19, మే 2020, మంగళవారం

కవిమిత్రులకు విన్నపం...

        ఎంతోకాలంగా అనుకుంటున్న విషయం...
        'సమస్యా పూరణలు' పేరిట ఇప్పటికి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అయితే అవన్నీ కవులు వ్యక్తిగతంగా తాము చేసిన సమస్యాపూరణలను ముద్రించుకున్నవే.
        'శంకరాభరణం - బృహత్సమస్యాపూరణలు' పేరుతో శంకరాభరణంలో ప్రకటింపబడిన 1116 మంచి సమస్యలను ఎన్నుకొని, ఒక్కొక్క సమస్యకు వచ్చిన పూరణలలో నాలుగు ఉత్తమమైనవి, విభిన్నమైనవి ఎన్నుకొని పూరించిన కవుల పేర్లతో సహా ప్రకటిస్తూ ఒక పుస్తకం తీసుకురావలన్నది నా చిరకాల స్వప్నం. ఈ పద్ధతిలో ఇది మొట్టమొదటి పుస్తకం అవుతుంది.  ఈ విషయాన్ని ఎన్నోసార్లు, ఎన్నో సమావేశాలలో, ఎందరితోనో ప్రస్తావించాను. అందరూ ఇది మంచి కార్యమని ప్రోత్సహించారు. ఎంతవరకు వచ్చిందని అడుగుతూ ఉన్నారు.
        పుస్తక ముద్రణా భారం తమదని శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు వాగ్దానం చేసారు. అంతేకాక ఎప్పటికప్పుడు ఈకార్యం పూర్తి చేయవలసిందిగా గుర్తు చేస్తున్నారు. 
అయితే ఇంతకాలంగా తీరిక లేకపోవడం వల్ల, తరచూ ప్రయాణల వల్ల, అనారోగ్యం వల్ల, డిటిపి పనుల ఒత్తిడి వల్ల నేను ఈ పనిని మొదలు పెట్టలేకపోయాను. మొదలు పెట్టినా ఇది ఒక్కడి వల్ల అయ్యే పని కాదు.
        అందువల్ల ఆసక్తి ఉన్న కవిమిత్రులను ముందుకు రావలసిందిగా మనవి చేస్తున్నాను. *ముందుకు వచ్చిన వారిలో పదిమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం కేటాయిస్తాను*. ఆ సంవత్సరం వారికి ఉత్తమమైనవిగా తోచిన సమస్యలను ఎన్నుకొని, ఆ సమస్యకు వచ్చిన పూరణలలో వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్న నాలుగింటిని పూరించిన వారి పేర్లతో సహా కాపీ చేసి, ఒక ఫైలులో పేస్ట్ చేసి నాకు పంపవలసి ఉంటుంది. శ్రమతో కూడిన పనే. కాని సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పుస్తకంలో మీ భాగస్వామ్యం ఉంటుంది.
        కేవలం బ్లాగులో వచ్చిన పూరణలనే ఎన్నుకొనడానికి అవకాశం ఉంది. వాట్సప్ సమూహంలో సాధ్యపడదు.
        లాక్‌డౌన్ ప్రారంభమైనపుడు ఈ ఆలోచన వస్తే బాగుండేది. ఇప్పటికైనా అవకాశం ఉంది.
ఆసక్తి ఉన్న కవిమిత్రులు స్పందించవలసిందిగా మనవి. 

3 కామెంట్‌లు:

 1. క్రొవ్విడి వెంకట రాజారావు:
  గురువుగారికి నమస్కారములు. నాపేరును పరిశీలించగలరు.

  రిప్లయితొలగించండి
 2. ఆర్యా! నమోవాకములతో, ఈ రకంగా భాషాసేవ చేసే అవకాశం లభించడం ముదావహం.

  రిప్లయితొలగించండి
 3. గురువర్యా నమస్కారములు🙏

  నావల్ల చేతనైన పని యుంటే చెప్పండి. ఎక్కడ కలువవలెనో.

  మీ శిష్యుడు
  యజ్ఞభగవాన్ గంగాపురం
  9440863535

  రిప్లయితొలగించండి