22, సెప్టెంబర్ 2016, గురువారం

సమస్య - 2151 (ధవుని పదమ్ములను గొలిచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యతఁ గాంచె నతండు వింటిరే"లేదా...
"ధవుని పదమ్ములను గొలిచి ధన్యతఁ గాంచెన్"

100 కామెంట్‌లు:

 1. ఉ.రవికుల తేజునిన్ ధరణి రావణు గూల్చిన దండపాణినిన్
  అవనిజ సీత మాత మనమందు వసించెడు నిత్యవాసినిన్
  కవికుల స్ఫూర్తి దాతయును కారణ జన్ముడు రామునిన్ రమా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకరయ్య గారూ !
   సవరణలకు ధన్యవాదాలు.మీ సూచనల మేరకు సవరించి మరల పోస్ట్ చేస్తున్నాను.
   ఉ.రవికుల తేజునిన్ ధరణి రావణు గూల్చిన శక్తిశాలినిన్
   అవనిజ యైన సీత మనమందు రహించెడు నిత్యవాసినిన్
   కవులకు స్ఫూర్తి దాతయును కారణ జన్ముడు రామునిన్ రమా
   ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే?

   తొలగించండి
  2. జనార్దన రావు గారూ,
   సవరించినందుకు సంతోషం!

   తొలగించండి
 2. కం.భువిలో దైవము మగడను
  పవిత్ర భావము మనమున పరచుకొనంగన్
  అవిరతముగ నొక సతియే
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'కోదండపాణి' అనాలి. 'దండపాణి' అంటే చేతిలో దుడ్డుకఱ్ఱ కలవాడు అన్న అర్థం వస్తుంది. 'మేటి ధన్వికిన్' అనండి. 'వసించెడు, నిత్యవాసి' అన్నచోట పునరుక్తి. 'అవనిజయైన సీత మనమందు రహించెడి నిత్యవాసికిన్' అనండి. 'కవికుల స్ఫూర్తి' అన్నపుడు ల గురువై గణదోషం. 'కవులకు స్ఫూర్తిదాతయును' అనండి.

   తొలగించండి


 3. కవితా వనంబుల తిరిగె
  ద, విశాలంబైన పంచదశ లోకమునన్
  భవము గనెదననుచును మా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యతఁ గాంచెన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. క్రొవ్విడి వెంకట రాజారావు:

  హవణికమగు హరి లీలలు
  బొవడుచు పాటల భజనల బూజల దోడన్
  సవురున మీరా నా మా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'హవణిక యగు' అనండి.

   తొలగించండి
 5. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ధృవుడు జనార్దనుండు తెలిదేవిదొరౌ మురారియే
  సవురునుగూర్చు దేవరని నమ్మి ప్రశస్తమునౌ విరాళినిన్
  బొవడుచు నొక్కడింటను నిరంతర బూజలు సల్పుజుండి మా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   తెలిదేవి...? దొర+ఔ, దేవర+అని అన్నపుడు యడాగమం వస్తుంది. 'సల్పుచుండి' అనండి.

   తొలగించండి
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గురువుగారు నమస్కారములు. నిన్నటి పూరణ పద్యాన్ని మరొక్కసారి పరికించండి.

  దుడ్డుల్దేవత లక్ష్మికిన్ పతియునై తుంగమ్ము పైనుండి దా
  దొడ్డేయౌ తిరువేంకటేశ్వరుడు పొందున్ గూడి ధాత్రేలుచున్
  వడ్డీకాసుల వాడటంచు ననురూపానన్ విభాసిల్లు నా
  వడ్డీ కట్టగ డబ్బులేని యతడే వర్షించు నైశ్వర్యమున్.

  (నిన్న 'మౌలేలుచున్' అని రెండవ పాదం చివరి పదం వ్రాసాను. ఈరోజు దానిని ' ధాత్రేలుచున్ ' అని మార్చాను. మౌలి అనగా భూమి అనే అర్ధం.
  రెండవ పాదం మొదట్లో ' దొడ్డేయౌనగు' అని వ్రాసినదానిని ' దొడ్డేయౌతిరు ' అని మార్చాను. మీ సూచనలను పాటించాను. )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరణలు చేసినందుకు సంతోషం.
   'మౌలి+ఏలు, ధాత్రి+ఏలు' అన్నపుడు సంధి లేదు. మౌలి నేలు, ధాత్రి నేలు... అవుతుంది.

   తొలగించండి
 7. గురువు గారికి నమస్కారములు. నిన్నటి సవరించిన పద్యాన్ని చూడ గోరుతాను.
  ఇది కాకపోతే మొదటి పాదంలో 'నిదియే ' బదులు 'గదురా ' అని అనవచ్చా? దయచేసి తెలుప గోరుతాను. ధన్యవాదములు.
  విడ్డూరంబుగ దోచుచుండు నిదియే బెండ్లాడ బూనంగ తా
  వడ్డీ తోడుత దీర్చు మాడ్కి ధనమున్ పౌలస్త్యు చెంతన్ గొనన్
  వడ్డీ కాసుల వేంకటేశుడనగన్ ప్రఖ్యాతి నార్జించియున్
  వడ్డీ కట్టగ డబ్బు లేని యతడే వర్షించు నైశ్వర్యముల్!

  రిప్లయితొలగించండి
 8. భవ హర శంకరా బహుళ భాగ్యవిధాయక నీలకంఠ నా
  స్తవమును స్వీకరించుమని తన్మయు డౌచు మృకండుజుండు తా
  నవిరళభక్తిభావయుతుడౌచును గొంకక నిత్యమాయుమా
  ధవుని పదమ్ములం గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి

 9. శివుని పదమ్ములన్ గొలిచి చింతయు వీడె నొకండు, గంటిరే
  భవుని పదమ్ములన్ గొలిచి భవ్యము వేరొ కరుండు గాంచెరో
  కవి కవనమ్ములన్ సురభి గాంచుచు తా సకలంబు గాంచి,మా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు, వింటిరే !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. జవరాలు మంజుభాషిణి
  యవనతయై దీక్షబూని యనవరతంబున్
  భువి నాదైవం బితడని
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్

  రిప్లయితొలగించండి
 11. కం.అవలీలగ జగమందున
  భవబంధమ్ముల హరించి భక్తుల బ్రోచే
  శివునిన్, పరాత్పరును మా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచెన్.
  పరాత్పరున్ +ఉమా ధవుని.
  కం.అవలీలగ జగమందున
  భవబంధమ్ముల హరించి భక్తుల బ్రోచే
  శివునిన్, భక్తుడొకడు మా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచెన్.
  భక్తుడొకడు +ఉమాధవుని.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'బ్రోచే' అనడం వ్యావహారికం. 'భక్తావనుడౌ। శివునిన్...' అనండి.

   తొలగించండి
 12. ధృవుడనుబాలుడే భువిని తిట్టగ తల్లియె పట్టునన్ రమా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు, వింటిరే!
  భువిని మృకండుసూనుడు యముండను గెల్చెను బాలుడై యుమా
  ధవుని పదమ్ములన్ గొలిచి, ధన్యత గాంచె నతండు వింటిరే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'యముండను గెల్చెను' అన్న ప్రయోగం సరిగా లేదు. 'యముం గెలిచెం గద బాలుదై...' అనండి.

   తొలగించండి
  2. మాస్టరుగారూ! ధన్యవాదములు. మీరు చూపిన సవరణతో...

   ధృవుడనుబాలుడే భువిని తిట్టగ తల్లియె పట్టునన్ రమా
   ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు, వింటిరే!
   భువిని మృకండుసూనుడు యముంగెలిచెంగద బాలుడై యుమా
   ధవుని పదమ్ములన్ గొలిచి, ధన్యత గాంచె నతండు వింటిరే!

   తొలగించండి
 13. నవనీతచిత్త శోభితు
  డవలీలగ భక్తుల కిట నార్తిని బాపన్
  భవ బంధము ద్రుంచెడి మా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత నొందెన్!

  రిప్లయితొలగించండి
 14. లవకుశ లిరువురు నొకపరి
  యవనాశ్వము బట్ట తుదిని యదుకుల ప్రభువా
  కవలల దీవించగ ,మా
  ధవుని పదమ్ములనుగొలిచి ధన్యత గాంచెన్

  రిప్లయితొలగించండి
 15. స్తవమొనరింప జాలని గజమ్మును,పామును,సాలెపుర్వుయున్
  శివునికి,పూలు,రత్నములు,చిక్కని నేతల మందిరమ్మిడ
  న్నవిరళ భక్తి,'బోయ 'తన యంబక యుగ్మము నిచ్చె నా యుమా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే

  రిప్లయితొలగించండి
 16. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  గు రు వు గా రి కి మ రి యు క వి మి త్రు
  ల కు న మ స్కా ర ము లు !

  పూ ర్వ క వు లు ర చి ౦ చి న ప ద్య
  కా వ్య ము ల పు స్త క ములు హై ద రా

  బా దు లో ఎ చ ట ల భ్య మ గు నో

  అ డ్ర సు తె లు ప గ ల ర ని ప్రా ర్థ న

  ద య చే సి తె లి య జే య ౦ డి

  రిప్లయితొలగించండి
 17. టాగూర్ పబ్లిషింగ్ హౌస్,
  ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్,
  షాప్ నెం.20,వైశ్యా హాస్టల్ బిల్డింగ్,
  కాచిగూడా చౌరస్తా,హైదరాబాదు,
  ఫోన్ : 27568329, 55368330 (పాతవీ నెంబర్లు, ఇప్పుడున్నవో లేదో తెలియదు)

  రిప్లయితొలగించండి

 18. శివ,శివ,శివ,యనరాదా
  శివనామామృతము చేద?సేవింపు డనెన్
  కవి,భవహరణ మని ఉమా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత జెందెన్

  రిప్లయితొలగించండి
 19. అవలక్షణములఁ దేఱిచి
  శివమును పొందగ తలంచి, స్థిరమగు భక్తిన్,
  భవభంధమ్ముల విడి, మా
  ధవుని పదమ్ములనుగొలిచి ధన్యత గాంచెన్

  రిప్లయితొలగించండి
 20. శివ నామము జపియించుచు

  భవు నిత్యము పూజచేసి భక్తి దలిర్పన్

  యవిరళముగ భక్తు డుమా

  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...దలిర్పన్+అవిరళముగ' అన్నపుడు యడాగమం రాదు. 'భక్తి దనర దా। ననవరతము...' అనండి.

   తొలగించండి
  2. గురువు గారూ !
   ధన్యవాదములు.
   భక్తి దనర దా
   ననవరతము అన్నపుడు ప్రాస ఉండదు గదండీ?

   తొలగించండి
  3. 'దా। నవిరళముగ...' అని టైప్ చేయబోయి అనవరతము అన్నాను. మన్నించండి.

   తొలగించండి
 21. అవిరళ భక్తిని మీరా
  హవణంబుగ సన్నుతించి యనవరతంబు
  న్నవనిత చోరుండగు మా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యతఁ నొందెన్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదాన్ని "...న్నవనీత చోరుడగు మా..' అనండి.

   తొలగించండి
 22. అవని గిరీశ నందని సుహాసిని బేరను నొప్పి యామె తా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె, నతండు వింటిరో
  భవహరు మీద గల్గెడు నవారిత భక్తిని నౌదలన్నిక న్
  బవలును రేయియున్ననక ప్రార్ధన లెన్నియొ జక్కజేసెగా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   నందిని.. నందని అయింది. బేరను..?

   తొలగించండి
 23. శివ పూజలతో తిన్నడు
  భవ హరణము నొంది భక్తి భావము నిండన్
  భవితయె నీదనుచు యుమా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్!

  రిప్లయితొలగించండి
 24. వివిధము లైన రూపముల విశ్వమనోహర మూర్తియై సదా
  యవనిని బ్రోచుచు న్నిరతమాశ్రిత పోషకు డైనవాడె యౌ
  భవభయ హారి భవాండము నేలు త్రివిక్రముండు మా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యతఁ గాంచె నతండు వింటిరే

  భవుడే భద్రుండు శివుడు
  పవనాంధసు భూషణుండు పాలాక్షుండౌ
  భవభయ హరుడైన యుమా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యతఁ గాంచెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
   రెండవ పూరణలో 'పవనాంధస భూషణు' డనండి.

   తొలగించండి
  2. గురువు గారికి ధన్యవాదములు నిజమే నండి మూడవపాదంలో నా పొరపాటు వల్ల శ్రీహరి అనే పదం మరచాను పవనాంధస టైపాటు పవనాంధసు గా ప్రచురితమైంది క్షమించగలరు


   భవభయ హారి శ్రీహరి భవాండము నేలు త్రివిక్రముండు మా

   అని ఉండాల్సింది

   తొలగించండి
  3. విరించి గారు నమస్కారములు.
   “ పవనాంధస భూషణుండు” : సమాసమసాధువని నా యభిప్రాయము. .
   అంధస్సు “స” కారంత నపుంసక లింగ పదము. అంధస్ లేక అంధః అని రూపములు.
   పవనాంధః + భూషణ = పవనాంధోభూషణ అవుతుంది.
   “భ” మృదు వ్యంజనము కాబట్టి విసర్గ “ఓ” గా మారుతుంది.
   విసర్గ కాకుండా “స” కారంతము తీసుకుంటే
   పవనాఅంధస్ + భూషణ = పవనాంధస్భూషణ అవుతుంది
   “నమస్కారము”, “పురస్కారము”ల వలె.
   అంధసుడు తత్సమము.

   తొలగించండి
 25. అవనితలమ్మునందుగల నాయువు చెల్లెనటంచు చెచ్చెరన్
  భువికగుదెంచి యార్కికొని పోవగనెంచ మృకండు పుత్రునిన్
  శివుడరుదెంచి రక్షణము చేసెను, భక్తుని బిట్టుగా, నుమా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   'భువి కరుదెంచి'.. అన్నచోట టైపాటు.

   తొలగించండి
 26. రిప్లయిలు
  1. సవతికిఁ బుట్టి తీవు మరి శక్యమె యెక్కగఁ దండ్రి యంకముం
   దివిరి మదీయ గర్భమునఁ దీరును బుట్టిన నన్న రోషుడై
   ధ్రువు డసమాన ధీరత సుతీక్ష్ణ తపోరతి రత్నగర్భ భూ
   ధవుని పదమ్ములం గొలిచి ధన్యతఁ గాంచె నతండు వింటిరే


   అవలీలగఁ గాచిన హ
   స్తివరదుఁ బ్రహ్లాదుడు ప్రతి దినమును భక్తిన్
   భవ తరణార్థము మది మా
   ధవుని పదమ్ములను గొలిచి ధన్యతఁ గాంచెన్

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 27. వివిధములైనమార్గముల విష్ణుకథల్ వినుచుండి యెల్లెడన్
  బ్రవిమల భక్తితో బరమ భాగవతోత్తముడౌచు వెల్గి దా
  నవపతి యైన తండ్రికి కనంబడు స్తంభజు డైనయా రమా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 28. పవన సుతుండు భాగ్యమున పావన గాత్రుని, మర్త్యరూపమం
  దవనిని సంచరించుచును తాటక మర్దన చేసి లీలగా
  శివధనువెక్కుపెట్టు నరసింహుని, భక్తుల బ్రోవు జానకీ
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యతఁ గాంచె నతండు వింటిరే

  రిప్లయితొలగించండి
 29. ధ్రువుడు వివక్ష నోర్వక
  భవబంధములు విడ గొలచి భక్తి ప్రపత్తిన్
  స్తవనీయ పథముఁ గొనె మా
  ధవుని పదముల నతండు ధన్యత గాంచెన్

  (గురుదేవులకు క్షమాపణలతో సమస్యాపాదమును మార్చితిని. ఇలా యుంటే సమస్యలాగా అనిపిస్తుదనిపించింది.పరిశీలించ ప్రార్థన.)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరించినందుకు సంతోషం!
   మొదటి పాదంలో గణదోషం. 'ధ్రువుడు వివక్షను సైపక' అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
   ధ్రువుడు వివక్షను సైపక
   భవబంధములు విడ గొలచి భక్తి ప్రపత్తిన్
   స్తవనీయ పథముఁ గొనె మా
   ధవుని పదముల నతండు ధన్యత గాంచెన్

   తొలగించండి
 30. భువివరు లెంచురీతిగ ప్రభుత్వపు మాటను లెక్కజేయకన్
  భవనము గట్టి రాముడికి|భక్తిగ,రక్తిగ రామదాసుడై|
  శ్రవణముకింపు కీర్తనల-శ్రావ్యతబంచెను.”నాడు జానకీ
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే”.?
  2. కవితా కీర్తన రచనల
  అవిరళ కృషి ,అన్నమయ్య నారాధనతో
  భువిలో నలివేల్ మంగమ
  ధవుని పదమ్ములనుగొలిచి ధన్యత గాంచెన్|.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'అన్నమయ్య యారాధనతో..' అనండి.

   తొలగించండి
 31. ప్రవిమలభక్తితత్పరత ద్వాదశిపారణకంబరీషుడున్
  స్తవనమొనర్చి దుర్వసను, తత్కృత దుస్తరమౌ పరీక్షలో
  అవిరల క్రోధచిత్తుడగు అమ్ముని శాపమిడంగనెంచ, మా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యతఁ గాంచె నతండు వింటిరే ||

  అవనీశునంబరీషుని
  నవనీసురుడలుకబూనియవమానింపన్
  ప్రవిమలభక్తినతడు మా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యతఁ గాంచెన్ ||


  కవికులదేశికుండు చిరకాలయశమ్మునకై కుమారసం
  భవమను కావ్యమున్ ఘనముమాధవుసచ్చరితమ్ముగూర్చి వై
  భవసరసాన్వితంబు రఘువంశమునెల్లరకందజేసి మా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యతఁ గాంచె నతండు వింటిరే ||

  కవికులగురువలరనుమా
  ధవునిమహాకావ్యరచన తదుపరి రఘువం
  శవిమలచరితమున రమా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యతఁ గాంచెన్ ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
   అద్భుతమైన పూరణలు. అభినందనలు.
   దుర్వాసుడు, దూర్వాసుడు రూపాలున్నవి కాని దుర్వసుడు, దుర్వసనుడు అన్న రూపాలు నాకు తెలియవు.

   తొలగించండి
  2. ఆర్యా ! అనేక నమస్కారములు.

   అశనం గరళం ఫణీ కలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః I
   కిమస్తి శంభో ! తవ కిం ప్రదాశ్యసి తవ పాదాంబుజ భక్తిమేవ దేహి II

   అన్న శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకున్నానండి.

   వాసః ప్రధానం ఖలు యోగ్యతాయాః వాసో విహీనం విజహాతి లక్ష్మీః
   పీతాంబరం వీక్ష్య దదౌ స్వపుత్రీం దిగంబరం వీక్ష్య విషం సముద్రః II

   అన్న శ్లోకాన్ని కూడ గుర్తుకు తెచ్చుకున్నానండి. కావున వాసము అన్ననూ, వసనము అన్ననూ వస్త్రము అనే అర్థమే వస్తుంది. వసనుడు అంటే వస్త్రము కలవాడు. దుర్వసనుడు అంటే దుర్వాసుడనే అర్థమే. దూర్వాసుడు సరియైన పదప్రయోగం కాదు. రూఢి ఏర్పడినది. దుర్వాసుడు సరియైన పదమే. ఛందో భంగమవుతుందని దుర్వసనుడు అని ప్రయోగించాను.మీరు సందేహం వ్యక్తం చేసిన తర్వాత సంస్కృతం మఱియు సి.పి.బ్రౌన్ నిఘంటువులలో చూశాను. దుర్వసను ప్రయోగం సరిపోయినది. అనేక ధన్యవాదాలు.

   తొలగించండి
  3. సముద్ర వసనే దేవి !పర్వత స్తనమండలే ! విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే II

   వసనా స్త్రీ లింగం. సంబోధన లో వసనే అయినది. వసనః పుంలింగము. వసనుడు తెలుగులోనికి పరిణామము.

   తొలగించండి
 32. జవమున తండ్రి సు తునకిటు
  పవలును రేయిని సతతము బాధించంగా
  కువలయమున బాలుడు మా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బాధింపంగన్' అనండి.

   తొలగించండి
 33. భవుని జపించ దీక్షగొని, ప్రాణములన్నిలుపంగ లింగనిన్
  శివుని త్రిశూల ధారిని విచిత్రపు కౌగిట నుంచి గొల్చి , సం
  భవమగు నట్లు జేయుమని ప్రార్ధన జేసె నొకం, డుమా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యతఁ గాంచె నతండు వింటిరే !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 34. సవినయ శాంత చిత్తుడును సద్గుణ శీలుడు ధర్మదాతయు
  న్నవిరళ రామ భక్తడు మహాకవి వర్యడు రామదాసుడున్
  కువలయమందు రామునకు కోవెల గట్టిన వాడు జానకీ
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యతఁ గాంచె నతండు వింటిరే

  రిప్లయితొలగించండి
 35. స్తవనము జేతుగాంధిని పితన్భరతావనికిన్జనాళికిన్
  కవనము నర్థ పూరితముగా నొనరించ; స్వదేశ వైద్యపుం
  జవముకు రామనామమును చయ్యన జేర్చె దరిద్ర నామ మా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే! P.Satyanarayana
  కవనము లౌక్యము గనుగొని
  స్తవనీయము గాగ వచన సారమ్మెగయన్
  జవమున పద్యము వాణీ
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్ p.Satyanarayana

  రిప్లయితొలగించండి
 36. ఆర్యా
  మొదటి పాదం లో హిందీ స్తవన్ కర్నా.కు లోబడగా శ.ర.నిఘం.లో ఆ పదం లేదు.కృపతో ఇలా చదువ గలరు
  స్తవమున దేల్తు గాంధిని...............p.Satyanarayana

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 37. భవహర చంద్రశేఖర ప్రభాకరసోమమహాగ్నిలోచనా
  శివ పరమేశ కింకరవశీకర శంకర పాపనాశనా
  ప్రవిమలహృన్నివాస యని భావము నందున తాను పార్వతీ
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మనోహరమైన పూరణ. అభినందనలు.

   తొలగించండి
  2. మిస్సన్న గారూ, మొదటి రెండు పాదాలు చదువుతుంటే ఏదో ఒక స్తోత్రం చదువుతున్న భావన కలిగింది. చాలా బాగుంది. నమస్కారములు.

   తొలగించండి
  3. గురువుగారూ ధన్యవాదములు.

   ఫణికుమార్ గారూ ధన్యవాదాలండీ.

   తొలగించండి
  4. గురువుగారూ ధన్యవాదములు.

   ఫణికుమార్ గారూ ధన్యవాదాలండీ.

   తొలగించండి


 38. అవనత వదనుండై మా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్
  బవరము నందున పార్థుడు
  జవమున విల్లును విడుచుచు శరణము కోరెన్

  సవతి యగు సురుచి పుత్రుని
  యవమానింపగ వగచుచు నర్భకు డౌ యా
  ధృవుడావనమున తామా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్

  జవమున తపమును చేయుచు
  బవరము నపరాజయంబు వలదను వరమున్
  కువలయమున వేడ నుమా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్.

  రిప్లయితొలగించండి
 39. P.Satyanarayana
  ఆర్యా
  1వ పాదంలో మొదట "స్తవమున దేల్తు గాంధిని...."గా చదువ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 40. అభినవ శ్రీనాథుడు:

  నవనవ లాడు పద్యములు నర్తన మాడగనన్ మనమ్మునన్
  కవివరు డొక్కడుండిటను కావ్యము వ్రాయగ ముద్రణమ్ముకై...
  తవిలి ధనమ్ము చింతిలుచు దండుకొ నెందున కానరాక తా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యతఁ గాంచె నతండు వింటిరే!

  ధవుడు = రాజు

  రిప్లయితొలగించండి