19, మే 2020, మంగళవారం

సమస్య - 3373

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రావణుఁడు కుంభకర్ణుఁడు రక్ష మనకు"
(లేదా...)
"రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్"

98 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    దేవుడు వేరు లేడిచట తీరిచి దిద్దగ జీవనమ్ములన్
    చేవను జూపి కోతులను చెండుచు చీల్చుచు పారద్రోలుచున్
    కావగ మమ్ము రాక్షసుల గారబు రీతిని లంకనందునన్
    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్

    రిప్లయితొలగించండి
  2. శరణు కోరి రామునిచెంత కరిగె నా వి
    భీషణుండు దానవజాతి పేరు పరువు
    మట్టిఁ గలిపి! దాశరథుల మౘ్చ మాప
    "రావణుఁడు కుంభకర్ణుఁడు రక్ష మనకు"
    భయము లేదని లంకను పౌరు లనిరి!

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కాంగ్రెసు పార్టీ తీర్మానము:

    చేవను జూపి భాజపులు చేరుచు కోర్టున దొడ్డిదారినిన్
    కావలెనంచు మందిరము కట్టగ తీర్పును వేగ తెచ్చిరే
    కోవెల కట్టి కొల్చెదము గొప్పగు రీతిని హస్తినమ్మునన్
    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్

    రిప్లయితొలగించండి
  4. (శ్రీరామునితో విభీషణుడు )
    కేవలబుద్దిహీనులయి
    కేకల బెట్టుచు నాశ్రమంబులన్
    దేవతలందరిన్ గొలుచు
    దీక్షితమౌనుల హింసబెట్టుచున్
    గావరధూర్తులై చెలగు
    కన్నులుగానని దైత్యకోటికిన్
    రావణకుంభకర్ణులె తి
    రంబగు రక్షణ నిచ్చు దైవముల్ .
    (దీక్షితమౌనులు -దీక్షలోనున్న మునులు ;కావరధూర్తులు -మదమెక్కిన నీచులు )

    రిప్లయితొలగించండి
  5. ద్రావిడజాతి మాది యని రాముఁడు దైవము గాఁడటంచుఁ దా
    మా విధిఁ జెప్పిరే తమిళులందునఁ గొందఱు, భారతీయమౌ
    పావన సంస్కృతిన్ దెగడి పల్కుదు రిట్టులఁ గట్టి కోవెలన్
    "రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్"

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    [హనుమంతుఁడు శ్రీరామునితోఁ బలికిన సందర్భము]

    "చేవయె యుండి, రామ! మతి చిక్కి కృశించిన మట్టిబుఱ్ఱలై,
    దీవిని లంకనుం గల మదించిన రాక్షసజాతికంతకున్
    దేవత లందఱుం గనఁగ, నీచ నికృష్టపు సేవకాళియౌ;
    రావణ కుంభకర్ణులె, తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్!"

    రిప్లయితొలగించండి
  7. పావని లంకనున్ బహుళభంగుల గాల్పుచు దైత్యకోటికిన్
    జేవను జూపుచున్ బలికె "సిద్ధము నాశన మిందు దెత్తురీ
    రావణ కుంభకర్ణులె, తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్
    కావున రామలక్ష్మణుల కాళ్ళకు మ్రొక్క శుభంబు మీకగున్"

    రిప్లయితొలగించండి
  8. ఆ వరముల్విశేషము దశాన నుడట్లు తపమ్ముతో మహా

    దేవుని నుండిపొందియురు ధీరపరాక్రమవంతుడై ప్రజా

    సేవలు సేయుచుం బ్రజల క్షేమము గాంచెను లంకవారికిన్

    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్.

    రిప్లయితొలగించండి
  9. సింహళమున వసించెడు స్త్రీ పురుషులు
    తలచు చుందురు మనమున దైవము లని
    రావణడు కుంభకర్ణుడు: రక్ష మనకు
    ననుచు కూర్మితో కొలిచెద రనవరతము.

    రిప్లయితొలగించండి
  10. సీతను తనపురమునకు చేర్చె నెవరు

    నారు నెలలు నిదురబోవు నసురు డెవరు

    రామ నామమే మిచ్చును‌ రమ్య‌ గతిని

    రావణుడు,కుంభకర్ణుడు, రక్ష మనకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      నా సవరణలను వాట్సప్ లో చూడండి.

      తొలగించండి
  11. పావని సీత నా యసుర భామిను లొంటిగ జేసి లంకలో
    నీ విధి క్రూర వాక్కులను నేచిరి మాటికి నేల రామునిం
    దేవు డటంౘు వాగెదవు తిక్కగ మానవు డేమి దేవుడౌ
    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్.

    రిప్లయితొలగించండి


  12. సీత నపహరించెనెవరు? చింత పడక
    నారు నెలలు నిదురపోయినట్టి వాడి
    తమ్ము డెవడోయి? రామయతండ్రి సూవె?
    రావణుఁడు; కుంభకర్ణుఁడు; రక్ష మనకు.


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహజమైన రజస్తమోసత్వ తత్వ
      రీతుల జెడుజేయు మొదటి రెంటి బోలు
      రావణుఁడు కుంభకర్ణుఁడు ; రక్ష మనకు
      సత్వగుణ శీలుడగు విభీషనుని వలన

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఆరు నెలలు నిదురపోయినట్టివాడు కుంభకర్ణుడు. మరి వాని తమ్ముడు ?

      తొలగించండి

  13. మైలవరపు వారి పూరణ

    ఈవెవరయ్య స్వామి! యిటకెట్టుల వచ్చితి వార్ధి దాటి లం...
    కా వరపట్టణమ్మునకు.,కావలి లంకిణి నేను.,బుద్ధిగా
    నీవిక పొమ్ము నిన్ను జొరనీయను., దాటను వారి యాన., మా
    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  14. శాప మొసగంగ సనకులు కోప మొంది
    ప్రార్థ నలుజేయ పాదాలు పట్టి వేడ
    వైర భక్తిని కొలచిన ధీర వరులు
    రావణుఁడు కుంభకర్ణుఁడు, రక్ష మనకు.

    రిప్లయితొలగించండి
  15. త్రిజట మాటల నాలించి తీవ్రమైన
    యాగ్రహమ్మున నొకకాంత యనియె నిటుల
    దనుజురాలవు నీవిట్లు తగదు పలుక
    రావణుఁడు కుంభకర్ణుఁడు రక్ష మనకు

    రిప్లయితొలగించండి
  16. మరొక పూరణ

    దేవివి కమ్ము రావణుకుతీరుగ సౌఖ్యము లబ్బు నీకిటన్
    దేవుని మెప్పు పొందెగను ధీరత తోడను విశ్వ మందు తా
    చేవను జూపి తెచ్చెనిను శీఘ్రము గానిట కంచె రుంగుమా
    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్"

    రిప్లయితొలగించండి


  17. తావును వీడి సేవకులె ధాత్రిని బుట్టిరి లంకనేలుచున్
    చావును కోరి తెచ్చుకొని చచ్చిరి శ్రేష్ఠుని చేతిలో సుమా
    రావణ కుంభకర్ణులె; తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్
    పావను డాసనాతనియె! భారము వారిదె మానవా సదా

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. పరుల కాంతలనాశించు పతితు డెవడు?
    నిరతము నిదురించు చవట నేమనండ్రు?
    యెల్ల దేవులఁ బూజింప నేమి ఫలము?
    తెల్పుమికనీకు తెలిసిన తెలుగు బాల.

    *రావణుఁడు, కుంభకర్ణుఁడు, రక్ష మనకు*

    రిప్లయితొలగించండి
  19. సేతువును కట్టి దాటెను కోతిమూక 
    ఏమి జరుగునో యికమీద యెరుగబోము 
    ప్రాణ హానంచు భయమును రాదు మనకు  
    రావణుఁడు కుంభకర్ణుఁడు రక్ష మనకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హాని+అంచు' అన్నపుడు సంధి లేదు. "ప్రాణహాని యనుచు భయము రాదు..." అనండి.

      తొలగించండి
  20. లంకనేలెడుదుష్టుల రాక్షసులగు
    రావణుఁడు కుంభకర్ణుఁడు; రక్ష మనకు
    రామ నామమే,బల్కెవీరాంజనేయ
    రామ శరమైనదియునువారలను జంప

    రిప్లయితొలగించండి
  21. దైత్య గణములు గుమి గూడి తలచెనిట్లు
    వారధిని దాటి కపిసేన వఛ్చి చేరె
    రావణుడు కుంభకర్ణుడు రక్ష మనకు
    తోడు నీడ గ మన కిప్డు దురము నందు

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  23. మహోదయా! నమస్సులతో,
    శుభోదయం.

    నేటి పద్యపూరణ యత్నం-

    రాక్షసులు మదోన్మత్తులై రాణుకెక్కె
    వీరలనుజూసి మనమంత వెరువ వలదు
    వినుము రాముడే శరణము ఘనము! నెట్లు
    రావణుడు కుంభకర్ణుడు రక్ష మనకు?

    నేటి రెండవ పద్యపూరణాయత్నం-
    (రామలక్ష్మణులు వచ్చు వరకే రావణునికెదురు లేదు వారే ఇక్కడ దైవం .అదీ దైవము వల్లనే.మన లాంటి ధార్మికరాక్షసులకు భయం లేదని విభీషణుడు లాంటి వారు చర్చించుకుంటున్న సందర్భము.)

    రావణ బ్రహ్మగా భువన రాజీవుడయ్యెను సాటి లేదిలన్
    దైవము గాచగన్! వినుము దైత్యవరేణ్యుల కేల భీతియున్
    ధీవరరామలక్ష్మణుల తేజము లంకకు సోక నంతకున్
    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్

    -🌹-

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు ఆర్యా!

      రావణ బ్రహ్మగా భువన రాజితుడయ్యెను సాటి లేదిలన్
      దైవము గాచగన్! వినుము దైత్యవరేణ్యుల కేల భీతియున్
      ధీవరరామలక్ష్మణుల తేజము లంకకు సోక నంతకున్
      రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్

      తొలగించండి
  24. రాజసము,తామసంబులు రాజ్యమేల
    బంది జీవుడు,యాగుణంబులె మనగల
    రావణుడు,కుంభకర్ణుడు;రక్షమనకు
    సత్వగుణ రామునాశ్రయ సాధనంబు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  25. చేవ గల్గిన రాముడు చేరులంక
    సమరమందున తప్పక యముని చేరు
    రావణుఁడు, కుంభకర్ణుఁడు, రక్ష మనకు
    దశరథ సుతుండు సతతమీ ధరణి పైన

    రిప్లయితొలగించండి
  26. కావలి యేది దేశమున కావితనమ్ముకు ద్వేషమెంతయో
    లావుకొనంగ సాధువులఁ రాక్షసులై పరిమార్చు హంతకుల్
    రావణ కుంభకర్ణులె! తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్
    లేవని చింత యేల? చెలరేగవలెన్ హృదిలోని శక్తియే౹౹

    రిప్లయితొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:

    రామ లక్ష్మణు లిర్వురు రణము నందు
    నాగ్రహమున దనుజసేన నణచు నపుడు
    మనము నందు వారెల్లరు మానసించె
    రావణుడు కుంభకర్ణుడు రక్ష మనకు

    రిప్లయితొలగించండి
  28. తేటగీతి
    సీత మదిమార్చమను ప్రభు చిత్తమెంచి
    కావరమనంగ మేలకొ సేవకులక
    టంచు దాసిఁ గని పతి వచించె నిటుల
    రావణుఁడు కుంభకర్ణుఁడు రక్ష మనకు


    ఉత్పలమాల
    ఆ వనమందు సీతనిడి యావిడ మార్చఁగ బూన్చె మమ్ములన్
    గావర మెంతయో ననుచు గాసిలు దాసికి భర్తయిట్లనెన్
    సేవకులైన వారు ప్రభుచిత్తము నెంచుటె? నీకు నాకు నా
    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్

    రిప్లయితొలగించండి
  29. హా విధి నేమనందుమిల నాసుర భావము పెచ్చరిల్లెగా
    వావియు జాలియున్ మరచి బాలికలన్ చెరబట్టు కీచకుల్
    భావన జేతురట్టి కులపాంసకులే విపరీత ధోరణిన్
    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్

    రిప్లయితొలగించండి
  30. చేవగలట్టి నీమగడు చేరును లంకకు దాటి సంద్రమున్
    తావక రక్షణన్ సలుపు తప్పక, నీకిక చింత యేలనే
    పావనుడైన రాఘవుడు భండనసల్పిన పాశిఁ జేరు నా
    రావణ కుంభకర్ణులె, తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్

    రిప్లయితొలగించండి
  31. *త్రిజట తన స్వప్న వృత్తాంతము తెలుపగా విని ఒక రాక్షసకాంత పలికిన మాటలుగా నూహించి*

    కావగ వచ్చు రాఘవుడు కార్ముక మెత్తి వధించి రావణున్
    బ్రోవగ వచ్చు నిన్ననుచు పొంకణముల్ వచియింతువేలనే
    నీవొక దానవాంగనవు నీకును నాకును రాక్షసాళికిన్
    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్

    రిప్లయితొలగించండి
  32. క్రూరుడై యెల్ల జీవుల కూల్చు నొకడు
    తిని పరుండెడి తామస దిత్యు డొకడు
    దైవమును ధిక్కరించిన దనుజు లెటుల
    రావణుఁడు కుంభకర్ణుఁడు రక్ష మనకు?

    రిప్లయితొలగించండి
  33. స్వంతయన్నదమ్ములువిశ్వవసునిసుతులు
    రావణుడుకుంభకర్ణుడు,రక్షమనకు
    నేకపత్నీవ్రతుడురాముడేకదికను
    బరగనాదర్శదంపతులరయవారు

    రిప్లయితొలగించండి
  34. యుద్ధమందునమడిసిరియోధులైన
    రావణుఁడు కుంభకర్ణుఁడు, రక్ష మనకు
    నింక శ్రీరామచంద్రుడు శంకవీడి
    శరణుగోరినతప్పక కరుణజూపు!

    రిప్లయితొలగించండి
  35. భయము సెందక పోరుఁడు పాఱ నేల
    రామ లక్ష్మణ కోదండ రక్షిత ప్ర
    చండ భల్లూక మర్కట భండనమున
    రావణుఁడు కుంభకర్ణుఁడు రక్ష మనకు


    వే వడి రాజి రామునకు వీరులు వీరలు బ్రహ్మవంశ స
    ద్భావ వరౌఘ దర్పిత సుబాహు పరాక్రమ విక్రమార్జితుల్
    పావన లంకఁ గాచెడు నపార రుషాత్ములు దైత్యకోటికిన్
    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్

    రిప్లయితొలగించండి
  36. యుద్ధభూమిలో రాక్షససేనల మనోభావన
    ఆవల యుద్ధరంగమున నండగనుండగ కోతిమూకలే
    చేవనుజూపుచున్ గదలి చేగొనసీతను ధర్మమార్గమున్
    వావిరి యస్త్రశస్త్రముల భండనభీముడు రాముధాటికిన్
    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణనిచ్చు దైవముల్!

    రిప్లయితొలగించండి
  37. చేవనుజూపగానరుగుశ్రీహనుమంతునిజూచిరాక్షసుల్
    రావణకుంభకర్ణులెతిరంబగురక్షణనిచ్చుదైవముల్
    బోవకువారిజోలికినిబూతమనస్కుడ!యాంజనేయుడా
    నీవయెప్రాణదాతవికనీకిదెదండముస్వీకరించుమా

    రిప్లయితొలగించండి
  38. రణమునందున రాక్షసుల్ గణనజేసి
    రావణుడు కుంభకర్ణుడు రక్షమనకు
    లంకజనులకు శంకేల బింకమందు
    నిలువుడంచును దెలిపిరి నేతలంత.

    రిప్లయితొలగించండి
  39. సుందరకాండ లో సందర్బంగా...
    ఉ:

    భూవరు లెవ్వరేని జన పూజితులై నలరారు రాజ్యమున్
    కావగ వచ్చు వారలనె గానక మాటలు నింద మోపుచున్
    భావన సేయగన్ దగదు భారమటంచన లంక ఱేడులన్
    రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  40. రామచంద్రుడు రాలేడు లంకవరకు
    మనసు మార్చుకొనిన నీకు మంచిదగును
    రావణుఁడు కుంభకర్ణుఁడు రక్ష మనకు
    ననుచు నొకకాంత బలికెను ననునయముగ!!!

    రిప్లయితొలగించండి
  41. రమణి సీతను మ్రుచ్చిలు రాజు యెవడు?
    నారు మాసముల్ నిదురించు నసురుడెవరు?
    రామనామము జపియింప నేమి గలుగు?
    రావణుఁడు, కుంభకర్ణుఁడు, రక్షమనకు!!!

    రిప్లయితొలగించండి
  42. సహజమైన రజస్తమోసత్వ తత్వ
    రీతుల జెడుజేయు మొదటి రెంటి బోలు
    రావణుఁడు కుంభకర్ణుఁడు ; రక్ష మనకు
    సత్వగుణ శీలుడగు విభీషనుని వలన

    రిప్లయితొలగించండి
  43. అందరికీ నమస్సులు🙏
    లంకారాజ్యము లోనివారి మాటలు...
    తే"

    సేతు నిర్మించె లంకను సేయ క్షయము
    కొరివి పెట్టిన యట్టి వానరుని ప్రభువు
    చెరను మగ్గునట్టి యబల సీత విభుడ
    ట, శతృ దుర్భేద్య కోటనుండ భయమేల
    *రావణుడు కుంభకర్ణుడు రక్ష మనకు*

    వాణిశ్రీ నైనాల, హైదరాబాద్

    రిప్లయితొలగించండి


  44. కందోత్పల


    హనుమా ! తిరుగుమికన్! ప్రబ
    లిన రావణ కుంభకర్ణులె తిరంబగు ర
    క్షణ నిచ్చు దైవముల్ మా
    కనుచున్ లంకిణి పలికెను కంద జిలేబీ



    జిలేబి

    రిప్లయితొలగించండి
  45. అందరికీ నమస్సులు 🙏
    (అశోకవనంలో సీతమ్మతో రాక్షసి పలుకులవలె)..

    *ఉ మా*

    దేవుడు రాముడే యనుచు తేలును కాదన నెవ్వరే యిలన్
    రావణు డుండగా నసుర రాజ్యము నందున వేరుగా ననన్
    నీవిల నెన్నియున్ పలుకు నిక్కము మాకిది నొప్పుటే సదా
    *"రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😊🙏

    రిప్లయితొలగించండి