20, మే 2020, బుధవారం

సమస్య - 3374

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హనుమంతుని జప మిడుముల నందించుఁ గదా"
(లేదా...)
"హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే"

127 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    తినుచున్ పుణ్కులు మిర్చి బజ్జిలహహా తీర్థమ్మునున్ గ్రోలుచున్
    కనగన్ జాలక బస్సులన్ తిరముగా గానంబునున్ జేయుచున్
    చనుచున్ హైదరబాదు వీధుల కడున్ చాదస్తమున్ వీడకే
    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే

    రిప్లయితొలగించండి

  2. మా మాలిక కల్నలు ఏకలింగము రంగములోకి‌దిగి స్ట్రిక్టుగా కత్తెర వేయుచుండు కరోనా వేళలో‌ :)


    మన ధైర్యమ్మును పెంచును
    హనుమంతుని జప, మిడుముల నందించుఁ గదా
    పనిలేక దారిని‌ చనుచు
    కనిపించిన బ్లాగు లెల్ల కామింట్లిడగా !




    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పని అదేకదా! అట్లా శంకరాభరణంలో గొంగళిపురుగుగా అడుగుపెట్టి ఇప్పుడు సీతాకోకచిలుక అయ్యారు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    2. సీతాకోక చిలుకలా అడుగుపెట్టి రామచిలుకలా అయ్యారు జిలేబి గారు

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పనియున్ పాటను గానకే పిలకనున్ బంధించుచున్ ముద్దుగా
    తనువున్ మానస హృత్తులన్ మరచుచున్ తాదాత్మ్యతన్ జెందుచున్
    చనగన్ మస్జిదునందు నొంటరిగనున్ జంబంపు రంజానునన్
    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే

    రిప్లయితొలగించండి
  4. (తనను అరణ్యంలో విడిచి రామాజ్ఞ పాలించిన లక్ష్మణునితో సీతాదేవి )
    కనుమా లక్ష్మణ ! నాదు దుర్విధిని ; భూ
    కాంతుండు పోనాడెనే ;
    మనుమా యూర్మిళ గన్న స్వప్నముల నే
    మాత్రంబు భంగింపకన్ ;
    చనుమా పౌరుల కంటిమంట లికపై
    చల్లారు ; నిర్భాగ్యదే
    హను ; మన్నామజపానురక్తులకు ల
    భ్యంబౌను కష్టంబులే !
    (మనుమా-వర్దిల్లుమా ; భంగింపక-చెదరగొట్టక )

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. ఘనుడౌరామునినామమంత్రమునురాగాలాపమున్సేయకన్,
    జననీజానకి దివ్యధాత్రినిట రాజన్యంబు బూజించకన్
    ఘనుడాదిత్యునిదివ్యమంత్రమునుయోగాభ్యాసమున్సేయకన్
    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే
    కొరుప్రోలు రాధాకృష్ణారావు


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేయక, పూజించక' అన్నవి కళలు. ద్రుతాంతాలు కావు.

      తొలగించండి
  7. కావలిద్వారపాలకులెకారణజన్ములుజన్మజన్మకున్
    పావనదేవలోకమునుబాసిరివారలుశాపమందగన్
    దీవెనరామబాణమునదేహమువీడగధన్యజీవులౌ
    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  8. వినివారణ మొనరించుచు
    హనుమంతుని జప మిడుముల,నందించుఁ గదా
    యనుపమ కార్యవిజయమని
    ఘనమగు నుడి యిలఁ బ్రసిద్ధిగాఁ గలదు కదా!

    రిప్లయితొలగించండి
  9. దనుజస్వామి సభాముఖంబున ననెన్ దైవంబె నీరాము? డా
    తని గీర్తింతువదేల? నన్ను గొలువన్ త్వత్ప్రాణముల్ నిల్చు జీ
    వనదానంబును జేసెదన్ నరుని నవ్వానిన్ మదిన్ నిల్పుచున్
    హనుమన్! నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే

    రిప్లయితొలగించండి


  10. కనులాదైవమునే కనంగ వలయున్ కామేశ్వరీ! నేర్వగా
    మనసా! ధైర్యము హెచ్చు బుద్ధియునసామాన్యమ్ముగా గూడునా
    హనుమన్నామ జపానురక్తులకు, లభ్యంబౌను కష్టంబులే
    పనిలేకన్ కని పించు బ్లాగులను వెంపర్లాడి కామింట్లిడన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పనిలేక' కళ. ద్రుతాంతం కాదు.

      తొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. మనుజుడు దలచుట సహజము
    హనుమంతుని జప మిడుముల నందించుఁ గదా
    కనుగొన నిటు పాపచయము
    మునుముందుగ భస్మమైన మోదమె మిగులున్

    రిప్లయితొలగించండి
  13. మనకిదిజయమగుమంత్రము
    హనుమంతుని జప, మిడుముల నందించుఁ గదా"
    కనుగొన దెలిసిన సత్యము
    జనులనుపీడించరక్కసగుణఖలునకున్

    రిప్లయితొలగించండి
  14. అనునిత్యమ్ము మనస్సు వాయుసుతునే యర్చించు భాగ్యంబునే

    కొనసాగించియు నిష్టకామ్య ములనే కోరంగ వేడంగనే

    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను, కష్టంబులే

    అనుమానమ్మును లేక తీరి సతతం బాశీస్సు లందించుగా


    రిప్లయితొలగించండి
  15. మైలవరపు వారి పూరణ

    చింతామణి..

    నను మా యమ్మను బోల్చి చూడకుడు., సౌందర్యమ్ము సర్వమ్ము కృ...
    ష్ణునికే యంచు దలంచుదాన., గణికాక్షుద్రానురాగమ్ము లే...
    దని భావింపుము సుబ్బిసెట్టి! గుణమాన్యన్ భక్తిమత్పుష్పదే...
    హను.,మన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  16. అనుమానింపక చేయుము 
    హనుమంతుని జప మిడుముల నందించుఁ గదా !
    పెను భూతములకు  సేవలు  
    చని  నా మాటను  పవనజు  జపియింపుమురా !

    రిప్లయితొలగించండి
  17. మనమున దలచిన జాలును
    పెనుముప్పే దొలగిపోయి విజయము గూర్చున్
    మనుజుల కది మరువకుమా
    హనుమంతుని జప, మిడుముల నందించు? గదా.

    రిప్లయితొలగించండి
  18. మనమున దలచిన శుభమగు
    హనుమంతుని జప, మిడుముల నందించు గదా!
    ధనమార్జించుటె లక్ష్యం
    బనుచును చరియించువార కవనిని నిజమే.

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. మహోదయా! శుభోదయం నేటి మొదటి పద్యపూరణాయత్నం-

    కనగన్! రామాయణమున్
    వినడే సద్బుద్ది తలపడె రామ విధమున్నెరుగన్
    చనకని యానరునికెపుడు
    హనుమంతుని జప మిడుముల నందించు గదా!

    రెండవ పద్యపూరణాయత్నం-

    వినుమా! రాముని తత్త్వమున్ గనక యేవేళై న రాద్ధాంతమే
    ఘనమార్గంబని నమ్ముచున్ దగిలి, కీకారణ్య సాంసా రికం
    బున జేరంగ, సుదృష్టి మాంద్యతన వైముఖ్యంపుభావాబ్దినిన్
    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే,?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. భావం స్పష్టంగా లేదు.
      రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  22. అనవరతము భక్తి సలుప
    హనుమంతుని జప మిడుముల నందించు గదా
    మన నణచజూచు దుష్టుల
    కును,రామశరమగు కంటకుల పాలిటయున్.

    రిప్లయితొలగించండి
  23. క్రమాలంకారం లో -----
    మనమున భయములు తొలగగ
    మన మే మొనరించ వలెను? మత్సర యుతులై
    మనుట వలన నేమగు నో?
    హనుమంతుని జప :: మిడుమల నందించు గదా

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. ఘనుడౌరామునినామమంత్రమునరాగాలాపవైముఖ్యులై
    జననీజానకి దివ్యధాత్రికిని రాజన్యమ్మురాహిత్యమై
    ఘనుడాదిత్యునిదివ్యమంత్రమునయోగాభ్యాసనిర్యోగులై
    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే
    కొరుప్రోలు రాధాకృష్ణారావు
    గురువుగారికి నమస్కారములు సరిచేసిన పద్యం

    రిప్లయితొలగించండి
  26. క్రొవ్విడి వెంకట రాజారావు:
    ఘనముగ నడచును భువిలో
    హనుమంతుని జపమిడుములు; నందించుగదా
    ననయము భక్తిని పూనెడి
    ననువగు వర్తన మనలకు నాతని గుణముల్.

    రిప్లయితొలగించండి
  27. మనసారగపూజించుచు
    తనువును వాక్కును సకలము దనపైనుండన్
    ననుటయు మాట నసత్యము
    హనుమంతుని జపమిడుముల నందించుఁ గదా

    రిప్లయితొలగించండి
  28. గురువు గారికి నమస్సులు.
    మనసుకుహాయిగల్గును
    హనుమంతుని జప,మిడుములు నందించు గదా
    తనవారితోతగవులే
    వినడెవ్వరునీతిపలుకువిశ్వం బందున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "మనమునకు హాయి గల్గును" అనండి.

      తొలగించండి
  29. గురువు గారికి నమస్సులు.
    మనసుకుహాయిగల్గును
    హనుమంతుని జప,మిడుములు నందించు గదా
    తనవారితోతగవులే
    వినడెవ్వరునీతిపలుకువిశ్వం బందున్.

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
      "హనుమంతుని జప మిడుముల నందించుఁ గదా"

      మనమున శ్రధ్ధయు లేకను,
      దినమున ననుచిత విధులను తిరిగెడి భ్రష్టుల్ |
      మునపుల కొరకై జేసెడి
      హనుమంతుని జప మిడుముల నందించుఁ గదా"
      (మునపు - కోరిక )

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  31. కనిపింపక జేయుగదా
    హనుమంతుని జప మిడుముల;నందించు గదా
    మనకు నభయంబు,రక్షణ
    యును,కార్యములన్ జయంబుయు,కడకు బరమున్.

    రిప్లయితొలగించండి
  32. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఘనమై సాగుచు నిత్యమున్నడరు చీకాకుల్ వినాశమ్మగున్
    హనుమన్నామ జపానురక్తులకు; లభ్యంబౌను కష్టంబులే
    ననయమ్మించుక భక్తితో హరికి సవ్యంబైన ధ్యానంబులున్
    ననువౌ రీతి సమాచరించని విధిన్నల్లాడెడిన్ వారికిన్.

    రిప్లయితొలగించండి
  33. అనయము భయములఁ బాపును
    హనుమంతుని జప, మిడుముల నందించుఁ గదా
    పనిగొని పదరుచు దైవము
    వినయమును విడిచి చను నవివేకుల కెపుడున్

    రిప్లయితొలగించండి
  34. అనయ మ్మితరుల దోచుచు
    తనపాపము బాపుకొనగ దైవమటంచున్
    మనమున దలచుచు సేయగ
    హనుమంతుని జపమిడుముల నందించు కదా!

    రిప్లయితొలగించండి
  35. అనయముశుభములనిచ్చును
    హనుమంతునిజపమి,డుములనందించుగదా
    పనిగొనియితరులయెడలను
    కనికరమునులేకయుండికధముగియింపన్

    రిప్లయితొలగించండి
  36. అందరికీ నమస్సులు 🙏🙏
    నా పూరణ యత్నం ..

    *కం||*

    కనుగొనలేవా నిజమును
    హనుమాన్ చాలీస వినగ ననుమానము లే
    దని యను, తప్పిటు లనుటయె
    *"హనుమంతుని జప మిడుముల నందించుఁ గదా"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏

    రిప్లయితొలగించండి
  37. ఉనికిన్ స్థైర్యము ప్రాణశక్తియును చేకూరున్, పిశాచాది భూ
    త నిరోధంబును పొందజేయు, నలిబాధంబుల్ తెగన్ శాంతియే
    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను, కష్టంబులే
    కనరాకన్ కడు దూరమౌను కలి దుఃఖంబుల్ శుభంబౌ నిలన్౹౹

    రిప్లయితొలగించండి
  38. వినుమా పూర్వము సంభృతశ్రుతులెయౌ వేదాంతులే చెప్పిరే
    మునిజాలమ్ములు కోరు దివ్య పథమౌ మోక్షమ్మదే కాంచగన్
    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను, కష్టంబుల్
    చను, సంపత్తులవెన్నియో కలుగవే, సత్యంబిదే నమ్ముమా!

    రిప్లయితొలగించండి
  39. మనమున దలచిన శుభమగు
    హనుమంతుని జప, మిడుముల నందించు గదా!
    మనలను బాధించెడి యా
    ఘనమైన సమస్యలకది, కలతను విడుమా!

    రిప్లయితొలగించండి
  40. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  41. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  42. అనయమ్మున్ భువిలోన రాముపయి ప్రత్యాఖ్యానమున్ జేయుచున్
    వినయమ్మెప్పుడు చూపకుండ ప్రజ నప్రీతిన్ కనుంగొంచు నే
    పనులన్ చేయక సాగుచున్ సతతమున్ భక్ష్యమ్ములన్ కోరుచున్
    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే

    రిప్లయితొలగించండి
  43. హనుమన్నామజపానురక్తులకులభ్యంబౌనుకష్టంబులే
    హనుమన్నామజపానురక్తులకులభ్యంబౌనుభాగ్యంబిలన్
    వినుమామారుతిగొల్వనేర్చునకునెవ్వేళంజయంబబ్బుసూ
    ననుమానంబిసుమంతయుంవలదుభయ్యానన్నునమ్మన్గదే

    రిప్లయితొలగించండి
  44. కనికరము సూప కించుక
    మనుటకు నాడించ మించి మనుజుల కొఱకై
    విను కోతిఁ బెంచి వీధుల
    హనుమంతుని జప మిడుముల నందించుఁ గదా


    మన మందుంచఁగ రామనామమునె యన్మండింట నశ్రాంత ముం
    డును గాపాడఁగ వారి నెల్లరను వే డుల్లంగఁ గష్టాలు దు
    ర్జన దోషాచర ణానుయాయ తతికిన్ సంతర్జి తాధ్రుఙ్మనో
    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే

    [సంతర్జిత +అధ్రుక్ +మనః + హనుమన్నామ; సంతర్జితాధ్రుఙ్మనో హనుమన్నామ జపానురక్తులు = తర్జింపబడిన నిష్కపట హనుమన్నామ జపానురక్తులు కలవారు; అధ్రుక్ = నిష్కపటము]

    రిప్లయితొలగించండి
  45. కందం
    పనిలో స్పష్టత, స్వచ్ఛత
    మనమ్మునన్ గల్గి రాము మదినిల్పె సదా,
    గుణ మాన హీనులకిలన్
    హనుమంతుని జప మిడుముల నందించుఁ గదా


    మత్తేభవిక్రీడితము
    పనిలో స్పష్టత స్వచ్ఛ మానసము నిస్వార్థంపు సంసేవ్యుడై
    చనుచున్ సీతను దెల్సి రాముని పరిష్వంగమ్మునన్ దేలెనే!
    ఘనతన్ గానక స్వామి మెచ్చు నడతల్ కల్లైన కామాంధులౌ
    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే

    రిప్లయితొలగించండి
  46. మనమందా ఘన వానరోత్తము డసామాన్యుండు గొల్వుండగా
    ఘనమౌ తారక రామ మంత్రము సురక్షా కంకణంబౌచు నా
    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను, కష్టంబులే
    వణుమాత్రంబును జేరబోవు దరి భక్తాళిన్ సదా గాచుగా

    రిప్లయితొలగించండి
  47. కనవే శ్రీరఘురామభక్తవరదున్ గంభీరధీరోద్ధతున్
    ఘనునిన్ వాయురయఃప్రయాణగతలంకాతంకశౌర్యాంకు, నా
    వనధిన్ దాటిన మారుతిం గొలిచినన్ పాపమ్ము సంధిల్లునే?
    హనుమన్నామజపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే?

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  48. హనుమాన్ చాలిస భక్తిగా పఠన జేయంగోరువారల్ ,సతమ్
    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే
    కనలేకుండిన జీవితంబు,బలమున్,కార్యంబొనర్ దీక్షయున్
    ననుభావ్యంబిది పెక్కు భక్తులకు ప్రత్యక్షంబునౌ లీలలున్.

    రిప్లయితొలగించండి
  49. కనుమరుగు జేయు నెప్పుడు
    హనుమంతుని జప మిడుముల ;
    నందించుఁ గదా
    ఘనముగ సంపద లెన్నో ,
    పెనకువగ నతనిగొలిచిన వేళల లోనన్

    రిప్లయితొలగించండి
  50. ఆదిలాబాద్ పట్టణ మందు నేటికీ , ఒకే రోజున,108 హనుమంతుల దర్శనము చేయుట ఒక ఆచారముగా యున్నది. వారి దర్శనము కొంత గతుకుల రోడ్డున కూడా సాగుతుంది. ఆ సందర్బంగా ఈ పద్యము:

    కం:

    దినమున నూటా ఎనిమిది
    హనుమల దరిసెన మిడుకొన నాదిలబాదున్
    గునగున గతకల నడుచగ
    హనుమంతుని జపమిడుముల నందించు గదా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  51. మనసున భక్తియె లేకను
    తనగొప్పను చాటుకొనెడు తాపత్రయమున్
    కొనియాటల కొరకు సలుప
    హనుమంతుని జపమిడుముల నందించుగదా!!!

    రిప్లయితొలగించండి
  52. పనిగొని చేయగ బాపును
    హనుమంతుని జపమిడుములు, నందించు గదా
    కనివిని యెరుగని ధైర్యము
    మనసున కలిగించు శాంతి మనుజుల కిలలో!!!

    రిప్లయితొలగించండి
  53. సునిశిత బుద్ధినొసంగును
    హనుమంతుని జప,మిడుముల నందించుగదా
    తనియుచు భౌతిక సుఖముల
    మనమోహను మరచి బ్రతుక మనమున జడుడై

    వినయంబున్ పదునైన బుద్ధియును నిర్భీతిన్నజాడ్యత్వమున్
    ఘనమౌనాయువు శక్తియుక్తులును ప్రఖ్యాతిన్నరోగత్వమున్
    హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను,కష్టంబులే
    కనరావెన్నడు చిత్తశుద్ధి జరుపంగా నిత్యమారాధనల్ !

    రిప్లయితొలగించండి
  54. మనమున స్థిరచిత్తముతో
    హనుమను గొలిచినదొలంగునాపదలెల్లన్
    కనుగొన రక్కసిమూకకు
    హనుమంతుని జప మిడుముల నందించుఁ గదా

    రిప్లయితొలగించండి
  55. వనమందున రాత్రిసమయ
    మున దయ్యంబులు పిశాచములు తిరుగాడన్
    మనమున తలుచుట వీడిన
    హనుమంతుని జప, మిడుముల నందించుఁ గదా

    రిప్లయితొలగించండి
  56. జ్ఞానము గల వెలయాలు మోహాంధుడైన వేమనకవి తో .....

    తనవుం జూడకు కామభావమున నేతద్ధేహ మెంతేనియున్
    కన హీనంబగు, వార్ధకానుగతరోగప్రాప్తసంక్షిష్ట త
    త్క్షణికక్షీణము మోహమేల? గతరాగన్ మూల్యసంప్రాప్తదే
    హను .. మన్నామజపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  57. మిత్రులందఱకు నమస్సులు!

    [తన భర్తయైన మన్మథుని శివుఁ డగ్గికంట భస్మీకృతుం జేయుటఁ గన్నారఁ గాంచిన రతీదేవి శోకించుచుఁ బలికిన సందర్భము]

    "కను మో దేవ! మహేశ్వరా! మనసిజుం గాల్పంగ భావ్యంబె? నె
    మ్మిని నాథున్ ననుఁ గూర్పుమయ్య! యటుకామిన్ జంపవే నన్ను! వె
    న్కనె భర్తన్ దగఁ జేరుదయ్య! వినుమన్నా! నేను కష్టార్త దే

    హను! మన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే!"

    రిప్లయితొలగించండి
  58. నను పద్మోద్భవ మానసోద్భవసుత న్వారీశు నర్ధాంగినిన్
    గన లక్ష్మీసతి కగ్రజన్ జనులయో గర్హించి పెద్దమ్మగా
    ఘన దారిద్య్రము నిచ్చుదానిగఁ గనంగన్ నిత్యదౌర్భాగ్య దే
    హను! మన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే!

    రిప్లయితొలగించండి
  59. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  60. విను నామాటల నతివా
    హనుమంతుని జప మిడుముల నందించు గదా
    యనుట యు తప్పౌ నాజప
    మనవరతమ్మును శుభము ల నందించు సుమా!

    అనుమానముతోచేసిన
    హనుమంతుని జపమిడుముల నందించు గదా
    అనయము జపమును శ్రద్ధగ
    మనమున చేయదయ చూపు మారుతి వినుమా.

    రిప్లయితొలగించండి
  61. అనయమ్మున్ విటపాళికిన్ తనువు నేనందించి జీవింతు, వే
    ధనమున్ దోచెద వచ్చువారలకు మోదమ్మున్ ప్రసాదించుచున్
    వనితా లోకమునింద చేయు కుటిలవ్యాపార పారీణ దే
    హను, మన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులలే

    రిప్లయితొలగించండి