించండిఅందరికీ నమస్సులు 🙏🙏
*కం||*
వేడుక కాదుగ బెండ్లన
చూడకు నువు చూపులనుచు చుక్కలు నెదురౌ
మోడౌ నీ జీవితమని
*"చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్"!!*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
😊😀😊😀😊
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండిరెండింటిలోను 'నువు' అనడం సాధువు కాదు. "చూడవలదు" అనండి.
రిప్లయితొలగించండికందోత్పల
కనులార్పక నాట్యపు పొల
తిని చూడనిదానిఁ జూచితిని చూడకు మ
న్నను దొంగచాటుగన్ కిసు
కున నవ్వుచు చూచె నన్ను గువ్వల చెన్నా
జిలేబి
అద్భుతం!
తొలగించండి
రిప్లయితొలగించండిచూడగ చూడగాను తన సొంపులె కిక్కును చేర్చెనయ్య! పూ
బోడి రికార్డు డాన్సులను పూతలపట్టున కన్నులార్పకన్
చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్,
వాడిగ నవ్వె జూచి నను పాటల కైపుల తో జిలేబియే
సెన్సారు కత్తెర పడునా :)
జిలేబి
🙏😀
తొలగించండిSan Saar ఏమంటే అదే ..
😷
బాగుంది. నా కత్తెర ఛందోవ్యాకరణాలకే పని చేస్తుంది.
తొలగించండి👌👌😀😀🙏
తొలగించండి
రిప్లయితొలగించండివాడు సుమా లేడోయీ
చూడకుమనఁ జూచినాఁడఁ ! జూడనిదానిన్
లేడనుచు చెప్పు టేలా
తోడు కలడతడు జిలేబి తొందర పడకే!
నాస్తికత్వమేలా!నాస్తికత్వం మేలా ?
జిలేబి
కనపడని చెయ్యేదో నడుపుతుంది నాటకం.. ఆ నాటకంలో నువ్వు నేను కీలుబొమ్మలం.
తొలగించండిబాగుంది మీ పూరణ.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వేడుక మీర మెచ్చగను పెండిలి యాడిన క్రొత్త రాత్రులన్,
మాడిన మోముతో వధువు మండుచు తిట్టుచు మొట్టుచుండగా
పోడిమి స్వప్నమందునను ముద్దుల మాధురి, జీవనమ్మునన్
చూడనిదానిఁ, జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్
మాధురి = మాధురి దీక్షిత్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది.
తొలగించండితొలిరాతిరే మొట్టికాయలా?
🙏😊
తొలగించండిఅయినా అది ఆశాపరేఖ్, వైజయంతిమాల, నూతన్ ల జమానా కదా? కొత్తతరం మాధురి ఎలా వచ్చింది కలలోకి? లేట మ్యారేజా?
తొలగించండి
తొలగించండిVery very late...
క్రీడాస్పూర్తినిదెలుపగ
రిప్లయితొలగించండిగోడకుఁగన్నులనుమూసిగోప్యతనిలుపన్,
వీడుచునియమమునచ్చట
చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివాడినపూల, వెండ్రుకల., వాడికటారిని., కల్లుముంత., వ్రే...
లాడుచునున్న పుఱ్రె., దగులంబడు కట్టెల నిమ్మకాయలన్
చూడగ భీతిగల్గెడిని., క్షుద్రమతార్చన ముందునెన్నడున్
చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిఇన్ని చూచారు ఆ తరువాత శాకిని ఢాకిని వచ్చే రా లేదా చూచారా లేదా :)
మైలవరపు వారి పూరణ బీభత్సరస ప్రపూర్ణం. ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండి(1964లో విడుదలైన 'ఆత్మబలం' సినిమాలో నాగేశ్వర రావు, బి. సరోజాదేవి ల వానపాట ఆకాలానికి అశ్లీలం. ఆ సినిమా చూడవద్దని మా నాన్నగారి హెచ్చరిక)
రిప్లయితొలగించండివేడుక 'ఆత్మబలం'లో
పాడగ 'చిటపట చినుకులు పడుతూ ఉంటే'
పాడైన వానపాటను
చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
తొలగించండిఈ నాటి పాటలతో చూసుకుంటే అది పాతివ్రత్య మహాత్మ్యము పాట :)
తొలగించండినాట్యం కూడా...
__/\__
తొలగించండిఅలనాడు ఇందిరాపార్కు లో చిత్రీకరణ జరిగినదా పాటకు.🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచూడగ నశ్లీలమునై
పోడిమి మార్చుచు చలించు పొలుపివ్వనిదౌ
పాడిని గూడిన నృతినిన్
చూడకుమన జూచినాడ జూడని దానిన్.
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికీడవు గనులకు! సూటిగ
తొలగించండిచూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
వేడుక సూర్యగ్రహణము!
వాడి మసిఁ బులిమిన కాచ ఫలకపుటడ్డున్!
మీ పూరణ బాగున్నది.
తొలగించండిచూడకునటు! నిటురారా
రిప్లయితొలగించండి'పాడె'ను దీసికొని బోవుపలువురు నటుగా
వేడుక గాదుర నదియును
చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండి"చూడకు మటు..."
గోడకునావలవైపున
రిప్లయితొలగించండిమేడకలదుగంటినందు మినుకుమిటారిన్
చూడవలదుపరకాంతల
చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిపాడగుదువుబాలక యని
రిప్లయితొలగించండివేడిరి చూడకు డిటెక్టు వీడియొలనుచున్
తోడెవ్వరు లేకున్నను
చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిపాడెని మోసుకు నల్గురు
చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
చూడ తెలిసె జీవితమే
క్రీడ! బతుకు నాల్గు మూర్ల కీవాడ సుమీ
వేదాంతం
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండివేడుక కద వలదన్నను
రిప్లయితొలగించండిచూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదాని
న్వీడక నను బాధించెను
పాడగు ఈ గ్రహణ దోష బాధై నన్నున్
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'బాధ+ఐ' అన్నపుడు సంధి లేదు. "బాధయె" అనండి.
రిప్లయితొలగించండివారుణీ కత :)
వాడచట తాగె పూటుగ!
చూడకుమనఁ జూచినాఁడఁ! జూడ నిదానిం
చాడను కొంటి జిలేబీ
వాడో పడె బోర్ల! త్రోవ పాన్పుగ మారెన్
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'చూడని దానిం చాడనుకొంటి'?
తొలగించండినిదానించు - సంభాళించుకొను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోడెతనమ్ముఁగ్రొత్తచవిఁగోరగనామదిగాంచిపెద్దలా
రిప్లయితొలగించండివాడియుఁగల్గుప్రేమయిలవద్దనిచెప్పిరిశుద్ధవాక్కులన్
చేడియసౌకుమార్యమునచిత్తవశీకరణంబుగాగనే
"చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్"
మీ పూరణ బాగున్నది.
తొలగించండికేడీలా తిరుగునురా
రిప్లయితొలగించండిపాడలవాటులకు దాసి వనితయె యౌరా!
ఆడుదటన్ పేరయతో
చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిమాడిన వంటలు తినమని
రిప్లయితొలగించండివేడుకగా మొరపెట్టె నంట ప్రేయసి ముదమున్
మాడిన బొగ్గులు గాడిని
చూడకు మనఁ జూచినాఁడఁ జూడని దానిన్
అక్కయ్యా! ఆరోగ్యమెలా ఉంది?
తొలగించండిమీ పూరణ బాగున్నది.
రెండవ పాదంలో గణభంగం. "వేడుక మొరపెట్టె" అనండి.
నీడకు జనిదుకూలము
రిప్లయితొలగించండిజేడియ మార్చుచు ననుగనె చేరువ యందున్
వ్రీడనముతోడ నన్నున్
జూడకు మనఁ జూచినాఁడఁ జూడని దానిన్.
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'నీడకు జనియు..' అనండి. లేకుంటే గణభంగం.
వేడుకనీకయె కృష్ణా
రిప్లయితొలగించండిచూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
క్రీడల నాడుచుజలమున
పాడగ,గోపికలవలువబట్టుకు బోయెన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిచేడియ కన్నుల లోనికిఁ
రిప్లయితొలగించండిజూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
లేడి కనుల నీవే నా
వాడను భావము నొయారి వలపు తెలుపుచున్!
పాడౌదు వాడువారిని
తొలగించండి*జూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్*
మోడైపోయె బ్రతుకు పెం
డ్లాడవలసి వచ్చి దాని నయ్యొ హతవిధీ!
వేడుక గూర్చక మనము ల
రిప్లయితొలగించండిపాడొన రించు నని తండ్రి పలుమరు దెలుప న్
తోడుగ మిత్రుని తో జని
చూడకు మన జూచి నాడ జూడని దానిన్
'కూడదు కృష్ణా!మమ్ముల
రిప్లయితొలగించండిచూడకు'మన,'జూచినాడ జూడనిదానిన్,
చూడనిది నేనిల గలదె,
వీడుము సర్వము శరణము వేడు'మనె కృపన్.
(గోపికా వస్త్రాపహరణ సందర్భ సంభాషణ)
కూడదు చవితిన చంద్రుని
రిప్లయితొలగించండిచూడుట యనునది తెలిసియు చోద్యము తోడన్ |
వాడుక తలపక పెద్దలు
చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్"
కోడెకుదూడబుట్టెననికొందరుఁబల్కిరసత్యవార్తలన్
రిప్లయితొలగించండిదూడకుగొమ్ములొచ్చెననిదుష్టులుబెంచిరినాటివార్తలన్
వాడిగవేడివేడిగనుబాఱునసభ్యపురీతిమున్నెపుడున్
చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్"
కొరుప్రోలు రాధాకృష్ణారావు
శ్రీ లక్ష్మీ నారసింహాయనమః
రిప్లయితొలగించండిమహోదయులకు నమస్సులతో,మేలి వేకువ.
నేటి సమస్యాపూరణల యత్నం-
నాడర్ధరాత్రి కేశము
గూడిన యాబొమ్మపాతి గొంద రచటనే
గూడగ నన్నావైపుకు
జూడకు మన జూచినాడ జూడని దానిన్.
వాడెపుడైన రామకథ వీనుల విందగు దేమికాదనున్
తోడుగ గొందరాతనికి తొత్తుగ జర్ఛల జేతురట్టి యా
కూడని వాదముల్ గనకు గూతుర టీవి య నన్ణ్చబూనినే
చూడని దాని జూచితిని చూడకుమన్నను దొంగచాటుగన్.
-🌻-
చేడియ వ్రాసి యుత్తరము చేర్చుము ప్రీతుని కంచు నన్ను తా
రిప్లయితొలగించండివేడగ వల్లె యంచు కడు వేగముఁ జేరగ బోవు వేళ నా
యాడది వ్రాసెనేమియని హౌసది కల్గగ లేఖ విప్పి నే
చూడని దానిఁ జూచితిని చూడకు మన్నను దొంగ చాటుగన్.
కుంతీ దేవి మనో వేదన
రిప్లయితొలగించండిఉ:
ఈడగు వేళ భావనలు యేదెస నా మది ప్రజ్వరిల్లెనో ?
కూడగ నేల భాస్కరుడు కోరిక దీర్చగ నప్రయత్నమున్
వీడగ లేని దుస్థితిది వెన్నడి రాకయె మిన్నకుండునా !
చూడని దాని జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్
వై. చంద్రశేఖర్
వాడనివన్నెచిన్నెలతొవావిరియైకనువిందుచేయునా
రిప్లయితొలగించండిచేడియయందచందములు చిత్తమునందు పరిభ్రమించగా
కూడదటంచుమానసముకోర్కెకు కళ్ళెము వేయబూనినన్
చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్
వేడుకఁ రాధిక జలకము
రిప్లయితొలగించండిలాడగఁగృష్ణుడుసరసపు లాలనజూపన్
మోడునుచాటుగఁ జేకొని
చూడకుమనజూచినాడుజూడనిదానిన్
నమస్తే! ఆర్యా! నేను ఇటీవలే పద్యాలు రాయడము నేర్చుకుంటున్నాను.అగ్రజుల వారి పర్యవేక్షణలో.(లాక్డౌను కాస్త తోడయింది. సమస్యా పూరణ నా ప్రయత్నము.
రిప్లయితొలగించండివాడల ముద్దుగ తిరిగెడి
వాడు మన యశోద పిల్ల వాడున్ కాంచెన్
నేడు చవితి చంద్రుడినే
చూడకుమన జూచినాడ జూడని దానిన్
వాడల వాడలఁ దిరుగుచు
రిప్లయితొలగించండిదూడల బలిగొను చిఱుతను దుఃఖము తోడన్
నాఁడు జనులెల్లరు తలఁకు
చూడకు మనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
[తలఁకుచు + ఊడకు = తలఁకు చూడకు; ఊడు = వదలు]
చూడుఁడు చూడుఁ డన్న లనఁ జూచెడి వారలఁ జూడ శక్యమే
చూడకు చూడ కన్న మఱి చూచెడి వారలు సూడ కొల్లలే
చూడకు మన్నఁ జూచుటయుఁ జూడమి నిక్కము చూడు మన్నచోఁ
జూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్
ఆడము అంతర్మధనం :
రిప్లయితొలగించండికందం
ఆడము నీవుకుఁ దోడై
వీడుచు భగవంతునాఙ్ఞ వెర్రి పిశాచం
బాడగ నాపిలుఁ గొని రుచిఁ
జూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
ఈవు అంతర్మధనం :
ఉత్పలమాల
ఆడము జంటగా భువిని హాయిగ సంతస మందుచుంటి నే
నాడును దైవ సూచనను నైతికమంచును దాటకుంటి, నే
నోడితి నప్పిశాచపు కుయుక్తికి నాపిలి నోటితో రుచిన్
జూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచూడనివాటినిజూసియు
రిప్లయితొలగించండిచూడకుమనజూచినాడజూడనిదానిన్
చూడకుమనిననుజూచెను
వీడెవడురబాబుచూసెవీడియొవోలెన్
చేడియ తానమా డగను చీరికి గైకొని చూడరాదనిన్
రిప్లయితొలగించండిబోడులు వస్త్రముల్ వదల పోకిరి లాగున నక్కిచూచుటన్
పాడియు గాదు మానసము పాడగు, వద్దని పెద్దలన్న నే
చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్.
చూడనిదానిజూచితినిచూడకుమన్ననుదొంగచాటుగన్
రిప్లయితొలగించండిచూడుముసోదరాయికనుచూడ్కులుసంతసమొందగాభళీ
చూడగరానివైనవిటచూడగదగ్గవియన్నియున్వెసన్
చూడగదొంగచాటుగనుచోద్యమునౌగదభీతిదేనికిన్
నాడయె సూర్యగ్రహణము
రిప్లయితొలగించండివేడుకగా నుత్సుకతను భీతియె లేకే
క్రీడించెడు నీడున నే
చూడకుమన జూచినాడ జూడనిదానిన్
వాడుక మీదటన్ మనసు బాసలనన్నిటి వ్రాసియుంచెడిన్
తోడగు డైరిపుస్తకము దొర్కగ బీరువ లాకరందునన్
గూఢపుచర్యలన్ వెదకి గుట్టునుదేల్చగ దొంగయింటిలో
చూడనిదాని జూచితిని చూడకుమన్నను దొంగచాటునన్
వేడుకగాదు చూచుటకు వెళ్ళుము దూరముగా నటంచునున్
దోడుగబోవ గాన్పునకు దుఃఖమునందెడు సోదరీమణిన్
వీడగబల్క వైద్యుడట ప్రేగునుదెంచుకు పుట్టుబిడ్డడిన్
చూడనిదానిని జూచితిని చూడకుమన్నను దొంగచాటుగా
కం//
రిప్లయితొలగించండికీడును తనతోగొని మను
వాడిన సఖి వెడలుట అనివార్యంబవగన్ !
పాడైపోయిన గేహము
చూడకుమనఁ, జూచినాఁడఁ జూడనిదానిన్ !!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగైడు వసించు చోటునకు క్రన్నన చేరితి సంశయమ్ముతో
రిప్లయితొలగించండికూడదటంచు రక్షకుడు కోరిన వానిని లక్ష్యపెట్టకన్
చేడియతోడనాతడట చేరి చరించుచు నుండ, భీతితో
చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్
మూడెను నకటంచుమది పొందితి త్రాసము నాక్షణమ్మునన్
౧.
రిప్లయితొలగించండిచూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్"
పూరణ:
వేడుచు మ్రొక్క,గణేశున్
చూడకుమన చవితి చంద్రు చూడక నుండన్
కూడితి మిత్రుని రాత్రిన
చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్!!
౨.
చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్"
పూరణ:
వేడుక దీరనాడిరట వేశ్యలు పబ్బుల లోనపాడుచున్
చేడియ లందరుం గలిసి చేష్టలు దక్కగ, క్రీడ సల్పగన్
తాడనమందుచున్ నొకచొ, త్రాగిన వారలె తూలుచుండగా
చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్!!
నర్తనశాలలో భీమునిచేతిలో చావబోతూ
రిప్లయితొలగించండినేఁడిదె గోచరంబయె వినిర్మల సుందర కాంచనాంగి యీ
చేడియ ద్రౌపదేయనుచు చిత్తమునందునెఱింగినాఁడ యా
నాఁడె గ్రహించగల్గినచొ నా దురవస్థ ఘటించకుండునే
చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్
పీడగ మారెగా నకట వేదన బెట్టు కరోన నేడిలన్
రిప్లయితొలగించండివీడక బట్టు నేమరిన వీడకు మింటి నటంచు జెప్పుచున్
చూడగ బోవనీరు దొలి చూలిని జూడకనుండ లేక మున్
జూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్