27, మార్చి 2024, బుధవారం

సమస్య - 4718

28-3-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంతలు గనరారు రాయగడ నగరమునన్”
(లేదా...)
“భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

33 కామెంట్‌లు:


  1. ఎంతగ వెదకిన నేమిర
    కొంతైనను గర్వముండి కొంటెతనముతో
    కాంతులనవమానించెడి
    కాంతలు గనరారు రాయగడ నగరమునన్.



    గామిడులౌచు సంతతము కయ్యము లాడెడు వార లెప్పుడున్
    నేమము వీడుచున్ చెలగు నేరమనస్కుల ధర్మవర్తనుల్
    సోమరులైచరించుచు నసూయను చెందెడి స్వార్థచిత్తులౌ
    భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో.

    రిప్లయితొలగించండి
  2. కందం
    ఇంతలుగ ప్రజ్ఞఁ గలిగిన
    నింతిగ వెలిగెడు నపర్ణ నెంచుచు సభ ని
    శ్చింతగఁ జేరుచు నెల్లరు
    కాంతలు, గనరారు రాయగడ నగరమునన్!

    ఉత్పలమాల
    లేమ శతావధానమట ప్రీతిని గూర్చెడు పాటవమ్మునన్
    శేముషిఁగల్గు పృచ్ఛకులు సిందగ మోదము పద్యమొల్కునన్
    గామన నెల్లరున్ సభను గాంచ నపర్ణను చేరినారనన్
    భామలు, లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  3. శాంత విభూషణు లతివలు
    శ్రాంతమెరుంగరు సలిపెడు సత్కార్యములన్
    వంతలలో జిక్కి కుములు
    కాంతలు గనరారు రాయగడ నగరమునన్

    రిప్లయితొలగించండి
  4. భ్రాంతిగ నుండును మరి యా
    ప్రాంతమున యువకులలోన వలపతియగుటన్
    సాంతము సనాధ లొంటరి
    కాంతలు గనరారు రాయగడ నగరమునన్

    రిప్లయితొలగించండి
  5. పంతము మూర్ఖత నిండిన
    వింతగు పాలన మిడుకొను పెద్దలు లేరే
    శాంతిని భంగపరచు కుల
    కాంతలు గనరారు రాయగడ నగరమునన్

    పామరులై యనారతము పాలన సల్పెడు మంత్రివర్యులున్
    సోమరిపోతులై తిరిగి సొమ్మును కోరెడు మర్త్యబృందమున్
    గోమలులై సదా శరణు కోరు లతాంగులు శక్తిహీనులౌ
    భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  6. పంతము న విద్య నేర్చియు
    శాంతము సఖ్యత గలిగిన సద్గుణ వ తు లౌ
    యింతులె. కానీ తప్పుడు
    కాంతలు గనరారు రాయగడ నగరము నందున్

    రిప్లయితొలగించండి
  7. భామలు శాంతి కాముకులు భవ్యమనస్కులు సాధువర్తనుల్
    నీమముతోడ నీశ్వరుని నిర్మల భక్తిని గొల్చువారలే
    సోమరులై చరింపరు, యశోధనులెల్లరు, నీతిబాహ్యులౌ
    భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  8. నీమముతోడ జీవనము నిక్కము
    గడ్పుచు నుందురెల్లరున్
    శ్రామిక కర్షకావళియు స్వాస్థత
    గల్గియు సంతసంబునన్
    క్షేమముతోడ బత్కుదురు చింతలు
    లేవు,వితంతువుల్ కడున్
    భామలులేరు రాయగడ పట్టణ
    మందునదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బత్కుదురు' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  9. రిప్లయిలు
    1. కం॥ పంతముఁ బూనుచు విద్యలు
      సాంతము నేర్చుచు పురుషుల సరసన గరిమన్
      గాంచు కొమలె గాని యితర
      కాంతలు గనరారు రాయగడ నగనమునన్

      ఉ॥ నేమము తోడ విద్యలను నేర్వఁగఁ బోయిన వారుఁ గొందరై
      ప్రేమగఁ దల్లిదండ్రులును బిల్వఁగఁ బోయిన వారుఁ గొందరై
      గోముగఁ దీర్థయాత్రలను గోరుచుఁ బోయిన వారుఁ గొందరై
      భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. కం:కాంతలు నిశి నొంటి తిరుగ
    చింత విడువ స్వేచ్ఛ యనుచు చెప్పెను గాంధీ
    ఎంత వెదుక నట్లు తిరుగు
    కాంతలు కన రారు రాయగడ నగరమునన్

    రిప్లయితొలగించండి
  11. ఉ.

    సీమ కళింగ దేశమున చిక్కె, నవాబుల చేతిలో దుదిన్
    ధామము ముందు రాజులకు దక్కెను సాహితి యుత్కలమ్మునన్
    క్షేమమునొంది నేర్వ, విదుషీమణి యోషితలే, కురూపులౌ
    *భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో!*

    రిప్లయితొలగించండి
  12. ఉ:ప్రేమగ మా సుపుత్రునకు పెండ్లికి చేపల దూర ముంచుచున్
    నీమము తోడ నుండు రమణిన్ వెదుకన్ కడు గష్ట మయ్యె హే
    రామ!యిదేమి మా కొక వరమ్మన చేపలు గిట్ట నట్టి యా
    భామలు లేరు రాయగడ పట్టణ మందు నదేమి చిత్రమో
    (ఒరిస్సా లో బ్రాహ్మణులకి కూడా చేపలు నిషిద్ధం కాదు.తినని వాళ్లు లభించటం కష్టం.)

    రిప్లయితొలగించండి
  13. అంతఃపురకాంతలు హత
    కాంతలు మరణింప మజ్జి ఘరియాణి సతిన్
    సుంతయినఁ బూజ సేసెడి
    “కాంతలు గనరారు రాయగడ నగరమునన్”

    స్వామినిఁ గోలుపోయి పెఱవారికి జిక్కక గుండమందు నా
    రామలు రాణులెల్లఁ దమ ప్రాణములన్ విడ నాత్మరక్ష కా
    హా! మనసార మజ్జిఘరియాణికిఁ బూజలు సేయువార లే
    “భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో”

    *నేపథ్యం*
    రాజా విశ్వనాథ్‌దేవ్ - రాయగడలో కోట మధ్యలో అమ్మవారిని ప్రతిష్టించడం వల్ల మజ్జి ఘరియాణి (మజ్జిగౌరమ్మ) అంటారట. ఆయన గోల్కొండ సేనల దాడిలో మరణిస్తే ఆయన 108మంది రాణులూ అగ్నిలో దూకి చనిపోయారట.

    రిప్లయితొలగించండి
  14. సంతత సంతోష నిమ
    గ్నాంతఃకరణ లచటఁ గల కాంతా మణులే
    సంతాన విహీన లయిన
    కాంతలు గనరారు రాయగడ నగరమునన్


    నామమె తెల్పు చున్నది ఘనమ్ముగ గొప్ప తనమ్ము నోర్మినిన్
    భూమి సమాన లెల్లరును బుణ్య చరిత్రలు సుందరాంగు లే
    ధామము నందుఁ గాంచినను దాన మొసంగని యట్టి వార లే
    భామలు లేరు రాయగడ పట్టణ మందు నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  15. వింతగు మాటల తోడను
    చింతనుపెంచుచుజనులకుచిక్కులనిడుచున్
    పంతముతోడచరించెడు
    *“కాంతలు గనరారు రాయగడ నగరమునన్”*


    నీమము తప్పకుండకడునిష్టగ భాగవతాది గ్రంథముల్
    ధీమతి తోడ వ్రాయుచును తీరుగ చక్కని కావ్య శైలిలో
    సామముతోడవీడకయె సాధన చేసెడివారె, వ్యర్థులౌ
    *భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో”*

    రిప్లయితొలగించండి