16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2145 (తల్లీ యని పిలుచునంట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తల్లీ యని పిలుచునంట తండ్రిని సుతుడే."
లేదా...
"తల్లీ యంచు సుతుండు పిల్చె నదిగో తండ్రిన్ ముదం బొప్పఁగన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

113 కామెంట్‌లు:

  1. నిన్నటి సమస్యకు నా పూరణ

    వీరావేశము నందు తల్లి పలికెన్ పెద్దాడినే తిట్టుచున్
    రారా! మూర్ఖుడ బీరులో రుచికి నా రక్తమ్మునే కల్పితిన్
    చేరన్ బిల్వుము నీదు సన్నిహితులన్ సీసాల ద్రావన్ననన్
    బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుం డయెన్ జూడుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెద్దాడు' అనడం వ్యావహారికం. 'వేరీతులన్ పుత్రునిన్' అందామా?

      తొలగించండి
  2. కం. ఇల్లాలిని తనలోనే
    యల్లన నెడమన నిలిపిన ఆ శివుని దరిన్
    మెల్లగ జేరియు బొరబడి
    తల్లీ యని పిలుచునంట తండ్రిని సుతుడే.

    రిప్లయితొలగించండి
  3. శా. ఇల్లాలిన్ దన మేనునందె నిలిపెన్నీశుండు బ్రేమార్ద్రతన్
    పిల్లల్ మూషక వాహనుండు మరియున్ బేర్గన్న యాగ్నేయుడున్
    తల్లిందండ్రిని పోల్చలేక సతతం తప్పుల్ ఘటించేరుగా
    తల్లీయంచు సుతుండు పిల్చె నదిగో తండ్రిన్ ముదంబొప్పగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సతతం, ఘటించేరు అన్నవి వ్యావహారికాలు. 'సతముం దప్పులు ఘటింపగ నో। తల్లీ...' అనండి.

      తొలగించండి
    2. శ్రీ కంది శంకరయ్య గారికి ,
      సవరించి నందులకు మరీ మరీ ధన్యవాదాలు. నిజానికి మీ సవరణకై ఎదుదు చూపుతోనే దాన్ని ప్రచురించాను.సతతం అన్నది వ్యావహారికమని ఓకవైపు నాకని పిస్తూనే యుండినది.
      ' సతముం దప్పులు ఘటింపగ నో' అని సవరించారు.గణ భంగ మౌతుంది కదా! "సతముం దప్పుల్ఘటింఫంగ నో " అని అనవలసి యుంటుంది. ఇది సరియేనా ? తెలుప గలరు. మరొక్క మారు ధన్య వాదాలతో.- జనార్దన రావు.

      తొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వల్లను గూడుచు పురవున
    అల్లగ నటనావధాన మాడెడి దండ్రిన్
    వెల్లిగొని వీక్షసేయుచు
    తల్లీయని పిలుచు నంట తండ్రిని సుతుడే.

    (వల్ల = నేర్పు; పురవు = సామర్థ్యము; అల్ల = తల్లి ; వెల్లిగొను = అతిశయించి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అల్ల అన్న పదానికి తల్లి అన్న అర్థం లేనట్టుంది.

      తొలగించండి
    2. గురువుగారూ! నమస్కారములు. ' అల్ల ' అన్న పదానికి ' తల్లి ' అనే అర్ధం ఆచార్య జి. ఎన్. రెడ్డిగారి " తెలుగు పర్యాయపద నిఘంటువులో " ఉంది.

      తొలగించండి


  5. కల్లా కపటము నెరుగడు
    తల్లీ యని పిలుచునంట ,తండ్రిని సుతుడే
    చల్లంగా జూచును మన
    పిల్లకు సరియై నమగడు, పెళ్లియు మేలౌ

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కల్లయు...చల్లంగను..' అనండి.

      తొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తల్లింబోలెడి రూపుతో నటనమందాఖ్యమ్ము జూపించగా
    యుల్లంబుల్ పొలుబొందు జందమున యోహోయంచు సర్వుల్ నటన్
    బల్లల్ మోదుచునుండ దండ్రి గరిమన్ భావమ్ముతో జూచుచున్
    తల్లీయంచు సుతుండు పిల్చె నదిగో తండ్రిన్ ముదంబొప్పగన్.

    (ఆఖ్యము = నేర్పు; భావము = ప్రేమ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...జూపించగా। నుల్లంబుల్... జందమున నోహో యంచు నా ప్రేక్షకుల్...' అనండి. (సర్వుల్+అటన్.. సర్వుల్ నటన్ ఎలా అయింది?)

      తొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువుగారూ! నమస్కారములు. నిన్నటి సమస్యాపూరణను తమరి సూచన ప్రకారం కొద్దిగా మార్పు చేసి వ్రాసాను. పరిశీలించగలరు.

    తీరుని గాని విధంబున
    వారుణి బీల్చి రుజనొంద వైద్యులురుముచున్
    సారాయము గొనునుసురన
    బీరుని గని త్రాగుబోతు భీతిం జెందెన్.

    (వారుణి బీల్చి = మద్యముగ్రోలి )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      సవరించినందుకు సంతోషం.
      'తీరుం గాని/తీరును గాని...' అనండి. వారుణిని పోల్చడ మెందుకు? వారుణి గ్రోలి/త్రాగి..' అనవచ్చు కదా!

      తొలగించండి
  8. ముల్లోకంబుల నేలుచుందువు గదా! మోదంబులం గూర్చుచుం
    కల్లోలంబుల ద్రుంచు దానవగుచుం గైవల్యసంధాయినీ!
    తల్లీ! యంచు, సుతుండు బిల్చె నదిగో తండ్రిన్ ముదం బొప్పగన్
    ఫుల్లాబ్జానన బార్వతిం గొలువగా పుణ్యాత్ము డవ్వేళలోన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  9. ఎల్లప్పుడు నాటకముల
    నుల్లంబులు మోదమంద నువిదల పాత్రల్
    పెల్లుగ జేసెడి వానిని
    తల్లీయని పిలుచునంట తండ్రిని సుతుడే.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మెల్లిగ' గ్రామ్యం. 'మెల్లగ' అనండి.

      తొలగించండి
    2. అల్లరి సేయుచు దిరిగెడు
      పిల్లడు 'మాతలి' జనకుని పేరున పిలువన్
      మెల్లగ దానిటుల 'పయిడి
      తల్లీ' యనిపిలుచునంట తండ్రిని సుతుడే
      మాతలి, పయిడితల్లి, పురుషుల పేర్లు

      తొలగించండి
  11. మల్లీ!వింటివె దొరకొక
    బుల్లీ బుజ్జాయి పుట్టి బొరపెము మీరన్
    చెల్లునె యందరి యెడ నిది
    తల్లీ యని పిలుచునంట తండ్రిని సుతుడే!
    "బొరిపెంగల్ల పిల్ల బోర్లబడంగ ముద్దు"అనే ‌సామెత పల్లె పట్టుది. బొరిపెము శ.ర.నఘంటువులోలేదు.
    P.Satyanarayana
    చెల్లున్ నామము లెన్నొ గౌరవముగా చేయన్ మగన్నాడ గా
    పల్లెన్ "కిష్టయ"గాడె"కిష్టమ"గ నా పాడిన్ గనెన్ బాలుడే
    కల్లల్ గానడు గాదె యమ్మ యనగా కాదేమి దోషంబు నో
    తల్లీ యంచు సుతుండు పిల్చెనదిగో తండ్రిన్ ముదంబొప్పగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'బొరిపెము' మాండలిక పదకోశంలోను లేదు. అది బహుశా మురిపెం గల పిల్ల.. అయి ఉంటుంది. గ్రామీణుల నోట బొరిపెం కావచ్చు.

      తొలగించండి
  12. అల్లరి మీరిన బాలుడు
    తల్లీ యని పిలుచునంట తండ్రిని! సుతుడే
    తల్లిని పేర్కొనె పిత యని!
    గొల్లున నవ్వుకొనిరి తమ కొమరుని గనుచున్!

    రిప్లయితొలగించండి
  13. ‌సుప్రసన్నకు పద్యము సున్న నాయె
    సత్యములు శంకరప్పలు సరకు గొనిరి
    భువన విజయ వచనముకున్ బువ్వ దొరికె
    (ఇటీవల ధ్వానా పురస్కారం "వీరాచారి"కి యిచ్చారు.)
    పద్య విద్యకు నూకలు బరగె!చాలు!!!!!!!
    P.Satyanarayana

    రిప్లయితొలగించండి
  14. బల్లిదమగు విధి వశమున
    తల్లిని గోల్పోవ తండ్రి తానే తల్లై
    యల్లన సాకగ నాతని
    తల్లీ యని పిలుచునంట తండ్రిని సుతుడే!

    రిప్లయితొలగించండి
  15. ఎల్లరుసంతోషింపగ
    తల్లీపిలుచునంట తండ్రిని సుతుడే
    అల్లన నాటకమందున
    తల్లిగ నటియించి మిగుల ధన్యతనందన్.

    రిప్లయితొలగించండి
  16. కీర్తి శేషులు స్థానం నరసింహారావు గారికి జోహారులు. స్త్రీపాత్రధారిగా జీవించి,మరణించినను ప్రజల నాల్కలపై నిరంతరము నాట్యమాడుచు మనసులలో సుస్థిర స్థానం పొందిన స్థానం వారి మనోహర నటనాపటిమకొక ఉదాహరణ. ఆనాడు తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా బాపట్ల లో ఒక శ్రావణ శుక్రవార పేరంటపు పిలుపునకు తన అర్థాంగి పట్టుచీర కట్టుకొని తానే స్వయముగా పిలిచినట్లు పెద్దలు చెబుతారు. ఈ సంఘటనకు భార్యే ఆశ్చర్యపడిందట. "నేను కట్టినట్లుగా ఎవరైన (ఆడవారైనా, మగవారైనా)చీర కట్టగలిగితే రు.116/-పందెమని సవాలు విసిరారట...వారి జ్ఞాపకముగా ఈ పద్యం.

    మల్లెల్మొల్లలు కొప్పునందు విరియన్మామాన్యంపు సౌశీలినాన్
    జెల్లుందానటు బేరటంబు బిలువన్ సిగ్గెందుకంచున్వడిన్
    సల్లాలిత్యపు మాతృరూపియగు నా "స్థానంపు వంశోద్భవుం"
    దల్లీ!యంచు సుతుండు బిల్చె నదిగో తండ్రిన్ ముదంబొప్పగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి వారూ,
      స్థానం వారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
      ఆ ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      విరియన్మాన్యంపు - విరియన్మామాన్యంపు అని టైపాటు...

      తొలగించండి
    2. అవునండి. అది టైపు పొరబాటే. మరికొంత జాగ్రత్త వహిస్తాను. మీ ప్రశంసకు ధన్యవాదములు.

      తొలగించండి
  17. కందం రెండవ పాదంలో సవరణ...తల్లీయని పిలుచునంట...

    రిప్లయితొలగించండి
  18. చెల్లిని తననూ వీడెను
    అల్లరి పాలాయె బాల్య మమ్మేలేకన్!
    పిల్లల బెంచగ బ్రేమతొ
    తల్లీయని పిలుచునంట తండ్రిని సుతుడే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      తననూ అనడం వ్యావహారికం. వీడెను+అమ్మయె అన్నపుడు సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాశారు. అమ్మ+ఏ అన్నపుడు యడాగమం వస్తుంది. ప్రేమతొ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. నా సవరణ...
      చెల్లెలిని తనను వీడగ
      నల్లరి పాలాయె బాల్య మమ్మయె లేకన్
      పిల్లల బెంచగ ప్రేమను
      తల్లీ యని....

      తొలగించండి
  19. శ్రీ కంది శంకరయ్య గారికి ,
    సవరించి నందులకు మరీ మరీ ధన్యవాదాలు. నిజానికి మీ సవరణకై ఎదుదు చూపుతోనే దాన్ని ప్రచురించాను.సతతం అన్నది వ్యావహారికమని ఓకవైపు నాకని పిస్తూనే యుండినది.
    ' సతముం దప్పులు ఘటింపగ నో' అని సవరించారు.గణ భంగ మౌతుంది కదా! "సతముం దప్పుల్ఘటింఫంగ నో " అని అనవలసి యుంటుంది. ఇది సరియేనా ? తెలుప గలరు. మరొక్క మారు ధన్య వాదాలతో.- జనార్దన రావు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే.. నేను తప్పుల్ అనే టైప్ చేయాలనుకున్నాను. కాని లు అని టైపయిన విషయాన్ని గమనించలేదు. ధన్యవాదాలు.

      తొలగించండి
  20. తల్లికి నుద్యోగమ్మని
    యిల్లంతయు చక్కదిద్ది యీడేర్చంగన్
    కల్లా కపటమెరుంగక
    తల్లీ! యని పిలుచునంట తండ్రిని సుతుడే!

    రిప్లయితొలగించండి
  21. తల్లి తన చిన్న తనమున

    నిల్లోకము వీడిపోగ నెంతో ప్రేమను

    యెల్లయు తానై పెంచగ

    తల్లి యని పిలుచునంట తండ్రిని సుతుడే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...నెంతో ప్రేమ। న్నెలయు తానై...' అనండి.

      తొలగించండి
    2. శంకరయ్య గారూ! ధన్యవాదాలు.
      టైపాటు వల్ల..ప్రేమను..అని, తల్లి..అని
      పడినది.మీ సవరణ ప్రసారం మరల
      పంపిస్తున్నాను.

      తల్లి తన చిన్న తనమున

      నిల్లోకము వీడిపోగ నెంతో ప్రేమ

      న్నెల్లయు తానై పెంచగ

      తల్లీ యని పిలుచునంట తండ్రిని సుతుడే.

      తొలగించండి
  22. ఆచార్య G.N.రెడ్డి గారి " పర్యాయ పద నిఘంటువు"లో తల్లికి పర్యాయ పదాలు:
    తల్లి,అంబ,అప్ప,అల్ల,జనని,జనయిత్రి,తాయి,ధాత్రి,ప్రజనిక,ప్రసత్వరి,ప్రసవిత్ర,ప్రసువు,ప్రసూతి,మాత,మాతృక,శుశ్రువు,సవిత్రి, సుతిని,సూషణ,సృత్వరి.
    అయితే వీటిలో చాలా పదాలు సామాన్యల వ్యవహారంలో కానీ, పండితుల వ్యవహారంలో కాని కానరావు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వావిళ్ళ నిఘంటువు ఆకారాంత స్త్రీలింగ సంస్కృత పదంగా పేర్కొని తల్లి అనే అర్థాన్నిచ్చింది.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. అవునండి. సంస్కృత నిఘంటువులోనూ చూచితిని. "అల్లా" అంటే జనని యని.

      తొలగించండి
  23. ఆల్లాహ్ తండ్రి యటంచు ముస్లిములు తా మర్చింప, నీసాయులున్
    పిల్లండీతడు దివ్యుడ౦చు గొలువన్ విశ్వాత్మునిన్,హిందువుల్
    తల్లీ,తండ్రియు,దైవమున్,గురుడు,సత్యమ్మంచు పూజించగన్
    తల్లీ యంచు సుతుండు పిల్చె నదిగో తండ్రిన్ ముదం బొప్పగన్

    రిప్లయితొలగించండి
  24. అల్లన గని తా మందుల
    నొల్లవు మారాము లేల నుచితమె నీకుం,
    దల్లడిలకు నిన్నేమనఁ
    దల్లీ! యని, పిలుచునంట తండ్రిని సుతుడే.


    పెద్ద చదువులకు దేశాంతరము వెళ్ళ గోరు తనయుని పల్కులు:


    మేలౌ నమ్మ సమగ్ర విద్యల నిలన్ మే ముందు మైక్యమ్ముగన్
    సల్లాపమ్ములు సేయ వచ్చును గదా చక్కంగ నిత్యమ్మునుం
    గల్లల్ పల్కుట లేదు నమ్ము నను శోకంబేల పంపింపవే
    తల్లీ! యంచు సుతుండు పిల్చె నదిగో తండ్రిన్ ముదం బొప్పఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్కృష్టంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  25. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    { బ ట్ట లు ఉ తు కు తూ -- చా క లి వా ని

    కొ డు కు త న త ౦ డ్రి తో = }

    …………………………………………………


    నీల్లన్ బి౦డితి , చాకి బ౦డ పయి నె౦తే

    …………… మోదితిన్ , గాని , యీ

    సెల్లా తెల్లగ కాక యు౦డె | యెటులో ా

    …………… ' చెప్పయ్య ' నీవైన | " దీ న్

    తల్లీ " య౦చు సుతు౦డు పిల్చె నదిగో

    …………… త౦డ్రిన్ | ముద౦బొప్పగా

    చల్లెన్ చాకలి యేరియల్ పొడి |

    …… నిమేష౦బ౦దు శుభ్ర౦ బయెన్ ! !

    { సెల్లా = తెల్లని వస్త్రము , టవలు ;

    ి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      ఏమని చెప్పను? మీ పూరణ చదివి నవ్వు ఆపుకోలేక పోయాను. హాస్య రసస్ఫోరకంగా మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. దీన్ తల్లీ.. అనడం గ్రామ్యమైనా పాత్రోచితం కనుక దోషంగా పరిగణించడం లేదు.

      తొలగించండి
  26. సమస్యాపూరణం

    తల్లియు దండ్రియు దానై
    అల్లారుముద్దుగతనయు నాప్యాయముతో
    చల్లగ పెంచగ ముద్దుగ
    తల్లీయని పిలుచునంట తండ్రిని సుతుడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో రెండవ గణం (రుముద్దు) జగణం అయింది. "అల్లారున్ ముద్దుగ సుతు నాప్యాయతతో" అందామా?

      తొలగించండి
  27. అల్లదె యొకనాటకమున
    దల్లిగదావే షమేయు తండ్రిని పిలువ
    న్న ల్లరి పిల్లడు పలికెను
    తల్లీ యని పిలుచు నంట తండ్రిని సుతుడే

    రిప్లయితొలగించండి
  28. అల్ల జగన్మోహినితో
    తల్లజుడౌ శివుడుఁ గూడుతరి పుట్టినవా
    డుల్లసిలన్నయ్యప్పయె
    తల్లీయని పిలుచునంట, తండ్రిని సుతుడే ||


    ముల్లోకంబులనేలుచున్న హరి, యున్మూలింప భస్మాసురున్
    తల్లీలన్ గని మోహితుండు శివుడున్ తాకెన్ జగన్మోహినిన్
    అల్లార్ముద్దగు బాలకుండునుదయించయ్యప్పయంచాతడే
    తల్లీయంచు సుతుండు పిల్చెనదిగో తండ్రిన్ ముదంబొప్పఁగన్ ||

    శివుని నుండి వరాన్ని పొందిన భస్మాసురుడు దానిని పరీక్షించడానికి శివుడినే ఎంచుకొంటాడు. అప్పుడు విష్ణువు మరల జగన్మోహినిగా అవతరించి భస్మాసురుని సంహరిస్తాడు. శివుడు జగన్మోహినిని చూసి మోహిస్తాడు. శివకేశవులకిరువురికీ అయ్యప్ప జన్మిస్తాడు అని స్కాందపురాణాంతర్గతము.

    రిప్లయితొలగించండి
  29. రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      అయ్యప్ప జన్మ వృత్తాంతంతో మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  30. తల్లియె దూరంబవ్వగ
    తల్లడపడు పిల్లగాడు దండ్రిని గనుచున్
    న్నల్ల పసితనము నుండియు
    తల్లీ !యనిపిలుచునంట తండ్రిని సుతుడే!!!

    రిప్లయితొలగించండి
  31. మల్లుడగు పైడితల్లికి
    పిల్లలు లేక పసిబాలు బెంచుకొనంగ
    న్నల్లరి యాబాలుడెపుడు
    తల్లీ యని పిలుచునంట తండ్రిని సుతుడే

    రిప్లయితొలగించండి
  32. చెల్లని పనులెదురైనచొ?
    తల్లీయని పిలుచునంట|”తండ్రిని సుతుడే
    కల్లాకపటము మాన్పగ
    పల్లవిగల పాటపాడి భావన దెలిపెన్”.
    2.సల్లాపంబులు సాగకన్ మదికి విశ్వాసంబులోపించగా?
    తల్లీయంచు సుతుండు పిల్చె|”నదిగో తండ్రిన్ ముదంబొప్పగన్
    చెల్లంగన్ తనపంతమందచట సచ్చీలంబు తోడవ్వగన్
    ఉల్లాసంబుకు నుత్సవంబగును|సత్వోద్రేక సమ్మోహియై|.


    రిప్లయితొలగించండి
  33. ఉల్లాసమ్మున నాటలాడు తనయున్నుత్సాహమే గల్గగన్
    ముల్లోకమ్ముల నేలు వాడు శివుడే ముద్దాడె నావేళలో
    వల్లీనాథుడు గాంచెనీశ్వరునిలో భాగమ్ముయౌ పార్వతిన్
    తల్లీయంచు సుతుండు పిల్చెనదిగో తండ్రిన్ ముదంబొప్పగన్

    రిప్లయితొలగించండి
  34. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గు రు వు గా రి కి ప ద న మ స్కా ర ములు .

    నా ప ద్యా ల ను ప్ర శ ౦ సి ౦ చు చు న్న

    మీ కు అ నే క ధ న్య వా ద ము లు .

    న మ స్తే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు వయస్సులో నాకంటె పెద్దలు.. అలా అనకూడదు.. నాకు మీ ఆశీస్సులు కావాలి.

      తొలగించండి
  35. పిల్లడు పుట్టిన తోడనె
    చెల్లెను కాలమ్ముతల్లి చేరెను కాలు
    న్నల్లన పెంచిన నాన్నను
    తల్లీ! యని పిలుచునంట తండ్రిని సుతుడే!

    రిప్లయితొలగించండి
  36. రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తల్లి+ఔనో' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. తల్లేయందునొ తండ్రిదానగునొ, సత్యంబింకనేమౌనొకో
      పుల్లింగంబునొ తద్విరుద్ధమునొ దాఁపుంస్త్రీయునుంగాదొ చి
      ద్వల్లీసంయుతమైనదానిఁ యెదనేదల్పంగ నిట్లేయగున్
      తల్లీ యంచు సుతుండు పిల్చె నదిగో తండ్రిన్ ముదం బొప్పఁగన్"
      యడాగమముతో సవరించినాను.పరిశీలించ ప్రార్థన

      తొలగించండి
  37. ఉల్లాసంబున బాలుడమ్మను గనన్, ఓ నా పితా రమ్మనెన్
    తల్లీ యంచు సుతుండు పిల్చెనదిగో తండ్రిన్ ముదంబొప్పగ
    న్నుల్లంబుల్ కడు సంతసించుచు సదా యుప్పొంగు చుండన్, భళా!
    ముల్లోకంబుల గాంచినన్ దొరకునా మూలంబులీ ప్రేమకున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీదర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత్ అన్వయదోషం ఉన్నట్టుంది.

      తొలగించండి
  38. కవిమిత్రులందరూ ఎంతో సుందరంగా పూరించారు. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  39. అల్లీఖానుకు పుత్రు డొక్కడగుటన్ హర్షాతిరేకంబుతో
    నల్లా! త్వత్కృప జూపుమా యనుచు మాటాడంగ నేర్పించినన్
    సల్లాపంబుల నొక్కనాడు వినరే చాపల్యభావంబు చే
    తల్లీ! యంచు, సుతుండు బిల్చె నదిగో తండ్రిన్ ముదం బొప్పగన్
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  40. సీతా దేవితో వాల్మీకి ఆశ్రమమున ఒక ఆశ్రమవాసి.

    పిల్లలు లవకుశులచ్చట
    నొల్లక నశ్వమ్మునీయ నుద్ధతితోడన్
    అల్లనరాముడు రాగా
    తల్లీ! యని పిలుచునంట తండ్రిని సుతుడే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...నొల్లక యశ్వమ్ము' అనండి.

      తొలగించండి
    2. మాస్టరుగారూ! ధన్యవాదములు. సవరణతో...

      పిల్లలు లవకుశులచ్చట
      నొల్లక యశ్వమ్మునీయ నుద్ధతితోడన్
      అల్లనరాముడు రాగా
      తల్లీ! యని పిలుచునంట తండ్రిని సుతుడే.

      అని = యుద్ధము.

      తొలగించండి
  41. ఎల్ల పరాంగనలన్ సుధి
    తల్లీ యని పిలుచునంట, తండ్రిని సుతుఁడే
    యుల్లంబున దైవముగా
    నెల్లప్పుడు నిలుపుకొనిన హితముం బొందున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఆణిముత్యము లాంటి పద్యమండి.చాలా బాగుంది. "ఎల్లఁ బరాంగనలన్" అనవచ్చుననుకుంటాను.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు.
      నిజమే... గుండు వారు కూడా ఇంతకుముందే ఫోన్ ద్వారా ఇదే విషయాన్ని సూచించారు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
    4. విరుపు చాలా బాగుంది. చక్కని పద్యం.

      తొలగించండి
  42. మిత్రులందఱకు నమస్సులు!

    "ఉల్లాసము మా కిడుచును
    నుల్లమునను బాధలెన్ని యున్నను నెపుడున్
    దల్లడ మందని ధీర మ

    తల్లీ!" యని పిలుచునంట తండ్రిని సుతుఁడే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      శ్రేష్ఠార్థవాచకమైన 'మతల్లి'తో మీ పూరణ వైవిధ్యంగా మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  43. పిల్లలు వినగోర " పయిడి
    తల్లీ" యని పిలుచు నంట తండ్రిని సుతుడే
    యల్లరి పిడుగులు నవ్వగ
    గొల్లడు తన తండ్రి పేరు గొంతెత్తి పురిన్

    రిప్లయితొలగించండి
  44. పల్లెల్ పట్టణముల్ పురాలు నగరీ ప్రాంతమ్ములున్ సర్వమున్
    కాళ్లన్ చక్రము లాడ తండ్రి కొరకై గాలించితిన్ నేటికిన్
    మళ్ళీ వారిని గంటి నీదు కృపచే మాతా భవానీ చల్లనౌ
    తల్లీ! యంచు సుతుండు పిల్చెనదిగో తండ్రిన్ ముదంబొప్పగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మళ్ళీ' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'మాతా' అన్నాక మళ్ళీ 'తల్లీ' అనడం పునరుక్తి కదా! 'చల్లనౌ' అన్నచోట గణభంగం. 'నీదు కృపచే మమ్మేలవే చల్లనౌ" అందామా?

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారూ.దోషములకు క్షంంతవ్యుడను.

      తొలగించండి
  45. చల్లగ చనుపాలు గొనుచు
    మెల్లగ నొక్కుచును భోగి మోదముతోడ
    న్నుల్లమున తలచి కుచమని,
    తల్లీ యని పిలుచునంట తండ్రిని సుతుదే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  46. ఉల్లాసమ్ముగ పాలఁద్రాగుచు సదా నుల్లమ్మునన్ తల్చుచున్
    తల్లిన్ మోదముతో గజాననుడు కాద్రవేయునిన్ నొక్కుచున్
    చల్లంగా కుచమంచుఁదాను గడు నుత్సారించు చున్ కేళిగా
    తల్లీ యంచు సుతుండు పిల్చెనదిగో తండ్రిన్ ముదంబొప్పగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సదా యుల్లమ్మునన్ దల్చుచున్..' అనండి. 'కాద్రవేయునిన్' అన్నచోట గణదోషం. 'గజాననుడు దృక్కర్ణంబునున్ నొక్కుచున్' అనండి (దృక్కర్ణము = పాము). అలాగే చల్లంగన్.. అనండి.

      అల్లసాని పెద్దన మనుచరిత్రలో చేసిన గణేశ ప్రార్థన పద్యం ఇది.....
      అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా
      ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్గబళింపఁబోయి యా
      వంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి వే మృణా
      ళాంకుర శంకనంటెడి గజాస్యునిఁగొల్తు నభీష్టసిద్ధికిన్.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. తమరి సవరణలో రెండవ పాదం లో యతి గురించి తెలియజేయ ప్రార్థన.

      తొలగించండి
    3. నిజమే! నేను యతిని గమనించలేదు. మన్నించండి.

      తొలగించండి
  47. రెండవ పాదం సవరించాను.పరిశీలించ ప్రార్థన.
    ఉల్లాసమ్ముగ పాలఁద్రాగుచు సదా యుల్లమ్మునన్ దల్చుచున్
    తల్లిన్ కన్గొనుచున్ గజాననుడు హస్తమ్మున్ సువాలించుచున్
    చల్లంగన్ కుచమంచుఁదాను గడు నుత్సారించు చున్ కేళిగా
    తల్లీ యంచు సుతుండు పిల్చెనదిగో తండ్రిన్ ముదంబొప్పగన్

    రిప్లయితొలగించండి
  48. అన్నపరెడ్డి వారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  49. బ్రహ్మ మానస పుత్రుడు:👇

    ఉల్లంబందున నిల్చి పద్యములనన్నూరించి
    పల్కించవే
    తల్లీ యంచు సుతుండు పిల్చె నదిగో!;...తండ్రిన్ ముదం బొప్పఁగన్
    సల్లాపంబులు మాని సృష్టి నికనీవ్ చాలించి శాంతించవోయ్
    కల్లా కప్టములేని నీరవునినీవ్ కాపాడు మయ్యాయనెన్!

    రిప్లయితొలగించండి