25, మే 2020, సోమవారం

సమస్య - 3379

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము"
(లేదా...)
"సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్"

83 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  కంగారొందక జబ్బలన్ జఱచుచున్ గాండ్రించి కోపించుచున్
  భంగున్ త్రాగుచు జంద్యమూని చనగన్ ప్రారబ్ధకర్మంబునన్
  రంగమ్మందు నమేఠినిన్ తగులగా రాకాసి సైన్యంబునన్
  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  Julius Caesar:

  జంగం దేవర పల్కులన్ వినకయే జాప్యమ్మునున్ జేయకే
  కంగారొందక సీజరే చనగనున్ గండమ్మునున్ గానకే
  పొంగారొందెడు జంబమున్ విడువకే పోవంగ రచ్చస్థలిన్:
  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్

  జంగం దేవర = జంగమయ్య (ఆంధ్రభారతి)

  రిప్లయితొలగించండి
 3. అందరికీ నమస్సులు 🙏

  నా ప్రయత్నం 🙏😊

  *తే గీ*

  ఊరి యందున యా జనులొకటి జూచె
  ఏనుగచట జేరగవారు యబ్బుర పడె
  పరుగు పరుగునగానగ వచ్చి గ్రామ
  *"సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము"*
  🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   "...జూచి । రేనుగచట... వార లబ్బురపడ..." అనండి.

   తొలగించండి
  2. *గురువు గారూ చెప్పిన సవరణతో*

   ఊరి యందున యా జనులొకటి జూచి
   రేనుగచట జేరగవారలబ్బుర పడె
   పరుగు పరుగునగానగ వచ్చి గ్రామ
   *"సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము"*

   తొలగించండి
 4. (కార్యమపూడి రణరంగంలో అభినవాభిమన్యుడైన బాలచంద్రుని అవక్రవిక్రమం)
  అంగాంగంబుల బౌరుషప్రభలు దే
  శాదర్శభావంబులున్
  బొంగుల్వారగ విక్రమించె మృగరా
  ట్పోతంబునా బాలుడే ;
  భంగంబందిన వైరులెల్ల రొకటై
  భల్లంబులన్ గ్రుచ్చగా
  సింగం బక్కట !సింధురమ్ములకు ని
  స్తేజంబుగా జిక్కెడిన్ .
  (మృగరాట్పోతంబు-సింహకిశోరము ;భల్లంబులన్-బల్లెములతో ;
  సింధురమ్ములు-ఏనుగలు)

  రిప్లయితొలగించండి
 5. రంగంబాస్థలి కంకుభట్టుఘనమంత్రాంగంబుసాగింపగా
  రంగంబింపుగ సాగుచుండెరసమైరాజన్యతేజంబునన్
  సాంగోపాంగముబంధనమ్ముగనతంత్రంబౌచుశోభిల్లగా
  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 6. గోవులను విడిపింప ఫల్గును డని కస
  హాయశూరుడై యేతెంచ ననుకొనిరట
  సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్మ
  టంచు కౌరవ శ్రేణి జయము తమదని!

  ("సింహంబాకటితో గుహాంతర.." - తిక్కన)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొంగుల్వారగఁ దామసంబు మదిలో,
   ముల్లోకముల్గొల్చు నీ
   లాంగున్బంధితుఁజేయ నిండుసభలో
   నాకౌరవశ్రేణి త
   ల్పంగన్, సభ్యులుఁ జర్చసేయఁ దొడగెం
   బాపంబు శ్రీకృష్ణుడన్
   సింగం బక్కట సింధురమ్ములకు ని
   స్తేజంబుగాఁ జిక్కెడిన్.

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి.
   రెండవ పూరణలో 'లాంగున్'? 'సభ్యులు' బహువచనం, 'తొడగెన్' ఏకవచనం. "...జర్చ సేసిరిటులం.." అందామా?

   తొలగించండి
  3. నీలాంగున్ (నీలదేహుడు అని నా ఉద్దేశ్యము)🙏

   తొలగించండి
 7. నిన్నటి దినము రాజ్యాధి నేత తెరచె
  కాసుల కొరకై మందు దుకాణములను
  శత్రుపక్ష వాదనలను సాంతము గన
  సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము

  రిప్లయితొలగించండి


 8. హింస కూడదనగ ముని హీనమనుకొ
  నుచు బతుకునరరె వదిలెను చరి వేట
  తనదు గాండ్రింపులనుకూడ తగ్గు చేసి
  సింహ మేనుంగు లకుఁ జిక్కెఁ జెడె య శమ్ము


  జిలేబి

  రిప్లయితొలగించండి

 9. రంగంపేట క్రాసు కాడి సింగము కత !


  రంగంపేట సివార్లలోన తిరుగాడంగా, భయోత్పాతులై
  రంగాస్వామిని వేడగా జనులు "సర్వంఖల్విదంబ్రహ్మ" పూ
  ర్ణంగా హింసను వీడ బోధనను నేర్పంగా పరివ్రాట్టు పొం
  గంగా ప్రేమయు మారె, మానుకొనెనా గాండ్రింపులన్ కూడ,నా
  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్!
  రంగంపేట క్రాసెక్కుడుంది ? :)
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ఏమో...మా నెల్లూరులో మాత్రం ఇది ఉన్నది:,

   "రంగ నాయకుల పేట"

   "గ్రాసము లేక స్రుక్కిన...కేసరి జీర్ణతృణంబు మేయునే?"

   తొలగించండి
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.
   మా వరంగల్లులో సెంట్రల్ జైల్ ఎదురుగా ఉన్న ప్రాంతం 'రంగంపేట'. సుప్రసిద్ధ భద్రకాళి దేవస్థానానికి ఈ రంగంపేట మీదుగానే వెళ్ళాలి.

   తొలగించండి


 10. BTW,

  చాన్నాళ్ళు గా ఓ సందేహం‌ తెలియ చేయ గలరు

  కందానికి ( కందపు మీటర్ కు) కందమనే పేరెట్లా వచ్చింది ?  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఛందస్సును గురించి సమగ్రంగా, సాధికారంగా కోవెల సంపర్కుమారాచార్యులు వ్రాసిన 'ఛందః పదకోశం' చూసాను. అందులో 'కందం' నామౌచిత్యం ఇవ్వలేదు.
   నేను ఊహించినది ఇది... కందం 64 మాత్రల పద్యం. ఇది 32 మాత్రల కొకటి చొప్పున రెండు భాగాలుగా ఖండింపబడింది. ఇలా ఖండింపబడినందున దీనిని "ఖండపద్యం' అన్నారేమో? కాలక్రమాన జనుల నోళ్ళలో ఇది 'కందపద్య' మయిందేమో?

   తొలగించండి

  2. ఆహా! మంచి ప్రశ్నే అన్న మాట!

   ఏమండోయ్ జీపీయెస్ వారు ఈ ప్రశ్న వాట్సప్పు లో సంధిస్తారూ ? ఏమైనా మరింత సమాచారం వస్తుందేమో చూద్దామూ


   జిలేబి

   తొలగించండి

  3. వారు నన్ను చాలా సార్లు అడిగిన ప్రశ్నలు:

   "ఈ జిలేబి ఎవరు? ఎక్కడ? ఎందుకు? ఈ పేరు ఎలా వచ్చినది?"

   వగైరా వగైరా...

   తొలగించండి


  4. దీనికి ఆల్రెడి జవాబుందండోయ్ :)

   బ్లాగులో ఎన్నో టపాల లో జిలేబి ఎవరో‌ఎక్కడో ఎందుకో గట్రా వాటికి జవాబు ఉంది.   జిలేబి

   తొలగించండి
 11. భంగంబున్ గను పాము చీమలకెడన్ వ్యాఘ్రం బజానీకముల్
  రంగత్స్వాంతము లౌచు బుద్ధివిభవప్రాధాన్యతన్ గాంచినన్
  కంగారందును శూన్యసత్వయగుచున్ గాంచంగ లోకమ్మునన్
  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్.  రిప్లయితొలగించండి
 12. గురువర్యులకు నమస్సులు, నా నిన్నటి మొన్నటి పూరణలను పరిశీలింప ప్రార్థన.
  తల్లిని దండ్రినిన్ మదిని దాల్చుచు వారలు జీవితమ్మునన్
  అల్లిన యట్టి గారముల నార్ద్రత కూడుక నాస్వదించుచున్
  అల్లన వారి చిత్తరువు లందున మేలు నలంకరింప నా
  మల్లెల నాగరాజు గని మానసమందున రోసెనయ్యయో

  మోదమున నా నుడుల నా
  మోదించక వేదన నిడ మూర్ఖము తోడన్
  వాదించగ, నీ వెంతయు
  రోదించిన బిల్చెదను కరోనా బూచిన్!
  (కరోనా లాక్ డౌన్ సందర్బంగా ఇంట్లో జరిగే సరదా బెదిరింపులు,వాగ్వివాదాలు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నది.
   "జీవితమ్ములో నల్లిన..." అనండి.

   తొలగించండి
  2. అలాగేసవరిస్తానండి, ధన్యవాదములు.
   సవరించిన పద్యం:
   తల్లిని దండ్రినిన్ మదిని దాల్చుచు వారలు జీవితమ్ములో
   నల్లిన యట్టి గారముల నార్ద్రత కూడుక నాస్వదించుచున్
   అల్లన వారి చిత్తరువు లందున మేలు నలంకరింప నా
   మల్లెల నాగరాజు గని మానసమందున రోసెనయ్యయో!

   తొలగించండి
 13. కయ్యమాపను కృష్ణుడు కౌరవులను
  చేర దూతగ, వేగమె చెరపట్టి  
  మూర్ఖులనుకొని  రీరీతి మోదమంది      
  సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము

  రిప్లయితొలగించండి
 14. గంగాహారతినిత్యసత్యమననేకాంతంబుస్వాంతంబును ద్గంగాగౌతమితుంగభద్రయమునాకావేరిసాక్షంబున
  య్యంగాంగంబునశృంగముల్గలకరోనాభూతసింహంబనన్
  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 15. రామ దాసుడు ' కంచర్ల '' రామ ' 'రామ '
  పలికి బందీగ బోయె నవాబునకును
  భక్తి గల్గెడు వారికి భయము లేదు
  సిం హ మేనుంగులకు జిక్కె జెడె యశమ్ము.

  రిప్లయితొలగించండి
 16. మైలవరపు వారి పూరణ

  పొంగుల్వారగ బుద్ధికౌశలము నే పూమొగ్గవ్యూహమ్ముని...
  బ్భంగిన్ గూర్చెద., రేపు యుద్ధమున నా పార్థాత్మజుండిందులో
  క్రుంగున్ జిక్కి యటన్న కుంభజుని పల్కుల్ విన్న రారాజనెన్
  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 17. తండ్రి లేని లోటును పూడ్చఁ దమ్మి మొగ్గ
  రమున జొచ్చి శాత్రువులతో రణమొ నర్చి
  వీరు డభిమన్యుడసువులు వీడుటగన
  సింహమేనుగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము.

  రిప్లయితొలగించండి
 18. తల్కమందునరాజుకీ దప్పదింక
  సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము
  పొగరు రోజులు లేవిక బోయెనింక
  పట్టి పీడించు నాయకులట్టిగతియె

  రిప్లయితొలగించండి
 19. ' చ్చెస్సు 'లో రాజునకు జెప్పె ' చెక్ ' యటంచు-
  ఏనుగులు పోరె విక్రమ మేర్పడంగ
  జయము జయమని పల్కెను సంబరమున
  సిం హ మేనుంగులకు జిక్కె చెడె యశమ్ము.

  రిప్లయితొలగించండి
 20. అన్నిట తన కెదురు లేని యా ఢ్యు డగుచు
  విఱ్ఱ వీగు తరుణమందు వింతగ నొక
  చోట నల్పుల చే నోడె చోద్యము గను
  సింహ మేనుంగులకు జిక్కె జెడె యశమ్ము

  రిప్లయితొలగించండి
 21. అందని ద్రాక్ష పుల్లన.. తగిన జిమ్నాస్టిక్స్ నేర్చుకోకుండా అందుకునే ప్రయత్నం చేస్తే... పాపం!!

  పట్టి గణముల బంధింపఁ బద్యములను
  దేట గీతియుఁ గందము నాట వెలది
  వ్రాసి యొకయింత యశమును బడసినాడు
  "సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము"

  రిప్లయితొలగించండి
 22. సంగరమున క్రీడి సుతుడు శత్రువులకు
  నొంటి గానగు పించగ నొక్క సారి
  చుట్టు ముట్టగ ననిపించె జోదుల కట
  సింహమేనుంగులకు జిక్కె చెడె యశంబు

  రిప్లయితొలగించండి
 23. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కాననమున కలసి తిరుగాడు చుండు
  హస్తికమును వెంటాడుచు నహము తోడ
  విక్రమము నాకు గలదంచు విఱ్ఱవీగి
  సింహ మేనుంగులకు జిక్కె జెడె యశమ్ము

  రిప్లయితొలగించండి
 24. ధరణి సాంకేతికమున ప్రథమము నిలుచు
  మంచి వైద్యము దొరుకెడు మాన్య సీమ
  యగ్రరాజ్యము కిడె చైన యట్టి దెబ్బ
  సింహ మేనుంగులకు జిక్కె జెడె యశమ్ము.

  రిప్లయితొలగించండి
 25. గురువు గారికి నమస్సులు.
  ప్రెక్కుభాషలరసనకుపేరుతనది
  మోసమన్నదెరుగకయెమోసపోయె
  నట్టి పరిపాలనామేరునగజమణినృ
  సింహమేఏనుగులకుజిక్కిజెడెయశమ్ము

  రిప్లయితొలగించండి
 26. గాంగేయున్ బ్రియ పౌత్ర నందనుడు విక్రాంతమ్ము తో జొచ్చి నా
  కంగారున్ రిపు వీరులన్ దునుమగన్ గాంచంగనే కుత్సితుల్
  సింగాణిన్ దునియించిరే యనిని యా సింగమ్ము నే కూల్చుటన్
  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్

  రిప్లయితొలగించండి
 27. రంగంబుం జని పద్మమొగ్గరమునన్ రావంబునుం జేసి వీ
  రంగంబాడుచు ద్రోణకర్ణకృపులన్ ప్రావీణ్యమొప్పార పే
  రుం గన్నట్టియు రీతి గెల్చి తుదకున్ గ్రుంకెప్రచండాజినన్
  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్

  రిప్లయితొలగించండి
 28. కరులగుంపులుదిరిగెడుఖాత్రమునకు
  సింహమొక్కటిబోవగసింధురములు
  చుట్టుముట్టగనన్నియుజొరవలేక
  సింహమేనుంగులకుజిక్కెజెడెయశమ్ము

  రిప్లయితొలగించండి
 29. భారత సమరమ్మున గజబలము తోడు
  త భగదత్తుఁడు చెలరేఁగ దపను భంగి
  కాల్బలము నందు నొక్కొక్క గణిత వీర
  సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము


  భంగుల్ పెక్కు నదృష్ట హీనులకుఁ జావం గాననంబం దహో
  కంగా రించుక లేక పొంచి పొదలం గర్వించి వేటాడఁగన్
  సింగం బేఁగఁగ నాఁడు సింగములతో శీఘ్రంబ శాబమ్మ యీ
  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్

  రిప్లయితొలగించండి
 30. రంగాకంటివెయిక్కడిచ్చినదిచిత్రంబాయెనేపారగన్
  సింగంబక్కటసింధురమ్ములకునీస్తేజంబుగాజిక్కెడిన్
  సింగంబంతటిక్రూరజంతువదిదాచిక్కంగనోపంగదా?
  కంగారుంబడబోకుమాయిపుడుదాగాంచంగనట్లేసుమా

  రిప్లయితొలగించండి
 31. సింహమై దాను రాజ్యమ్ము జేయు నాడు
  సింహభాగంబు నిధులు కాజేసెనంచు
  చింత రేపె విపక్షము జేర్చి కొంత
  సింహనాదంబు నేన్గులై జేసిరింక
  సింహభాగంబు గోల్పోయి జేరె వీడు
  సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము

  రిప్లయితొలగించండి
 32. రంగా వీడక పెళ్ళిదుస్తులను ప్రారంభింప శృంగారమున్
  పొంగుల్ వారెడి కోర్కెతోడ వరుడే పూరింపగా గుబ్బెతన్
  రంగంబందున దూకె నిశ్చయముగా లాలాట బంధమ్ము *బా*
  *సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 33. తేటగీతి
  తెల్లవారల నల్లూరి తల్లడించి
  గూడె మందున నల్పులఁ గొట్టెదరని
  గుండె జూపుచు తూటాడ గూలెనకట!
  సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము!

  శార్దూలవిక్రీడితము
  పొంగుల్వారగ దేశ భక్తి తనలో పోరాడి నల్లూరియే
  బెంగంజెందుచు గూడె మందు జనులన్ వేదింతురన్ జాలితో
  లొంగన్ గుండెను జూపి తెల్లలకు నిర్లోభంబునన్ భావిపై
  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్!

  రిప్లయితొలగించండి
 34. అంగారమ్మును బోలు బాలకు డనాయాసంబుగా బోరుచున్
  బొంగుల్వారెడు శౌర్యతేజమున నాముప్పేటదాడిన్ వడిన్
  కంగారేమియు లేకయే యెదిరి నాకంబేగగా దోచెడిన్
  సింగం బక్కట సింధురంబులకు నిస్తేజమ్ముగా జిక్కెనే!

  రిప్లయితొలగించండి
 35. మిత్రులందఱకు నమస్సులు!

  [పద్మవ్యూహయుతరణాంగణమ్మునఁ గపటులైన ద్రోణాదులకు వీరాభిమన్యుఁ డొంటరిగఁ జిక్కిన సందర్భము]

  అంగాంగక్షతభంగఘోటకశతాంగానీక పద్మస్పశో
  త్తుంగీకృత్యమహోత్తమాగ్రగుఁడు తద్ద్రోణాదులే డీకొనం,
  బింగాక్షుండయి శూరతం బఱపు నా వీరాభిమన్యుం బలెన్,

  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్!

  రిప్లయితొలగించండి
 36. బాలవీరుడు రణమున పార్థుసుతుడు
  కౌరవుల వ్యూహమందున కన్నుమూసె
  సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము
  విధిబలీయము తప్పింప వీలుగాదు

  రిప్లయితొలగించండి
 37. తే.గీ.

  దేశ స్వాతంత్ర్య సిద్ధికై తిరుగులేని
  ధైర్య సాహసములజూపి దట్టి నిలుచ
  చంద్ర శేఖర యాజాదు చరిత గనగ
  సింహ మెనుగులకు జిక్కె జెడె యశమ్ము

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శా:

   రంగంబందున జంతుజాలములనున్ రంజింప సంభారముల్
   సంగమ్మూనగజేసి శిక్షణ నిడన్ సావాసమున్ బెంచుటై
   భంగంబాయెను సాజమైన గుణముల్ వర్తింప మిత్రత్వమున్
   సింగంబక్కట సింధురమ్ములకు నిస్తేజంబు గా జిక్కెడిన్

   రంగము=సర్కస్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 38. భంగమ్మున్ వెస చేయ తమ్మిరచనన్ బాలున్ నియోగింపగా
  రంగమ్మందున దూకె శీఘ్రపు గతిన్ రౌద్రమ్ముతో వైరులన్
  త్రుంగన్ జేయగ పార్థుసూనుడచటన్ దుర్మార్గమౌ చర్యతో
  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్

  రిప్లయితొలగించండి
 39. దుర్యోధనుడిని సింహమనుటకు పెద్దలొప్పుతారో లేదో ?

  రంగత్బాహుబలాఢ్యు దుస్సహ రణప్రావీణ్యధౌరేయుఁడు
  త్తుంగోత్సాహ బలప్రదర్శన విధిన్ దుర్నీతియై మౌని స
  త్సంగుల్ పాండవులన్ హసించునెడఁ గంధర్వాళి బంధించెనే
  సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దుర్యోధనుఁడు దురహంకారి,దురభిమాని,విద్వేషి యైనను గదాయుద్ధమున సింహవిక్రముఁడే.

   తొలగించండి
 40. శ్రీలక్ష్మీ నృసింహాయనమః తేది:25-05-2020.
  మహోదయులకు నమస్సులతో, శుభోదయం.

  నేటి సమస్యాపూరణాల యత్నం -


  శత్రువుల చీల్చి చెండాడి చావు జూపె
  భారతీయధర్మ నిరత ప్రభవ శివుడు
  కదన సీమకపటయుక్తి గనకలేక
  సింహ మేనుంగులకు జిక్కె,జెడె యశమ్ము.

  ఏం?గండౌ కదనంబునైన తన దాయిత్వంబు భాసిల్లగన్
  సాంగోపాంగత నాల్గుదిక్కుల నణంచగ
  క్రీడగబోరెన్
  గృంగంనేరక, యాంగ్లమూకల వలన్ కృద్ధంపు ఝాన్సీ సుమా
  సింగంబక్కట సింధురంబులకు నిస్తేజంబుగా జిక్కెనే

  రిప్లయితొలగించండి