2, మార్చి 2024, శనివారం

సమస్య - 4693

3-3-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్”
(లేదా...)
“పీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్”
(అయ్యగారి కోదండరావు గారికి ధన్యవాదాలతో...)

42 కామెంట్‌లు:

BMahalakshmi చెప్పారు...

కానగసంఘంబందున
మానని వైరము పదవికి మైకొనియుండన్
ఏనికయౌగాహీనుడు
పీనుగుతరుశాఖపైకివేగమెయెక్కెన్

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

కాననము వెళ్ళెనొక్కడు
పూనికతోదేను గట్టె పుల్లలువడిగా
తానట పులిని గని, పిరికి
పీనుగ తరుశాఖపైకి వేగమె యెక్కెన్

BMahalakshmi చెప్పారు...

మానండప్పుడుసౌబలుండుగనగా మారాజుతోడెంచుటన్
కానండాయెగకౌరవుండుహృదిలోకార్చిచ్చుమామాయెగా
ఆనంజేసెనునిర్ణయంబునకటా హానిన్గనన్రాజ్యమే
పీనంగెక్కెనువృక్షశాఖనటనుద్వృత్తిన్ జవంబొప్పగన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
పేనఁగ భేతాలుడు కథ
మౌనము వీడిచు బదులిడ మాన్యుడు రాజై
యానతి దప్పెననుచు నా
పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్!

శార్దూలవిక్రీడితము
పేనంగన్ గథనొక్కటిన్ బదులుకై భేతాలుఁడున్, విజ్ఞుఁడై
మౌనంబున్ విడి విక్రమార్క ప్రభువే మాటన్ సమాధానమున్
దానందింపఁగ దప్పుచున్ నియమమున్ దర్కమ్మునన్ బద్ధమై
పీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్!

gsnatp చెప్పారు...

కం:
ఏనుగును గని భయపడెను
తాను, పరుగెత్తి చేరె తరువట గురిసెన్
వాన, గనెను తొర్రనుగల
పీనుగు! తరుశాఖపైకి వేగమె యెక్కెన్”

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మానుగ భేతాళు ని గొని
మౌనపు విక్రము డు తాను మా టా డ వెసన్
జానుగ నెగిరివెడలి యా
పీనుగ తరుశాఖ పైకి వేగమె యెక్కెన్

విరించి చెప్పారు...


వానిని దాచగ వలెనని
యేనాడైనను విడువని యీ యస్త్రములన్
పీనుగుగ మార్చినంతనె
పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్.


మ్రానున్ జేరుచు పల్కె సోదరులతో మాన్యుండు ధర్మజ్ఞుడే
యేనాడున్ విడనట్టి యస్త్రములనే యీనాడు నిచ్చోటిలో
పీనుంగై యగుపించురీతి నిట దాపెట్టంగ మేలంచనన్
పీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్.

Sitharamayya Solasa చెప్పారు...

దీనుడతడు బతుకుటకయి
మ్రాను పయిన కట్టినట్టి మఱువలను చేరన్
దోని ధనమొంద నా నడ
పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్

నడపీనుగు = నడచుశవము

విరించి చెప్పారు...


నేనిక ప్రశ్నింతు సమా
ధానము తెల్పుమని అడగ దక్షుడు తెలుపన్
మౌనము భంగమయెననుచు
పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్.


మౌనమ్మందున సాగు రాజునడిగెన్ మాన్యుండ వంచున్ సమా
ధానమ్మిమ్మని ప్రశ్నజేయనదియే తా జెప్పగా నంతటన్
మౌనంబయ్యది భగ్నమయ్యె ననుచున్ మన్నేడి స్కందస్సుపై
పీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్.

M.B.G.TILAK చెప్పారు...

కానగ వృక్షంబు పయిన
పీనుగులో దాగియుండు భేతాళుండే
మౌనము భంగంబొనరగ
పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్

తానే పీనుగునావహించి మను భేతాళుండు వృక్షంబుపై
తానే ప్రశ్నలఁ సంగడించి విధిగా తాఱించు మౌనంబునే
నానా రీతుల కల్పనల్ చదివితిన్ నాబాల్యమందే యిటుల్
పీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

మేనుఁ బెరిగెనేనుగు వలె
హాని కలుగునన్న లావునావిరి చేయన్
పీనుగు వలె చిక్కగనా
పీనుగు తఱుశాఖపైకి వేగమె ఎక్కెన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

పూనికతో తానడిగిన
పానలు దీర్చంగరాజు బదులిచ్చుటకై
మౌనము విడచిన తోడనె
పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్

(పానలు= సందేహము)

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

మౌనంబున్ విడనాడకన్ చలముతో క్ష్మానాథుఁడా మ్రానుపై
పీనుంగున్ తన మూఁపునందుగొనఁగా బేతాళుఁడా రాజుకున్
మౌనంబున్ విడనాడజేయ నడిగెన్ మాన్యంపు సందేహమున్
పీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ మానక నుత్తర మొసఁగుచు
మౌనము వీడఁగ నధిపుడు మరిమరి విధిగా
నానతిఁ దప్పితి వనుచును
బీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్

శా॥ కానంగాఁ గలికాల చోద్యమగునో కాదో మరేమాయయో
సూనమ్మాయె మనంబుఁ జూడగ నటుల్ శుద్ధమ్ముగా భీతితోఁ
బీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్
నేనిశ్చేష్టుఁడ నైతి లేవమనె నానిక్కంపుటాలప్పుడే

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:బాణమ్ముల,శస్త్రమ్ముల
పీనుగు రూపమ్ము జేసి వృక్షము పైనన్
దానిని పాండవు లుంచిరి
పీనుగు తరు శాఖ పైకి వేగమె యెక్కెన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

శా:ప్రాణమ్ముల్ కబళించుచున్,దివి కి శాపమ్మైనదౌ నుప్పెనన్
దీనమ్మై విలపించె సీమ,కన నీ దృశ్యమ్మె యెచ్చో గనన్
పీనుం గెక్కెను వృక్షశాఖ నట, నుద్వృత్తిన్ జవం బొప్పుచున్
బ్రాణాధారపు బంట నిచ్చు దివికిన్ బ్రాప్తించె నా కష్టముల్.
(దివి సీమ ఉప్పెన లో మృతకళేబరాలు చెట్ల పై ఉన్న దృశ్యాలు అనేకం.)

Subbarao Pochiraju చెప్పారు...

మానున గలభే తాళుఁడు
పీనుగు పైనావహించి వేయగ ప్రశ్నల్
మౌనమె రాజ్యముఁజేయగ
పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఊనంగ విక్రమార్క ధ
రా నాథుం డంచి తోత్తరం బీయంగం
దా నడిగి నట్టి ప్రశ్నకుఁ
బీనుఁగు తరు శాఖ పైకి వేగమె యెక్కెన్


వానల్ దగ్గిన వేళ లందు నిజ సత్వంబుం బ్రదర్శింపఁగా
మానం జాలక రక్తి నాడు ననుకంపం గోఁతి కొమ్మంచినిం
గోనల్ గొండలు తిర్గుచుండి వడి సద్గోత్రుండు జ్యేష్ఠుండు రా
పీనుం గెక్కెను వృక్ష శాఖ నట నుద్వృత్తిన్ జవం బొప్పఁగన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కాననమున కేగె నొకడు.." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం. "మఱువల జేరన్" అనండి

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ఉత్కృష్టంగా ఉన్నవి. అభినందనలు.

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ధన్యవాదం గురువు గారు!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏 కందంలో రెండవపాదము లో సవరణ: వీడిచు బదులు వీడుచు

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

వీనులలరంగనునుపా
ఖ్యానము వినిబదులొసంగగాంచుచు మదిలో
నానందమునొందుచునా
పీనుగు తరుశాఖ పైకి వేగమె యెక్కెన్

సురేశ్ కుమార్ చెప్పారు...

నా పూరణ ప్రయత్నం..

కానలనొక చెట్టు మొదట
పానము బోయిన మిడతను బట్టెను చీమల్,
దానిని మహిజము కీడ్చగ
పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్