7, మార్చి 2024, గురువారం

సమస్య - 4698

8-3-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున”
(లేదా...)
“శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా”


41 కామెంట్‌లు:

gsnatp చెప్పారు...

ఆ.వె:
మనసు లోన భక్తి మార్గ మెరుగకనె
దీక్ష బూను చుంద్రు తీరు మార్చి
వేష మేసి జనుల వెర్రివారల జేసి
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున”

M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విరించి చెప్పారు...


బల్లిదుడ నటంచు బలహీనులను జేరి
ప్రాణములను తీసి పసిడి దోచి
పాపకార్యములను వాసిగా నొనరించి
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున?



అవరోధమ్ములు ధర్మశాస్త్రములవే యార్జింపగా భాగ్యమున్
శివమున్ బొందగ నంచు మూఢుడయి సచ్చీలమ్మునే వీడుచున్
భవబంధమ్ముల చిక్కి నిత్యమిల పాపాలెన్నియో జేయుచున్
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా?

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

భద్రినాధునివలె రుద్రాక్ష మాలలు
వేసికొనియు ప్రజల మోసగించు
దొంగ భక్తులెట్లు మంగళ కరమైన
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున?


గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆటవెలది
నియమ నిష్ఠ లేక నీలకంఠుని గొల్చి
మూఢభక్తి నొందె బోయ ముక్తి
మూలమంత్రమనగఁ బూను భక్తియె లేక
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున?

మత్తేభవిక్రీడితము
శివమూర్తిన్ గొని మూఢభక్తిఁ బరమున్ జెందెన్ గదా కన్నడున్
భవుడే కానక నిష్టయున్ నియమమున్ వాత్సల్యమున్ జూపఁగన్
భువిలోనన్ దగు 'భక్తి' యే వలయు సోమున్ బొందగన్, 'లేదనన్'
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా?

Sitharamayya Solasa చెప్పారు...


కంఠమందు నిలిపె గరళమును మనకై ,
రాజధరుని కొలుచు రాత్రి యందు ,
కడుపునిండ మెక్కి కరుణ జూపుమనుచు
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున !

BMahalakshmi చెప్పారు...

చేయరానిపనులజేతయైనిలచుచు
శివునిగొల్చువాఁడుశిష్టుడగున
వంకలున్నకఱ్ఱబారుగానుండునా
సత్యమిదియఁజూడుశంకరార్య

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మత్తు నందు మున్గి మంచి చెడ్డ లెరిగి
మసల లేని వాడు మహిని జనుల
మోస గింప జూచు పోకిరి యగు వాడు
శివుని గొల్చు వాడు శిష్టు డగున?

BMahalakshmi చెప్పారు...

భవుపాదాబ్జమువ్రాలిరావణుడు తాభావించెదుర్మార్గమున్
శివునేగోరగచంపెగాదెహరియున్ చిత్రంబుభస్మాసురున్
చవులూరించెడిశంభునామమదిరా చండాడుపాపాత్ములన్
శివరాత్రిన్శివుగొల్చునట్టినరునిన్ శిష్టుండనన్జెల్లునా

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

అవకాశంబులు దేవతార్చనకు లభ్యంబౌననల్పంబుగన్
కవనమ్మేయగు తల్లిదండ్రులకు సౌకర్యమ్ములన్ చేయగన్
లవలేశంబుయు బద్ధుడవ్వకనె కాలక్షేపముల్ చేయుచున్
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టండనం జెల్లునా

Subbarao Ayyalasomayajula చెప్పారు...

మ.

జవరాల్ జూదము ధూర్తుడౌ గుణములన్ సామర్థ్యమున్ బుత్రునిన్
నివసించంగ బహిష్కరించె బిత, సాన్నిధ్యమ్ము గాశీపురిన్
*శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా*
దివియన్ గ్రమ్మి కుబేరుడై జననమున్ దిక్పాలకుండయ్యెగా.

M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

శివుఁడు వశుఁడుగాదె శిష్టులకెన్నఁడు
భావజారి బాపు బంధనములు
మనసునందున నిడుకొని మచ్చరమ్మును
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

శివమున్ గూర్చును భక్తకోటి గొలువన్ క్షిప్రమ్ముగా నీశుఁడే
భవ నాశంకరుడైన శంకరుని సంభావించగా భక్తితో
శివసాన్నిధ్యమునందు నైహికములన్ చింతించుచున్ హేలగా
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఆ.వె:సంధ్య వార్చ కుండ,స్నాన మైనను లేక
కులపు ధర్మములను కూల ద్రోసి
భవుని కేల నిష్ఠ,భక్తి ముఖ్య మటంచు
శివుని గొల్చు వాడు శిష్టు డగునె

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

ఆ॥ భక్తి లేక పాప పంకిల మౌచు న
శ్వరమగు యిహ భోగ భాగ్యములనె
యాదరించి చనుచు నత్యాశ తోడను
శివునిఁ గొల్చు వాఁడు శిష్టుఁ డగున

మ॥ భవ మోహంబున నెన్నొ పాపములు సంపాదించ నైశ్వర్యమున్
భువిలోఁ జేయుచు ధర్మ చింతనయు సంపూర్ణమ్ముగా వీడుచున్
భవునిన్ గొల్వఁగ దేవదేవఁడెటులన్ బాపాత్మునిన్ గాంచునో
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుండనన్ జెల్లునా?

Dhanikonda Ravi Prasad చెప్పారు...

మ:భవునిన్ గొల్చుచు,నర్థభాగమగు నంబన్ వీడి,విఘ్నాంతకున్
శివపుత్రున్ స్మరియింపకే,వదలి నందిన్,కార్తికేయున్,హిమో
ద్భవగంగన్ విడి,లింగపూజ తనకున్ ప్రాథాన్యమం చెంచుచున్
శివరాత్రిన్ శివు గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనన్ జెల్లునే

subbarao చెప్పారు...

శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగుననుట
కల్ల కాదు , నిజము కలియుగమున
పాద సేవఁజేయ బాధలఁదొలగించు
భూరి ధనము నొసఁగు ముదము తోడ

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పుండ్రములు ధరించి భూత దయ యొకింత
లేక సంచరింప లోకు లందు
నాశ నూని యెడఁదఁ గేశవునిఁ బరమ
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున


అవలోకింపఁగ ధర్మ వర్తనము ముఖ్యం బౌను లోకమ్మునన్
శివునిం గొల్చిన భస్మ దైత్యుఁడు ధరం జింతింప సన్మార్గుఁడే
శివ భక్తుండగు రావణాసురుఁ డహో శిష్టుండె చింతింపఁగా
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

మ॥ 3వ పాదము మధ్యన దేవుదేవుఁడెటులన్ చిన్న టైపాటు మన్నించగలరు

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మార్గ మెరుగకయె" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆటవెలదిలో "ఫాలనేత్రుని గొల్త్రు" అనండి.
వృత్తంలో "...చుందురు జనుల్ క్షేమంబు..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం అన్వయించడం లేదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"లవలేశంబును బద్ధుడవ్వకయె" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"నశ్వరమగు నిహభోగ..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

ధన్యవాదములండి

M.B.G.TILAK చెప్పారు...

సూచించిన సవరణలతో....

భక్తి తోడ జనులు ఫాలనేత్రునిగొల్త్రు
దుష్టశీలురైన శిష్టులైన
వరములొందినారు పలువురు రాక్షసుల్
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున ?

శివపూజల్ వెలయించుచుందురు జనుల్ క్షేమంబునాశించుచున్
శివభక్తుల్ శతకోటిగాదె జగమున్ చింతించి శోధించినన్
లవలేశంబులు వారిలోన సుజనుల్ రాకాసులే దండిగా
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా?

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

డా బల్లూరి ఉమాదేవి
ముక్తినందగలడుపుడమిలోహసతము
*“శివునిఁ గొల్చువాఁడు, శిష్టుఁ డగున”*.
కానిపనులుచేసి కరములుజోడించు
వానిని పరికింప వసుధ యందు